భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదే | Jayesranjan started the EV charging center | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదే

Published Sun, Jul 28 2024 4:54 AM | Last Updated on Sun, Jul 28 2024 4:54 AM

Jayesranjan started the EV charging center

దేశంలోనే అతి పెద్ద పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ కేంద్రం ప్రారంభించిన జయేశ్‌రంజన్‌

శంషాబాద్‌: చార్జింగ్‌ కేంద్రాలు విస్తృతంగా అందుబాటు­లోకి వస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారని ఐటీ,పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ అన్నారు. పర్యావరణహిత∙ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందన్నారు.

స్వీడన్‌కు చెందిన గ్లీడా సంస్థ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో శ్రీశైలం హైవేలో ఒకేసారి 102 వాహనాలు చార్జింగ్‌ చేసుకునేలా ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ  సందర్భంగా జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ గ్లీడా వంటి సంస్థ దేశంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఈవీ చార్జింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ  2018 కేవలం ఒక చార్జింగ్‌ పాయింట్‌తో ప్రయాణం ప్రారంభించి ప్రస్తుతం నగరంలో మొత్తం 89 కేంద్రాలను విస్తృత పర్చిందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవదేష్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement