
మా భూములను లాక్కుంటున్నారు
బత్తలపల్లి: ‘‘నిరుపేదలమైన మాకు గతంలో ప్రభుత్వం భూ పంపిణీ కింద పొలాలు పంపిణీ చేసింది. వాటిని సాగుచేసుకుంటూ మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు అధికార పార్టీ అండతో కొందరు మా భూములను ఆక్రమించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు. మీరే తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి’’ అని బత్తలపల్లి మండలం సూర్యచంద్రాపురం గ్రామస్తులు సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు విన్నవించారు. తమకు 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దంపెట్ల గ్రామ పొలంలోని 107 సర్వే నంబర్‌లో 11 మంది ఎరికల కులస్థులకు 2 ఎకరాలు చొప్పున పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పట్టాలు పొందిన తర్వాత తామే సాగులో ఉన్నామన్నారు. అయితే వర్షాభావం వల్ల పెట్టుబడులు రాకపోవడంతో ప్రస్తుతం పంటలు సాగు చేయలేకపోయామి, దీంతో అక్కడ కంపచెట్లు పెరిగాయన్నారు. రీ సర్వే నేపథ్యంలో భూముల్లో కంపచెట్లు తలగించుకునేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇంతలోనే దంపెట్ల గ్రామానికి చెందిన హరిదాసు అనే వ్యక్తి తన తోటకు దగ్గరగా ఉన్న తమ భూముల్లో రాత్రికి రాత్రే జేసీబీతో కంపచెట్లు తొలగించి మామిడి మొక్కలు నాటుతుండగా అడ్డుపడ్డామన్నారు. దీంతో తమను కులం పేరుతో దూషించి, బెదిరించి అక్కడ నుంచి తరమి వేశారని కలెక్టర్‌కు తమ బోడు వెళ్లబోసుకున్నారు. ఆ తర్వాత తహసీల్దార్, వీఆర్‌ఓలకు ఫిర్యాదు చేయగా.. వారుు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. తమ జీవనాధారమైన పొలం ఆక్రమణకు గురికాకుండా న్యాయం చేయాలని బాధితులు నాగేంద్రమ్మ, ఉమాదేవి, రామలక్ష్మి, రామాంజినమ్మ, లావణ్య, నారాయణమ్మ, లలక్ష్మీదేవి, సామ్మ, వనజ, మణేమ్మ, లక్ష్మమ్మ తదితరులు కలెక్టర్‌ను కోరారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన
గిరిజన మహిళలు