
రాజీనామా చేయలేదు.. మరొకర్ని నియమించారు
గ్రామంలోని పొదుపు గ్రూపుల సభ్యులు నన్ను వీఓఏగా కొనసాగించాలని తీర్మానం చేశారు. దీనికి సంబంధించిన కాపీని అధికారులకు పంపాం. ఒత్తిళ్లు అధికమయ్యాయి. విధులకెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నా. కూటమి నేతలు అత్యుత్సాహం ప్రదర్శించి మరో మహిళను వీఓఏగా నియమించారు. ప్రస్తుతం ఆమె పేరే ఆన్‌లైన్లో కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇలా.. ఎలా నమోదు చేశారో అధికారులకే తెలియాలి.
– మానస, విడవలూరు
వీఓఏల నియామకాలకు సంబంధించి నిబంధనల మేరకే నడుచుకుంటున్నాం. గ్రామంలో తీర్మానం చేసిన మహిళనే వీఓఏగా స్థానిక ఏపీఎంలు నియమిస్తున్నారు. ఇందులో ఉత్తర్వులను ఉల్లంఘించడంలేదు. కొత్తగా వచ్చిన వీఓఏలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గ్రూపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతున్నాం.
– నాగరాజకుమారి, పీడీ, డీఆర్డీఏ
నిబంధనల మేరకే..