రోప్‌ స్కిప్పింగ్‌లో అపురూపం | - | Sakshi
Sakshi News home page

రోప్‌ స్కిప్పింగ్‌లో అపురూపం

Apr 3 2025 1:54 AM | Updated on Apr 3 2025 1:54 AM

రోప్‌

రోప్‌ స్కిప్పింగ్‌లో అపురూపం

అమరాపురం: గ్రామీణ రైతు కుటుంబంలో జన్మించిన రూప.. చదువులోనే కాదు క్రీడల్లోనూ తనకు సాటి లేరని నిరూపిస్తోంది. సరైన ప్రోత్సాహం, అవకాశాలను అందిపుచ్చుకుని జాతీయ స్థాయిలో తన క్రీడా నైపుణ్యాన్ని చాటి పతకాన్ని సొంతం చేసుకుంది. వివరాలు.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన వెన్నపూస సుజాత, వెంకట్రామిరెడ్డి దంపతుల కుమార్తె రూప ప్రస్తుతం అమరాపురం మండలం హలుకూరు సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రతి క్రీడాపోటీల్లోనూ ఆమె ప్రతిభ చాటడం గమనించిన పీడీ రోజా... విషయాన్ని వెంటనే ప్రిన్సిపాల్‌ పద్మావతి దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఆమెలోని క్రీడానైపుణ్యాలను వెలికి తీస్తే పాఠశాలకు మంచి పేరు వస్తుందని భావించిన ప్రిన్సిపాల్‌ వెంటనే ఆ దిశగా రూప ను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో రోప్‌ స్కిప్పింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన రూప... ఇటీవల జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో తొలిసారిగా పాల్గొని వరుసగా బంగారు పతకాలను కై వసం చేసుకుంది. ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని నాసిక్‌ వేదికగా జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్ని ప్రతిభ చాటి వెండి పతకాన్ని సాధించింది. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన రూపను పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్‌ఐ ఇషాక్‌బాషా, ఎంఈఓ, గ్రామస్తులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

జాతీయ స్థాయి రోప్‌లో రాణించిన గురుకుల విద్యార్థిని

రోప్‌ స్కిప్పింగ్‌లో అపురూపం1
1/1

రోప్‌ స్కిప్పింగ్‌లో అపురూపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement