
●కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లాకు 8న వైఎస
అనంతపురం ఎడ్యుకేషన్: ‘‘ఫ్యాక్షన్ ఆనవాళ్లే ఉండకూడదని గడిచిన ఐదేళ్లలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఈ కుట్రలు, కుతంత్రాలు ఎంతో కాలం సాగవు. చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.టీడీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ మజ్జిగ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 8న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో శనివారం నగరంలోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మాజీ మంత్రి శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సతీష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8న ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా 10 గంటలకు పాపిరెడ్డిపల్లికి చేరుకుని లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను కాపాడే అంశంలో తరతమ భేదాలు లేకుండా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులు నిత్యకృత్యమయ్యా యన్నారు. కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను హతమార్చడం వారి క్రూర ఆలోచన విధానానికి అద్దం పడుతోందన్నారు. ఎన్నికలకు ముందు అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పది నెలలవుతున్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదని విమర్శించారు.సమావేశంలో మేయర్ వసీం, వైఎస్సార్ సీపీ కదిరి, మడకశిర నియోజకవర్గాల సమన్వయకర్తలు మక్బూల్‌బాషా, ఈరలక్కప్ప, ఎన్‌ఆర్‌ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, మహాలక్ష్మీ శ్రీనివాస్, నదీం అహమ్మద్, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, గంగుల భానుమతి, మీసాల రంగన్న, పామిడి వీరా, రంగంపేట గోపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులుపాల్గొన్నారు.
ప్రజల్లో భయం పుట్టించేందుకే కురుబ లింగమయ్య హత్య
దారుణ ఘటనను అన్ని
రాజకీయ పార్టీలు ఖండించాలి
లింగమయ్యలా మరో కార్యకర్తకు అన్యాయం జరగకూడదు
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి పిలుపు
మాజీ సీఎం పర్యటన ఏర్పాట్లపై
పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం

●కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లాకు 8న వైఎస

●కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లాకు 8న వైఎస