
జూన్ 21న రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న వివిధ దేశాలకు చెందిన మేయర్ల సదస్సుకు అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం ఏకైక నగరం కావడం విశేషం. దేశంలో జైపూర్, కాలికట్, త్రిస్సూర్ మరియు నాగర్ కోయిల్ నుండి మేయర్‌లు పాల్గొంటున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పేద ప్రజలకు అందిన సంక్షేమం.. జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాన్ని రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ప్రదర్శించారు. అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం. ప్రపంచ వ్యాప్తంగా 50 మంది మేయర్లు రష్యా బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఏపీ నుంచి బ్రిక్స్ సమావేశాల్లో అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం ఒక్కరే పాల్గొన్నారు. గత ఐదు సంవత్సరాల వ్యవధిలో అనంతపురం నగరపాలక సంస్థ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరిగిన గ్రామ స్వరాజ్యం వివరాలతో కూడిన ఓ పుస్తకాన్ని తయారు చేసిన మేయర్ మహమ్మద్ వాసీం... దానిని రష్యాలోని కజాన్ నగరంలో ఉన్న లైబ్రరీకి అందజేశారు.