
సాక్షి, అమరావతి: ప్రజలకు సుపరిపాలన, సంక్షేమాన్ని అందించడంలో ఫార్టీ ఇయర్స్ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఫెయిలే. కేవలం మేనేజ్ చేస్తూ ఐదేళ్లూ గడిపేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఇంతకాలం ఓ పేరుండేది. అలాంటిది ఆ లోటును ఆయన తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ భర్తీ చేయడానికి ముందుకు వచ్చాడు.
మూడుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు ఏనాడూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చింది లేదు. విజనరీనంటూ.. గప్పాలు కొట్టుకుంటూ కాలయాపన చేస్తారే తప్ప.. అభివృద్ధి, సంక్షేమం అనేది మచ్చుకైనా కనిపించదు. ఇప్పుడు.. ఈ దఫా పాలనను, సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టేందుకు జగన్ హయాంపై విమర్శలతోనే నెట్టుకొచ్చేలా కనిపిస్తున్నారాయన. అయితే తాను చేసిందేం లేకపోగా.. అవతలివాళ్లు చేసింది తన ఘనతగానే చెప్పుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. అయితే.. లోకేష్ అదే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు ‘కష్టం ఎవరిదైనా.. క్రెడిట్ కొట్టేయడంలో మీ తండ్రి చంద్రబాబును మించిపోయావ్ లోకేశ్’ అంటూ వైఎస్సార్‌సీపీ ఆదివారం సామాజిక మాధ్యమం(ఎక్స్)లో పోస్టు చేసింది. ‘ఎట్టెట్టా.. కువైట్‌లో శివను మీరు కాపాడారా? మీ సాయం ఇసుమంత కూడా లేకపోయినా గత కొన్ని రోజులుగా ఎల్లో మీడియాతో కలిసి మీరు వేసిన పీఆర్ స్టంట్‌లు అన్నీ ఇన్నీ కావుగదా? నిజం నిలకడ మీద తెలుస్తుందంటే ఇదే. బయటికి రాదులే అనుకున్నారు.
.. ఇప్పుడు శివకు సాయం చేసింది మీరు కాదని సాక్ష్యాలతో సహా వీడియోలు బయటికి వచ్చాయి. ఇప్పుడేం చెప్తావ్ నారా లోకేశ్?’ అంటూ ప్రశ్నించింది. కువైట్‌లో శివను కాపాడింది లోకేశ్ కాదు.. సాక్ష్యమిదిగో అంటూ ఒక వీడియోను వైఎస్సార్‌సీపీ పోస్టు చేసింది. దీంతో.. అబద్ధాలు, మోసపూరిత హామీల విషయంలో లోకేష్ చంద్రబాబునే మించిపోయేందుకు ఎక్కువ టైం పట్టకపోవచ్చనే కామెంట్లు కనిపిస్తున్నాయి.
కష్టం ఎవరిదైనా.. క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడంలో మీ తండ్రి @ncbnని మించిపోయావ్ @naralokesh!
ఎట్టెట్టా.. కువైట్‌లో శివను మీరు కాపాడారా? మీ సాయం ఇసుమంత కూడా లేకపోయినా గత కొన్ని రోజులుగా ఎల్లో మీడియాతో కలిసి మీరు వేసిన పీఆర్ స్టంట్‌లు అన్నీఇన్నీ కావుగదా?
నిజం నిలకడమీద… pic.twitter.com/56XqKcNTuv— YSR Congress Party (@YSRCParty) July 28, 2024