పింఛన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారీ
ధర్మవరం అర్బన్: పట్టణంలోని లోనికోట సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీ పింఛన్ సొమ్ముతో పరారయ్యాడు. పింఛనుదారులు డబ్బు కోసం సచివాలయానికి వస్తుంటే మూడురోజులుగా సచివాలయానికి ఉద్యోగులు తాళం వేశారు. చివరికి సచివాలయ ఉద్యోగులతో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ ధర్మవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సచివాలయ ఉద్యోగిపై ఫిర్యాదు చేశారు. పట్టణంలోని లోనికోట సచివాలయంలో ప్లానింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న హరి ఈనెల 1న పింఛనుదారులకు పింఛను డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేయలేదు. ఈరోజు సాయంత్రం ఇస్తానని నమ్మబలికి పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వకుండా పింఛనుదారులతో వేలిముద్రలు వేయించుకున్నాడు. దాదాపు రూ.1.50 లక్షలకుపైగా అంటే 40 మందికిపైగా పింఛనుదారులతో వేలిముద్రలు తీసుకుని వారికి డబ్బులు ఇవ్వకుండా ఆ పింఛను సొమ్ముతో పరారయ్యాడు. పింఛనుదారులు సచివాలయం వద్దకు వచ్చి గొడవ చేస్తుంటే సచివాలయ సిబ్బంది ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కమిషనర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పింఛను డబ్బుతో పరారైన ప్లానింగ్ సెక్రటరీ హరిపైన చర్యలు తీసుకోవాలని పింఛన్ సొమ్ము రికవరీ చేయాలని సీఐ నాగేంద్రప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు గురువారం పింఛన్ సొమ్ముతో పరారైన ప్లానింగ్ సెక్రటరీ తల్లిదండ్రులను పోలీసులు పిలిపించారు. తమ కుమారుడు తీసుకెళ్లిన సొమ్మును తాము చెల్లిస్తామని పోలీసులకు, మున్సిపల్ కమిషనర్‌కు వారు హామీ ఇచ్చినట్లు సమాచారం.
మూడురోజులుగా
సచివాలయానికి తాళం
వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో
మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు
పింఛన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి పరారీ


