
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ అధికారిక నివాసంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని గురించి అసదుద్దీన్ శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తూ.. లేఖ రాశారు. తనను చంపేందుకు కుట్ర చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. ఎంపీల ఇళ్లపై దాడిని సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ లేఖలో కోరారు.
చదవండి: ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి