
అరాచకాలు పేట్రేగిపోయాయి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు పేట్రేగిపోయాయి. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితిని టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కల్పించలేదు. స్థానిక సంస్థల స్థానాల్లో ఏమాత్రం బలం లేకపోయినా పోలీసు, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని కుట్ర చేశారు. ఇందులో భాగంగానే కురుబ లింగమయ్యను హత్య చేశారు. ఎస్పీ దుస్తులను కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వేసుకుని పోలీసు వ్యవస్థను శాసిస్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేను నియోజకవర్గంలో అడుగుపెట్టకూడదంటే పోలీసులు అదే అమలు చేయడం అన్యాయం. ప్రతి కార్యకర్తకు ధైర్యం నింపేందుకే వైఎస్ జగన్ జిల్లాకు వస్తున్నారు. – అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు