
హీరోగా, హీరో తండ్రిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నటుడు జగపతి బాబు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయిన ఓ సంఘటనను మీడియాతో పంచుకున్నాడు. 'నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్లవుతోంది. నాకు సినిమా తప్ప మిగతా ఏం తెలియదు. నాకు బాగా గుర్తుండిపోయిన చేదు సంఘటన చెప్తాను.. సాహసం సినిమాలో నేను సెకండ్ హీరో. ఆ మూవీ షూటింగ్‌లో ఏడు రోజులపాటు నాకు తిండిపెట్టలేదు, కనీసం తింటారా? అని కూడా అడగలేదు. అప్పుడు లైట్‌బాయ్ కూడా నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు.
ఈ అవమానం నాకు మంచి గుణపాఠం నేర్పించింది. ఇక్కడే ఉంటాడులే, ఎలాగో సినిమా చేస్తాడులే అని నన్ను చులకనగా చూసేవారు. ఇతర భాషల్లో సినిమాలు చేసి వస్తే మాత్రం అప్పుడిక్కడ మనకు ప్రత్యేక గౌరవమిస్తారు' అని చెప్పుకొచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'పెద్దమ్మాయి అమెరికన్‌ను పెళ్లాడింది. చిన్నమ్మాయినైతే పెళ్లే వద్దన్నాను. వివాహం అనే సాంప్రదాయాన్నే నమ్మను. పెళ్లి, పిల్లలు.. అని బాధ్యత తీర్చుకోవడానికి వారి వెంటపడటం కరెక్ట్ కాదు. చిన్నమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే తననే వెతుక్కోమన్నాను' అని చెప్పుకొచ్చాడు జగ్గూభాయ్.
చదవండి: మనోజ్ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు మంచు లక్ష్మీ సమాధానం ఏంటంటే?
Comments
Please login to add a commentAdd a comment