Vidadala Rajini
-
విడదల రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ, ఎస్పీ జాషువాపై కేసులు
-
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్ డేటాను తీశారు’
సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్‌డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్ జగన్ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు. -
కూటమి నేతల డైరెక్షన్ లోనే నాపై ACB కేసు నమోదు చేసింది
-
ఏసీబీ కేసు నమోదు చేయటంపై ఎక్స్ లో విడదల రజినీ పోస్ట్
-
‘వంద కేసులను, వెయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొంటా’
సాక్షి,అమరావతి : వంద కేసులను, వేయ్యి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ మాజీ మంత్రి విడదల రజిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. ‘మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు. వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం.నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా.నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి’ అని పేర్కొన్నారు. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలువ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులుఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధంనా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం నేను ఎదురు…— Rajini Vidadala (@VidadalaRajini) March 23, 2025 -
నా నియోజకవర్గం, నా ప్రజలు అనుకున్న.. విడదల రజిని ఎమోషనల్
-
మర్రి రాజశేఖర్‌ను వైఎస్ కుటుంబం ఎంతో గౌరవించింది: విడదల రజిని
పల్నాడు, సాక్షి: వైఎస్సార్సీపీ మర్రి రాజశేఖర్‌ని ఏనాడూ మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ ఇంఛార్జి విడదల రజిని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్సార్సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీలో తనకు గౌరవం దక్కలేదని, పదవులు దక్కలేదని అన్నారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మర్రి కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్సార్సీపీలో చేరాక ఆయనకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో ఓడినా సరే.. ఆయనను ఆ బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్‌కు ఎంతో గౌరవం ఇచ్చింది. వైఎస్సార్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రెడ్ బుక్ పేరుతో పాలన జరుగుతున్నప్పుడు మర్రి రాజశేఖర్ తన గొంతుక వినిపించి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. కానీ, ఆయన అలా చేయలేదు. ఒకవేళ.. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదం పొందితే ఆ సీటు టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. విమర్శించే ముందు మర్రి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్సార్సీపీ ఆయన్ని మోసం చేయలేదు. ఉన్నత పదవులతో గౌరవించింది అని విడదల రజిని అన్నారు... 2019 ఎన్నికల టైంలో నాకు పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ సమయంలో పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2024లో చిలకలూరి పేట నుంచి పోటీ చేయలేకపోవడం నా దురదృష్టంగా భావించా. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబితేనే పోటీ చేశాను. తిరిగి చిలకలూరిపేటకు తిరిగి ఆయన పంపిస్తేనే వచ్చా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టే ఆ పనులన్నీ చేశా. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను పాటించడం మాత్రమే నాకు తెలుసు అని అన్నారామె. -
MLC మర్రి రాజశేఖర్ రాజీనామాపై విడదల రజిని స్ట్రాంగ్ రియాక్షన్
-
అక్రమ కేసులపై తగిన మూల్యం చెల్లించక తప్పదు: రజని
-
Vidadala Rajini: పత్తిపాటి పుల్లారావు డైరెక్షన్లో తప్పుడు కేసులు..ఇవిగో ఆధారాలు
-
పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలు : విడదల రజని
సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసరావుపేట జైలులో రిమాండ్‌లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివీస్ట్ లపై ఉక్కుపాదంతో అణిచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే తప్పుడు కేసులుతెలుగుదేశం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు బనాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడుగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న రాకేష్ గాంధీపై కావాలనే తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపారు. భాషా అనే వ్యక్తితో టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈనెల 6వ తేదీన ఒక కేసు నమోదు చేయించారు. రాకేష్ గాంధీ తన ఇద్దరు మిత్రులు ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి కోటేశ్వర్ లతో కలిసి తనపై దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని, అసభ్య పదజాలంతో దూషించారంటూ భాష ఫిర్యాదు చేశాడు. చుట్టుపక్కల వారు గమనించడంతో తన ఫోన్ లాక్కుని వారు పరారయ్యారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఏకంగా సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు పెడితే కోర్టులు చీవాట్లు పెడుతుండటంతో, రాకేష్ గాంధీపై ఈ సెక్షన్ నమోదు చేయకుండా తెలివిగా ఒక తప్పుడు ఫిర్యాదును రాయించి, దాని ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కట్టుకథకు ఇవిగో ఆధారాలురాకేష్ గాంధీ అరెస్ట్ విషయంలో పోలీసులు అల్లిన కట్టుకథ ఇలా ఉంటే.. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాకేష్ బెదిరించినట్టుగా చెబుతున్న ఆరో తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతడు గుంటూరులో ఇంట్లో ఉన్నాడు. దీనికి సీసీ ఫుటేజీ ఆధారాలున్నాయి. అదే వ్యక్తి అదే సమయంలో చిలుకలూరిపేట కళామందిర్ సెంటర్లో ఎలా ఉంటాడో పోలీసులే చెప్పాలి. చిలకలూరిపేటలో ఉంటే వేధిస్తున్నారనే కారణంతో గత 9 నెలలుగా రాకేష్ గుంటూరులోనే ఉంటున్నాడు. ఘటన జరిగినట్టుగా చెబుతున్న 6వ తేదీతో పాటు అంతకు ముందు రోజు కూడా అతడు గుంటూరులోనే ఉన్నాడు. గుంటూరులో నాతో పాటు పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇదే కేసులో ఉన్న మరో వ్యక్తి ఫణీంద్ర నాగిశెట్టి కూడా ఘటన జరిగిన రోజు, అదే సమయంలో సెలూన్లో హెయిర్ కటింగ్ కోసం వెళ్లాడు. ఇందుకు సీసీ ఫుటేజీ ఆధారాలు కూడా ఉన్నాయి. మరో వ్యక్తి దామిశెట్టి కోటేశ్వర్ కూడా ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఆధారాలన్నీ చూస్తే కట్టుకథలు అల్లి వైస్సార్సీపీ శ్రేణులను వేధింపులకు గురిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. కేవలం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతో సీఐ ఇలా తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలను నిజం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆధారాలను కోర్టు ముందుంచడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల మెప్పకోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులు ద్వారా పోలీసు వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోంది. -
పోసానికి 10 రోజుల రిమాండ్ విధించిన జడ్జి
-
మాజీమంత్రి విడదల రజిని మామ కారుపై పచ్చ గూండాల దాడి
-
మాజీ మంత్రి విడదల రజిని మామ కారుపై దాడి.. హత్యాయత్నం!
చిలకలూరిపేట: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది అనేందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధుడు అనే విజ్ఞత మరచి టీడీపీ వర్గీయులు మాజీ మంత్రి విడదల రజిని భర్త తండ్రి లక్ష్మీనారాయణపై దాడికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ కారు పురుషోత్తమపట్నంలోని ఇంటికి వెళుతున్న క్రమంలో వేణుగోపినాథస్వామి ఆలయం సమీపంలో టీడీపీ వర్గీయులు పలువురు ఆయనపై దాడిచేసే ఉద్దేశంతో కారును అడ్డగించారు. లక్ష్మీనారాయణను ఉద్దేశించి కిందకు దిగరా అంటూ రాళ్లు, రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్‌పై దాడికి ప్రయత్నించారు. కారులో లక్ష్మీనారాయణ లేకపోవడంతో ఆయనకు ప్రాణహాని తప్పినట్టయింది. దాడికి పాల్పడిన వారి నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని కారుతో పాటు ఇంటికి చేరాడు.ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రి విడదల రజినిపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఓ గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయించిన విషయం విదితమే. ఇటీవల మాజీ మంత్రి విడదల రజినిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన విషయంపై ఆమె మీడియాలో టీడీపీ ఆగడాలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమె మామ కారుపై దాడి జరిగినట్లు ప్రజలు భావిస్తున్నారు. -
Ys Jagan: మంచిపాలన చేస్తే ప్రజలు ఆదరిస్తారు...
-
చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటికి విడదల రజిని వార్నింగ్
-
మీకు కూడా కుటుంబం ఉంది విడదల రజినీ మాస్ వార్నింగ్
-
ప్రత్తిపాటి పుల్లారావుకు విడదల రజిని వార్నింగ్
సాక్షి, పల్నాడు జిల్లా: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కట్టు కథ అల్లి మళ్లి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో ఫారిన్లో ఉంటున్న మా మరిదిపై కూడా అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు’’ అని రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.పుల్లారావు గుర్తుపెట్టుకో.. మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. నేను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా. నువ్వు ఎక్కడికి పారిపోయిన, నువ్వెక్కడ దాక్కున్న కచ్చితంగా నిన్ను లాక్కు రావటం ఖాయం. ఆ రోజు పుల్లారావుకి వడ్డీతో సహా చెల్లిస్తాం’’ అంటూ విడదల రజిని వార్నింగ్ ఇచ్చారు.‘‘నా కుటుంబం జోలికి వచ్చినా.. మా కార్యకర్తలు నాయకులు జోలికి వచ్చిన సహించే ప్రసక్తే లేదు. అవినీతి అక్రమాల్లో ఘనాపాటి పత్తిపాటి. 2019లో ఒక ఘటన జరిగిందని.. కట్టు కథ అల్లి పుల్లారావు నాపైన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించాడు. హైకోర్టు నమోదు చేయమందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై నేను దృష్టి పెట్టి ఉండి ఉంటే పుల్లారావు నువ్వు ఎక్కడ ఉండేవాడు గుర్తుపెట్టుకో.. మా పాలనలో మేము అభివృద్ధిపైన దృష్టి పెడితే.. మీ ప్రభుత్వంలో నువ్వు అరాచకంపైన దృష్టి పెట్టావు.తెలుగుదేశం పార్టీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోండి. అక్రమ కేసులు పెట్టి మా పార్టీ నేతలు జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు అక్రమాలకు కేరాఫ్‌గా మారింది’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు. -
కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోంది: విడదల రజిని
-
పేదల సంక్షేమం కోసం YSR ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు: Vidadala Rajini
-
బాబూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదా?: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఏపీలో పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి విడదల రజని(Vidadala Rajini). ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారని మండిపడ్డారు.మాజీ మంత్రి విడదల రజిని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ(aarogyasri) పేదలకు సంజీవిని లాంటింది. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ప్రారంభించారు. ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చూడకూడదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని వైఎస్ జగన్ మరింత బలోపేతం చేసి పేదలకు అందించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే అని భావించి ఆరోగ్యశ్రీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది.ఈరోజు నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్య సేవలు ఆపేశాయి. ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత కాదు అని కూటమి సర్కార్ ఆలోచిస్తోంది. ఇటువంటి పరిస్థితులు మా ప్రభుత్వంలో ఎప్పుడూ రాలేదు. కోవిడ్(covid)ను ఆరోగ్యశ్రీలో చేర్చి మా ప్రభుత్వం వైద్యం అందించింది. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. మూడు వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఆరోగ్య శ్రీని హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్‌లో అమలు చేస్తామని చెబుతున్నారు. థర్డ్ పార్టీకి బీమా సౌకర్యం అందించే ప్రయత్నం మంచిది కాదు. బీమా కంపెనీలు సేవా దృక్పథంతో వ్యవహరించవు. అలాగే, బీమా సౌకర్యం ఎన్ని ఆసుపత్రుల్లో అమలు చేస్తారో తెలియదు. ఎన్ని రోగాలకు అమలు చేస్తారో తెలియదు. ఓటు వేసి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడ్ విధానాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిది కాదన్న సందేశాన్ని ఇస్తున్నారు. కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేయలేకపోయాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 637 కోట్ల పాత ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించారు అని చెప్పుకొచ్చారు. -
కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలపై ఆగని అక్రమ కేసులు
-
ఇప్పటికైనా నిద్ర లేవండి.. బాబు & కో ని ఏకిపారేసిన విడదల రజిని
-
రైతుల భుజం తట్టి భరోసా ఇచ్చాము: Vidadala Rajini
-
ఏపీలో 104, 108 సేవలు అటకెక్కాయి: విడదల రజిని
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?
-
అధికారం శాశ్వతం కాదు.. గుర్తుంచుకోండి.. కూటమి ప్రభుత్వానికి విడుదల రజిని హెచ్చరిక
సాక్షి,పల్నాడు జిల్లా : అధికారం శాశ్వతం కాదు. గుర్తుంచుకోండి అని మాజీ మంత్రి విడుదల రజిని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావు పేట జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని పరామర్శించారు. అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడారు.‘వైఎస్సార్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టారు. నరసరావుపేట జైలుకు పంపారు. కోటిరెడ్డికి 75 ఏళ్లు. సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్తే ఆ అధికారులను కోటిరెడ్డి కొట్టినట్టు, కులం పేరుతో దూషించినట్లు అక్రమ కేసులు బనాయించారు.ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే కోటిరెడ్డిపై కేసులు పెట్టారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అది ఖచ్చితంగా రాజకీయ నాయకులు, పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. వైఎస్సార్సీపీ నేతలు ఓ పథకం ప్రకారం జైలుకు పంపుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి. రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఆనవాళ్లు దొరకడం లేదు. పోలీసులు మహిళలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దృష్టి పెట్టారు’ అని విడదల రజిని మండిపడ్డారు. -
మీరు ఎంత భయపెట్టాలని చూస్తే.. మేము అంత ధైర్యంగా ముందుకు వస్తాం
-
పులివెందుల అంటే ఎందుకంత కక్ష...
-
ఆంధ్రప్రదేశ్ లో 108, 104 సేవలు అటకెక్కాయి: Vidadala Rajini
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీని పట్టించుకోవడం లేదు
-
‘పులివెందుల మెడికల్ కాలేజీపైనే ఎందుకీ కక్ష?’
గుంటూరు, సాక్షి: ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఏపీ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మంగళవారం గుంటూరు ఆమె మీడియాతో మాట్లాడారు.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పని చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేస్తోంది. ఆరోగ్యశ్రీని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అనారోగ్యశ్రీగా మార్చేశారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకూడదని 104, 108 సర్వీసులు తీసుకొచ్చాం. ఆ సేవలను కూడా అటకెక్కించారు. ఏపీకి 17 మెడికల్‌కాలేజీలు తీసుకొచ్చాం. మెడికల్ కాలేజీల కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక మాపై బురద జల్లాలని చూస్తున్నారు. కాలేజీలకు పర్మిషన్ రాలేదని సంబంధిత మంత్రి మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మొత్తం 17 కాలేజీల్లో పులివెందుల కాలేజీ కూడా ఉంది. కానీ, ఆ ఒక్క కాలేజీ మీద అంత కక్ష ఎందుకు?. పులివెందుల కాలేజీకి మెడికల్ సీట్లు వద్దని లేఖ రాయడం దేనికి?. అని నిలదీశారామె...పులివెందుల మెడికల్ కాలేజ్‌కు హాస్టల్స్ లేవని ఇప్పుడున్న మంత్రి చెప్తున్నారు. కానీ, ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే ఈపాటికి పనులన్నీ పూర్తి అయ్యేవి. (ఈ ఏడాది జనవరి లో హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను మీడియా ముందు రజిని ప్రదర్శించారు)కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం సోషల్ మీడియా పై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని విడదల రజిని అన్నారు. -
నాలుగు రోజులుగా సుధారాణికి చిలకలూరిపేట సిఐ చిత్రహింసలు..
-
విడదల రజినిని అంత మాట అన్నప్పుడు.. పవన్ కి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
కార్యకర్తలపై కేసులు.. విడదల రజిని ఫైర్
-
కేసులు పెట్టిన అధికారులపై కచ్చితంగా చర్యలుంటాయి: విడదల రజిని
సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి విడదల రజిని. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం కొంతమంది కోసమే పని చేస్తుందా? అని ప్రశ్నించారు. అలాగే, సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.మాజీ మంత్రి విడదల రజిని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో పోలీసు బాసు.. పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం సోషల్ మీడియా ప్రతినిధులపై కుట్రతో జైలుకు పంపుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియాపై కేసులు పెడతారా?. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు పెడితే పోలీసులు ఏం చేస్తున్నారు?. 20 రోజుల క్రితం నాపై పెట్టిన పోస్టులకు సంబంధించి ఆధారాలతో సహా డీజీపీ, ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు లేవు. నా క్యారెక్టర్ దెబ్బ తినే విధంగా వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ టీడీపీ స్పాన్సర్ మీడియా పోస్టులు పెట్టింది. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం కొంతమంది కోసమే పని చేస్తుందా?. అక్రమంగా, అన్యాయంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టిన అధికారులపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.మా నాయకుడు చెప్పాడంటే చేస్తాడు అంతే.. అది అందరికీ తెలుసు. మా నియోజకవర్గానికి చెందిన సుధారాణిని ఐదు రోజులు పాటు అక్రమంగా, అన్యాయంగా స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. మాటలతో చెప్పలేని విధంగా చిలకలూరిపేట సీఐ రమేష్ బూతులు మాట్లాడారు. సుధారాణి చెప్పిన విషయాలకు సాక్ష్యాత్తూ న్యాయమూర్తి చలించిపోయారంటే.. పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే అర్థం అవుతుంది. సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనిని, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాలవజ్రబాబు (డైమండ్ బాబు) నియమితులయ్యారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
జగనన్నను చరిత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది
-
యూట్యూబ్ ఛానళ్లపై విడదల రజిని కంప్లైంట్
-
వ్యక్తిత్వ హననం చేస్తారా?.. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులపై విడదల రజిని పోలీసులకు ఫిర్యాదు
సాక్షి,గుంటూరు : వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టింగ్స్ పెడుతున్న వారిపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ అనే యాంకర్‌తో పాటు, మరో రెండు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకులు తన గురించి అసభ్యకర పోస్టింగ్స్, వీడియోలు పెడుతున్నారని పోలీసుల ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పోలీసులతో పాటు జాతీయ మహిళా కమీషన్, ఏపీ మహిళా కమీషన్, డీజీపీలకు విడదల రజిని ఫిర్యాదు చేశారు. -
సహానా మృతిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రులు
-
గుంటూరు సహాన ఘటనపై విడదల రజిని ఎమోషనల్..
-
దళిత యువతి సహానాది ప్రభుత్వ హత్యే
గుంటూరు మెడికల్ : కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడి దాడిలో మరణించిన దళిత యువతి మధిర సహానాది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, విడదల రజిని స్పష్టం చేశారు. వారు మంగళవారం రాత్రి గుంటూరు జీజీహెచ్‌లో సహానా మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం, హిందూపురం, బద్వేలు, తెనాలిలో మహిళలపై జరిగినవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇటీవలి హత్యలు, దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు.రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, చట్టాలను ప్రభుత్వ పెద్దలు చుట్టాలుగా మార్చుకున్నారని ఆరోపించారు. దళిత యువతి సహానాపై దాడి జరిగి మూడు రోజులు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం నుంచి స్పందనే లేదని చెప్పారు. ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని, బయటకు చెప్పుకోలేని అభద్రతా భావంలో సహానా తల్లిదండ్రులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ దాడిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే తక్షణమే స్పందించేవారని చెప్పారు. సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత చేతగాని తనం వల్లే దాడులు, హత్యలు జరుగుతున్నాయని, పోలీసులు కళ్లున్న కబోదుల్లా ఉన్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దాడులు, హత్యలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా, తిరిగి తమ పార్టీ నేతలపైనే కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ యాప్ ప్రవేశపెట్టారని, దాని ద్వారా మహిళలకు భరోసా లభించి, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దిశ యాప్ పనిచేయడంలేదని, అందువల్లే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. -
మధిర సహాన మృతిపై వైఎస్సార్సీపీ నేతల తీవ్ర విచారం
సాక్షి,గుంటూరు: టీడీపీ రౌడీషీటర్ నవీన్ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీకి మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని అన్నారు. సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా బాబు దుష్ప్రచారం
-
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వెనుక పెద్ద స్కామ్: రజనీ
-
మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని కేంద్రానికి లెటర్ రాసిన చెత్త ప్రభుత్వం ఇది
-
మెడికల్ కాలేజీల పరిస్థితేంటి?: విడదల రజిని
సాక్షి,గుంటూరు: వైఎస్జగన్ తన హయంలో ప్రజారోగ్యంపై ఎక్కువ దృష్టిపెట్టారని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.ఈ విషయమై రజిని బుధవారం (సెప్టెంబర్18) మీడియాతో మాట్లాడారు. ‘మెడికల్ కాలేజీల బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. దీంతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏపీలోనూ ఉండాలనే ఆలోచనలతో వైఎస్జగన్ మెడికల్ 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రెండో దశలో ప్రారంభించాల్సిన అయిదు మెడికల్ కాలేజీల పరిస్థితేంటి’అని విడదల రజని ప్రశ్నించారు.విడదల రజిని ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందిఏపిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలన్న ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కాలేజీ ఆస్పత్రులతో పేదలకు మెరుగైన, ఉచిత వైద్యసేవలు అందించవచ్చని వైఎస్జగన్ భావించారుమెడికల్ కాలేజ్ ఒక్క రాత్రిలో నిర్మాణం కాదువందేళ్ళలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయికేవలం ఐదేళ్ళలో వైఎస్జగన్ ఐదు మెడికల్ కాలేజ్ ప్రారంభించి మరో ఐదు కాలేజీల నిర్మాణం ప్రారంభించారుఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాల్సి ఉంది.కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయని దుస్సాహాసం కూటమి ప్రభుత్వం చేసిందిపులివెందుల కాలేజీకి సీట్ల కేటాయింపు వద్దని ప్రభుత్వం లేఖ రాసిందిపులివెందుల మీద ద్వేషం, రాజకీయ కక్షతోనే ప్రభుత్వం లేఖ రాసింది.వైఎస్జగన్ మీద కక్షతోనే విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్నారుమూడో ఫేజ్‌లో రావాల్సిన ఏడు మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదుప్రయివేట్--పబ్లిక్ పార్టనర్ షిప్ లో నిర్వహించేందుకు సిద్దమయ్యారు.ప్రయివేటు వ్యక్తులకు బదలాయిస్తూ స్కామ్‌కు తెర తీస్తున్నారు.ఫీజుల జీవోలను రద్దు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఈ రోజు అదే జీవో పేరుతో ఫీజులు కొనసాగిస్తున్నారు]ఇదీ చదవండి.. బాబూ అమరావతి మాత్రమే సెంటిమెంటా..? -
చంద్రబాబుకి విడదల రజిని సూటి ప్రశ్న
-
ఆరోగ్యశ్రీకి చంద్రబాబు సర్కార్ తూట్లు: విడదల రజిని
సాక్షి, గుంటూరు: వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.‘‘ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఆసుపత్రి పెండింగ్ బిల్లులను చెల్లించాం గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదు. జనవరిలోపు ఆసుపత్రులకు ఉన్న బకాయిలను అన్ని చెల్లించాం. బాబు పెట్టిన బకాయిలను కూడా మేం క్లియర్ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తుంది. సాకులు చెప్తూ ఆరోగ్యశ్రీని ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారు.’’ అని విడదల రజిని గుర్తు చేశారు.‘‘పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారు. చంద్రబాబు మనస్సులో మాటలనే మంత్రులు చెబుతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఆరోగ్యశ్రీలో రూ. 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్‌లో పరిధి కేవలం ఐదు లక్షలే. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేవలం మూడు వందలు కోట్లు మాత్రమే ఇస్తున్నారు. పేదవారు ఇబ్బంది పడకూడదనే ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా అందించాం. ఆరోగ్యశ్రీపై ప్రస్తుత ప్రభుత్వ విధానమేంటో సీఎం వెల్లడించాలి’’ అని విడదల రజిని డిమాండ్ చేశారు.‘‘మొదటి విడతలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. వచ్చే నెలలో మరో ఐదు కాలేజ్ లు ప్రారంభించేందుకు మా హాయాంలో అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నెలలో ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రారంభిస్తారో లేదో స్పష్టత ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మా హాయాంలో తీసుకొచ్చాం. మారుమూల గ్రామాల్లో ఉన్న రోగులకు ఎంతగానో ఈ విధానం ఉపయోగపడింది. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా?’’ అంటూ విడదల రజిని ప్రశ్నించారు. -
ఏపీకి రాష్ట్రపతి పాలన..
-
పచ్చమూకల విధ్వంసం.. గెలుపు మత్తులో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, గుంటూరు: గెలుపు మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పచ్చమూకల విధ్వంసం సృష్టించారు. గుంటూరు విద్యానగర్‌లోని విడదల రజని కార్యాలయంపై టీడీపీ, జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంపై రాళ్లు విసిరిన ఎల్లో గూండాలు కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ- జనసేన రౌడీమూకలు రాళ్లు విసురుతూ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు.వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. పర్నిచర్‌ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయవాడ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును పచ్చమూక ధ్వంసం చేశారు.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంపై దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు.. కారును ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అచ్చంపేట మండలం కొండూరులో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు బరితెగించి దాడులకు దిగారు. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. -
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
-
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
-
టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి డర్టీ పాలిటిక్స్.. మహిళను నిర్బంధించి..
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు వెస్ట్ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా, విడదల రజిని అనే పేరుగల మరొక మహిళ చేత నామినేషన్ వేయించడానికి గల్లా మాధవి ప్రయత్నించింది.మూడు రోజుల నుంచి గల్లా మాధవి ఉంటున్న అపార్ట్మెంట్లో విడదల రజిని అనే మహిళను నిర్బంధించారు. తన కుమార్తె విడుదల రజినిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళను అపార్ట్మెంట్ నుంచి నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని.. తండ్రికి అప్పగించారు.కాగా, గల్లా మాధవిపై ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినందుకు రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన గళ్లా మాధవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పోలీసు కేసుల వివరాలతోపాటు పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు చూపారు. -
గుంటూరు వెస్ట్: ఇరుకునపడ్డ టీడీపీ.. అదే మైనస్‌గా మారిందా?
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే సీఎం జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడలకు చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎంపికలో తెలుగుదేశానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురైంది. మరోవైపు అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగడంతో టీడీపీ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీని భుజాన మోసిన అందరినీ పక్కకి తోసేసి.. కొత్త అభ్యర్థిగా గల్లా మాధవిని తీసుకురావడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీటన్నింటికి తోడు గల్లా మాధవి ఒంటెత్తు పోకడలు పార్టీకి చేటు తీసుకొస్తున్నాయి. అంతేకాదు సీనియర్లు కూడా దూరమైపోతున్నారు. వారితో పాటు క్యాడర్ కూడా వెళ్లిపోతోంది. గల్లా మాధవి ఉన్నట్టుండి సడన్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి, ఆమెకు ఎవరేమిటో తెలీడం లేదు. హాయిగా ఏసీలో కూర్చుని పనిచేసే ఆమె మండుటెండలోకి వచ్చి, చుట్టూ గుమిగూడే జనం మధ్యలో ఇమడలేక పోతున్నారు. వీటన్నిటికి మించి విడదల రజనీ దూకుడు ముందు ఆమె పోటీ పడలేకపోతున్నారనే టాక్ అయితే జనంలోకి వెళ్లిపోయింది. అది ఆమెకు మైనస్‌గా మారింది. అంతేకాదు రాజకీయాల్లో రజనీ సీనియర్ అయ్యారు. మంత్రి అయ్యారు. రాజకీయాల్లో రెండు ఫేజ్లను చూశారు. వీటన్నిటి పరంగా గల్లా మాధవి సరైన అభ్యర్థి కాదనే అంటున్నారు. కోవెలమూడి రవీంద్ర.. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ ఇంచార్జిగా ఉన్నారు. ఆయన 2014, 2019లో కూడా టికెట్ ఆశించారు. చంద్రబాబు అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడూ ఇవ్వలేదు. దీంతో ఆయన రగలిపోతున్నారు. దాదాపు క్యాడర్ అంతా ఆయనవైపే ఉంది. వారి దగ్గర మీకు నచ్చినట్టు చేసుకోండి అని అంటున్నారని తెలిసింది. హీరో బాలక్రష్ణ వీరాభిమాని మన్నవ మోహనకృష్ణ కూడా గుంటూరు వెస్ట్ సీటు ఆశించారు. రాకపోవడంతో బహిరంగంగానే అసంత్రప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు. కానీ పని కాలేదని అంటున్నారు. తాడిశెట్టి ఫ్యామిలీకి గుంటూరులో మంచి పట్టుంది. తాడిశెట్టి వెంకట్రావు, తాడిశెట్టి మురళీ మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, సీటు రాదని గ్రహించి, చంద్రబాబు దగ్గర హామీ తీసుకుని తెలుగుదేశంలోకి వచ్చారు. తీరా వచ్చాక బాబు కూడా హ్యాండ్ ఇచ్చేసరికి రివర్స్ అయ్యారని అంటున్నారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన నేతగా ఉన్నారు. పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ ఆశించారు. రాకపోవడంతో ఆయన సైడ్ అయిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఆ పార్టీ నేత వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఆశించారు. హడావుడిగా కార్యాలయం ఓపెన్ చేశారు. 18 రోజులు పాదయాత్ర చేశారు. ధూంధామ్ చేశారు. చివరికి సీటు టీడీపీకి వెళ్లిపోయింది. దీంతో ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసుకెళ్లి ధర్నాలు చేసినా ఫలితం రాలేదు. అప్పటి నుంచి బుద్ధిగా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇలా ఇంతమంది తెలుగుదేశం నాయకులు వ్యతిరేకమైపోవడంతో గల్లామాధవి గెలవడం కష్టమేనని అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది విడదల రజనీ చరిష్మా ముందు ఈమె నిలవలేకపోతున్నారని అంటున్నారు. రాజకీయాల్లో తన మార్కు చూపించుకున్న విడదల రజనీని గెలవడం ఈ పరిస్థితుల్లో అంత ఈజీకాదని అంటున్నారు. తనకే విజయావకాశాలు ఉన్నాయని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ చదవండి: జగన్ ముందుకు.. అధఃపాతాళానికి చంద్రబాబు -
ఎన్నికల ప్రచారంలో బ్యాడ్మింటన్ ఆడిన రజని
-
అవ్వాతాతలపై చంద్రబాబు కక్ష
సాక్షి నెట్వర్క్ : పేదవారంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన భావమేనని.. ప్రతీనెల ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడని, అందుకే వారిపై ఆయన కక్ష కట్టాడని పలువురు మంత్రులు మండిపడ్డారు. దీంతో చంద్రబాబు తన జేబు సంస్థ అయిన ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ముసుగులో తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి.. దాన్ని వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీచ రాజకీయాలు చేస్తూ వలంటీర్లపై ఫిర్యాదు చేయడమంటే.. ప్రజలకు జరుగుతున్న మేలు అడ్డుకోవడమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అవ్వాతాతలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. ఎవరెవరు ఏమేన్నారంటే.. ఈసీ ఆదేశాలను పునఃసమీక్షించాలి.. ప్రతీనెలా ఒకటో తేదీన ప్రభుత్వమిచ్చే పెన్షన్లపై ఎన్నో ఆశలు పెట్టుకుని అవ్వాతాతలు జీవిస్తున్నారు. అలాంటి వారికి వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలి. పేదోడు బాగా ఉంటే చంద్రబాబుకు తిన్నది అరగదు. పెన్షన్లు ఇవ్వనీయకుండా.. నిరుద్యోగుల డీఎస్సీని అడ్డుకున్న దుషు్టడు చంద్రబాబు. పెన్షన్ పంపిణీకి ఎటువంటి ప్రత్యామ్నాయం చేసినా ఇబ్బందులు తప్పవు. అది ఒక నెలతో పోయేది కాదు.. మూడునెలల పాటు అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటే ఆ పాపం శాపమై చంద్రబాబుకు చుట్టుకుంటుంది. – బొత్స సత్యనారాయణ, మంత్రి వలంటీర్లపై విషం కక్కుతున్నారు పది మంది జీవితాల బాగు కోసం పాటుపడుతూ.. పారదర్శకంగా ప్రజాసేవకు అంకితమైన వలంటీర్లపై చంద్రబాబు, పచ్చబ్యాచ్ విషం కక్కుతున్నారు. ప్రజల కోసం అహరి్నశలు పాటుపడుతున్న వలంటీర్లంటే ఎందుకంత భయం? చంద్రబాబు ఓటమి భయంతోనే వలంటీర్లపై తప్పుడు ఫిర్యాదులు చేయించి కక్ష సాధిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. మొత్తం వలంటీరు వ్యవస్థనే తీసేసే హెచ్చరికగానే దీన్ని భావించాలి. అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిసినా అమానవీయంగా ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబుకు వారి ఉసురు తగులుతుంది. – విడదల రజిని, మంత్రి బాబుకు అవ్వాతాతల శాపనార్థాలు అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులు 1వ తేదీ ఉ.5 గంటల నుంచి ఇంటిగుమ్మంలో పింఛను కోసం ఎదురుచూస్తారు. పెత్తందార్లకు వెన్నుదన్నుగా నిలబడి ప్యాకేజీలు గుంజుకునే చంద్రబాబు పేదలను ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. ముందునుంచీ వలంటీరు వ్యవస్థపై పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్‌తో ఎన్నికల అధికారికి పిటిషన్ ఇచ్చి వలంటీర్లను విధుల నుంచి తప్పించి పాపం మూటగట్టుకున్నాడు. అవ్వాతాతల శాపనార్థాలు ఆయనకు తగులుతాయి. వారు పడే బాధ నువ్వు కూడా అనుభవించే రోజు వస్తుంది. – కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి చంద్రబాబుది రాక్షసానందం అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల ఇంటికి వలంటీర్లు రాకుండా అడ్డుకున్న పాపం చంద్రబాబుదే. గ్రామ వలంటీర్ వ్యవస్థను అడ్డుకుని ఆయన రాక్షసానందం పొందుతున్నారు. ఆయన కుట్రతో అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇకపై మండుటెండల్లో ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో? వలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు పింఛన్లు పంపిణీ చేయాలంటూ చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ బతుకులు ఏవిధంగా ఉంటాయోనని పేదలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ కూటమికి వారు బుద్ధిచెప్పడం ఖాయం. – ఆదిమూలపు సురేష్, మంత్రి చంద్రబాబు నరరూప రాక్షసుడు అవ్వాతాతలపై ఎటువంటి కనికరం లేకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నరరూప రాక్షసుడిలా వ్యవహరించాడు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచీ కడుపు మంటతోనే ఉన్నాడు. ప్రతినెలా ఒకటో తేదీన అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి, ఆప్యాయంగా పలకరిస్తూ రూ.3 వేల పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారు. దీంతో వలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించేలా చేశారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది, ఇబ్బందులు పడేది పెన్షన్దారులే. – మార్గాని భరత్‌రామ్, ఎంపీ పెన్షనర్లే టీడీపీ కూటమికి బుద్ధిచెబుతారు పింఛన్‌దారులను ఇబ్బంది పెట్టడం దారుణం. చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా వలంటీర్లతో పింఛన్లను పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో పెన్షనర్లే తెలుగుదేశం కూటమికి బుద్ధిచెబుతారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం. – ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి -
రాజకీయ నేపథ్యం: గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడదల రజిని
గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినిని అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో చిలకలూరిపేట నుంచి గెలుపొందిన ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వరుసగా రెండుసార్లు తెలుగుదేశం గెలిచిన ఈ నియోజకవర్గంలో రజిని తనదైన ముద్ర వేశారు. ఆమెకు పోటీగా ఎవరిని పెట్టాలనే దానిపై తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడిపోయి ఇప్పటి వరకూ కష్టపడ్డ వారందరిని కాదని, ఒక మహిళకు కేటాయించాల్సి వచ్చింది. నియోజకవర్గం: గుంటూరు పశ్చిమ పేరు: విడదల రజిని వయస్సు.: 34 విద్యార్హత: బీఎస్సీ, ఎంబీఏ సామాజిక వర్గం: కాపు ఎన్నికల్లో పోటీ: రెండో సారి రాజకీయ నేపథ్యం: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో వైఎస్సార్ సీపీలో చేరారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. -
కుట్రతోనే వేధింపులు
తెనాలి: ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి సంతోషంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన గొల్తి గీతాంజలిపై సోషల్ మీడియాలో వికృతంగా ట్రోల్ చేసి ఆమె బలవన్మరణానికి కారకులైన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. గీతాంజలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వెనుక ప్రభుత్వం చేసిన మంచిని మరెవరూ చెప్పకుండా అణచివేయాలనే పెద్ద కుట్ర ఉందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీరికసలు మనసనేది ఉందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలంతా వీరి దుశ్చర్యలను గమనించాలని రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆమె సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని గొల్తి గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ పవిత్ర పరామర్శించారు. గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం జగన్ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు గుంటూరు తూర్పు అసెంబ్లీ ఇన్చార్జి నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి మురుగుడు లావణ్య, ఎన్నారై అధికార ప్రతినిధి కడప రత్నాకర్, గాలి అరవింద, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చితిమంటల్లోనూ చలికాచుకుంటున్నారు... ప్రభుత్వం చేసిన మంచిని చెప్పే ఉత్సాహంలో ఒక అంకె తప్పు చెప్పడం బూతులాగా అనిపించిందా? గీతాంజలి చనిపోయి రెండురోజులైనా ఇంకా పోస్టులు పెడుతూ, ఇంకా రాబందుల్లా పీక్కుతింటున్నారు. తాగుబోతులు, సైకోలు వీరంగం వేసినట్టుంది. గీతాంజలి చితిమంటల్లోనూ చలికాచుకుంటున్న మీకు సిగ్గుండాలి.లోకేశ్ భార్య, చంద్రబాబు భార్యపై పోస్టులు పెడితే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు భార్యను ఏమీ అనకుండానే అసెంబ్లీ నుంచి బయటకొచ్చి గొడవ చేశారు. రాజీపడేదే లేదు. అందరికీ శిక్షలు పడతాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. – నందిగం సురేష్, ఎంపీ సోషల్ మీడియా టెర్రరిజం గీతాంజలిపై ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా చేసింది ట్రోలింగ్ కాదు...టెర్రరిజం అంటాను. మా పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు, సీనియర్ లీడర్లు, జర్నలిస్టులు అందరూ ఈ టెర్రరిజం బాధితులే. గీతాంజలి చనిపోయాక కూడా వదలడం లేదు. బాధపడుతున్నట్టు ఒక్కరు కూడా చెప్పటం లేదు. ఒక కుటుంబంలో భార్య, తల్లి, కోడలు, కుమార్తెగా ఉంటున్న మహిళ మరణానికి కారకులయ్యారు. న్యాయం ఏమిటి? నారా లోకేశ్, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎక్కడా అసభ్యత ఉండదు. – సజ్జల భార్గవ, కన్వినర్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య గీతాంజలిది ఆత్మహత్య కాదు...టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబంలోని లబ్దిదారులే స్టార్ క్యాంపెనర్లు అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని చెప్పిన గీతాంజలి నోరు నొక్కితే ఇంకెవరూ నోరు విప్పరు అనే కుట్రతో ఆమెను ట్రోల్ చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ చెప్పకూడదనే ఆమె జీవితాన్ని అంతం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు ఎవరూ మాట్లాడకూడదనే వారి కుట్ర. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ పట్టా ఇచ్చిన చేత్తోనే నివాళి అర్పించడం దురదృష్టం... గీతాంజలికి ఈ నెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ పట్టాను ఇచ్చిన చేతులతోనే ఆమె భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించాల్సి రావడం దురదృష్టం. ఆమె మరణానికి కారకులను ప్రభుత్వం శిక్షిస్తుంది. మానవతా దృక్పథంతో సీఎం జగన్మోహన్రెడ్డి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఆమె ఇద్దరు ఆడపిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే గీతాంజలిని దారుణంగా వేధించారు.. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియావాళ్లు గీతాంజలిని దారుణంగా వేధించారు. ఆమె బలవన్మరణానికి కారకులయ్యారు. ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షిస్తుంది. మళ్లీ మరో మహిళకు ఇలా జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. – ఎస్ఎం పవిత్ర, చైర్పర్సన్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ -
సీఎం జగన్ మేనిఫెస్టోపై విడుదల రజిని క్లారిటీ
-
గత సభలకు మించి మేదరమెట్ల సిద్ధం భారీ ప్రణాళిక
-
ప్రజలు డిసైడ్ అయ్యారు..!
-
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం చరిత్రలో నిలిచిపోతుంది
-
డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం
నగరంపాలెం: డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 8341396104కు ఫోన్ చేయొచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో ఆదివారం మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని.. గుంటూరు నగరంలో పది ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తుచేశారు. నాడు 2,400 మంది డయేరియాతో బాధపడ్డారని.. అందులో 24 మంది మృతి చెందారని తెలిపారు. శనివారం గుంటూరుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 32 మంది వాంతులు, విరేచనాలతో జీజీహెచ్‌కు వచ్చారన్నారు. వీరందరికి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారని, మిగతావారు సోమవారం నాటికి డిశ్చార్జ్ అవుతారని వివరించారు. ఘటనపై జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారని తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపించామన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సర్వే.. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేయిస్తున్నామని విడదల రజిని వెల్లడించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులు వెంటనే వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో తాగునీటిని రోస్టర్ విధానంలో సరఫరా చేస్తున్నారని తెలిపారు. శారదా కాలనీలో మూడు షిఫ్ట్‌లలో వైద్యులు, ఐదుగురు సిబ్బందిని 24/7 అందుబాటులో ఉంచామన్నారు. కాగా, ఇటీవల కృష్ణానదిలోకి పులిచింతల నుంచి కొత్త నీరు వస్తోందని ప్రజలకు 15 రోజుల కిందటే కమిషనర్ తెలియజేశారన్నారు. కొళాయిల నుంచి వచ్చే తాగునీటిని వేడి చేసుకుని తాగాలని సూచించారని తెలిపారు. -
చంద్రబాబుకి మంత్రి రజని స్ట్రాంగ్ కౌంటర్
-
మంత్రి విడదల రజిని స్పీచ్... దద్దరిల్లిన చిలకలూరిపేట
-
YSRCP Bus Yatra: చిలకలూరిపేటలో ప్రజలు బ్రహ్మరథం
వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన సాధికార బస్సు యాత్రలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. బస్సుయాత్రలో భాగంగా నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులతోనూ ముచ్చటించారు. అనంతరం నిర్వహించిన భారీ బైక్ ర్యాలీతో చిలకలూరిపేటలో బహిరంగ సభా వేదిక వద్దకు బస్సు యాత్ర చేరుకుంది. వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడానికే వెళ్తున్నా: మంత్రి విడుదల రజిని ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ, వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజికంగా, ఆర్థికంగా చేసిన అభివృద్ధిని చాటి చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచే వై.ఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టారని, ఇక్కడ నుంచే బీసీ మహిళను అసెంబ్లీకి పంపించడమే కాకుండా మంత్రి పదవి కూడా ఇచ్చి చరిత్రలో ఎన్నడూలేని విధంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించారని గుర్తు చేసారు. చిలకలూరిపేటలో మున్సిపల్ చైర్మన్ పదవి ముస్లీంలకు, మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్సీలకు పదవులు కట్టెబెట్టారన్నారు. రూ.2వేల కోట్లతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.900 కోట్లతో బైపాస్ పనులు జరుగుతున్నాయని, అతి తర్వలోనే సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నామని, రూ.150 కోట్లతో అమృత్ పథకాన్ని కేంద్రం సహకారంతో చేపట్టి మంచినీటి సమస్యను తీర్చబోతున్నారని వెల్లడించారు. కాపు, ఎస్సీ, బీసీ భవన్లు కూడా పెద్ద మనసుతో వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయలతో తాను సొంత నిధులతో ముస్లీంలకు స్థలాన్ని ఇవ్వగా, మరో మూడు ఎకరాలు కూడా సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేయడానికి సుముఖుత వ్యక్తం చేసారన్నారు. ముఖ్యమంత్రి అండదండలతో అనేక కీలక ప్రాజెక్టులను చిలకలూరిపేటలో కనీవిని ఎరుగని రీతిలో చేపట్టడమే కాకుండా, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని, నాడు - నేడు స్కీమ్ ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసామన్నారు. రూ.1100 కోట్ల రూపాయల సంక్షేమాన్ని వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చిలకలూరిపేట నియోజకవర్గానికి అందించారంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, అప్యాయతను అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమలో పార్టీ రెండుసార్లు ఓడిపోయిందని, ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి నన్ను అక్కడకు పంపుతున్నారని, తాను ఎక్కడ ఉన్నా సరే చిలకలూరిపేట ప్రజలు తన మనసులో ఉంటారని ఉద్ఘాటించారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించండి: ఎమ్మెల్సీ ఏసు రత్నం ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ, కల్లబొల్లి మాటలు చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూ ముందుకు వస్తున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గుర్తించాలని. 600 హామీలిచ్చి ప్రజలను గత ఎన్నికల్లో మోసం చేసిన అంశాన్ని ప్రజలు మరిచిపోలేదని హెచ్చరించారు. 31 లక్షల ఇళ్లను బడుగు, బలహీన వర్గాల కోసం ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సన్నహాలు చేస్తుంటే, చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఆరోగ్య సాధికారత: ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మరో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్యా సాధికారతను సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధికి రూ.60,500 కోట్లు, బీసీ కులాల కోసం రూ.70,750 ఎస్టీ సంక్షేమానికి రూ.23,430 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి దేశ, రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అణగారిన బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఉన్నత విద్యావంతులను చేయాలని సీఎం లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. 37 వేల స్కూల్స్ కోసం రూ.12 వేల కోట్లతో అభివృద్ధి చేసి కార్పోరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దారన్నారు. జగన్‌ను మరోసారి సీఎం చేస్తాం: నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లెల రాజేశ్ నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ సామాజిక వర్గానికి సంక్షేమం, రాజ్యాధికారం కల్పనలో పెద్ద పీట వేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉద్ఘాటించారు. కులం, మతం చూడకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి తగ్గ తనయుడుగా నిలిచారన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి రాష్ట్రానికి మరోసారి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. -
చిలకలూరిపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్
-
‘జగనన్న సామాజిక న్యాయం మొదలైంది ఇక్కడి నుంచే’
సాక్షి, పల్నాడు: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత నియోజకవర్గంలో భావోద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారని ప్రసంగించారామె. సోమవారం చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఆపై నిర్వహించిన సభలో మంత్రి విడుదల పాల్గొని మాట్లాడారు. ఒక బీసీ మహిళలైన తనకు చిలకలూరిపేట సీటు ఇచ్చి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి తమ ప్రభుత్వంలో చిలకలూరిపేటలో జరిగిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిపించాలి మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె సభకు హాజరైన ప్రజలకు పిలుపు ఇచ్చారామె. కానుక అందిద్దాం.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాలు మరే ఇతర ముఖ్యమంత్రి అమలు చేయలేదని చిలకలూరిపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోసారి కానుక అందిద్దామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. దేశంలోనే 30 లక్షల మందికిపైగా నిరుపేదలకు ఇల్లపట్టాలు పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. చదవండి: వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు చుక్కెదురు -
108, 104 ఉద్యోగుల సమ్మె లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యోగుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్ పాల్గొన్నారు. -
విప్లవాత్మక మార్పులకు అది రాచబాట
నెహ్రూనగర్/కర్నూలు(టౌన్)/మక్కువ: ప్రజల కష్టాలు తెలిసిన నేత సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు నినదించాయి. అన్ని వర్గాల సంక్షేమాభివృద్ధి కోసం విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి, చరిత్ర సృష్టించారని కొనియాడాయి. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు వేడుకలు నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్ర విప్లవాత్మక మార్పులకు రాచబాట అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం లభించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికారత సాధించారని, రాష్ట్రంలో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నాయని పార్టీ నేతలు అన్నారు. ప్రతి ఊళ్లోనూ మార్పు కనిపిస్తోందని చెప్పారు. గుంటూరులో మంత్రి విడదల రజిని పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన నేత జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూసి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. ఇప్పటి వరకు 99 శాతానికిపైగా హామీలు అమలు చేసిన నాయకుడు జగనన్న అని తెలిపారు. కర్నూలులో ఘనంగా కార్యక్రమాలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్పర్సన్ విజయమనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, సంజామలలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత కేక్ కట్ చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్సీఎంగా ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కేక్‌లు కట్ చేసి సందడి చేశారు. పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. తణుకులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, బువ్వనపల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ఓ చారిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ.. 2017 నవంబర్ 6వ తేదీన వైఎస్ జగన్ ఇడుపులపాయలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన పాదయాత్ర ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్.. రావాలి జగన్.. అంటూ నినదించారు. -
సీఎం జగన్ పాలనలో వైద్యులకు గౌరవం
గుంటూరు మెడికల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు పదోన్నతులు ఇచ్చారని, వేతనాలు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఆదివారం గుంటూరులో ఏపీ డాక్టర్స్ ఇంట్రాక్షన్ మీట్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యుల త్యాగాలను ఎవరూ మర్చిపోలేరన్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో వైద్యవృత్తికి, వైద్యులకు గౌరవం పెరిగిందన్నారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య వృత్తికి గుర్తింపు తెచ్చారన్నారు. తొలిసారిగా వైద్యులకు యూజీసీ స్కేల్స్ అమలు చేసిన ఘనత డాక్టర్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. దేశానికే ఏపీ ఆదర్శం వైద్యులకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఏడో వేతన స్కేల్‌ను సీఎం జగన్ అమలు చేశారని గుర్తు చేశారు. 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్ డీఎంఈ ప్రమోషన్లు ఇచ్చామని, ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ విధానంతో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామని, ఈక్రమంలో సుమారు 53 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. వైద్యుల రిక్రూట్మెంట్లో దేశానికే ఏపీ ఆదర్శంగా ఉందని తెలిపారు. రోగులు, ప్రజల అవసరాలను బట్టి నూతనంగా నెఫ్రాలజీ వార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రైబల్ ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యసేవలు పొందేలా చేశామన్నారు. నాడు–నేడుతో అభివృద్ధి.. నాడు–నేడు కార్యక్రమంతో రాష్ట్రంలో నూతనంగా 17 వైద్య కళాశాలలను రూ.8,500 కోట్లతో ప్రారంభించామన్నారు. వాటిల్లో నేడు ఐదు కళాశాలలు ప్రారంభమైనట్లు చెప్పారు. గతంలో ఉన్న 11 మెడికల్ కాలేజీలను రూ.3,820 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రూ.17,000 కోట్లతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. వ్యాధులు వచ్చాక చికిత్స అందించే ఆస్పత్రులను బలోపేతం చేయడంతోపాటు, వ్యాధులు రాకుండానే ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. దీన్లో భాగంగా ప్రివెంటివ్ మెడికల్ కేర్ ఏర్పాటు చేశామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఇళ్ల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారని పేర్కొన్నారు. -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశలో 13,818 క్యాంపులు
గుంటూరు రూరల్: జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,818 వైద్య శిబిరాలను నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ మెడికల్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. గుంటూరు రూరల్ మండలం చినపలకలూరులో నిర్వహించిన క్యాంపునకు మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మండలాల వారీగా గ్రామాల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం వారానికి రెండురోజుల చొప్పున వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. పట్టణాల్లో వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి బుధవారం, గురువారం ఈ శిబిరాలు ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 10,032 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల పరిధిలో 13,818 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని వైద్య శిబిరాలకు తీసుకురావడం, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని పెద్ద ఆస్పత్రులకు పంపి ఉచితంగా అందేలా చేయడం ఈ కార్యక్రమంలో ఒక భాగమని ఆమె వెల్లడించారు. రోగి పూర్తిగా కోలుకునే వరకు ఆరోగ్యమిత్ర, ఏఎన్ఎంల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే చేస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా, వేగంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తుండటం వల్లే వైద్య, ఆరోగ్య రంగంలో కనీవిని ఎరుగని సంస్కరణలను ప్రవేశపెట్టారని రజిని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న చికిత్సల సంఖ్యను ఏకంగా 3,257కు జగనన్న పెంచారని పేర్కొన్నారు. వైద్య ఖర్చును రూ.25లక్షలకు పెంచారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులను కూడా కొత్తవి మంజూరు చేసి జగనన్న ఆరోగ్య సురక్ష–2లో భాగంగా ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ఆసరా అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి రోగులకు చికిత్సకాలంలో ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డీకే బాలాజీ, డీఎంఈ నర్సింహం, డీఎంఅండ్‌హెచ్‌వో శ్రావణ్‌బాబు పాల్గొన్నారు. -
పేట్రేగిన టీడీపీ–జనసేన మూకలు..మంత్రి రజిని కార్యాలయంపై రాళ్ల దాడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి/సత్తెనపల్లి : టీడీపీ, జనసేన మూకలు గుంటూరులో విధ్వంసానికి తెరలేపాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని కొత్త కార్యాలయంపై ఆ మూకలు రాళ్ల దాడిచేశాయి. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్రమౌళినగర్ మెయిన్‌రోడ్డులో మంత్రి రజిని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ, జనసేన కార్యకర్తల ముసుగులో కొందరు గూండాలు పెద్ద సంఖ్యలో బైక్‌లపై ర్యాలీగా వచ్చారు. ముందుగా పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 12 గంటల తర్వాత కేక్ కటింగ్ నిర్వహించారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా.. తెలుగుదేశం, జనసేన జిందాబాద్.. అంటూ నినాదాలు చేస్తూ మంత్రి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయం మొత్తం టీడీపీ రౌడీమూకలు విసిరిన రాళ్లతో నిండిపోయింది. అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఆఫీసు సెక్యూరిటీ మాసారపు చిరంజీవి అడ్డుకోబోతే అతనిపైనా దాడిచేశారు. కార్యాలయం ప్రారంభానికి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ మూకలు చించివేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు మేడా ప్రకాష్, సాధు రఘు, మద్దులూరి రామబ్రహ్మం, పుల్లా రేవంత్, కోనేటి సాయిమణికంఠ, పాములపాటి రాంబాబుతోపాటు మరో 24 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు వంద మంది పాల్గొన్నట్లు పట్టాభిపురం పోలీసులు నిర్ధారించారు. మిగిలిన వారిపైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పథకం ప్రకారమే దాడి.. ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే.. మంత్రి రజినిని ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రమౌళినగర్లో పార్టీ కార్యాలయాన్ని ఆమె ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థులు దాడికి దిగినట్లు తెలిసింది. మరోవైపు.. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కూడా రజినిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని సహించలేని తెలుగుదేశం నేతలు ఈ దాడిని ప్రేరేపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీసీ మహిళపై టీడీపీ రౌడీయిజం : మంత్రి రజిని ఈ ఘటనపై మంత్రి రజిని స్పందిస్తూ.. తన పార్టీ కార్యాలయంపై దాడి టీడీపీ గూండాల అధికార దాహానికి పరాకాష్ట అని మండిప డ్డారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళ పోటీచేయడాన్ని చూసి తట్టుకోలేక టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారన్నారు. వారికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ధ్వంస రచనకు తెరతీశారని ఆమె ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్నారు. వాహనాల ద్వారా బస్తాల్లో రాళ్లు తీసుకొచ్చి పార్టీ కార్యాలయంపై విసిరారని.. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. మంత్రి కార్యాలయంపైనే టీడీపీ రౌడీమూకలు దాడులకు పాల్పడ్డాయంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణే ఉండదన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం పెడితే.. రాష్ట్రం సర్వనాశనమవుతుందని మంత్రి చెప్పారు. భౌతిక దాడులతో నైతికంగా తమను దెబ్బతీయాలని చూస్తున్నారని.. తమ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ఎవరి తరం కాదని రజిని హెచ్చరించారు. టీడీపీ దౌర్జన్యాలు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో గుంటూరు ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. దాడి దుర్మార్గం : ఎమ్మెల్యే మద్దాళి గిరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీ మహిళ పోటీచేయడాన్ని టీడీపీ గూండాలు సహించలేకపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి తెలిపారు. బీసీలను అందలం ఎక్కిస్తామంటూ ఓ పక్క మాయమాటలు చెబుతూ మరోవైపు బీసీలపై ఇలా దాడులకు తెగబడటం టీడీపీకే చెల్లిందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేసిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు. బలహీనవర్గాలపై టీడీపీ, జనసేన దాడులు : మంత్రి జోగి ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ కూడా స్పందిస్తూ.. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల వారు సంఘ విద్రోహశక్తులుగా, గూండాలుగా మారి బలహీనవర్గాలపై దాడులకు తెగబడుతున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లు తమ శ్రేణులను రెచ్చగొడుతూ.. ఇతర పార్టీలపై దాడులు చేయిస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థిర నివాసం కూడా లేని వీరు సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న వీరికి రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెబుతారన్నారు. టీడీపీ, జనసేన కలిశాకే అరాచకాలు : మంత్రి అంబటి ఇక టీడీపీ, జనసేన పార్టీల కలయిక ప్రజాప్రయోజనాల కోసం కాదని, అరాచకం సృష్టించేందుకేనని.. గుంటూరులో బీసీ మహిళ మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఇందులో భాగమేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రజినీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం టీడీపీ దాష్టీకమని, దీనిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిన తర్వాతే అరాచకాలు పెరిగాయన్నారు. చంద్రబాబునాయుడు నిరాశా నిస్పృహల్లో ఉన్నాడని, పవన్‌కల్యాణ్ ఒక అరాచక శక్తి అని ఆయన నిప్పులు చెరిగారు. ‘ఎర్ర’బుక్కులో పేర్లు రాసుకుని అధికారంలోకి వస్తే అధికారుల తాటతీస్తానని లోకేశ్ హెచ్చరిస్తున్నాడని, టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పంను కనీసం మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్‌గా కూడా చేసుకోలేని చంద్రబాబుకి ఇప్పుడు ఎన్నికల ముందు అక్కడి ప్రజలు గుర్తుకొచ్చారని అంబటి విమర్శించారు. అంతకుముందు.. ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఏడాదంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. -
అది చంద్రబాబు మనస్తత్వం: మంత్రి అంబటి ఫైర్
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటోందో ఇప్పుడు తెలిసొచ్చిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన అంబటి.. అరాచకవాదులుగా టీడీపీ శ్రేణులు తయారయ్యాయంటూ మండిపడ్డారు. మంత్రి రజినీ ఆఫీస్‌పై పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. రజినినీ ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులు చేయడమే టీడీపీ లక్ష్యంగా చేసుకుందని.. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారన్నారు. ఎర్ర పుస్తకాల్లో(లోకేష్ రెడ్ బుక్‌ను ప్రస్తావిస్తూ..) పేర్లు రాసుకుని బెదిరిస్తారా? అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా మంత్రిపై.. అందునా బీసీ నేతపై దాడి మంచిది కాదని అంబటి హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటోందో ఇప్పుడు తెలిసిందని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు దిగుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు ఉద్ఘాటించారు. గతంలో రుణమాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను మోసం చేశాడు. రావణుడికి పది తలలు ఉన్నట్లే.. చంద్రబాబుకి పవన్ ఒక తలగా ఉంటుండని ఎద్దేవా చేశారు. సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాననే మనస్తత్వం చంద్రబాబుదని.. పదవిపై చంద్రబాబుకి ఎందుకంత వ్యామోహమే అర్థం కావట్లేదన్నారు మంత్రి అంబటి. అయితే.. వందమంది కలిసివచ్చినా సీఎం జగన్‌ను ఓడించలేరని.. వచ్చే ఎన్నికల కోసమే 175 మంది సభ్యుల టీమ్‌ను సిద్ధం చేస్తున్నారని అంబటి చెప్పారు. ఇంకా మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే... – అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – ఈ సందర్భాన నూతన సంవత్సరం మొదటి రోజునే వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.3వేలకు పెంచి ఇవ్వడం జరుగుతోంది. – ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి రాజకీయంగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. – అదేమంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్న రూ.వెయ్యి పింఛన్‌ను అధికారంలోకి రాగానే రూ.2వేలు చేస్తానని హమీ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఇంకో మాట కూడా అన్నారు. నేను రూ.వెయ్యి పింఛన్‌ను రూ.2వేలు చేస్తానంటున్నాను.. చంద్రబాబు ఇంకా మరో రెండు మాసాలు అధికారంలోనే ఉంటారు కనుక నా మాటను కాపీ కొట్టి ఆయన రూ.2వేలు చేస్తారేమో.. అదే జరిగితే, నేను అధికారంలోకి రాగానే రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతానన్నారు. – ఆ ప్రకారంగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 నుంచి పెంచుకుంటూ ఈరోజుకు రూ.3వేల పింఛన్‌ను అందిస్తోన్నారు. – ఈనెల మూడోతేదీ నుంచి ప్రతీ వాలంటీర్ ఇంటింటికీ వెళ్లి రూ.3వేల చొప్పున పింఛన్‌ను అందించడంతో .. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దమ్మున్న ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువ కాబోతున్నారు. బాబు, పవన్‌ల ప్రగల్భాలకు రెస్పాన్స్ నిల్.. – ప్రజలంతా ఒకసారి ఆలోచించాలి. ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు. అదే, ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని బుట్టదాఖలా చేసింది చంద్రబాబు నాయుడు. – ఈ వ్యత్యాసాన్ని గమనించిన ప్రజలు రేపటి ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును తుక్కుతుక్కుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. – ఇదే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఎవరు దొరికితే వాళ్లతో సయోధ్య చేసుకోవాలని వెంపర్లాడుతున్నాడు. – దాన్లో భాగంగానే జనసేనతో కలిసి పనిచేయాలనుకున్నాడు. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఓట్లు చీలకుండా జగన్ గారిని అధికారంలో నుంచి దించేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. దాడులకు తెగబడుతున్న తెలుగుదేశం పార్టీ – చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ కలయికలో రాష్ట్రంలో రాజకీయాలు మారతాయని ఆశపడ్డారు. అయితే, వారిద్దరి పొత్తుపై ఏ విధమైన రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించాక.. ఇక, లాభం లేదనుకుని వైఎస్ఆర్సీపీ పైన దాడులకు తెగబడుతున్నారు. – నిన్న గుంటూరులో జరిగిన ఒక ఘటనకు కారణమిదే. చిలకలూరిపేట శాసనసభ్యురాలు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న శ్రీమతి విడదల రజినీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచార్జిగా నియమించారు. నూతన సంవత్సరం మొదటి రోజు నుంచి ఆమె ఇక్కడ ఆఫీసు నుంచి పనిచేయడానికి సర్వం సిద్ధమైన క్రమంలో రాత్రి 12 గంటల సమయంలో పార్టీ ఆఫీసుపై దాడులకు పాల్పడ్డారు. – ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. రాళ్లు వేశారు. బ్యానర్లు చించేశారు. – స్పాట్లోనే పోలీసులొచ్చి ఆ దాడి చేస్తున్న ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపులో ఎవరున్నారంటే, అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్లే. – తెలుగుదేశం పార్టీ మనుషులు ప్రీప్లాన్డ్‌గా మంత్రి రజినీ గారి ఆఫీసు మీద దాడిచేసి హింసాత్మకంగా అరాచకాలను సృష్టించడం చాలా దురదృష్టకరం. ఉగ్రవాదులు, అరాచకశక్తులు వారు – ఒక బీసీ మహిళ అయిన విడదల రజినీ గుంటూరులో పోటీ చేస్తుంటే.. మీకెందుకంత కడుపు మంట..? – దమ్ముంటే, ఆమెను ఢీకొట్టి గెలవాలి. మీరు గెలిచి ఆమెను ఓడించే పరిస్థితి లేదని తెలుసుకున్నారు గనుకే వారి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఇది ఎంతవరకు సబబు..? – తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక ఉగ్రవాదులుగా, హింసావాదులు, అరాచకశక్తులుగా తయారయ్యారు. అధికారమెటూ రాదని .. అరాచకానికి పూనుకున్నారా..? – ఎప్పుడైతే, తెలుగుదేశం పార్టీ జనసేనతో జతకట్టిందో..ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించేందుకు వారు కంకణం కట్టుకున్నారు. – వారి పొత్తుపై ఎటూ ప్రజల్లో స్పందన కనిపించడం లేదు గనుక .. అధికారంలోకి ఎటూ రాలేము కనుక.. రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించి వైఎస్ఆర్సీపీపై దాడులు చేసి, పోలీసువారిపైనా దాడులకు పాల్పడి ఏదో సాధించాలనే మీ తాపత్రయం చాలా దురదృష్టకరం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు కుట్ర – ఇదే సందర్భంలో నేనొక సంఘటనను గుర్తుచేస్తున్నాను. ఖమ్మంలో ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు నేనెళితే.. నా మీద కూడా దాడి చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్లే ప్రయత్నించారు. – వారంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ఆరోజు నామీద దాడి చేసి నన్ను అల్లరిపాల్జేయాలని చూశారు. – ఈ విధంగా ఎక్కడబడితే అక్కడ దాడులకు పూనుకుని.. రాష్ట్రంలో అలజడులు, అరాచకం కలిగిస్తున్నారు. – తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ తోడైంది కాబట్టి మేం రాష్ట్రంలో ఎన్ని దాడులు చేసినా.. ఎంత అరాచకం సృష్టించినా అడ్డుకునేవారు లేరని భావిస్తున్నారు వారు. అందుకే, తెలుగుదేశం పార్టీ మనుషులు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. – ఆ రెండు పార్టీల కలయికతో జరుగుతున్న దాడుల కారణంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వారు సిద్ధపడ్డారనేది కనిపిస్తోంది. పవన్‌కళ్యాణ్ పెద్ద అరాచకశక్తి – జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అందరూ చూస్తుండగా.. కాలి చెప్పు తీసి కొడతానంటాడు. ఇదెక్కడి విడ్డూరం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడైన వ్యక్తి అలా చేస్తాడా..? – రెండుచోట్ల పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి అతడు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోకపోయినా.. ఆయన్ను అభిమానించే వ్యక్తులు మాత్రం అలా కోరుకోవడం సహజం. – అలాంటి వ్యక్తి తాను ఒక పార్టీకి అధ్యక్షుడినని మరిచి బూతులు తిడుతూ.. కాలి చెప్పు చేతబట్టుకుని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్ని కొడతాననడం.. పెద్ద అరాచకం కాదా..? ఆయనో పెద్ద అరాచక శక్తి కాదా..? – అలాంటి అరాచక శక్తితో కలిసి చంద్రబాబు రాష్ట్రంలో అరాచకాల్ని సృష్టించేందుకు ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. దుర్మార్గుల్లా తండ్రీకొడుకుల బెదిరింపులు – చంద్రబాబు ఆ వయసులో కూడా పోలీసుల మీదికి తన పార్టీ మనుషుల్ని దాడి చేయమని ఉసిగొల్పుతాడా..? తరమండి.. కొట్టండి అంటూ బహిరంగంగా రెచ్చగొట్టి పంపుతాడు. ఏంటి ఈ దౌర్భాగ్యం..? – ఇంత అరాచకానికి కారణమేంటి..? ఎందుకంత మీకు ఫ్రస్టేషన్..? – మీరు అధికారంలోకి రాలేమనే కదా.. ఈ విధమైన దాడులు, రెచ్చగొట్టడాలు చేస్తుందని ప్రశ్నిస్తున్నా.. – ఇక, ఆయన కొడుకుల్లో దత్తపుత్రుడు కాకుండా సొంతపుత్రుడు లోకేశ్ ఒక ఎర్రబుక్కులో తాను టార్గెట్ చేసిన వారి పేర్లు రాశాడంట. అధికారంలోకి రాగానే వారి తాట తీస్తాడంట. అది ఎర్రబుక్కో... ఎర్రిబుక్కునో తెలియదు గానీ ఏంటి మీ బెదిరింపులు..? – చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులకు దిగజారిపోయారు. – మీరంతా అధికారుల్ని బెదిరించాలనుకున్నా.. ప్రజల్ని భయపడాలని కోరుకుంటున్నా.. ఇక్కడ వణికేవారెవరూ లేరన్నది సంగతిని మీరు గ్రహించాలి. ఆ రెండుపార్టీలకు అధికారం కలే – ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు సృష్టించినా.. దాడులకు పాల్పడి ఎంతమందిని భయపెట్టినా.. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు కూటమి అధికారంలోకి రాలేదు.. రాదు. – ఈ విషయం అందరికన్నా ముందు గ్రహించిన వారు ఆ రెండు పార్టీల నేతలే. కుప్పంలోనే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు. నాన్‌లోకల్ నేతలు మీరు – మొన్న కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. తనను మళ్లీ గెలిపిస్తే కుప్పంను ప్రపంచానికి అనుసంధానం చేస్తానంటున్నాడు. అక్కడ ఎయిర్‌పోర్టు పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట. – ఏమయ్యా చంద్రబాబూ.. నువ్వేమైనా కొత్తగా రాజకీయాల్లో కొస్తున్నావా..? కొత్తగా ఎన్నికల్లో నిలబడుతున్నావా..? కొత్తగా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నావా..? – 14 ఏళ్లపాటు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావే.. మరి, అప్పుడు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశావు..? అప్పుడు చేయనివాడివి.. ఇప్పుడు చేస్తానంటే నమ్మడానికి కుప్పం ప్రజలేమైనా అమాయకులా..? – నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం, కుప్పంకు రెవెన్యూ డివిజన్‌ను తీసుకురాలేకపోయావు. ఇది ఎంత హాస్యాస్పద విషయం. – కనీసం, కుప్పంను మున్సిపాల్టీ కూడా చేసుకోలేకపోయావు. ఆ నియోజకవర్గంలో అదీఇదీ చేస్తానన్న పెద్దమనిషివి..మరి, కనీసం అక్కడ నువ్వు సొంత కొంప కట్టుకున్నావా..? – కుప్పం వస్తే గెస్టుహౌస్‌లో ఉంటున్నావు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తే కరకట్టమీదనున్న లింగమనేని వారి గెస్టుహౌస్‌లో ఉండాల్నా..? – అదే పవన్‌కళ్యాణ్ ఈ రాష్ట్రానికొస్తే నోవాటెల్ హోటల్లో ఉండాలి. సొంత ఇళ్లులేని నేతలు మీరు. ఇంతకంటే, ప్రజలు మీ గురించి చర్చించుకోవాల్సిన దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా..? నాన్‌లోకల్ నేతలు మీరు. – అలాంటి మీరు ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్దరిస్తామంటే.. కుప్పం ప్రజలే కాదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మరు గాక నమ్మరని మీరు గమనించండి. పది తలల చంద్రబాబుకు ఒక తల పవన్‌కళ్యాణ్ – చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పార్టీల కలయిక ఆరోగ్యకరం కాదు. పది తలల రావణాసురుడు చంద్రబాబు అయితే.. ఆయనకున్న ఒక తల పవన్‌కళ్యాణ్. – కనుకే, బాబు నోట వినిపించని మాటల్ని పవన్‌కళ్యాణ్ చేత చెప్పిస్తుంటాడు. – హౌసింగ్‌లో అవినీతి జరిగిందని.. సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని కేంద్రానికి పవన్‌కళ్యాణ్ లేఖ రాయడం కూడా అందులో భాగమేనని ప్రజలు అర్ధం చేసుకోవాలి. – వీరి ఇద్దరి కలయికతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే తప్ప వారివల్ల ఈ రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం ఉండదని ప్రజలు గమనించాలని కోరుతున్నాను. అరాచకశక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం – రాజకీయ కుట్రలు, వ్యూహాలు పన్ని వైఎస్ఆర్సీపీ మీద, మా పార్టీ నాయకులపైన దాడులు చేస్తామంటే ఇక్కడెవరూ భయపడేది లేదు. – మీరు ఒక బీసీ మహిళ ఆఫీసుపై దాడిచేస్తారా.? చట్టం ఊరుకుంటుందనుకుంటున్నారా..? మిమ్మల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం.. జాగ్రత్త – అరాచకశక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని హెచ్చరిస్తున్నా. – చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌తో పాటు నిన్న మంత్రి గారి ఆఫీసుపైన రాళ్లేసిన వెధవలైనా .. ఎవరైనా గానీ అరాచకం సృష్టించాలనుకుంటు.. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పట్టుకుంటాం. అరెస్టులు చేస్తాం.. చట్టపరంగా తగిన శిక్ష విధించే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వం, చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది. – కనుక, ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఏదో నాలుగు సీట్లల్లో గెలిచేందుకు పనిచేయండి గానీ.. మీరిద్దరూ ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయడానికి పనిచేస్తామంటే ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నాను. చదవండి: మంత్రి రజిని ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్ -
మంత్రి రజిని ఆఫీస్‌పై దాడి.. 30 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు తమ చర్యలు ప్రారంభించారు. ఈ దాడికి సంబంధించి 30 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కార్యాలయంపై దాడి చేసింది టీడీపీ-జనసేన కార్యకర్తలనే పోలీసులు ధృవీకరించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై గుర్తు తెలియని ఆగంతకులు దాడులు చేశారు. ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడడంతో పాటు ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినా.. రౌడీ మూక వెనక్కి తగ్గలేదు. చివరికి దాడికి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో ఇది టీడీపీ-జనసేన కార్యకర్తల పనిగా తేల్చారు. పచ్చమూక దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి రజిని.. బీసీ అయిన తనను దాడులతో భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతో.. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారని అన్నారామె. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారామె. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే మంత్రి రజినీ కార్యాలయంపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఎవరున్నా విడిచిపెట్టేది లేదు: మంత్రి రజిని వార్నింగ్ -
మంత్రి రజిని ఆఫీసుపై దాడి ఎలా జరిగిందో చెప్పిన DSP
-
బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు
-
Guntur: ఆఫీసుపై దాడి.. మంత్రి రజిని సీరియస్ వార్నింగ్
సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటాం. ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతాం. చంద్రబాబు, నారా లోకేష్‌కు బీసీలపై కపట ప్రేమ. బీసీ మహిళా మంత్రిగా ఉన్న నా కార్యాలయంపైనే దాడి చేశారు. బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థం అవుతుంది. పక్కా ప్రణాళికతో ఇలా దాడి చేశారు. లాఠీఛార్జ్ చేసినప్పటికి దాడి కొనసాగించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దాలి గిరి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు జయహో బీసీ అంటారు.. మరొకవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతారు. గుంటూరులో ఆఫీసులపైన దాడి చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదు. తాము అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులుంటాయో రాత్రి ఘటనతోనే ప్రజలకు చెప్పారు. బీసీ మహిళ పోటీ చేయకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి అని కామెంట్స్ చేశారు. -
మంత్రి రజిని ఆఫీసుపై దాడి..15 మంది గూండాలు అరెస్ట్
-
అర్ధరాత్రి ఎల్లో బ్యాచ్ ఓవరాక్షన్.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి
సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీసు అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు. వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం, జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై ఎల్లో బ్యాచ్ రాళ్లు విసిరారు. అనంతరం, మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే, మంత్రి రజిని ఈరోజు గుంటూరు వెస్ట్‌లో ఏర్పాటు చేసిన తన ఆఫీసును ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో దాడి జరిగింది. -
మంత్రి విడదల రజిని ఆఫీసుపై టీడీపీ, జనసేన రౌడీలు దాడి
-
వైఎస్సార్ సీపీ బీసీల పార్టీ - మంత్రి విడదల రజిని
-
ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ షురూ
సాక్షి, అమరావతి/పట్నంబజార్ (గుంటూరు) : పేద, మధ్యతరగతి ప్రజలపై వైద్య ఖర్చుల భారం పడకుండా సీఎం జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రచార కార్యక్రమంతో పాటు కొత్తగా రూపొందించిన ఆరోగ్యశ్రీ స్మార్ట్‌కార్డుల పంపిణీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకం కింద వైద్యఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీంతో విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్‌కార్డులను అందజేస్తూ, పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతిఒక్కరికీ వివరించే ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ ప్రచార, స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన గ్రామాలు, పట్టణాల్లో వార్డులు/డివిజన్లలో ప్రచారం, కార్డుల పంపిణీ చేపట్టారు. సరికొత్త ఫీచర్లతో 1.48 కోట్ల స్మార్ట్‌కార్డులను వైద్యశాఖ ముద్రించింది. ఇంటింటికీ వెళ్లి అవగాహన.. కుటుంబంలో ఎవరికైనా దురదృష్టవశాత్తు జబ్బుచేసినా, ప్రమాదం జరిగినా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందడం ఎలా అనేదానిపై ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, సీహెచ్ఓ, వలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొసీజర్లను 1,059 నుంచి 3,257కు పెంచడం, ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం అందిస్తున్న భృతి, రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు ఇలా పథకం ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలియజేశారు. ప్రజలు సులువుగా పథకం సేవలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ యాప్‌ను రూపొందించింది. దీనిని ప్రతి ఇంటిలో మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, కుటుంబ సభ్యుల ఐడీ ద్వారా లాగిన్ చేయించి వినియోగంపై అవగాహన కలి్పంచారు. యాప్‌లో లాగిన్ కావడం ద్వారా పథకం కింద అందే వైద్యసేవలు, నెట్వర్క్ ఆస్పత్రులు, గతంలో పొందిన చికిత్సల వివరాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఏఎన్ఎం, సీహెచ్‌ఓలు ప్రజలకు వివరించారు. పథకం కింద సేవలు పొందడంలో ఇంకా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే ‘104’ ఫోన్‌ను ఎలా సంప్రదించాలన్న దానిపైనా అవగాహన కలి్పంచారు. ఇక పనిలో పనిగా ఇప్పటివరకూ దిశ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోని యువతులు, మహిళలు ఉన్నట్లైతే వారి ఫోన్లలో కూడా యాప్‌ను డౌన్లోడ్ చేయించి, అత్యవసర సమయంలో యాప్ ఎలా సహాయపడుతుందో వివరిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి ఏటా రూ.4వేల కోట్లు : మంత్రి రజిని కాగా, ఆరోగ్యశ్రీ ద్వారా ఎటువంటి రోగాలకు చికిత్స లభిస్తుంది, సందేహాలను నివృత్తి చేస్తూ ప్రచురించిన పోస్టర్లను గుంటూరులో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని ఆవిష్కరించి ఆరోగ్యశ్రీ కొత్త స్మార్ట్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టి వాటిని అమలుచేశారన్నారు. వచ్చే జనవరి 1 నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ సెకండ్ ఫేజ్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టాక ప్రతిఏటా రూ.4వేల కోట్లు చొప్పున ఆరోగ్యశ్రీకి కేటాయించారని.. విలేజ్ క్లినిక్‌లు, పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు వైద్యానికి సంబంధించి రూ.17వేల కోట్లతో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అలాగే, వైద్య విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 53 వేల పోస్టులను భర్తీచేశారన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుచేస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ డీకే బాలాజీ, జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, మేయర్ కావటి మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సాగరతీరంలో సాహస విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా కనిపించే విశాఖ సాగరతీరం ఆదివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బాంబుల వర్షం.. యుద్ధ విమానాల చక్కర్లు, శత్రుమూకల దాడులు.. యుద్ధ ట్యాంకర్ల వీర విహారంతో.. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. శత్రుదేశం పాక్‌పై విజయానికి ప్రతీకగా ఏటా విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో ఆదివారం నేవీడే విన్యాసాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ముందుగా నేవీ బ్యాండ్, నేవల్ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలతో ప్రారంభమైన విన్యాసాలు.. మార్కోస్ రాకతో వేడెక్కాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, వైమానిక దళాల అద్భుత ప్రదర్శనలు, యుద్ధ, నిఘా విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నిర్వహించబడే వ్యూహాత్మక విన్యాసాలతో కూడిన ఫ్లాగ్షిప్ ఈవెంట్ అద్భుతంగా సాగింది. చివరిగా.. యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణతో నేవీడే విన్యాసాల్ని ముగించాయి. విన్యాసాలకు విశిష్ట అతిథులుగా మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఎంపీ డా.సత్యవతి, కలెక్టర్ డా.మల్లికార్జున, సీపీ రవిశంకర్, జేసీ విశ్వనాథన్ హాజరయ్యారు. అనంతరం.. నేవీ హౌస్‌లో తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ‘ఎట్ హోమ్’ ఫంక్షన్ పేరుతో నిర్వహించిన తేనీటి విందులో గవర్నర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ పటిమని చాటిచెప్పే వీడియోను గవర్నర్ ఆవిష్కరించి తిలకించారు. -
ఐదు వైద్య కళాశాలల్లో అన్ని పోస్టులు భర్తీ చేయండి
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న ఐదు వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించేలా చ ర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమా వేశంలో ఐదు వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీపై మంత్రి సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ బోధనా సి బ్బందిని కాంట్రాక్టు విధానంలో నియమించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు వేతనాలు ఇవ్వడం, అదేవిధంగా శాశ్వత బోధనా సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించేందుకు సాధ్యా సా«ద్యాలను పరిశీలించాల న్నారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్ప డం ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేస్తున్నారని చెప్పారు. ఐదు కళాశాలలను ప్రారంభించామని, ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, వైద్య విద్యార్థుల హాజరు ఉండేలా పర్య వేక్షించాలని సూచించారు. వైజాగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖలో ఇప్పటి వరకు 53వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్టు గుర్తుచేశారు. వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కా ర్యదర్శి డాక్టర్ మంజుల, సెకండరీ హెల్త్ డైరెక్టర్, వై ఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ వెంకటేశ్వర్, డీ ఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
వైద్య,ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
ప్రకాశించిన సాధికారత
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో సామాజిక సాధికారత ప్రకాశించింది. సామాజిక చైతన్యం ఉవ్వెత్తున ఎగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రోడ్లపైకి చేరి పండుగ చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రతిబింబిస్తూ నగరంలోని బడుగు, బలహీనవర్గాలు బుధవారం పెద్ద ఎత్తున సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. ఒకప్పుడు అవమానాలకు గురైన తాము సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ భరోసాతో తలెత్తుకు తిరుగుతున్నామంటూ నినదించారు. జోరు వానలోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. నగర వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భారీ గజమాలలు, సంప్రదాయ నృత్యాలు, డప్పుల మోతలు, బాణాసంచాతో జై జగన్ నినాదాలతో ఒంగోలు నగరం మార్మోగింది. కర్నూలు బైపాస్ రోడ్డు నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ర్యాలీ సాగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుల వృత్తులు ప్రతిబింబించేలా శకటాలను యాత్రలో ప్రదర్శించారు. అనంతరం ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ సెంటర్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సభలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున ఇదో సామాజిక విప్లవం: మంత్రి విడదల రజిని సభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన సామాజిక సాధికారతకు ఈ వేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మంత్రులు, మేయరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నేతలే నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. మంత్రివర్గం నుంచి అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. పేదవానికి కార్పొరేట్ వైద్యం, విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఇదో సామాజిక విప్లవమని అన్నారు. బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు: ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆంధ్రాలో అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదివి అమెరికా, ఆ్రస్టేలియా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం జగన్ సుపరిపాలన చూశాక ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను కూడా ఆంధ్రాలో కలపాలంటూ డిమాండ్లు వస్తున్నాయన్నారు. జగనన్న ఆలోచనలకు మేం నిదర్శనం: మంత్రి ఆదిమూలపు సురేశ్ సీఎం జగనన్న ఆలోచనా విధానానికి నిలువెత్తు నిదర్శనం ఈ సభావేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ ఉన్నతంగా తీర్చిదిద్ది, ఇంగ్లిష్ మీడియం చదువులు అందించడాన్ని మిగతా రాష్ట్రాలూ అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, అధునాతన ప్రభుత్వ ఆస్పత్రులతో సీఎం జగన్ రోల్ మోడల్‌గా నిలిచారన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి: మంత్రి మేరుగు పేదల పక్షపాతిగా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. వైఎస్ జగన్ 75 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారని, ఇంతకంటే సామాజిక సాధికారత చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ కూడా చేయను : బాలినేని ఒంగోలు నగర ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 25 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే నెలలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా 25 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో పోటీ కూడా చేయనన్నారు. వైఎస్సార్ హయాంలో ఒంగోలులో వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించామని తెలిపారు. ఇప్పుడు ఒంగోలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.350 కోట్లతో మంచినీటి పథకానికి, మరో రూ.350 కోట్లతో కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
చిలకలూరిపేట: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం చిలకలూరిపేటలో సాక్షాత్కారం కానుంది. మూడూ నామాల స్వామి కనుల పండువగా కొలువుదీరనున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల కలగా మిగిలిన తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపమూ నిర్మాణం జరుపుకోనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కృషి, దాతృత్వంతో ఈ పుణ్యకార్యం రూపుదాల్చనుంది. గతంలోనూ పలుమార్లు చిలకలూరిపేటలో టీటీడీ కల్యాణమండపం, ఆలయ నిర్మాణానికి ఆలోచనలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో పట్టువదలకుండా మంత్రి విడదల రజిని కృషి చేశారు. ఎట్టకేలకు ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు. భూమి కేటాయింపు తలచినదే తడువుగా చిలకలూరిపేటలో టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించేందుకు అనువైన స్థలం కోసం మంత్రి విడదల రజిని అన్వేషణ సాగించారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం జరుపుకుంటున్న ప్రదేశానికి సమీపంలో భూమిని గుర్తించారు. బాపట్ల జిల్లా చీరాల ఓడరేవులోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి సంబంధించిన దేవదాయశాఖ భూమి పురుషోత్తమపట్నం సర్వే నంబర్ 336/1–సీ, 336/3సీలో ఉన్న ఐదు ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఈ భూమిలో కల్యాణ మండపం, ఆలయం నిర్మించేందుకు అవసరమైన ఫైళ్లను వేగంగా ముందుకు తెచ్చారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 21న దేవదాయశాఖకు చెందిన ఈ భూమిని కల్యాణ మండపం, వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మించేందుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3.25 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాన్ని రూ.2.50 కోట్లతో, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రూ.75 లక్షలతో నిర్మించేందుకు టీటీడీ అంగీకారం తెలిపింది. ఇందులో టీటీడీ నిబంధనల ప్రకారం ఐదో వంతు భాగం 20 శాతాన్ని పబ్లిక్ కాంట్రిబ్యూషన్ (దాతల వాటా) ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కల్యాణ మండప నిర్మాణానికి రూ. 2.50 కోట్లలో రూ.50 లక్షలు, దేవాలయ నిర్మాణానికి సంబంధించి రూ.75 లక్షలకుగాను రూ.18.75 లక్షలు దాతల వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని మంత్రి విడదల రజిని, కుమారస్వామి దంపతులు భరించేందుకు ముందుకు వచ్చారు. కల్యాణ మండప నిర్మాణానికి రూ.50 లక్షలు, వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.18.75 లక్షల నిమిత్తం రెండు డిమాండ్ డ్రాఫ్ట్‌లను ఈనెల ఆరో తేదీన మంత్రి విడదల రజిని కుటుంబ సభ్యులు ఆమె మరిది విడదల గోపీనాథ్ ఆధ్వర్యంలో తిరుమలలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డిని కలిసి అందజేశారు. దీంతో మొత్తం రూ.3.25 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలకు మార్గం సుగమమైంది. వేగంగా నిర్మాణపనులు ఎన్నో దశాబ్దాలుగా కలగానే మిగిలి ఉన్న టీటీడీ కల్యాణ మండపం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు నా హయాంలో ప్రారంభం కానుండటం అదృష్టంగా భావిస్తున్నా. దీనికి సంబంధించి భూమి కేటాయింపు, అన్ని అనుమతులూ ఇప్పటికే లభించాయి. ఇక పనులు ప్రారంభించటమే తరువాయి. ఎవరి వద్ద నుంచి ఏమీ ఆశించకుండా దాతల వాటా కూడా చెల్లించాం. నిర్మాణ పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తాం. – విడదల రజిని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
కేబినెట్లోనూ సామాజిక సాధికారత
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర కేబినెట్లో 25 మంత్రులకుగాను 17 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించి, వారికి పెద్దపీట వేసిన జగనన్నకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత తెలిపేందుకే ఈ బస్సు యాత్ర అని మంత్రి విడదల రజిని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం శివయ్య స్థూపం సెంటర్లో జరిగిన భారీ బహిరంగసభలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎలా మేలు చేసిందో వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో సైతం చరిత్రలో మరే సీఎం ఇవ్వని విధంగా పదవులు అందించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో నలుగురు బీసీ నేతలను రాజ్యసభకు పంపడం విశేషమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు డీబీటీ ద్వారా సుమారు రూ.2.4 లక్షల కోట్లకు పైగా లబ్ధిచేకూర్చిన ప్రభుత్వం ఇదేనన్నారు. పథకాల అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఆడపడుచులకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిచేకూరిందన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను రానున్న ఎన్నికల్లో బీసీలు తమ ఓటు ద్వారా కత్తిరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇంత చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చే బాధ్యత మనందరి మీద ఉందని రజిని పిలుపునిచ్చారు. ఆచరణలో సామాజిక విప్లవం చూపిన జగన్.. మరో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దేశంలో ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలి, దేశం బాగుపడాలి, పేదవారు బాగుండాలని కోరుకున్నారని.. కానీ, దాన్ని ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కితాబిచ్చారు. చంద్రబాబు పాలనలో అవమానాలు ఎదుర్కొన్నామని.. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు పాలనలో దళితులపై పెద్ద సంఖ్యలో దాడులు జరిగాయని గుర్తుచేశారు. జగనన్న మాత్రం అలా చూడలేదన్నారు. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తెచ్చారంటే మన జీవన విధానం పెరిగిందా? తగ్గిందా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ముందు వరుసలో నిలబెట్టిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. ‘నువ్వు నాతో ఉండాలని జగనన్న అన్నారు. మీకోసం ఎంతదూరమైనా వెళ్తా అని నేను మాటిచ్చా’నన్నారు. మైనార్టీలు త్వరలోనే శుభవార్త వింటారని అలీ చెప్పారు. నా వాళ్లంటూ అక్కున చేర్చుకున్నారు తరతరాలుగా ద్వితీయశ్రేణి మనుషులుగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అంటూ ఆప్యాయంగా పిలిచి రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వారిని ఎంతో ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఎస్టీలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. జగన్ మాత్రం డిప్యూటీ సీఎం ఇవ్వడంతోపాటు, ట్రైబల్ కమిషన్ ఏర్పాటు, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలో 3.26 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం గిరిజనులకు అందజేసిందన్నారు. 17న ‘వరికపూడిసెల’ పనులు ప్రారంభం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జగనన్న వినుకొండలో వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మిస్తామని ఇచ్చిన హామీని అమలుచేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈనెల 17న మాచర్లలో సీఎం పర్యటనలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో పల్నాడుకు మెడికల్ కళాశాల, వరికపూడిసెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు, రూ.3 వేల కోట్లతో హైవేలు, జేజేఎం పనులు, కేంద్రీయ విద్యాలయాలు తెచ్చామని, మరోసారి అవకాశమిస్తే పల్నాడు రూపురేఖలే మారుస్తామన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారు ఏమిచేయలేదని.. వినుకొండ అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము టీడీపీకి ఉంటే ముందుకు రావాలని ‘లావు’ సవాలు విసిరారు. ఆచరణలో గుర్రం జాషువా ఆశయాలు బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థాయివైపు చేయి పట్టుకుని తీసుకెళ్లిన ఘనత జగన్‌కే దక్కిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నిజమైన సామాజిక సాధికారత ఫలితాలెలా ఉంటాయో చేతల్లో చూపించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. సామాజిక సాధికారత ఏంటో ఈ సభావేదిక చూస్తే ఆర్థమవుతుందని.. మాలాంటి ఎంతోమందిని మంత్రులుగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా చేసి చట్టసభల్లో మాకు సముచిత స్థానం కల్పించారన్నారు. గుర్రం జాషువా ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో పెడుతున్న వ్యక్తి జగన్ అన్నారు. బడుగువర్గాలకు మేలు చేసే గట్టున ఉంటారా, పెత్తందార్ల గట్టున ఉంటారా అన్నది ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. 2019లో ఇచ్చిన తీర్పు మరోసారి 2024లో సైతం ఇచ్చి జగనన్నను గెలిపించాలని కోరారు. సాధికారత యాత్రకు జేజేలు స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో జరిగిన ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది ప్రజలు, పార్టీ నేతలు యాత్రకు పూలవర్షం, గజమాలలతో స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నేతల ప్రసంగాల్లో జననేత జగనన్న పేరు వినగానే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘‘మా నమ్మకం నువ్వే జగన్’’.. ‘‘జగన్ రావాలి–జగనే కావాలి’’.. ‘‘వై నాట్ 175’’ అంటూ జనం ప్రతిస్పందించారు. రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వి. విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే, బాబు జగజ్జీవన్‌రామ్, కొమురం భీం, భారతరత్న అబ్దుల్ కలాం చిత్రపటాలు, మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఉంచి నేతలు నివాళులు అర్పించారు. -
ఆరు నూరైనా మళ్లీ జగనే సీఎం: వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, పల్నాడు: సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవ కల నెరవేరిందని, తిరిగి ఆయనే ముఖ్యమంత్రి అయ్యి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ కీలక నేతలు. మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ జరిగింది. చంద్రబాబు హయాంలో వివిధ సామాజిక వర్గాలకు ఎంతటి అన్యాయం జరిగిందని వివరిస్తూనే.. జగనన్న పాలనలో ఆయా వర్గాలకు దక్కిన ప్రాధాన్యతలను సభకు హాజరైన ప్రజలకు వివరించారు వైఎస్సార్సీపీ నేతలు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఎంతో చేశాడు. ఇవాళ ఆయా వర్గాలకు చెందినవాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మహానేత తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కారణం. వినుకొండలో మంచి నీటి సమస్యను పరిష్కరించాం. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేయలేదు. కానీ, అధికారం ఇస్తే మాత్రం బెంజ్ కారు ఇస్తానంటారు.. రైతు రుణ మాఫీ చేస్తానంటారు. వినుకొండలో ఒక్క అభివృద్ధి పని చేశామని టీడీపీ నేతలు చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. సామాజిక విప్లవం రావాలని విప్లవకారులు కోరుకున్నారు. ఎస్సీ కులంలో ఎవరూ పుట్టకూడదని చంద్రబాబు అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. వైఎస్ జగన్ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. పేద వాడు చదువుకోవాలని, వైద్యం చేయించుకోవాలని జగన్ ఆలోచించి అనేక కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు దళిత హక్కులను కాలరాశారు. అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసి ముళ్ళపొదల్లో చంద్రబాబు కడితే.. విజయవాడ నడిబొడ్డున జగన్ అంబేద్కర్‌కు భారీ విగ్రహం పెట్టారు. వైఎస్ జగన్ మరో అంబేద్కర్.. పూలే. చంద్రబాబు దొరికిపోయిన దొంగ.. మోసకారి. ఆరు నూరైనా తిరిగి వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేసిన కార్యక్రమాలు సాధికారితకు నిదర్శనం. జాషువా పుట్టి పెరిగిన గడ్డ వినుకొండ. జాషువా జయంతిని అధికారికంగా జరుపుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. కోర్టులో కూడా అబద్దం చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టులను మోసి చేసిన వ్యక్తి మనల్ని మోసం చేయడా?. బ్రహ్మన్నకు(ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడును ఉద్దేశించి..) మరోసారి అవకాశం ఇవ్వండి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. మంచి చేయకపోతే ఎవరినైనా ఏట్లో వేస్తామని వినుకొండ ప్రజలు గత ఎన్నికల్లో చెప్పారు. ఈ ప్రాంతం వెనుకబడిన ఉండటానికి ప్రధాన కారణం నీళ్ళు లేకపోవడమే. వరికిపూడిసెల తీసుకొచ్చి బొల్లాపల్లి మండలానికి సాగు త్రాగు నీరు ఇస్తామని చెప్పాం. ఇందులో భాగంగానే అన్ని అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడానికి సిద్ధమయ్యాం. ఈ నెల 17న మాచర్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి పనులు కూడా ప్రారంభిస్తాం. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. జగన్ అన్న కటౌట్ చూపించి సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తాం. జగన్ లేకుండానే ఇంతమంది వస్తే.. జగనన్న వస్తే జనసునామీ వచ్చేది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే సాధికారిత సాధ్యమవుతుంది. పదవుల్లో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ఇచ్చారు. వార్డు మెంబర్ నుండి రాజ్యసభ ఎంపీ వరకూ అవకాశం ఇచ్చారు. రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్.. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే) ద్వారా పేదలకు పంచారు. ఒక బీసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. పద్నాలుగు ఏళ్ళు సీఎంగా చేసి.. నలభై ఏళ్ల సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు తోకను బీసీలు కత్తిరించబోతున్నారు. చంద్రబాబును దళితులు ఓడించి.. ఆయన్ని ఆత్మవిమర్శ చేసుకునేలా చేయబోతున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు అలీ మాట్లాడుతూ.. బ్రహ్మ నాయుడుని యాభై నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎత్తుకొని జగన్ ముందు వరుసలో కూర్చో బెట్టారు. వైఎస్ తోనూ ఆయన కుమారుడు జగన్ తోనూ నా ప్రయాణం సాగింది. జగనన్న కోసం ఎంతదూరమైన, ఎక్కడికైనా వెళ్తాను. మైనారిటీలు త్వరలోనే శుభ వార్త వింటారు. -
ట్వీట్ చేయడం కాదు.. లోకేష్ దమ్ముంటే దీనికి సమాధానం చెప్పు
-
జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
సిటీ ఆఫ్ డెస్టినీ.. విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అత్యంత ప్రభావవంతమైన విద్యాసంస్థలు, పరిశ్రమలతోపాటు ఆకర్షణీయమైన బీచ్‌లు ఉన్న విశాఖ నగరం నిజంగా ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కొనియాడారు. ముఖ్యంగా హైటెక్ వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మరింత పురోభివృద్ధి సాధించేందుకు అవసరమైన నిపుణులు రాష్ట్రంలో ఉన్నారని ప్రశంసించారు. ఆంధ్రా వైద్య కళాశాల (ఏఎంసీ) శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శనివారం విశాఖ చేరుకున్నారు. ముందుగా ఐఎన్ఎస్ డేగాలో తూర్పు నౌకాదళం, రాష్ట్ర ప్రభుత్వం అందించిన గార్డ్ ఆఫ్ ఆనర్, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా వైద్య కళాశాలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి ఏఎంసీ శతాబ్ది ఉత్సవాల పైలాన్‌ని గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏఎంసీలో రూ.20 కోట్లతో నిర్మించనున్న క్లినికల్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు జగదీప్ ధన్‌ఖడ్ శంకుస్థాపన చేసి.. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఉత్సవాల సదస్సులో పాల్గొన్నారు. ఏఎంసీ సెంటినరీ కాఫీ బుక్, పోస్టల్ కవర్, స్టాంప్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీప్ ధన్‌ఖడ్ ఆంధ్రా వైద్య కళాశాల (ఏఎంసీ).. వైద్య నిపుణులను అందిస్తూ వైద్య రంగానికి బెంచ్‌మార్క్‌గా నిలుస్తోందని కొనియాడారు. 12 మంది పద్మ అవార్డుల్ని అందుకున్న ఏకైక వైద్య కళాశాలగా దేశంలోనే ఏఎంసీ చరిత్ర సృష్టించిందన్నారు. కోవిడ్ సమయంలో హెల్త్ వారియర్స్‌గా నిలిచిన వైద్యులు మరిన్ని పరిశోధనలు చేయాలని సూచించారు. వైద్య రంగంలో భారత్‌ను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే బాధ్యతను ఏఎంసీ వంటి వైద్య కళాశాలలు తీసుకోవాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ సరికొత్త విప్లవం సృష్టించారు.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాటా్లడుతూ వైద్య కళాశాలల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీలో సరికొత్త విప్లవాన్ని సృష్టించారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి సమగ్ర చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నాలుగు క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2030 నాటికి ఏపీకి చెందిన ఒక్క క్యాన్సర్ పేషెంట్ కూడా వైద్యం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. త్వరలోనే ఏఎంసీ.. ఆంధ్రా మెడికల్ యూనివర్సిటీగా మారే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఎంపీలు జీవీఎల్ నరసింహరావు, సీఎం రమేశ్, ఏఎంసీ సెంటినరీ కమిటీ చైర్మన్ డా.రవిరాజు, ఏఎంసీ ప్రిన్సిపాల్ జి.బుచ్చిరాజు, డీఎంఈ నరసింహంతోపాటు వైద్య ప్రముఖులు, వివిధ దేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వైద్య రంగంలో ఉన్నత స్థాయి పరిశోధనలు జరగాలి.. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ప్రపంచానికి వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అందించడంలో భారత్ అగ్రభాగంలో ఉందన్నారు. యూఎస్, యూకే, తదితర దేశాలతోపాటు యూరప్‌లో 70 వేలకు పైగా వైద్యులు భారత్ నుంచి వెళ్లినవారేనని తెలిపారు. అయినప్పటికీ వైద్య విద్యా కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగంలో ఉన్నత స్థాయి పరిశోధనలు అవసరమని చెప్పారు. ఏటా 25 వేల మంది భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు విదేశాలకు వెళ్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ తరహాలో దేశంలో మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా పూర్వ విద్యార్థులు ఉండటం ఏఎంసీకి గర్వకారణమన్నారు. -
సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ ఒకే చోట..
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్ర వైద్య కళాశాలలోని కేజీహెచ్‌లో సూపర్ స్పె షాలిటీ సేవలన్నీ ఒకే చోట లభించ డం శుభ పరిణామమని కేంద్ర వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ప్రశంసించారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రా మెడికల్ కళాశాల శత దినోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్చువల్‌గా హాజరయ్యారు. ఉత్సవాల్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె.నివాస్, కలెక్టర్ డా.మల్లికార్జున, డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జీ, మధ్యప్రదేశ్ ఆయుష్మాన్ భారత్ ముఖ్య కార్యదర్శి రమేశ్‌కుమార్, సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో ఏర్పాటు చేస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి వచ్చే వైద్యులకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. పీజీ, డిగ్రీలో అధిక మార్కులు సాధించిన వైద్య విద్యార్థులకు మంత్రి రజిని మెడల్స్, అవార్డులు అందజేశారు. ఎమ్మెల్సీ డా.రవీంద్రబాబు, ఏఎంసీ ప్రిన్సిపల్ డా.బుచ్చిరాజు, ఎంపీ డా.సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
పేదోళ్లకు వరం.. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం
చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్షతో పేదోళ్ల ఆరోగ్యానికి అత్యంత రక్షణ కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనా విధానం నుంచి పుట్టిన అద్భుత పథకమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సుగాలికాలనీలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి బుధవారం పరిశీలించారు. శిబిరానికి హాజరైన పేద రోగులను ఆత్మీయంగా పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందజేయటమే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కోటి34లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,535 వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. 71,173 మందికి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మెరుగైన వైద్యం అందించినట్లు చెప్పారు. చంద్రబాబు హయాంలో ఆరోగ్యరంగం కుదేలైందని విమర్శించారు. గతంలో 1,059 ఉన్న ఆరోగ్య శ్రీ వైద్య సేవలను జగనన్న ప్రభుత్వం 3,257కు పెంచిందని, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రవి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొన్నారు. -
జగనన్న గురించి ఏది పడితే అది మాట్లాడితే: విడదల రజినీ
-
ఎన్ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతోందని, వాటిని సడలించి పాత పద్ధతినే కొనసాగించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం మంత్రి రజిని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్ఎంసీ కొత్తగా పలు నిబంధనలు తీసుకొచ్చింది. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద వైద్య సీట్ల చొప్పునే అనుమతిచ్చేలా నిబంధనలు రూపొందించింది. అలాగే కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతివ్వాలంటే 605 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి కూడా ఉండాలని నిర్ణయించింది. ఈ రెండు నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ట్ర విభజన తర్వాత టెర్షియరి కేర్ సర్వీసెస్ విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 12 కాలేజీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి. సిబ్బంది నియామకాలు కూడా పూర్తయ్యాయి. కానీ కొత్త నిబంధనల వల్ల ఏపీకి ఒక్క మెడికల్ కాలేజీ కూడా కొత్తగా మంజూరయ్యే అవకాశం ఉండదు’ అని కేంద్ర మంత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు విడదల రజిని వివరించారు. వైద్య, ఆరోగ్య రంగంలో సీఎం వైఎస్ జగన్ తీసుకొస్తున్న సంస్కరణలకు కేంద్రం తరఫున తగిన సహకారం అందించాలని.. ఏపీ ప్రజలకు ఎలాంటి నష్టం రాకుండా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. తమ వినతికి మన్సూక్ మాండవీయ సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్‌దాస్, ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కింబెర్లీ– క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య, ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ సంస్థ 2.33 లక్షల శానిటరీ నాప్కిన్లు, 297 కేసుల డైపర్స్‌ను తొలి విడతలో పేద విద్యార్థులు, చిన్నారులకు అందజేసేందుకు ముందుకొచ్చింది. కార్య్రకమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఏడో తరగతి నుంచి 12వ తరగతి లోపు ఆడపిల్లలకు స్వేచ్ఛ కార్యక్రమం కింద ప్రభుత్వం నెల నెలా 12 లక్షల శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. హెల్త్ రికార్డులన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా వైద్యం పొందుతున్న అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. 1.6 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు. క్యాంపులకు హాజరైన వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే అలాంటి వారిని పెద్దాస్పత్రులకు సిఫారసు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నయం అయ్యేంతవరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని, కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ప్రతి అంశంలోనూ బురదజల్లడమే పనిగా మారిందని మండిపడ్డారు. -
ఈ అవ్వ మాటలకు మంత్రి రజని ఫిదా
-
జగనన్న ఆరోగ్య సురక్షతో సంచలన ఫలితాలు
చిలకలూరిపేట: రాష్ట్రంలో అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంచలన ఫలితాల దిశగా దూసుకుపోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి విడదల రజిని సందర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ వరకు అంటే తొలి పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,041 వైద్య శిబిరాల్లో ఏకంగా 13.7 లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని చెప్పారు. మొత్తం 10,057 వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించామన్నారు. ఇప్పటి వరకు 34 వేల మంది రోగులకు మెరుగైన వైద్యం అవసరం ఉందని గుర్తించి, పెద్ద ఆస్పత్రులకు సిఫార్సు చేశామని పేర్కొన్నారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని తెలిపారు. వీరి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు డీఎంఅండ్‌హెచ్‌వోలు, ఆయా గ్రామాల సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. వీరు ఆరోగ్యంగా తిరిగి వచ్చేవరకు ఫాలోఅప్ ఉంటుందని, ఆ తర్వాతే వారి కేసు ఆన్లైన్లో ముగుస్తుందని వెల్లడించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అని ఆమె వివరించారు. -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: మంత్రి రజని
-
పథకాల అమలులో ఏపీ ప్రామాణికం
సాక్షి, బెంగళూరు: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే గొప్ప ప్రామాణికంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించొచ్చనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రముఖ మీడియా గ్రూప్.. సౌత్ ఫస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో శనివారం దక్షిణ్ డైలాగ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మదింపు జరిగింది. దీనికి ఆయా రాష్ట్రాల ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు ఒక అభివృద్ధి నమూనా ఉందా? ఒకవేళ ఉంటే అది సరైన దారిలోనే ఉందా? అనే అంశాలపై చర్చ నిర్వహించారు. అనేక సంస్కరణలకు శ్రీకారం.. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. మన దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం జగన్ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రతి పథకం ఆయన ఆలోచన నుంచి వచ్చేందేనన్నారు. అమ్మఒడి ద్వారా ఏటా 44.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థుల డ్రాపవుట్లు నివారించి అక్షరాస్యత శాతాన్ని పెంచగలిగామన్నారు. నాలుగేళ్లలో ఈ పథకానికి తమ ప్రభుత్వం ఏకంగా 26,067.28 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. అలాగే రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలను నాడు–నేడు కింద రూ.17,805 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన కార్యక్రమాల ద్వారా 1 నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నామని తెలిపారు. నిజమైన మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు 7.98 లక్షల మహిళా గ్రూపులకు రూ.19,178.17 కోట్ల రుణాలను తమ ప్రభుత్వం మాఫీ చేసిందని తెలిపారు. అలాగే వైఎస్సార్ చేయూత కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున అందించిందన్నారు. 30 లక్షల మందికిపైగా మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా కట్టి ఇస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా, వాహన మిత్ర , నేతన్న నేస్తం.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీ ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో తమ ప్రభుత్వం కనీవినీ ఎరుగని సంస్కరణలు ప్రవేశపెట్టిందని రజిని తెలిపారు. రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. దేశంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏపీయేనని వెల్లడించారు. రూ.16 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య పరీక్షలు చేయడంతోపాటు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. -
అవ్వలతో మంత్రి విడదల రజిని సరదా సన్నివేశం
-
ఊరూ వాడా.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల్లో 7.16 లక్షల మంది ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తే గురువారం వరకూ నాలుగు రోజుల పాటు వైద్య శాఖ 2,427 శిబిరాలను నిర్వహించింది. గ్రామాల్లో 2,261 శిబిరాలను నిర్వహించగా పట్టణాలు, నగరాల్లో 166 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి శిబిరంలో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి ఇద్దరు చొప్పున మొత్తంగా నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచారు. నాలుగు రోజుల్లో ఏకంగా 7,16,101 లక్షల మంది సొంత ఊళ్లలో ఉచిత చికిత్సలు పొందారు. వెద్య సేవలను వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 4 లక్షల మందికిపైగా మహిళలే ఉండటం గమనార్హం. ఒక్కో శిబిరంలో సగటున 277 మంది వైద్య సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు భావించిన 20,798 మందిని పెద్దాస్పత్రులకు రిఫర్ చేశారు. ఉచితంగా పరీక్షలు.. మందులు ప్రతి క్యాంపులో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్త పరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఫ్యామిలీ డాక్టర్లు, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పర్యవేక్షిస్తున్నారు. ఐదు దశల్లో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. టోకెన్లు లేకున్నా వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు లేకున్నా కూడా తమ గ్రామం/పట్టణంలో శిబిరం నిర్వహించే ప్రాంతానికి నేరుగా వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మహిళలకు ప్రత్యేక కౌంటర్ – పకూర్ బీ, క్రిష్టిపాడు, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. గతంలో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లే వాళ్లం. ఇప్పుడు మా గ్రామానికే వైద్యులు వస్తున్నారు. డబ్బు ఖర్చు లేకుండా ఊళ్లోనే వైద్యం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు వ్యయ ప్రయాసలు లేకుండా వైద్యులే గ్రామాల్లోకి వచ్చి వైద్యం చేయడం ఎంతో మేలు చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే రూ.5 వేలు ఖర్చయ్యేవి – కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కర్రి లక్ష్మి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)) ఆరోగ్య సురక్ష శిబిరంలో నేను, నా భర్త వైద్య సేవలు పొందాం. ముందుగానే వలంటీర్, ఏఎన్ఎం మా ఇంటికి వచ్చి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భీమవరంలో నిర్వహించిన సురక్ష శిబిరంలో కొన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ వైద్యులు ఉచితంగా మందులు కూడా ఇచ్చారు. ఇదే వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుంటే మాకు సుమారు రూ.5 వేలు ఖర్చయ్యేవి. ముఖ్యమంత్రి జగన్ మా ఇంటి వద్దకే వైద్యులను పంపించి ఉచితంగా సేవలు అందించడం చాలా బాగుంది. ఈ శిబిరాలు పేద, మధ్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడతాయి. 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులు: మంత్రి విడదల రజని చిలకలూరిపేట: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును మంత్రి రజని గురువారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మెరుగైన వైద్యం అవసరమని గుర్తించిన వారికి పెద్ద ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో వైద్యం అందించేందుకు ఏకంగా 4 వేల మంది స్పెషలిస్టు వైద్యులను నియమించినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. -
బాబుపై మంత్రి రజిని ఫైర్
-
10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రతి గడపకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ శిబిరాలకు వస్తున్న ప్రతి వ్యక్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరచడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దాస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండానే ఉన్నత వైద్యం అందిస్తామన్నారు. మూడు రోజుల్లోనే ఈ శిబిరాల ద్వారా 3.35 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. వీటిలో 11,780 కేసులను ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉన్నత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 297 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు 250 మంది వైద్య నిపుణులను కేటాయించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. గిరిజనులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు గిరిజనులంటే సీఎం జగన్‌కు అపారమైన ప్రేమ అని మంత్రి రజిని తెలిపారు. రూ.600 కోట్లతో మన్యం జిల్లా పార్వతీపురంలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని చెప్పారు. అలాగే పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది ఇది ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీంతోపాటు 600 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో మన్యం ప్రజలు కేజీహెచ్‌కు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో బర్త్ వెయిటింగ్ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు 40.. 104, 108 వాహనాలను కేటాయించామన్నారు. 20 లక్షల మంది గిరిజనులకు సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నామన్నారు. రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్ కూడా అందిస్తున్నామని చెప్పారు. అనంతరం వైద్య శిబిరానికి వచి్చన గిరిజనులకు మందుల కిట్లు పంపిణీ చేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చే గిరిజనులకు ఉచితంగా ఆహారం, తాగునీరు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దత్తత గ్రామానికి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా? టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బాౖMð్సట్ తవ్వకాలతో మన్యాన్ని దోచుకోవాలని ప్రయత్నాలు చేశారని మంత్రి విడదల రజిని విమర్శించారు. పెదలబుడును చంద్రబాబు దత్తత తీసుకుని ఒక మంచి పని అయిన చేశారా అని నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉన్న జీవోను రద్దు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నివాస్, ఐటీడీఏ పీవో వి.అభిõÙక్, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణీలూ.. నెలలు నిండకుండానే బర్త్ వెయిటింగ్ హాల్‌కు రండి: మంత్రి రజిని
సాక్షి, అల్లూరి జిల్లా: మన్యానికి జ్వరం వచ్చింది అన్న శీర్షికలతో గతంలో వార్తలు చదివాం.. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది మన్యానికి మంచి ఆరోగ్యం వచ్చింది. సీఎం జగన్ ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఇది ఓ చరిత్ర.. అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం కిల్లోగూడ గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సందర్శించారు. అక్కడ వచ్చినా రోగులతో మాట్లాడారు. వివిధ దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష అమలు తీరును ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల మంచి మనసు తనకు ఎంతో మనసుకు నచ్చిందన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలని సీఎం జగన్ ఆలోచన మేరకు కృషి చేస్తున్నట్టు వివరించారు. గర్భిణీలు నెలలు నిండే వరకు గిరిజన గ్రామాల్లో ఉండకుండా బర్త్ వెయిటింగ్ హాళ్లకి చేరాలని కోరారు గర్భిణీ తో వచ్చే సహాయకులకు ఉచితంగా వసతి ఆహారం అందిస్తామని చెప్పారు. దీనిద్వారా ప్రసాద్ సమయంలో ఇబ్బందులు పడకుండా దోళీమోతలు లేకుండా ఉంటాయని వివరించారు. ఈ విషయంలో గర్భిణీలకు ఆశా వర్కర్లు సహకరించాలని సూచించారు. ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రెండు రోజుల్లోనే గరిష్టంగా 11 వేల 550 మందికి మెరుగైన వైద్యం కోసం రిఫరల్ ఆసుపత్రులకు సిఫార్సు చేశామన్నారు. సాధారణ జ్వరం లాంటి రుగ్మతలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య సదుపాయం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష నగరాలు గ్రామీణ ప్రాంతాల కంటే మారుమూల గిరిజన గ్రామాలకు చెరువు చేయాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. గతం మాదిరిగా పాడేరు అరకు మన్యం ప్రాంతాల నుంచి వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే అధునాతన వైద్యం అందే రీతిన చర్యలు చేపట్టారని, వచ్చే ఏడాదికి పాడేరు మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. వచ్చే ఏడాది నుంచి 300 పడకల ఆసుపత్రి కూడా అందుబాటులోకి వస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వెల్లడించారు. గతంలో చూస్తే మన్యంలో ఖనిజ సంపదను దోచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని.. ఇప్పుడు అందుకు భిన్నంగా గిరిజన ప్రాంతంలో మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్ ఆలోచనలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతానికి దగ్గరగా ఉన్న గర్భిణీలు కోసం ఆసుపత్రులకు దగ్గరలో బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గిరిజన ప్రజల కోసం పాడేరు పార్వతిపురం మన్యం జిల్లాల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి వచ్చే గిరిజనులకు మధ్యాహ్నం ఆహారం కూడా ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపించాలని ఆమె కోరారు. తొలిసారిగా గర్భిణీ స్త్రీల వెయిటింగ్ హాల్ కోసం తన క్వార్టర్స్ ను కేటాయించిన అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ను ఆమె అభినందించారు. మరింత మెరుగైన వైద్యం గిరిజన ప్రజలకు అందించడానికి అవసరమైన కొత్త ప్రణాళికలను అమలు చేస్తామని మంత్రి విడుదల రజిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ..పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మీ.. జగన్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర.. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యాంధ్రప్రదేశ్
మద్దిలపాలెం (విశాఖపట్నం): జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విశాఖ నగరం 16వ వార్డులోని ఇసుకతోట అర్బన్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకటకుమారితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలకు విశేషస్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో 10,032 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 542 పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో 45 రోజులపాటు 10,574 జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల 30న వైద్యశిబిరాలు ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 611 శిబిరాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ శిబిరాల్లో 1.57 లక్షలమందికి వైద్యపరీక్షలు చేశామని, వీరిలో 6,089మందికి మెరుగైన వైద్యచికిత్స కోసం రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేశామని వివరించారు. వీరందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఈ శిబిరాల్లో నాలుగువేల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు చెందిన స్పెషలిస్టు వైద్యులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇదో చరిత్రాత్మక ఘట్టమన్నారు. పల్లెలు, కాలనీల్లోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చి వైద్యం చేయడం రాష్ట్రంలో మునుపెన్నడూ చూడలేదని చెప్పారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 3,257 వ్యాధులకు వర్తింపజేశామని, వైద్యంతోపాటు చికిత్స తర్వాత దినసరి భత్యం అందిస్తున్నట్లు తెలిపారు. నాడు–నేడు కింద రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారన్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కళాశాలలను ప్రారంభించారని గుర్తుచేశారు. నాలుగేళ్ల పాలనలో కేవలం వైద్యానికి రూ.3,600 కోట్లకుపైగా ఖర్చుచేశామని ఆమె చెప్పారు. -
ప్రజారోగ్యానికి ‘రక్ష’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమాన్ని ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ద్వారా చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములయ్యారని తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ప్రివెంటివ్ కేర్‌లో నూతన అధ్యాయం ఫ్యామిలీ డాక్టర్ విధానం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో నూతన ఒరవడికి నాంది పలికాం. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపంలో ప్రివెంటివ్ కేర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. దేశంలో ఎవరూ, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మనం ధైర్యంగా, సాహసోపేతంగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌ను, 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తేగలిగాం. వీటిలో పూర్తి స్థాయిలో వనరులన్నీ సమకూర్చాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉండేలా చర్యలు చేపట్టాం. పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ఒక 104 వాహనాన్ని సమకూర్చాం. పీహెచ్‌సీల్లోని వైద్యులకు ఆ మండలంలోని గ్రామాలను విభజించి వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఇద్దరు వైద్యుల్లో ఒకరు పీహెచ్సీలో సేవలు అందిస్తుంటే మరొకరు 104 ఆంబులెన్స్‌లో తనకు కేటాయించిన గ్రామానికి వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇలా తనకు కేటాయించిన గ్రామాలను ప్రతి వైద్యుడు నెలలో రెండు సార్లు సందర్శిస్తున్నారు. క్రమం తప్పకుండా ఓ గ్రామానికి వైద్యుడు వెళ్లడం వల్ల ఆర్నెల్లలో గ్రామంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలకు వైద్య పరంగా ఏ అవసరాలున్నాయనేది గుర్తించి మెరుగైన వైద్య సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. అప్పులపాలయ్యే పరిస్థితులు రాకుండా దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు బారినపడితే పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అప్పుల పాలయ్యే పరిస్థితులు రాకుండా డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అండగా ఉంటున్నాం. టీడీపీ హయాంలో కేవలం 1,056 ప్రోసీజర్స్‌కు పరిమితం కాగా ఇప్పుడు 3256కు ప్రొసీజర్స్‌ను పెంచాం. గతంలో 915 నెట్వర్క్ ఆసుపత్రులుంటే ఈ రోజు 2,200 పైచిలుకు ఆస్పత్రులున్నాయి. ప్రజలు వైద్యం కోసం అప్పులపాలు కాకుండా ఉండాలనే ఈ చర్యలన్నీ చేపట్టాం. ప్రజారోగ్య రంగంలో కీలక పాత్ర ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆనారోగ్య సమస్యలున్నా గుర్తించేలా సర్వే నిర్వహిస్తున్నాం. ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు చేసి వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తిస్తున్నాం. అనంతరం గ్రామంలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్టు డాక్టర్లతో చికిత్స అందిస్తున్నాం. రోగం నయం అయ్యే దాకా సంబంధిత వ్యక్తిని చేయిపట్టి నడిపిస్తాం. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు ఏరకంగా పొందాలనే విషయాలను వివరించాలి. వైద్య సేవలు పొందడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు ఎలా చేయాలో కూడా తెలియచేయాలి. అవసరమైన మందులు అందేలా, ఆ మేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేయాలి. క్యాన్సర్, డయాలసిస్ రోగులకు ఖరీదైన మందులు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా అందిస్తాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలి ఐదు దశలను క్రోడీకరిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై ఇప్పటికే అన్ని స్థాయిల్లో అవగాహన కల్పించాం. గ్రామస్ధాయి నుంచి నెట్ వర్క్ అంతా కనెక్ట్ అయింది. ప్రతి ఒక్కరు తమ విధులను బాధ్యతగా భావించాలి. కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా), అసోసియేషన్ ఆఫ్ నెట్ వర్క్ హాస్పిటల్స్ ఆఫ్ ఏపీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) భాగస్వామ్యం అయ్యాయి. వీరందరికీ నా తరపున కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఐదు దశలుగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ మొదటి దశ: మొదటి దశ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహ సారథులు, సీఎం జగన్ ప్రభుత్వం పట్ల అభిమానం, ప్రేమ ఉన్న వారెవరైనా ఇందులో పాల్గొనవచ్చు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. ఏ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు? ఎలాంటి వైద్య సేవలు అందిస్తారు? అనే వివరాలు ప్రజలకు చెప్పాలి. అనంతరం సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఆయా ఇళ్లకు వచ్చి ఆరోగ్యంపై వాకబు చేస్తారని, ఏడు రకాల టెస్టులు నిర్వహించేందుకు వీలుగా వారి వద్ద కిట్స్ ఉంటాయని తెలియచేయాలి. రెండో దశ: గ్రామంలోని విలేజ్ క్లినిక్‌లో ఒక భాగానికి సీహెచ్‌వో, మరొక భాగానికి ఏఎన్ఎం బాధ్యత తీసుకుని ఆశావర్కర్లు, వలంటీర్లతో మమేకమై ప్రతి ఇంటిని జల్లెడ పడతారు. ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేస్తారు. అవసరాన్ని బట్టి యూరిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు చేపడతారు. ఇలా ఏడు రకాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్లి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై వాకబు చేస్తారు. ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా మ్యాపింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో వివరిస్తారు. స్మార్ట్ ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్ చేసి పుడ్ సప్లిమెంటేషన్ కోసం చర్యలు చేపడతారు. మూడో దశ: గ్రామం, పట్టణంలో హెల్త్ క్యాంపునకు మూడు రోజుల ముందు వలంటీర్లు, గృహసారధులు, ఔత్సాహికులు, ప్రభుత్వం పట్ల, ఆరోగ్యశ్రీ పథకం మీద మమకారం ఉన్నవారంతా ఏకమై ప్రతి ఇంటికీ వెళతారు. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై వివరాలు అందిస్తారు. హెల్త్ క్యాంపులో పాల్గొనాలని సూచిస్తారు. రెండో దశలో ఇచ్చిన టోకెన్ నెంబర్లు ఉన్నవాళ్లు తప్పకుండా క్యాంపులో హాజరవ్వాలని వివరిస్తారు. టోకెన్ లేకపోయినా వైద్యం అవసరమైన వారు కూడా హెల్త్ క్యాంపులకు రావచ్చని తెలియజేస్తారు. నాలుగో దశ: హెల్త్ క్యాంపుల నిర్వహణ ఈ దశలో ఉంటుంది. గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంపు నిర్వహించే రోజు వలంటీర్లు, ప్రజా ప్రతినిధులు, ఆశావర్కర్లు, సీహెచ్‌వోలు, ఔత్సాహికులు మమేకమవుతారు. క్యాంప్ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా చూస్తారు. మందులు సమకూర్చడం, ఇతర సహాయ సహకారాలు అందిస్తారు. సంబంధిత వ్యక్తులను విలేజ్ క్లినిక్స్ వారీగా ఫ్యామిలీ డాక్టర్, ఏఎన్ఎంలకు మ్యాప్ చేస్తారు. మ్యాప్ అయిన వ్యక్తులకు తర్వాతి రోజుల్లో తగిన వైద్యం అందించే చర్యలు తీసుకుంటారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడం, చికిత్స అనంతరం మందులు, రెగ్యులర్ ఫాలో అప్ చేపడతారు. ఐదో దశ: ఈ దశలో ప్రజలను చేయిపట్టుకుని నడిపిస్తాం. సురక్ష క్యాంపుల్లో గుర్తించిన వారికి నయం అయ్యేంత వరకూ చేయూత నిస్తాం. ఆయా వ్యక్తుల పర్యవేక్షణ బాధ్యతలను వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్‌వోలు తీసుకుంటారు. చికిత్స అందించడంతోపాటు క్రమం తప్పకుండా ఆరోగ్యంపై వాకబు చేస్తారు. -
గ్రామాల్లో సురక్ష క్యాంపుల ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు: సీఎం జగన్
-
జగనన్న ఆరోగ్య సురక్ష ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి
సాక్షి, అమరావతి: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో కలిసి గురువారం డీఎంహెచ్వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు దశల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం వైద్య శిబిరాలు ప్రారంభించే ప్రాంతాల్లో ఇప్పటికే గ్రామాల్లో తొలి దశ సర్వే పూర్తయిందన్నారు. రెండు, మూడో దశ సర్వేలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంటింటి సర్వేలను పక్కాగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంపై ప్రజలకు సమగ్రంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్యశ్రీ కరపత్రాలను ప్రతి ఇంటికీ అందజేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేయించి వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి గ్రామాల్లో దండోరా వేయించాలని చెప్పారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్థోపెడిక్ వైద్యులు ఉండేలా చూడాలని సూచించారు. డీఎంహెచ్వోలు, ఇతర ఉన్నతాధికారులు వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. మారిన వైద్య రంగం ముఖచిత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగం ముఖచిత్రం మారిపోయిందని మంత్రి విడదల రజిని అన్నారు. వివిధ కార్యక్రమాల అమలులో జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లకు అత్యధిక రికార్డులను లింక్ చేసి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అవార్డు కైవసం చేసుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరేందిరప్రసాద్ మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం మంత్రి రజినికి అందజేశారు. ఈ సందర్భంగా అధికారులను ఆమె అభినందించారు. -
జగనన్న ఆరోగ్య సురక్ష ఓ అద్భుతం
ముఖ్యమంత్రివ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో అద్భుతమైనదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి విడదల రజిని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువే చేసే వీలు ఏర్పడిందని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ఫేజ్ 1 సర్వే పూర్తయిందని చెప్పారు. ఫేజ్ -2 , ఫేజ్ -3 సర్వే లు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని సర్వేలు పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయా జిల్లాలల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని చెప్పారు. క్యాంపుల్లో భాగంగా ఏడు రకాల వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఏకంగా 118 రకాల మందులను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, క్షేత్రస్థాయిలో ఇవన్నీ పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఆరోగ్య శ్రీ పథకంపై పూర్తి అవగాహన కల్పించేలా ఇంటింటికీ వాలంటీర్లు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఈ కరపత్రాల్లో ఉన్న అన్ని అంశాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. యాప్‌లు కొలమానంగా..! మంత్రి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఇంటింటి సర్వే కు వచ్చే సమయంలో ఆరోగ్యశ్రీ యాప్ ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. ఎన్ని సెల్‌ఫోన్ లలో ఆరోగ్యశ్రీ అనువర్తనం డౌనల్ లోడ్ అయింది అనే దానిపై కూడా మదింపు ఉంటుందని తెలిపారు. ఎక్కుడ సెల్ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయితే ఆ వాలంటీర్లు బాగా పనిచేసినట్లుగా గుర్తించాలని కోరారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే తేదీలకు సంబంధించి దండోరా వేయించడం ద్వారా కూడా ప్రజలకు అవగాహన కల్పించే విషయాన్ని పరిశీలించాలని తెలిపారు. క్యాంపులకు స్పెషలిస్టు వైద్యులు కూడా వస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా చూడాలని చెప్పారు. ఆర్ధోపెడిక్ వైద్య నిపుణుడి అవసరం ఉందనే విజ్ఞప్తులు ప్రజల నుంచి బాగా వస్తున్నాయని, క్యాంపులలో వీలైనంతవరకు ఆర్ధో నిపుణులు కూడా ఉండేలా చొరవ చూపాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా క్యాంపులు ఉండాలి అన్ని గ్రామాలు, వార్డుల్లో జరిగే వైద్య శిబిరాలు ఒక ప్రణాళిక ప్రకారం ఉండాలని చెప్పారు. టోకెన్ల పంపిణీ, కన్సల్టేషన్, పరీక్షలు, మందుల పంపిణీ, అవసరమైన రోగులను పెద్ద ఆస్పత్రులకు సిఫారుసు చేయడం.. ఇదంతా ఒక క్రమపద్ధతిన జరగాలని చెప్పారు. రోగులు ఎక్కువ సమయం శిబిరాల వద్దనే నిరీక్షించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శిబిరాల్లో రోగుల సమయం వృధా కాకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ని వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా వీడియోలు, కరపత్రాలు, బ్యానర్లు లాంటివి వైద్య శిబిరాల్లో ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, శాఖ ఉన్నతాధికారులు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. సదుపాయాలకు లోటు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆశయం నెరవేరేలా చేయాలంటే క్షేత్రస్థాయి పరిశీలనలను తప్పనిసరి అని చెప్పారు. తాను సైతం మెడికల్ క్యాంపులు జరుగుతున్నతీరును క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి గొప్ప పేరు తీసుకొచ్చేలా మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, డీహెచ్ డాక్టర్ రామిరెడ్డి, ఎన్ హెచ్ఎం స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వెంకట రవికృష్ణ, సిఎవో గణపతి రావు, జగనన్న ఆరోగ్య సురక్ష స్టేట్ నోడల్ ఆఫీసర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలందరికీ ఆరోగ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం శాసన సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ.. తొలి రెండు దశల్లో 1.60 కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్రోచర్ల ద్వారా వైద్యసేవలు పొందే విధానాన్ని వివరిస్తామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అందించే వైద్య సేవలను వివరించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారన్నారు. బాధితులను గుర్తించిన అనంతరం ఇంటి వద్దే స్పెషలిస్టు వైద్యులతో చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. ఒకప్పుడు 919 ఉండే నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను ఏకంగా 2,283కు పెంచారని తెలిపారు. ఇందులో 204 ఆస్పత్రులతో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. క్యాన్సర్ వైద్యంలో 638 ప్రొసీజర్స్‌ను చేర్చడంతో పాటు రూ.600 కోట్లు ఖర్చు చేశామన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా 104కు ఫిర్యాదు చేస్తే ఆ హాస్పిటల్స్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు: ప్రభుత్వ విప్ కొరముట్ల అనంతరం ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అందుకే పీహెచ్‌సీలు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 300కు పైగా ఓపీలు నమోదవడంతో పాటు గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులకు వైద్యం ఉచితంగా అందుతోందని, ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. బద్వేల్ సీహెచ్‌సీలో ఆర్థోపెడిక్ సర్జన్ పోస్టు మంజూరు చేయాలని, ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధ కోరారు. సీఎస్ఆర్ కింద పూర్తయిన డయాలసిస్ యూనిట్ భవనాన్ని ప్రభుత్వం తీసుకుని వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని కోరారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో బలోపేతం చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి తెలిపారు. ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి పథకాన్ని చేరువ చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1059 ప్రొసీజర్లు ఉంటే ఈ ప్రభుత్వం 3,257కు పెంచిందన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే జగన్మోహనరావు నెట్వర్క్ ఆస్పత్రుల్లో కొన్ని ప్రొసీజర్స్‌కు ఆరోగ్యశ్రీపై వైద్యం చేయట్లేదని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్‌లో ఉండటంతో సహాయ నిధిని విడుదల చేయట్లేదని తెలిపారు. ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రుల్లో సదుపాయాలపై తనిఖీలు చేయాలని, విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు, అక్కడ లభించే ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పించేలా దృష్టి సారించాలని కోరారు. ఇలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే తిప్పేస్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా, డిశ్చార్జి తర్వాత ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చి, స్థానిక ఏఎన్ఎంల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు. అయితే, కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు రోగుల దగ్గర, ఆరోగ్యశ్రీలోనూ రెండు రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 108లను కర్ణాటకకూ నడపండి: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రజలు వైద్యం కోసం 150 కిలోమీటర్ల దూరంలోని అనంతపురానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల సమీపంలోనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోనూ నెట్వర్క్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరారు. రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర సమయాల్లో 108 అంబులెన్సులు కర్నాటకకు తీసుకెళ్లడంలేదని, ఇకపై 108లను కర్ణాటకకు కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రిని వేగంగా పూర్తి చేయాలని కోరారు. -
వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభిస్తాం: సీఎం జగన్
-
సీఎం జగన్‌ను సత్కరించిన మంత్రి విడదల రజిని
-
చంద్రబాబు మోసాలు అన్ని ఇన్ని కాదు...బాబుపై రెచ్చిపోయిన విడదల రజిని..
-
బీసీల సాధికారతకు సీఎం జగన్ ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గాల సాధికారతకు అన్ని విధాలుగా ప్రాధా న్యత ఇస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమం పోస్టర్లను మంగళగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు పాలించిన కేంద్ర ప్రభుత్వాలన్నీ బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇచ్చే దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేశ్, నాయకులు మహిధర్, మణికంఠ పాల్గొన్నారు. -
చట్టం ఎవరికీ చుట్టం కాదు.. చంద్రబాబుపై మంత్రి విడదల రజిని ఫన్నీ వ్యాఖ్యలు
-
ప్రభుత్వ ధనాన్ని దుర్మార్గంగా దోచుకున్నారు: మంత్రి రజని
-
సెప్టెంబర్ 15 నుంచి ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహన
సాక్షి, గుంటూరు: ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. దీనికోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. నూతన మెడికల్ కాలేజీలు, నిర్వహణపైనా సమీక్షించారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలన్న సీఎం.. నిర్వహణకు నిధులు సమస్య రాకుండా చూసుకునేందుకు ఒక విధానం తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు జరగనున్నాయని, వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సిద్ధం అవుతున్నామని అధికారులు వివరించారు. పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్, మదనపల్లెల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలకు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు. చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు! -
మాది కుటుంబ గొడవ.. మంత్రి విడదల రజినికి ఎలాంటి సంబంధం లేదు ..
చిలకలూరిపేట: తమది పూర్తిగా కుటుంబ వివాదమని, ఈ వ్యవహారంతో మంత్రి విడదల రజినికి ఎలాంటి సంబంధం లేదని చందవరం గ్రామానికి చెందిన గొంటు జయభరత్‌రెడ్డి స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం చందవరం గ్రామంలో ఈ నెల 20వ తేదీన అన్నదమ్ములు జయభరత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి మధ్య ఘర్షణ జరిగిన విషయం విదితమే. ఇందులో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. జయభరత్‌రెడ్డి కుటుంబసభ్యులు చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో జరిగిన గొడవ పూర్తిగా తమ కుటుంబ అంతర్గత వ్యవహారమని చెప్పారు. గ్రామంలో గతంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తన సోదరుడు శ్రీనివాసరెడ్డి తనకు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఆ డబ్బులు అడిగేందుకు వెళ్లినందుకే తన భార్య గొంటు సామ్రాజ్యంతోపాటు తన కుమార్తైపె దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులపై మూకుమ్మడి దాడికి పాల్పడటంతో తాను ఆత్మరక్షణ కోసం గొడవ పడాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ విషయంలో మంత్రి రజినికి ఎలాంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. కావాలని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఆమె పేరును వాడుతున్నారని అన్నారు. దీనికి తోడు సొలస గ్రామానికి చెందిన బీవీరెడ్డి మా కుటుంబ వ్యవహారంపై మాట్లాడటం సముచితం కాదన్నారు. బీవీ రెడ్డి గురించి ఆరా తీస్తే అతను కూడా జనాల వద్ద డబ్బులు వసూలు చేసి ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిగా తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు వారి స్వలాభం కోసం మంత్రిపై విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి బీవీరెడ్డి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. మంత్రి విడదల రజినిని అడ్డంపెట్టుకొని పదవులు పొంది జనాలను మోసం చేసే వారు విమర్శలకు దిగడం సరికాదన్నారు. శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ గ్రామంలో చేసిన దౌర్జన్యాల ఫలితంగా గతంలో టీడీపీకి ఓట్లే లేని గ్రామంలో ఆ పార్టీకి మనుగడ ఏర్పడిందని విమర్శించారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. -
ఆరోగ్యశ్రీలో 648 క్యాన్సర్ ప్రొసీజర్లు
సాక్షి, అమరావతి: క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రంలోని పేద రోగులకు ఎంతో మేలు చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఎంతో దార్శనికతతో క్యాన్సర్ నియంత్రణకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ నివారణ–ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ చికిత్సకు ఏడాదికి రూ.600 కోట్లకు పైగా నిధులు ఒక్క ఆరోగ్యశ్రీకే ఖర్చు చేస్తోందని తెలిపారు. మొత్తం 648 క్యాన్సర్ ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 క్యాన్సర్ కేర్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని, అన్ని ఆస్పత్రుల్లో చికిత్స ఏకీకృతంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో 5 శాతం బెడ్లు పాలియేటివ్ కేర్ కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. క్రమ పద్ధతిలో ఆస్పత్రుల అభివృద్ధి: నోరి దత్తాత్రేయుడు ప్రతి టీచింగ్ ఆస్పత్రిలో క్యాన్సర్‌కు చికిత్సను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందని మంత్రి తెలిపారు. కర్నూలు, కడపలో స్టేట్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు మొత్తం రూ.220 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ రెండు చోట్లా క్యాన్సర్ కేర్ సెంటర్లు అక్టోబర్ చివరి కల్లా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గుంటూరులోని క్యాన్సర్ కేర్ సెంటర్‌ను కూడా తొలి విడతలోనే పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. రెండో విడతలో అనంతపూర్, కాకినాడల్లో క్యాన్సర్ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఏపీలో ఒక క్రమపద్ధతిన క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, క్యాన్సర్ చికిత్సకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. దేశంలోనే క్యాన్సర్‌కు పూర్తి ఉచితంగా, అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందంజలో ఉంటుందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఏపీవీవీపీ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
క్యాన్సర్ గ్రిడ్‌తో ‘ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల’ అనుసంధానం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని క్యాన్సర్ ఆస్పత్రుల్లో పాలియేటివ్ కేర్ కోసం 5% పడకలను కచ్చితంగా కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ విభాగాధిపతులతో ఆమె మంగళగిరిలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ క్యాన్సర్ ఆస్పత్రులను హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎలాంటి, ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. ఐబ్రిస్ట్ స్క్రీనింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని చెప్పారు. రూ.10వేల ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఉచిత బస్‌పాస్‌లు అందజేయాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు, పలాసలో కిడ్నీ కేర్ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పిడుగురాళ్ల, పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆయా చోట్ల టీచింగ్ ఆస్పత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. నేడు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి రజిని పోస్టర్‌ను ఆవిష్కరించారు. గురువారం గుంటూరులో నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీందిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చేతకాని చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మించలేదని, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి శనివారం పరిశీలించారు. తర్వాత సర్వజన ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారని మంత్రి రజిని విమర్శించారు. టీడీపీ పాలనా కాలంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయండని ఓ టీడీపీ ఎమ్మెల్యే అడిగితే.. రూ.500 కోట్లు అవుతుందని, అంత భారం మోయలేమని చంద్రబాబు తప్పుకున్నారని మంత్రి రజిని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కలిపి దాదాపు 50 వేల మందిని నియమించినట్లు వెల్లడించారు. త్వరలోనే వైద్య కళాశాలల్లో తరగతులు.. విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల మెడికల్ కాలేజీల్లో సెప్టెంబర్ నెల నుంచి ఎంబీబీఎస్ మొదటి విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి రజిని వెల్లడించారు. త్వరలోనే ప్రారంభం.. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని, సాలూరు నియోజకవర్గంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వైద్య కళాశాల ప్రారంభమైతే ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. -
గత టీడీపీ ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసింది
-
టీడీపీ హయాంలో ఎంత మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారు?
చిలకలూరిపేట: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారు? ఇప్పుడు ఎంత మంది బీసీలు మంత్రులుగా ఉన్నారో.. లోకేశ్ చెప్పాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు. బీసీల బాగోగులు లోకేశ్‌కు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టుందని, లోకేశ్‌కు దమ్ముంటే.. బీసీల కోసం సీఎం జగన్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఎత్తేస్తా అని చెప్పగలడా అంటూ సవాల్ విసిరారు. జగనన్న నలుగురు బీసీలకు ఏకంగా రాజ్యసభ సీట్లు ఇచ్చారని, ఇలా చేయకూడదు అని లోకేశ్ అనగలడా.. అని ప్రశ్నించారు. ఏకంగా 11 మంది బీసీలను సీఎం జగన్ మంత్రులను చేశారని, ఇది తప్పు.. ఇలా నేను చేయను.. అని లోకేశ్ చెప్పగలడా.. అని ప్రశ్నించారు. చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ లోకేశ్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. చంద్రబాబే పెద్ద కటింగ్, ఫిటింగ్ మాస్టర్ చంద్రబాబును మించిన కటింగ్, ఫిటింగ్ మాస్టర్ దేశంలోనే ఎక్కడా లేరని మంత్రి విమర్శించారు. పల్నాడు జిల్లా పాదయాత్రలో భాగంగా లోకేశ్ మాట్లాడిన మాటలు అతడి మానసిక దుస్థితికి అద్దం పడుతున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. పదే పదే రెడ్‌బుక్‌లో పేరు నమోదు చేస్తా.. అంటూ అధికారులను, ప్రజలను లోకేశ్ బెదిరిస్తున్నాడని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణమవుతుందన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ఒంటిచేత్తో గెలిపించుకుని సీఎం అయిన జగనన్నను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్‌కు విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ కటింగ్.. ఫిటింగ్ అంటూ మాట్లాడుతున్నాడని, రైతులకు సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి, దానిని తుంగలో తొక్కిన చరిత్ర చంద్రబాబుదని, అసలైన కటింగ్, ఫిటింగ్ అంటే ఇదేనని మంత్రి ఎద్దేవా చేశారు. పల్నాడులో సున్నపురాయిని దోచుకుతిన్నది టీడీపీ నేతలేనని రజిని మండిపడ్డారు. సున్నపురాయి క్వారీల్లో టీడీపీ నేతలు చేసిన అక్రమ మైనింగ్ ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. వైనాట్ పులివెందుల అంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఆయనకు దమ్ముంటే ముందు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ములేని వారు వైనాట్ పులివెందుల అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం: మంత్రి రజిని
-
పేద విద్యార్థులకు చేరువగా వైద్య విద్య
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో వైద్య కళాశాల నిర్మాణం చరిత్రాత్మకమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మెడికల్ కళాశాలను శుక్రవారం ఆమె స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో 64 ఎకరాల విస్తీర్ణంలో రూ.560 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి నడుం బిగించడం అభినందనీయమన్నారు. ఇందుకోసం దాదాపు రూ.8,500 కోట్లు వెచ్చించి.. త్వరలోనే 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయాలన్న సంకల్పంతో మెడికల్ కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల్లో సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కళాశాలల్లోనూ, ఆపై ఏడాది మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లోనూ అకడమిక్ ఇయర్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. కనీసం ఆస్పత్రులనైనా అభివృద్ధి చేశారా అంటే అదీ శూన్యమన్నారు. ఆస్పత్రుల్లో మందులనైనా ప్రజలకు అందుబాటులోకి తెద్దామన్న ఆలోచన కూడా చేయని చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వైద్య రంగానికి సంబంధించి దాదాపు 50,000 ఉద్యోగాలిచి్చన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మరో 3,000 పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు. రైతులపై చంద్రబాబుది మొసలికన్నీరేనని ధ్వజమెత్తారు. రైతును రారాజుగా చూస్తోంది, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వమేనన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, వైఎసార్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జ్ పేర్ని కిట్టు పాల్గొన్నారు. -
1.8 కోట్ల మందికి గ్రామాల్లోనే వైద్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానంతో గ్రామీణ ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇప్పటివరకు 1.8 కోట్ల మంది వైద్యసేవలు పొందారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుపై మంత్రి రజిని మంగళవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా గర్భిణులకు మరింత సులభంగా ప్రభుత్వ వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలపై మరింత పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అమలవుతున్న తీరు, ఓపీ సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు చెప్పారు. రక్తహీనత సమస్యను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లు అవగాహన కల్పించాలన్నారు. బీపీ, షుగర్ వంటి అసాంక్రమిక వ్యాధులపై రాష్ట్రవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని సూచించారు. గత ఏడాది ప్రారంభించిన ఎన్సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్) సర్వేలో భాగంగా మొత్తం జనాభాలో ఏకంగా 82.47 శాతం మందికి పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్సీడీ బాధితులకు ఫ్యామిలీ డాక్టర్ ద్వారా చికిత్స కూడా అందిస్తున్నామని వివరించారు. తాజాగా మరోసారి సర్వే చేపట్టాలని, సెపె్టంబర్ ఒకటో తేదీ నుంచి ఈ సర్వే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం జిల్లాల నోడల్ ఆఫీసర్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లి ఓపీలతోపాటు ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జె.నివాస్, డాక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. -
అమరావతిలో పేదలు ఉండకూడదని చంద్రబాబు కుట్ర
-
అవయవదానంపై నూతన విధానం రావాలి
సాక్షి, అమరావతి: దేశంలో అవయవదానం, అవయవమార్పిడికి నూతన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సమాఖ్యతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్త్య చింతన్ శిబిర్ కార్యక్రమంలో శనివారం రెండో రోజు మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం గొప్ప విరుగుడుగా పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 2021 అక్టోబర్‌లో అసంక్రమిత వ్యాధులపై స్క్రీనింగ్ ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో క్యాన్సర్, గుండె వ్యాధులకు ముందస్తు నిర్ధారణ పరీక్షలను గ్రామాల్లోనే చేపడతామన్నారు. ఇప్పటికే 600కుపైగా క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి ఏటా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. రూ.350 కోట్లతో బోధన ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, వసతులు, స్టేట్ క్యాన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్హెచ్ఎం నిధులను మరింత అదనంగా కేటాయించి సహకరించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్, ఏపీ కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు వైద్యం అందించడంలో ఏపీనే నం.1.. కేంద్రం ప్రశంసలు
డెహ్రడూన్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందువరుసలో ఉందని కేంద్రప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రడూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమాఖ్య 15వ కాన్ఫరెన్స్‌ను స్వాస్థ్య చింతన్ శివిర్ పేరుతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ, వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర సహాయ మంత్రులు భారతీప్రవీణ్ పవార్, ఎస్పీ సింగ్ భాగేలా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌దామీ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్త, 15 రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు. ఏపీ తరపున మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న వైద్య విధానరాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వైద్య విధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజంటేషన్లో ఏపీ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాగున్నాయని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా అక్కడి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పింది. చదవండి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలి: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేలకు పైగా ఆస్పత్రులు అత్యద్భుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఏకంగా రెండువేలకుపైగా ఆస్పత్రులు అనుసంధానమై ఉన్నాయని, దేశంలోనే ఈ స్థాయిలో ఆస్పత్రుల్లో ఉచిత వైద్య పథకాలు ఎక్కడా అమలవడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రజంటేషన్ సందర్భంగా తెలిపారు. ఏపీ ఆరోగ్యశ్రీ అమలు విషయంలో చురుగ్గా ఉండటం వల్ల ఆయుష్మాన్ భారత్ పథకం కూడా చాలా ఎక్కువ ఆస్పత్రుల్లో అమలవుతోందన్నారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పారు. ఏపీలో ఈ స్థాయిలో ఎలా సాధ్యమైందో మిగిలిన రాష్ట్రాలు పరిశీలస్తే బాగుంటుందని సూచన చేశారు. ఏపీ మొత్తం జనాభా 5 కోట్ల వరకు ఉంటే.. వీరిలో ఏకంగా 80 శాతం మందికి దాదాపు నాలుగున్నర కోట్ల మందికి అబా ఐడీలను ఏపీ ప్రభుత్వం జారీ చేయగలిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం చూపుతున్న చొరవను మిగిలిన రాష్ట్రాలు కూడా గుర్తించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విధానాలపై కేంద్ర ప్రభుత్వ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాష్ట్ర చొరవకు కేంద్ర సహకారం కూడా మరింతగా తోడైతే పేదలకు మేలు జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే సీఎం ధ్యేయం
జగ్గయ్యపేట: రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో నిర్మించిన 50 పడకల నూతన ఆస్పత్రి భవనం, తొర్రగుంటపాలెంలో రూ.90 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రం, బలుసుపాడు రోడ్డులోని జగనన్న లేఅవుట్లో రూ.90 లక్షలతో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి మంత్రి రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.16,822 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 104, 108 వాహనాలు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడంతోపాటు వైఎస్సార్ ఫ్యామిలీ డాక్టర్ పథకం పేరుతో గ్రామాల్లో ఇళ్ల వద్దే రోగులకు వైద్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 పీహెచ్‌సీలు, 992 సీహెచ్‌సీలు ఆధునికీకరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు వైద్యరంగానికి సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పారు. జగ్గయ్యపేట ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణానికి రెండు వైపులా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డిల్లీరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ సుహాసిని, వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ పి.సరళమ్మ, డీసీహెచ్ఎస్ స్వప్న, కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
పేద ప్రజలకు చేరువగా వైద్యం
గుడివాడ టౌన్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు సీఎం జగన్ కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలతో ఇప్పటికే ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేశారని పేర్కొన్నారు. శనివారం కృష్ణా జిల్లా గుడివాడలో రూ.10.28 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ఏరియా ఆస్పత్రి బ్లాక్–2 భవనాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ వైఎస్సార్ జయంతి రోజున 100 పడకల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన దేశంలో ఒక చరిత్ర సృష్టించిందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలందించాలనే సంకల్పంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి సేవలందిస్తే.. ఆయన తనయుడు సీఎం జగన్ వైద్య రంగం మొత్తాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గతంలో ఏరియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో రోగులు ఇబ్బందులు పడేవారని వివరించారు. తాము అధికారంలోకి రాగానే ఆస్పత్రి దుస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన వెంటనే స్పందించి రూ.10 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. 22మంది వైద్యులు, 80 మందికి పైగా నర్సులు, ఇతర సిబ్బందితో వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పలువురు అధికారులు, నేతలు పాల్గొన్నారు. -
గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ 2023
-
AP: 108 అంబులెన్స్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు,లోకేష్ చర్చకు రావాలి: విడదల రజిని
సాక్షి, గుంటూరు: ఆరోగ్యశ్రీపై మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎవరి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైందో చర్చకు సిద్ధమా? దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు, లోకేష్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘‘గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. ఆరోగ్యశ్రీని వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్ చెప్పగలరా?. 3257 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌ది’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదు. మా హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్లు ఖర్చుపెట్టాం. నాలుగేళ్లలో 10,100 కోట్లు ఖర్చుపెట్టాం. వార్షికాదాయం 5 లక్షలు ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నాం. మా హయాంలో 2275 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందుతుంది’’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. చదవండి: ఇంత బిల్డప్ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం.. -
ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించిన మంత్రి రజని
-
కనిపించే దైవం.. డాక్టర్లు
గుంటూరు మెడికల్/చిలకలూరిపేట: కనిపించే దైవం వైద్యులేనని.. వారు ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో శనివారం ‘డాక్టర్స్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని చెప్పారు. ‘డాక్టర్స్ డే’లో బీసీ రాయ్‌తో పాటు డాక్టర్ వైఎస్సార్‌ను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు 108 అంబులెన్సులు, 104 వాహనాలు తదితర గొప్ప కార్యక్రమాలను ప్రవేశపెట్టి.. ఎంతో మంది ప్రాణాలను కాపాడారని కొనియాడారు. ఆ తర్వాత వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ‘నాడు–నేడు’ కింద ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నింటినీ అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ వైద్యుడు రోగి ఇంటికే వెళ్లి సేవలందించడం గొప్ప విషయమన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో వేలాది ఖాళీలను భర్తీ చేస్తూ.. వైద్యులపై భారాన్ని తగ్గిస్తున్నామన్నారు. ఇదే గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో టీడీపీ పాలనలో సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్లు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతకుముందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే నాట్కో ఫౌండేషన్ వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావు, డాక్టర్లు పొదిల ప్రసాద్, గంగా లక్ష్మి, బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, సుధాకర్, రాజేంద్రప్రసాద్, తారకనాథ్, మద్దినేని గోపాలకృష్ణయ్య, మురళీ బాబూరావు, ఫణిభూషణ్, రాజేంద్రప్రసాద్, సుబ్రహ్మణ్యం, కేఎస్ఎన్ చారి తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేందుకు.. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకు, సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించేందుకు, ఎలాంటి ఫీజు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందజేసేందుకు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలన్న ఆశయంతో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి నాంది పలికారని తెలిపారు. దేశంలోనే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. మీడియా కూడా సహకరించి ప్రజలకు మేలు కలిగేలా ప్రచారం కల్పించాలని కోరారు. -
క్యాన్సర్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
గుంటూరు మెడికల్: క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఏడాదిలో రూ.600 కోట్లు క్యాన్సర్ చికిత్సల కోసం ఖర్చు చేసిందన్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో శుక్రవారం జరిగిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్ రాష్ట్రస్థాయి వార్షిక తొలి సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాధునిక క్యాన్సర్ వైద్యసేవలు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో గత ప్రభుత్వంలో 990 ప్రొసీజర్లు మాత్రమే ఉండేవని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో 3,257 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చారని వివరించారు. ముఖ్యమంత్రికి క్యాన్సర్ నియంత్రణకై ప్రత్యేకదృష్టి ఉందని, అందుకే ఆరోగ్యశ్రీ పథకంలో 638 ప్రొసీజర్లు కేవలం క్యాన్సర్ వ్యాధులకు చెందినవే అందుబాటులో ఉంచారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందన్నారు. ఇతర కళాశాలల్లో సైతం రెండోదశలో క్యాన్సర్ చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలులో రూ.120 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రూ.55 కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కడపలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్‌ను క్యాన్సర్ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌గా మార్చేందుకు రూ.45 కోట్లతో అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హరీంద్రప్రసాద్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక క్యాన్సర్ చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. నాట్కో ట్రస్టు వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేదలకు గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలు, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి.వి.శివరామకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉమేష్‌శెట్టి, డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్, యడ్లపాటి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీహెచ్‌లో సోలార్ పవర్ ప్లాంట్
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/గాజువాక: కింగ్ జార్జి హాస్పిటల్ (కేజీహెచ్)లో రూ.50 లక్షలతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సమక్షంలో కేజీహెచ్‌లోని సీఎస్ఆర్ బ్లాక్ రూఫ్ టాప్‌లో సౌర విద్యుత్‌ను ఇన్స్టాలేషన్ చేయడానికి ఎంవోయూ జరిగింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ వైజాగ్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రవీంద్రనాథ్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఎంవోయూపై సంతకాలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద వైజాగ్ అసెట్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన ఈ సోలార్ పవర్ ఇన్స్టాలేషన్ ద్వారా కేజీహెచ్‌లో విద్యుత్ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏఎంఎన్ఎస్ ఇండియా లిమిటెడ్ హెడ్, హెచ్ఆర్ అడ్మిన్ డి.ఎస్.వర్మ తదితరులు పాల్గొన్నారు. రూ.670 కోట్లతో 1,125 పీహెచ్‌సీల ఆధునికీకరణ రాష్ట్రంలోని 1,125 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రూ.670 కోట్లతో ఆధునికీకరించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రూ.1.75 కోట్లతో నిర్మించిన కణితి పీహెచ్సీ భవనాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామస్థాయి నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో రూ.1,692 కోట్లతో 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను నిర్మిస్తున్నామన్నారు. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం జగనన్న ప్రభుత్వం రూ.1,223 కోట్లను కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రూ.8,500 కోట్లను ఖర్చు చేస్తున్నారన్నారు. టీచింగ్ ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం రూ.3,820 కోట్లు కేటాయించామని తెలిపారు. -
సి‘కిల్’ సెల్‌పై సర్కారు యుద్ధం
సాక్షి, పాడేరు: సికిల్ సెల్ అనీమియా.. తలసేమియా. ఈ వ్యాధుల మధ్య స్వల్ప వ్యత్యాసాలున్నా రెండూ అత్యంత ప్రమాదకరమైనవే. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసి రక్తహీనతను కలిగించే వారసత్వ రుగ్మతలే. వీటితో ఎక్కువగా గిరిజనులు బాధపడుతుంటారు. చికిత్స లేని ఈ వ్యాధుల నుంచి గిరిజనులను రక్షించేందుకు.. జీవిత కాలమంతా పూర్తి ఆరోగ్యంతో బతికేలా చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అల్లూరి జిల్లా పాడేరులో ‘రుధిర రక్షణ’ యజ్ఞాన్ని ప్రారంభించింది. సికిల్ సెల్, తలసేమియా మరణాల నుంచి గిరిజనుల్ని రక్షించేందుకు పెద్ద యుద్ధమే తలపెట్టింది. ఏమిటీ.. సికిల్ సెల్! సికిల్ సెల్ అనీమియా అనేది వంశపారంపర్య వ్యాధులలో ఒకటి. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంపై ప్రభావం చూపుతుంది. ఎర్ర రక్త కణాలు సాధారణంగా గోళాకారంలో రక్తనాళాల నుంచి సులభంగా వెళ్లేలా ఉంటాయి. సికిల్ సెల్ అనీమియాలో కొన్ని ఎర్ర రక్త కణాలు సికిల్స్ (కొడవలి) లేదా చంద్రవంక ఆకారంలో తయారవుతాయి. ఇవి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నిజానికి శరీరంలోని వివిధ అవయవాలకు రక్తం ద్వారానే ఆక్సిజన్ అందుతుంది. సికిల్ సెల్స్ రక్తప్రవాహాని అడ్డుకోవడం వల్ల ఆవయవాలకు ఆక్సిజన అందక సమస్యలు తలెత్తి మరణానికి దారి తీసే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎప్పటికప్పుడు పుట్టే ఎర్ర రక్త కణాలు 120 రోజుల వరకు జీవిస్తాయి. కానీ.. సికిల్ సెల్ రక్త కణాలు మాత్రం పుట్టిన 10 నుంచి 20 రోజులకే మరణిస్తాయి. అందువల్ల ఈ రుగ్మత ఉన్నవారికి రక్తహీనత తలెత్తి ప్రాణాపాయానికి దారి తీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందంటే.. రాష్ట్రంలో సికిల్ సెల్, తలసేమియా బారిన పడిన వారికి ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున ఇప్పటికే పింఛన్లను పంపిణీ చేస్తోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల పరిధిలో 19 లక్షల 90 వేల 277 మంది సికిల్ సెల్, తలసేమియా బాధితులు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. వీరందరికీ వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టింది. నిర్థారణ అయితే.. సికిల్ సెల్ పాజిటివ్‌గా నిర్థారణ అయితే వారికి ఉచితంగా కౌన్సెలింగ్, మందులను ప్రభుత్వం సమకూరుస్తుంది. 2047 కల్లా రాష్ట్రంలో సికిల్‌సెల్ లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఐదు చోట్ల ఇంటిగ్రేటెడ్ సెంటర్స్ ఫర్ హిమోగ్లోబినోపాథిస్ పరీక్షల ప్రయోగశాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి, విశాఖలోని కేజీహెచ్, కాకినాడ, గుంటూరు, కర్నూలు పట్టణాల్లోని టీచింగ్ ఆస్పత్రుల్లో ఈ ల్యాబ్‌లను అభివృద్ధి చేశారు. చదవండి: మార్గదర్శి’లాంటి స్కాం ఇప్పటివరకు జరగలేదు -
ఏపీకి విలన్ చంద్రబాబే
చిలకలూరిపేట: రాష్ట్రానికి విలన్ టీడీపీ నేత చంద్రబాబేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పన్నుల భారం మోపి, ఇష్టారీతిన విద్యుత్ చార్జీలు పెంచి, పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ విధించి ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మండిపడ్డారు. చంద్రబాబు పూర్తిగా అరాచక పాలన సాగించారని విమర్శించారు. ఇప్పుడేమో వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధిని అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు విమర్శలను ఖండిస్తూ మంత్రి రజిని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ చార్జీలు పెంచారని చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు విద్యుత్ చార్జీలను భారీగా పెంచిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విద్యుత్ చార్జీల మోత మోగించేవారని గుర్తు చేశారు. 2015 ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.4 అదనపు వ్యాట్ విధించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. రాష్ట్రంలో బెల్టుషాపుల వ్యవస్థను సృష్టించిన చంద్రబాబు.. మద్యపాన నిషేధాన్ని సైతం ఎత్తివేశారని.. అలాంటి వ్యక్తి నేడు మద్యం గురించి మాట్లాడుతుండటం సిగ్గుచేటన్నారు. టీడీపీ నాయకులు ఊరూరా మద్యం అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపులన్నింటినీ రద్దు చేసిందని గుర్తు చేశారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్య పెట్టేందుకు టిడ్కో ఇళ్లను తెరపైకి తెచ్చారని విమర్శించారు. అందుకే ప్రజలు టీడీపీకి తగిన విధంగా బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో, మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో, టీడీపీ గూండాలు ఎలా రెచ్చిపోయారో ప్రజలింకా మర్చిపోలేదన్నారు. శాంతిభద్రతల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసుల పనితీరుకు గాను ఇప్పటికే 200కు అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. నాడు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడితే.. చంద్రబాబు వారందరికీ అండగా నిలిచారని విమర్శించారు. -
ఔషధ విక్రయాల్లో అక్రమాలను అరికట్టాలి
సాక్షి, అమరావతి: ఔషధాల క్రయవిక్రయాల్లో అవకతవకలు, నకిలీ, నాణ్యత లేని మందుల చెలామణి, మెడికల్ షాపుల్లో అక్రమాలను అరికట్టడానికి డీజీ స్థాయిలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ఔషధ నియంత్రణా విభాగంపై గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఔషధ నియంత్రణా విభాగం మరింత సమర్థంగా పనిచేయాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఖాళీల భర్తీకి నివేదిక తయారుచేయాలని చెప్పారు. కేంద్ర ఔషధ నియంత్రణ శాఖకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని మన రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులకు లేఖ రాయాలన్నారు. సీఆర్‌యూ ఫిర్యాదుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యశాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఔషధ నియంత్రణ డీజీ కొల్లి రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యామిలీ డాక్టర్‌తో కోటి మందికిపైగా సేవలు
సాక్షి, గుంటూరు: వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్ నంబర్ ప్రతిచోటా ఉంచాలి. అలాగే సమర్థవంతమైన ఎస్ఓపీలను పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పనితీరు ఇందులో కీలకం. ప్రివెంటివ్ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం. ► వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్మెంట్ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలి. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదు. నాలుగు వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదు. అధికారుల వివరణ ► కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాం. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్ బైట్, ఐవీ ఇన్ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్ కేర్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో వారికి శిక్షణ పూర్తయ్యింది. ► అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్తో బాధపడతున్నట్టు గుర్తింపు. ► వాళ్లందరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్ స్ధాయిలో కంటి పరీక్షలు క్రమం తప్పకుండా కూడా చేయాలన్నారు. సికిల్ సెల్ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష సికిల్ సెల్ ఎనీమియా నివారణ కార్యక్రమంలో భాగంగా.. ఈ ఏడాది 6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఓరల్ హెల్త్‌లో భాగంగా ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. ► టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడి. అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితుల్ని గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. ► ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను నమోదు చేయాలన్నారు. మెడికల్ కాలేజీలపైనా సీఎం సమీక్ష. ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే.. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయి. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు. -
చిత్తశుద్ధి లేని బాబు ఎన్ని హామీలైనా ఇస్తారు
సాక్షి, విశాఖపట్నం: కాపీ కొట్టడం.. ఆల్ ఫ్రీ అనడం.. ఇదే టీడీపీ నేత చంద్రబాబు మేనిఫెస్టో అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. చంద్రబాబు లాంటి చిత్తశుద్ధి లేని నాయకులు ప్రజలకు ఎన్ని హామీలైనా ఇస్తారన్నారు. 2014లో ఏకంగా 600కు పైగా హామీలిచ్చారని, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని మంత్రి ప్రశ్నించారు. శనివారం విశాఖలో మంత్రి రజిని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గత పాలనలో చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. 2019లో తగిన విధంగా బుద్ధి చెప్పిన ప్రజలు.. ఈసారి టీడీపీని నామరూపాలు లేకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పొరుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల నుంచి కొన్ని, ఇక్కడ సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కొన్ని కాపీ కొట్టి.. వాటినే తాను ఇస్తానంటూ మాయ మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హామీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం దివాలా తీస్తోందని మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు.. ఇప్పుడు తాను అధికారంలోకి వస్తే అవే పథకాలు ఇస్తానంటూ హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచి్చన నాలుగేళ్లలోనే 99 శాతం హామీలు నెరవేర్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని చెప్పారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేస్తూ జీపీఎస్ ప్రవేశపెట్టారని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని పేర్కొన్నారు. తమకు మేలు చేసే నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. 2024లో గత ఎన్నికలకు మించిన విజయంతో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖకు ఏం చేశారో చెప్పాలి? అధికారంలో ఉన్నప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ కోసం ఏం చేశారో చెప్పాలని చంద్రబాబుకు మంత్రి రజిని సవాల్ విసిరారు. టీడీపీ పాలనలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేసేందుకు.. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. తాజాగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్‌లు ఉచితంగా చేస్తున్నామని వెల్లడించారు. ఇలా.. అనేక విధాలుగా పేద రోగులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ హరి వెంకటకుమారి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ ఎ.విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. -
వైద్య ఆరోగ్య శాఖలో చంద్రబాబు చేసిందేమిటి? : మంత్రి విడదల రజిని
-
AP: ఉచితంగా అల్ట్రా, టిఫా స్కానింగ్
గుంటూరుమెడికల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో గర్భిణులకు అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్‌లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను మంత్రి రజిని శుక్రవారం గుంటూరులోని వేదాంతం హాస్పిటల్లో లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు సీమంతం చేసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్ అవసరం ఉంటుందని, అందుకు దాదాపు రూ.7 కోట్ల ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రతి గర్భిణికి రెండుసార్లు చేయాల్సి ఉంటుందని, వీటిని కూడా పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేసేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2022–23లో రూ.3,400 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.32 లక్షల కాన్పులు ఉచితంగా చేశామని, కేవలం గర్భిణుల చికిత్సకు రూ.247 కోట్లు వెచ్చించామని వివరించారు. ఆరోగ్య ఆసరా పథకం కింద రోగి కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 17,54,000 మందికి పైగా ఆర్థిక ఆసరా అమలు చేశామని, అందుకోసం రూ.1,075 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధిరప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వేదాంత హాస్పిటల్ ఎండీ డాక్టర్ చింతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.