కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan Sri Sathya Sai District Tour Updates To Visit Kuruba Lingamaiah Family In Papireddy Palli | Sakshi
Sakshi News home page

కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published Tue, Apr 8 2025 8:18 AM | Last Updated on Tue, Apr 8 2025 4:23 PM

Papireddy Palli: YS Jagan Sri Sathya Sai District Tour Updates

కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్‌ జగన్‌

👉కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ
👉 లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్‌ జగన్‌
👉 పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబానికి వైఎస్‌ జగన్‌ భరోసా
👉ఇటీవలే  టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన లింగమయ్య

వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం

👉టీడీపీ నేతల డైరెక్షన్‌లో ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు
👉పాపిరెడ్డిపల్లి గ్రామంంలో నిషేధాజ్ఞలు
👉స్థానికులను కూడా అనుమతించిన పోలీసులు
👉వాహనాలు వదిలి పొలాల ద్వారా పాపిరెడ్డిపల్లికి వస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
👉ఎన్ఎస్ గేట్, రామగిరి వద్ద వైఎస్సార్ సీపీ వాహనాలు అడ్డుకుంటున్న పోలీసులు
👉పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

టీడీపీ గూండాల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఏడాది మార్చి 30న కొందరు టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరి స్తున్న కురుబ లింగమయ్య కుటుంబంపై దాడికి దిగారు.

దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు. అయితే మరుసటి రోజు లింగమయ్య అంత్యక్రియలకు ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగా మంగళవారం బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్లను ఆయన కార్యక్రమాల కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ సోమవారం పరిశీలించారు.

	LIVE: రాప్తాడు లో కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement