‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె | - | Sakshi
Sakshi News home page

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె

Published Sun, Apr 13 2025 2:19 AM | Last Updated on Sun, Apr 13 2025 2:19 AM

‘టాప్

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె

పుట్టపర్తి: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా ర్యాంకులు మారలేదు. గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతంతో పాటు రాష్ట్ర ర్యాంకు కూడా తగ్గాయి. శనివారం ఉదయం ఫలితాలు విడుదల కాగా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఈసారి 57 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 11,173 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 6,368 మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే వివిధ గ్రూపుల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్‌, ప్రైవేట్‌కు పోటీ పడుతూ మార్కులు సాధించారు.

సీనియర్‌ ఇంటర్‌లోనూ అంతే...

ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 76 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి రెండు శాతం పెరిగి 78కి చేరింది. దీంతో రాష్ట్రంలోనే జిల్లా 18వ స్థానంలో నిలిచింది. మొత్తం 8,952 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,986 మంది ఉత్తీర్ణులయ్యారు.ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 2,457 మందికి గానూ 1,536 మంది పాసయ్యారు.

మెరిసిన గ్రామీణ విద్యార్థులు..

● కదిరి బాలుర ఉన్నత పాఠశాలలోని జూనియర్‌ కళాశాలలో చదువుతున్న ప్రకాశ్‌ ఎంపీసీ గ్రూపులో 961 మార్కులు సాధించాడు.

● కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో గారికోట క్షితిరెడ్డి 470 మార్కులకు గాను 450 మార్కులు సాధించి సత్తా చాటింది.

● లేపాక్షిలోని మహాత్మాజ్యోతిరావు పూలే ఏపీ గురుకుల పాఠశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 130 మంది పరీక్ష రాయగా, 109 (84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 125 మంది పరీక్షలు రాయగా, 124 మంది (99.2 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ విద్యార్థి దివాకర్‌ (ఎంపీసీ) 984 మార్కులు, జి.శ్రీశాంత్‌ (బైపీసీ) 959 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్‌ సుందరరాజు తెలిపారు.

ఫస్ట్‌ ఇయర్‌ టాపర్‌గా

టేకులోడు విద్యార్థిని మేఘన

440 మార్కులకు గాను 435 మార్కులు సాధించిన విద్యార్థిని

సీనియర్‌ ఇంటర్‌లో బిందుకు

980 మార్కులు

15 నుంచి పరీక్ష ఫీజు

చెల్లించొచ్చు

మే 12 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

ధర్మవరం అర్బన్‌: ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకున్న విద్యార్థులు ఈనెల 15వ తేదీ పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌ విద్య జిల్లా అధికారి రఘునాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 22వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు తాము చదివే కళాశాలల్లోనే ఫీజు చెల్లించాలని సూచించారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేయించాలనుకునే వారు ఈనెల 13వ తేదీ నుంచి www.bie.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్‌ ఫీజు ఒక పేపర్‌కు రూ.260, రీవెరిఫికేషన్‌ కోసం రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

చిలమత్తూరు: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో మండల పరిధిలోని టేకులోడు మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల కళాశాల విద్యార్థిని మేఘన సత్తా చాటింది. గురుకుల కళాశాల విభాగంలో టాపర్‌గా నిలిచింది. రొద్దం మండలం కలిపి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ వేణుగోపాల్‌ కుమార్తె జి. మేఘన ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో 440 (బైసీపీ) మార్కులకు గాను 435 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ శోభారాణి, అధ్యాపకులు మేఘనను అభినందించారు. ఇక అదే కళాశాలలో జూనియర్‌ ఇంటర్‌కు చెందిన కె.భవాని (ఎంపీసీ) 470 మార్కులకు 462, దీప్తి 500 (ఎంఈసీ) మార్కులకు 484 మార్కులు సాధించారన్నారు. కాగా జూనియర్‌ ఇంటర్‌లో మొత్తం 162 మంది పరీక్షలకు హాజరు కాగా 132 మంది ఉత్తీర్ణత (81.48) సాధించారు. సీనియర్‌ ఇంటర్‌లోనూ 152 మంది (96 శాతం) ఉత్తీర్ణులయ్యారు బి. హర్షిత (ఎంపీసీ) 961, పి. హర్షిత (బైపీసీ) 957, భవ్యశ్రీ (సీఈసీ) 950, అక్షయ (ఎంఈసీ) 927 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్‌ తెలిపారు.

సీనియర్‌ ఇంటర్‌లో టాపర్‌గా బిందు..

సీనియర్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో చిలమత్తూరు జూనియర్‌ కళాశాల విద్యార్థిని బిందు సత్తా చాటింది. చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటకు చెందిన రైతు భాస్కర్‌రెడ్డి, సరితల కుమార్తె పూలకుంట బిందు ఎంపీసీలో 980 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బిందు అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ భీముడు నాయక్‌తో పాటు అధ్యాపకులు విద్యార్థిని బిందును అభినందించారు. ఇక ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎం. శ్వేత (బైపీసీ) 422, శృతి (బైపీసీ) 405, పల్లవి (ఎంపీసీ) 416, సౌజన్య (హెచ్‌ఈసీ) 427 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో శ్రావణి (బైపీసీ) 957, అక్షయ (బైపీసీ) 920 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్‌ తెలిపారు.

ఇంజినీర్‌ అవుతా

ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులు వచ్చి టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న భాస్కర్‌రెడ్డి, అమ్మ సరితల ప్రోత్సాహంతో బాగా చదువుకున్నా. రానున్న రోజుల్లో బీటెక్‌ పూర్తి చేసి ఇంజినీర్‌ కావాలన్నది నా లక్ష్యం. మా అధ్యాపకులు బాగా ప్రోత్సహించారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

– పూలకుంట బిందు,

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె1
1/5

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె2
2/5

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె3
3/5

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె4
4/5

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె5
5/5

‘టాప్‌’ లేపిన ఆటోడ్రైవర్‌ కుమార్తె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement