
సమస్యలకు కేరాఫ్ కదిరి ఆస్పత్రి
కదిరి టౌన్: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి సమస్యలకు కేరాఫ్‌గా మారింది. పేరుకు వంద పడకల ఆస్పత్రి అయినా కనీస వైద్యం కూడా అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. మందుల కొరత వేధిస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో నిరుపేదలు బయట మెడికల్ షాపులకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. 20 మంది వైద్యులు ఉండాల్సిన చోట 16 మంది ఉన్నారు. అలాగే 90 మందికి పైగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉన్నా కేవలం 70 మంది మాత్రమే ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. వందపడకల ఆస్పత్రిలో కేవలం మూడు వీల్‌చైర్లు, మూడు స్ట్రక్చర్లు ఉండటంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షలు కూడా సరిగా అందుబాటులో లేవని వాపోతున్నారు.
తనకల్లులో..
తనకల్లు సీహెచ్‌సీలో స్టాఫ్ నర్సు పోస్టు ఒకటి ఖాళీ ఉంది. లివర్ , రక్తం పరీక్షలను బయట చేయించుకోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.