జానపదం.. కళా వైభవం
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా తెలంగాణ సత్యసాయి యూత్ సభ్యులు శనివారం పుట్టపర్తికి విచ్చేశారు. ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి అష్టోత్తర శతనామావళి పఠించారు. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. తెలంగాణ లోని 10 లక్షల మంది భక్తుల ఇళ్లకు సత్యసాయి చిత్రపటాలను పంపిణీ చేసే ‘సాయి ఇన్ ఎవ్రీ హోం’ కార్యక్రమాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. సాయంత్రం తెలంగాణ జానపద కళా వైభవాన్ని చాటిచెబుతూ యూత్ సభ్యులు చేసిన నృత్య ప్రదర్శనతో భక్తులు మైమరచిపోయారు.
జానపదం.. కళా వైభవం
జానపదం.. కళా వైభవం


