హీరోలకు ఫ్యాన్స్ ఉండటం చాలా సాధరణం. స్టార్ హీరోలకు కోట్లలో ఫ్యాన్స్ ఉంటే మిడ్ రేంజు హీరోలకు అంతలా కాకపోయినా లక్షల్లో అయినా ఉంటారు. అయితే కొన్నిసార్లు అభిమానులం అని పేరు చెప్పుకొని మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు తెలుగు స్టార్ హీరో, నటుడు జగపతిబాబుకి అలాంటి ఓ పరిస్థితి ఎదురైంది. దీంతో ఫ్యాన్స్ కి దండం పెట్టేసి మరీ ఓ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఏంటి సంగతి?
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!)
ఏం జరిగింది?
అందరు హీరోల్లానే జగపతిబాబు కూడా అప్పట్లో హీరోగా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం విలన్, తండ్రి పాత్రలు చేస్తున్నాడు. ఇతడు అభిమాన సంఘాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వాళ్లలో కొందరు హీరో అని ప్రేమ చూపించడం కంటే డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నట్లున్నారు. దీంతో ఈ తరహా పనులకు చెక్ పెట్టాలని బాధతో ఓ ట్వీట్ పెట్టాడు.
ట్వీట్‌లో ఏముంది?
'అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లా.. అభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్యకారణంగా భావించాను. వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్పూర్తిగా నమ్మాను. కానీ బాధకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది అభిమానులకు ప్రేమ కంటే అశించడం ఎక్కువైపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక నుంచి అభిమాన సంఘాలు, ట్రస్టుతో నాకు సంబంధం లేదు. వాటి నుంచి విమరించుకుంటున్నాను. కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను' అని జగపతిబాబు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్)
నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T
— Jaggu Bhai (@IamJagguBhai) October 7, 2023
Comments
Please login to add a commentAdd a comment