గాండ్లపెంట: విశ్వకవి యోగివేమన ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం గాండ్లపెంట మండలం కటారుపల్లిలో నిర్వహించి ఉట్టి ఉత్సవంలో యువకులు హోరాహోరీగా తలపడ్డారు. ఆలయ ఎదుట ఇనుప స్తంభం ఏర్పాటు చేసి స్తంభానికి పై భాగాన తాంబూలంతో ఆలయ పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో రూ.10,116 నగదు ఉట్టి కట్టారు. ఉట్టిని అందుకునేందుకు దాసరిండ్లు, కటారుపల్లి, మద్దివారిగొంది గ్రామాలకు చెందిన యువకులు పలుమార్లు ప్రయత్నించి.. చివరకు మద్దివారిగొందికి చెందిన జట్టు సభ్యులు అందుకున్నారు. కార్యక్రమంలో ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
శేష వాహనంపై శ్రీరంగనాథుడు
తాడిపత్రి: మండలంలోని ఆలూరు కోనలో వెలసిన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 వ రోజు మంగళవారం దేవేరులతో కలసి శేషవాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శేషతల్ప రంగనాథస్వామి మూలవిరాట్‌కు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. రాత్రి శేషవాహన సేవలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
హోరాహోరీగా ఉట్టి ఉత్సవం


