
ఎకై ్సజ్‌లో 44 మందికి ఎస్‌ఐలుగా అడ్‌హాక్ పదోన్నతి
కర్నూలు : ఎకై ్సజ్ శాఖ ఫోర్త్ జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేస్తూ ఆ శాఖ నోడల్ అధికారి (డిప్యూటీ కమిషనర్) శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్న 29 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 15 మంది క్లర్కులకు అడ్‌హాక్ పద్ధతిలో పదోన్నతి కల్పించి బదిలీల్లో భాగంగా వారికి స్టేషన్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ మహిళా ఎస్‌ఐలకు సంబంధించి మరో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీరి సీనియారిటీ జాబితా త్వరలోనే రూపొందించి ఆయా పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. పదోన్నతి పొందిన వారందరికీ శుక్రవారం మధ్యాహ్నం తన కార్యాలయంలో ప్రమోషన్‌తో పాటు పోస్టింగ్ కాపీలను డీసీ శ్రీదేవి అందజేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పదోన్నతి దక్కిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని డీపీఈఓలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షేక్ రవితేజ ఉన్నారు. ఆయనకు కర్నూలు ఎసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐగా పోస్టింగ్ ఇచ్చారు.