
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గాల సాధికారతకు అన్ని విధాలుగా ప్రాధా న్యత ఇస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం చట్ట సభల్లో రిజర్వేషన్‌లు కల్పిస్తేనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని అభిప్రాయపడ్డారు.
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమం పోస్టర్లను మంగళగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు పాలించిన కేంద్ర ప్రభుత్వాలన్నీ బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇచ్చే దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేశ్, నాయకులు మహిధర్, మణికంఠ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment