
రష్యాలో ఈ నెల 21న జరిగే బ్రిక్స్ దేశాల మేయర్ల సదస్సుకు ఆహ్వానం
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ మహమ్మద్ వసీం సలీంకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 21న రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా మేయర్లు పాల్గొననున్నారు. భారత్ నుంచి ఐదుగురు మేయర్లకు ఆహ్వానం అందగా..అందులో అనంతపురం మేయర్ ఒకరు. మిగిలిన వారిలో జైపూర్, క్యాలికట్, త్రిసూర్, నాగర్ కోయిల్ మేయర్లు ఉన్నారు.
అనంతపురం మేయర్‌కే ఎందుకంటే..
అనంతపురానికి, రష్యాకు చారిత్రక సంబంధం ఉంది. 550 ఏళ్ల కిందట రష్యన్ యాత్రికుడు అఫానసీ నికితిన్ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించాడు. ఆ∙అంశాలు ఇటీవల కజాన్‌లో జరిగిన అసోసియేషన్ వ్యవస్థాపక సమావేశంలో చర్చకు వచి్చ.. అనంతపురం ప్రాధాన్యతను గుర్తు చేశాయి. కాగా, అనంతపురం నగరాన్ని సందర్శించిన రష్యన్ యాత్రికుని రచనలను పరిగణనలోకి తీసుకుని మేయర్ల సదస్సుకు అనంతపురం నగరాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది అని మేయర్ అన్నారు.
