Sri Sathya Sai District News
-
ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?
బీసీ నేతలే టార్గెట్.. సాక్షి, టాస్క్‌ఫోర్స్ కూటమి పార్టీల నేతలు పైన పొత్తులో కనిపిస్తున్నా.. లోన కత్తులు నూరుతున్నారు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో తరచూ టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నియోజకవర్గంలో బీజేపీ పెత్తనాన్ని టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆధిపత్యం కోసం బీజేపీ నేతలపై తరచూ దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల నేతలనే టార్గెట్ చేస్తున్నారు. ఓటు బ్యాంకు ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలని ‘తెలుగు తమ్ముళ్లు’ డిమాండ్ చేస్తుండగా.. ఎమ్మెల్యే మావాడు...మాకే ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. శ్రీరామ్ అనుచరుల దాష్టీకం.. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అండతో ఆయన అనుచరులు నానా హంగామా చేస్తున్నారు. బీజేపీ నాయకులను భయపెట్టేందుకు బీసీ కులాలను టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతున్నారు. మద్యం దుకాణాల నిర్వహణ మొదలుకుని.. ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్ల నియామకం.. ఇలా ప్రతి విషయంలో బీజేపీ నేతల పెత్తనాన్ని ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. ఎక్కడైనా ఎదురుతిరిగితే దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే తాడిమర్రి మండలంలో మద్యం దుకాణం నిర్వహణలో బీజేపీ నేతలను రెండు నెలల పాటు పరిటాల శ్రీరామ్ అనుచరులు అడ్డగించిన సంగతి తెలిసిందే. పాపిరెడ్డిపల్లి తరహాలోనే.. పరిటాల శ్రీరామ్ అండతో టీడీపీ గూండాలు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది రోజున కురుబ లింగమయ్యపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అదే తరహాలో పెద్దకోట్లలో కురుబ కులానికి చెందిన ఆనంద్‌పై దాడికి దిగినట్లు తెలిసింది. పాపిరెడ్డిపల్లి తరహాలోనే పెద్దకోట్లలో కూడా ‘పరిటాల’ సామాజిక వర్గానికి చెందిన వారే దాడికి దిగడం గమనార్హం. పరిటాల శ్రీరామ్ అనుచరుల బెదిరింపులతో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో బీసీ కులాల నేతలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆధిపత్యం కోసం అకృత్యాలకు దిగుతున్నారు. తమ బలం చూపించేందుకు బడుగులపై దాడులు చేస్తూ బలి తీసుకుంటున్నారు. నిన్న కురుబ లింగమయ్య, తాజాగా ఆనంద్.. ఇద్దరిపైనా దాడి చేసింది ‘పరిటాల’ వర్గమే. పట్టుకోసం అటు రాప్తాడు, ఇటు ధర్మవరంలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యనేతల జోలికెళ్లే ధైర్యం లేక అమాయకులైన బీసీలపై దాడులు చేస్తూ భయకంపితులను చేస్తున్నారు. ‘ధర్మవరం’లో ‘తమ్ముళ్ల’ దాష్టీకం రామగిరి తరహాలో ‘పరిటాల’ అనుచరుల బరితెగింపు బీజేపీ కార్యకర్త కురుబ ఆనంద్‌పై దాడి తీవ్రంగా గాయపరిచి.. బెదిరించిన వైనం ‘పరిటాల’ దెబ్బకు బీసీ కులస్తుల బెంబేలు ఆర్వేటి ఆనంద్‌పై టీడీపీ నేతల దాడి దుర్మార్గం దుండగులపై చర్యలు తీసుకోవాలి బీజేపీ, కురుబ సంఘం నాయకుల డిమాండ్ నెల రోజుల క్రితం ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ వాహనంపై పరిటాల శ్రీరామ్ అనుచరులు దాడికి దిగారు. ఒకే కూటమిలో ఉన్నప్పటికీ ఇరు పార్టీల మధ్య సఖ్యత లేదనే విషయం బహిర్గతమైంది. తాజాగా తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామంలో బీసీ కులానికి చెందిన ఆనంద్‌ను టీడీపీ నేతలు చితకబాదారు. ఆదివారం సాయంత్రం గొడవ జరగడంతో అదేరోజు రాత్రి ధర్మవరం ఆస్పత్రిలో చేరాడు. అయితే విషయం బయటకు పొక్కుతుందని భావించిన టీడీపీ నేతలు ఆస్పత్రిలో ఉన్న ఆనంద్‌కు వార్నింగ్ ఇవ్వగా..రాత్రికి రాత్రే ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. ధర్మవరం/తాడిమర్రి: తమ అక్రమాలను ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేందుకు కూడా టీడీపీ నేతలు వెనుకాడటం లేదని బీజేపీ, కురుబ సంఘం నాయకులు మండిపడ్డారు. తమ దురాగతాలను బయటపెట్టినందుకే బీజేపీకి చెందిన కురుబ ఆర్వేటి ఆనంద్‌పై టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. మండలంలోని పెద్దకోట్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కురుబ ఆర్వేటి ఆనంద్‌పై ఆదివారం టీడీపీ నాయకులు దాడి చేశారు. సోమవారం బాధితుడిని పరామర్శించిన బీజేపీ మండల నాయకులు, కురుబ సంఘం నాయకులు అనంతరం ధర్మవరం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధర్మవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంకా నాగార్జున మాట్లాడుతూ.. తాడిమర్రి మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి పెద్దకోట్లకు చెందిన కురుబ ఆర్వేటి ఆనంద్ గ్రామానికి చెందిన మత్స్యకారుల సొసైటీలో సభ్యుడిగా ఉన్నారన్నారు. మత్స్యకార సొసైటీలోని కొందరు సభ్యులు మత్స్య సంపదను రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్‌కు అప్పజెప్పాలని నిర్ణయించారన్నారు. దీనివల్ల గ్రామానికి గానీ, స్థానిక మత్స్యకారులకు ఎలాంటి ఆదాయం రాదన్నారు. దీంతో ఆర్వేటి ఆనంద్ టీడీపీ నేతల నిర్ణయానికి అడ్డుచెప్పారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఆదివారం మద్యం సేవించి వచ్చి మరణాయుధాలతో ఆర్వేటి ఆనంద్‌పై దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బత్తలపల్లి జెడ్పీటీసీ కోటి సుధ, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కాటమయ్య, బీజేపీ నాయకులు దేవర రామ్మోహన్, వీరనారప్ప, బిల్లే శ్రీనివాసులు, గొట్లూరు అనీల్ పాల్గొన్నారు. -
దేశానికే దిక్సూచి అంబేడ్కర్
పుట్టపర్తి టౌన్/ప్రశాంతి నిలయం: ప్రపంచంలోనే గొప్పదైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ దేశానికి దిక్సూచిలా నిలిచారని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో డాక్టర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ...దేశంలోని అన్నివర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి చేశారన్నారు. భారత రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేలా చూశారన్నారు. ఏ అంశంౖపైనెనా సరే నేడు ప్రతి ఒక్కరూ ధైర్యంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారంటే అది అంబేడ్కర్ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ వల్లేనన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే నేడు సామాన్యులు, బడుగు, బలహీన వర్గాల వారు చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతును వినిపించగలుగుతున్నారన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్, సాంఘిక సంక్షేమ శాఖాధికారి శివరంగప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, గిరిజన సంక్షేమశాఖ అధికారి మోహన్‌రామ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తిప్పన్న, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డితోపాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. జయంతి వేడుకల్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ -
కమనీయం.. మహాలక్ష్మీ రథోత్సవం
రొళ్ల: రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి రథోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. వార్షిక ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయాన్నే అర్చకులు అమ్మవారి మూలవిరాట్‌కు పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకం, అంకురార్పణ, కుంకుమార్చన, తులసీపూజ చేశారు. ఆలయ ఆవరణలో ఉంచిన రథాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి శాంతి, నవగ్రహ హోమం, గణపతి పూజ చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. మహాలక్ష్మీ నమోస్తుతే.. రథంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ కీర్చించారు. అనంతరం రథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి సమీపాన ఉన్న ప్రధాన రోడ్డు వరకు లాగారు. ఈ సందర్భంగా భక్తులు రథంపైకి అరటి పండ్లు, పూలు, తమలపాకులు తదితర వాటిని విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామానికి చెందిన బ్రహ్మణ కులస్తులు రాజవంశీకులతో కలిసి జ్యోతులను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థాన రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు గంగ పూజ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి గంగ పూజ చేయనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. గంగ పూజ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై ‘తమ్ముళ్ల’ దాడి
● వాట్సాప్ స్టేటస్‌లో జగన్ పాట పెట్టాడని దౌర్జన్యం ● అడ్డువచ్చిన భార్యనూ అసభ్యపదజాలంతో దూషణ ● మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన బాధితుడు ధర్మవరం: వైఎస్సార్ సీపీ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌లో వైఎస్ జగన్ పాట పెట్టడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డువచ్చిన అతని భార్యనూ అందరి ముందు అసభ్యపదజాలంతో దూషించారు. అవమానంగా భావించిన బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ముదిగుబ్బలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ముదిగుబ్బ గేట్ కొట్టాల వద్ద నివాసం ఉంటున్న బాబ్జాన్ వైఎస్సార్ సీపీ కార్యకర్త. టైల్స్ పరిచే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇటీవల బాబ్జాన్ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పాటలను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుంటున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు బాజ్జాన్ను పిలిపించి మరోసారి జగన్ పాట స్టేటస్ పెడితే ఊరుకునేది లేదంటూ ఇటీవల హెచ్చరించారు. ఆ తర్వాత కూడా బాబ్జాన్ వైఎస్ జగన్ చిత్రాలు, పాటలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి బాబ్జాన్ పీర్ల చావిడి వద్ద ఉండగా.. పూటుగా మద్యం సేవించి అక్కడికి వచ్చిన నలుగురు టీడీపీ కార్యకర్తలు అతనిపై గొడవకు దిగారు. తాము చెప్పినా వినకుండా మళ్లీ జగన్ పాటను వాట్సాప్ స్టేటస్ పెడతావా... అంటూ దాడి చేశారు. అక్కడికి వచ్చిన బాబ్జాన్ భార్యను అసభ్యపదజాలంతో దూషించారు. దీన్ని అవమానంగా భావించిన బాబ్జాన్ ఇంటికి వెళ్లి తలకు పూసుకునే వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కదిరి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం గమనార్హం. -
ఖాద్రీశా.. గోవిందా
● ఖాద్రీశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి, వారాంతపు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామి దర్శనం కోసం భారీగా తరలివచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఖాద్రీశున్ని స్మరిస్తూ గోవింద నామ స్మరణ చేయగా..ఆ ప్రాంతం మార్మోగింది. ఆలయ కమిటీ భక్తులకు అన్నదానం చేసింది. సాయంత్రం వేళ మహిళలు దీపాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. -
క్వింటా చింతపండు రూ.25 వేలు
హిందూపురం అర్బన్: చింతపండు ధరలు మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 1024.20 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.12 వేల ప్రకారం ధర పలికింది. ఇక ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ.4 వేలు, సరాసరిన రూ.11 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌కు నాణ్యమైన చింతపండు తీసుకువచ్చి అధిక ధర పొందాలని కార్యదర్శి రైతులకు సూచించారు. హెచ్ఎం పదోన్నతుల సీనియార్టీ జాబితా సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, అనంతపురం కార్పొరేషన్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ జాబితాను తయారు చేశారు. deoananthapuramu.blogspot. com వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో ఈనెల 19లోపు ఫిర్యాదు చేయాలని డీఈఓ సూచించారు. ఎస్పీని కలిసిన డీఎస్పీ పుట్టపర్తి టౌన్: పెనుకొండ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నరసింగప్ప సోమవారం ఎస్పీ రత్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెనుకొండ సబ్ డివిజన్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని డీఎస్పీకి ఎస్పీ సూచించారు. ముఖ్యంగా మట్కా, పేకాటను పూర్తిగా అరికట్టాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు
పుట్టపర్తి టౌన్: సామాజిక మాధ్యమాల వేదికగా కులమతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రత్న హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సోమవారం డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కదిరి డీఎస్పీ శివన్నారాయణస్వామితో కలసి ఎస్పీ మాట్లాడారు. కదిరి ఆర్ఐ మున్వర్‌బాషా దొంగ పట్టాలు సృష్టించి ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న అంశంలో 6 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో రెండు కేసుల్లో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారన్నారు. అనంతరం కదిరి ఇన్స్పెక్టర్ను మున్వర్‌బాషా రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పినా వినకుండా మొత్తం అంశాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారన్నారు. వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించిన మున్వర్బాషాపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాగే హిందూపురంలోనూ ఓ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో సోషల్ మీడియా సీఐ తిమ్మారెడ్డి, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు తాడిమర్రి: తమ విధులకు ఆటంకం కలిగించారంటూ శివంపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు అల్లే సాయినాథ్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. శనివారం తాడిమర్రిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజేలో ఆ పార్టీకి చెందిన పాటలు వేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని వైఎస్సార్సీపీ నాయకులు కోరినా పోలీసులు వినలేదు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. సత్తా చాటిన కస్తూరిబా విద్యార్థినులు పుట్టపర్తి అర్బన్: ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని 30 కస్తూరిబా కళాశాలల విద్యార్థినులు సత్తా చాటారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 877 మంది పరీక్షలు రాయగా, 599 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 641 మంది పరీక్షలు రాయగా 557 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 68 శాతం, రెండో సంవత్సరంలో 87 శాతం ఫలితాలు సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా కో–ఆర్డినేటర్ దేవరాజ్ తెలిపారు. జాతీయ హోమియో వైద్యుల సంఘంలో జిల్లా వాసులకు చోటు అనంతపురం మెడికల్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ నెల 13న గుంటూరులో అఖిల భారత హోమియో వైద్యుల సంఘం 18వ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియర్ హోమియోపతి వైద్యుడు డాక్టర్ పోగుల కుమారయ్య, రాష్ట్ర విభాగం కో ఆర్డినేటర్‌గా డాక్టర్ ఎం.శాంతిప్రియకు అవకాశం దక్కింది. డాక్టర్ పోగుల కుమారయ్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హోమియో వైద్యం ప్రాముఖ్యత, నూతన ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
మందు అడిగితే ఇవ్వలేదని వ్యక్తిపై దాడి
యాడికి: తాగేందుకు మందు ఇవ్వలేదన్న అక్కసుతో ఖాళీ మద్యం బాటిళ్లతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన యాడికిలో సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన మంగల గంగాధర్ సోమవారం వ్యక్తిగత పనిపై మండల కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రాందీ షాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి, ఆ పక్కనే మిగిలిన వారితో కలసి తాగుతూ కూర్చొన్నాడు. అదే సమయంలో గంగాధర్‌తో ఎలాంటి ముఖపరిచయం లేని యాడికి గ్రామానికి చెందిన మహేష్ అక్కడకు చేరుకుని తనకూ తాగేందుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు గంగాధర్ నిరాకరించడంతో మహేష్ వాగ్వాదానికి దిగాడు. దుర్భాషలాడుతూ ఆ పక్కనే పడి ఉన్న ఖాళీ మద్యం గాజు బాటిల్ తీసుకుని గంగాధర్ తలపై బలంగా బాదాడు. దీంతో గంగాధర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. సమాచారం అందుకున్న గంగాధర్ సమీప బంధువు అక్కడకు చేరుకుని వెంటనే క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న యాడికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మాజీ సైనికుడి మృతిహిందూపురం అర్బన్: స్థానిక న్యూ హస్నాబాద్‌లో నివాసముంటున్న మాజీ సైనికుడు ఎ.ఆదినారాయణ (86) సోమవారం అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయనకు భార్య గ్రేస్ ఆదిలక్ష్మీదేవి, కుమార్తె సుమలత, కుమారులు కామేష్, నాగేంద్రకుమార్ (ఎస్డీజీఎస్ కళాశాల ప్రిన్సిపాల్), స్టీఫెన్‌రాజ్, మనవలు, మనుమరాళ్లు ఉన్నారు. 24 ఏళ్లపాటు సైన్యంలో పనిచేసిన ఆయన 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి శత్రుసైనికులను దేశంలో చొరబడకుండా అడ్డుకున్నారు. ఆదినారాయణ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంజాయి విక్రేతల అరెస్ట్ కదిరి టౌన్: తనకల్లు మండలం గోవిందువారిపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. సోమవారం ఉదయం గోవిందవారిపల్లి వద్ద నలుగురు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా గమనించిన తనకల్లు ఎస్ఐ గోపి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సమయలో వారు అక్కడి నుంచి పారిపోతుండడంతో అనుమానం వచ్చి కానిస్టేబుళ్లు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఉన్న గంజాయి, 4 సెల్పోన్లు, రూ.1,100 నగదు స్వాధీనం చేసుకుని డిప్యూటీ తహసీల్దార్ సమక్షంలో పంచనామా చేయించారు. నిందితులను బాలంగిరి జిల్లా నూంహాడ్ గ్రామానికి చెందిన తులసీ పరదు, అన్మమయ్య జిల్లా ముదివేడు మండలం గుట్టమీదసాహెబుల పల్లికి చెందిన రెడ్డి బాషా, మొలకలచెరువు మండలం ఎపురకోటకు చెందిన కె.నరసింహులు, అన్నమయ్య జిల్లా బాలసముద్రం గ్రామానికి చెందిన సురేందర్‌గా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ముగిసిన రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు తాడిపత్రి: ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు సోమవారం స్వామి వారికి కోనలో తీర్థవాది, వసంతోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలు అర్చకులు జరిపించారు. అనంతరం స్వామి వారికి పుష్పయాగ కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రికి రంగనాథస్వామి వారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. -
ప్రాణం పోసిన మెడిసిన్ వైద్యులు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో చికిత్స ఆస్పత్రికి చేరుకున్న రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ద్వారా అతని ప్రాణాలను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మెడిసిన్ విభాగం వైద్యులు కాపాడారు. కంబదూరు మండలం ఒంటిరెడ్డిపల్లికి చెందిన 34 ఏళ్ల వయసున్న నాగేంద్ర.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉన్నఫళంగా కాళ్లు చేతులు పడిపోయి, మాట రాకపోవడంతో ఈ నెల 7న కుటుంబసభ్యులు సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మెడికల్ కేర్‌లో అడ్మిట్ చేసుకుని మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ భీమసేనాచార్ నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పావని తదితరులు చికిత్స మొదలు పెట్టారు. గులియన్ బరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ అయిన తర్వాత పీజీ వైద్యులు, స్టాఫ్‌నర్సులు నాగేంద్రకు రౌండ్ ద క్లాక్ సేవలందించారు. రూ.7వేలు విలువ చేసే ఇంజెక్షన్లను క్రమం తప్పకుండా 20కి పైగా అందించాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై ఉన్న నాగేంద్ర కోలుకోవడంతో వార్డుకు షిప్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తమకు ముగ్గురు పిల్లలున్నారని, ఆస్పత్రి వైద్యులు తన భర్తకు ఊపిరి పోశారని, వారి మేలును ఎన్నడూ మరవనంటూ వైద్యులు, స్టాఫ్‌నర్సులు, తదితర సిబ్బందికి భార్య సుకన్య కృతజ్ఞతలు తెలిపింది. ప్రైవేట్‌గా ఈ తరహా వైద్యం పొందాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వైద్యులంటున్నారు. -
భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
కదిరి అర్బన్: మండలంలోని కుమ్మరవాండ్లపల్లి నుంచి కదిరి కొండ చుట్టూ సోమవారం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మీనరసింహాస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా మహిమ గల ఖాధ్రీ కొండకు గిరి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన తప్పనిసరి ● జిల్లా అగ్నిమాపక శాఖాధికారి హేమంత్‌రెడ్డి పుట్టపర్తి టౌన్: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి హేమంత్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం స్థానిక ఫైర్ స్టేషన్లో ఆయన ప్రారంభించి, మాట్లాడారు. విఽధి నిర్వహణలో అమరవీరులైనా ఫైర్మెన్లకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 1944, ఏప్రిల్ 14న ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో (బాంబే డాక్ ఫైర్) మొత్తం 800 మంది మృత్యవాత పడ్డారు. ఇందులో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నారన్నారు. అప్పటి నుంచి విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలను జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణపై వారం రోజుల పాటు ప్రజలకు వివిధ రూపాల్లో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. 15న జనసంచారిత ప్రాంతాల్లో, విద్యాసంస్థల్లో, గ్యాస్ గోడౌన్లు, పెట్రోల్ బంక్‌లలో వారం రోజుల పాటు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓలు, నాగరాజునాయక్, శంకర్‌ప్రసాద్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. -
నాటుసారా తయారు చేస్తే చర్యలు
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ ఎక్పైజ్ జిల్లా అధికారి గోవిందనాయక్ హెచ్చరించారు. నవోదయం 2.0 భాగంగా నాటు సారా నిర్మూలకు సోమవారం బుక్కపట్నం మండలం నార్శింపల్లి తండాలో జిల్లా అధికారులలో కలసి దాడులు నిర్వహి ంచారు. 540 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 4 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నార్శింపల్లి తండాకు చెందిన అలివేలుబాయి, కిరణ్‌నాయక్, శ్రీరాములు నాయక్‌పై కేసు నమోదు చేశారు. పుట్టపర్తి రూరల్ మండలం వెంగలమ్మచెరువు గ్రామంలో దాడులు నిర్వహించి 90 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, గంగులయ్యపై కేసు నమోదు చేశారు. దాడుల్లో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అధికారి నరసింహులు, సీఐ నాగరాజు, ఎస్ఐ ఉమామహేశ్వర్రాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బెల్లపు ఊట ధ్వంసం కదిరి అర్బన్: బాలప్పగారిపల్లి తండా సమీపంలోని కొండగుట్టల్లో సోమవారం ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 452 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. దాడుల్లో అనంతపురం ఎన్ఫోర్స్మెంట్ సీఐ అలీ, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, బాబు, దత్తాత్రేయతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
19న వివాహం... యువతి బలవన్మరణం
రాప్తాడు రూరల్: పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట కాబోయే పెళ్లికూతురు బలవన్మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం రూరల్ మండలం పూలకుంటలో సోమవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన మేరకు... పూలకుంట గ్రామానికి చెందిన కురుబ నారాయణస్వామికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహమైంది. రెండో అమ్మాయి రేణుక (24) ఆకుతోటపల్లి–1 సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. ఈమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 19న పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు ఓవైపు పెళ్లి పత్రికల పంపిణీ చేస్తూనే మరోవైపు పెళ్లికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటికి బంధువుల రాక కూడా మొదలైంది. పెళ్లంటే ఇష్టం లేక.... అయితే రేణుకకు పెళ్లంటే ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు సచివాలయంలో సహచర ఉద్యోగులతో చెప్పేది. ‘పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందో...అత్త మామలు ఎలా ఉంటారో....ఇప్పుడున్నట్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఉండేందుకు ఉండదు... కొత్తగా పెళ్లి చేసుకున్న వారి కాపురాలు చాలా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఎందుకు చేసుకోవాలో?’ అని చర్చించేది. మరోవైపు పెళ్లి తేదీ దగ్గరకు వస్తుండడంతో హడావుడి పెరిగిపోయింది. ఇక పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, తల్లిదండ్రులకు చెప్పుకోలేక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె సోమవారం ఉదయం మేడపై ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమార్తె కనిపించింది. సమాచారం అందుకున్న ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్‌కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెళ్లి భజంత్రీ మోగాల్సిన ఇంట విషాదం మృతురాలు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ -
పేదల నెత్తిన గుదిబండ
ప్రశాంతి నిలయం: జిల్లా వాసులపై వంట గ్యాస్ రూపంలో అదనపు భారం పడింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుతుండడంతో అవస్థలు పడుతున్న సామాన్యులకు వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50 ధర పెంచి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఏ మాత్రం చిత్తశుద్ధి చూపని పాలకులు.. నిత్యావసర సరుకుల ధరలు, వంట గ్యాస్, ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 32 మండలాల పరిధిలో ఐఓసీ, హెచ్పీసీ, బీపీసీ కంపెనీల ద్వారా 39 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా సాధారణ గృహ వినియోగ సిలిండర్లు 8,08,489 ఉన్నాయి. మరో 7,737 నాన్ డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. ఏటా రూ.24.25 కోట్ల భారం.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 అదనంగా పెంచడంతో జిల్లా వాసులపై ఏటా రూ.24.25 కోట్ల భారం పడనుంది. జిల్లాలో 8,08489 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్కో కనెక్షన్ ద్వారా ఏడాదికి 6 సిలిండర్లు చొప్పున 48,50,934 సిలిండర్లు వినియోగిస్తున్నారు. గతంలో 14.20 కిలోల సిలిండర్ ధర జిల్లా కేంద్రంలో రూ.870 ఉండగా పెంచిన తర్వాత రూ.930కి చేరింది. రవాణా చార్జీల రూపంలో దూరాన్ని బట్టి మరో రూ.30 నుంచి రూ.50ను, డెలివరీ చేసినందుకు అంటూ బాయ్స్ మరో రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో గృహ వినియోగదారులు సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ.1000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ధర తగ్గించాలి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలను ఏ మాత్రం నెరవేర్చడం లేదు. పైగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినా పట్టించుకోవడం లేదు. నెలసరి ఖర్చుల భారం మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడేమో గ్యాస్ సిలిండర్‌పై రూ.50 ధర పెంచడం తగదు. వెంటనే పెంచిన సిలిండర్ రేటును వెంటనే తగ్గించాలి. – సాయిలీల, ప్రశాంతి గ్రామ్ పేదలపై భారం నిత్యావసరాల ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తి లేక చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందనే సాకు చూపి వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడం సబబు కాదు. పెంచిన ధరను వెంటనే తగ్గించి పేదలకు న్యాయం చేయాలి. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఏ ప్రభుత్వానికై నా పతనం తప్పదు. – కవిత, గోకులం, పుట్టపర్తి ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌పై అదనంగా రూ.50 పెంపు జిల్లా వినియోగదారులపై ఏటా రూ.24.25 కోట్ల అదనపు భారం -
ఉయ్యాలసేవలో చౌడేశ్వరీదేవి
అమడగూరు: చౌడేశ్వరీదేవి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శీతిరెడ్డిపల్లి గ్రామస్తులు అమ్మవారికి ఉయ్యాలసేవ నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆలయం నుంచి అమ్మవారిని డప్పు వాయిద్యాల నడుమ బెళ్ల్లీ రథంలో ఊరేగింపుగా గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం పురవీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు. యువత రంగునీళ్లు జల్లుకొంటూ సంతోషంగా ముందుకు సాగారు. తర్వాత కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలోకి అమ్మవారిని తీసుకొచ్చారు. అనంతరం ఈ ఏడాది నూతనంగా తయారు చేయించిన ఉయ్యాలలో అమ్మవారిని కొలువుదీర్చి పాటలు పాడుతూ ఊయలూపారు. మహిళలంతా ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బంధువర్గాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యప్రభ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తమరెడ్డి పేర్కొన్నారు. -
పరిస్థితి దారుణంగా ఉంది
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చీనీ తోటలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 93 వేల ఎకరాలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 37,250 ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ పంట సాగవుతోంది. వాటి ద్వారా ఏటా 7.20 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తోంది. ఏటా సరాసరి రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల టర్నోవర్ ఉన్నట్లు ఉద్యానశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో 18 వేల ఎకరాలు, యల్లనూరు 11,296, కూడేరు 9,300, పామిడి 5,300, నార్పల 5,200, పుట్లూరు 5 వేలు, ఆత్మకూరు 4,200, అనంతపురం 3,900, పెద్దపప్పూరు 3,500 ఎకరాల్లో చీనీ తోటలు ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో చీనీ అత్యధికంగా సాగులో ఉంది. ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి.. ఉమ్మడి జిల్లాలో పండించే చీనీలో 70 నుంచి 80 శాతం వరకు ఢిల్లీలో ఉన్న అజాద్‌పూర్ మార్కెట్‌కు, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. అయితే ఈ సారి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఎక్కువ దిగుబడి రావడంతో వ్యాపారులు అక్కడికి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల మార్కెట్లకు సరుకు విపరీతంగా వెళుతుండటంతో సమస్య ఉత్పన్నమవుతోందని మార్కెట్‌యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. ఇటీవల జిల్లా నుంచి అక్కడకు వెళ్లిన 50 నుంచి 70 లారీల సరుకు ఇంకా అన్లోడ్ కాలేదని, దీంతో ధరలు పెరగడం లేదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట ధరలు పలికేవి. కానీ, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ధరలు పెరగడం అటుంచి తగ్గుదల కనిపిస్తుండటంతో అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్‌లో టన్ను రూ.40 వేలకు పైగా పలకాల్సివుండగా... గత రెండు నెలలుగా టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించి పలకడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఇటీవల నిత్యం 1,000 నుంచి 1,500 టన్నుల సరుకు వస్తోంది. ఈ క్రమంలో శనివారం టన్ను గరిష్ట ధర రూ.20 వేల లోపే పలికింది. సరాసరి ధర రూ.13 వేలు మాత్రమే పలకడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. దీనికి తోడు శనివారం మార్కెట్‌యార్డులో జీవాల సంత ఉండటంతో చీనీ అమ్మకాలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. చాలా వాహనాల్లోని చీనీ సరుకును కిందికి దించి అమ్మకాలు చేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఇలా రోజురోజుకు కష్టాలు ఎక్కువ అవుతుండటంతో చీనీ రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ‘అనంత’ రైతులకు ఒకప్పుడు లాభాల తీపి పంచిన చీనీ ఇప్పుడు చేదెక్కింది. మంచి ధర కోసం వారాలు, నెలల తరబడి కాయలు కోయకుండా ఎదురుచూసినా ఫలితం కానరాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్కెటింగ్ పరిస్థితి దారుణంగా ఉన్నా కూటమి సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ధరలు మరింత పతనం గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణ పరిస్థితులు రైతుల్లో తీవ్ర ఆందోళన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి చీనీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రంజాన్, ఉగాది, హోలీ పండుగలు అన్నీ వెళ్లినా... ధరలు మాత్రం పెరగడం లేదు. తోటల్లోనే టన్ను రూ.25 వేలకు మించి అడగడం లేదు. దానికి డబుల్ సూట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే నెల పాటు కాయలు కోయకుండా ధరల కోసం ఎదురుచూసినా ఫలితం కానరాలేదు. నాకు ఏడెకరాల చీనీ తోట ఉంది. దిగుబడి బాగానే ఉన్నా ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. టన్ను రూ.40 వేలు అటుఇటుగా పలికితే తప్ప గిట్టుబాటు కాదు. గతంలో కన్నా ఈ సారి చీడపీడల తాకిడి ఎక్కువ కావడంతో పురుగుల మందుల ఖర్చు బాగా పెరిగింది. – కుళ్లాయిరెడ్డి, చీనీ రైతు, కునుకుంట్ల గ్రామం, తాడిమర్రి మండలం -
కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
● అర్ధరాత్రి అమ్మవారికి జలధి ఉత్సవం ● నేడు బ్రహ్మ రథోత్సవం రొళ్ల: చారిత్రక రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు సాగుతాయి. తొలిరోజు సాయంత్రం అమ్మావారి మూలవిరాట్‌తో పాటు ఉత్సవ విగ్రహానికి అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో అలంకరించి మహామంగళహారతి ఇచ్చారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో వేదపండితుల సమక్షంలో గణపతి పూజ చేసి కలశ స్థాపన చేశారు. రాత్రి అమ్మావారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం చుట్టూ మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. తిరిగి ప్రధాన ఆలయ ప్రాంగణంలో పట్టం కూర్చోబెట్టి అర్ధరాత్రి అక్కడి నుంచి సమీపాన గల పాలబావి వద్దకు మేళతాళాల నడుమ చేరుకున్నారు. ఉత్సవ విగ్రహానికి ప్రధాన అర్చకులు గంగాజలంతో శుద్ధి చేసి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం కట్టి, పూలు, పండ్లు ఉంచి, హారతి ఇచ్చిన తర్వాత బావిలోకి నైవేద్యం సమర్పించారు. పాలబావిలో అమ్మవారికి గంగా జలంతో శుద్ధి చేసిన అనంతరం పూజలు నిర్వహిస్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం, పెళ్లికాని యువతులకు పెళ్లిల్లు జగురుతాయని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. చుట్టు పక్కల గ్రామస్తులతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో రత్నగిరి సంస్థానం దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు బ్రహ్మరథోత్సవం రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఉత్సవాల్లో సోమవారం మధ్యాహ్నం బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నట్లు రాజవంశీకుడు దొర రంగప్పరాజు, గ్రామ పెద్దలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. -
సాగునీరు అందించడంలో ఘోర వైఫల్యం
చిలమత్తూరు: ఆయకట్టుకు సాగునీరందించడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. ఆదివారం హిందూపురంలోని ఆంబేడ్కర్ భవనంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆద్వర్యంలో ‘సాగునీటి ప్రాజెక్ట్‌లు – విభజన హామీలు’ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ దీపిక మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు చేపట్టడం ద్వారా ఆయకట్టు పరిధిలోని భూములకు సమాధి కడుతున్నారన్నారు. రానున్న రోజులు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లను కాపాడుకోవడం, వాటికి నీటిని తెప్పించడం కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన హామీలను తుంగలో తొక్కాయన్నారు. రైతులకు మేలు చేకూర్చే సాగునీటి ప్రాజెక్ట్‌లపై నిర్లక్ష్యంగా ఉన్నాయన్నారు. ప్రాజెక్ట్‌ల కోసం వచ్చిన నిధులను మళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలోకి నెడుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శ్రీరాములు, చైతన్య గంగిరెడ్డి, శ్రీనివాసులు, శంకరయ్య, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతల అక్రమ నిర్బంధం సాక్షి టాస్క్ ఫోర్స్:కేసుతో సంబంధం లేకపోయినా ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, రహస్య ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించడం కలకలం రేపుతోంది. అధికార టీడీపీ నేతల డైరెక్షన్లోనే ఇదంతా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన మోహన్ అనే టీడీపీ కార్యకర్త మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేయడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. నిందితుడిపై కేసు నమోదు చేయాలని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే టీడీపీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కేసును అడ్డం పెట్టుకొని ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు వాల్మీకి లోకేష్, అంబేద్కర్ నవీన్, షేక్షా శుభకార్యంలో పాల్గొనేందుకు అనంతపురం జిల్లాకు వెళ్తుండగా శనివారం హిందూపురం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి నిర్బంధించడం కలకలం రేపుతోంది. టీడీపీ నేతల ఒత్తిళ్ల మేరకే పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ముగ్గురిని ఎక్కడికి తీసుకువెళ్లారు.. ఏమి చేయబోతున్నారో అని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరి అక్రమ నిర్బంధంపై వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేస్తే రిమాండ్‌కు తరలించాలని, అలా రహస్యంగా ఎక్కడో ఉంచడం ఏంటని ప్రశ్నించారు. వృద్ధ దంపతుల ఆత్మహత్య అనంతపురం: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం త్రీటౌన్ సీఐ కే.శాంతిలాల్ తెలిపిన మేరకు.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వీవర్స్ కాలనీ చెందిన దేవా శివానంద (70), దేవా శాంతమ్మ (60) దంపతులు. వీరికి దేవా గోపాల్, దేవా చంద్రశేఖర్ సంతానం కాగా, హిందూపురంలో కుమారులు ఒక చోట, తల్లిదండ్రులు మరో చోట నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన శివానందకు ఇటీవల షుగర్ ఎక్కువైంది.కిడ్నీ కూడా దెబ్బతినడంతో అనంతపురం సవేరా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. శాంతమ్మ కూడా షుగర్ వ్యాధితో బాధపడేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి అనంతపురం చేరుకున్నారు. నగర సమీపంలోని నేషనల్ పార్కు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించగా, చికిత్స ఫలించక శివానంద అదే రోజు ప్రాణాలు విడిచారు. శాంతమ్మ ఆదివారం మృతి చెందింది. -
‘టాప్’ లేపిన ఆటోడ్రైవర్ కుమార్తె
పుట్టపర్తి: ఇంటర్ ఫలితాల్లో జిల్లా ర్యాంకులు మారలేదు. గతంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతంతో పాటు రాష్ట్ర ర్యాంకు కూడా తగ్గాయి. శనివారం ఉదయం ఫలితాలు విడుదల కాగా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఈసారి 57 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితంగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 11,173 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 6,368 మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం 58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే వివిధ గ్రూపుల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్‌కు పోటీ పడుతూ మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్‌లోనూ అంతే... ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 76 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి రెండు శాతం పెరిగి 78కి చేరింది. దీంతో రాష్ట్రంలోనే జిల్లా 18వ స్థానంలో నిలిచింది. మొత్తం 8,952 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,986 మంది ఉత్తీర్ణులయ్యారు.ఒకేషనల్ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 2,457 మందికి గానూ 1,536 మంది పాసయ్యారు. మెరిసిన గ్రామీణ విద్యార్థులు.. ● కదిరి బాలుర ఉన్నత పాఠశాలలోని జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రకాశ్ ఎంపీసీ గ్రూపులో 961 మార్కులు సాధించాడు. ● కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో గారికోట క్షితిరెడ్డి 470 మార్కులకు గాను 450 మార్కులు సాధించి సత్తా చాటింది. ● లేపాక్షిలోని మహాత్మాజ్యోతిరావు పూలే ఏపీ గురుకుల పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 130 మంది పరీక్ష రాయగా, 109 (84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 125 మంది పరీక్షలు రాయగా, 124 మంది (99.2 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థి దివాకర్ (ఎంపీసీ) 984 మార్కులు, జి.శ్రీశాంత్ (బైపీసీ) 959 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్ సుందరరాజు తెలిపారు. ఫస్ట్ ఇయర్ టాపర్‌గా టేకులోడు విద్యార్థిని మేఘన 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించిన విద్యార్థిని సీనియర్ ఇంటర్లో బిందుకు 980 మార్కులు 15 నుంచి పరీక్ష ఫీజు చెల్లించొచ్చు మే 12 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ధర్మవరం అర్బన్: ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్మెంట్ రాయాలనుకున్న విద్యార్థులు ఈనెల 15వ తేదీ పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ విద్య జిల్లా అధికారి రఘునాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 22వ తేదీ వరకూ ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులు తాము చదివే కళాశాలల్లోనే ఫీజు చెల్లించాలని సూచించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించాలనుకునే వారు ఈనెల 13వ తేదీ నుంచి www.bie.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్ ఫీజు ఒక పేపర్‌కు రూ.260, రీవెరిఫికేషన్ కోసం రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందన్నారు. చిలమత్తూరు: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మండల పరిధిలోని టేకులోడు మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల కళాశాల విద్యార్థిని మేఘన సత్తా చాటింది. గురుకుల కళాశాల విభాగంలో టాపర్‌గా నిలిచింది. రొద్దం మండలం కలిపి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వేణుగోపాల్ కుమార్తె జి. మేఘన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 440 (బైసీపీ) మార్కులకు గాను 435 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శోభారాణి, అధ్యాపకులు మేఘనను అభినందించారు. ఇక అదే కళాశాలలో జూనియర్ ఇంటర్‌కు చెందిన కె.భవాని (ఎంపీసీ) 470 మార్కులకు 462, దీప్తి 500 (ఎంఈసీ) మార్కులకు 484 మార్కులు సాధించారన్నారు. కాగా జూనియర్ ఇంటర్లో మొత్తం 162 మంది పరీక్షలకు హాజరు కాగా 132 మంది ఉత్తీర్ణత (81.48) సాధించారు. సీనియర్ ఇంటర్‌లోనూ 152 మంది (96 శాతం) ఉత్తీర్ణులయ్యారు బి. హర్షిత (ఎంపీసీ) 961, పి. హర్షిత (బైపీసీ) 957, భవ్యశ్రీ (సీఈసీ) 950, అక్షయ (ఎంఈసీ) 927 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. సీనియర్ ఇంటర్లో టాపర్‌గా బిందు.. సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో చిలమత్తూరు జూనియర్ కళాశాల విద్యార్థిని బిందు సత్తా చాటింది. చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటకు చెందిన రైతు భాస్కర్‌రెడ్డి, సరితల కుమార్తె పూలకుంట బిందు ఎంపీసీలో 980 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బిందు అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ భీముడు నాయక్‌తో పాటు అధ్యాపకులు విద్యార్థిని బిందును అభినందించారు. ఇక ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎం. శ్వేత (బైపీసీ) 422, శృతి (బైపీసీ) 405, పల్లవి (ఎంపీసీ) 416, సౌజన్య (హెచ్ఈసీ) 427 మార్కులు సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో శ్రావణి (బైపీసీ) 957, అక్షయ (బైపీసీ) 920 మార్కులు సాధించినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఇంజినీర్ అవుతా ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు వచ్చి టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న భాస్కర్‌రెడ్డి, అమ్మ సరితల ప్రోత్సాహంతో బాగా చదువుకున్నా. రానున్న రోజుల్లో బీటెక్ పూర్తి చేసి ఇంజినీర్ కావాలన్నది నా లక్ష్యం. మా అధ్యాపకులు బాగా ప్రోత్సహించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. – పూలకుంట బిందు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని -
మేమున్నామని.. మీకేం కాదని
రాప్తాడురూరల్: టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ నెల 8న వారి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆదేశాలతో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు శనివారం అనంతపురంలోని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నివాసంలో లింగమయ్య భార్య రామాంజనమ్మ, కుమారులు హరి, శ్రీనివాసులుకు చెక్కును అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి చేతుల మీదుగా చెక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామగిరి ఆదిరెడ్డి, కాటిగానికాలువ జనార్దన్‌రెడ్డి, బిల్లే మంజునాథ్ పాల్గొన్నారు. చెక్కును అందజేస్తున్న మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ అండ రూ. 5 లక్షల ఆర్థిక సాయం -
అట్టహాసం..చౌడేశ్వరీ ఉత్సవం
అమడగూరు: చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం కుంభకూడు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఏడాది కూడా చీకిరేవులపల్లికి చెందిన పళ్లెం నరసింహప్ప, చంద్రకళ, అలాగే దాసరి శివప్ప, రాధమ్మ దంపతులతో పాటుగా తొగటవీర సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎప్పటిలాగే రాత్రి ముత్యాల జొన్నలతో వండిన కూడును ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా పెద్ద ఎత్తున కుంభం వలె రాశిగా పోసి పూల కుచ్చును ఏర్పాటు చేశారు. అనంతరం ఆనవాయితీ ప్రకారం జంతువులను బలిగా ఇచ్చారు. పూజలన్నీ ముగిసిన తర్వాత రుధిరంతో తడిసిన జొన్నల కూడును, పూలకుచ్చును తీసుకెళ్లడానికి భక్తులు పోటీపడ్డారు. ఈ కుంభకూడును తీసుకెళ్లి నివాస గృహాలపైన, పంటపొలాల్లో, పశువులపై చల్లితే ఎటువంటి కీడు జరగదని భక్తుల నమ్మకం. కుంభకూడు కార్యక్రమానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆకట్టుకున్న జ్యోతుల ఊరేగింపు.. కుంభకూడును పురస్కరించుకుని చీకిరేవులపల్లి తొగటవీర క్షత్రియ సంఘం సభ్యులతో కలసి ధర్మవరానికి చెందిన 20 మంది అమ్మవారికి జ్యోతులు సమర్పించారు. తొలుత ప్రత్యేకంగా తయారుచేసిన జ్యోతులతో బోనాలు తయారు చేసుకుని చీకిరేవులపల్లి వీధుల గుండా ఊరేగారు. అనంతరం జ్యోతులను తలమీద పెట్టుకుని అమ్మవారి ఖడ్గ పద్యాలు చదువుతూ, పాటలు పాడుకుంటూ అమడగూరుకు వెళ్లి సమర్పించారు. సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్ఐ వెంకటరాముడు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పురుషోత్తమరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తొలిరోజు కుంభకూడుకు కిక్కిరిసిన భక్తజనం -
ఉట్టిపడిన తమిళ సాంస్కృతిక శోభ
ప్రశాంతి నిలయం: సత్యసాయి సన్నిధిలో తమిళ సత్యసాయి భక్తులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తకోటిని మైమరపించారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తమిళనాడు సత్యసాయి యూత్ సభ్యులు శనివారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం తమిళనాడు సత్యసాయి యూత్ బృందం సంగీత కచేరీ నిర్వహించింది. సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఆలరించింది. సాయంత్రం శివభక్తుడైన నందనార్ ఆధ్యాత్మిక చింతన, శివుడిపై అపారమైన భక్తిని వివరిస్తూ బాలవికాస్ చిన్నారులు ‘నందనార్’ పేరుతో నృత్య రూపకం ప్రదర్శించారు. శివుడి దర్శన భాగ్యం కోసం నందనార్ పరితపించిన తీరును చక్కగా వివరించారు. చివరకు నందనార్ భక్తికి మెచ్చిన శివుడు దర్శన భాగ్యం కల్పించిన తీరును కళ్లకు కట్టారు. అనంతరం తమిళ భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
రమణీయం.. రథోత్సవం
తాడిమర్రి: చెన్నకేశవ స్వామి నామస్మరణతో తాడిమర్రి మార్మోగింది. లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. మరగాళ్ల విన్యాసాలు, కీలు గుర్రాల నృత్యాలు, చక్క భజన, కోలాటం ప్రదర్శిస్తూ భక్తులు రథం ముందు సాగుతుండగా...దేవేరులతో కలిసి రథంపై కొలువైన లక్ష్మీచెన్నకేశవుడు భక్తులకు దర్శనమిచ్చారు. యాగంతో ప్రారంభం.. ఆలయ అర్చకులు మామిళ్లపల్లి జయరామయ్యశర్మ, సంతోష శర్మ శనివారం ఉదయం బ్రహ్మ ముహూర్థంలో యాగం నిర్వహించి శ్రీవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన రథంలో ఉంచారు. ఉదయం 9.30 గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు మడుగు తేరును లాగారు. అనంతరం సాయంత్రం 3.30 నుంచి భక్తాదులు గోవిందా...చెన్నకేశవస్వామి, వెంకటేశ్వర నామస్మరణ చేస్తూ తాడిమర్రి ప్రధాన వీధులలో రథాన్ని లాగారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు కొబ్బరి కాయలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవంలో మోదుగులకుంట, శివంపల్లి, మద్దుల చెరువు. నిడిగల్లు, పిన్నదరి, ఆత్మకూరు, పుల్లా నారాయణపల్లి, పెద్దకోట్ల, తదితర గ్రామాలతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఆలయ కమిటీ కమిటీ సభ్యులు అన్నదానం ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవాలు -
వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు నేతలకు చోటు దక్కింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కమిటీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. నూతనంగా నియమితులైన పీఏబీ సభ్యులను ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రులు డాక్టర్ సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకర్ నారాయణ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ కమిటీలో ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. జిల్లా నుంచి గతంలో ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి ఈ స్థానంలో ఉండేవారు. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి అవకాశం కల్పించారు. వైభవం.. శ్రీగిరి రఽథోత్సవం పుట్టపర్తి టౌన్: పౌర్ణమిని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం శనివారం సాయంత్రం పట్టణంలో సత్యసాయి శ్రీగిరి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా అందంగా అలంకరించిన రథంలో సత్యసాయి చిత్రపటాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రశాంతి నిలయం ముఖద్వారం నుంచి రథాన్ని లాగుతూ ఊరేగింపుగా ప్రశాంతి నిలయం, విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి ,గణేష్ కూడలి, పెట్రోల్‌బంక్, చింతతోపు, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా తిరిగి ప్రశాంతి నిలయానికి చేర్చారు. ఉత్సవంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేపు పీజీఆర్ఎస్ రద్దు పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీ (సోమవారం) రద్దు చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. తల్లిని తిట్టి.. కొడుకును కొట్టి.. ● రేషన్ డీలర్ నిర్వాకంధర్మవరం రూరల్: రావులచెరువు గ్రామంలో నాగేంద్రమ్మ తన కుమారుడు కార్తీక్‌తో కలిసి శనివారం రేషన్ కోసం స్టోర్‌కు వెళ్లారు. బియ్యం అందరికీ వేసేశామని, ఇప్పుడు వస్తే ఎలా అంటూ డీలర్ చెన్నారెడ్డి తన తల్లి నాగేంద్రమ్మను బూతులు తిడుతూ... తన చెంపచెల్లుమనిపించాడని కార్తీక్ తెలిపాడు. రేషన్ సక్రమంగా వేసేదిపోయి.. కార్డుదారులపై దురుసుగా ప్రవర్తించడమేంటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
పేదలకు సేవ చేస్తే దేవునిగా కీర్తిస్తారు
బత్తలపల్లి: పేదల కోసం ఎవరైతే పాటుపడతారో వారిని గుండెల్లో పెట్టుకుని దేవునిలా కీర్తిస్తారని ఆర్డీటీ మహిళా సాధికారిత డైరెక్టర్ విశా ఫెర్రర్ అన్నారు. శనివారం మాల్యవంతం ఎస్సీ కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కాంస్య విగ్రహాన్ని విశా ఫెర్రర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరువు పీడిత ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అడుగుపెట్టినపుడు వెనక్కు వెళ్లిపోవాలని కొందరు అడ్డుపడ్డారన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు, వివిధ రంగాల్లో ప్రోత్సహించిన తీరును చూసి దేవుడని కొనియాడుతున్నారని గుర్తు చేశారు. మనం ఒకరికి సాయం చేయాలన్న ఆశయంతో ముందుకు వెళ్లారని, ఆయన బాటలోనే పలువురు ఈరోజు ముందుకు వస్తున్నారని తెలిపారు. మాల్యవంతంలో పలువురు ఆర్డీటీ సహకారంతో అభివృద్ధి సాధించారని వివరించారు. అలాంటి వారందరూ కలిసిమెలిసి ఉండి ఆర్డీటీ, ప్రభుత్వం అందించే పోత్రాహకాలను పొందుతూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అంతకు ముందు విశా ఫెర్రర్‌కు ఎస్సీ కాలనీ వాసులు ఘనస్వాగతం పలికారు. ఆర్డీటీ సహకారంతో ఉన్నత చదువులు చదివి బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న తమ పిల్లల తరఫున తల్లిదండ్రులు ఓబుళమ్మ, కుళ్లాయప్ప ‘స్పందించు– సాయం అందించు’ కార్యక్రమానికి రూ.50 వేలను విశా ఫెర్రర్‌కు అందించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ ప్రమీల, ఏటీఎల్ క్రిష్ణ, ఎస్టీఎల్ వెంకటేష్, కావేరి, మధు, సీఓ నాగరాజు, సీబీటీ వీరనారప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం
పుట్టపర్తి టౌన్: వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. చిన్న నిప్పు రవ్వ పడినా మంటలు వ్యాపిస్తాయి. ఆకతాయి చేష్టలకు, ఏమరపాటుకు గడ్డి వాములు, అడవులు దగ్ధమతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు తగ్గించి ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపక శాఖ మాక్‌డ్రిల్స్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. 14న అమరవీరులకు నివాళి, 15ప బహిరంగ ప్రదేశాలు, కూడళ్లు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు. 16న అపార్టుమెంట్లు, 17న విద్యాసంస్థలు, 18న గ్యాస్ గోడౌన్లు, ఆయిల్ ఫాంలు, 19న ఆస్పత్రుల్లో అవగాహన కల్పిస్తారు. 20న అన్ని వర్గాల ప్రజలకు ఫైర్ సేఫ్టీపై వర్క్‌షాప్ నిర్వహించి వారోత్సవాలు ముగిస్తారు. అందుబాటులో ఫైర్ సేవలు.. జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర అగ్నిమాపక కార్యాలయాలు ఉన్నాయి. ఆరుగురు ఫైర్ అధికారులతో పాటు జిల్లాలో 100 మంది సిబ్బంది, 24 మంది హోంగార్డులు ఉన్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన అడ్వాన్స్డ్ వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్, రెస్క్యూ ఫైర్ ఇంజిన్, ట్రూప్ క్వారియర్, ఫైర్ బుల్లెట్ బైక్, మిస్ట్ జీప్‌లు అందుబాటులో ఉన్నాయి. కాలం చెల్లిన ఇంజిన్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో ఒక అగ్నిమాపక అధికారి, ఇద్దరు సహాయక అధికారులు జిల్లా వ్యాప్తంగా వాహనాలను అగ్నిమాపక అధికారి కాని, సహాయక అధికారి గాని తనిఖీ చేస్తుంటారు. అప్రమత్తంగా ఉండాలని ప్రమాదాలు ఎదుర్కొవడానికి సిధ్ధంగా ఉండాలని అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలి.. చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాసులు వంటివి ఇవ్వకూడదు. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా దుప్పటి చుట్టుకోవాలి. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచకూడదు. మండుతున్న పొయ్యిపై వస్తువులను దూరం నుంచి అందుకోవాలని ప్రయత్నించకూడదు. మండుతున్న స్టవ్‌పై కిరోసిన్ పోయడం ప్రమాదకరం. చెడిపోయిన గ్యాస్ ట్యూబ్ స్థానంలో ఐఎస్ఐ మార్కుగల కొత్త ట్యూబ్ అమర్చాలి. రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన మాక్‌డ్రిల్స్‌కు అగ్నిమాపక శాఖ సర్వం సిద్ధం ప్రణాళికతోనే ప్రమాదాల నివారణ ఎండలు మండుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాలి. ప్రణాళికతో అగ్నిప్రమాదాలు నివారించవచ్చు. సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అగ్నిమాపక వారోత్సవాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. – హేమంత్‌రెడ్డి, డీఎఫ్ఓ -
కారు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● కుక్కను తప్పించే క్రమంలో ఘటన పరిగి: కారు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం మణూరు గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహ(28) కారు బాడుగకు నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. గత శుక్రవారం బెంగళూరుకు బాడుగ వెళ్లాడు. అక్కడి నుంచి విజయ్‌కుమార్, బాలచంద్ర అనే ఇద్దరు మిత్రులతో కలిసి మడకశిరకు తిరుగుపయనమయ్యాడు. శనివారం వేకువజామున మూడు గంటలు దాటాక పరిగి వద్దకు చేరుకున్నారు. మడకశిర వైపు వెళ్తుండగా ఉన్నపళంగా కుక్క అడ్డుగా రావడంతో దాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న నాగులకట్టను ఢీకొట్టి ఆ పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. లక్ష్మీనరసింహతో పాటు ఇద్దరు మిత్రులు గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లక్ష్మీనారాయణ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. కాగా లక్ష్మీనరసింహకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సస్పెండైన ఆర్ఐపై కేసు కదిరి అర్బన్: సోషల్ మీడియాలో మాటలు వక్రీకరించి పోస్టులు పెట్టి పోలీసులకు, ఇతరులకు మధ్య శాంతియుత వాతావరణం దెబ్బతినేలా చేస్తున్నాడని కానిస్టేబుల్ గోవర్దన్ ఫిర్యాదు మేరకు ఓడీసీలో సస్పెండైన ఆర్ఐ మున్వర్బాషాపై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు సీఐ నారాయణరెడ్డి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న మున్వర్‌బాషా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులతో మార్చి 24న పట్టణ పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో తనపై కేసులు పెట్టినవారంతా దొంగలే అంటూ కానిస్టేబుల్ గోవర్దన్, సీఐ నారాయణరెడ్డిని ఉద్దేశించి మీరు ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను అని బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం సోషల్ మీడియాలో వక్రీకరించిన మాటలతో పోస్ట్ పెట్టి పోలీసులు, ఇతరుల మధ్య శాంతియుత వాతావరణం దెబ్బతినేలా చేశారని పేర్కొన్నారు. వక్రీకరించిన వాయిస్‌ను వైరల్ చేస్తున్న వారందరికీ చట్ట ప్రకారం నోటీసులిచ్చి విచారణ చేస్తామని సీఐ తెలిపారు. వృద్ధునిపై పోక్సో కేసు ముదిగుబ్బ: మండల కేంద్రం ముదిగుబ్బలో ఓ వృద్ధునిపై పోక్సో కేసు నమోదైంది. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను వృద్ధుడు దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వృద్ధునిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వృద్ధునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ శివరాముడు తెలిపారు. -
పల్లె అనుచరులతో ప్రాణహాని
పుట్టపర్తి టౌన్: మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ దినపత్రిక పాత్రికేయుడు ఉద్దండం చంద్రశేఖర్ పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. పల్లెకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ ఆయన అనుచరుడు, టీడీపీ నల్లమాడ మండల నాయకుడు సలామ్ తనపై దాడులు చేస్తామని, ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ పంపిన వీడియోను పరిశీలించి, తనకు రక్షణ కల్పించాలని కోరారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆగడాల గురించి పత్రికలో ప్రచురిస్తున్నందుకు తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. వార్తలు రాయడం ఆపకపోతే నియోజకవర్గంలో తిరగకుండా చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పీఆర్ఓ సంతోష్‌రెడ్డి నుంచి కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా బెదిరింపు మెసేజీలు వచ్చాయని పేర్కొన్నారు. ఉద్దండం వెంట వచ్చిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బాబు, సాక్షి స్టాఫర్ రాజేష్, జర్నలిస్టులు మురళి, రమణ, సోముశేఖర్ తదితరులు ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పాత్రికేయుడు -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
తాడిమర్రి: మండల కేంద్రం తాడిమర్రిలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎనిమిది జతల వృషభాలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో అనంతపురం జిల్లా యాడికి మండలం యంగన్నగారిపల్లి వాసుదేవరెడ్డి వృషభాలు నిర్ణీత 20 నిమిషాల్లో 1,550 అడుగులు లాగి ప్రఽథమ స్థానంలో నిలిచాయి. సోమలదొడ్డి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు 1,500 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన నాగరాజు యాదవ్ వృషభాలు 1,250 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం విజేత వృషభాల యజమానులకు ప్రథమ బహుమతి కింద రూ.70వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు, తృతీయ బహుమతి కింద రూ.30 వేలుతో పాటు నాలుగో బహుమతి కింద రూ.20వేలు, ఊదో బహుమతి కింద రూ.10 వేలు చొప్పున అందజేశారు. ముదిగుబ్బ రూరల్ సీఐ శ్యామరావు, ఎస్ఐ క్రిష్ణవేణి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువ నాయకులు తాడిమర్రి మనోజ్‌రెడ్డి, చెన్నారెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, వైటీ చంద్రశేఖర్‌రెడ్డి, సాయినాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛను హరించలేవు ●
● చిలమత్తూరులో పాత్రికేయుల నిరసన చిలమత్తూరు: సాక్షి ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షతో బనాయించిన కేసు అక్రమమని పాత్రికేయులు మండిపడ్డారు. నిజాలను నిష్పక్షపాతంగా ప్రచురించే పత్రికలను అణచివేయాలని చూడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు పాత్రికేయులపై నమోదు చేసిన అక్రమ కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పత్రికా స్వేచ్ఛను హరించలేవన్నారు. ఉన్నవి ఉన్నట్టు రాస్తే ఇలా కేసులు బనాయించి ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ జగన్నాథ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల పాత్రికేయ సంఘం అధ్యక్షుడు గంగరాజు, ఆంజనేయులు(ఆంధ్రప్రభ), శంకర్ (ప్రజాశక్తి), సురేంద్రరెడ్డి( ది జర్నలిస్ట్) విశ్వనాథ్(బిగ్ టీవీ), నాగార్జున(కాకతీయ) నారాయణస్వామి( సూర్య న్యూస్), రామాంజనేయులు, వెంకటేష్(ఆర్టీఐ) తదితరులు పాల్గొన్నారు. -
పంగుణి ఉత్సవం..ఆధ్యాత్మిక సౌరభం
హిందూపురం: దశాబ్దాల క్రితం వచ్చి హిందూపురంలో స్థిరపడిన తమిళ, కేరళీయులు శుక్రవారం నిర్వహించిన పంగుణి ఉత్సవంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. తమ ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణేశ్వర స్వామి రథయాత్రను కేరళ, తమిళీయులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉత్తర ఫాల్గుణి నక్షత్రాన్ని పురస్కరించుకుని పళనీ క్షేత్రంలో సుబ్రహ్మణేశ్వరుడికి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తారు. అదేరోజు స్థానికంగా స్థిరపడిన తమిళ, కేరళీయులు కూడా పంగుణి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం బెంగళూరు రోడ్డులోని పళనీనగర్, ఇందిరానగర్‌లో స్థిరపడిన వారంతా పంగుణి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్ సుబ్రహ్మణేశ్వరస్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం 14 రోజులుగా సుబ్రహ్మణ్యస్వామి మాలధరించిన వారంతా దవడల్లో శూలాలు గుచ్చుకుని, శరీరానికి కొక్కేలు తగిలించుకుని పుర వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. మరికొందరు శరీరానికి గుచ్చుకున్న కొక్కేలతో విలక్కులు, ఆటోలను లాగారు. పళనీనగర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి బెంగళూరు రోడ్డు, చిన్నమార్కెట్, గాంధీ సర్కిల్, మెయిన్‌రోడ్డు గుండా పొట్టిశ్రీరాములు సర్కిల్, ఆర్పీజీటీ రోడ్డు, అంబేడ్కర్ సర్కిల్, మెయిన్ బజార్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వస్తున్న భక్తులు, ప్రజలకు దాతలు చల్లని నీరు, మజ్జిగ, పానీయాలు అందించారు. టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుల పూజలు.. సుబ్రమణేశ్వర షష్టి సందర్భంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి పార్టీ నేతలతో కలిసి బెంగళూరురోడ్డులోని సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. మాలాధారణ పూజల్లో పాల్గొన్నారు. వేణురెడ్డి వెంట పార్టీ నాయకులు మనోజ్, శివ, మురుగన్, భాస్కర్, నవీన్, హరి ఉన్నారు. -
క్వింటా ఎండుమిర్చి రూ.14 వేలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధర తగ్గింది. శుక్రవారం హిందూపురం మార్కెట్లో క్వింటా గరిష్టంగా రూ.14 వేలు మాత్రమే పలికింది. మార్కెట్‌కు 47.70 క్వింటాళ్ల మిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో క్వింటా ఎండు మిర్చి గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.12,600 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌కు వచ్చే సరుకు బాగా తగ్గుతున్నట్లు ఆయన వెల్లడించారు. జీవీఎస్ పాఠశాల ఘటనపై అధికారుల విచారణ ధర్మవరం: పట్టణంలోని జీవీఎస్ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులను ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టిన ఘటనపై శుక్రవారం ఎంఈఓలు రాజేశ్వరిదేవి, గోపాల్‌నాయక్ విచారణ చేపట్టారు. పాఠశాలకు వెళ్లిన వారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాన్ని విచారించారు. అనంతరం ఎంఈఓలు విలేకరులతో మాట్లాడారు. జీవీఎస్ పాఠశాలలో గతంలో జరిగిన ఘటనలు, తాజాగా విద్యార్థులను చెప్పుతో కొట్టిన ఘటనపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా విద్యాశాఖాధికారికి పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను కొట్టడం, తిట్టడం, లైంగిక వేధింపులకు గురిచేయడం విద్యా హక్కు చట్టం ప్రకారం నేరమన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎంఈఓలు హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేస్తాయి ప్రశాంతి నిలయం: నేడు రెండో శనివారం అయినప్పటికీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కార్యాలయాలు పనిచేస్తాయని జిల్లా రిజిస్టార్ కృష్టకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పని చేస్తాయన్నారు. ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. బడుగుల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే ● జయంతి వేడుకల్లో కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి టౌన్/ప్రశాంతి నిలయం: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావ్ పూలే ఆయా వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని కలెక్టర్ టీఎస్ చేతన్ కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పుట్టపర్తిలోని అబ్దుల్ కలాం షాదీమహల్‌లో జ్యోతిరావ్ పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమాధికారి నిర్మలాజ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ టీఎస్ చేతన్ ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమానత్వం కోసం, సామాజిక వివక్షపై పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్‌పూలే అన్నారు. విద్యా వికాసంతోనే వివక్ష నిర్మూలన సాధ్యమని నమ్మిన గొప్ప వ్యక్తి జ్యోతిరావ్ పూలే అన్నారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, ఎల్డీఎం రమణమూర్తి, కురుబ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, వాల్మీకి సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులుతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో వేడుకలు.. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంత వేడుకలు శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి కలెక్టర్ చేతన్, పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రత్న పూలే చిత్రపటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. -
ప్రజాస్వామ్యానికి ముప్పు
కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై హరిస్తోంది. నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తోంది. నిజంగా ఇది దారుణం. పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికే ముప్పు. ప్రజాస్వామ్యవాదులంతా ఇలాంటి చర్యలను ఖండించాలి. పాలకులు ఇప్పటికై నా మేల్కోవాలి. వెంటనే సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు మిగిలిన ఆరుగురు జర్నలిస్టులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలి. – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి -
ప్రతి ఒక్కరూ ఖండించాలి
కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. పల్నాడు జిల్లాలో ఓ వృద్ధుడు పింఛను తీసుకునేందుకు వస్తే టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతాన్ని సాక్షి పత్రిక ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించింది. దీన్ని ఓర్వలేక ఎడిటర్‌పై కేసు నమోదు చేయడం దారుణం. ఈ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం -
అక్రమ కేసులు సరికాదు
నిజాన్ని నిర్భయంగా వేలికి తీసే జర్నలిస్ట్‌లపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పాలకులే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గం. కూటమి నియంతృత్వ పాలనలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు భద్రత కరువైంది. ఇప్పటికై నా జర్నలిస్టులపై వేధింపులు, అక్రమ కేసులు ఆపాలి. లేకపోతే జర్నలిస్టులతో కలిసి ఈ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం. – ఉషశ్రీచరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ -
జర్నలిస్ట్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
● పెనుకొండలో జర్నలిస్టుల డిమాండ్ పెనుకొండ రూరల్: ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పెనుకొండ జర్నలిస్ట్‌లు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం పెనుకొండలోని పలువురు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ గిరిధర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో జరిగిన ఓ హత్యకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలతో ‘సాక్షి’ వార్త ప్రచురించిందన్నారు. దీన్ని సహించలేని టీడీపీ నేతలు జర్నలిస్టులపై కేసులు పెట్టారన్నారు. ఇది ముమ్మాటికీ పత్రికాస్వేచ్ఛపై దాడేనన్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాక్షి జర్నలిస్టులు మల్లికార్జున, గోవిందు, జాకీర్, మురళీ (సాక్షి టీవీ), రామకృష్ణ (వార్త), ఆదినారాయణ (విశాలాంధ్ర), రామాంజి (సీమవార్త), హరి (రాజ్ న్యూస్), ఉదయ భాను (హెచ్ఎం టీవి), మహేష్ (ఆర్టీవీ) తదితరులు పాల్గొన్నారు. -
బీసీల ద్రోహి చంద్రబాబు
పరిగి: ‘‘ఓట్ల కోసం బీసీ జపం చేసే చంద్రబాబు, కూటమి పార్టీల్లోని నేతలు ఏనాడూ బీసీల అభ్యున్నతికి కృషి చేయలేదు. పైగా బీసీలను అణగదొక్కేందుకు, అంతంచేందుకు ప్రయత్నించారు. కానీ బీసీలంటే ఎనలేని ప్రేమ చూపే జగనన్న బీసీ అంటే బ్యాక్‌బోన్ క్యాస్ట్ అని చెప్పడంతో పాటు తన హయాంలో పదవులిచ్చి పాలనలో భాగస్వామ్యం చేశారు. రాష్ట్రంలో బీసీ పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నే. అందుకే కురుబ లింగమయ్య హత్యతో ఆయన చలించిపోయారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. ఇలా చేయగలిగిన కూటమి నేత ఎవరైనా ఉన్నారా..కనీసం బీసీ మంత్రిగా ఉన్న సవిత అయినా ఆ కుటుంబాన్ని పరామర్శించరా’’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. శుక్రవారం ఆమె మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల చేతిలో గాయపడి మృతి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని కూటమి పార్టీల్లోని ఒక్క బీసీ ప్రజాప్రతినిధి అయినా కనీసం పరామర్శించారా.. అని ప్రశ్నించారు. పైగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు తామంతా బాధిత కుటుంబానికి అండగా నిలిబడితే దాన్ని కూడా తప్పుపడుతూ విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పార్టీల నేతలకు బీసీలపై ఉన్న ప్రేమకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. బీసీ మంత్రిగా ఉన్న కురుబ సామాజిక వర్గానికి చెందిన సవితకు హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించే తీరక లేదా అని ప్రశ్నించారు. ఎంపీపీ పదవి కోసం దిగజారి రాజకీయం రామగిరి ఎంపీపీ ఎన్నికలోనూ కూటమి నాయకులు దిగజారి రాజకీయం చేశారన్నారు. వైఎస్సార్సీపీ తరఫున 9 మంది గెలిస్తే ఒక్క ఎంపీటీసీతో ఎంపీపీ సీటు కైవసం చేసుకునేందుకు మంత్రి సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వ్యవహరించిన తీరు చూసి సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రామగిరి ఎస్ఐ సుధాకర్‌యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గమనించి మసలుకోవాలని సూచించారు. తమ స్థాయి గుర్తించి మాట్లాడితే అందరికీ మంచిదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి పాల్గొన్నారు. లింగమయ్య మృతిపై నేటికీ స్పందించక పోవడం దుర్మార్గం బాధిత కుటుంబాన్ని జగనన్న పరామర్శించినా తట్టుకోలేకపోతున్నారు లింగమయ్య హత్యను కూటమి పార్టీల్లోని బీసీ నేతలూ ఖండించాలి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
సందర్భం : నేటి నుంచి చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు
అమడగూరు: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద ఉత్సవాలకు పేరొందిన అమడగూరు చౌడేశ్వరీ దేవి ఉత్సవాలకు వేళైంది. దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితం అమరావతిగా పిలువబడిన అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఏటా ఛైత్ర మాసంలో ఆలయ కమిటీ సభ్యులు, అమడగూరు, చీకిరేవులపల్లి, గుండువారిపల్లి గ్రామ పంచాయతీ ప్రజల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలను 8 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా నుంచే కాక.. ఏపీలోని పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అమ్మవారి ఉత్సవాల వివరాలు.. ఏటా ఛైత్ర మాసంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారిని 16 గ్రామాల ఊరేగింపునకు తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత వచ్చే పున్నమితో ఎప్పటి లాగానే సంప్రదాయ బద్ధంగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాలు ఈ ఏడాది కూడా శనివారంతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల వివరాలను ఆలయ ధర్మకర్త, మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి వెల్లడించారు. 12న కుంభకూడు, 13న ఊయల సేవ, 14న సూర్యప్రభ, 15న చంద్రప్రభ, 16న శ్రీజ్యోతి ఉత్సవం, 17న అశ్వ వాహనం, 18న సింహ వాహనం, 19న హంస వాహన సేవలు ఉంటాయి. ఉత్సవాలకే తలమానికంగా.. అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 16న నిర్వహించే శ్రీజ్యోతి ఉత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఉత్సవాన్ని ఏటా కొత్తపల్లికి చెందిన దంపతులు మాజీ జెడ్పీటీసీలు పొట్టా పురుషోత్తమరెడ్డి, ఉమాదేవి కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు 4 రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఆ రోజు ఉట్టి వద్ద నుంచి తీసుకొచ్చే జ్యోతి దర్శనంతో సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు కాలక్షేపానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చౌడేశ్వరీదేవి 16న శ్రీజ్యోతి ఉత్సవం భక్తుల కోర్కెలు తీరుతాయి నమ్మకంతో అమడగూరు చౌడేశ్వరమ్మతో కొలిచే భక్తుల కోర్కెలు తీరుతాయి. ఇందుకు ఎన్నో ఘటనలు ఉన్నాయి. కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడి అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. గత మూడేళ్లుగా ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశాం. ముఖ్యంగా దాతల చేయూత, కమిటీ సభ్యుల సహకారం మరువలేం. త్వరలో ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులు కూడా పూర్తి చేస్తాం. భక్తుల స్నానమాచరించడానికి కోనేరు నిర్మాణం, విశ్రాంత గదులు, పార్కింగ్ సౌకర్యం తొందర్లోనే ఏర్పాటు చేయనున్నాం. – పొట్టా పురుషోత్తమరెడ్డి, ఆలయ ధర్మకర్త -
కలల సాకారానికి తొలిమెట్టు.. ఈ–సెట్
అనంతపురం: ఉన్నత కలలకు ఏపీ ఈ–సెట్ తొలిమెట్టుగా నిలుస్తోంది. పేరెన్నికగల కళాశాలల్లో బీటెక్, బీఈ పూర్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అదే ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ద్వారా గణనీయమైన ర్యాంకు సాధిస్తే ఈ కలను సాకారం చేసుకోవచ్చు. అయితే ఈఏపీసెట్‌కు పోటీ అధికంగా ఉంటుంది. కానీ, మంచి కళాశాలల్లో ఇంజినీరింగ్ సీటు దక్కించుకునేందుకు ఏపీ ఈ–సెట్ మరో చక్కటి మార్గం. ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈ–సెట్)లో సత్తా చాటితే నేరుగా బీటెక్ సెకండియర్‌లో అడ్మిషన్ పొందవచ్చు. డిప్లొమా పూర్తి చేసిన వారు, బీఎస్సీ(మేథమేటిక్స్) పూర్తి చేసినవారు ఇందుకు అర్హులు. ఫార్మసీ కోర్సుల్లో సైతం అడ్మిషన్లు పొందడానికి ఈ–సెట్ దోహదపడుతుంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనూ సీట్లు దక్కించుకోవచ్చు. మొత్తం సీట్లలో 10 శాతం ఈ–సెట్ ర్యాంకర్లకు కేటాయిస్తున్నారు. దీంతో ఈ–సెట్ అనేది డిప్లొమా విద్యార్థులకు వరంలా మారింది. క్రేజీ కంప్యూటర్ సైన్సెస్.. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్సెస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే ఏపీఈఏపీ సెట్లో గణనీయమైన ర్యాంక్‌ను సాధించాల్సి ఉంటుంది. అదే డిప్లొమో కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేసిన వారు ఈ–సెట్ ద్వారా మంచి కళాశాలల్లో కంప్యూటర్ సైన్సెస్ కోర్సు దక్కించుకోవచ్చు. గతేడాది కంటే ఈ ఏడాది ఈ–సెట్ కంప్యూటర్ సైన్సెస్ బ్రాంచ్‌కు దరఖాస్తులు పెరగడమే ఇందుకు కారణం. లేటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం.. ఇంజినీరింగ్ కోర్సులో లేటర్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలోకి అడ్మిషన్ పొందడానికి అవకాశం కల్పిస్తూ నిర్వహిస్తున్న ఏపీ ఈ–సెట్–2025కు భారీగా దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మొత్తం 33,454 మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగానికి–143, బీఎస్సీ(మేథమేటిక్స్) –41, సిరామిక్ టెక్నాలజీ–3, కెమికల్ ఇంజినీరింగ్ –290, సివిల్ ఇంజినీరింగ్ –2,874, కంప్యూటర్ సైన్సెస్–10,639, ఈఈఈ–5492, ఈసీఈ–9,024, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ –54, మెకానికల్ ఇంజినీరింగ్ –4,424, మెటలార్జీ –97, మైనింగ్–66, ఫార్మసీ విభాగానికి –307 చొప్పున మొత్తం 33,454 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు గడువును మరింత పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ నెల 12వ తేదీ వరకు రూ.వెయ్యి అపరాధ రుసంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 17వ తేదీ వరకు రూ.2వేలు, 24వ తేదీ వరకు రూ.4వేలు, 28వ తేదీ వరకు రూ.10 వేల అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 6వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూకు అవకాశం.. ఏపీ ఈ–సెట్‌ను ఇప్పటి వరకూ 8 దఫాలుగా నిర్వహించే అవకాశం జేఎన్టీయూ (ఏ)కు దక్కింది. 2015 నుంచి 2020 వరకు ఏపీ ఈసెట్‌ను రాష్ట్ర కన్వీనర్‌గా ప్రొఫెసర్ పీఆర్ భానుమర్తి , 2021లో ప్రొఫెసర్ సి. శశిధర్, 2024లో ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్‌ను ఈసెట్ కన్వీనర్‌గా నియమించారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్లోకి అడ్మిషన్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు సువర్ణ అవకాశం జేఎన్టీయూ(ఏ) ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ నిర్వహణ -
తల్లిదండ్రులకు విద్యార్థుల అప్పగింత
ధర్మవరం అర్బన్: సరదాగా రైలు ఎక్కిన తప్పిపోయిన ఇద్దరు విద్యార్థుల ఆచూకీని పోలీసులు గుర్తించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చారు. వివరాలు.. ధర్మవరంలోని కొత్తపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జస్వంత్, విజయ్‌కుమార్ గురువారం స్థానిక రైల్వే స్టేషన్లో సరదాగా రైలు ఎక్కిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు ఎక్కిన సమయంలో రైలు ముందుకు కదలడంతో వారు కిందకు దిగలేకపోయారు. పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన రెండో పట్టణ సీఐ రెడ్డప్ప.. చొరవ తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు రైల్వే స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించిన ధర్మవరం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పిలుచుకొచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రమాదంలో వ్యక్తి మృతి పావగడ: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. వివరాలు... పావగడ తాలూకా నాగలమడక హోబళి గ్యాదికుంటె గ్రామానికి చెందిన బాబు (45)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం వ్యక్తిగత పనిపై పొరుగున ఉన్న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలానికి వెళ్లాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన అదే మండలం తిమ్మాపురం–కొండాపురం గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
జగన్‌ను విమర్శించే స్థాయి నీకెక్కడిది?
ఉరవకొండ: జనంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌కు లేదని శాసనమండలి ప్రివిలైజ్ కమిటీ చైర్మెన్/ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీకి తొత్తులుగా మారిన కొందరు పోలీసులను ఉద్దేశించి తప్పు చేసిన పోలీసులైన చట్టం ముందు సమానమేనని, వారి యూనిఫాం తీసేయిస్తామని వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తే... దానిని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలుగా చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌కు పటిష్ట భద్రతను అప్పటి సీఎం వైఎస్ జగన్ కల్పించారని గుర్తు చేశారు. ఈ అంశంపై అప్పట్లో ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా భద్రతా వైపల్యం కనిపిస్తోందన్నారు. వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనలో 1,100 మంది పోలీసులను, 200 మందిని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంటూ భద్రతా వైపల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేవలం అభిమానులను, కార్యకర్తలను ఆపడానికి పోలీసులను మోహరించారు కానీ, మాజీ సీఎం భద్రతకు కాదనే విషయం క్షేత్ర స్థాయిలో బట్టబయలైందన్నారు. వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏ పార్టీలోనైనా మహిళల వ్యక్తిత్వాన్ని తప్పు పట్టేలావ్యాఖ్యలు చేయడం తగదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్‌పై ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మండిపాటు తప్పు చేస్తే పోలీసులైనా చట్టం ముందు సమానమే నేర నిరూపణ అయితే యూనిఫాం తీసేసి శిక్ష అనుభవించాల్సిందే -
రేపటి నుంచి కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు
రొళ్ల: మండలంలోని రత్నగిరి గ్రామంలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న (ఆదివారం) సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రత్నగిరి సంస్థాన రాజవంశీకుడు దొర రంగప్పరాజు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి మూల విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహానికి అంకురార్పణ, కుంకుమార్చన, అభిషేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపండితుల సమక్షంలో గణపతి పూజ చేసి కలశ స్థాపనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు. అదే రోజు రాత్రి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల గుండా ఊరేగించి మధ్య రాత్రి అక్కడి నుంచి సమీపంలోని పాలబావి వద్దకు మేళతాళాలతో తీసుకెళ్లి గంగాజలంతో శుద్ధి చేసి పట్టువస్త్రాలు, గాజులు, వడి బియ్యం సమర్పించి, పూలు, పండ్లు నివేదించిన అనంతరం హారతి ఇచ్చి నైవేధ్యంగా బావిలోకి సమర్పిస్తామన్నారు. 13న జలధి ఉత్సవం, కలశస్థాపన, 14న బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 15న జలధి, కలశ ఉత్సవం, గంగపూజ, 16 నుంచి 19వ తేదీ వరకు జ్యోతుల ఉత్సవాలు, 20న అమ్మవారికి పుష్పాలంకారణ, పోతులరాజుల విశేష పూజ, 21న పోతులరాజు బండారు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఒకే ఇంట్లో రెండు గిన్నిస్ రికార్డులు ధర్మవరం: స్థానిక రాజేంద్రనగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు సోమిశెట్టి రమేష్‌బాబు, శ్యామల కుమార్తెలు కావ్య, ప్రణతి లక్ష్మికు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. జాతీయ సాంస్కృతిక శాఖ, కేంద్ర సంగీత నాటక అకాడమి సంయుక్తంగా ఈ ఏడాది జనవరి 24న న్యూఢిల్లీలో నిర్వహించిన విభిన్న రాష్ట్రాల్లోని 53 జానపద కళారూపాల ప్రదర్శనలో 5,194 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ తరపున వీరిద్దరూ ప్రదర్శించిన జానపద నృత్యాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేశారు. దీంతో వీరి పేర్లతో నమోదైన సర్టిఫికెట్లు శుక్రవారం అందడంతో అక్కాచెల్లెలు సంతోషం వ్యక్తం చేశారు. కంది పంట రాబడిని అపహరించిన సైబర్ నేరగాళ్లు బెళుగుప్ప: ఆరుగాలం శ్రమించి సాధించిన కంది పంట రాబడిని సైబర్ నేరగాళ్లు అపహరించారు. వివరాలు. బెళుగుప్పకు చెంది మహిళా రైతు నిర్మలమ్మ తనకున్న పొలంలో కంది పంట సాగు చేశారు. ఈ క్రమంలో పంట చేతికి రాగా, మార్కెట్లో విక్రయించగా వచ్చిన రూ.1.34 లక్షలను స్థానిక ఎస్బీఐ శాఖలోని తన ఖాతాలో జమ చేశారు. ఈ నెల 9న అర్థరాత్రి వరుసగా మూడు మెసేజ్‌లు రావడంతో ఆమె పరిశీలించారు. రూ.24,500, రూ.24,960, రూ.50వేలు చొప్పున మొత్తం రూ.99,460 నగదు విత్‌డ్రా అయినట్లుగా తెలుసుకున్న ఆమె కంగుతిని, మరుసటి రోజు ఉదయమే బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీశారు. ఖాతాలో లావాదేవీలను పరిశీలించిన బ్యాంక్ అధికారులు... న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోని ఓ ఖాతాకు బదిలీ అయినట్లు తెలిపారు. ఇది సైబర్ నేరగాళ్ల పనిగా నిర్ధారించడంతో శుక్రవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. వ్యక్తి మృతదేహం లభ్యం నల్లచెరువు: మండలంలోని నడింపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గ్రామ శివారులోని పాడుపడిన బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికి తీయించారు. దాదాపు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బెల్లపు ఊట ధ్వంసం వజ్రకరూరు: మండలంలోని బోడిసానిపల్లి తండాలో 150 లీటర్ల బెల్లపు ఊటను శుక్రవారం ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శివసాగర్ తెలిపారు. గోపాల్‌నాయక్, శంకర్‌నాయక్‌పై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 13న రెడ్డి వివాహ పరిచయ వేదిక రాప్తాడురూరల్: రాయలసీమ రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో ఈనెల 13న ఉచితంగా రెడ్డి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకుడు రొద్దం సురేష్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, కార్యదర్శి దుబ్బా కిషోర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం రూరల్ పాపంపేటలోని సంఘం కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరిచయ వేదిక జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలకు వివాహాలు చేయాలనుకునే రెడ్డి కులస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువతీ, యువకుల బయోడేటాలు తీసుకురావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94415 75641, 93902 84296, 94907 67224 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఉద్యాన రైతులూ అప్రమత్తంగా ఉండండి
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, పెను గాలులు, వడగండ్లు, అకాల వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని రెండు జిల్లాల ఉద్యానశాఖ అధికారులు జి.చంద్రశేఖర్, జి.ఫిరోజ్‌ఖాన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా పంట చేతికివచ్చే సమయం కావడంతో చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అరటి, బొప్పాయి పంటలు నేలవాలకుండా సరైన పోట్లు ఏర్పాటు చేసుకుంటే నష్ట తీవ్రత బాగా తగ్గుతుందని తెలిపారు. తోట చుట్టూ వెలుపలి ప్రాంతంలో నీటి తడి ఇస్తే సుడిగాలి తీవ్రత బాగా తగ్గిపోతుందన్నారు. పెను గాలులకు దెబ్బతిన్న తోటల్లో వెంటనే కాయలు, గెలలు తొలగించి, కొమ్మలను బయట పడేయాలన్నారు. చీడపీడల బారి నుంచి రక్షించుకునేందుకు లీటర్ నీటికి 2.5 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలన్నారు. నిల్వ ఉన్న వర్షపు నీరు ఆవిరైన తర్వాత పైపాటుగా ఎకరాకు 10 కిలోల యూరియా చల్లుకోవాలన్నారు. తోటల చుట్టూ అవిశె, సుబాబుల్ లాంటి రక్షణ పంటలు వేసుకుంటే పెనుగాలుల బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చన్నారు. అవకాశం ఉన్న రైతులు కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే వేసవి సమస్యల నుంచి గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి
ప్రశాంతి నిలయం: ప్రజలకు పాదర్శకంగా సేవలు అందిస్తూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ సేవలపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, సర్వే అధికారులలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్, రెవెన్యూ అంశాలు, రీ సర్వే, ఆర్ఓఆర్ కేసుల నమోదు, వాటి పరిష్కారం, మ్యుటేషన్ ఆడిట్, అసైన్మెంట్ భూముల సమస్యలు, సర్వేయర్ల శిక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే దరఖాస్తులు గడువులోపు నాణ్యతగా పరిష్కరించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ సమస్యలను నాణ్యతగా పరిష్కారం చేయాలని, రీ సర్వే ప్రక్రియలో పురోగతి సాధించాలన్నారు. పీ–4 సర్వేకి సంబంధించిన పనులను మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, ప్రీ హోల్డ్ రెండో విడత రీసర్వే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈనెల 15 నుంచి జిల్లాలో రీ సర్వే రెండో విడత ప్రారంభించాలని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ ఆర్డీఓలు సువర్ణ, మహేష్, శర్మ, ఆనంద్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ జిల్లా అధికారి విజయశాంతి బాయి, జిల్లాలోని 32 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
కిడ్నీ బాధితుడికి ఆర్థికసాయం
ధర్మవరం అర్బన్: స్థానిక మహాత్మాగాంధీ కాలనీలో నివాసముంటున్న కిడ్నీ బాధితుడు మల్లిపోగుల శ్రీనివాసులు చికిత్సకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భరోసానిచ్చారు. రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన శ్రీనివాసులు దుస్థితిపై ఈ నెల 10న ‘తండ్రి కోసం తనయ పోరాటం’ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం తెలిసిందే. దీనిపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఆయన ఆదేశాలతో బీజీపీ నియోజకవర్గ నేత హరీష్‌బాబు శుక్రవారం బాధితుడు శ్రీనివాసులును కలసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం బాధితుడికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని బీజేపీ నాయకులు కృష్ణాపురం జమీర్, షాన్షా అందజేశారు. మరికొందరు బీజేపీ నాయకులు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలోనైనా శ్రీనివాసులుకు వైద్యం చేయిస్తామని హరీష్‌బాబు హామీనిచ్చారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గీతామాధురి, లక్ష్మీప్రసన్న, చిగురుపాటి లక్ష్మి, పట్టణ అధ్యక్షుడు జింకా చంద్రశేఖర్, బిల్లే శ్రీనివాసులు, పోతుకుంట రాజు, కుంచపు నారప్ప, పెద్ద లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిలకడగా చింతపండు ధర
హిందూపురం అర్బన్: చింతపండు ధర మార్కెట్లో నిలకడగా కొనసాగుతోంది. గురువారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 1,000 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలంపాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.14 వేలు పలికింది. ఇక ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.14,500, కనిష్టంగా రూ.4,300, సరాసరిన రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. అంధుల స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని సేవామందిరంలో ఉన్న ప్రభుత్వ బాల బాలికల అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికిగానూ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకూ ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అన్ని తరగతులకు పాఠశాలలో 150 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ప్రస్తుతం 58 మంది విద్యార్థులు ఉండగా మిగిలిన 98 ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసున్న విద్యార్థులంతా ఆయా తరగతుల్లోకి అర్హత ఆధారంగా ప్రవేశానికి అర్హులన్నారు. ముఖ్యంగా 40 శాతం అంధత్వం కలిగి వైద్యులచే ధ్రువీకరించబడిన సర్టిఫికెట్ పొందిన వారు మాత్రమే ప్రవేశానికి అర్హులని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 80088 89815, 81434 61585, 94900 71392, 94907 37661, 80081 71524 సెల్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభంగోరంట్ల: స్థానిక నాల్గవ వార్డులోని సచివాయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రారంభించారు. మహిళలు కుట్టు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు గోరంట్లలోని చౌడేశ్వరీ కాలనీలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నూతన బోరుబావి తవ్వేందుకు రింగ్ ఏర్పాటు చేయగా మంత్రి సవిత అక్కడ పూజ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మారుతీప్రసాద్, ఎంపీడీఓ నరేంద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పరిసరాల శుభ్రతే లక్ష్యం నల్లచెరువు: పంచాయతీ అధికారులు పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి సమత పేర్కొన్నారు. మండల పరిధిలో అల్లుగుండు, నల్లచెరువు పంచాయతీల్లోని చెత్త సంపద కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో తయారయ్యే వర్మీ కంపోస్టు, విడి విడిగా సేకరించిన పలు రకాల చెత్తలను పరిశీలించారు. అలాగే మండల పరిషత్ కార్యలయంలో తనకల్లు, నల్లచెరువు పంచాయతీ కార్యదర్శులతో పరిశుభ్రత– పారిశుధ్యంపై సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్మికులు ప్రతి ఇంటికీ వెళ్లి తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. పంచాయతీ అధికారులు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్ట సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ అంజనప్ప, ఎంపీడీఓ రఘునాథ గుప్తా, ఈఓఆర్డీ శకుంతల, సర్పంచ్ పంచరత్నమ్మ, పంచాయతీ కార్యదర్శులు నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిని పరిశీలించిన కాయకల్ప బృందం
హిందూపురం టౌన్: పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని కాయకల్ప బృందం గురువారం పరిశీలించింది. విజయవాడ నుంచి కాయకల్ప బృందం డాక్టర్లు రామారావు, నరేష్, క్వాలిటీ కంట్రోలర్ సుబ్రహ్మణ్యం పాల్గొని ఆస్పత్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏటా కాయకల్ప అవార్డు అందిస్తుంది. ఇంటర్నల్ అసెస్మెంట్లో భాగంగా బృందం సభ్యులు ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి స్వచ్ఛత, సదుపాయాలు, బయోమెడికల్ వేస్టేజ్, ల్యాబ్, మందుల నిర్వహణ, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, బెడ్స్ నిర్వహణ, వార్డులో రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాలను మెరుగుపరుచుకవాలని బృందం సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. -
తల్లీ బిడ్డల క్షేమమే ముఖ్యం
పుట్టపర్తి అర్బన్: గర్భిణులకు తల్లీ బిడ్డల సంరక్షణపై పూర్తి అవగాహన కల్పించివారి పరిరక్షణకు తోడ్పాటు అందించాలని డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం ఆదేశించారు. మాతా శిశు మరణాలకు సంబంధించి జిల్లా స్థాయి సబ్ కమిటీ మీటింగ్‌ను గురువారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్ఓ జిల్లాలో మార్చి నెలలో శిశు మరణాలు 3, ఒక మాతృ మరణం సంభవించాయన్నారు. ప్రతి నెలా జరిగే రివ్యూ ద్వారా సిబ్బంది అవగాహన పెంచుకోవాలని తద్వారా గర్భిణీలకు అవగాహన పెంచవచ్చన్నారు. గర్భిణులకు ప్రతి నెలా 9న జరిగే శిక్షణలో అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణుల గ్రూపును తయారు చేసి ఆరోగ్య విద్యను అందించాలన్నారు. ఏ తల్లీ .. బిడ్డకు జన్మనిస్తూ చనిపోకూడదని, ఏ బిడ్డ జన్మిస్తూ చనిపోరాదన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ తిప్పేంద్రనాయక్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు మంజువాణి, సెల్వియాసాల్మన్, నాగేంద్రనాయక్, వైద్యులు సునీల్, శ్రీలత, నీరజ, కార్తీక్, ఐసీడీఎస్ పీడీ శారద , డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, 108 ఈఓ అబ్దుల్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. -
మడకశిరలో దాహం.. దాహం
గుడిబండ: మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఏదో ఒక చోట రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గుడిబండ మండల పరిధిలోని బూదిపల్లి తండా గ్రామ ప్రజలు గురువారం రాస్తారోకో చేపట్టారు. జంబులబండ పంచాయతీ బూదిపల్లి తండాలో సుమారు 28 కుటుంబాలు నివసిస్తున్నాయి. కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో మడకశిర – అమరాపురం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జంబులబండ పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో చర్చించారు. తాగునీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా నియోకవర్గ వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో తాగునీటి సమస్య కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నా సమస్యను పరిష్కరించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రోజూ ఏదో ఒక చోట నీటి కోసం రోడ్డెక్కుతున్న జనం పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
మద్యం డిపో ప్రారంభం
గోరంట్ల: మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన మద్యం డిపో (ఐఎంఎఫ్ఎల్)ను గురువారం రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్‌కుమార్‌మీనా, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ డైరెక్టర్ నిశాంత్‌కుమార్, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి పుట్టపర్తి అర్బన్: ప్రతి మహిళా కొంత సొమ్మును పొదుపు చేయడం ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఎల్డీఎం రమణకుమార్ పేర్కొన్నారు. పుట్టపర్తి వెలుగు కార్యాలయంలో ఆదర్శ రూరల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే బ్యాంకులు అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సేవింగ్స్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు, రెకరింగ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లు , ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులో ఉందన్నారు. ప్రతి మహిళా కొంత సొమ్మును పొదుపు చేస్తే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, ఆదర్శ సంస్థ అధ్యక్షురాలు లక్ష్మీదేవి, కార్యదర్శి శివానంద, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
సక్రమంగా పనిచేసినా తప్పేనా?
● ఓ అసిస్టెంట్‌కు.. మెడికల్ ఆఫీసర్లకు తగాదా ● కలెక్టర్, హెల్త్ కమిషనర్‌కు వద్దకు చేరిన పంచాయితీ ● అసిస్టెంట్‌ను తీసేయాలని మంత్రి సత్యకుమార్‌కు మెడికల్ ఆఫీసర్ల వినతి సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో వైద్యారోగ్యశాఖ పరువు బజారు పడుతోంది. జిల్లా అధికారిని ఓవర్టేక్ చేస్తూ వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది మంత్రిని కలవడం, డీహెచ్‌కు మెయిల్ ద్వారా సమాచారం చేరవేయండం, హెల్త్ కమిషనర్ వద్ద పంచాయితీ పెట్టడం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయాయి. అయితే పంచాయితీ ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో అధికారులు – సిబ్బంది మధ్య అనారోగ్యకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్యశాఖ పంచాయితీ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అందరి నోటా చర్చకు దారి తీసింది. వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లకుండా.. మెయిల్స్ ద్వారా విజయవాడకు సమాచారం చేరవేయడం కలకలం రేపింది. ఫలితంగా వైద్య – ఆరోగ్య శాఖలో పలు లోపాలు బహిర్గతం అయ్యాయి. గొడవకు కారణం ఇదేనా? కర్ణాటక సరిహద్దున ఉన్న కొన్ని పీహెచ్‌సీల్లో పని చేసే మెడికల్ ఆఫీసర్లు ప్రైవేటు క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్) పలు లొకేషన్ల నుంచి వేయడం సమస్యగా మారి కోల్డ్‌వార్‌కు దారి తీసింది. నిబంధనల ప్రకారం పనిచేసే చోట నుంచే బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సి ఉంది. దీని వల్ల వారు పనిచేస్తున్న ప్రాంతంతో పాటు ఎన్నిగంటలకు విధులకు వస్తున్నారో కూడా సులువుగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే పీహెచ్సీ పరిధి నుంచి ఎఫ్ఆర్ఎస్ ఉంటేనే అప్రూవ్ చేస్తానని జిల్లా కేంద్రంలో ఉండే సీనియర్ అసిస్టెంట్ వాదించడాన్ని మెడికల్ ఆఫీసర్లు తప్పుబడుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ స్థాయి మరచి మాట్లాడుతున్నారని మాటల యుద్ధం మొదలుపెట్టారు. ఆ తర్వాత పదే పదే సమస్య ఉత్పన్నం కావడంతో రెండు నెలల క్రితం ఎఫ్ఆర్ఎస్ విధుల నుంచి సదరు సీనియర్ అసిస్టెంట్‌ను తప్పించారు. అయితే ఆ సీనియర్ అసిస్టెంట్‌ను జిల్లా నుంచి బదిలీ చేయించాలని కొత్తగా యూనియన్ ఏర్పాటు చేసిన సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గుర్తింపు లేని యూనియన్‌తో.. ఉద్యోగ సంఘాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి గుర్తింపు లేని ఓ యూనియన్ను ఏర్పాటు చేసుకుని.. తాము సిబ్బంది తరఫున పోరాటం చేస్తున్నామని ఆ యూనియన్ సభ్యులు చెబుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలి బాగాలేదని అంటున్నారు. ఆరు పీహెచ్‌సీల్లో ఏర్పడిన సమస్యపై ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు లీడ్ తీసుకుని.. సదరు సీనియర్ అసిస్టెంట్‌ను బదిలీ చేయించాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆ సీనియర్ అసిస్టెంట్ కదలికలపై దృష్టి సారించి.. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో వాట్సాప్ స్టేటస్‌లోని విషయాలను కూడా ఫిర్యాదులో పేర్కొనడం విశేషం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్యశాఖలో సిబ్బంది మధ్య అనారోగ్య వాతావరణం ఏర్పడింది. కొరవడిన సమన్వయంతో ఉద్యోగుల మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. ఆఖరికి వీరి పంచాయితీ బెజవాడ వరకూ వెళ్లింది. తప్పు వారిదేనని ఒకరు.. కాదు ఆయనదేనని వారందరూ వాదిస్తున్నారు. విచారణ చేస్తున్నాం నేను వాట్సాప్‌లో నాకు ఇష్టం వచ్చినట్లు స్టేటస్ పెట్టుకుంటా. ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? సమాజానికి ఇబ్బంది కలిగేలా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. డ్యూటీలో భాగంగా నేను చేయాల్సిన పని చేస్తున్నా. పీహెచ్సీలలో ఎఫ్ఆర్ఎస్లు మాత్రమే అనుమతించాలనే నిబంధన ఉంది. ఆ మేరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎఫ్ఆర్ఎస్లను తిరస్కరించా. ఉన్నతాధికారుల సూచన మేరకు నా డ్యూటీ నేను చేస్తున్నాను. అవతలి వాళ్ల తప్పిదాలను కప్పిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేయిస్తే తప్పొప్పులు తేలతాయి. – సీనియర్ అసిస్టెంట్, పుట్టపర్తి ప్రభుత్వ జీతం.. ప్రైవేటు వైద్యం.. మెడికల్ ఆఫీసర్లకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడే.. సీనియర్ అసిస్టెంట్‌ను తక్షణమే బదిలీ చేయాలంటూ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు గుర్తింపు పొందని ఓ యూనియన్ తరఫున పోరాటం మొదలుపెట్టారు. వివరాలపై ఆరా తీస్తే ఆ మెడికల్ ఆఫీసర్లు అందరూ ప్రైవేటు క్లినిక్లకే పరిమితం అవుతున్నట్లు తెలిసింది. హిందూపురం కేంద్రంగా ప్రైవేటు వైద్య వ్యాపారం మొదలుపెట్టి.. పీహెచ్‌సీలకు డుమ్మా కొడుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో తమ అనధికారిక డ్యూటీలను బయటపెట్టిన సీనియర్ అసిస్టెంట్‌ను తీసేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. మెడికల్ ఆఫీసర్లు, సీనియర్ అసిస్టెంట్ మధ్య ఉన్న సమస్య నా దృష్టికి వచ్చింది. వెంటనే ఎఫ్ఆర్ఎస్ బాధ్యతల నుంచి సీనియర్ అసిస్టెంట్‌ను తప్పించి.. ఆ పనులను వేరొకరికి అప్పగించాము. కమిషనర్‌కు మెయిల్స్ ద్వారా పంపించిన విషయంపై విచారణ చేస్తున్నాం. ఎవరు పంపించారనే విషయం తేలలేదు. అవన్నీ తప్పుడు ఫిర్యాదులు, ఫేక్ మెయిల్స్‌గా అనుమానం ఉంది. మెడికల్ ఆఫీసర్లు పీహెచ్‌సీల నుంచి ఎఫ్ఆర్ఎస్ ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటాం. పని వేళల్లో కచ్చితంగా పీహెచ్‌సీల్లో ఉండాలి. లేదంటే అధికారికంగా సెలవులో ఉండాలి. డ్యూటీకి డుమ్మా కొట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
వాహనం ఢీ – బైక్ రైడర్ మృతి
పెద్దవడుగూరు: వాహనం ఢీకొన్న ఘటనలో బెంగళూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... బెంగళూరులోని హెబ్బాల్లో వినాయక్‌నగర్ ఫోర్త్క్రాస్లో నివాసముంటున్న మహేష్‌కుమార్ (47)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. బైక్ రైడింగ్‌పై ఆసక్తి ఉన్న ఆయన వారం రోజుల క్రితం తన స్నేహితులతో కలసి ద్విచక్ర వాహనాలపై సిక్కింకు వెళ్లారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణమై ఈ నెల 9న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపారు. బుధవారం వేకువజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒంటరిగా ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆయన గురువారం ఉదయం పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పెద్దవడుగూరు పీఎస్ ఎస్ఐ ఆంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, సమాచారం అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సంఘాలను బలోపేతం చేస్తాం
తనకల్లు: మహిళా సంఘాలను బలోపేతం చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య తెలిపారు. స్థానిక చౌడేశ్వరీ మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం రైతు ఉత్పత్తిదారుల ఎఫ్‌పీజీ లీడర్ల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చిరుధాన్యాల సాగును ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వేరుశనగ పంటకు మార్కెట్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరానగర్‌లోని కల్పన మహిళా సంఘం యాక్షన్ ప్లాన్ గురించి సభ్యులతో మాట్లాడారు. వివిధ రకాల జీవనోపాధులకు అవకాశం ఉండేలా యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీహెచ్ఓ చంద్రశేఖర్, డీపీఎంఎల్హెచ్ రామమోహన్, ఏపీఓ మరియమ్మ, ఏపీఎం జయంతి, హెచ్ఓ లావణ్య, ఎఫ్‌పీఎం ఏపీఎం రమణప్ప, సీసీ, పలువురు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
ఎస్ఐ సుధాకర్‌పై చర్యలు తీసుకోండి
మడకశిర: పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఏజెంట్లా మారిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. లేకపోతే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా మాజీ సీఎంను ఏకవచనంతో సంబోధించడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం ఎస్ఐ సుధాకర్‌యాదవ్‌కు తగదన్నారు. గతంలో చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు పోలీసులను ఏకవచనంతో దూషించిన రోజు ఎందుకు వారిని విమర్శించలేదని ప్రశ్నించారు. పరిటాల రవి కుటుంబీకులు చెప్పిన విధంగానే తాను పనిచేస్తానంటూ వృత్తి ధర్మాన్ని విస్మరించిన సుధాకర్ యాదవ్.. పోలీస్ ఉద్యోగానికి అనర్హుడని, తక్షణమే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని శాఖ ప్రతిష్టను కాపాడాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి -
‘కలలు కనండి..ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ యువతలో చైతన్యాన్ని రగిలించిన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దివంగత రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి వృథా కాలేదు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి... తాము కన్న కలలను సాకారం చేసుకున్నారు ఇద్దరు యువ
ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికై న పూజారి నాగప్రదీప్ ఓఎన్జీసీలో ఉద్యోగం పొందిన పూజారి నాగసాయికనగానపల్లి: మండల కేంద్రానికి చెందిన పూజారి నాగభూషణ ఓ సాధారణ వ్యవసాయ కూలీ. వ్యవసాయ పనులు ఉంటే పూట గడుస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో వ్యవసాయ పనులు సరిగా లేకపోవడంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన కష్టం పిల్లలకు రాకూడదని భావించిన ఆయన... కేవలం చదువులు ఒక్కటే వారి జీవన గమనాన్ని మారుస్తాయని గుర్తించాడు. ఆ దిశగా పిల్లల చదువు కోసం అహర్నిశం శ్రమించాడు. తండ్రి ఆశయానికి అనుగుణంగా.. పూజారి నాగభూషణకు నాగప్రదీప్, నాగసాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ వైపు ఆటో నడుపుతూనే రోజూ సమీపంలో ఉన్న ధర్మవరం పట్టణానికి పిల్లలను తీసుకెళ్లి ఓ ప్రైవేట్ పాఠశాలలో వదిలి వచ్చేవాడు. తిరిగి పాఠశాల వేళలు ముగిసే వరకూ ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంలో మొదట పిల్లల చదువులకు కొంత మొత్తాన్ని పక్కన తీసిపెట్టేవాడు. తండ్రి ఆశయాన్ని గుర్తించిన పిల్లలు సైతం చదువులపై ఆసక్తి పెంచుకున్నారు. పేదరికపు సవాళ్లను అధిగమిస్తూ ఈ పదో తరగతి, ఇంటర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ప్రభుత్వ, దాతల సహకారంతో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం నాగప్రదీప్ బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేశాడు. ఆ సమయంలో సైన్స్ పరిశోధనల్లో ప్రతిభ చూపటంతో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన బోర్డు పరీక్షలు రాసి ఆల్ ఇండియా స్థాయిలో 72వ ర్యాంకు సాధించాడు. దీంతో ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన శ్రీహరికోటలోని ఇస్రోలో గ్రూపు– ఏ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హత సాధించాడు. జాతీయ స్థాయిలో మెరిసిన మరొకరు.. నాగప్రదీప్తో పాటు గేట్లో మంచి ర్యాంకు సాధించిన సోదరుడు నాగసాయి కూడా జాతీయ స్థాయి ఓఎన్జీసీ సంస్థలో ఏఈఈ ఉద్యోగం సాధించాడు. బీటెక్ పూర్తి కాగానే చిరుప్రాయంలోనే ఈ ఉద్యోగం సాఽధించడం గమనార్హం. దీంతో తన ఆశయానికి అనుగుణంగా కుమారులిద్దరూ జాతీయ స్థాయి సంస్థల్లో మంచి ఉద్యోగాలు సాధించినందుకు ఆటో డ్రైవర్ నాగభూషణ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా పిల్లలిద్దరూ బాగా చదువుకొని ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించినందుకు వారిని గ్రామస్తులు అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తగా ఎదిగిన ఆటో డ్రైవర్ కుమారుడు జాతీయ స్థాయి సంస్థలో మరో కుమారుడికి ఉద్యోగం -
వైభవంగా పోతులరాజు మహోత్సవం
గుడిబండ: మండల కేంద్రానికి కూతవేటు దూరంలో వెలసిన తుమ్మల మారెమ్మదేవి ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత తుమ్మల మారెమ్మదేవి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేసి మహంకాళి రూపంలో అలంకరణ చేశారు. అనంతరం గ్రామ నడిబొడ్డును వెలసిన వీరభద్రస్వామి ఆలయం నుంచి పోతులరాజులు ప్రత్యేకంగా అలంకరించుకుని పురవీధుల గుండా నృత్యం చేస్తూ మారెమ్మదేవి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం సమీపంలో పోతులరాజు పుష్పాలంకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. భక్తులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కొడికొండ చెక్‌పోస్ట్‌లో చైన్‌స్నాచింగ్ చిలమత్తూరు: మండలంలోని కొడికొండ చెక్‌పోస్ట్‌లో ఓ మహిళ మెడలోని బంగారం గొలుసును దుండగులు అపహరించుకెళ్లారు. ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపిన మేరకు... గురువారం ఉదయం చెక్‌పోస్టులోని ఓ దుకాణం వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు కూల్‌డ్రింక్ కావాలని అడిగారు. ఆ సమయంలో దుకాణ నిర్వాహకురాలు ఫ్రిడ్జ్ నుంచి కూల్ డ్రింక్ బాటిళ్లు తీస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పెనుగాలులకు నేలకొరిగిన అరటి కూడేరు: మండలంలోని మరుట్ల–1వ కాలనీలో గురువారం పెనుగాలుల ధాటికి కౌలు రైతు బెస్త ఎర్రిస్వామి సాగు చేసిన అరటి చెట్లు విరిగిపడ్డాయి. కోత దశలో ఉన్న దాదాపు 1500 అరటి చెట్లు విరిగిపోవడంతో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. -
మోతుకపల్లిలో టీడీపీ నేత దౌర్జన్యం
చిలమత్తూరు: హిందూపురం పట్టణ పరిధిలోని మోతుకపల్లిలో టీడీపీ నేత చంద్రమోహన్ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. ఏకంగా రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించిన అడ్డుకునే అధికారి లేకపోయాడు. తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా రోడ్డును చంద్రమోహన్ ఆక్రమించాడంటూ మున్సిపల్ అధికారులకు అదే గ్రామానికి చెందిన గొల్ల పవన్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేత కబ్జా పర్వం బయట పడింది. దీంతో అప్పటి వరకూ కబ్జాపై ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చిన అధికారుల్లో చలనం మొదలై ఈ నెల 3న క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆక్రమణ నిజమని నిర్ధారించుకుని సదరు టీడీపీ నేతకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోపు తొలగించాలని ఆదేశించినా టీడీపీ నేత లెక్క చేయకుండా ప్రహరీని అలాగే ఉంచాడు. ప్రహరీని కూల్చరాదంటూ అధికారులపై ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ ఒత్తిడి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మళ్లీ అధికారులు మిన్నకుండిపోయారు.రాగి పంట పరిశీలనచిలమత్తూరు/లేపాక్షి: మండలంలోని టేకులోడు, లేపాక్షి మండలం కల్లూరు గ్రామాల్లో రైతులు సాగు చేసిన రాగి పంటను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) ఎవాల్యూటర్ బి.వెంకటేష్ గురువారం పరిశీలించారు. ఐఎన్డీజీఏపీ సర్టిఫికేషన్ కోసం కంబాలరాయుడు పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ ద్వారా నమోదు చేసుకున్న హిందూపురం డివిజన్‌కు సంబంధించి 20 మందికి అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగు మందులను సిఫార్సు మేరకు మాత్రమే వాడాలని రైతులకు సూచించారు. విత్తన ధ్రువీకరణ ప్రాముఖ్యతను వివరించారు. పురుగు మందుల అవశేషాల పరీక్ష నిమిత్తం రాగి విత్తన నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. కార్యక్రమంలో సీఈఓ హరి, ఏఓ శ్రీలత, వంశీకృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.గరుడ వాహనంపై శ్రీవారుతాడిపత్రి: ఆలూరు కోనలో వెలసిన శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం దేవేరులతో కలసి గరుడవాహనంపై భక్తులకు శ్రీరంగనాథుడు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. రాత్రి గరుడ వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
కాంట్రాక్టర్ బలవంతపు వసూళ్లు
సోమందేపల్లి: గ్రామ పంచాయతీ పరిధిలో వారపు సంతకు సంబంధించి అధిక రుసుం వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ వ్యాపారులు గురువారం ధర్నా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ ధర్నాలో పలువురు మాట్లాడుతూ.. గతంలో వారపు సంతలో దుకాణం నిర్వహణకు రూ.150 చెల్లిస్తుండగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుంకం వసూలుదారులు ఏకంగా రూ.300 నుంచి రూ.400 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో రోజంతా తాము కష్టపడి సంపాదించిన సొమ్ము కాంట్రాక్టర్ల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆదాయం సమకూరుతున్నా మార్కెట్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అధికారులు ఎంతకూ స్పందించక పోవడంతో వ్యాపారస్తులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా వసూళ్లు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయం ఎదుట వ్యాపారుల ధర్నా -
లైన్మెన్పై దాడి
లేపాక్షి: విద్యుత్ బిల్లు చెల్లించాలన్న లైన్మెన్పై ఓ వినియోగదారుడు దాడికి తెగబడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. లేపాక్షి మండలం పులమతి పంచాయతీ పరిధిలోని ఎస్ఆర్ఎంయూ కాలనీకి చెందిన ఆసీఫ్, షాహీనా విద్యుత్ బిల్లు చెల్లించలేదు. గడువు మించి పోవడంతో విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేశారు. గురువారం ఉదయం ఎప్పటి లాగానే విద్యుత్ బిల్లు చెల్లించాలని లైన్మెన్ శివారెడ్డి వెళ్లి అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన హసీఫ్, షాహీనా లైన్మెన్పై కట్టెతో దాడి చేయడమే కాక, ఆయన ద్విచక్ర వాహనాన్ని కిందకు పడేసి పగుల గొట్టారు. అక్కడున్న కొందరు స్పందించి ఇరువురుని సర్దిచెప్పి పంపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. డ్రిప్పు పరికరాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ బత్తలపల్లి: మండలంలోని సంజీపురం గ్రామానికి చెందిన రైతు అవినేని సూర్యనారాయణ దానిమ్మ తోటలో డ్రిప్పు పరికరాలను అపహరించుకెళుతున్న తలారి నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపాడు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన సిబ్బందితో నిఘా ఉంచామన్నారు. ఈదుల ముష్టూరుకు చెందిన తలారి నాగరాజు.. డ్రిప్పు వైరు కట్టలను ద్విచక్ర వాహనంలో ధర్మవరంలో విక్రయించడానికి తీసుకెళ్లుతుండగా వేల్పుమడుగు క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. గోకులం పాఠశాలను పరిశీలించిన డీఈఓ పుట్టపర్తి: మండల కేంద్రంలోని గోకులం ప్రాథమిక పాఠశాలను డీఈఓ కృష్ణప్ప గురువారం తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. పాఠాలు బోధించారు. ఈ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మారుస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉపాధ్యాయుడు పీవీ రమణారెడ్డి, పాఠశాల సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఖాదర్‌వలి, ప్రసాద్ పాల్గొన్నారు. సరదాగా రైలు ఎక్కి.. కనిపించకుండా పోయారు ధర్మవరం అర్బన్: స్థానిక కొత్తపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు జస్వంత్, విజయ్‌కుమార్ గురువారం రైలు ఎక్కి వెళ్లిపోయారు. వారు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. పోతుకుంట గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు జస్వంత్, అతని స్నేహితుడు విజయ్‌కుమార్ ఇద్దరు కొత్తపేట ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఇద్దరు ఉదయం రైల్వేస్టేషన్‌కు వెళ్లి సరదాగా రైలు ఎక్కారు. ఈ లోపు రైలు ముందుకు కదలడంతో కిందకు దిగలేకపోయారు. బాలురు ఆచూకీ తెలిసిన వారు 63058 00429, 93458 63219, 63029 67673కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. కలెక్షన్ సెంటర్లను వినియోగించుకోండి ● ఇక్రిసాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు శింగనమల: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) నిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కలెక్షన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు ఇక్రిసాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. శింగనమల మండలం వెస్ట్ నరసాపురం, శింగనమల గ్రామాల్లో దొనరామేశ్వర రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నిర్మించిన కలెక్షన్ సెంటర్లను థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కింద గురువారం ఆయన పరిశీలించారు. రైతు సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. ఎఫ్‌పీఓ గ్రూప్ పరిధిలోని గ్రామాలు, సభ్యుల వివరాలు, పండించే ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆరా తీశారు. పంట ఉత్పత్తునలు గ్రేడింగ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు కలెక్షన్ సెంటర్లు దోహదపడతాయన్నారు. పంట కోత అనంతరం ఉత్పత్తులను మార్కెట్లో డిమాండ్ వచ్చే వరకూ నిల్వ చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏడీఏ రామచంద్ర, ఉద్యానాధికారి శైలజ, రైతు సేవా కేంద్రం సిబ్బంది ఉమాదేవి, అనూష, పవన్‌కుమార్, అమరేష్, రైతులు పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్య గోరంట్ల: మండలంలోని బూదిలి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విజయ్‌కుమార్ నాయక్ భార్య అనంతబాయి (49) చేసుకుంది. మార్నింగ్ స్కూల్ కావడంతో గురువారం ఉదయం విజయ్‌కుమార్ నాయక్ పాఠశాలకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అనంతబాయి యాసిడ్ తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు బంధువులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. -
తండ్రి కోసం తనయ పోరాటం
కుటుంబాన్ని పోషించేందుకు ఆ తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని బండరాళ్లు కొట్టాడు. మండుటెండలో పునాది రాళ్లను కొడుతూ అహర్నిశలు శ్రమించాడు. నాలుగు రాళ్లు సంపాదించి కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాలనే తపనతో ఆకలి దప్పికలు మరిచాడు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది. విధి వక్రీకరించి మంచానపడ్డాడు. ఏనాడూ గడప దాటి ఎరుగని కుమార్తె.. నేడు తండ్రి వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ కోసం పలువురి ఇళ్లలో పనులకు వెళుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే తన తండ్రి మామూలు మనిషిగా మారుతాడని, అయితే వైద్యానికి అయ్యే ఖర్చు తమ తలకు మించిన భారం కావడంతో ఆపన్నహస్తమందించాలని నిరుపేద కుటుంబం వేడుకుంటోంది. ధర్మవరం అర్బన్: స్థానిక మహాత్మాగాంధీ కాలనీకి చెందిన మల్లిపోగుల శ్రీనివాసులు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇంటి పునాదులకు అవసరమైన రాళ్లను కొడుతూ కుటుంబాన్ని శ్రీనివాసులు పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అరకొర సంపాదనలోనే దాచుకుంటూ వచ్చిన డబ్బుతో పెద్ద కుమార్తె శిరీషకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపారు. చిన్న కుమార్తె జ్యోతిని పదో తరగతి వరకు చదివించగలిగారు. అపై చదువులకు పంపే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంచేశారు. సాధారణ జబ్బు కాదది నెల రోజుల క్రితం మహాశివరాత్రి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు శ్రీనివాసులు కుటుంబం సిద్ధమైంది. ఉదయం తలంటి స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజలు చేసుకుని ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా శ్రీనివాసులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. పరిస్థితి గమనించిన భార్య లక్ష్మి, కుమార్తె జ్యోతి వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం శ్రీనివాసులుకు రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమిస్తుండడంతో వెంటనే కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డయాలసిస్ చేయడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఈ క్రమంలో ఎడమ కాలికి ఇన్ఫెక్షన్ సోకి సెఫ్టిక్ కావడంతో పెద్ద గాయమైంది. దీంతో శ్రీనివాసులు కనీసం కూర్చొనే పరిస్థితి కూడా లేకపోయింది. ఇంటి వద్ద మంచానికే పరిమితం ఎడమ కాలికి కట్టు కట్టిన తర్వాత కర్నూలు ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేసి, ఇంటికి పంపారు. ఈ నేపథ్యంలో మరోసారి డయాలసిస్ అవసరం కావడంతో ఆస్పత్రికి తీసుకెళితే.. శ్రీనివాసులు పరిస్థితిని గమనించిన వైద్యులు డయాలసిస్ చేయడానికి సాధ్యం కాదని వెనక్కు పంపారు. అప్పటి నుంచి ఇంట్లోనే మంచానికే ఆయన పరిమితమయ్యాడు. ఈ మొత్తం ప్రక్రియలో ఇంట్లో చిన్న కుమార్తె పెళ్లికని దాచిన డబ్బు మొత్తం శ్రీనివాసులు చికిత్స కింద ఖర్చయి.. మరికొంత తెలిసిన వారి వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. నిరుపేద కుటుంబం కావడంతో రోజూ పనికి వెళితే తప్ప పూట గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇంటి వద్ద భర్తకు సపర్యలు చేయడంలోనే భార్య లక్ష్మికి సమయం సరిపోతోంది. దీంతో ఏనాడు గడప దాటి ఎరుగని చిన్న కుమార్తె జ్యోతి.. తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలనే తపనతో తొలిసారిగా ఇల్లు విడిచి బయట కూలి పనులకు సిద్ధమైంది. ఇంటింటికీ తిరిగి వారికి అవసరమైన పనులు చేసి పెట్టి, వారిచ్చిన కొద్ది పాటి డబ్బుతో తండ్రికి అవసరమైన మందులు, కాలికి డ్రస్సింగ్ చేసేందుకు అవసరమైన మందులు, డయపర్స్ కొనుగోలు చేస్తోంది. వీరి దుస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు అప్పుడప్పుడు చిన్నపాటి సాయం అందిస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు. తన తండ్రి మంచాన పడటంతో కుటుంబ పోషణ భుజాల మీదకు వేసుకున్న జ్యోతి ఇంటి పనులతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. అయితే తన సంపాదనతో తండ్రి ఆరోగ్యం ఎన్నటికీ బాగుపడదని గుర్తించిన ఆమె ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. తన తండ్రికి మెరుగైన వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని దాతలను వేడుకుంటోంది. అనారోగ్యంతో మంచానపడ్డ తండ్రి సపర్యలు, ఇంటి పనుల్లో నిమగ్నమైన తల్లి కుటుంబ పోషణ, తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె మెరుగైన వైద్యం కోసం ఆపన్న హస్తమందించాలని వేడుకోలుసాయం చేయదలిస్తే... పేరు :మల్లిపోగుల లక్ష్మి బ్యాంకు పేరు : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ధర్మవరం బ్రాంచ్ ఖాతా నెంబరు : 9103 349 4823 ఐఎఫ్ఎస్సీ కోడ్ : APGB0001029 సంప్రదించాల్సిన నంబర్ : 78424 68672 -
సుధాకర్.. ఓ అక్రమాల పుట్ట
చిలమత్తూరు: ‘మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి రెండూ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌కు లేవు. ఆయనో అక్రమాల పుట్ట’ అంటూ చిలమత్తూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం హిందూపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేవంలో ఆయన మాట్లాడారు. సుధాకర్ యాదవ్ నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చిలమత్తూరు పంచాయతీ తుమ్మలకుంట సమీపంలో సుధాకర్ యాదవ్ తన భార్య పేరిట 3.71 ఎకరాల భూమి కొనుగోలు చేశారని, రూ.కోట్లు విలువ చేసే ఆ భూమిని ఎలా కొనుగోలు చేశారో సమాధానమివ్వాలన్నారు. ఇదే భూమిలో రూ.కోట్ల ఖర్చుతో కోళ్ల ఫారం ఎలా నిర్మిస్తున్నారో కూడా సమాదానం చెప్పాలన్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే సుధాకర్ యాదవ్ అక్రమ సంపాదన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఉపాధి నిధులతో అక్రమంగా తన భూమిలో రోడ్డు వేయించుకున్నాడని ఆరోపించారు. తమ భూమి చదును చేయించుకునేందుకు లేపాక్షి నాలెడ్జి భూముల్లో మట్టిని అక్రమంగా తోలించుకున్న సుధాకర్ యాదవ్‌పై పత్రికల్లో పలు కథనాలు వెలువడినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటే ఆయన వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఏకవచనంతో సంబోధించడం సిగ్గుచేటన్నారు. అధికార టీడీపీ నేతలను అడ్డు పెట్టుకుని అక్రమ దందాలతో సామాన్య ప్రజలను ఇక్కట్లు పెట్టే ఎస్ఐ సుధాకర్ యాదవ్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పురమాయించడం ఆయన అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రోద్బలంతో విచక్షణ కోల్పోయి మాజీ సీఎంను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గంగా మాట్లాడితే సహించబోమన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని, కాలం ఒకేలా ఉండదనే విషయాన్ని ఇప్పటికై నా ఆయన గుర్తించాలన్నారు. రూ.కోట్ల విలువైన భూమి ఎలా కొన్నావ్? భారీ ఎత్తున కోళ్లఫారం నిర్మాణం ఎలా చేపట్టావ్? భూమి చదును కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల నుంచి మట్టిని అక్రమంగా తోలుకోలేదా? చిలమత్తూరు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి ధ్వజం -
ఆటో బోల్తా – మహిళా కూలీ మృతి
పుట్టపర్తి అర్బన్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ మృతి చెందారు. పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పుట్టపర్తి రూరల్ పీఎస్ ఏఎస్ఐ ప్రసాద్ తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామానికి చెందిన రైతు జలీల్ పొలంలో వేరుశనగ పంట తొలగించేందుకు రోజూ లాగే బుధవారం ఉదయం 9 గంటలకు ఏడుగురు కూలీలతో ఆటో బయలుదేరింది. తమ సొంత ఆటోలోనే కూలీలను తీసుకుని జలీల్ కుమారుడు ఫారూక్ బయలుదేరాడు. గ్రామ శివారుకు చేరుకోగానే 342వ జాతీయ రహదారి మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక దూసుకెళ్లడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ పక్కనే కూర్చున్న మహిళా కూలీ రాధ (32) ఆటో కింద పడడంతో కాలు, చెయ్యి విరిగాయి. ఫారూక్ తల్లి షేక్ మౌసిన్భాను తలకు తీవ్ర గాయమైంది. చెయ్యి విరిగింది. మరో కూలీ లక్ష్మీదేవి చెవి తెగిపడింది. సుకన్య, సరస్వతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను పెడపల్లిలోని ఓ ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించి, ప్రైవేట్ కారులో అనంతపురానికి తరలిస్తుండగా రాధా పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మౌసిన్భానును అనంతపురానికి తరలించారు. లక్ష్మీదేవికి గోరంట్లలో వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పుట్టపర్తి రూరల్ పీఎస్ సిబ్బంది అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలు రాధ భర్త తలారి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ కల్లూరు ప్రసాద్ తెలిపారు. కాగా, రాధాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయం చేయాలని బాధితుల ధర్నా.. రాధ మృతిపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి ప్రమాదానికి కారణమైన ఫారూక్ ఇంటి ఎదుట ఉంచి దాదాపు 3 గంటల పాటు ధర్నా చేపట్టారు. ఆటో నడపడం తెలియని ఫారూక్ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఆటోకు ఇన్సూరెన్స్ లేదని, ఫారూక్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని సద్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా బాధితులు వినలేదు. ప్రమాదం జరిగిన వెంటనే టీడీపీ నేత ఆశ్రయించి అజ్ఞాతంలోకి వెళ్లిన ఫారూక్, ఆయన కుటుంబసభ్యులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా పోలీసులు చేయకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబసభ్యుల ధర్నా -
భూగర్భ జలమట్టం పడిపోవడం.. నీటి పథకాలు పనిచేయకపోవడంతో చుక్కనీటి కోసం గ్రామీణులు దిక్కులు చూస్తున్నారు. రోజుల తరబడి తాగునీరు సరఫరా కాక దాహం కేకలు వేస్తున్నారు. స్పందించాల్సిన పాలకులు చోద్యం చూస్తుండగా ఊరూరా మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లెక్కుతున్నారు. తాగునీరివ
గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది వేసవికి సంబంధించి రూ.5.87 కోట్లతో 284 పనులను చేపట్టినట్లు ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. అయితే ఏ గ్రామంలో చేపట్టారో.. ఎక్కడ సమస్య పరిష్కరించారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందులో 85 చోట్ల బోరుబావుల తవ్వకానికి రూ.85 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కానీ ఆ పనులెక్కడా కనిపించడం లేదు. జిల్లాలోని 51 గ్రామాలు వాల్టా చట్టం పరిధిలో ఉండగా ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. కానీ ఆ దిశగా యంత్రాంగం చర్యలు తీసుకోలేదు. పాలకులూ కనీసం పట్టించుకోలేదు. ఇక ఇతర ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేసే అవకాశం ఉన్నా...ఎవరూ స్పందించడం లేదు. కేవలం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే నీటి సమస్యకు కారణమని జనం అంటున్నారు. ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించడంలో యంత్రాంగం విఫలమైందంటున్నారు. సాక్షి, పుట్టపర్తి వేసవి ఆరంభంలోనే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తగినంత వర్షాలు కురవక పోవడం.. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోరుబావులు ఎండిపోయాయి. దీంతో రక్షిత మంచినీటి పథకాలు అలంకార ప్రాయంగా మారాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సాగు, తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏ గ్రామంలో చూసినా నీటి సమస్య వెంటాడుతోంది. ‘నీళ్లో రామచంద్రా’ అంటూ జనం నిట్టూరుస్తున్నారు. తాగునీటి కోసం రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధికారులు సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపుతుండగా... వారం రోజుల్లోనే మళ్లీ నీటి కష్టాలు పునరావృతమవుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు చర్యలు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పుట్టపర్తి, బుక్కపట్నం, ఓడీ చెరువు, లేపాక్షి, మడకశిర, హిందూపురం, రొళ్ల, అగళి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. అయినా పాలకుల్లో చలనం రాలేదు. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కిన రోజు మాత్రం రెండు నీటి ట్యాంకర్లను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు ఉండగా...తాగునీటి సమస్యతో జనం అల్లాడిపోతున్నారు. మూడు, నాలుగు ఫోర్లలో ఉంటున్న వారు నీరు రాక నరకం చూస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం వెనుక సందులో రెండురోజులకోసారి అర్ధరాత్రి వేళ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. జిల్లా కేంద్రమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని.. సమయానికి నీళ్లు రావడం కష్టంగా మారిందని వాపోతున్నారు. శ్రీసత్యసాయి తాగునీటి పథకం ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో సమస్య జఠిలమైంది. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం మండలం చిలకలగడ్డపల్లిలోనూ తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓడీ చెరువు మండలంలోనూ రక్షిత తాగునీటి పథకాలు పనిచేయకపోవడంతో ప్రజలు వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సీఎం చంద్రబాబు బావమరిది, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో నెలరోజుల ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. ఏ వార్డులో చూసినా నీటి సమస్య వెంటాడుతోంది. ట్యాంకర్ రూ.500 వెచ్చించి నీరు కొనుగోలు చేసి వినియోగిస్తున్న దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. ఎమ్మెల్యే చుట్టపు చూపుగా వచ్చి వెళ్తారని.. సమస్యలు పరిష్కరించే వారే లేరని చెబుతున్నారు. లేపాక్షి మండలంలోనూ తాగునీటి కోసం ఇటీవల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గుక్కెడు తాగునీరివ్వలేని పాలకుల తీరును నిరసించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణంలో నీటి సమస్య వేధిస్తోంది. సరైన సమయానికి నీరు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రతరం కాగా, రెండు రోజుల కిందట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించడంలో విఫలం అవుతున్నారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ఏనాడూ నీటి సమస్య కనిపించలేదని ప్రజలే చెబుతున్నారు. కర్ణాటక సరిహద్దున ఉన్న మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. ఏ గ్రామంలో చూసినా తాగునీటి కష్టాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడు చాలా గ్రామాలు వాల్టా చట్టం పరిధిలో ఉండటంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. పాలకులు గ్రామాలకు నీళ్లు ఇవ్వక.. ప్రజలు బోర్లు వేసుకోలేక.. నానా అవస్థలు పడుతున్నారు. మడకశిర, రొళ్ల, అగళి మండలాల్లో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పొలాల్లోని బోర్ల వద్ద నీటి కోసం యుద్ధాలకు దిగుతున్నారు. 12.9 మీటర్లు ప్రస్తుతం జిల్లా భూగర్భ జలమట్టం రూ.5.87 కోట్లు ఆర్‌డబ్ల్యూస్ ద్వారా కేటాయించిన నిధులు ఆర్డబ్ల్యూఎస్ పనులెక్కడ? ముందస్తు చర్యలేవీ? ఊరూరా నీటికష్టాలు జిల్లాలో తీవ్రమైన తాగునీటి సమస్య రోజూ ఏదో చోట రోడ్డెక్కుతున్న ప్రజలు పుట్టపర్తి, హిందూపురం, మడకశిరలో దాహం కేకలు ధర్మవరంలోనూ సరిపడా అందని తాగునీరు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం ప్రజల నీటి సమస్యలు పట్టించుకోని అధికారులు, పాలకులు 51 వాల్టా చట్టం కింద ఉన్న గ్రామాలు 284 సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద ఆర్‌డబ్ల్యూస్ ద్వారా చేపట్టిన పనులు పుట్టపర్తిని వెంటాడుతోన్న దాహార్తి.. మంత్రి ఇలాకాలో తీరని కష్టాలు.. బాలయ్య అడ్డాలో దాహం.. దాహం మడకశిర వ్యాప్తంగా నీటియుద్ధాలు.. -
ముగిసిన ‘పది’ మూల్యాంకనం
పుట్టపర్తి: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం (స్పాట్) బుధవారం ముగిసింది. కొత్తచెరువులోని బాల బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన మూల్యాంకనం బుధవారం ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా 891 మంది ఉపాధ్యాయులు, సిబ్బందితో మూల్యాంకనంలో పాల్గొన్నారని డీఈఓ కృష్ణప్ప తెలిపారు. పరీక్షలు, స్పాట్ విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేడు జిల్లాకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రశాంతి నిలయం: రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రబాబు గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం అనంతపురంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి... మధ్యాహ్నం 2.25 గంటలకు రోడ్డుమార్గంలో గోరంట్ల మండలంలోని పాలసముద్రం చేరుకుంటారన్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) పరిపాలన భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. అక్కడి నుంచి ‘నాసిన్’కు వెళతారని, సాయంత్రం 4 గంటలకు పాలసముద్రం నుంచి బయలుదేరి బెంగళూరు వెళతారని కలెక్టర్ పేర్కొన్నారు. రేపు పుట్టపర్తిలో పూలే జయంతి వేడుకలు ప్రశాంతి నిలయం: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి నిర్మలాజ్యోతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు గణేష్ సర్కిల్లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం షాధీఖానాలో పూలే జయంతి వేడుకలు ఉంటాయన్నారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు వెల్లడించారు. పూలే జయంత్యుత్సవంలో మేధావులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనాలని కోరారు. గాలీవాన బీభత్సం కణేకల్లు: మండలంలో బుధవారం సాయంత్రం గాలీవాన బీభత్సం సృష్టించింది. కణేకల్లు, కె.కొత్తపల్లి, పుల్లంపల్లి, పూలచెర్ల, కణేకల్లు క్రాస్, యర్రగుంట తదితర గ్రామాల్లో సుమారు 250 ఎకరాల్లో మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. వారం, పది రోజుల్లో కోత కోయాల్సిన తరుణంలో గాలీవాన పంటను దెబ్బతీసింది. ఎకరా మొక్కజొన్న సాగుకు రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, వర్షానికి మొత్తం తుడిచి పెట్టుకుపోయిందంటూ బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
ధర్మవరం: వేసవి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ శాఖ ద్వారా ధర్మవరం నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి ఎంతమేర నిధులు అవసరమో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నియోజకవర్గంలో 85 చెరువుల అభివృద్ధికి 96 పనులు ఆమోదించి రూ.179.9 లక్షలు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అలాగే త్రిబుల్ ఆర్ ద్వారా 21 చెరువుల అభివృద్ధికి రూ.795 లక్షలు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్, పీఏబీఆర్ కాలువల ద్వారా 14 చెరువులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముదిగుబ్బ మండలంలోని యోగివేమన రిజర్వాయర్ ప్రాజెక్టును రూ.60 లక్షలతో పనులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గంలో తాడిమర్రి, ముదిగుబ్బ, ధర్మవరం అర్బన్‌లో తీవ్ర నీటి ఎద్దడి నివారణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మవరం మున్సిపాలిటీలోని శ్మశాన వాటికను హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న ఐదేళ్లలో అర్హులైన వారందరికి ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గంలో 15,830 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపామని, అర్బన్ ప్రాంతాల్లో 13 వేల ఇళ్ల నిర్మాణ పనులు దశల వారీగా జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, మైనర్ ఇరిగేషన్ అధికారి విశ్వనాథ్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి మల్లికార్జునప్ప, హౌసింగ్ అధికారి శంకరయ్య, ఉద్యనశాఖ, జాతీయ రహదారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ధర్మవరంలో శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రణాళికలు వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ -
హాకీ టోర్నీ విజేత ‘కాకినాడ’
ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీ విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైఎస్సార్ జిల్లా జట్టుతో తలపడిన కాకినాడ జట్టు ఆది నుంచి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 2–0 గోల్స్ తేడాతో విజేత ట్రోఫీని కై వసం చేసుకుంది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ జిల్లా జట్టుకు ధర్మవరం షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షుడు వీరనారాయణ, మూడో స్థానంలో నిలిచిన అన్నమయ్య జిల్లా జట్టుకు చేనేత నాయకురాలు జయశ్రీ బహుమతులు, ట్రోఫీలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మవరంలో జాతీయ స్థాయి హాకీ టోర్నీ నిర్వహణకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్ ట్రెజరర్ థామస్ పీటర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, ఉపాధ్యక్షుడు గౌరీప్రసాద్, ఉడుముల రామచంద్ర, ఊకా రాఘవేంద్ర, మహమ్మద్ అస్లాం, ట్రెజరర్ అంజన్న, హాకీ కోచ్ హసేన్ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరంలో జాతీయ స్థాయి హాకీ టోర్నీ నిర్వహణకు కృషి : మంత్రి -
మూడు నెలలుగా నీటి సరఫరా బంద్
గాండ్లపెంట: ఎన్పీకుంట, గాండ్లపెంట మండలాల్లోని గ్రామాలకు ‘సత్యసాయి మంచినీరు’ మూడు నెలలుగా సరఫరా కావడం లేదు. దీంతో ఈ రెండు మండలాల్లోని 68 గ్రామాల్లో తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఆయా గ్రామాలకు సత్యసాయి నీరు సరఫరా చేసేందుకు సీఈఆర్ నుంచి కాళసముద్రానికి అక్కడి నుంచి కుటాగుళ్లకు అక్కడి నుంచి కమతంపల్లికి నీరు సరఫరా చేస్తారు. ఇందుకోసం కమతంపల్లిలో 8.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు సంపులు నిర్మించారు. కానీ మూడు నెలలుగా నీరు సరఫరా చేయడం లేదు. దీంతో గాండ్లపెంట, ఎన్పీకుంట మండలాల్లోని జనం తాగునీటికి అల్లాడుతున్నారు. -
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
ధర్మవరం అర్బన్: స్థానిక సత్యసాయినగర్‌కు చెందిన శంకర్ గోవిందు (70) ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం సిద్దయ్యగుట్టలో ఉన్న తన తల్లిని పలకరించి, రాత్రి సమయంలో ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పట్టాలపై వస్తున్న రైలును గమనించకుండా రైల్వే గేటు దాటే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య చౌడమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న హిందూపురం జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ ఎర్రిస్వామి బుదవారం ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.వ్యక్తి దుర్మరణంఅగళి: ద్విచక్ర వాహన చోదకులు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం వడ్రుపాలెం గ్రామానికి చెందిన ఆంజనేయులు (42) శిర నుంచి స్వగ్రామానికి వెళుతుండగా అగళి మండలం వడగుంటనహళ్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా దొక్కలపల్లి గ్రామానికి చెందిన రాకేష్, రంగనాథ్ వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డు పక్కన కిందపడిన ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రాకేష్, రంగనాథ్‌ను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కర్ణాటకలోని శిర ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘పరిటాల’ పతనం ప్రారంభమైంది
రామగిరి: కురుబ లింగమయ్య హత్యతో పరిటాల కుటుంబం రాజకీయ పతనం ప్రారంభమైనట్లేనని విశ్రాంత జిల్లా జడ్జి ఎం.కృష్ణప్ప అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ బద్ధంగా రాజకీయాలను ఎదుర్కోలేక హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సబబు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను కురుబ సంఘం నాయకులు బుధవారం పాపిరెడ్డిపల్లికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కురుబలు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేక హత్యలకు తెగబడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం విశ్రాంత జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. లింగమయ్య హత్య కేసు పక్కదోవ పట్టించకుండా నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్ష వైఖరి వీడి.. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. చట్టం ఎవరి చుట్టం కాదని.. చట్టానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పోలీసుపై ఉందన్నారు. లింగమయ్య హత్య కేసును సీబీ సీఐడీకి బదిలీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రామగిరి ఎస్ఐ సుధాకర్‌యాదవ్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. ఎస్ఐ తన పరిధి మేరకు.. తాను చేసే వృత్తిలో నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తే మంచిదని సూచించారు. సుధాకర్ యాదవ్ సక్రమంగా విధులు నిర్వర్తించి ఉంటే లింగమయ్య హత్య జరిగేది కాదని జనం నోట నానుతోందన్నారు. కురుబల జోలికొస్తే ఖబడ్దార్.. కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు మాట్లాడుతూ.. కురుబల జోలికొస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేసుకునే రైతు లింగమయ్యను హత్య చేయడం దారుణమన్నారు. రామగిరిలో ఏ రాజ్యాంగం అమలులో ఉందో అర్థం కావడం లేదన్నారు. హత్యారాజకీయాలను ప్రోత్సహించడం రాజకీయం కాదని హితవు పలికారు. కురుబ కులస్తులు సౌమ్యులని.. ఎవరి జోలికీ పోరని.. అలా అని రాజకీయం అంటగట్టి హత్యలకు తెగబడితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. లింగమయ్యను హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడే వరకు పోరాడతామన్నారు. అంతకుముందు లింగమయ్య భార్య రామాంజినమ్మ, పెద్దకుమారుడు మనోహర్, ఆయన భార్య రేణుక, చిన్న కుమారుడు శ్రీనివాసులు, కుమార్తె ప్రమీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులను కురుబ సంఘం నాయకులు పరామర్శించారు. కురుబ లింగమయ్య హత్య దుర్మార్గం పాపిరెడ్డిపల్లిలో విశ్రాంత జిల్లా జడ్జి ఎం.కృష్ణప్ప కురుబల జోలికొస్తే ఖబడ్దార్ హెచ్చరించిన కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజహంస శ్రీనివాసులు -
జెడ్పీలో 10 మందికి పదోన్నతి
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పది మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరికి ఉత్తర్వులను బుధవారం తన చాంబర్లో జెడ్పీసీఈఓ రామచంద్రారెడ్డితో కలసి చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో పరిచేస్తున్న డి.మాధవి చౌదరికి పదోన్నతి కల్పిస్తూ తిరిగి జెడ్పీనే కేటాయించారు. ఇదే కార్యాలయంలో పని చేసే బి.సుశీలాదేవిని పెనుకొండలోని పీఆర్ క్యూసీ సబ్ డివిజన్‌కు, కె.రమాదేవిని చిలమత్తూరు మండల పరిషత్ కార్యాలయానికి, విజయవాడలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఎం.అరుణశ్రీని యల్లనూరు మండల పరిషత్ కార్యాలయానికి కేటాయించారు. తొగరకుంట హైస్కూల్లో పని చేస్తున్న పి.షాహీనా బేగంను రొద్దం మండల పరిషత్ కార్యాలయానికి, పుట్టపర్తి మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే జి.రవీంద్రను పుట్టపర్తి పీఆర్ అనుబంధం పీఐయూ సబ్ డివిజన్‌కు, సిద్ధరాంపురం జెడ్పీహెచ్ఎస్లో పని చేసే జె.సుబ్రహ్మణ్యంను లేపాక్షి మండల పరిషత్ కార్యాలయానికి పోస్టింగ్ ఇచ్చారు. ఎద్దులపల్లి జెడ్పీహెచ్ఎస్లో పని చేసే పి.ఉమామహేశ్వరరెడ్డిని గుత్తిలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్‌కు, నాగసముద్రం జెడ్పీహెచ్ఎస్లో పని చేసే వి.విశ్వనాథ్‌ను మడకశిర పీఆర్ఐ సబ్ డివిజన్‌కు, రాయదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే పి.మహేష్ ను కణేకల్లు మండల పరిషత్ కార్యాలయానికి పదోన్నతిపై బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. -
13న యూపీఎస్సీ ఫ్లాగ్షిప్ పరీక్ష
అనంతపురం అర్బన్: ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఈనెల 13న ఉమ్మడి అనంతపురం జిల్లా అభ్యర్థులకు ఫ్లాగ్షిప్ పరీక్ష జరగనుంది. రెండు కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 363 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. యూపీఎస్సీ నిబంధనలను అనుసరించి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి’ అని అనంతపురం కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరుగుతాయన్నారు. ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎ.రామ్మోహన్, రూట్ ఆఫీసర్‌గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, కేఎస్ఎస్ డిగ్రీ, పీజీ కళాశాల పరీక్ష కేంద్రానికి ఇన్స్పెక్టింగ్ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, రూట్ అధికారిగా వి.మల్లికార్జునరెడ్డిని నియమించామన్నారు. కేంద్రం వద్ద ఒక ఎస్ఐ, ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష వేళలకు అనుకూలంగా బస్సులు నడపాలని ఆదేశించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పరీక్ష సమయాలు ఇలా... ● ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేపర్–2, 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–3 పరీక్ష జరుగుతుంది. ● కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళ కళాశాల పరీక్ష కేంద్రంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1, 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పేపర్–2 జరుగుతుంది. ● అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. ● ఈ–అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, పెన్, పెన్సిల్ తీసుకువాల్సి ఉంటుంది. ● మొబైల్ ఫోన్లు, డిజిటల్, స్మార్ట్ గడియారాలు, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. -
ఇదేం పెళ్లిరా నాయనా!
వన్ ప్లస్ వన్ ఆఫర్ గురించి మనందరికీ తెలుసు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకటి కొంటే ఒకటి ఉచితమని వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఇలాంటి వింత ‘ఆఫర్’ను సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. అయితే ఇది వస్తువులకు సంబంధించిన ఆఫర్ కాదు. మనుషుల పెళ్లికి సంబంధించిన ఆఫర్! ఇద్దరు మైనర్ బాలికలను ఒకే ముహూర్తానికి ఒకే వేదికపై పెళ్లాడటానికి రెడీ అయ్యాడో ప్రబుద్ధుడు. విషయం అధికారులకు తెలియడంతో పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.వరుడు ఒక్కడే.. వధువులిద్దరు!పెళ్లికి వధువు దొరకక ఎందరో యువకులు నిరాశతో జీవనం సాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు మైనర్ బాలికలను వివాహం (Wedding) చేసుకునేందుకు రెడీ అయిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన యువకుడు, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ఈనెల 10న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 16 ఏళ్ల తన అక్క కూతురిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే చిన్న మేనకోడలు (15) కూడా మేనమామనే పెళ్లి చేసుకుంటానని, అలా చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని మొండికేసింది. దీంతో ఇద్దరు అమ్మాయిలనూ అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు.అధికారుల వార్నింగ్గోరంట్లలోని రంగమహల్ ఫంక్షన్ హాల్లో ఈనెల 10న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి శుభలేఖ (Wedding Card) వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఫంక్షన్ హాల్ నిర్వహకుడిని గోరంట్ల పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించి పెళ్లి చేస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత, సీఐ శేఖర్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.కేసు నమోదుపెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కనీసం ఒక అమ్మాయితోనైనా పెళ్లి జరిపిస్తామని వధువు, వరుడు (Groom) తరపువారు అధికారులను వేడుకున్నారు. మైనర్ బాలికకు పెళ్లి చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. కాగా, చివరిలో ఇరువర్గాలు మాట వినకపోవడంతో ఐసీడీఎస్ (ICDS) సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ శేఖర్ తెలిపారు. మరి రేపు ఉదయం ముహుర్తం సమయానికి పెళ్లి జరుగుతుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి లవ్స్టోరీబాల్య వివాహాలు వద్దుసోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారంపై జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిన్నవయసులో పెళ్లి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకునే విషయంలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం యంత్రాంగం పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. -
ప్రమాదంలో వీఆర్ఏ మృతి
ముదిగుబ్బ: మండలంలోని ఎనుములవారిపల్లి వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో రెడ్డిపల్లి వీఆర్ఏ ప్రసాద్(38) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... విధులకు హాజరయ్యేందుకు మలకవేమల క్రాస్ నుంచి రెడ్డిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రసాద్‌ను నల్లమాడ వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. తలకు తీవ్ర గాయమై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.రెడ్డిపల్లిలో విషాదఛాయలునల్లమాడ: వీఆర్ఏ ప్రసాద్ ఆకస్మిక మృతితో ఆయన స్వగ్రామం నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కదిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రెడ్డిపల్లికి తీసుకొచ్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. తహసీల్దార్ రంగనాయకులు, కార్యాలయ సిబ్బంది, వీఆర్ఏలు రెడ్డిపల్లికి చేరుకుని ప్రసాద్ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
పరికరాలు లేవంటున్నారు
నేను కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా. సదరం స్లాట్ బుక్ చేసుకోవడమంటే ఓ యుద్ధం చేసినట్లవుతోంది. ఆన్లైన్లో సైట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా అర్థం కావడం లేదు. అష్టకష్టాలు పడి ఎప్పుడో బుక్ చేసుకుంటే ఇప్పుడు పరీక్షలకు అవకాశం వచ్చింది. ఇక్కడకు వస్తే కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరం కూడా లేదంటున్నారు. పరికరాలు లేనప్పుడు సదరం క్యాంప్ నిర్వహణకు ఎలా అనుమతిచ్చారు. మాకెలా సమాచారం ఇచ్చారు. దివ్యాంగులంటే ఇంత చులకనా? – శ్రీనివాసులు, రాప్తాడు, అనంతపురం జిల్లా -
జానపద కళాకారిణికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు
ధర్మవరం అర్బన్: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ధర్మవరం పట్టణానికి చెందిన జానపద కళాకారిణి సోమిశెట్టి సరళకు చోటు దక్కింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను మంగళవారం ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరిగిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ తరఫున టీం లీడర్ గాయత్రి ప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో తన బృందంతో గరగ నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కేలా చేసిందన్నారు. వివాహిత బలవన్మరణం కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లికి చెందిన మురళి భార్య నీలమ్మ (32) ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన ఆమె సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, భర్త మురళి వేధింపులే తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమంటూ మృతురాలి తల్లిదండ్రులు చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్త చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ● గోరంట్ల: మండలంలోని పుట్టగుండ్లపల్లి గ్రామానికి చెందిన వివాహిత వడ్డే సరస్వతి (33) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... వడ్డే సరస్వతిని తరచూ భర్త, అత్త అనుమానంతో వేధింపులకు గురి చేసేవారు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శేఖర్ తెలిపారు. దొంగను పట్టించిన రైతులు బత్తలపల్లి: వ్యవసాయ తోటల వద్ద రైతులు పండించిన పంటను అపహరించుకెళుతున్న ఓ యువకుడిని రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన బత్తలపల్లి మండలం సంజీవపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు... సంజీవపురం గ్రామానికి చెందిన రైతు శ్రీధర్ దానిమ్మ పంటను సాగు చేశారు. పంట చేతికి రావడంతో పొలంలో సోమవారం రాత్రి కాపలా కాస్తుండగా ఈదుల ముష్టూరు బీసీ కాలనీకి చెందిన నాగరాజు తన ద్విచక్రవాహనంలో పొలం వద్దకు చేరుకున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో గమనించిన రైతు వెంటనే గ్రామస్తులకు, సన్నిహితులకు సమాచారం చేరవేశాడు. వారు పొలం వద్దకు చేరుకుని నాగరాజును పట్టుకున్నారు. ద్విచక్రవాహనంతో సహా పోలీసులకు అప్పగించారు. విచారణలో దానిమ్మ కాయలను కోసుకెళ్లేందుకు వచ్చినట్లుగా నిందితుడు అంగీకరించినట్లు వెల్లడైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. తోటకు నిప్పు ముదిగుబ్బ: మండల కేంద్రంలోని ఐఏఎస్ రామాంజినేయులు తోటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితురాలు మంజుల తెలిపారు. తోటకు సమీపంలో ఉన్న ఎండుగడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పురాజేయడంతో మంటలు వ్యాపించి తోటను చుట్టుముట్టినట్లు వివరించారు. పొలం చుట్లూ ఉన్న 100 టెంకాయ చెట్లతో పాటు 70 చీనీ చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. -
అధికారుల నిర్లక్ష్యం.. దివ్యాంగులకు శాపం
తాడిపత్రి రూరల్: దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలంటే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. దీంతో సదరం క్యాంప్‌లో వైద్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో స్లాట్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ద్వారా ముందుగా స్లాట్ బుక్ చేసుకున్న వారికి తేదీ, సదరం క్యాంప్ నిర్వహించే ఆస్పత్రి ఖరారు చేసి సమాచారాన్ని అందజేస్తారు. ఈ విధానం దివ్యాంగులకు ఎంతో సౌలభ్యంగా మారింది. అయితే ఇటీవల ఆర్థో, కంటి పరీక్షలకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకున్న వారికి తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిని కేటాయిస్తూ మంగళవారం సదరం క్యాంప్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి వందలాది మంది దివ్యాంగులు వారి సహాయకులతో కలసి వచ్చారు. అయితే వైద్య పరీక్షలు చేసేందుకు ఎలాంటి పరికరాలు లేవని తెలియడంతో దివ్యాంగులు అయోమయంలో పడ్డారు. పరికరాల్లేవు.. పరీక్షలు చేయలేం ఆర్థో, కంటి వైద్య పరీక్షలు చేసేందుకు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో ఎలాంటి వైద్య పరికరాలు లేవు. అర్థోకు అరకొరగా పరికరాలు ఉన్నా కంటి పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరమూ లేదు. తమకందిన సమాచారంతో మంగళవారం ఉదయం 8 గంటలకే వందలాది మంది దివ్యాంగులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఉదయం 11గంటలైన పరీక్షలు మొదలు పెట్టకపోవడంతో విసుగెత్తి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్‌ను నిలదీశారు. దీంతో కంటి డాక్టర్ వసంత, ఆర్థో వైద్యుడు హరిప్రసాద్‌ను డాక్టర్ డేవిడ్ పిలిపించుకుని మాట్లాడారు. సదరం క్యాంప్‌కు హాజరైన దివ్యాంగులకు అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవసరమైన పరికరాలు లేవని వారు చేతులేత్తేయడంతో విషయాన్ని వెంటనే డీసీహెచ్ డాక్టర్ పాల్ రవికుమార్ దృష్టికి సూపరింటెండెంట్ తీసుకెళ్లారు. బయటి నుంచి పరికరాలు తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఆయన సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశారు. వెంటనే మరోసారి డీసీహెచ్కు డాక్టర్ డేవిడ్ ఫోన్ చేయడంతో ఆయన మంత్రి సత్యకుమార్ పర్యటనలో ఉన్నారంటూ కింది స్థాయి ఉద్యోగి తెలిపి ఫోన్ పెట్టేశారు. ఈ విసయం తెలియగానే దివ్యాంగులు మండిపడుతూ సూపరింటెండెంట్‌తో వాగ్వాదానికి దిగారు. రాప్తాడుకు చెందిన దివ్యాంగుడు విషయాన్ని వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనకే నేరుగా ఫోన్ చేశారు. అయితే మంత్రి మీటింగ్‌లో ఉన్నారని పీఏ హర్ష తెలిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. చివరకు పరికరాలే లేనప్పుడు వైద్య పరీక్షలు చేయడం సాధ్యం కాదంటూ చేతులెత్తేయడంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పరీక్షల కోసం పిల్లాపాపలు, వృద్దులతో కలసి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. వైద్య పరీక్ష పరికరాలు లేకున్నా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి సదరం స్లాట్ ఖరారు జిల్లాతో పాటు వైఎస్సార్, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల నుంచి తరలివచ్చిన దివ్యాంగులు -
మళ్లీ బుక్ చేసుకునే అవకాశం లేదు
నా కుమార్తె జోషికకు పుట్టుకతోనే కుడి కన్ను లేదు. చిన్నారికి ఎలాంటి పరీక్షలు చేయకుండానే కన్ను లేదని నిర్ధారించవచ్చు. ఆమె చదువులకు, ఉద్యోగ అవకాశాలకు పనికి వస్తుందని సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ఇప్పుడు పరీక్షలకు అవకాశం వచ్చింది. దీంతో ముదిగుబ్బ నుంచి తెల్లవారుజామునే బయలుదేరి వచ్చాను. ఇక్కడకు వచ్చిన తర్వాత కంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఒక్క పరికరం కూడా లేదని అంటున్నారు. పోతే పోయిందేలే అనుకుని మళ్లీ స్లాట్ బుక్ చేద్దామనుకుంటే రూల్స్ ఓప్పుకోవు. ఎందుకు పరీక్షలు చేయించుకోలేదో వైద్యులు రాతపూర్వకంగా ఇచ్చిన వివరణను జతపరచాల్సి ఉంటుంది. అంతేకాక మరో మూడు నెలల వరకూ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేదు. – రమాదేవి, ముదిగుబ్బ -
బూటు కాలితో తన్ని.. గొంతు నులిమి
అనంతపురం: బిడ్డను అక్కున చేర్చుకుని ప్రేమను పంచాల్సిన ఓ తండ్రి కర్కశత్వం ప్రదర్శించాడు. రాక్షసుడిలా మారి అభంశుభం తెలియని చిన్నారిని చిత్రహింసలకు గురి చేశాడు. అనంతపురం వన్‌టౌన్ సీఐ వి. రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన శివ, మౌనికలు కులాంతర వివాహం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం అనంతపురానికి వచ్చి జేఎన్టీయూ (ఏ) ఎదురుగా ఉన్న ఓ బాయ్స్ హాస్టల్లో వంట మనుషులుగా చేరారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి హాస్టల్లో ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తోందన్న కోపంతో తండ్రి శివ మంగళవారం విచక్షణారహితంగా కొట్టాడు. బూటు కాలితో తన్నాడు. చెంప పగులకొట్టడమే కాకుండా బుగ్గలు గట్టిగా కొరికాడు. గొంతు నులిమి చిత్రహింసలు పెట్టాడు. దెబ్బలు తాళలేక చిన్నారి ఆర్తనాదాలు పెడుతున్నా కనికరం చూపలేదు. సొమ్మసిల్లిపడిపోయినా ఆపకుండా మరీ చితకబాదాడు. ఈ విషయాన్ని హాస్టల్లో ఉంటున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ఐసీడీఎస్ అధికారులు హాస్టల్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మూడేళ్ల చిన్నారిపై కసాయి తండ్రి కర్కశత్వం -
హోరాహోరీగా ఉట్టి ఉత్సవం
గాండ్లపెంట: విశ్వకవి యోగివేమన ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం గాండ్లపెంట మండలం కటారుపల్లిలో నిర్వహించి ఉట్టి ఉత్సవంలో యువకులు హోరాహోరీగా తలపడ్డారు. ఆలయ ఎదుట ఇనుప స్తంభం ఏర్పాటు చేసి స్తంభానికి పై భాగాన తాంబూలంతో ఆలయ పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో రూ.10,116 నగదు ఉట్టి కట్టారు. ఉట్టిని అందుకునేందుకు దాసరిండ్లు, కటారుపల్లి, మద్దివారిగొంది గ్రామాలకు చెందిన యువకులు పలుమార్లు ప్రయత్నించి.. చివరకు మద్దివారిగొందికి చెందిన జట్టు సభ్యులు అందుకున్నారు. కార్యక్రమంలో ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.శేష వాహనంపై శ్రీరంగనాథుడుతాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 వ రోజు మంగళవారం దేవేరులతో కలసి శేషవాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శేషతల్ప రంగనాథస్వామి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. రాత్రి శేషవాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అభిమాన నేతను చూశాం.. అదే చాలు
ఎంతో ఆనందం కలిగింది మాది వ్యవసాయ కుటుంబం. పొలంలో వేరుశనగ, మొక్కజొన్న సాగు చేస్తాం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏటా ఠంచనుగా ‘రైతు భరోసా’ అందించడంతో సాఫీగా పంటలు సాగు చేశాం. వరుణుడు కరుణించి పంటలు బాగా పండటంతో నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాం. అలా మమ్మల్ని ఎంతగానో ఆదుకున్న అభిమాన నేత మా ప్రాంతాన్ని రావడంతో ఎలాగైనా చూడాలని వచ్చాం. ఆయన్ను చూశాక ఎంతో ఆనందం కలిగింది. – చెన్నకేశవ దంపతులు, కుంటిమద్ది గ్రామం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి నాకు పది ఎకరాల పొలం ఉంది. చంద్రబాబు రైతులకు ఏమీ చేయడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు మా కష్టాలు తెలియడం లేదు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలకు అడుగడుగునా చేయూతనిచ్చారు. ఆయన ఉంటే మాకు ఈ బాధలు ఉండేవే కావు. రాష్ట్రానికి తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం. – రంగయ్య, ఆర్. కొట్టాల, పెనుకొండ మండలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి మండల పర్యటనలో జన తరంగం ఎగిసి పడింది. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. జనం తాకిడికి ముదిగుబ్బకు చెందిన శోభారాణి చెప్పులు తెగిపోగా.. జగన్‌ను చూడాలనే సంకల్పంతో ఆమె తన వద్ద ఉన్న టవల్‌ను చింపి కాళ్లకు చుట్టుకుని మరీ ఎర్రటి ఎండలో ముందుకు నడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి కొందరు తలపై టవల్స్ ధరించి, కానుగ ఆకులు కట్టుకొని వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ రాష్ట్రానికి శని పట్టింది.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రానికి శని పట్టింది. మాకు కుమార్తె, ఒక కుమారుడు సంతానం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం జగనన్న అమ్మఒడి ఇచ్చేవారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు. జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటే.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు. – వెంకట్రామ్ దంపతులు, పోలేపల్లి గ్రామం -
వరుడు ఒక్కడే.. వధువులిద్దరు
గోరంట్ల: పెళ్లికి వధువు దొరకక ఎందరో యువకులు నిరాశతో జీవనం సాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు మహిళలను వివాహం చేసుకుంటుండడం శ్రీసత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన దివంగత నిడిగింటి గంగులమ్మ, రాజు వేలు దంపతుల కుమారుడు గంగరాజు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన సుశీల, రఘు దంపతుల ఇద్దరు కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యను ఈ నెల 10న వివాహం చేసుకోనున్నాడు. ఇందుకు గోరంట్లలోని రంగమహల్ ఫంక్షన్ హాల్ వేదికగా మారింది. వీరి పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా, వధువుల తల్లి సుశీల వరుడు గంగరాజుకు స్వయానా అక్క. సుశీల రెండో కుమార్తె ఐశ్వర్య చిన్నప్పటి నుంచి మేనమామ గంగరాజు ఇంట్లోనే ఉంటోంది. ఇద్దరు అమ్మాయిలకూ మేనమామ అయిన గంగరాజు అంటే చాలా ప్రేమ. ఇటీవల ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు సుశీల మొదటి కుమార్తె శ్రీలక్ష్మిని గంగరాజుకు ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే ఐశ్వర్య తాను కూడా మేనమామనే పెళ్లి చేసుకుంటానని, అలా చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో ఇద్దరు అమ్మాయిలనూ అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు. -
మద్దతు ధర చట్టం అమలుకు మరో ఉద్యమం
అనంతపురం సిటీ: మద్దతు ధర చట్టం అమలు కోసం మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని రైతులకు రైతు సంఘం రాష్ట్ర క్యాదర్శి కేవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. వ్యవసాయ పథకాలకు 90 శాతం సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో అనంతపురంలోని జిల్లా పరిషత్ క్యాంపస్‌లో ఉన్న డీపీఆర్సీ భవన్లో ఉద్యాన రైతుల రాష్ట్ర సదస్సు మంగళవారం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చిరుతల మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేవీవీ ప్రసాద్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీస్, జిల్లా కార్యదర్శి జాఫర్, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య, రాష్ట్ర రైతు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కాటమయ్య, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత రాముడు హాజరయ్యారు. కేవీవీ ప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. దేశ వ్యాప్తంగా 600 రకాల పండ్లను రైతులు ఉత్పత్తి చేస్తున్నా.. కేవలం 24 రకాల పండ్ల ఉత్పత్తులకు మాత్రమే కేంద్రంలోని కూటమి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం బాధాకరమన్నారు. 52 రకాల ఉద్యాన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని ఏఐకేఎస్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులపై శ్రమ, ఖర్చులతో పాటు 50 శాతం అదనంగా కలిపి ధర నిర్ణయిస్తేనే రైతుకు గిట్టుబాటవుతుందన్నారు. అప్పుడే రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడుకోగలమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనంతపురం జిల్లా ఫ్రూట్ బోల్గా ఎదగాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. హంద్రీ–నీవా ద్వారా రూ.9 కోట్లతో చివరి ఆయకట్టు వరకు నీరందించనున్నట్లు వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యవస్థను నిర్మూలించి అన్నదాతలను కాపాడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డుల్లో బహిరంగంగా వేలం పాడే సదుపాయాన్ని పండ్ల రైతులకు కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కాటమయ్య కోరారు. కార్పొరేట్ అప్పులను రద్దు చేస్తున్న తరహాలోనే రైతుల అప్పులనూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యు డు లింగమయ్య, ఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేశ్, నిర్మల, ఇంకా వివిధ స్థాయిల నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్ -
నూతన జిల్లా జడ్జిగా భీమా రావు
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఈ. భీమా రావు నియమితులయ్యారు. చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఆయనను జిల్లాకు బదిలీ చేశారు. ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జి. శ్రీనివాస్ నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అలాగే, అనంతపురం నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి (గుత్తి)గా విధులు నిర్వహిస్తున్న శ్రీహరిని పిఠాపురం అదనపు జిల్లా జడ్జి, సెషన్స్ జడ్జిగా బదిలీ చేశారు. అనంతపురం అదనపు జిల్లా జడ్జి ఎం. శోభారాణి సీబీఐ స్పెషల్ జడ్జి (కర్నూలు)గా బదిలీ అయ్యారు. ● జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఈ.భీమారావు 1972లో పిఠాపురంలో జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ కాకినాడలో పూర్తి చేశారు. పిఠాపురంలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. 2013లో అదనపు జిల్లా జడ్జిగా విజయవాడలో బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు. అదే సంవత్సరంలోనే విజయనగరం ఫ్యామిలీ కోర్టు కమ్–నాలుగో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2020లో పదోన్నతిపై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ● నెల్లూరుకు బదిలీపై వెళ్తున్న జడ్జి జి. శ్రీనివాస్ అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సంచలన తీర్పులు వెలువరించారు. కందుకూరు శివారెడ్డి హత్య కేసులో నిందితులకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించారు. జిల్లా కోర్టు చరిత్రలోనే మొత్తం 12 కేసుల్లో ముద్దాయిలకు జీవిత ఖైదు విధించిన తొలి ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ కావడం గమనార్హం. సివిల్ కేసులనూ 50 శాతం పరిష్కరించి కక్షిదారులకు సాంత్వన చేకూర్చారు. నెల్లూరు జిల్లా జడ్జిగా జి. శ్రీనివాస్ బదిలీ -
పేదోడి రైలు.. రైల్వేకు అలుసు
గుంతకల్లు: డివిజన్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైళ్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గుంతకల్లు–హిందూపురం (77213/14), గుంతకల్లు–రాయచూర్ (77201/02), గుంతకల్లు–డోన్ (77203/04), డోన్–గుత్తి (77205/06), నంద్యాల–రేణిగుంట (77212/11), కర్నూలు సిటీ–నంద్యాల (77209/10) మధ్య నడుస్తున్న డెమో ప్యాసింజర్ రైళ్లలో రాయలసీమ జిల్లా వాసులు తక్కువ ధరతో ప్రయాణం చేయాడానికి ఎంతో అనువుగా ఉన్నాయి. దీంతో మధ్య తరగతి, గ్రామీణ ప్రాంతా ప్రయాణికులు ఈ రైళ్ల వైపు మెగ్గు చూపారు. మౌలిక వసతులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వసతులు కరువు.. హైదరాబాదు, బెంగుళూరు తదితర నగరాల్లో నడుతుపున్న ఎంఎంటీఎస్ రైళ్ల (డెమో)ను రైల్వేశాఖ సాధారణ ప్రయాణికుల కోసం గుంతకల్లు డివిజన్లోపి పలు ప్రాంతాల నుంచి నడుపుతోంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకపోవడంతో పాటు సమయానికి నిర్దేశించిన గమ్యస్థానానికి చేరుకోవచ్చు. దీంతో సిటీ ప్రజలు ఎక్కువగా ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ వెళ్లడానికి 5 నిమిషాల సమయం కూడ పట్టదు. 700ల మంది కూర్చొని, మరో వెయ్యి మందికి పైగా నిల్చోని ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది. దీంతో ఈ రైళ్లలోని బోగీల్లో టాయిలెట్లు, నీటి వసతి అనేవి ఉండవు. గుంతకల్లు–హిందూపురం మధ్య నడస్తున్న డెమో ప్యాసింజర్ రైలు దాదాపు 200 కి.మీ.లు ప్రయాణించాల్సి ఉంది. గుంతకల్లు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన రైలు హిందూపురానికి రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ప్రయాణికులు టాయిలెట్‌కు వెళ్లాలంటే వీలుపడదు. బోగీల్లో టాయిలెట్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో గంటల తరబడి వృద్దులు, మహిళలు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో నిలబడిన వెంటనే రైలు దిగి టాయిలెట్ల వైపు పరుగు తీస్తున్నారు. ఈ లోపు రైలు వెళ్లిపోవడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రైలు మిస్ అయిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్లతో గొడవకు దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్యాసింజర్లు అంటే చులకన... పేదోడి రైళ్లు (ప్యాసింజర్) అంటే రైల్వేశాఖకు చులకనై పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడ్స్ రైళ్లపై ఉన్న శ్రధ్ద ప్యాసింజర్ రైళ్లపై లేదని విమర్శిస్తున్నారు. గుంతకల్లు–గుత్తి. గుత్తి–ధర్మవరం మధ్య డబుల్‌లైన్ పూర్తయింది. ఈ మార్గంలో ఒకేసారి రెండు రైళ్ల పరుగులు పెడుతాయి. అయితే గూడ్స్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్న సమయంలో డెమో రైళ్లను ఎక్కడ పడితే అక్కడ నిలిపి వేస్తున్నారు. దీంతో ఈ రైళ్లు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవి ఎండలకు రైళ్లలో ఉక్కపోతకు చిన్నారులు, వృద్దులు తాళలేకపోతున్నారు.పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అనుగుణంగా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్ – డెమో ప్యాసింజర్) రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. వీటితో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే డెమో రైళ్లలో ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. డెమో ప్యాసింజర్ రైళ్లతో ప్రయాణికుల బేజారు మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు జనరల్ బోగీలతో నడపాలని ప్రయాణికుల డిమాండ్ సాధారణ బోగీలతో నడపాలి డివిజన్ వ్యాప్తంగా నడుపుతున్న డెమో రైళ్ల స్థానంలో సాధారణ బోగీలతో ఉన్న ప్యాసింజర్ రైళ్లను నడపాలి. ఈ సాధారణ బోగీల్లో టాయిలెట్లు, నీటి సౌకర్యం ఉంటుంది. డెమో రైళ్లతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను రైల్వేశాఖ గుర్తించాలి. డెమో రైళ్లను సిటీలకే పరిమితం చేయాలి. – అనంత శేషారెడ్డి, గుంతకల్లు -
చంపినట్లే. నిన్ను చంపేస్తాం!
లింగమయ్యను పుట్టపర్తి టౌన్: ‘ప్రభుత్వం మాది... ఇక్కడ మాదే రాజ్యం. పాపిరెడ్డిపల్లి లింగమయ్యను చంపేసినట్లే నిన్నూ చంపేస్తాం’ అంటూ ఓ సామాజిక సేవా కార్యకర్తపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. మహిళ అని కూడా చూడకుండా చెప్పులతో కొట్టి అవమానపరిచి చంపుతామని బెదిరించారు. దీంతో టీడీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. న్యాయం చేయాల్సిన ఖాకీలు చేతులెత్తేశారు. కేసును నీరుగార్చి బాధితురాలి ప్రాణాలకు భరోసా లేకుండా చేశారు. దీంతో జరిగిన ఘటనను ఎస్పీ రత్న దృష్టికి బాధితురాలు, అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన లక్ష్మీదేవి తీసుకొచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలసి వినతి పత్రం అందజేసి, తన గోడు వెల్లబోసుకున్నారు. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న వివరాలు.. ‘మాది అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామం. నాకు, నా కుటుంబసభ్యులకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అనాథ పిల్లలు, వృద్ధులకు సేవ చేయాలని అనుకున్నా. 2024, డిసెంబర్ 5న నా సొంత పొలంలోని 20 సెంట్ల స్థలంలో ఓ షెడ్ వేయించాలనుకున్నా. ఇందుకు గాను నాకున్న మూడు సెంట్ల స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇటీవల షెడ్ వేయిస్తున్నా. నా సేవా సంకల్పాన్ని చూసి ఓర్వలేక స్థానిక టీడీపీ నాయకులు రాము, వెంకటేష్, సురేష్.. షెడ్డు కట్టకూడదని అడ్డుకున్నారు. నన్ను నోటికొచ్చినట్లు తిట్టారు. చెప్పులతో కొట్టారు. అధికారంలో ఉన్నాం... మా వెనుక మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉన్నారు... రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్యను చంపినట్లు చంపేస్తాం... ఎవరు అడ్డొస్తారో చూస్తాం అంటూ బెదిరించారు. దీంతో నాకు ప్రాణహాని ఉందని సాక్ష్యాలతో సహా అమడగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే పోలీసులు టీడీపీ నేతలకే వత్తాసు పలికారు. వారిపై గొడవ కేసు నమోదు చేసి, అరెస్ట్ కూడా చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. దీంతో వాళ్లు నామీద మరింత కక్ష కట్టి నన్ను భయపెడుతున్నారు. నాకు ప్రాణహాని ఉంది. న్యాయం చేయండి’ అంటూ ఎస్పీ వద్ద బాధితురాలు వాపోయారు. దీనిపై స్పందించిన ఎస్పీ... నీకు ఎలాంటి హాని లేకుండా చూస్తామని, బెదిరింపులకు పాల్పడిన వారిని బైండోవర్ చేయిస్తానంటూ భరోసానిచ్చారు. 65 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 65 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, అర్జీదారులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని, చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యకర్తను బెదిరించిన టీడీపీ నేతలు ప్రాణహాని ఉందంటూ చేసిన ఫిర్యాదును నీరుగార్చిన పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్న బాధిత మహిళ -
మధురం.. ప్రేమ రామం
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తెలంగాణ సత్యసాయి యూత్ బృందం సభ్యులు సోమవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరం వేదికగా పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. సత్యసాయి తన భక్తులపై చూపిన ప్రేమ, వాత్సల్యాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన భక్తపరివారంపై చూపిన ప్రేమ వాత్సల్యంతో పోల్చుతూ ప్రేమ రామం పేరుతో ప్రదర్శించిన నృత్యరూపకం భక్తులను మైమరిపించింది. రామకథ రసవాహిని పేరుతో సత్యసాయి రాసిన రామగ్రంథం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నృత్యరూపకాన్ని రూపొందించడం విశేషం. అంతకు ముందు ఉదయం శ్రీ సాయి రామ నామామృతం పేరుతో సంగీత కచేరీతో అలరించారు. -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ప్రశాంతి నిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 220 అర్జీలను అందగా...పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. అర్జీలన్నింటికీ నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జిల్లాలో అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్ట్‌లైన హెచ్ఎన్ఎస్ఎస్, నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జిల్లాలో త్వరిత గతిన పూర్తయ్యేలా ఎంపీడీఓలు బాధ్యత తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులందరూ సంబంధిత మండలాలను సందర్శించి అన్ని జీఎస్‌డబ్ల్యూఎస్ నివేదికలను పర్యవేక్షించాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. పీ–4 సర్వే పనులు వేగవంతంగా చేయాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 9 నుంచే ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టరేట్లో వచ్చే వారం నుండీ ఉదయం 9 గంటల నుండీ మద్యాహ్నం 12 గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అధికారులు, ప్రజలు సమయ వేళలు గమనించి అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, పట్టు పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్ కుమార్, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి భాయి, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్రనాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ.. మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ‘మహిళలపై లైంగిక వేధింపుల చట్టం–2013’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతి విభాగంలోను, ప్రతి స్థాయిలోనూ మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు విచారించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
హంతకులకు శిక్ష పడేలా చూడండి
పెనుకొండ రూరల్: రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య హత్య కేసులో పాల్గొన్న అందరి పేర్లు కేసులో నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె లింగమయ్య కుటుంబీకులతో కలిసి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్నను కలిశారు. ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబీకులు హత్యకు దారితీసిన ఘటనల గురించి ఎస్పీకి వివరించారు. ఆరోజు జరిగిన హత్యాకాండలో చాలామంది పాల్గొన్నారని, పోలీసులు మాత్రం ఇద్దరిపైనే కేసు నమోదు చేశారని ఎస్పీకి తెలిపారు. పోలీసులు కావాలనే పలువురి పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారని ఉషశ్రీచరణ్ ఫిర్యాదు చేశారు. మరోసారి విచారించి అందరి పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఉషశ్రీచరణ్ వెంట వైఎస్సార్ సీపీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు సుధాకర్ రెడ్డి, గజేంద్ర తదితరులు ఉన్నారు. హత్యలో పాల్గొన్న వారందరి పేర్లు చేర్చాలి ఎస్పీ రత్నను కోరిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ బాధిత కుటుంబంతో కలిసి వెళ్లి హత్య ఘటన వివరించిన వైనం -
మారణహోమాన్ని ఆపేందుకే జగనన్న రాక
రాప్తాడురూరల్: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ సభలో పాల్గొనేందుకు రావడం లేదు. చీమకు కూడా హాని తలపెట్టని పేద రైతు కురుబ లింగమయ్యను హత్య చేస్తే ఆ కుటుంబానికి అండగా నిలవడానికి, జిల్లాలో మారణ హోమాన్ని ఆపడానికి, మరో రాజకీయ హత్య జరగకూడదనే సందేశం ఇవ్వడానికి వస్తున్నారు’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాపిరెడ్డిపల్లికి వస్తున్న నేపథ్యంలో సోమవారం తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి కుంటిమద్ది మీదుగా పాపిరెడ్డిపల్లి చేరుకుంటారన్నారు. ఇటీవల హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడతారని తెలిపారు. తిరిగి అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని వెల్లడించారు. ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొడదాం జిల్లాలో ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టాలనుకునే విజ్ఞులు, భవిష్యత్తు బాగుండాలని కోరుకునే యువత, రాప్తాడు నియోజకవర్గ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు మేల్కోవాలని ప్రకాష్ రెడ్డి కోరారు. కుట్ర, హత్యా రాజకీయాలు కలగలిసి ప్రభుత్వ మద్దతుతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘నడుచుకుంటూ వస్తారో... సైకిల్, బైకు, ట్రాక్టర్, ఆటోల్లో వస్తారో మీ ఇష్టం. మీరు రావాలి. వస్తేనే జిల్లా నుంచి ఫ్యాక్షన్ భూతాన్ని తరిమికొట్టగలం అనే విషయం గుర్తుంచుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో శాంతి కుసుమాలు మనందరం అభివృద్ధిని కాంక్షిస్తున్నామని, గత ఐదేళ్లూ జగనన్న సంక్షేమాన్ని చూశామని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న హయాంలో శాంతి కుసుమాలు ఎలా వికసించాయో అందరూ చూశారన్నారు. ఒక గొడవ కాని, హత్యకాని జరగకుండా ఐదేళ్లు పరిపాలన సాగించారన్నారు. ‘కూటమి’ అధికారంలోకి రాగానే రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి మారణకాండను ఆపుదామా.. ఆపుదామంటే అందరూ వచ్చి జగనన్నకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ‘ఎవరో కాకమ్మ కథలు చెబుతుంటారు, కుట్రలతో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని, ‘పచ్చ’ మీడియాను ఉపయోగించుకుని జగన్మోహన్రెడ్డిపైనా, నాపైనా దుష్ప్రచారం చేస్తుంటారు. కానీ ఇక్కడ బతకాల్సింది నువ్వు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడుకోవాల్సింది నువ్వు. అది నీ బాధ్యత. ఆ బాధ్యతను నిలబెట్టుకోవడానికి మంగళవారం ఉదయం 9 గంటలకు కుంటిమద్ది గ్రామానికి రావాలి’ అని ఆయన పేర్కొన్నారు. శాంతిస్థాపనకు జగనన్నతో కలిసి కవాతు చేద్దామన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, దుర్మార్గాలను జిల్లా ఓర్చదనే సందేశం ఇద్దామని, జిల్లాను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. చీమకు కూడా హాని తలపెట్టని కురుబ లింగమయ్యను హత్య చేశారు శాంతిస్థాపనకు జగనన్నతో కలిసి కవాతు చేద్దాం ప్రజలకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపు -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించండి
పెట్టుబడులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు అందించేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కలెక్టరేట్ ఆవరణలో జనజీవన రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్‌కు వస్తారని, ప్రకృతి వ్యవసాయంపై వారికి అవగాహన కల్పించేలా ప్రతివారం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు. -
పాపిరెడ్డిపల్లికి కొందరికే అనుమతి
పెనుకొండ: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. సోమవారం ఆమె పెనుకొండలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పాపిరెడ్డిపల్లిలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాపిరెడ్డిపల్లి కుగ్రామం కావడం... రహదారులు చిన్నగా ఉండడంతో ఎక్కువ మంది గ్రామంలో పర్యటించేందుకు వీలు లేదన్నారు. ఈ పరిస్థితి దృష్ట్యా వైఎస్ జగన్ వెంట ఎక్కువ మందిని గ్రామంలోకి అనుమతించబోమన్నారు. పార్టీ నాయకులు పోలీసుల సూచనలు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రితోపాటు అనుమతి కలిగిన నాయకులను మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామని ఎస్పీ తెలిపారు. జగన్‌ను అడ్డుకునే ధైర్యం మాకుంది ● మాలో పరిటాల, చంద్రబాబు, టీడీపీ బ్లడ్ ఉంది ● రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వివాదాస్పద వ్యాఖ్యలు రాప్తాడురూరల్: ‘వైఎస్ జగన్‌ను రాప్తాడు రాకుండా అడ్డుకునే దమ్ము, ధైర్యం మాకున్నాయి. మాలో పరిటాల, చంద్రబాబు, టీడీపీ బ్లడ్ ఉంది. ఆయన ఇక్కడ దిగకుండా తిరిగి పంపే శక్తీ ఉంది’ అంటూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె రామగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ను అడ్డుకుందామంటూ తమ కార్యకర్తలు, నాయకులంతా కోరుతున్నారని తెలిపారు. పర్యటనకు వచ్చే జగన్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సాయం చేయాలని సూచించారు. టీడీపీ నేతలు ఎక్కడా సంయమనం కోల్పోవద్దన్నారు. సింహ వాహనంపై రంగనాథుడు తాడిపత్రి: ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రాత్రి సింహ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. రంగనాథస్వామిని ప్రత్యేక పూలు, ఆభరణాలతో అర్చకులు అలంకరించారు. రాత్రి సింహ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. -
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు
ధర్మవరం: స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ పోటీలు రెండో రోజు సోమవారం హోరాహోరీగా సాగాయి. ప్రకాశం జిల్లా జట్టుపై అనంతపురం జిల్లా జట్టు 3–1 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఏలూరు జట్టుపై విశాఖ జట్టు 8–1, గుంటూరు జట్టుపై అన్నమయ్య జిల్లా జట్టు 6–1, ఎన్టీఆర్ జిల్లా జట్టుపై వైఎస్సార్ జిల్లా జట్టు 7–0, ఏలూరు జట్టుపై శ్రీకాకుళం జట్టు 2–0, చిత్తూరు జిల్లా జట్టుపై కాకినాడ జట్టు 6–0, నంద్యాల జిల్లా జట్టుపై అనంతపురం జిల్లా జట్టు 5–0 గోల్స్ తేడాతో గెలుపొందాయి. తిరుపతి – అనకాపల్లి, అన్నమయ్య– శ్రీకాకుళం, కాకినాడ – అనంతపురం, వైఎస్సార్ – శ్రీసత్యసాయి జిల్లా జట్ల మధ్య మంగళవారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పోటీలను హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణుక్యరాజు, ట్రెజరర్ థామస్ పీటర్, శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, ఉపాధ్యక్షుడు గౌరిప్రసాద్, కోచ్ హసేన్ పర్యవేక్షించారు. -
భూసేకరణతో పొట్ట కొడతారా?
అగళి: పరిశ్రమల ఏర్పాటుకు తమ భూములు ఇవ్వబోమని హెచ్.డి.హళ్లి పంచాయతీ గాయత్రీ కాలనీ, ఉల్లేకెర, దేవరహళ్లి, సుగాలి తండా, వడ్రహట్టి, పి.బ్యాడగేర గ్రామాల రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఇటీవల పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తమ భూములను కలెక్టర్ పరిశీలించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేందుకు తాము సుముఖంగా లేమని తేల్చి చెప్పారు. తమకున్న అరకొర భూములను పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం తీసుకుంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా భూసేకరణ ప్రక్రియ చేపట్టి పొట్ట కొట్టరాదంటూ తహసీల్దార్ సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని తహసీల్దార్ ఇచ్చిన హామీతో ఆందోళనను రైతులు విరమించారు.విద్యుదాఘాతంతో రైతు మృతిపుట్టపర్తి అర్బన్: విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందాడు. పుట్టపర్తి రూరల్ పీఎస్ ఏఎస్ఐ ప్రసాద్ తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం రాచువారిపల్లికి చెందిన నంబూరి ప్రసాద్(45)కు భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రసాద్... తనకున్న ఎనిమిది ఎకరాల్లో వరి, కళింగర, దోస పంటలను సాగు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో విద్యుత్ సరఫరా కావడంతో పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో స్టార్టర్ పెట్టెలో బటన్ నొక్కినా మోటార్ ఆన్ కాకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద కేబుల్‌ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో బోరు మోటార్ ఆన్ చేసి వస్తానంటూ వెళ్లిన వ్యక్తి ఎంతకూ రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన సెల్‌ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ లోపు పొలం వద్ద నుంచి వచ్చిన చుట్టుపక్కల రైతులు.. నంబూరి ప్రసాద్ మృతిచెందినట్లు తెలపడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ పొలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. చంద్రకళ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
మా భూములను లాక్కుంటున్నారు
బత్తలపల్లి: ‘‘నిరుపేదలమైన మాకు గతంలో ప్రభుత్వం భూ పంపిణీ కింద పొలాలు పంపిణీ చేసింది. వాటిని సాగుచేసుకుంటూ మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు అధికార పార్టీ అండతో కొందరు మా భూములను ఆక్రమించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. మీరే తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి’’ అని బత్తలపల్లి మండలం సూర్యచంద్రాపురం గ్రామస్తులు సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు విన్నవించారు. తమకు 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దంపెట్ల గ్రామ పొలంలోని 107 సర్వే నంబర్లో 11 మంది ఎరికల కులస్థులకు 2 ఎకరాలు చొప్పున పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పట్టాలు పొందిన తర్వాత తామే సాగులో ఉన్నామన్నారు. అయితే వర్షాభావం వల్ల పెట్టుబడులు రాకపోవడంతో ప్రస్తుతం పంటలు సాగు చేయలేకపోయామి, దీంతో అక్కడ కంపచెట్లు పెరిగాయన్నారు. రీ సర్వే నేపథ్యంలో భూముల్లో కంపచెట్లు తలగించుకునేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇంతలోనే దంపెట్ల గ్రామానికి చెందిన హరిదాసు అనే వ్యక్తి తన తోటకు దగ్గరగా ఉన్న తమ భూముల్లో రాత్రికి రాత్రే జేసీబీతో కంపచెట్లు తొలగించి మామిడి మొక్కలు నాటుతుండగా అడ్డుపడ్డామన్నారు. దీంతో తమను కులం పేరుతో దూషించి, బెదిరించి అక్కడ నుంచి తరమి వేశారని కలెక్టర్‌కు తమ బోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత తహసీల్దార్, వీఆర్ఓలకు ఫిర్యాదు చేయగా.. వారుు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. తమ జీవనాధారమైన పొలం ఆక్రమణకు గురికాకుండా న్యాయం చేయాలని బాధితులు నాగేంద్రమ్మ, ఉమాదేవి, రామలక్ష్మి, రామాంజినమ్మ, లావణ్య, నారాయణమ్మ, లలక్ష్మీదేవి, సామ్మ, వనజ, మణేమ్మ, లక్ష్మమ్మ తదితరులు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గిరిజన మహిళలు -
నీలకంఠాపురంలో సామూహిక వివాహాలు
మడకశిర రూరల్: శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మడకశిర మండలం నీలకంఠాపురంలో వెలిసిన నీలకంఠేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం ఉచిత సామూహిక వివాహాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎన్ రఘువీరారెడ్డి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో 18 జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యాయి. అంతకు ముందు సీతారాముల కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కర్ణాటకలోని పట్టనాయకనహళ్లి నంజావధూతస్వామి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నూతన జంటలకు తాళిబొట్లు, నూతన వస్త్రాలు, కాలిమెట్లను నంజావధూతస్వామి, రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు అందించి ఆశ్వీదించారు. వేడుకకు హాజరైన వందలాది మందికి పెళ్లి విందు భోజనం ఏర్పాటు చేశారు. కాగా, శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, సేవామందిర విద్యాసంస్థల అధినేత కేటీ శ్రీధర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ కళావతి, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
వైభవంగా ‘వేమన’ ఉత్సవాలు
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో రెండో రోజు సోమవారం రాత్రి విశ్వకవి యోగి వేమన ఉత్సవాలు వైభవంగా సాగాయి. పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో వేమన సమాధిని ప్రత్యేకంగా ఆలంకరించి విశేష పూజలు చేశారు. కదిరి పరిసర మండలాల నుంచే కాక వైఎస్సార్ జిల్లా, కర్నూలు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వేమన ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. భక్తులకు పీఠాధిపతి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి చిన్నారుల శాసీ్త్రయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాటల కచేరీ అలరించింది. -
‘స్టార్’ తిరగబడింది!
తాడిపత్రి టౌన్: ‘బిజినెస్ చేయాలనుకున్నారా?. సొంత ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు లేక ఆగిపోయారా? ఇప్పుడు మీ కలలను సాకారం చేసేందుకు స్టార్ ఫైనాన్స్ మీ ముందుకు వచ్చింది. సిబిల్ స్కోర్ లేకున్నా మీకు రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఊరించి నెల రోజులు తిరగకుండానే బాధితులకు రూ.6 లక్షల కుచ్చుటోిపీ పెట్టి తాడిపత్రిలో ఓ ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. వివరాలు... తాడిపత్రి మండలం కొండేపల్లికి చెందని సాగిబండ భాస్కర్... స్థానిక నంద్యాల రోడ్డులో ఓ గదిని అద్దెకు తీసుకుని స్టార్ పైనాన్స్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. సిబిల్ స్కోర్ లేకపోయినా వ్యక్తిగత రుణాలు, బిజినెస్ లోన్లు, హౌస్.. ప్లాట్ లోన్లు ఇస్తామంటూ ఆకర్షణీయమైన ఫ్లెక్సీలో విస్తృత ప్రచారం చేశాడు. నెలకు రూ.10వేల వేతనంతో దాదాపు 20 మంది సిబ్బందిని నియమించుకుని ఆర్థిక ఇబ్బందులతో బాదపడుతున్న వారిపై ఉసిగొల్పాడు. ఎదుటి వ్యక్తి అవసరాలను బట్టి రుణం మంజూరుకు సంబంధించి రూ.లక్షకు 6 శాతం చొప్పున ప్రాసెసింగ్ పీజును ముందుగానే రాబట్టుకున్నాడు. ఇలా దాదాపు 35 మందితో రూ.6 లక్షలు వసూలు చేసుకుని 30 రోజుల్లోపు రుణం మొత్తం వారి బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందని నమ్మబలికాడు. దాదాపు నెల రోజలకు పైగా గడుస్తున్నా బ్యాంక్ ఖాతాలకు రుణం మొత్తం జమ కాకపోవడంతో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన పలువురు నేరుగా కార్యాలయానికి చేరుకుని అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. దీంతో రేపోమాపో వస్తుందని చెబుతూ వచ్చిన సిబ్బంది సైతం ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుడు భాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో లబోదిబో మంటూ బాధితులతో కలసి సోమవారం ఏఎస్సీ రోహిత్‌కుమార్‌ను కలసి సమస్య విన్నవించారు. ఘటనపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. తాడిపత్రిలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ రూ.6 లక్షలతో ఉడాయించిన సంస్థ ఇన్చార్జ్ భాస్కర్ సంస్థ సిబ్బందిని నిలదీస్తున్న బాధితులు పోలీసులను ఆశ్రయించిన సిబ్బంది, బాధితులు -
సాంకేతిక విద్య.. ఉజ్వల భవిత
అనంతపురం: డిప్లొమా కోర్సులకు డిమాండ్ భారీగా నెలకొంది. ఈ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తయిన విద్యార్థులు పాలీసెట్ రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ పాలీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులకు ఆసక్తి ఉన్న ఏ కోర్సులోనైనా చేరి ఇష్టంగా చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చిరుప్రాయంలోనే ఐదు అంకెల వేతనం.. పూర్తిగా ప్రాక్టికల్ ఓరియంటేడ్ సిలబస్ ఉన్న పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. దీంతో 19 సంవత్సరాల్లోపే రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం అందుకునే అవకాశముంది. తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య పూర్తి చేసే అవకాశం కేవలం డిప్లొమా కోర్సులతోనే సాధ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. సింహభాగం కంపెనీలు సైతం ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారి కంటే డిప్లొమా పూర్తి చేసిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిప్లొమా కోర్సుల్లో విద్యార్థులను తీర్చిదిద్దడమే ఇందుకు కారణం. ఇంటర్మీడియట్ తరువాత ఇంజినీరింగ్ కోర్సు చదివితే ఆరు సంవత్సరాల కాల వ్యవధి అనివార్యం. ఇలా కాకుండా కేవలం పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం మూడేళ్లలో డిప్లొమా కోర్సు పూర్తి చేస్తే కొలువు దక్కడం ఖాయమని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కోర్ బ్రాంచ్లే అధికం.. ఇంజినీరింగ్‌లో కోర్ బ్రాంచ్‌ల్లో గణనీయంగా అడ్మిషన్లు పడిపోయి కొత్త బ్రాంచ్‌ల వైపు విద్యార్థులు చూస్తున్నాయి. కానీ డిప్లొమోలో కోర్ బ్రాంచ్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి కోర్ బ్రాంచ్‌లతో పాటు కంప్యూటర్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులువుగా దక్కుతాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కళాశాలల్లో తరచూ ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో కోర్సు పూర్తి చేయడానికి మూడేళ్లకు కలిపి కేవలం రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ కింద) నేరుగా చేరవచ్చు. లేదా ఉద్యోగంలో చేరవచ్చు. పాలీసెట్ ఎంట్రెన్స్ ఇలా.. పాలీసెట్‌ను 120 మార్కులకు నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ నెల 30న పాలీసెట్ నిర్వహించనున్నారు. డిప్లొమా కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఈ నెల 30న పాలీసెట్ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ -
ఎఫ్‌వీఎఫ్ – బీపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
బత్తలపల్లి: ఏడీసీఏ ఆధ్వర్యంలో బత్తలపల్లిలోని ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, బీపీఎల్ సీజన్–3 క్రికెట్ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. ఆర్డీటీ ఆర్డీ ప్రమీల, ఏపీ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల విజయ్‌కుమార్, సీఐలు నాగేంద్ర, ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విభేదాలకు తావివ్వకుండా క్రీడాస్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ఈ పోటీలు ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయన్నారు. అనంతరం టీమ్ అన్నీ, టీమ్ మాంఛో, టీమ్ విష, టీమ్ విన్సెంట్, ఎంవీఎం, ఆర్డీటీ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో క్రికెట్ కోచ్ జయరాం తదితరులు పాల్గొన్నారు.హిటాచీకి నిప్పుధర్మవరం రూరల్: మండలంలోని ఓబుళనాయనపల్లి సమీపంలోని గుట్టలో మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్న హిటాచీన వాహనానికి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన మేరకు... ఓబుళనాయనపల్లి వద్ద ఉన్న గుట్టలోని మట్టిని టిప్పర్లకు వేసేందుకు ధర్మవరం పట్టణానికి చెందిన కిషోర్ వద్ద ఉన్న హిటాచీ వాహనాన్ని శివ లీజుకు తీసుకున్నాడు. శనివారం రాత్రి హిటాచీని అక్కడే ఉంచి డ్రైవర్, హెల్పరు ఇంటికి వెళ్లిపోయారు. ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దుండగులు వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో పూర్తిగా కాలిపోయింది. ఆదివారం ఉదయం అక్కడికెళ్లిన డ్రైవర్ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో ధర్మవరం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మట్టి తవ్వకాల్లో తలెత్తిన విభేదాల కారణంగా నిప్పు పెట్టి ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు.సంతల ఆదాయం రూ.3.66 లక్షలుఅనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణంలో ఈవారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.3.66 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత నుంచి రూ.2,25,090 వసూలు కాగా.. ఆదివారం జరిగిన పశువులు, గేదెలు, ఎద్దుల సంత నుంచి రూ.1,41,350 మేర వసూలైనట్లు పేర్కొన్నారు. -
వాహనం ఢీకొని నక్క మృతి
రొళ్ల: మండలంలోని టీడీ పల్లి క్రాస్ సమీపంలో 544ఈ జాతీయ రహదారి మలుపు వద్ద ఆదివారం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని నక్క మృతి చెందింది. అటవీ ప్రాంతంలో తాగునీరు, సరైన ఆహారం లభ్యం కాక కొడగార్లగుట్ట గ్రామం వైపుగా వెళుతూ జాతీయ రహదారిని దాటుతున్న క్రమంలో వాహనం ఢీకొని కుడి వైపున ఉన్న రెండు కాళ్లూ విరిగాయి. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న నక్కకు గ్రామస్తులు ఉపశమన చర్యలు చేపట్టారు. రోడ్డు మధ్యలో నుంచి పాకుకుంటూ పక్కనే ఉన్న రాళ్ల మధ్యలోకి దూరింది. సమాచారం అందుకున్న వైల్డ్‌లైఫ్ వాచర్ భీమప్ప అక్కడకు చేరుకుని, గాయపడిన నక్కను ఆస్పత్రికి తరలించేలోపు మరణించింది. అనంతరం టోల్‌ఫ్లాజా సమీపంలో ఉన్న అటవీ శాఖ నర్సరీలో నక్క కళేబరాన్ని ఖననం చేశారు.8న హార్టికల్చర్ రాష్ట్ర సదస్సుకూడేరు: జిల్లా కేంద్రం అనంతపురంలో ఈ నెల 8న రైతు సంఘం ఆధ్వర్యంలో హార్టికల్చర్ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఐ అనుబంధ రైతు సంఘం నాయకులు తెలిపారు. ఆదివారం కూడేరులో రాష్ట్ర సదస్సు కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా, మండల నేతలు రమణ, మలరాయుడు, ప్రసాద్ , వెంకటేష్ పాల్గొన్నారు.నేడు సూరేపల్లిలో జ్యోతుల మహోత్సవంపుట్లూరు: మండలంలోని సూరేపల్లిలో సోమవారం చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతుల మహోత్సవం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చౌడేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు గంగ పూజ, చెక్క భజన ఉంటుందన్నారు. అనంతరం సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ జ్యోతుల ఊరేగింపు చేపడతామన్నారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా
గార్లదిన్నె: శ్రీరామనవమి సందర్భంగా గార్లదిన్నె మండలం కల్లూరులో నిర్వహించిన గ్రామీణ క్రీడాపోటీలు ఉత్సాహంగా... ఉల్లాసంగా సాగాయి. అగ్రహారం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఆదివారం ఈ పోటీలను నిర్వహించారు. పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. 151 కిలోల ఇసుక మూట ఎత్తే పోటీల్లో పాల్తూరు రాజు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానంలో కల్లూరు సుధాకర్ నిలిచాడు. 146 కిలోల బరువున్న గుండును ఎత్తే పోటీల్లో మాధవరం రాజశేఖర్ మొదటి స్థానం, ప్యాపిలి మండలానికి చెందిన ఈశ్వరరెడ్డి రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. 60 కిలోల బరువున బండను ఒక్క చేతితో పైకి ఎత్తే పోటీల్లో మొదటి స్థానాన్ని హుస్సేన్ దక్కించుకోగా, రెండో స్థానంలో ఈశ్వరరెడ్డి నిలిచాడు. కర్ర సాము పోటీల్లో మొదటి స్థానంలో రాజేష్, రెండో స్థానంలో యాడికి నాగార్జున గెలుపొందారు.ఇరుసు పోటీల్లో మొదటి స్థానంలో నాగులాపురం వనేంద్ర, రెండవ స్థానంలో వంకరాజుకాలువ నరేష్ నిలిచారు. విజేతలను గ్రామస్తులు అభినందించి, నగదు పురస్కారాలతో సత్కరించారు. -
చేతిలోని మొబైల్ లాక్కెళ్లిన దొంగ
రాప్తాడు రూరల్: చేతిలో మొబైల్ పట్టుకుని చూస్తుండగా ఓ యువకుడు లాక్కొని ఉడాయించిన ఘటన ఆదివారం సాయంత్రం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాలు... అనంతపురం రూరల్ మండలం కొడిమి పంచాయతీ దర్గాకొట్టాలుకు చెందిన జాఫర్ పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. వ్యక్తిగత పనిపై ఆదివారం నగరానికి వచ్చిన ఆయన సాయంత్రం బళ్లారి రోడ్డు కూడలిలో ఆటో కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో ఫోన్ రింగ్ కావడంతో జేబులో నుంచి తీసి చూస్తుండగా రెప్పపాటులో ఓ యువకుడు లాక్కొని కళ్యాణదుర్గం రోడ్డు వైపుగా పరుగుతీశాడు. జాఫర్ తేరుకుని గట్టిగా కేకలు వేసినా లాభం లేకపోయింది. చీకట్లు ముసురుకుంటుండడంతో సెకన్లలోనే ఆ యువకుడు కనిపించకుండా పోయాడు. ఇటీవలే రూ. 20 వేలు పెట్టి మొబైల్ కొనుగోలు చేశానని, ఇంతలో ఇలా జరిగిదంటూ బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఘనంగా వేమన ఉత్సవాలు ప్రారంభం
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో వెలసిన విశ్వకవి యోగి వేమన ఆలయంలో ఉత్సవాలు ఆదివారం రాత్రి ఆలయ పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేమన సమాధిని ప్రత్యేకంగా ఆలంకరించి పూజలు చేశారు. కదిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఉడికించిన జొన్నలను భం పోసి పసుపు కుంకుమ కలిపి ఆదిశక్తి పూజలు నిర్వహించారు. అనంతరం జొన్న ధాన్యాన్ని ప్రసాదంగా భక్తులు స్వీకరించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా సోమవారం బండ్ల మెరవణి, ఆర్కెస్ట్రా (పాటల కచేరి) ఉంటుంది. మొక్కుబడి ఉన్న భక్తులు ఎడ్ల బండ్లను అలంకరించి ఆలయం ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు. -
అజరామరం.. రత్నగిరి వైభవం
రొళ్ల: మండలంలోని రత్నగిరిలో నాటి రాచరికపు వైభవం నేటికీ చెక్కుచెదరలేదు. నాడు నిర్మించిన కోటలు, చంద్రశాల, అంతఃపురం, గజశాలలు, రాతి ఏనుగులు, బురుజులు, కళ్యాణిబావులు, మంటపాలు, పురాతన కట్టడాలు, ఊరి చుట్టూ కోట, కొండపై ఎత్తైన బురుజులు, రాతి బండపై ఏర్పాటు చేసిన మెటికెలు ఇలా ఎన్నో కట్టడాలు నేటీకి అలాగే ఉన్నాయి. గ్రామంలో అక్కడక్కడ కనిపించే జైన దేవాలయాను బట్టి చూస్తే ఈ ప్రాంతంలో జైనమతం వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన కొల్హాపురి మహాలక్ష్మీదేవి ఈ గ్రామంలోనే వెలసింది. రాజవంశీకులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారు, సమీపంలోని కర్ణాటక వాసులు తమ ఇలవేల్పుగా అమ్మవారిని కొలుస్తుంటారు. ఆరు శతాబ్దాల నాటి ఆలయం రత్నగిరిలో వెలసిన కొల్హాపురి మహాలక్ష్మి ఆలయానికి దాదాపు 628 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. వారు చెబుతున్న కథనం మేరకు.. ‘పూర్వం చౌళ రాజుల వంశానికి చెందిన రత్నగిరి సంస్థాన మహారాజైన కృష్ణప్పరాజు... సురుపూర్కు చెందిన రాణి గౌడమ్మను వివాహం చేసుకున్నాడు. అప్పట్లో రాణి గౌడమ్మను రత్నగిరి సంస్థానానికి గుర్రపు మార్గాన తీసుకొస్తున్నప్పుడు ఓ రకమైన శబ్ధం రావడంతో ప్రశ్నించారు. నేను కొల్హాపురి మహాలక్ష్మీదేవిని మీ సంస్థానంలో కొలువుదీరేందుకు మీ వెంట అరిసిన కుంకుమ రూపంలో వస్తున్నానని అశరీరవాణి చెబుతుంది. రాణి గౌడమ్మ సంస్థానానికి వచ్చిన మరుసటి రోజు అమ్మవారు అరిసిన కుంకుమ (పసుపు కుంకుమ) రూపంలో కొలువుదీరింది. క్రమేణ దానిపై నాగుల పుట్ట పెరుగుతుంది. దీంతో కృష్ణప్పరాజు, రాణిగౌడమ్మ అప్పట్లో గారతో అమ్మవారి (కొల్హాపురి మహాలక్ష్మీదేవి) ప్రతిమను చేయించి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో విశేష పూజలు కొనసాగుతూ వస్తున్నాయి.’ 13వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు రత్నగిరిలో కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజవంశీకుడు రంగప్పరాజు (దొర), ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. 13న జలధి ఉత్సవం, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 14న బ్రహ్మరథోత్సవం, ధూళోత్సవం, 15న జలధి, కలశ ఉత్సవం, గంగ పూజ, 16 నుంచి 19వ తేదీ వరకు అమ్మవారికి జ్యోతుల ఉత్సవాలు, 20న అమ్మవారికి పుష్పాలంకారణ, పోతులరాజుల విశేష పూజ, 21న పోతురాజు బండార కార్యక్రమం, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా పశువుల జాతరను నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాలకు వచ్చి వెళ్లే భక్తుల సౌకర్యార్థం మడకశిర డిపోతో పాటు కర్నాటకలోని మధుగిరి, శిర, పావగడ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. నేటికి చెక్కు చెదరని కోటలు, పురాతన కట్టడాలు భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొల్హాపురి మహాలక్ష్మీదేవి 13 నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు -
రేపు మాజీ సీఎం జగన్ పర్యటన
● పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబానికి పరామర్శ రామగిరి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నాటి జిల్లా పర్యటన ఖరారైంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులైన టీడీపీ నాయకుల చేతిలో దారుణహత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన రానున్నారు. పర్యటన షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గాన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వస్తారు. అక్కడి నుంచి వైఎస్సార్సీపీ నాయకులతో కలసి 10.50 గంటలకు రోడ్డు మార్గాన ఎన్ఎస్ గేట్ మీదుగా బయల్దేరి 11.05 గంటలకు పాపిరెడ్డిపల్లికి చేరుకుంటారు. 12.05 గంటల వరకు లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి కాన్వాయ్‌లో చెన్నేకొత్తపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.30 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయల్దేరుతారు. పర్యటన విజయవంతం చేయండి పెనుకొండ రూరల్ : పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు పాపిరెడ్డిపల్లికి విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఉదయం 9.30 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకోవాలని ఆమె సూచించారు. -
పండుగకు నోచని ఉపాధ్యాయులు
పుట్టపర్తి: శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా రామాలయాలు దర్శించుకుని పండుగ చేసుకున్నారు. అయితే ఉపాధ్యాయులకు ఆ అవకాశం లేకుండా పోయింది. కొత్తచెరువులోని బాల, బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్‌కు దాదాపు 800 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. పండుగకు కూడా సెలవు ఇవ్వకుండా స్పాట్ వాల్యుయేషన్ విధులు అప్పగించడంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కల్టెక్టర్ చేతన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నేడు పోలీస్ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. క్రీడలతో అంతర్జాతీయస్థాయి గుర్తింపు ధర్మవరం: చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం ఊకా అశ్వత్థనారాయణ మెమోరియల్ 15వ హాకీ ఆంధ్రప్రదేశ్ జూనియర్ మెన్ ఇంటర్ డిస్ట్రిక్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలను మంత్రి ప్రారంభించారు. నాలుగు రోజులపాటు సాగే రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి 22 జట్లకు చెందిన 440 మంది క్రీడాకారులు వచ్చారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్మవరంలో టర్ఫ్ హాకీ కోర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తొలిరోజు విజేతలు.. చిత్తూరుతో జరిగిన హాకీ మ్యాచ్‌లో 10 గోల్స్‌తో కాకినాడ విజయం సాధించింది. ఇక నంద్యాల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రకాశం జట్టు ఐదు గోల్స్‌తో గెలుపొందింది. ఇక విశాఖపట్నంతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాకుళం జట్టు 3.2 గోల్స్‌తో విజయం సాధించింది. మన్యం జట్టుపై అన్నమయ్య జట్టు 5 గోల్స్‌తో గెలుపొందింది. నెల్లూరు జట్టుపై 5 గోల్స్‌తో తిరుపతి జట్టు విజేతగా నిలిచింది. వెస్ట్ గోదావరి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2 గోల్స్‌తో అనకాలపల్లి జట్టు విజయం సాధించింది. కర్నూలు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 12 గోల్స్‌తో కడప విజేతగా నిలిచింది. కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చాణక్యరాజు, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్, కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి థామస్, సౌత్ రైల్వే ఆఫీసర్ కత్తి గీతారెడ్డి, ఆర్డీఓ మహే ష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, జనసేనపార్టీ ఇన్చార్జ్ చిలకం మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకూడేరు: ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు... జయపురానికి చెందిన మదన్మోహన్, సునీత దంపతులకు కుమార్తె అర్చన (16), ఓ కుమారుడు ఉన్నారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న అర్చన ఇటీవల మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి చేరుకుంది. పరీక్షలు సక్రమంగా రాయలేకపోయానని, ఫెయిల్ అవుతానంటూ తల్లిదండ్రులతో చెప్పుకుని బాధపడేది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైన అర్చన... ఆదివారం వేకువజామున ఇంట్లోనే బాత్రూమ్లో ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
రొళ్ల: అతివేగం రెండు ప్రాణాలను బలిగొంది. ఓవర్ టేక్ చేసే క్రమంలో టిప్పర్‌ను టాటాఏస్ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రొళ్ల మండలం బీజీ హళ్లికి చెందిన తిప్పేస్వామి కుమార్తె త్రివేణి (26)కి కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకా కాటగానహళ్లి చెందిన సిద్ధగంగతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల తర్వాత కుటుంబ కలహాల కారణంగా త్రివేణి పుట్టింటికి వచ్చేసింది. ఇంటి వద్ద ఖాళీగా ఉండలేక బెంగళూరులోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. శ్రీరామ నవమి పండుగ నిమిత్తం త్రివేణి పుట్టింటికి వచ్చింది. వరుసకు మామ అయిన మల్లసముద్రం గ్రామానికి చెందిన బద్రీనాథ్ టాటా ఏస్ వాహనంలో బంధువు, అమరాపురం మండలం పి.శివరం గ్రామానికి చెందిన కుమార్ (35) బెంగళూరులో నివాసం ఉండేందుకు ఆదివారం అవసరమైన సామగ్రి వేసుకుని వెళ్తుండగా.. త్రివేణి కూడా అందులోనే బయల్దేరింది. బెంగళూరు సమీపాన నెలమంగల వద్ద జాతీయ రహదారి–4పై ఓవర్టేక్ చేసే క్రమంలో టాటా ఏస్ వాహనం అదుపుతప్పి టిప్పర్ లారీని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో త్రివేణి, కుమార్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బద్రీనాథ్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కుమార్‌కు భార్య శివమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. టిప్పర్‌ను ఢీకొన్న టాటాఏస్ ఇద్దరు దుర్మరణం.. మరొకరికి గాయాలు బెంగళూరు సమీపాన నెలమంగళ వద్ద ఘటన -
సీతారాముల కల్యాణ వైభోగమే..
ప్రశాంతి నిలయం: సీతారాముల కల్యాణం భక్తజనం కనులారా తిలకించి తరించింది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సత్యసాయి భక్తులు యజుర్ మందిరం నుంచి సీతారామ లక్ష్మణ సమేత హనుంతుల చిత్రపటాలతో పాటు కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలు, తీపివస్తువులు, నూతన వస్త్రాలను ర్యాలీగా తీసుకువచ్చారు. తర్వాత వేదపండితులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో సీతారామ లక్ష్మణ సమేత హనుంతులను, సత్యసాయిని కీర్తించారు. సాయంత్రం మృదురవళి దర్బా బృందం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మైమరిపించింది. -
●కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లాకు 8న వైఎస్ జగన్ రాక ●పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలపాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ‘‘ఫ్యాక్షన్ ఆనవాళ్లే ఉండకూడదని గడిచిన ఐదేళ్లలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఈ కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం సాగవు. చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ మజ్జిగ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 8న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్న నేపథ్యంలో శనివారం నగరంలోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మాజీ మంత్రి శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8న ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా 10 గంటలకు పాపిరెడ్డిపల్లికి చేరుకుని లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను కాపాడే అంశంలో తరతమ భేదాలు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులు నిత్యకృత్యమయ్యా యన్నారు. కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను హతమార్చడం వారి క్రూర ఆలోచన విధానానికి అద్దం పడుతోందన్నారు. ఎన్నికలకు ముందు అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పది నెలలవుతున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదని విమర్శించారు.సమావేశంలో మేయర్ వసీం, వైఎస్సార్ సీపీ కదిరి, మడకశిర నియోజకవర్గాల సమన్వయకర్తలు మక్బూల్‌బాషా, ఈరలక్కప్ప, ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, మహాలక్ష్మీ శ్రీనివాస్, నదీం అహమ్మద్, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, గంగుల భానుమతి, మీసాల రంగన్న, పామిడి వీరా, రంగంపేట గోపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులుపాల్గొన్నారు. ప్రజల్లో భయం పుట్టించేందుకే కురుబ లింగమయ్య హత్య దారుణ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలి లింగమయ్యలా మరో కార్యకర్తకు అన్యాయం జరగకూడదు వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పిలుపు మాజీ సీఎం పర్యటన ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం -
రెవెన్యూ రాజకీయం!
● జిల్లేడు బండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే ధర్మవరం నియోజకవర్గంలో 23 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి..ఈ ప్రాజెక్టుకు ఇంకా 2 వేల ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. నిర్వాసితులకు భూ పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ రెవెన్యూ అధికారులకు తీరిక లేదు. ● ధర్మవరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు కదిరిగేట్ వద్ద రూ.50 కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆర్ఓబీ కింద ఇళ్లు కోల్పోయే వారికి పరిహారం ఇచ్చేందుకు రూ.30 కోట్లు కూడా విడుదల చేసింది. ఇంకా 23 ఇళ్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించేందుకు కూడా రెవెన్యూ అధికారులకు సమయం ఉండటం లేదు. ● బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లోని చిత్రావతి నది పరీవాహక ప్రాంతం నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతోంది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఎందుకంటే ఈ దందా అంతా కూటమి నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. ...ధర్మవరం నియోజకవర్గంలో రెవెన్యూ ఉన్నతాధికారుల పనితీరుకు పై ఉదాహరణలే నిదర్శనం. మరైతే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటే... అధికారంలో ఉన్న కూటమి నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. వారి సేవలో తరిస్తూ అక్రమాలకు అధికార ముద్ర వేస్తున్నారు. వివాదాస్పద విషయాల్లో తలదూరుస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ధర్మవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరగానే రెవెన్యూశాఖలోని కొందరు అధికారులు రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారు. పోస్టింగ్ ఇప్పించారని కొందరు.. బాగా డబ్బులు ముట్టజెపుతున్నారని మరికొందరు.. చెప్పిన మాట వినకపోతే బదిలీ చేయిస్తారన్న భయంతో ఇంకొందరు రాజకీయ నాయకుల సేవల్లో తరిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి మద్దతు పలుకుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నారు. రస్తా వివాదం ఉందంటే... అధికార పార్టీ సానుభూతిపరులకే ఏకపక్షంగా మద్దతుగా నిలుస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారు. ఫ్రీ హోల్డ్ జీఓలో నిబంధనలు విస్మరించి మరీ అధికార పార్టీ నేతలకు మేలు చేస్తూ సామాన్యులకు అన్యాయం చేస్తున్నారు. చివరకు కోర్టు పరిధిలోని అంశాల్లోనూ తలదూరుస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అధికార పార్టీ విమర్శలు..రెవెన్యూ చర్యలు.. రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని చెప్పేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫాంహౌస్ వివాదంలో తలదూర్చడమే ఉదాహరణగా చెప్పవచ్చు. ధర్మవరం మండలం తుంపర్తి సమీపంలో నిర్మించిన ఫాంహౌస్ కోసం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ అధికారపార్టీ నాయకులు ఆరోపిస్తుండగా... వాటిని వాస్తవమని తేల్చేందుకు రెవెన్యూ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఫాంహౌస్ కోసం 40 ఎకరాల అసైన్డ్ భూములు ఆక్రమించారని కూటమి పార్టీల నేతలు కేతిరెడ్డిపై ఆరోపణలు చేశారు. దీనిపై కేతిరెడ్డి ఇప్పటికే పలు మార్లు ఆధారాలతో సహా మీడియా ముఖంగా వివరించారు. దీంతో కూటమి నేతలు తాజాగా 2.50 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశారంటూ రెవెన్యూ అధికారులతో ఎల్లో మీడియాకు లీకులు ఇప్పించారు. వాస్తవానికి కేతిరెడ్డి తన సోదరుడి సతీమణి గాలి వసుమతి పేరిట 1932లోనే భూ యజమాన్య హక్కులు పొందిన రైతుల వారసులతో 25.38 ఎకరాలు మార్కెట్ ధరకు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను కేతిరెడ్డి గతంలో మీడియాకు చూపించారు. దీంతో ఎలాగైనా కేతిరెడ్డి మీద బురదజల్లాలన్న ఉద్దేశంతో కూటమి నాయకులు తాజాగా 2.50 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఆ భూమిని నిబంధనలకు లోబడే అధికారులు రిజిస్టర్ చేశారు. ఇదే విషయమై హైకోర్టులో కేతిరెడ్డి పిటిషన్ వేయడంతో కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. అయినా రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కేతిరెడ్డిపైన బురద జల్లేందుకు రెవెన్యూ డివిజన్లో ఓ ఉన్నతాధికారి రాత్రింబవళ్లు శ్రమిస్తూ కింది స్థాయి సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. ఇలా నేతల రాజకీయ పనుల కోసం కాకుండా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమయం కేటాయించాలని నియోజకవర్గ ప్రజలు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. రాజకీయ నాయకుల కక్ష సాధింపులకే అహర్నిశలు కృషి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు.. సమస్యలు పరిష్కరించాలని వేడుకోలు ధర్మవరంలో విస్మయం కల్గిస్తున్న రెవెన్యూ అధికారుల వైఖరి అభివృద్ధి పనులకు అడ్డంకులున్నా... పట్టించుకోని వైనం -
అరాచకాలు పేట్రేగిపోయాయి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు పేట్రేగిపోయాయి. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితిని టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కల్పించలేదు. స్థానిక సంస్థల స్థానాల్లో ఏమాత్రం బలం లేకపోయినా పోలీసు, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని కుట్ర చేశారు. ఇందులో భాగంగానే కురుబ లింగమయ్యను హత్య చేశారు. ఎస్పీ దుస్తులను కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వేసుకుని పోలీసు వ్యవస్థను శాసిస్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గంలో అడుగుపెట్టకూడదంటే పోలీసులు అదే అమలు చేయడం అన్యాయం. ప్రతి కార్యకర్తకు ధైర్యం నింపేందుకే వైఎస్ జగన్ జిల్లాకు వస్తున్నారు. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు -
కేసులకు భయపడొద్దు
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని మనల్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. పోలీసుల కేసులకు ఎవరూ భయపడొద్దు. నాకు జైలు, బెయిలు కొత్తకాదు. రెండున్నరేళ్లు జైలు జీవితం గడిపా. మహా అంటే కేసులు నమోదు చేస్తారు, లేదంటే రిమాండ్‌కు పంపుతారు, అంతకంటే ఏం చేస్తారు. కార్యకర్తలెవరూ భయపడొద్దు. రాజన్న భక్తులు, జగనన్న సైనికులు 8న పాపిరెడ్డిపల్లికి తరలిరావాలి. చంద్రబాబు చేతిలో మోసపోయిన మహిళలు, నిరుద్యోగులు, రైతులు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి జగనన్నకు సంఘీభావం తెలపాలి. లింగమయ్యదే చివరి రాజకీయ హత్య కావాలి. ఈ ఘటనను అన్ని రాజకీయ పార్టీలు ఖండిం చాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే నేర వ్యవస్థ రాప్తాడు నియోజకవర్గంలో ఉంది. ఈ సంప్రదాయాన్ని ఇక్కడే అణిచి వేయాలి. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
జగ్జీవన్‌రామ్ సేవలు వెలకట్టలేనివి
పుట్టపర్తి టౌన్: కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దాదాపు మూడు శతాబ్దాల పాటు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శనివారం స్థానిక సాయిఆరామంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ 118 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టీఎస్ చేతన్, ఎస్పీ రత్న ముఖ్యఅతిథులుగా హాజరై అధికారులతో కలసి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... విద్యతోనే సమాజంలో అసమానతలు రూపుమాపడం సాధ్యమని నమ్మిన జగ్జీవన్‌రామ్...నిరుపేదల జీవితాల్లో విద్యావెలుగులు నింపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వ్యవసాయ మంత్రిగా కరువు నివారణ చర్యలు చేపట్టి హరిత విప్లవాన్ని ప్రోత్సహించారన్నారు. నవ సమాజ స్థాపనకు జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారని, యువత ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, నాయకులు సామకోటి ఆదినారాయణ, పెడపల్లి నరసింహులు, యశోద, పంచరత్నమ్మ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్‌తోపాటు కుల సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జయంతి వేడుకల్లో కలెక్టర్ చేతన్ -
కురుబ లింగమయ్యది రాజకీయ హత్యే
సాక్షి, పుట్టపర్తి: రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యది ముమ్మూటికీ రాజకీయ హత్యే అని వైఎస్సార్సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఎ. శివ స్పష్టం చేశారు. శనివారం ఆయన లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ పరిటాల కుటుంబం ఆధిపత్యం కోసం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా గడిపారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హత్యా రాజకీయాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక బీసీ వర్గానికి చెందిన లింగమయ్యను దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. లింగమయ్య హత్యలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరో వైపు రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి శ్రీకారం చుట్టి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ద్వజమెత్తారు. రాప్తాడులో పరిటాల రాజ్యాంగం నడుస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, హత్యలు చేస్తున్నారని, ఇవి కొన్నాళ్లే అని, తమ ప్రభుత్వం వస్తే అప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి, మంత్రి సవిత కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే అయినా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. త్వరలోనే తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కార్యక్రమంలో హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఆసీఫుల్లా, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మహేష్ గౌడ్, మల్లికార్జున, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీ కులాలపై పరిటాల కుటుంబం కక్ష కట్టింది వైఎస్సార్సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ ధ్వజం -
జానపదం.. కళా వైభవం
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా తెలంగాణ సత్యసాయి యూత్ సభ్యులు శనివారం పుట్టపర్తికి విచ్చేశారు. ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి అష్టోత్తర శతనామావళి పఠించారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. తెలంగాణ లోని 10 లక్షల మంది భక్తుల ఇళ్లకు సత్యసాయి చిత్రపటాలను పంపిణీ చేసే ‘సాయి ఇన్ ఎవ్రీ హోం’ కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. సాయంత్రం తెలంగాణ జానపద కళా వైభవాన్ని చాటిచెబుతూ యూత్ సభ్యులు చేసిన నృత్య ప్రదర్శనతో భక్తులు మైమరచిపోయారు. -
నేడు వేమన ఆలయంలో మహాశక్తి పూజ
గాండ్లపెంట: విశ్వకవి యోగి వేమన వార్షిక ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని కటారుపల్లిలోని ఆలయంలో ఆదివారం రాత్రి మహాశక్తి పూజ (కుంభం పోయడం) నిర్వహించనున్నట్లు ఆలయ పీఠాధిపతులు చెన్నారెడ్డి, నంద వేమారెడ్డి తెలిపారు. మహాశక్తి పూజతోనే ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేశామన్నారు. మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని వారు వివరించారు. బెంగళూరు–కలబురిగి ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు–కలబురిగి మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను 4 వారాల పాటు తిప్పుతున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరు జంక్షన్ నుంచి (06519) ఈనెల 5, 12, 19, 26వ తేదీల్లో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు కలబురిగి జంక్షన్‌కు రైలు చేరుతుందన్నారు. తిరిగి కలబురిగి జంక్షన్ నుంచి 06,13,20,27వ తేదీల్లో ఉదయం 9.35కు బయలుదేరి అదే రోజు రాత్రి 8 గంటలకు బెంగుళూరు చేరుతుందన్నారు. యలహంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయ రోడ్డు, రాయచూర్, కృష్ణ, యాదగిరి, షాద్‌నగర్ మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. 2టైర్, 3ఏసీ, స్లీపర్ క్లాస్‌తోపాటు జనరల్ బోగీలు ఉంటాయని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్రీడలపైనా ఆసక్తి చూపాలి ● విద్యార్థులకు కలెక్టర్ చేతన్ సూచన పుట్టపర్తి టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి చూపాలని కలెక్టర్ చేతన్ సూచించారు. శనివారం ఆయన ఎనుములపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మోనూ ప్రకారం భోజనం అందుతుందా అంటూ ఆరా తీశారు. క్రీడలవల్ల శరీరదారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. తద్వారా చదువుపై దృష్టి పెట్టవచ్చన్నారు. క్రీడల్లో బాగా రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా ఉంటుందన్నారు. అనంతరం వంగదికి వెళ్లి సామగ్రితో పాటు ప్రభుత్వం అందిస్తున్న కోడిగుడ్లు, బియ్యం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అఽధికారులను ఆదేశించారు. వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మురుగునీరు ఎందుకు నిల్వ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. మొత్తం వసతి గృహం మరమ్మతు పనులు ఐదురోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ అధికారి శివరంగప్రసాద్, అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారి బాలాజీ, సంక్షేమ వసతి గృహ అధికారి విజయకుమార్ తదితరులు ఉన్నారు. -
దేశం గర్వించదగ్గ మహనీయుడు జగ్జీవన్‌రామ్
పుట్టపర్తి టౌన్: స్వాతంత్య్ర సమరయోధుడు, ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ దేశం గర్వించదగ్గ మహనీయుడని ఎస్పీ రత్న కొనియాడారు. శనివారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫెరెన్సు హాలులో బాబు జగ్జీవన్‌రామ్ 118 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రత్న ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిషలూ కృషి చేశారన్నారు. సంస్కరణల కోసం పదవులను సైతం త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు యువతకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసిన ఘనత జగ్జీవన్‌రామ్‌కే దక్కిందన్నారు. బిహార్‌లోని అట్టడుగు వర్గంలో జన్మించి రాజకీయంగా అత్యుత్తమ స్థాయికి ఎదిగిన ఘనత జగ్జీవన్‌రామ్‌కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్ఐలు వలి, మహేష్, ఆర్ఎస్ఐలు వీరన్న, వెంకటేశ్వర్లు, ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్ఐ ప్రదీప్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.జయంతి వేడుకల్లో ఎస్పీ రత్న -
అక్రమాలు కోకొల్లలు..
సంపాదన కోసం ఆ రియల్టర్ అడ్డదారులు తొక్కాడు. సహజ వనరులను కబ్జా చేశాడు. చుట్టుపక్కల రైతులు ఏమైపోతే నాకేంటి.. తనకు అన్ని సౌకర్యాలూ ఉంటే చాలనుకున్నాడు. పలువురు అధికారుల అండతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాడు. చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలు బయటపడుతున్న కొద్దీ విస్తుగొల్పుతున్నాయి. నదీ జలాల అక్రమ నిల్వతో పాటు పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యానికి పాల్పడిన తీరు అందరినీ విస్మయ పరుస్తోంది. అందులోనూ పన్నులు కట్టే వ్యక్తి (ట్యాక్స్‌పేయర్)కి 10 దాకా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉండడం సంచలనం రేపుతోంది. రెడ్డెప్పశెట్టికి కోడూరు సమీపంలోని చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికితోడు చుట్టుపక్కల భూములనూ అక్రమంగా అధీనంలో ఉంచుకున్నాడు. ఇందులో 30 పైచిలుకు బోరుబావులు ఉన్నాయి. వివిధ వ్యక్తుల పేరిట వ్యవసాయం కోసమని ఉచిత విద్యుత్ కనెక్షన్లు తీసుకున్నాడు. అయితే ఆ విద్యుత్‌ను వ్యవసాయానికి కాకుండా ఫ్లోరికల్చర్ – పాలీహౌస్‌లకు వినియోగిస్తున్నాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు నెలకు రూ.30 బిల్లు కాగా, ఫ్లోరికల్చర్ వినియోగానికి ప్రత్యేకంగా అనుమతి పొంది యూనిట్‌కు రూ.4.50 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏడేళ్లుగా వ్యవసాయ కనెక్షన్ల పేరిటే ఫ్లోరి కల్చర్ నడుపుతున్నాడు. రియల్టర్ అక్రమాల గురించి ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. క్షేత్రస్థాయి విచారణ చేపట్టి విద్యుత్ చౌర్యాన్ని గుర్తించారు. ఇటీవలే అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో సదరు రియల్టర్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించి విద్యుత్‌శాఖలోని అధికారులతో ఇప్పటికే మంతనాలు జరిపినట్టుగా విశ్వసనీయ సమాచారం. భారీ విద్యుత్ చౌర్యానికి సంబంధించి రూ.40 లక్షల దాకా జరిమానా విధించాల్సి ఉండగా.. దాన్ని రూ.10 లక్షలకే పరిమితం చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏఈ స్థాయిలో అంతకు మించి ఫైన్ వేసే అవకాశం లేదు. ఉన్నతస్థాయి అధికారులు విచారణ జరిపితే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. ఈ అంశంపై విద్యుత్ శాఖ ఈఈ భూపతిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. నదీ జలాల అక్రమ నిల్వ.. రియల్టర్ రెడ్డెప్పశెట్టి చిత్రావతి నదిపై అనధికారికంగా బ్రిడ్జి నిర్మించి.. నదీ జలాలు దిగువకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశాడు. ఆ నీటిని విద్యుత్ మోటార్ల సాయంతో నిల్వ ఉంచుకుని తన ఫారంపాండ్లు, పాలీహౌస్‌లు, పూలమొక్కలకు మళ్లించాడు. నదీ పరివాహకంలో ఉండే రైతులు నదీ జలాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఇలా ఆదిలోనే అడ్డుకట్ట వేసి జలచౌర్యం చేస్తే దిగువన గల రైతుల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెలరేగిపోతున్న రియల్టర్ రెడ్డెప్పశెట్టి కొందరు అధికారుల అండదండలతోనే.. యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం.. నదీ జలాల అక్రమ వినియోగం పన్ను చెల్లింపుదారుకు ఉచిత విద్యుత్ వర్తింపు ఏమిటో..? ‘సమాజానికి మేలే చేస్తున్నా’ చిత్రావతి నదిపై అనుమతి లేకుండా బ్రిడ్జి నిర్మించడం.. నదీజలాలను అక్రమంగా నిల్వ ఉంచడం.. విద్యుత్ చౌర్యం చేయడం గురించి రియల్టర్ రెడ్డెప్పశెట్టిని ‘సాక్షి’ విలేకరి ప్రశ్నించగా... తాను సమాజానికి మేలే చేస్తున్నానన్నాడు. తన వల్ల ఏ రైతుకూ నష్టం జరగలేదని చెప్పుకొచ్చాడు. అనవసరంగా పత్రికల్లో రాస్తున్నారంటూ చిందులేశాడు. నీ అంతు చూస్తానని విలేకరిని బెదిరించాడు. -
కష్టపడి చదివితే లక్ష్యాలను చేరుకోవచ్చు
ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే తాను ఐఏఎస్ సాధించానని, ఇష్టంతో కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాలనైనా చేరుకోవచ్చని అనంతపురం జాయింట్ కలెక్టర్ శివనారాయణ్‌శర్మ పేర్కొన్నారు. శనివారం అనంతపురంలోని రోటరీపురం వద్ద సీసీఎల్ క్యాంపస్‌లో ఉరవకొండకు చెందిన నిస్వార్థ ఫౌండేషన్, హైదరాబాద్‌కు చెందిన అభయ ఫౌండేషన్ సంయుక్తగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు ‘సూపర్–60’ పేరుతో ఏపీఆర్జేసీ, పాలిసెట్, ఆర్డీటీ సెట్‌కు ఉచిత కోచింగ్ ప్రారంభించాయి. జాయింట్ కలెక్టర్ హాజరై విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల్లో చదవితేనే ర్యాంకులు వస్తాయని అనుకోవడం భ్రమ అని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్ సాధించిన వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. అనంతరం అభయ ఫౌండేషన్ నిర్వాహకులు స్వామి బాలచంద్ర మాట్లాడుతూ రూ.లక్షల కోసం కాకుండా లక్ష్యం కోసం చదవాలని సూచించారు. పరీక్షల కోసం మాత్రమే శిక్షణ కాదని, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఇస్తున్నామని చెప్పారు. నిస్వార్థ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెంకట్ తాటికొండ మాట్లాడుతూ 2047 వికసిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జైకిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగమల్లి ఓబుళేసు, నిస్వార్థ ఫౌండేషన్ సభ్యులు చంద్ర, వాణి, రజినీ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ -
వ్యాపార ప్రణాళికపై శిక్షణ
గుడిబండ: మహిళా సంఘాల్లోని రైతులకు ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ రంగంలో బలోపేతం చేయడం చాలా అవసరమని ఐఐపీఎం ప్రొఫెసర్ నరేంద్రన్ పేర్కొన్నారు. స్థానిక మండల కేంద్రంలోని ఎఫ్‌పీఓ కార్యాలయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వ్యాపార ప్రణాళిక, బ్రాండింగ్, మార్కెటింగ్‌పై మహిళా సంఘాల రైతులకు శనివారం శిక్షణ నిర్వహించారు. ప్రొఫెసర్ నరేంద్రన్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటను నేరుగా అమ్మకుండా ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్మతే అధిక లాభాలు పొందవచ్చునని సూచించారు. అనంతరం పండించిన పంటను గ్రేడింగ్ ఏ విధంగా చేయాలి, గ్రేడింగ్ చేసిన పంటను ఏ విధంగా ప్యాకింగ్ చేయాలి, బ్రాండింగ్ ఏ విధంగా ఉండాలి, పంటను నిల్వ ఎలా చేయాలి, బ్రాండింగ్‌కు ప్రచారం ఏ విధంగా చేయాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. వెలుగు పథకం ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలకు జీవనోపాధిపై ప్రణాళికలు తయారు చేసుకోవాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ రసూల్ కోరారు. కార్యక్రమంలో ఏపీఎం తిప్పన్న, ఎఫ్‌పీఓ సీసీ దేవరాజు, మహిళా సంఘాల రైతులు పాల్గొన్నారు.ఒకే వరుసలో మూడు వాహనాలు ఢీపెనుకొండ రూరల్: దుద్దేబండ మలుపు సమీపంలో శనివారం ఒకే వరుసలో వస్తున్న మూడు వాహనాలు వేగాన్ని అదుపు చేసుకోలేక ఢీకొన్నాయి. కియా స్టేషన్ ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కురుబవాండ్లపల్లికి చెందిన లావణ్య తన భర్తతో కలసి కియా అనుంబంధ పరిశ్రమలో విధులకు ఆటోలో వస్తోంది. మార్గమధ్యంలో దుద్దేబండ మలుపు సమీపంలో స్పీడ్‌బ్రేకర్ వద్ద ఆటోను స్లో చేయడంతో వెనకే వస్తున్న మారుతి కారు ఢీకొంది. అదే సమయంలో వేగంగా వచ్చిన ఐచర్ వాహనం కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న లావణ్య, కారులో ప్రయాణిస్తున్న త్రివేణి గాయపడ్డారు. స్థానికులు 108 వాహనం ద్వారా పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు లావణ్యను అనంతపురం పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాముకాటుతో రైతు మృతి
రొద్దం: పొలం పనులు చేస్తున్న రైతు పాముకాటుకు గురై మృతి చెందాడు. కంబాలపల్లికి చెందిన రైతు కురుబ సిద్దప్ప(48), సువర్ణమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. శనివారం ఉదయం సిద్దప్ప మల్బరి తోటలో గుంటక పాస్తుండగా పాము కాటువేసింది. ఏదో పుల్ల గుచ్చుకుందని భావించి అలాగే పనిలో నిమగ్నమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలో ఉడిపోయాడు. అటు వైపు వెళ్లిన కొందరు గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వారు హుటాహుటిన పెనుకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గం మధ్యలోనే సిద్దప్ప మృతి చెందినట్లు వైద్యులు వివరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి లేపాక్షి: చోళసముద్రం టోల్ గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం పరిగి మండలం శ్రీరంగరాజుపల్లికి చెందిన భాగ్యరాజ్ (23) పని నిమిత్తం చిలమత్తూరుకు వెళ్లాడు. పని ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా చోళసముద్రం టోల్గేట్ సమీపంలో లేపాక్షి మండలం గలిబిపల్లికి చెందిన నాగరాజు ద్విచక్రవాహనంపై వస్తూ ఎదురుగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో భాగ్యరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాగరాజును 1033 వాహనంలో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మానసికరోగి బలవన్మరణంపావగడ: కణివేనహళ్ళికి చెందిన మానసిక రోగి హనుమంతరాయప్ప(40) చాకుతో గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. సంజీవమ్మ, నారాయణప్ప దంపతుల కుమారుడు హనుమనంతంతరాయప్ప. ఈయనకు భార్య ఈరమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఐదారు నెలలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని ఇంట్లోనే ఉంచి కాపలా ఉండేవారు. అయినా కళ్లుగప్పి పలుమార్లు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండగా హనుమంతరాయప్ప తప్పించుకుని ఊరి బయట ఉన్న మొక్కజొన్నతోటలోకి వెళ్లాడు. అక్కడ చాకుతో గొంతు కోసుకుంటుండగా గ్రామస్తులు గమనించి వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తుమకూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సీఐ సురేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఎకై ్సజ్‌లో 44 మందికి ఎస్ఐలుగా అడ్హాక్ పదోన్నతి
కర్నూలు : ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తూ ఆ శాఖ నోడల్ అధికారి (డిప్యూటీ కమిషనర్) శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి బదిలీల్లో భాగంగా వారికి స్టేషన్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా ఎస్ఐలకు సంబంధించి మరో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీరి సీనియారిటీ జాబితా త్వరలోనే రూపొందించి ఆయా పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. పదోన్నతి పొందిన వారందరికీ శుక్రవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ప్రమోషన్‌తో పాటు పోస్టింగ్ కాపీలను డీసీ శ్రీదేవి అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదోన్నతి దక్కిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని డీపీఈఓలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షేక్ రవితేజ ఉన్నారు. ఆయనకు కర్నూలు ఎసీ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. -
కేఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా
అమరాపురం: మండలంలోని కె.శివరం గ్రామ చెరువు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున కేఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వివరాలు... కర్ణాటకలోని శిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పావగడ తాలూకా సాసలకుంట గ్రామం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు బెంగళూరుకు బయలు దేరింది. అమరాపురం మండలంలోని చిట్నడకు క్రాస్, ఆలదపల్లి, కె.గొల్లహట్టి మీదుగా 4.40 నిమిషాలకు కె.శివరం గ్రామానికి వెళుతుండగా.. చెరువు సమీపంలో రోడ్డుపై ఉన్న మట్టి రాత్రి కురిసిన వర్షానికి బురదగా మారడంతో బస్సు ఓ వైపుగా వాలడం మొదలైంది. ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సు నెమ్మదిగా రోడ్డు పక్కన బోల్తాపడింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన లక్ష్మక్క, కెంచప్ప, శిల్ప, గాయత్రిను 108 వాహనం ద్వారా మడకశిరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఇషాక్‌బాషా అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులు పావగడ తాలూకా ఎస్ఆర్పాళ్యం, కదిరేపల్లి గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పందుల అపహరణ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్ బెళుగుప్ప: గ్రామాల్లో రెక్కీ నిర్వహించి పందులను అపహరించుకెళుతున్న దొంగల ముఠా సభ్యుల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎస్ఐ శివ తెలిపిన మేరకు... ఈ ఏడాది జనవరి 5న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పందులను అపహరించుకుని వెళ్తున్నారంటూ బెళుగుప్పకు చెందిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో కొన్ని రోజుల క్రితం ఎరికల నాగరాజు, ఎరికల ముత్యాలప్పను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, అనంతపురానికి చెందిన సాకే ఆదినారాయణ అలియాస్ గుడ్డి ఆదినారాయణను శుక్రవారం కాలువపల్లి సమీపంలోని మానిరేవు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.40 వేలు నగదు స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
నిలకడగా ఎండు మిర్చి ధరలు
హిందూపురం అర్బన్: స్తానిక వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 90 క్వింటాళ్ల ఎండు మిర్చి రాగా, ఈ–నామ్ ద్వారా వేలం పాటలు నిర్వహించారు. క్వింటా గరిష్ట ధర రూ.15వేలు, కనిష్ట ధర రూ.70వేలు చొప్పున సగటున రూ.13,500 ధరతో క్రయ విక్రయాలు సాగాయి. ఈ మేరకు మార్కెట్ యార్డ్ కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. అర్థాకలితో అలమటించిన విద్యార్థులుహిందూపురం టౌన్: ప్రధానోపాధ్యాయురాలి నిర్లక్ష్యం కారణంగా హిందూపురంలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 648 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి ప్రభుత్వ మార్గాదర్శకాల మేరకు రోజు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. అయితే శుక్రవారం హెచ్ఎం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు ఆలస్యంగా అరకొర భోజనం అందడంతో ఆకలితో అలమటించారు. వండిన ఆహారా పదార్థాల్లో నాణ్యత లోపించడంతో విద్యార్థులు తినలేక ఇబ్బంది పడ్డారు. కాగా, వంట కార్మికులకు హెచ్ఎం తక్కువ బియ్యం అందిస్తుండడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. దీనిపై హెచ్ఎం సామ్రాజ్యంను వివరణ కోరగా.. ‘ జిల్లా ఉప విద్యాధికారి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటలకు భోజనం అందిస్తున్నామని, అయితే నాసిరకంగా, అరకొరగా భోజనం అందిస్తుండడంపై విచారణ చేపడతాం’ అని అన్నారు. -
ఇంటిపై నుంచి కిందపడి వైద్యుడి మృతి
అనంతపురం: ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి కిందపడి ఓ వైద్యుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న డాక్టర్ అమిలినేని మధు (49)కు భార్య డాక్టర్ సుష్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ దంత వైద్యులు కావడంతో నగరంలోని క్లాక్ టవర్ సమీపంలో ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఇంటిపైన నాలుగో అంతస్తులో ఉన్న వాటర్ ట్యాంక్‌ను పరిశీలించేందుకు డాక్టర్ అమిలినేని మధు వెళ్లాడు. గోడపైకి ఎక్కి వాటర్ ట్యాంక్ మూత తీసి పరిశీలిస్తుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పై నుంచి కిందకు పడడంతో వెన్నముక, కాళ్లు విరిగాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డాక్టర్ సుష్మ ఫిర్యాదు మేరకు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతిలాల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఎకై ్సజ్‌లో 44 మందికి ఎస్ఐలుగా అడ్హాక్ పదోన్నతి
కర్నూలు : ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తూ ఆ శాఖ నోడల్ అధికారి (డిప్యూటీ కమిషనర్) శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి బదిలీల్లో భాగంగా వారికి స్టేషన్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా ఎస్ఐలకు సంబంధించి మరో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీరి సీనియారిటీ జాబితా త్వరలోనే రూపొందించి ఆయా పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. పదోన్నతి పొందిన వారందరికీ శుక్రవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ప్రమోషన్‌తో పాటు పోస్టింగ్ కాపీలను డీసీ శ్రీదేవి అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదోన్నతి దక్కిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని డీపీఈఓలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షేక్ రవితేజ ఉన్నారు. ఆయనకు కర్నూలు ఎసీ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. -
పీఏబీఆర్‌లో నీట మునిగి యువకుడి మృతి
ఉరవకొండ: మండలంలోని రాకెట్ల గ్రామానికి చెందిన కత్రిమల కార్తీక్ (25) ప్రమాదవశాత్తు పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నీట మునిగి మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు... కార్తీక్‌కు ఆరు నెలల క్రితం బళ్లారి జిల్లా కుడితిని గ్రామానికి చెందిన అఖిల అలియాస్ లక్ష్మి వివాహమైంది. ఈ క్రమంలో బళ్లారికి మకాం మార్చి కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉగాది పండుగ సందర్భంగా ఇటీవల స్వగ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. పీఏబీఆర్ సమీపంలో ఉన్న బంధువుల పంట పొలాలకు నీరు పెట్టేందుకు జలాశయంలో మోటారు దింపాల్సి ఉండడంతో వారితో కలసి గురువారం రాత్రి 9 గంటలకు జలాశయం వద్దకు వెళ్లాడు. మోటారును నీటిలో దించే క్రమంలో జలాశయం లోపలికి వెళ్లిన కార్తీక్.. కాలు చేపల వలకు చిక్కుకుంది. వల నుంచి కాలును విడిపించుకునే క్రమంలో ఊపిరి ఆడక మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని కార్తీక్ మృతదేహాన్ని వెలికి తీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, పైళ్లెన ఆరు నెలలకే భర్తను కోల్పోయిన అఖిలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. -
శ్రీరామనవమి ఏర్పాట్ల పరిశీలన
గోరంట్ల: మండలంలోని కరావులపల్లి తండా సమీపంలో నూతనంగా నిర్మించిన శివ అంజన్ దేవాలయ వార్షికోత్సవం ఆదివారం శ్రీరామనవమి వేడుకలను ఆలయ కమిటీ, ఆలయ నిర్మాణ కర్త సునీత శంకర్‌లాల్ నాయక్, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. అలాగే ఆలయ ప్రాంగణములో అదే రోజు మధ్యాహ్నం జిల్లా స్థాయి ఎడ్లబండ్ల పరుగు పోటీలు నిర్వహించనున్నారు. వేడుకలకు మహారాష్ట్రకు చెందిన మంత్రి సంజయ్ దూల్చన్రాథోడ్తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, గుజరాత్ ట్రిబినల్ వైస్ ప్రసిడెంట్ బి.ఆర్.ఆర్ కుమార్, తిరుపతి జిల్లా జడ్జి రామచంద్రుడు, తెలంగాణ జాయింట్ కమిషనర్ నారాయణనాయక్, జాయింట్ పోలీసు కమిషన్ ఆఫ్ పోలీసు బెంగళూరు రమేష్, కర్ణాటక మాజీ మంత్రి పరమేష్ నాయక్ ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద చేపట్టిన ఏర్పాట్లను, భద్రతా చర్యలను ఎస్పీ రత్న శుక్రవారం పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ పరిశీలించారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శేఖర్, తహసీల్దార్ మారుతీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు అన్యాయం
చిలమత్తూరు: వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ బిల్లు వల్ల వక్ఫ్ ఆస్తులన్నీ పరాధీనం అవుతాయని పలువురు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీలో వైఎస్సార్ సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, పార్టీ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు చాంద్ బాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ జబిఉల్లా, వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆసీఫుల్లా తదితరులతో కలిసి వందలాది మంది ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన కూటమి పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన టీడీపీ, జనసేనలు ముస్లింలకు తీరని అన్యాయం చేశాయన్నారు. ఆ పార్టీలకు తప్పక బుద్ధిచెబుతామన్నారు. ముస్లింలకు అన్యాయం జరిగితే సహించం.. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముస్లింల హక్కులకు భంగం కలిగించేలా సవరణ చేశారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడం ద్వారా వారి హక్కులకు భంగం కలుగుతుందన్నారు. అందువల్లే వైఎస్సార్ సీపీ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందన్నారు. ముస్లింలకు బాసటగా వైఎస్సార్ సీపీ ఎప్పుడూ నిలబడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు డాక్టర్ బాషా, దాదాపీర్, రోషన్ అలీ, మల్లికార్జున, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నాగమణి, వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగం నాయకుడు మహేష్ గౌడ్, నాయకులు అమానుల్లా, ఆర్కే ఖలీల్, హుమయూన్, సీపీసీ సాధిఖ్, ఫరూక్, ఆసిఫ్, అయూబ్, నౌషద్, ఇమ్రాన్, బాబా, సీఎన్పీ నాగరాజు, హబీబ్, డిష్ చాంద్, ముస్తూ తదితరులు పాల్గొన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా కదం తొక్కిన ముస్లింలు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో హిందూపురంలో నిరసన -
సూర్యఘర్‌పై అవగాహన కల్పించండి
ప్రశాంతి నిలయం: ‘ప్రధాన మంత్రి సూర్యఘర్’ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం కలెక్టర్ చేతన్ అధ్యక్షతన కలెక్టరేట్లోని కోర్టు హాలులో నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘సూర్యఘర్’ పథకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేంద్రం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 వేలు సబ్సిడీ ఇచ్చి ఉచితంగా సోలార్ పరికరాలను బిగిస్తుందన్నారు. తమ అవసరాలకు వినియోగించుకొని మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తే యూనిట్‌కు రూ.2.90 వంతున చెల్లిస్తారన్నారు. ఇక బీసీ వర్గాలకు 2 కిలోవాట్‌కు కేంద్రం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలు సబ్సిడీ ఇస్తుందని, మిగతా రూ. 35 వేలను లబ్ధిదారుడు బ్యాంక్ ద్వారా రుణంగా పొందవచ్చన్నారు. విజన్ ప్రణాళిక కమిటీని ఎంపిక చేయండి.. నియోజకవర్గాల విజన్ ప్రణాళికల్లో భూగర్భజలాలు, వ్యవసాయం, ఉద్యానవన శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొనాలన్నారు. విజన్ ప్రణాళిక కమిటీ మెంటర్లుగా విషయ పరిజ్ఞానం ఉన్న వారిని నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున, జిల్లా స్థాయి కమిటీకి ఐదుగురిని ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో ప్రభుత్వ కార్యాలయాల్లో వాట్సాప్ పరిపాలను పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. నీటి నాణ్యత తనిఖీని నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓ, ఆర్డీఓలను ఆదేశించారు. తాగునీటి పైపులైన్ లీకేజీ కాకుండా ముందస్తుగా మరమ్మతు పనులు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మినీ గోకులాల్లో పారంపాండ్లు, పశువులకు నీటి తొట్టెల నిర్మించాలని, రోడ్డు కనెక్టివిటీ ఉండే ప్రాంతాలను గుర్తించి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, సీపీఓ విజయ్ కుమార్, పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, కదిరి ఆర్డీఓలు సువర్ణ, మహేష్, ఆనంద్, శర్మ, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ సుధాకర్‌రెడ్డి, డీపీఓ సమత, డీఎంహెచ్ఓ ఫైరోజా బేగం, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
‘పుట్టపర్తి’ని కరువు జాబితాలో చేర్చాలి
పుట్టపర్తి: ఏటా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాల్లో చేర్చి రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కలెక్టర్ టీఎస్ చేతన్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి వినతి పత్రం సమర్పించారు. అలాగే పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు చేపల సంఘంలోని 16 మందిని నాలుగు రోజుల క్రితం బలవంతంగా చెరువులో చేపలు పట్టుకోకుండా గెంటేశారని వారికి న్యాయం చేయాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి హక్కులేని వారు చేపలు పట్టి సొమ్ము చేసుకుంటున్నారని కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై విచారణ జరిపి సభ్యులందరికీ న్యాయం చేయాలని కోరారు. అనంతరం దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, నల్లమాడ, అమడగూరు మండలాల్లో ఈసారి వర్షాభావం నెలకొందన్నారు. పంటలు పండక రైతులు నష్టాలు మూటగట్టుకున్నారన్నారు. చాలా ప్రాంతాల్లో భూగర్భజలమట్టం దారుణంగా పడిపోగా, బోరుబావుల కింద కూడా వ్యవసాయం సాగలేదన్నారు. పెట్టుబడుల రూపంలో పెట్టిన రూ. కోట్లు రైతుల చేతికి అందలేదన్నారు. అయినా ప్రభుత్వం నియోజకవర్గంలోని ఒక్క మండలాన్ని కూడా కరువు జాబితాలో చేర్చకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కరువు జాబితాలో చేర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. వెంటనే ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు స్థాపించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్నా..జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ఒక్క పరిశ్రమను కూడ నెలకొల్పలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు స్థాపించే విధంగా అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పీవీ రమణారెడ్డి, పార్టీ మాజీ మండల కన్వీనర్ నరసారెడ్డి, కన్వీనర్ గంగాద్రి, ఎంపీటీసీ ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6 మండలాలకు తగిన న్యాయం చేయాలి కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వినతి -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపు ప్రశాంతి నిలయం: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో తాము ఎంచుకున్న రంగంలో ముందుకు సాగాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకం కింద 17 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.38.50 లక్షల విలువైన రుణాలు, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న 15 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, మరో 13 మంది బధిరులకు టచ్ఫోన్లను కలెక్టర్ చేతన్ అందజేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు రూ.47 లక్షల రుణాలు, ఉపకరణాలు అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు చదువులు, క్రీడల్లో ముందంజలో ఉండాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అకాల వర్షం.. రైతుకు కష్టం పుట్టపర్తి అర్బన్: అకాల వర్షంతో రైతులకు తీరని నష్టం కలిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో కాస్తోకూస్తో ఉన్న పంటలూ దెబ్బతిన్నగా రైతులకు రూ.లక్షల నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరటి నేలవాలగా, దోస, కళింగర, మామిడి తదితర పంటలకు నష్టం జరిగింది. 20 నుంచి 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 27 మండలాల పరిధిలో వర్షం.. వాతావరణంలో మార్పులతో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కరోజే జిల్లాలో 614 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నల్లమాడ మండలంలో 59.4 మి.మీ వర్షం కురిసినట్లు వెల్లడించారు. ఇక కనగానపల్లి మండలంలో 51.4 మి.మీ, పుట్టపర్తి మండలంలో 51.4 మి.మీ, చెన్నేకొత్తపల్లి 45.6, రామగిరి 41.4, కొత్తచెరువు 39.4, ఓడీచెరువు 35.4, పెనుకొండ 34.8, ధర్మవరం 34.6, బుక్కపట్నం 34, అమరాపురం 32.6, బత్తలపల్లి 23.6, రొద్దం 22.2, సోమందేపల్లి 19.6, తాడిమర్రి 18.2, ముదిగుబ్బ 15.2, గోరంట్ల 15.2, చిలమత్తూరు 9.8, తలుపుల 6.4, కదిరి 5.2, మడకశిర 4.6, నల్లచెరువు మండలంలో 3.4 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. -
గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు!
● వినియోగదారుడి ఫిర్యాదుతో సిలిండర్ మార్చి ఇస్తామన్న ఏజెన్సీ రొద్దం: వంట కోసం వాడే గ్యాస్ సిలిండర్‌లో మామూలుగా గ్యాస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. కానీ ఓ వినియోగదారుడికి ఇచ్చిన ఎల్పీజీ సిలిండర్‌లో మొత్తం నీళ్లు నిండిపోయి ఉన్నాయి. దీంతో వినియోగదారులు ఏజెన్సీకి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళికే.. రొద్దంకు చెందిన గాజుల వన్నూరుస్వామి నూతన గృహ ప్రవేశం ఉండడంతో శుక్రవారం వంట చేయడానికి స్థానిక ఓ గ్యాస్ ఏజన్సీ నుంచి సిలిండర్ తెచ్చుకున్నాడు. వంట మనిషి సిలిండర్‌ను గ్యాస్ పొయ్యికి అనుసంధానించినా స్టౌవ్‌కు గ్యాస్ సరఫరా కాలేదు. ఎంత ప్రయత్నించినా... పొయ్యి వెలగకపోవడంతో అసలు సిలిండర్‌లో గ్యాస్ ఉందా లేదా అనే అనుమానం వచ్చింది. దీంతో గ్యాస్ సిలిండర్‌ను తలకిందులు చేసి గ్యాస్ నాబ్‌ను నొక్కగా నీళ్లు వచ్చాయి. దీంతో వన్నూరు స్వామి విషయాన్ని గ్యాస్ ఏజెన్సీ వారికి తెలిపాడు. అయితే ఆయిల్ కంపెనీ నుంచి వచ్చిన సిలిండర్‌నే తాము డెలివరీ చేశామని, తమ తప్పులేదన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే సిలిండర్ తీసుకువస్తే మార్చి మరో సిలిండర్ ఇస్తామన్నారు. జిల్లాకు వర్ష సూచనబుక్కరాయసముద్రం: రానున్న మూడు రోజులు అనంతపురంతో పాటు శ్రీసత్యసాయి జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల తోపాటు కర్నూలు, నంద్యాల, జిల్లాల్లో రానున్న 3 రోజులూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 37.5 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చన్నారు. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు 25.0 నుంచి 26.6 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
సమస్యలకు కేరాఫ్ కదిరి ఆస్పత్రి
కదిరి టౌన్: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి సమస్యలకు కేరాఫ్‌గా మారింది. పేరుకు వంద పడకల ఆస్పత్రి అయినా కనీస వైద్యం కూడా అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. మందుల కొరత వేధిస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో నిరుపేదలు బయట మెడికల్ షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. 20 మంది వైద్యులు ఉండాల్సిన చోట 16 మంది ఉన్నారు. అలాగే 90 మందికి పైగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉన్నా కేవలం 70 మంది మాత్రమే ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. వందపడకల ఆస్పత్రిలో కేవలం మూడు వీల్చైర్లు, మూడు స్ట్రక్చర్లు ఉండటంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షలు కూడా సరిగా అందుబాటులో లేవని వాపోతున్నారు. తనకల్లులో.. తనకల్లు సీహెచ్‌సీలో స్టాఫ్ నర్సు పోస్టు ఒకటి ఖాళీ ఉంది. లివర్ , రక్తం పరీక్షలను బయట చేయించుకోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. -
కంటి సమస్యలకు వైద్యం కరువు..
పెనుకొండ: స్థానిక సర్వజనాస్పత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. ఆస్పత్రిలో 11 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 8 మంది మాత్రమే ఉన్నారు. ఉన్న వారే అన్ని విధాలుగా సేవలను అందిస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో కంటికి సంబంధించిన సేవలు ఆసలు నిలిచిపోయాయి. ఇక.. ఆస్పత్రి ముందున్న డ్రైనేజ్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో రోగుల ఇబ్బందులు పడుతున్నారు. చెత్తా చెదారం, మురుగు నీరు కాలువలో నిలబడటంతో వైద్యం కోసం వచ్చిన వారు రోగాలబారిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. -
మందులు కొనుగోలు చేయాల్సిందే
ధర్మవరం అర్బన్: ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరతతో పాటు మందుల కొరత పట్టిపీడిస్తోంది. దీంతో రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 17 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 13 మంది మాత్రమే ఉన్నారు. ఎక్స్‌రే రూమ్‌లో సిబ్బంది లేరు. ఉన్న ఒక్క రేడియోగ్రాఫర్ ఇటీవలే పదవీ విరమణ పొందడంతో ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. డార్క్ రూమ్ అసిస్టెంట్లు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు స్టాఫ్ నర్సు పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అకౌంటెంట్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. చివరికి మందులు సైతం అందుబాటులో లేవు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇవ్వడం లేదు. ఐరన్ సిరప్, సర్జికల్ గ్లౌజ్‌లు, యాంటిబయాటిక్ టాబ్లెట్లు తదితర 20 రకాల మందులు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులకు ప్రైవేటుగా కొనుగోలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. -
పింఛన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారీ
ధర్మవరం అర్బన్: పట్టణంలోని లోనికోట సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ పింఛన్ సొమ్ముతో పరారయ్యాడు. పింఛనుదారులు డబ్బు కోసం సచివాలయానికి వస్తుంటే మూడురోజులుగా సచివాలయానికి ఉద్యోగులు తాళం వేశారు. చివరికి సచివాలయ ఉద్యోగులతో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ ధర్మవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సచివాలయ ఉద్యోగిపై ఫిర్యాదు చేశారు. పట్టణంలోని లోనికోట సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న హరి ఈనెల 1న పింఛనుదారులకు పింఛను డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేయలేదు. ఈరోజు సాయంత్రం ఇస్తానని నమ్మబలికి పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండా పింఛనుదారులతో వేలిముద్రలు వేయించుకున్నాడు. దాదాపు రూ.1.50 లక్షలకుపైగా అంటే 40 మందికిపైగా పింఛనుదారులతో వేలిముద్రలు తీసుకుని వారికి డబ్బులు ఇవ్వకుండా ఆ పింఛను సొమ్ముతో పరారయ్యాడు. పింఛనుదారులు సచివాలయం వద్దకు వచ్చి గొడవ చేస్తుంటే సచివాలయ సిబ్బంది ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కమిషనర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పింఛను డబ్బుతో పరారైన ప్లానింగ్ సెక్రటరీ హరిపైన చర్యలు తీసుకోవాలని పింఛన్ సొమ్ము రికవరీ చేయాలని సీఐ నాగేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు గురువారం పింఛన్ సొమ్ముతో పరారైన ప్లానింగ్ సెక్రటరీ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించారు. తమ కుమారుడు తీసుకెళ్లిన సొమ్మును తాము చెల్లిస్తామని పోలీసులకు, మున్సిపల్ కమిషనర్‌కు వారు హామీ ఇచ్చినట్లు సమాచారం. మూడురోజులుగా సచివాలయానికి తాళం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు -
పది మూల్యాంకనం ప్రారంభం
పుట్టపర్తి: పదో తరగతి మూల్యాంకనం ప్రారంభమైంది. గురువారం కొత్తచెరువులోని బాల బాలికల ఉన్నత పాఠశాలలో జవాబు పత్రాలను దిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. ఇందుకోసం సబ్జెక్టుల వారీగా సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు. మూల్యాంకనం కోసం ఏఈఎస్‌లు 582 మంది, సీఈఎస్లు 94 మంది, 188 మందిని సహాయకులను నియమించినట్లు డీఈఓ తెలిపారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఏఈఎస్‌లు 79 మంది, సీఈఎస్లు 17 మంది, 31 మంది సహాయకులను నియమించినట్లు వివరించారు. కార్యక్రమంలో పెనుకొండ డీవైఈఓ పద్మలత, ఏడీ రామకృష్ణ, వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు పీవీ రమణారెడ్డి, శెట్టిపి జయచంద్రారెడ్డి, చంద్రశేఖర్, బడా హరిప్రసాద్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, రజనీకాంత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేయండి ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేరణకు సంబంధించి అన్ని పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్‌హెచ్ 342, ఎన్‌హెచ్ 716జీ, జాతీయ రహదారులు, వివిధ భూసేకరణ పనుల పురోగతిపై సంబంధితశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూకేటాయింపుల ప్రతిపాదనలపై వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిబంధనల మేరకు నివేదికలను రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎన్హెచ్ఏఐ పీడీ అశోక్ కుమార్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి పుట్టపర్తి టౌన్: పాఠశాల దశ నుంచే విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి సమాజానికి అవసరమైన ఆవిష్కరణ చేసేలా ఎదగాలని డీఈఓ కృష్ణప్ప ఆకాంక్షించారు. కొత్తచెరువు శాంతినికేతన్ పాఠశాలలో గురువారం ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. డీఈఓ కృష్ణప్ప ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 8 ప్రాజెక్టులను ప్రదర్శించారు. సైన్స్ టీచర్ తనూజ, డైట్ అధ్యాపకులు గోవిందరాజులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి బహుమతులకు ఎంపిక చేశారు. గెలుపొందిన వారికి ప్రశంసాపత్రాలు మెమొంటోలు డీఈఓ చేతుల మీదుగా అందజేశారు. డైట్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తగ్గిన చింతపండు ధరహిందూపురం అర్బన్: చింతపండు ధర తగ్గింది. 15 రోజుల క్రితం వరకూ రూ.30 వేలకు పైగా పలికిన క్వింటా చింతపండు ధర అమాంతం పడిపోయింది. గురువారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 1,097.10 క్వింటాళ్ల చింత పండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.24 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.12 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ.10,500, కనిష్టంగా రూ.4,300, సరాసరిన రూ.6500 చొప్పున ధర పలికింది. ఇక బోటు రకం క్వింటా రూ.3 వేలు పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
హిందూపురం అర్బన్: ఓ ముఠాగా ఏర్పడి హిందూపురంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. గురువారం హిందూపురం వన్‌టౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. హిందూపురానికి చెందిన జాహీద్ అహమ్మద్ తరచూ పెనుకొండ దర్గాకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో అక్కడ బాబా ఫకృద్దీన్‌తో పరిచయమైంది. పెనుకొండకు వచ్చే కొందరి నుంచి గంజాయి కొనుగోలు చేసి సేవించడంతో పాటు హిందూపురంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని విక్రయించసాగారు. ఇటీవల అందిన పక్కా సమాచారంతో సబ్ డివిజన్లోని అన్ని పీఎస్‌ల సిబ్బంది బృందాలుగా విడిపోయి వారి కదలికలపై నిఘా పెంచారు. గురువారం ఉదయం కొడికొండ చెక్‌పోస్టు – శిర మార్గంలో బైలాంజనేయస్వామి ఆలయం సమీపంలో ముఠా సభ్యులు మాట్లాడుకుంటుండగా పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో పెనుకొండ బాబాఫకృద్ధీన్, హిందూపురంలోని హస్నాబాద్‌కు చెందిన జాహీద్ అహమ్మద్, మేళాపురం నివాసి షేక్ తబ్రీజ్, నేతాజీ నగర్‌కు చెందిన సాయి వినయ్, అహమ్మద్ నగర్ నివాసి ఇమ్రాన్ ఉన్నారు. వీరి నుంచి 600 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ పాతికేళ్ల లోపు వయసున్నవారే కావడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడిన వీరు గంజాయి సేవించడమే కాక దానినే వ్యాపారంగా మార్చుకుని హిందూపురంలోని పలువురు యువకులకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన జపాన్ దేశస్తులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. జపాన్‌లో సత్యసాయి సేవా సంస్థలను ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, 1926లో జన్మించిన సత్యసాయి బాబాకు ఇది వందో సంవత్సరం కావడంతో మహాసమాధి మందిరాన్ని ప్రత్యేకంగా ఆ దేశ సంస్కృతి ప్రతిబింబించేలా అలంకరించారు. సత్యసాయిపై భక్తి భావనను చాటుతూ రుద్ర పఠించారు. అనంతరం జపాన్ సత్యసాయి సేవా సంస్ధల అధ్యక్షుడు మసాకి సుమిటోమా వేడుకలనుద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం ‘గోల్డెన్ బ్రిడ్జి’ పేరుతో నాటిక ప్రదర్శించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రైకో హిరా ప్రసంగించారు. -
పచ్చిరొట్ట విత్తన ధరల ఖరారు
అనంతపురం అగ్రికల్చర్: పచ్చిరొట్ట (గ్రీన్ మెన్యూర్స్) విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పచ్చిరొట్ట విత్తనాల కింద జీలుగ (ధనించా), జనుము (సన్‌హెంప్), పిల్లిపెసర ద్వారా భూసారం పెంచుకునేందుకు వీలుగా పొలాల్లో చల్లి పూతకు వచ్చిన తర్వాత కలియదున్నితే సేంద్రియ పదార్థం బాగా పెరుగుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. దీంతో ఇటీవల ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు, రాయితీలు ఖరారు చేశారు. జిల్లాకు ఈ ఏడాది 190 క్వింటాళ్ల జీలుగ, రెండు క్వింటాళ్ల జనుము, 15వ క్వింటాళ్ల పిల్లిపెసర... మొత్తం 207 క్వింటాళ్లు కేటాయించారు. రబీలో కూడా జనుము, జీలుగ విత్తనాలు 425 క్వింటాళ్లు కేటాయించారు. అటు శ్రీసత్యసాయి జిల్లాకు కూడా ఖరీఫ్‌లో 138 క్వింటాళ్లు ఇచ్చారు. వీటిని 50 శాతం సబ్సిడీతో రైతులకు ఇవ్వనున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా వీటిని సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు. జీలుగ విత్తనాలు క్వింటా పూర్తి ధర రూ.12,300 కాగా, 50 శాతం రాయితీతో రూ.6,150 చొప్పున రైతులకు అందజేయనున్నారు. అలాగే క్వింటా జనుము విత్తనాల పూర్తి ధర రూ.10,900 కాగా, 50 శాతం రాయితీ పోను రూ.5,450 చెల్లించాలి. పిల్లిపెసర క్వింటా పూర్తి ధర రూ.18 వేలు కాగా, 50 శాతం రాయితీ పోను రూ.9 వేల చొప్పున రైతులకు విక్రయిస్తారు. జీలుగు, జనుము విత్తనాలు 10 కిలోల ప్యాకెట్ల రూపంలో, పిల్లిపెసర 8 కిలోల ప్యాకెట్ కింద ఎకరాలోపు ఒక బ్యాగ్, రెండు ఎకరాలకు రెండు, మూడు ఎకరాలున్న రైతులకు మూడు బ్యాగులు, నాలుగు ఎకరాలున్న వారికి నాలుగు బ్యాగులు, ఐదు ఎకరాలు, అంతకన్నా ఎక్కువ ఉన్న వారికి గరిష్టంగా ఐదు బ్యాగులు పంపిణీ చేయనున్నారు. రైతు ఆసక్తిని బట్టి మూడు రకాల విత్తనాలు వేర్వేరుగానూ, మూడు రకాల విత్తనాలు కలిపి ఒకే బ్యాగ్ రూపంలోనూ ఇవ్వనున్నారు. మూడు కలిపిన వాటిలో నాలుగు కిలోల చొప్పున జీలుగ, జనుము, రెండు కిలోల పిల్లిపెసర ఉంటాయి. 10 కిలోలు కలిగిన మిక్సింగ్కిట్ పూర్తి ఖరీదు రూ.1,296 కాగా, 50 శాతం రాయితీ పోను రూ.648 చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన రైతులు ఆర్ఎస్కేలలో తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. జిల్లాకు 207 క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 138 క్వింటాళ్ల కేటాయింపు 50 శాతం రాయితీతో రైతులకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనం -
కార్చిచ్చు.. కన్నీరు మిగుల్చు!
● పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన నాగరాజు ఇటీవల తన 35 గొర్రెలను అడవికి మేతకు తీసుకెళ్లారు. ఆకతాయిలు పెట్టిన నిప్పుతో గొర్రెల మంద ఉన్న ప్రాంతం చుట్టూ మంటలు వ్యాపించాయి. అతికష్టమ్మీద నాగరాజు 15 గొర్రెలను రక్షించుకోగలిగాడు. మిగిలిన 20 గొర్రెలు కళ్లముందే సజీవదహనమై రూ.2.5 లక్షలు నష్టం వాటిల్లింది. కుటుంబ పోషణ కోసం నాగరాజు ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నాడు. ● సీకేపల్లి మండలం పులేటిపల్లిలో రగిలిన కార్చిచ్చు రైతు దాసరి పెద్దన్న వ్యవసాయ పరికరాలను దగ్ధం చేసింది. రూ.50 వేల నష్టం జరిగింది. ● పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద కొండకు పాకిన కార్చిచ్చుకు సుమారు 200 ఎకరాల బీడు భూముల్లో గడ్డి కాలి పోయి అడవి జంతువులకు ఆశ్రయం లేకుండాపోయింది. రైతు జనార్దన్‌రెడ్డికి చెందిన 10 పీవీసీ పైపులు, గేట్ వాల్వులు, డ్రిప్పు పైపులు, పరికరాలు కాలి పోయి నష్టం మిగిల్చింది. ● కొత్తచెరువు మండలం బైరాపురం గ్రామానికి చెందిన బ్రహ్మానందరెడ్డి మామిడి పంట పూర్తి కాగానే వ్యవసాయ పరికరాలన్నింటినీ ఒక చెట్టుకింద భద్రపరిచారు. గత నెలలో ఆకతాయిలు పెట్టిన నిప్పుతో కార్చిచ్చు రగిలి మామిడి మొక్కలతో పాటు వ్యవసాయ పరికరాలు కాలిపోయాయి. దీంతో రైతుకు సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ, ఏపీఎంఐపీ అధికారులకు సమాచారం ఇచ్చినా.. పైసా నష్ట పరిహారం అందించలేదు. పైగా సబ్సిడీపై పరికరాలు మరోసారి అందించడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెబుతున్నారు. ... ఇలా చాలా గ్రామాల్లో వరిగడ్డి, వేరుశనగ కట్టె, కంది కట్టె కుప్పలు కాలిపోతుండగా.. రైతులకు రూ.లక్షల నష్టం వాటిల్లుతోంది.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పుట్టపర్తి అర్బన్: ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీల మార్క్ దాటడంతో జనమే అల్లాడిపోతున్నారు. ఇక పొలాల్లో పచ్చని గరిక కూడా కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఎండిన గడ్డి, మొక్కలు, పంటలు, ఆకులురాలిపోయి మోడుగా మారిన చెట్లే కనిపిస్తున్నాయి. దీంతో చిన్న నిప్పు ఎగసిపడినా కార్చిచ్చు రగులుతోంది. పంటలను, పశుపక్ష్యాదులను దహిస్తోంది. దీంతో రైతులకు రూ.లక్షల నష్టం వాటిల్లితుండగా కన్నీరుమున్నీరవుతున్నారు. పైగా ఆదుకోవాల్సిన పాలకులు చోద్యం చూస్తుండగా...రైతుల ఆశలన్నీ కాలి బూడిదవుతున్నాయి. అవగాహన లోపంతో గడ్డికి నిప్పు.. ఏటా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో కొండగుట్టలు, బీడు భూముల్లో ఉన్న గడ్డి ఎండిపోయి జీవాలకు మేత కరువవుతుంది. ఈ సమయంలో కొందరు గడ్డికి నిప్పు పెడతారు. తొలకరి వర్షాలకు కాలిన చోట గడ్డి మొలకెత్తి త్వరగా జీవాలకు మేత దొరుకుతుందని ఇలా చేస్తుంటారు. కానీ ఇలా అవగాహన లోపంతో కొందరు నిప్పు పెడుతుండగా..కార్చిచ్చు రగిలి సమీపంలోని పొలాల తగలబడిపోతున్నాయి. మూగజీవాలూ సజీవ దహనమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యాన తోటల్లో ఎంతో కాలంగా పెంచుకుంటున్న పండ్ల మొక్కలతో పాటు వాటికి ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాలు కాలి బూడదవుతున్నాయి. దీంతో రైతులు, పశువుల కాపర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా రెండు నెలల కాలంలోనే జిలాల్లో పదుల సంఖ్యలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రైతులకు సరైన అవగాహన లేక పోవడం, అందుబాటులో నీళ్లు లేకపోవడంతో కార్చిచ్చు వందలాది ఎకరాల్లో గడ్డితో పాటు చుట్టూ ఉన్న అన్నింటినీ కాల్చి వేస్తుంది. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చినా... సకాలంలో పొలాల్లోకి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఒక వేళ అగ్నిమాపక సిబ్బంది వచ్చినా...గడ్డే కదా అని తేలిగ్గా తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. భానుడి భగభగలతో పెరిగిన ఉష్ణోగ్రతలు ఎటుచూసినా ఎండిపోయిన పొలాలు ఆకతాయి చేష్టలతో రగులుతున్న కార్చిచ్చు పంటలు, వ్యవసాయ పరికరాలూ దగ్ధం మూగజీవాలు, పాడిపశువుల సజీవ దహనం నష్టపోతున్న రైతన్నలు.. ఆదుకోవాలంటూ వేడుకోలు -
ముస్లింల ద్రోహి చంద్రబాబు
● వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వడం దుర్మార్గం ● వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ కదిరి టౌన్: వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ, జనసేన ఎంపీలతో మద్దతు ఇప్పించిన చంద్రబాబు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడని వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అన్నారు. గురువారం ఆయన స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కుటుంబం ఆది నుంచీ ముస్లింల మంచి కోరిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారని, ఆ రిజర్వేషన్ల వల్లే నేడు ఎందరో ముస్లింలు డాక్టర్లు, ఇంజినీర్లు, గొప్ప స్థానాల్లో ఉన్నారన్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముస్లింలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూములను కాజేయడానికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. చంద్రబాబు జాదూ.. నారా చంద్రబాబు పెద్ద జాదూ అని మక్బూల్ విమర్శించారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో ఉంటారో... ఏ పార్టీతో సంబంధం పెట్టుకుంటారో... ఏం మాట్లాడతారో తెలియదన్నారు. ఎన్నికల సమయంలో ముస్లింలకు అండగా ఉంటామని చెప్పిన వ్యక్తి.... ఇపుడు పార్లమెంటులో టీడీపీ ఎంపీలతో వక్ఫ్ సవరణ బిల్లలుకు అనుకూలంగా ఓటు వేయించడం నమ్మించి మోసం చేయడమేనన్నారు. వక్ఫ్ సవరణ బిల్లలుకు మద్దతు తెలిపిన జనసేన, టీడీపీ రెండూ ముస్లిం వ్యతిరేక పార్టీలేనన్నారు. ముస్లింలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఓటేసిందని మగ్బూల్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు అండగా నాడు వైఎస్సార్.... నేడు వైఎస్ జగన్మోహనరెడ్డి నిలబడ్డారన్నరు. ఇప్పటికై నా కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బాబ్జాన్, నూరుల్లా, సాధిక్, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణంలోని ముస్లింలు పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్య గోరంట్ల: మండలంలోని కాలేకుంటపల్లికి చెందిన హరీష్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. హరీష్‌కు హిందూపురానికి చెందిన గాయత్రితో వివాహమైంది. కొంత కాలంగా హిందూపురంలో నివాసముంటూ మగ్గం పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఉగాది పండుగకని సొంతూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైనా నేటికీ సంతానం కలగకలేదని, ఇక తనకు పిల్లలు పుట్టరనే మనో వేదన లోనైన హరీష్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బీసీలపై దాడులు సహించం
పుట్టపర్తి టౌన్: ఆధిపత్య పోరులో బీసీలను సమిధలు మార్చే కూటమి నేతల చర్యలను ఖండిస్తున్నామని, బీసీలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు హెచ్చరించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలపై అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ వ్యాప్తంగా ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కూటమి నేతల స్వార్థానికి ఇటీవల కర్నూలు జిల్లాలో ఇద్దరు బీసీలు, పుంగనూరులో ఒకరు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలు మరువకనే రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యపై ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు రాళ్లు, రాడ్లతో దాడి హతమార్చారడం దారుణమన్నారు. కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరుడన్న ఒకేఒక్క కారణంతో అత్యంత పాశావికంగా ఆయనను హతమార్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని ఎదిరించే సత్తా, దమ్ము, ధైర్యం లేక అమాయకులైన కురుబలపై ప్రతాపం చూపడం ఎమ్మెల్యే సునీతకు తగదన్నారు. తన సొంత జిల్లాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ నోరు కూడా మెదపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన విషయాన్ని కూటమి పెద్దలు విస్మరించి విష సంస్కృతికి బీజమేస్తున్నారని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లింగమయ్య కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు ఎల్ఐసీ వెంకటరాముడు, ఓడీపీ ఆదినారాయణ, డాక్టర్ తిరుపతేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు కొట్టాల శ్రీరాములు -
కరువు జిల్లా పరిస్థితి ఏమిటి?
● సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య లేపాక్షి: తాము అధికారంలోకి వస్తే హంద్రీ–నీవా కాలువకు పిల్ల కాలువలు ఏర్పాటు చేసి కరువు పీడిత శ్రీసత్యసాయి జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని గత ఎన్నికల సమయంలో హామీనిచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టిన తర్వాత ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీటిని తరలించుకెళ్లే చర్యలు వేగవంతం చేశారంటూ సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య మండిపడ్డారు. గురువారం సాయంత్రం లేపాక్షిలోని ఏపీ టూరిజం అతిథి గృహంలో సీపీఐ మండల కార్యదర్శి శివప్ప అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఆయన, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీ–నీవా నీటిని పంటల సాగుకు వదలక పోగా లైనింగ్ పనులు, సిమెంట్ ర్యాంపుల ఏర్పాటు పేరుతో రూ.3 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధికి సీపీఐ అడ్డంకి కాదన్నారు. జిల్లాలో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఎప్పడిస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షలతో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని భరోసానిచ్చిందని, అయితే పేదలకు నిర్మించే ఇంటికి నాణ్యమైన ఇసుక, ఇనుము వాడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 నుంచి 80 శాతం నిర్మాణాలైన ఇళ్లను కూడా పూర్తి చేయాలన్నారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మాటలు నమ్మి టిడ్కో ఇళ్ల కోసం అప్పు చేసి రూ.25 వేల నుంచి రూ.50 వేలు చెల్లించిన లబ్ధిదారులకు ప్రస్తుతం బ్యాంకర్లు అప్పులు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. టిడ్కో గృహ లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్‌కుమార్, సహాయ కార్యదర్శి గౌతమ్‌కుమార్, ఏఐఎస్ఎఫ్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం హిందూపురం టౌన్: మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ గురువారం రాత్రి మృతుడి బంధువులు ధర్నా చేపట్టారు. వివరాలు... పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా నదిలో ఇసుక తోడుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక దిబ్బ మీదపడి హేమంత్‌కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. సాయంత్రం అయినా పోస్టుమార్టం నిర్వహించకపోవడంతో మృతుడి బంధువులు వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఇందిరమ్మ సర్కిల్లో రాత్రి ధర్నా చేపట్టారు. దాదాపు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్ఐ శ్రీధర్ అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. చివరకు న్యాయం చేస్తామని సీఐ రాజగోపాల్‌నాయుడు భరోసానివ్వడంతో ధర్నాను విరమించారు. పిడుగుపాటుకు వివాహిత మృతి గుంతకల్లు రూరల్: పిడుగుపాటుకు ఓ వివాహిత మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం కదిరిపల్లికి చెందిన సుంకన్న, రమాదేవి దంపతుల కుమారుడు రమణకు రెండేళ్ల క్రితం పెద్దపప్పూరు మండలానికి చెందిన ఇంద్రజ (24)తో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో బోరు బావి కింద సాగు చేసిన వేరుశనగ పంట చేతికి వచ్చింది. శుక్రవారం పంటను తొలగించాలనుకున్న దంపతులు గురువారం సాయంత్రం పొలానికి వెళ్లి స్ప్రింక్లర్ల సాయంతో నీళ్లు పెడుతుండగా జడి వాన మొదలైంది. కాసేపటికి ఉరుములు, మెరుపులు ఎక్కువ కావడంతో పని ఆపి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రమణ బోరు బావి వద్దకెళ్లి కాలికి అంటుకున్న బురదను కడుక్కుంటుండగా, నాలుగు అడుగుల దూరంలోనే వేచి ఉన్న ఇంద్రజపై పిడుగు రాలింది. ఆమె శరీరంలో నుంచి నేరుగా దూసుకెళ్లడంతో గుండె కింద భాగంలో బొక్క పడి శరీరంలో రెండు చీలికలు ఏర్పడ్డాయి. కాలి పట్టీలు తెగిపడ్డాయి. శరీరం మొత్తం నల్లగా మాడిపోయింది. విషయాన్ని గమనించిన భర్త ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. దాదాపు అరగంట తర్వాత తేరుకున్న ఆయన వెళ్లి విగతజీవిగా ఉన్న పడి ఉన్న భార్యను చూసి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఇంద్రజ మృతదేహాన్ని ఇంటికి తరలించారు. -
రోప్ స్కిప్పింగ్‌లో అపురూపం
అమరాపురం: గ్రామీణ రైతు కుటుంబంలో జన్మించిన రూప.. చదువులోనే కాదు క్రీడల్లోనూ తనకు సాటి లేరని నిరూపిస్తోంది. సరైన ప్రోత్సాహం, అవకాశాలను అందిపుచ్చుకుని జాతీయ స్థాయిలో తన క్రీడా నైపుణ్యాన్ని చాటి పతకాన్ని సొంతం చేసుకుంది. వివరాలు.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన వెన్నపూస సుజాత, వెంకట్రామిరెడ్డి దంపతుల కుమార్తె రూప ప్రస్తుతం అమరాపురం మండలం హలుకూరు సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రతి క్రీడాపోటీల్లోనూ ఆమె ప్రతిభ చాటడం గమనించిన పీడీ రోజా... విషయాన్ని వెంటనే ప్రిన్సిపాల్ పద్మావతి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఆమెలోని క్రీడానైపుణ్యాలను వెలికి తీస్తే పాఠశాలకు మంచి పేరు వస్తుందని భావించిన ప్రిన్సిపాల్ వెంటనే ఆ దిశగా రూప ను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో రోప్ స్కిప్పింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన రూప... ఇటీవల జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో తొలిసారిగా పాల్గొని వరుసగా బంగారు పతకాలను కై వసం చేసుకుంది. ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని నాసిక్ వేదికగా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్ని ప్రతిభ చాటి వెండి పతకాన్ని సాధించింది. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన రూపను పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్ఐ ఇషాక్‌బాషా, ఎంఈఓ, గ్రామస్తులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయి రోప్లో రాణించిన గురుకుల విద్యార్థిని -
ఆత్మకూరు హెచ్ఎం సస్పెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: ఆత్మకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెండ్ శ్రీనివాసప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గత నెల 29న ఆత్మకూరు పరీక్ష కేంద్రంలో కేజీబీవీ విద్యార్థిని అప్పటికే తనకు తెలిసిన ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసి కూర్చుంది. ఆ సమయంలో ప్రశ్నపత్రం కిందకు పడిపోయి గాలికి వెనుక వైపు బెంచీవద్దకు వెళ్లింది. అదే సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసప్రసాద్ ఆ గదిలో చేరుకుని పరిశీలిస్తున్న క్రమంలో ఆ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. ఆన్షర్ షీటు మాత్రం కనిపించడంతో ప్రశ్నపత్రం ఎక్కడ? అని అడిగాడు. హఠాత్పరిణామంతో ఆ విద్యార్థిని తీవ్ర కంగారుకు గురైంది. ఇక్కడే ఉందంటూ ఆందోళన చెంది వెతుకుతుండగా ఒక్కసారిగా కర్రతో ఆ విద్యార్థినిని చితకబాదాడు. దాడిలో భుజపుటెముక విరిగింది. దీంతో తర్వాత రోజు పరీక్ష రాయలేని పరిస్థితి. ఈ పరిణామంపై ‘సాక్షి’లో ‘శ్రీనివాసా...ఇదెక్కడి ‘కర్ర’ పెత్తనం శీర్షికతో కథనం వెలువడింది. దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్వయంగా పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు ఈ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినిది ఏమాత్రం తప్పు లేదని హెచ్ఎం ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడంటూ జిల్లా అధికారులు వివరించడంతో సదరు హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో హెచ్ఎం శ్రీనివాసప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ ఉత్తర్వులు జారీ చేశారు. -
అమ్ముకోలేకపోతున్నాం
నాకు పెద్దల నుంచి సంక్రమించిన ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అయినా వాటిని అమ్ముకోలేకపోతున్నాం. స్థలాలు అమ్ముకుని ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఆ స్థలాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కొనేవారు ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి. – మీసేవ చంద్ర, ముదిగుబ్బ ప్రత్యామ్నాయం చూపాలి ముదిగుబ్బలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల క్రయివిక్రయాలు నిలిచిపోయి చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అప్రూవల్ కావాలన్నా...రిజిష్టర్ పత్రాలను జత పరచాలి. చాలా మంది వద్ద రిజిష్టర్ పత్రాలు లేక అప్రూవల్ చేసుకోలేక పోతున్నారు. పంచాయతీకి ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపాలి. – చండ్రాయుడు, ముదిగుబ్బ పట్టా భూములు మాత్రమే రిజిస్టర్ అవుతాయి చుక్కల భూములు, అసైన్డ్ భూములను 22ఏ నిషేదిత జాబితాలో చేర్చారు. అలాంటి భూములు రిజిస్ట్రేషన్ కావు. ముదిగుబ్బలో చాలా వరకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా భూములే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రిజిస్టేషన్లు కావడం లేదు. పాత పట్టా భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతాయి. – నారాయణస్వామి, తహసీల్ధార్ -
ఇళ్ల స్థలాలకు చుక్కల గ్రహణం
గత ప్రభుత్వ హయాంలో మంచి అవకాశం.. ముదిగుబ్బ: మండల కేంద్రంలో ఇంటి స్థలాలు కొనుగోలు చేసినా.. విక్రయించినా... రిజిస్ట్రేషన్ కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముదిగుబ్బలో మొత్తం 40 సర్వే నెంబర్లలో 350 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అయితే నాలుగు సర్వే నెంబర్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మిగిలిన 36 సర్వే నెంబర్లు చుక్కల భూములు, అనెగ్జర్ 2, 3, 4, 5 (వాగులు, వంకలు, కొండలు, దేవదాయ, వక్ఫ్, సరఫ్లస్, కోర్టు వివాదాలు) లో ఉండడం కారణంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఆయా సర్వేనెంబర్లు రిజిస్ట్రేషన్ కాక నిలిచిపోయాయి. ముదిగుబ్బలో 5,400 ఇళ్ల నిర్మాణం చేయగా, ఇందులో 25వేల మంది జనాభా ఉన్నారు. ఇండ్ల మధ్యన కొన్ని స్థలాలు కూడా వున్నాయి. మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసిపెట్టుకుంటే భవిష్యత్‌లో ధరలు పెరిగినప్పుడు లాభదాయకంగా ఉంటుందని గ్రామీణ ప్రాంత ప్రజలు కొన్ని స్థలాలు కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి 2018కి ముందు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. 2018 తర్వాత నుంచి వాటి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ప్రస్తుతం వారి ఇంట శుభ కార్యాలయాలకు, పిల్లల చదువులకు, ఇతర ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బ్యాంక్‌ల్లో తాకట్టు పెట్టుందుకు సిద్ధం కాగా, రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పరిటాల రవీంద్ర హత్యానంతరం ముదిగుబ్బలో జరిగిన అల్లర్ల కారణంగా మండల రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులు కాలిపోయాయి. అప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ఉన్నతాధికారులు కార్యాలయాల రికార్డులు చూపించాలని ఆదేశిస్తున్నారు. దీంతో రికార్డులు కాలిపోవడంతో వాటికి సంబంధించిన ఆధారాలను మండల రెవెన్యూ అధికారులు చూపలేకపోతున్నారు. దీంతో ఎన్ఓసీ కోసం పెట్టుకున్న పైళ్లను సైతం పక్కకు పెడుతున్నారు. ఫలితంగా స్థిరాస్తులకు సంబంధించిన పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కలుగజేసుకుని ప్రత్యామ్నాయం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు రెవెన్యూ రికార్డులు కాలిపోవడంతో ప్రజలకు తీరని కష్టాలు అనెగ్జర్ 1, 2, 5 భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. భూములకు సంబంధించిన పత్రాలను ఆధారాలను జత పరిచి రైతులు, ఇళ్ల స్థలాల యజమానులు తమ భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలా ఎన్ఓసీ కోసం అప్పట్లో ఇచ్చారు. అలాగే 20 సంవత్సరాల క్రితం పట్టా పొందిన రైతులకు సైతం తమ భూములను (ప్రీ ఓల్డ్) రిజిస్ట్రేషన్ అయ్యేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియను అటకెక్కించింది. 2018 తర్వాత బంద్.. రెవెన్యూ రికార్డులు కాలిపోయి.. -
వైభవంగా సిడిమాను ఉత్సవం
రససిద్ధుల కొండపై అశేష భకుల మధ్య సిడిమానుకు బాలుడ్ని తిప్పుతున్న దృశ్యంరాయదుర్గం టౌన్: స్థానిక రససిద్ధుల కొండపై వెలసిన రససిద్ధేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు సిడిమానుకు బాలుడిని కట్టి తిప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ ఈశ్వర్ స్నేహబృందం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. -
దౌర్జన్యాలు సహించం
అనంతపురం ఎడ్యుకేషన్: దౌర్జన్యాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించబోమని ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారులు, సోదరులు, బంధువులను వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వారి బంధువుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయని మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురైన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ నెల 8న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులు, శాంతికాముకులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులకు విస్తృత స్వేచ్ఛ ఉండేదన్నారు. ఏ చిన్నదాడి జరిగినా మన.. తమ అనే భేదభావాలు లేకుండా కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. దీంతో రాప్తాడు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారులు, సోదరులు, బంధువులు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని, ఫలితంగా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం మటుమాయమైందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాను చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలను తరచూ గుర్తు చేస్తున్నారని, అయితే తనను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతోనే తాను ఆయనపై విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు. ‘చంద్రబాబు, లోకేష్... మీకు బాధ కలిగి ఉంటే క్షమించాలని ఆ రోజే చెప్పా...ఈ రోజు కూడా క్షమించమని చెబుతున్నా. తిట్టినందుకే నేను దుర్మార్గుడిని అయితే వందలాది మందిని హతమార్చిన నీ భర్త (పరిటాల రవి) దేవుడా?... చెప్పు సునీతమ్మా’ అంటూ ప్రశ్నించారు. పరిటాల వర్గీయులు సాగిస్తున్న దుర్మార్గాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా తాము సమిధలయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో అనంతపురం రూరల్, రాప్తాడు ఎంపీపీలు వరలక్ష్మి, జయలక్ష్మి,, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గోవిందరెడ్డి, బండి పవన్, రాప్తాడు సత్తిరెడ్డి, మామిళపల్లి హరినాథ్‌రెడ్డి, బాలపోతన్న, నాగముని, తిరుపాల్‌రెడ్డి, భానుకోట శివ పాల్గొన్నారు. తిట్టినందుకే దుర్మార్గుడినైతే వందలాది మందిని పొట్టనబెట్టుకున్న పరిటాల రవి దేవుడా? మారణకాండను ఆపేందుకు అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్ రాక వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి