
అభిమాన నేతను చూశాం.. అదే చాలు
ఎంతో ఆనందం కలిగింది
మాది వ్యవసాయ కుటుంబం. పొలంలో వేరుశనగ, మొక్కజొన్న సాగు చేస్తాం. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఏటా ఠంచనుగా ‘రైతు భరోసా’ అందించడంతో సాఫీగా పంటలు సాగు చేశాం. వరుణుడు కరుణించి పంటలు బాగా పండటంతో నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాం. అలా మమ్మల్ని ఎంతగానో ఆదుకున్న అభిమాన నేత మా ప్రాంతాన్ని రావడంతో ఎలాగైనా చూడాలని వచ్చాం. ఆయన్ను చూశాక ఎంతో ఆనందం కలిగింది.
– చెన్నకేశవ దంపతులు, కుంటిమద్ది గ్రామం
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
నాకు పది ఎకరాల పొలం ఉంది. చంద్రబాబు రైతులకు ఏమీ చేయడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు మా కష్టాలు తెలియడం లేదు. జగన్ ప్రభుత్వంలో అన్నదాతలకు అడుగడుగునా చేయూతనిచ్చారు. ఆయన ఉంటే మాకు ఈ బాధలు ఉండేవే కావు. రాష్ట్రానికి తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నాం.
– రంగయ్య, ఆర్. కొట్టాల, పెనుకొండ మండలం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రామగిరి మండల పర్యటనలో జన తరంగం ఎగిసి పడింది.
అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. జనం తాకిడికి ముదిగుబ్బకు చెందిన శోభారాణి చెప్పులు తెగిపోగా.. జగన్‌ను చూడాలనే సంకల్పంతో ఆమె తన వద్ద ఉన్న టవల్‌ను చింపి కాళ్లకు చుట్టుకుని మరీ ఎర్రటి ఎండలో ముందుకు నడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి కొందరు తలపై టవల్స్ ధరించి, కానుగ ఆకులు కట్టుకొని వచ్చారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్
రాష్ట్రానికి శని పట్టింది..
చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రానికి శని పట్టింది. మాకు కుమార్తె, ఒక కుమారుడు సంతానం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం జగనన్న అమ్మఒడి ఇచ్చేవారు. ఇప్పుడేమో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు. జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటే.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారు.
– వెంకట్రామ్ దంపతులు, పోలేపల్లి గ్రామం

అభిమాన నేతను చూశాం.. అదే చాలు

అభిమాన నేతను చూశాం.. అదే చాలు

అభిమాన నేతను చూశాం.. అదే చాలు

అభిమాన నేతను చూశాం.. అదే చాలు

అభిమాన నేతను చూశాం.. అదే చాలు