10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు  | Jagananna health protection camps at 10574 places | Sakshi
Sakshi News home page

10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు 

Published Thu, Oct 5 2023 4:59 AM | Last Updated on Thu, Oct 5 2023 4:59 AM

Jagananna health protection camps at 10574 places - Sakshi

సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):  ప్రతి గడపకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ శిబిరాలకు వస్తున్న ప్రతి వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దాస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండానే ఉన్నత వైద్యం అందిస్తామన్నారు. మూడు రోజుల్లోనే ఈ శిబిరాల ద్వారా 3.35 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.

వీటిలో 11,780 కేసులను ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్‌ చేసి ఉన్నత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 297 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు 250 మంది వైద్య నిపుణులను కేటాయించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని వెల్లడించారు.   

గిరిజనులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు 
గిరిజనులంటే సీఎం జగన్‌కు అపారమైన ప్రేమ అని మంత్రి రజిని తెలిపారు. రూ.600 కోట్లతో మన్యం జిల్లా పార్వతీపురంలో మెడికల్‌ కళాశాలకు శంకుస్థాపన చేశారని చెప్పారు. అలాగే పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది ఇది ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీంతోపాటు 600 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా అందుబాటు­లోకి వస్తాయన్నారు. దీంతో మన్యం ప్రజలు కేజీహెచ్‌కు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో బర్త్‌ వెయి­టింగ్‌ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవా­లన్నారు.

అల్లూరి సీతారామ­రాజు జిల్లాకు 40.. 104, 108 వాహ­నాలను కేటాయించామన్నారు. 20 లక్షల మంది గిరిజనులకు సికిల్‌సెల్‌ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నామన్నారు. రోగులకు నెల­కు రూ.10 వేల పింఛన్‌ కూడా అందిస్తున్నా­మని చెప్పారు. అనంతరం వైద్య శిబిరానికి వచి్చన గిరిజనులకు మందుల కిట్లు పంపిణీ చేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చే గిరిజనులకు ఉచితంగా ఆహారం, తాగునీరు పంపిణీ చేయా­­లని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.  

దత్తత గ్రామానికి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా? 
టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బాౖMð్సట్‌ తవ్వకాలతో మన్యాన్ని దోచుకోవాలని ప్రయత్నాలు చేశారని మంత్రి విడదల రజిని విమర్శించారు. పెదలబుడును చంద్రబాబు దత్తత తీసుకుని ఒక మంచి పని అయిన చేశారా అని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా ఉన్న జీవోను రద్దు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ నివాస్, ఐటీడీఏ పీవో వి.అభిõÙక్, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement