ప్రత్తిపాటి పుల్లారావుకు విడదల రజిని వార్నింగ్‌ | Ex Minister Vidadala Rajini Warns Mla Prathipati Pullarao | Sakshi
Sakshi News home page

ప్రత్తిపాటి పుల్లారావుకు విడదల రజిని వార్నింగ్‌

Published Sat, Feb 8 2025 1:17 PM | Last Updated on Sat, Feb 8 2025 1:46 PM

Ex Minister Vidadala Rajini Warns Mla Prathipati Pullarao

ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కట్టు కథ అల్లి మళ్లి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు.

సాక్షి, పల్నాడు జిల్లా: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కట్టు కథ అల్లి మళ్లి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో ఫారిన్‌లో ఉంటున్న మా మరిదిపై కూడా అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు’’ అని రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుల్లారావు గుర్తుపెట్టుకో.. మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. నేను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా. నువ్వు ఎక్కడికి పారిపోయిన, నువ్వెక్కడ దాక్కున్న కచ్చితంగా నిన్ను లాక్కు రావటం ఖాయం. ఆ రోజు పుల్లారావుకి వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అంటూ విడదల రజిని వార్నింగ్‌ ఇచ్చారు.

‘‘నా కుటుంబం జోలికి వచ్చినా.. మా కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే లేదు. అవినీతి అక్రమాల్లో ఘనాపాటి పత్తిపాటి. 2019లో ఒక ఘటన జరిగిందని.. కట్టు కథ అల్లి పుల్లారావు నాపైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించాడు. హైకోర్టు నమోదు  చేయమందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై నేను దృష్టి పెట్టి ఉండి ఉంటే పుల్లారావు నువ్వు ఎక్కడ ఉండేవాడు గుర్తుపెట్టుకో.. మా పాలనలో మేము అభివృద్ధిపైన దృష్టి పెడితే.. మీ ప్రభుత్వంలో నువ్వు అరాచకంపైన దృష్టి పెట్టావు.

తెలుగుదేశం పార్టీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోండి. అక్రమ కేసులు పెట్టి మా పార్టీ నేతలు జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్‌గా మారింది’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement