సీతారాముల కల్యాణ వైభోగమే..
ప్రశాంతి నిలయం: సీతారాముల కల్యాణం భక్తజనం కనులారా తిలకించి తరించింది. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సత్యసాయి భక్తులు యజుర్ మందిరం నుంచి సీతారామ లక్ష్మణ సమేత హనుంతుల చిత్రపటాలతో పాటు కల్యాణోత్సవానికి సంబంధించిన తలంబ్రాలు, తీపివస్తువులు, నూతన వస్త్రాలను ర్యాలీగా తీసుకువచ్చారు. తర్వాత వేదపండితులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో సీతారామ లక్ష్మణ సమేత హనుంతులను, సత్యసాయిని కీర్తించారు. సాయంత్రం మృదురవళి దర్బా బృందం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను మైమరిపించింది.
సీతారాముల కల్యాణ వైభోగమే..
సీతారాముల కల్యాణ వైభోగమే..


