
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించండి
పెట్టుబడులు తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులు ప్రజలకు అందించేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కలెక్టరేట్ ఆవరణలో జనజీవన రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్‌కు వస్తారని, ప్రకృతి వ్యవసాయంపై వారికి అవగాహన కల్పించేలా ప్రతివారం ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.