ఎన్నికలప్పుడే రాజకీయాలు: సీఎం రేవంత్‌ | Cm Revanth Reddy And Deputy Cm Bhatti Vikramarka Press Meet | Sakshi
Sakshi News home page

ఎన్నికలప్పుడే రాజకీయాలు: సీఎం రేవంత్‌

Published Thu, Jul 4 2024 4:50 PM | Last Updated on Thu, Jul 4 2024 5:17 PM

Cm Revanth Reddy And Deputy Cm Bhatti Vikramarka Press Meet

పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయని.. మాకైతే ఏకాభిప్రాయం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

సాక్షి, ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయని.. మాకైతే ఏకాభిప్రాయం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎందుకు ఆలస్యం అవుతుందో ఏఐసీసీ పెద్దలనే అడగాలన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పని చేస్తామని రేవంత్‌ తెలిపారు. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తామన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి,  విభజన చట్టం అంశాలపై ప్రధాని, అమిత్ షాను కలిశాం. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు పనులు కేటాయించాలని కోరాం. తెలంగాణ రాష్ట్రానికి  ఐఐఎం ఏర్పాటు చేయాలి. ఐటిఐఆర్ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి కేటాయింపులు చేయాలి. సెమీ కండక్టర్స్ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరాము. ప్రతి జిల్లాకు నవోదయ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు  ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాము. విద్యుత్తు రంగంలో తెలంగాణకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరాం. ఎక్స్చేంజి కింద డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వాలని  విజ్ఞప్తి చేశా’’ అని భట్టి పేర్కొన్నారు.

‘‘రీజినల్‌ రింగ్ రోడ్డుకు మొత్తంగా ఒకే జాతీయ రహదారి నెంబర్ ఇవ్వాలి. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలి. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంలో తెలంగాణ మార్చేందుకు కేంద్రం సహకారం ఇవ్వాలి. ఐపీఎస్ క్యాడర్ కింద 29 మందిని అదనంగా ఇవ్వాలి. భద్రాచలంలోకి ఐదు గ్రామాలు ఇవ్వాలని కోరాం’’ అని భట్టి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement