
ఇళ్ల స్థలాలకు చుక్కల గ్రహణం
గత ప్రభుత్వ హయాంలో మంచి అవకాశం..
ముదిగుబ్బ: మండల కేంద్రంలో ఇంటి స్థలాలు కొనుగోలు చేసినా.. విక్రయించినా... రిజిస్ట్రేషన్ కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముదిగుబ్బలో మొత్తం 40 సర్వే నెంబర్లలో 350 ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అయితే నాలుగు సర్వే నెంబర్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మిగిలిన 36 సర్వే నెంబర్లు చుక్కల భూములు, అనెగ్జర్ 2, 3, 4, 5 (వాగులు, వంకలు, కొండలు, దేవదాయ, వక్ఫ్, సరఫ్లస్, కోర్టు వివాదాలు) లో ఉండడం కారణంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఆయా సర్వేనెంబర్లు రిజిస్ట్రేషన్ కాక నిలిచిపోయాయి.
ముదిగుబ్బలో 5,400 ఇళ్ల నిర్మాణం చేయగా, ఇందులో 25వేల మంది జనాభా ఉన్నారు. ఇండ్ల మధ్యన కొన్ని స్థలాలు కూడా వున్నాయి. మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసిపెట్టుకుంటే భవిష్యత్‌లో ధరలు పెరిగినప్పుడు లాభదాయకంగా ఉంటుందని గ్రామీణ ప్రాంత ప్రజలు కొన్ని స్థలాలు కొనుగోలు చేశారు. వీటికి సంబంధించి 2018కి ముందు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. 2018 తర్వాత నుంచి వాటి రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ప్రస్తుతం వారి ఇంట శుభ కార్యాలయాలకు, పిల్లల చదువులకు, ఇతర ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు బ్యాంక్‌ల్లో తాకట్టు పెట్టుందుకు సిద్ధం కాగా, రిజిస్ట్రేషన్‌లు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.
పరిటాల రవీంద్ర హత్యానంతరం ముదిగుబ్బలో జరిగిన అల్లర్ల కారణంగా మండల రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులు కాలిపోయాయి. అప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి ఉన్నతాధికారులు కార్యాలయాల రికార్డులు చూపించాలని ఆదేశిస్తున్నారు. దీంతో రికార్డులు కాలిపోవడంతో వాటికి సంబంధించిన ఆధారాలను మండల రెవెన్యూ అధికారులు చూపలేకపోతున్నారు. దీంతో ఎన్‌ఓసీ కోసం పెట్టుకున్న పైళ్లను సైతం పక్కకు పెడుతున్నారు. ఫలితంగా స్థిరాస్తులకు సంబంధించిన పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కలుగజేసుకుని ప్రత్యామ్నాయం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు.
రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు
రెవెన్యూ రికార్డులు కాలిపోవడంతో ప్రజలకు తీరని కష్టాలు
అనెగ్జర్ 1, 2, 5 భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. భూములకు సంబంధించిన పత్రాలను ఆధారాలను జత పరిచి రైతులు, ఇళ్ల స్థలాల యజమానులు తమ భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలా ఎన్‌ఓసీ కోసం అప్పట్లో ఇచ్చారు. అలాగే 20 సంవత్సరాల క్రితం పట్టా పొందిన రైతులకు సైతం తమ భూములను (ప్రీ ఓల్డ్) రిజిస్ట్రేషన్ అయ్యేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియను అటకెక్కించింది.
2018 తర్వాత బంద్..
రెవెన్యూ రికార్డులు కాలిపోయి..