
వ్యక్తిగత వివరాలు ఇవ్వటం ఎప్పటికైనా ప్రమాదమే
ఆర్థిక, వైద్య, న్యాయపరమైన సమాచారం ఇవ్వొద్దు
మన డేటాతోనే లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల ట్రైనింగ్
చాటింగ్ టైంలో సెట్టింగ్ మార్చుకోవటం మేలు
సాక్షి, స్పెషల్ డెస్క్: కొత్త వస్తువైనా, టెక్నాలజీ అయినా కంటపడితే దాని అంతుచూడందే కొందరికి నిద్ర పట్టదు. ప్రస్తుతం ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలోనూ చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. చాట్‌జీపీటీ, జెమినీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. పనులు చక్కబెట్టుకోవటం కోసం, నాలెడ్జ్ కోసం వీటిని వాడుకోవటం మంచిదే. కానీ, విచక్షణ లేకుండా వీటిని మన వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఏఐ టూల్స్‌కు ఏ సమాచారం ఇవ్వచ్చో.. ఏది మన సమాచారంతోనే ఎల్‌ఎల్‌ఎం టైనింగ్ టీచర్ల బోధన, పాఠ్యపుస్తకంలోని పాఠాలు, గైడ్లు, నిజ జీవిత అనుభవాలన్నింటి సాయంతో ఎలాగైతే విద్యార్థులు నేర్చుకుంటారో.. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు (ఎల్‌ఎల్‌ఎం) కూడా అందుబాటులో ఉన్న సమాచారం, మనం వేసే ప్రశ్నల సాయంతో కొత్త విషయాలు నేర్చుకుంటాయి. దీన్నే ట్రైనింగ్ అని పిలుస్తుంటారు. చాట్‌జీపీటీ వంటివాటికి నిత్యవ్యవహారాల తాలూకు సమాచారం అందుబాటులో ఉంటే.. డాలీవంటి ఇమేజ్ జనరేటర్లకు వేల, లక్షల ఫొటోలు అందించి శిక్షణ ఇస్తుంటారు.
ఈ శిక్షణ ఎంత ఎక్కువ ఉంటే, వచ్చే ఫలితాలు అంత కచ్చితంగా ఉంటాయి. అయితే, ఈ శిక్షణ సందర్భంగా వ్యక్తుల వ్యక్తిగత సమాచారం కూడా లభిస్తే దాన్ని కూడా అవి ఎక్కడో ఒకచోట వాడుకుంటాయి. కాబట్టి భవిష్యత్తులో మనకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చాట్‌జీపీటీ, జెమినీ లాంటి ఎల్‌ఎల్‌ఎంలు ‘మీ సంభాషణల్లో సున్నితమైన సమాచారం లేకుండా చూసుకోండి’అని, ‘మీకు మాత్రమే తెలిసిన సమచారాన్ని పంచుకోవద్దు’అని చెబుతుంటాయి.
1, మీ ఇంటి అడ్రస్ లేదా ఫొన్ నంబర్, ఆధార్, ఓటర్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎల్‌ఎల్‌ఎంలతో అస్సలు పంచుకోవద్దు. 2023లో చాట్‌జీపీటీ కోడ్‌లో చిన్న పొరబాటు దొర్లింది. ఫలితంగా ఇతరులు అడుగుతున్న ప్రశ్నలు అందరికి కనిపించడం మొదలైంది. హ్యాకర్లు ఈ సమాచారం చూస్తే ఇక అంతే సంగతులు.
2, పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలను ఎల్‌ఎల్‌ఎంలతో పంచుకోవడం ఏమంత మంచిది కాదు. పడకూడని వారి చేతుల్లో పడితే ఈ సమాచారంతో మీ జేబులు ఖాళీ కావచ్చు. పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ టూల్స్ మాదిరిగా ఎల్‌ఎల్‌ఎంలలో ఈ వివరాలు సంకేత భాషలో స్టోర్ కావు. మోడల్‌ను రివ్యూ చేసేవారికి అందుబాటులో ఉంటాయి. లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎల్‌ఎల్‌ఎంలు పొరపాటుగానైనా ఈ సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉంది.
3, ఎల్‌ఎల్‌ఎంలతో పంచుకోకూడని మరో అంశం వృత్తిపరమైన సమాచారం. దీనివల్ల మనం పనిచేసే సంస్థలకు నష్టం జరగవచ్చు.
4, వైద్యులు, లాయర్ల వద్ద ఏదీ దాచకూడదని చెబు తారు. కానీ, ఎల్‌ఎల్‌ఎంల వద్ద మాత్రం వైద్య సమాచారం అస్సలు పంచుకోకూడదు. ఎల్‌ఎల్‌ఎంలకు వైద్యపరమైన సమాచారాన్ని భద్రపరిచే చట్టాలు వర్తించకపోవచ్చు. ఫలితంగా మనం ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది.
విరుగుడు మంత్రాలు ఎల్‌ఎల్‌ఎంలలో మన సంభాషణలు రికార్డు కాకుండా కొన్ని చిట్కాలున్నాయి.
⇒ చాట్‌జీపీటీ 4.0లో సంభాషణలను టెంపరరీ మోడ్‌లో ఉంచుకోవచ్చు.
⇒ డక్.ఏఐని వాడుకుంటే మన పేరు వివరాలు లేకుండా చేస్తుంది.
⇒ మైక్రోసాఫ్ట్ కో–పైలట్, గూగుల్ జెమినీలోసంభాషణలను రికార్డు చేస్తారు కానీ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుని దాన్ని గోప్యంగా ఉంచుకోవచ్చు.
⇒ మన సంభాషణలను అప్పుడప్పుడూ డిలీట్ చేస్తుండటం ద్వారా సమాచార దుర్వినియోగాన్ని నివారించవచ్చు.
⇒ చైనీస్ ఏఐ డీప్‌సీక్ మాత్రం మీ సంభాషణలన్నీ రికార్డు చేసి ట్రెయినింగ్ కోసం వాడుకుంటుంది. మార్పులు చేసుకునే, తప్పించుకునే అవకాశాల్లేవు.