ఘనంగా వేమన ఉత్సవాలు ప్రారంభం
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో వెలసిన విశ్వకవి యోగి వేమన ఆలయంలో ఉత్సవాలు ఆదివారం రాత్రి ఆలయ పీఠాధిపతి నందవేమారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేమన సమాధిని ప్రత్యేకంగా ఆలంకరించి పూజలు చేశారు. కదిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్థరాత్రి ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఉడికించిన జొన్నలను భం పోసి పసుపు కుంకుమ కలిపి ఆదిశక్తి పూజలు నిర్వహించారు. అనంతరం జొన్న ధాన్యాన్ని ప్రసాదంగా భక్తులు స్వీకరించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా సోమవారం బండ్ల మెరవణి, ఆర్కెస్ట్రా (పాటల కచేరి) ఉంటుంది. మొక్కుబడి ఉన్న భక్తులు ఎడ్ల బండ్లను అలంకరించి ఆలయం ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేయిస్తారు.
ఘనంగా వేమన ఉత్సవాలు ప్రారంభం
ఘనంగా వేమన ఉత్సవాలు ప్రారంభం


