
దేశం గర్వించదగ్గ మహనీయుడు జగ్జీవన్‌రామ్
పుట్టపర్తి టౌన్: స్వాతంత్య్ర సమరయోధుడు, ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ దేశం గర్వించదగ్గ మహనీయుడని ఎస్పీ రత్న కొనియాడారు. శనివారం పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫెరెన్సు హాలులో బాబు జగ్జీవన్‌రామ్ 118 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రత్న ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిషలూ కృషి చేశారన్నారు. సంస్కరణల కోసం పదవులను సైతం త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు యువతకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సాకారం చేసిన ఘనత జగ్జీవన్‌రామ్‌కే దక్కిందన్నారు. బిహార్‌లోని అట్టడుగు వర్గంలో జన్మించి రాజకీయంగా అత్యుత్తమ స్థాయికి ఎదిగిన ఘనత జగ్జీవన్‌రామ్‌కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్‌ఐలు వలి, మహేష్, ఆర్‌ఎస్‌ఐలు వీరన్న, వెంకటేశ్వర్లు, ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జయంతి వేడుకల్లో ఎస్పీ రత్న