Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Candlelight Rally In Protest Against Pahalgam Terror Attack1
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ శాంతి ర్యాలీ

సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్‌ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్‌ జగన్‌.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్‌సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్‌ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్‌ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.

Pahalgam Attack  April 23rd Latest updates2
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు

పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్‌.. అప్‌డేట్స్‌పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులుసుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారంఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులుజమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్‌సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీపాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం పాక్‌ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు ఎయిర్‌ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో భేటీప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ మరికాసేపట్లో ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్‌ వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్‌కి వచ్చిన అధికారి ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the #Pahalgam terror attackThe couple got married on April 16. 💔💔 pic.twitter.com/a83lpg3A40— Venisha G Kiba (@KibaVenisha) April 23, 2025జమ్ములో అత్యధికంగా ఎల్‌ఈటీ ఉగ్రవాదులు! జమ్ము కశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్‌ఈటీ విభాగం అసిఫ్‌ ఫౌజీ, సులేమాన్‌ షా, అబు తల్హా గుర్తింపు ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్‌? ముజాహిదీలు కశ్మీర్‌లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్‌ సాయంత్రం కేబినెట్‌ కీలక సమావేశంపహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాసాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశంకేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్‌ సింగ్‌ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్‌ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్‌నాథ్‌ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్‌ విధానం : రాజ్‌నాథ్‌ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్‌నాథ్‌పహల్గామ్‌ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్‌#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E— ANI (@ANI) April 23, 2025 ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్‌.. ఆరేళ్లలో తొలిసారి బంద్‌! పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం శ్రీనగర్‌ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్‌ గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో తొలిసారి బంద్‌ ఉగ్రదాడి.. పాకిస్థాన్‌ హైకమిషన్‌ వద్ద భద్రత కట్టుదిట్టం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం పాకిస్థాన్‌ హైకమిషన్‌ వద్ద గట్టి సెక్యూరిటీ పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ట్వీట్‌ జమ్మును వీడుతున్న పర్యాటకులుపహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులుఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లుకాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లుఆరు గంటల్లో కశ్మీర్‌ను వీడిన 3,300 మంది పర్యాటకులుపర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాIt’s heartbreaking to see the exodus of our guests from the valley after yesterday’s tragic terror attack in Pahalgam but at the same time we totally understand why people would want to leave. While DGCA & the Ministry of Civil Aviation are working to organise extra flights,… pic.twitter.com/5O3i5U1rBh— Omar Abdullah (@OmarAbdullah) April 23, 2025 భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్‌ను వదిలి పాక్‌ వెళ్లిపోయిన అదిల్‌ గురి, అషన్‌ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్‌లో చొరబడినట్లు అనుమానంఅదిల్‌, అషన్‌ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్‌ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్‌ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్‌ మౌంటెడ్‌ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్‌ కవ్వింపు చర్యలుపాక్‌ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్‌ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్‌, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్‌ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్‌ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్‌ ఐఎస్‌ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్‌ ‍ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానంఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌?కశ్మీర్‌, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్‌ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్‌ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్‌ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్‌ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్‌ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్‌ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్‌ క​శ్మీర్‌ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్‌ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్‌ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్‌ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్‌గర్ల్స్‌ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్‌, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్‌ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్‌, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్‌ కంట్రోల్‌ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్‌లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.

IPL 2025: Sunrisers Hyderabad vs Mumbai Indians Live Updates3
దూకుడు పెంచిన క్లాసెన్‌..

IPL 2025 SRH Vs MI Live updates: ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. దూకుడు పెంచిన క్లాసెన్‌..10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 5 వికెట్ల న‌ష్టానికి 51 ప‌రుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్‌(25), మ‌నోహ‌ర్‌(1) ఉన్నారు.పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఎస్ఆర్‌హెచ్‌.. 13 ప‌రుగుల‌కే 4 వికెట్లుఉప్ప‌ల్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌ కేవ‌లం 13 ప‌రుగులకే 4 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ట్రావిస్ హెడ్‌(0), కిష‌న్‌(1), అభిషేక్ శ‌ర్మ‌(8),నితీష్ రెడ్డి(2) వ‌రుస క్ర‌మంలో పెవిలియ‌న్‌కు చేరారు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్ త‌లా రెండు వికెట్లు సాధించారు.ఎస్ఆర్‌హెచ్‌కు భారీ షాక్‌.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు భారీ షాక్ త‌గిలింది. ట్రావిస్ హెడ్(0) రూపంలో స‌న్‌రైజ‌ర్స్ తొలి వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో హెడ్ పెవిలియ‌న్‌కు చేరాడు.2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి హైద‌రాబాద్ వికెట్ న‌ష్టానికి 9 ప‌రుగులు చేసింది.👉ఈ మ్యాచ్‌కు ముందు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా సన్‌రైజర్స్‌, ముంబై ఇండియన్స్ ఆట‌గాళ్లు ఓ నిమిషం మౌనం పాటించారు.ఐపీఎల్‌-2025లో ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు, మ్యాచ్‌ అఫీషియల్స్‌ నల్లటి బ్యాండ్లు ధ‌రించి బ‌రిలోకి దిగారు.ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి. పేస‌ర్ అశ్వినీ కుమార్ స్దానంలో విఘ్నేష్ పుత్త‌ర్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. అదేవిధంగా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీని ఎస్ఆర్‌హెచ్ ప‌క్క‌న పెట్టింది. అత‌డి స్ధానంలో జ‌య‌దేవ్ ఉన‌ద్కట్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.తుది జ‌ట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్‌), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుత్తూర్

PM Modi holds key Cabinet meet to review security situation4
Pahalgam: ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని మోదీ నివాసంలో భద్రత వ్యవహారాల కేబినేట్‌ కమిటీ (Cabinet Committee on Security)సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌లు పాల్గొన్నారు. సీసీఎస్ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, నావికా దళం అధిపతి త్రిపాఠి, సైన్యాధిపతి ద్వివేది, వైమానిక దళాధిపతి అమన్ ప్రీత్ సింగ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశంలో భద్రతా వ్యవహరాల కేబినెట్ కమిటీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముందే పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరికలు జారీ చేశారు. #WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "We lost many innocent lives in the cowardly act in Pahalgam. We are deeply distressed. I express my condolences to the families who lost their loved ones... I want to repeat India's resolve against… pic.twitter.com/OhuX8rkghy— ANI (@ANI) April 23, 2025

How much wealth did Dhirubhai Ambani left behind for Mukesh Ambani and Anil Ambani5
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..

కష్టపడితే సాధించలేనిది లేదు అని కొందరు చెబుతారు, మరికొందరు నిరూపిస్తారు. అలా నిరూపించిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామిక వేత్త 'ధీరూభాయ్ అంబానీ' ఒకరు. గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని.. చోర్వాడ గ్రామంలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఈయన, అంత గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు?, ఆయన మరణించే సమయానికి ఆయన సంపద ఎంత?, కుమారులకు ఇచ్చిన ఆస్తులు ఏమిటి అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.రూ.300 జీతానికిసాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్‌లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. నిజాయితీగా పనిచేస్తూ.. అతి తక్కువ కాలంలోనే అక్కడే మేనేజర్ అయ్యారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చేసారు.భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. ధీరూభాయ్ అంబానీ ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు. వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది.ప్రపంచంలో 138వ ధనవంతుడిగారిలయన్స్ సంస్థ ఓ పెద్ద సామ్రాజ్యంగా ఎదిగిన తరువాత.. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించారు. అప్పటికి ఈయన సంపద ఎంత అనేదానికి సంబంధించిన గణాంకాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. కాగా రిలయన్స్ విలువ రూ. 60,000 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ లక్షల కోట్లు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి.. రిచ్‌డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయితవారసులకు ఏమిచ్చారు?ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, అధికారిక వీలునామా లేకపోవడంతో గ్రూప్ భవిష్యత్తు నాయకత్వం గురించి అనిశ్చితి ఏర్పడింది. ఆ సమయంలోనే ఆయన ఇద్దరు కుమారులు ఆస్తులను పంచుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో వారి తల్లి కోకిలాబెన్ అంబానీ మధ్యవర్తిత్వం వహించారు.ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)ను తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, తరువాత టెలికాం ఉన్నాయి. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ మొదలైనవి తీసుకున్నారు.

Sangareddy Jail Officials Gave A Shock To Aghori6
అఘోరీకి షాక్‌ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు

సాక్షి, సంగారెడ్డి: చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీకి సంగారెడ్డి జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌లోనూ ఉంచలేమంటూ అధికారులు తేల్చి చెప్పారు. అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు.. లింగ నిర్థారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్​ విధించారు. మరో వైపు, సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరీ అరుపులతో హడావుడి చేశాడు. తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు.పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో మోకిలా పోలీసులు.. అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌- మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నగరానికి తీసుకువచ్చారు. మోకిలా పోలీసులు. అఘోరీతో పాటు వర్షిణిని కూడా నగరానికి తరలించారు. ఏపీకి చెందిన వర్షిణి.. అఘోరీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో కూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తమను ఎవరైనా అరెస్టు చేయాలని చూస్తే, ఆత్మహత్య చేసుకుంటామని కూడా హెచ్చరించిన ఈ జంట.. ఓ సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది.

