
అమ్ముకోలేకపోతున్నాం
నాకు పెద్దల నుంచి సంక్రమించిన ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అయినా వాటిని అమ్ముకోలేకపోతున్నాం. స్థలాలు అమ్ముకుని ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఆ స్థలాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కొనేవారు ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించాలి. – మీసేవ చంద్ర, ముదిగుబ్బ
ప్రత్యామ్నాయం చూపాలి
ముదిగుబ్బలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల క్రయివిక్రయాలు నిలిచిపోయి చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అప్రూవల్ కావాలన్నా...రిజిష్టర్ పత్రాలను జత పరచాలి. చాలా మంది వద్ద రిజిష్టర్ పత్రాలు లేక అప్రూవల్ చేసుకోలేక పోతున్నారు. పంచాయతీకి ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపాలి. – చండ్రాయుడు, ముదిగుబ్బ
పట్టా భూములు మాత్రమే రిజిస్టర్ అవుతాయి
చుక్కల భూములు, అసైన్డ్ భూములను 22ఏ నిషేదిత జాబితాలో చేర్చారు. అలాంటి భూములు రిజిస్ట్రేషన్ కావు. ముదిగుబ్బలో చాలా వరకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా భూములే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రిజిస్టేషన్‌లు కావడం లేదు. పాత పట్టా భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతాయి.
– నారాయణస్వామి, తహసీల్ధార్

అమ్ముకోలేకపోతున్నాం

అమ్ముకోలేకపోతున్నాం