హిందూపురం అర్బన్: స్తానిక వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 90 క్వింటాళ్ల ఎండు మిర్చి రాగా, ఈ–నామ్ ద్వారా వేలం పాటలు నిర్వహించారు. క్వింటా గరిష్ట ధర రూ.15వేలు, కనిష్ట ధర రూ.70వేలు చొప్పున సగటున రూ.13,500 ధరతో క్రయ విక్రయాలు సాగాయి. ఈ మేరకు మార్కెట్ యార్డ్ కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు.
అర్థాకలితో అలమటించిన విద్యార్థులు
హిందూపురం టౌన్: ప్రధానోపాధ్యాయురాలి నిర్లక్ష్యం కారణంగా హిందూపురంలోని ఎంజీఎం ఉన్నత పాఠశాల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 648 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి ప్రభుత్వ మార్గాదర్శకాల మేరకు రోజు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. అయితే శుక్రవారం హెచ్‌ఎం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు ఆలస్యంగా అరకొర భోజనం అందడంతో ఆకలితో అలమటించారు. వండిన ఆహారా పదార్థాల్లో నాణ్యత లోపించడంతో విద్యార్థులు తినలేక ఇబ్బంది పడ్డారు. కాగా, వంట కార్మికులకు హెచ్‌ఎం తక్కువ బియ్యం అందిస్తుండడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. దీనిపై హెచ్‌ఎం సామ్రాజ్యంను వివరణ కోరగా.. ‘ జిల్లా ఉప విద్యాధికారి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటలకు భోజనం అందిస్తున్నామని, అయితే నాసిరకంగా, అరకొరగా భోజనం అందిస్తుండడంపై విచారణ చేపడతాం’ అని అన్నారు.
నిలకడగా ఎండు మిర్చి ధరలు