
వైభవంగా ‘వేమన’ ఉత్సవాలు
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో రెండో రోజు సోమవారం రాత్రి విశ్వకవి యోగి వేమన ఉత్సవాలు వైభవంగా సాగాయి. పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో వేమన సమాధిని ప్రత్యేకంగా ఆలంకరించి విశేష పూజలు చేశారు. కదిరి పరిసర మండలాల నుంచే కాక వైఎస్సార్ జిల్లా, కర్నూలు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వేమన ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. భక్తులకు పీఠాధిపతి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. రాత్రి చిన్నారుల శాసీ్త్రయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాటల కచేరీ అలరించింది.

వైభవంగా ‘వేమన’ ఉత్సవాలు