ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన జపాన్ దేశస్తులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. జపాన్‌లో సత్యసాయి సేవా సంస్థలను ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, 1926లో జన్మించిన సత్యసాయి బాబాకు ఇది వందో సంవత్సరం కావడంతో మహాసమాధి మందిరాన్ని ప్రత్యేకంగా ఆ దేశ సంస్కృతి ప్రతిబింబించేలా అలంకరించారు. సత్యసాయిపై భక్తి భావనను చాటుతూ రుద్ర పఠించారు. అనంతరం జపాన్ సత్యసాయి సేవా సంస్ధల అధ్యక్షుడు మసాకి సుమిటోమా వేడుకలనుద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం ‘గోల్డెన్ బ్రిడ్జి’ పేరుతో నాటిక ప్రదర్శించారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు రైకో హిరా ప్రసంగించారు.


