
బొమ్మనహళ్లి: బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. చెన్నైకి చెందిన గాయకురాలు శివశ్రీ స్కంధ ప్రసాద్‌తో పెళ్లి ఖాయమైనట్లు తెలిసింది. కొత్త ఏడాది మార్చిలో వివాహ వేడుక జరగనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఓ ఇంటివారు కాబోతున్నారు. చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ఆయనే మంగళవారం ప్రకటించారు. ఇక, శివశ్రీ.. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. ఇక, తేజస్వి సూర్య.. బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన విషయం తెలిసిందే.
ప్రముఖ సింగర్‌తో బీజేపీ ఎంపీ వెడ్డింగ్ బెల్స్ (ఫోటోలు)
ಸಂಸದ ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯ ಅವರು ಇದೀಗ ಗಾಯಕಿ, ಭರತನಾಟ್ಯ ಕಲಾವಿದೆಯಾಗಿರುವ ಚೆನ್ನೈ ಮೂಲದ ಸಿವಶ್ರೀ ಸ್ಕಂದಕುಮಾರ್ ಎನ್ನುವವರನ್ನು ವರಿಸಲು ಸಜ್ಜಾಗಿದ್ದಾರೆ. ಮಾರ್ಚ್ 4ಕ್ಕೆ ವಿವಾಹ ನಡೆಯಲಿದೆ#2025Wedding#TejasviSuryaWedding #TejasviSuryabride #sivasriskandaprasad pic.twitter.com/3xmUPRRuPJ
— ಎ ಜೆ ಕ್ರಿಯೇಷನ್ಸ್ (@AjUniversal1) December 31, 2024