Singer Pravasthi Aradhya Reacts on Harini Ivaturi Comments7
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్‌?: సింగర్‌ హారిణి

ఐదేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aradhya). సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ రియాలిటీ షోలో విజేతగానూ నిలిచింది. చిన్నతనంలోనే పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొంది. తెలుగు, తమిళ భాషల్లో పలు రియాలిటీ షోలలో పాల్గొంది. ఇటీవల మరోసారి పాడుతా తీయగా సిల్వర్‌ జూబ్లీ షోలో పార్టిసిపేట్‌ చేసింది. ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్‌ అయిన ప్రవస్తి.. తనపై జడ్జిలు సునీత, కీరవాణి, చంద్రబోస్‌ వివక్ష చూపించారని ఆరోపించింది. సింగింగ్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌తననొక చీడపురుగులా చూస్తూ ఆత్మస్థైర్యంపై దెబ్బకొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. షో నిర్మాతలు కూడా కొన్నిసార్లు సరైన డ్రెస్సులు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవారంది. షోలో జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన తనకు ఇక భవిష్యత్తు ఉండదని అర్థమై గాయనిగా కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లు ప్రకటించింది. అయితే పాటలంటే ప్రాణమున్న నువ్వు సంగీతాన్ని విడిచిపెట్టొద్దని.. సింగర్‌గా కొనసాగాలని గాయని మాళవిక (Singer Malavika) అభ్యర్థించింది. కష్టమంతా బూడిదపాలుఅందుకు ప్రవస్తి స్పందిస్తూ.. నాపై విషం కక్కుతూ ఉంటే ఇంకా ఈ ఫీల్డ్‌లో ఎలా కొనసాగగలను? మీరందరూ నేను పాడాలని కోరుకుంటున్నారు. కానీ నా కష్టం, ప్రతిభ అంతా బూడిదలో కలిసిపోతుంటే ఎలా తట్టుకోగలను? వివక్ష చూపిస్తుంటే ఎలా భరించగలను? అని ప్రశ్నించింది. మరోవైపు ప్రవస్తిపై సింగర్‌ హారిణి ఇవటూరి (Harini Ivaturi) ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ డ్రామాలు చాలు.. ప్రశంసల కోసం పాకులాడినప్పుడు విమర్శలు స్వీకరించే ధైర్యం కూడా ఉండాలి. చదవండి: 'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీఇంకా ఎంతవరకు లాగుతావ్‌?పాడుతా తీయగా షోలో చాలా ఎపిసోడ్లు చూశాను. కొన్ని చోట్ల నిన్ను నువ్వు ఇంకా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ పొరపాట్లను సరిదిద్దుకోవడం మానేసి అనుభవజ్ఞులైన జడ్జిలను ప్రశ్నిస్తున్నావా? నీకేదైనా అన్యాయం జరిగిందంటే అది షోలోనే తేల్చుకోవాలి. షో అయిపోయాక ఇలా పబ్లిక్‌లో మాట్లాడటం సరికాదు. జడ్జిల క్యారెక్టర్లను తప్పుపట్టడం అన్యాయం. నువ్వు నిరాశలో ఉన్నావని... దాన్ని ఇలా లాగుతూనే ఉంటావా? నీకు నిజంగా దమ్ముంటే వారితోనే నేరుగా మాట్లాడతావ్‌.టాలెంట్‌తోనే ఆన్సర్‌..ఇంత రచ్చ చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు. నీకంత బాధ ఉంటే నీ టాలెంట్‌తోనే సమాధానం చెప్పాలి. నా సొంత అనుభవమే చెప్తా.. ఒకసారి చివరి నిమిషంలో నేను పాడాల్సిన పాట మార్చేశారు. అయినా సరే దాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పాడా.. బెస్ట్‌ పర్ఫామెన్స్‌ గెలుచుకున్నా! ఛాలెంజ్‌లు లేకుంటే మన ఎదుగుదల ఆగిపోతుంది. రియాలిటీ షోలలో ఒత్తిడి భరించలేకపోతున్నావంటే అవి నీకు సెట్టవవు. నీకేదైనా డ్రెస్‌ నచ్చలేదంటే అప్పుడే ముక్కుసూటిగా చెప్పేయాలి. అప్పుడే పోరాడాల్సిందిఅంతేకానీ ఇప్పుడెందుకు చెప్పడం? నీ ఎలిమినేషన్‌ అప్పుడు మీ తల్లి.. జడ్జిలతో ఎంత గట్టిగా మాట్లాడిందో.. నీకు జరుగుతున్న బాడీ షేమింగ్‌ గురించి మేనేజ్‌మెంట్‌ దగ్గర అంతే గట్టిగా చెప్పాల్సింది. ఇప్పుడు ప్రదర్శిస్తున్న ధైర్యం అప్పుడేమైంది. పబ్లిక్‌గా వాళ్లను విమర్శించడం దేనికి? అని ఆగ్రహించింది. ఈ పోస్ట్‌పై ప్రవస్తి స్పందిస్తూ.. అక్కా, దయచేసి నా బాధను డ్రామా అని పిలవొద్దు. నేను పిరికిదాన్ని అని కూడా అన్నారు. నిజంగా పిరికిదాన్నయితే పవర్‌ఫుల్‌ వ్యక్తుల గురించి మాట్లాడను. నేరుగా మాట్లాడొచ్చుగా అని ఇంకో పాయింట్‌ అన్నారు.నాకు ఛాన్స్‌ ఇస్తేగా!వాళ్లు నాకు అవకాశం ఇస్తే కదా నేరుగా మాట్లాడేది. స్టేజీ మీద ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకు వాళ్లు ఏ సమాధానం చెప్పలేదు. నిజంగా పిరికిదాన్నయితే మీరందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారని తెలిసి కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు కదా! అని కౌంటర్‌ ఇచ్చింది. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తనకు జరిగిన ఓ మంచిని సైతం పొందుపరిచింది. ఇండస్ట్రీలో చెడు ఉన్నట్లే మంచి కూడా ఉందని పేర్కొంది. సంగీత దర్శకుడు తమన్‌ 'బ్రో' మూవీలో ఇతర సింగర్స్‌తో కలిసి వెనకాల కోరస్‌ పాడే అవకాశం ఇచ్చారని పేర్కొంది. View this post on Instagram A post shared by Harini Ivaturi (@hariniivaturi)చదవండి: ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే

Rajnath Singh on Pahalgam attack8
పహల్గాం దాడికి దీటుగా బదులిస్తాం

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడుల వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.‘పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యతో అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ దుర్ఘటన నన్ను కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఉగ్రవాదంపై దేశం సంకల్పాన్ని పునరావృతం చేయాలనుకుంటున్నాను. భారత్‌ను ఎవరూ భయపెట్టలేరు. ప్రభుత్వం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటుందని దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని మాత్రమే కాదు, తెరవెనుక ఉన్న ఎంతటివారినైనా ఉపేక్షించబోం. ప్రతీకారం తీర్చుకుంటాం’అని హెచ్చరించారు. #WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "We lost many innocent lives in the cowardly act in Pahalgam. We are deeply distressed. I express my condolences to the families who lost their loved ones... I want to repeat India's resolve against… pic.twitter.com/OhuX8rkghy— ANI (@ANI) April 23, 2025ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా.. వారి వెనుక ఎవరున్నా ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు త్రివిధ దళాదిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఎకె సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా.. వారి వెనుక ఎవరున్నా విడిచి పెట్టమంటూ ఘాటుగా స్పందించారు.సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశం రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలతో కశ్మీర్‌, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్‌? చేపట్టేందుకు సిద్ధమైందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ,రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు వరుస సమావేశాలు నిర్వహించారు. హోం మంత్రి అమిత్‌ షా జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.ఇప్పటికే కశ్మీర్‌ పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ప్రధాని మోదీకి వివరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు.కేంద్రం ఆదేశాల అమలుకు త్రివిధ దళాధిపతులు సిద్ధమనే సంకేతాలిచ్చారు.పహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం‌ ఉంది.

Victims Queue Up For Baldness Medicine In Uppal Hyderabad9
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్‌లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బాగాయత్‌లో ఏర్పాటు చేసిన శిబిరం.. వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. వెయ్యి రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు.. 700 ఆయిల్ కాస్ట్ అంటూ హరీశ్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్‌, వినోద్, రాజశేఖర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాతబస్తీలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వకీల్‌ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్‌ పేరుతో కటింగ్‌ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.వకీల్‌ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్‌ను బట్టతలపై రాసేవాడు. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు.

 Dubai Billionaire Spotted Having Breakfast At White House With Elon Musk Who Is Hussain Sajwani10
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ : ఫోటో వైరల్‌, ఎవరీ సజ్వానీ ?

దుబాయ్‌కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్‌, వేలాది లైక్స్‌ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్‌ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్‌డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్‌లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలు మస్క్‌తోపాటు, మస్క్‌ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్‌ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్‌డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్‌లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్‌ టైకూన్‌ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్‌ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్‌ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్‌మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement