
శ్రీరామనవమి ఏర్పాట్ల పరిశీలన
గోరంట్ల: మండలంలోని కరావులపల్లి తండా సమీపంలో నూతనంగా నిర్మించిన శివ అంజన్ దేవాలయ వార్షికోత్సవం ఆదివారం శ్రీరామనవమి వేడుకలను ఆలయ కమిటీ, ఆలయ నిర్మాణ కర్త సునీత శంకర్‌లాల్ నాయక్, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. అలాగే ఆలయ ప్రాంగణములో అదే రోజు మధ్యాహ్నం జిల్లా స్థాయి ఎడ్లబండ్ల పరుగు పోటీలు నిర్వహించనున్నారు. వేడుకలకు మహారాష్ట్రకు చెందిన మంత్రి సంజయ్ దూల్చన్‌రాథోడ్‌తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, గుజరాత్ ట్రిబినల్ వైస్ ప్రసిడెంట్ బి.ఆర్.ఆర్ కుమార్, తిరుపతి జిల్లా జడ్జి రామచంద్రుడు, తెలంగాణ జాయింట్ కమిషనర్ నారాయణనాయక్, జాయింట్ పోలీసు కమిషన్ ఆఫ్ పోలీసు బెంగళూరు రమేష్, కర్ణాటక మాజీ మంత్రి పరమేష్ నాయక్ ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద చేపట్టిన ఏర్పాట్లను, భద్రతా చర్యలను ఎస్పీ రత్న శుక్రవారం పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పుట్టపర్తి ఆర్‌డీఓ సువర్ణ పరిశీలించారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శేఖర్, తహసీల్దార్ మారుతీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.