
MLC Election Counting Updates..
కరీంనగర్ జిల్లా :
- కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బిజెపి
- టీచర్స్ ఓట్ల లెక్కింపు పూర్తి.
- భారీ మెజారిటీతో బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య విజయం.
అధికారికంగా ఇంకా ప్రకటించని అధికారులు.
కరీంనగర్ జిల్లా:
- కరీంనగర్ టీచర్ MLC మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపు
- కాసేపట్లో అధికారిక ప్రకటన
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి
- గెలుపోటములు సహాజం
- ఓటమిని అంగీకరిస్తున్నా
- గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్న
- ఓడిపోయినందుకు బాధపడటం లేదు
- ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో
- ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు.
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ
- 18 రౌండ్ ఫలితాలు
- టీ పీఆర్టీయూ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేట్
- మరికాసేపట్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- కొనసాగుతున్న 17వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ
- స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం
- సుందర్ రాజుకు వచ్చిన (3115) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులు
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ
- తొలి స్థానంలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయానికి ఇంకా 4149 ఓట్లు అవసరం
- రెండో స్థానంలో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 6162 ఓట్లు అవసరం
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- 15 రౌండ్ ఫలితాలు
- బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్
- వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- 16 రౌండ్ ఫలితాలు
- బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్
- సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ తర్వాత
- శ్రీపాల్ రెడ్డి- 7673
- అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5660
- హర్షవర్ధన్ రెడ్డి- 5309
- పూల రవీందర్- 3992
కరీంనగర్ :
- టీచర్స్ కోటా ఎమ్మెల్సీలో ముందంజలో ఉన్న బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య
- సంబరాలకు సిద్దమవుతున్న బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
- మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు దిశగా కొమరయ్య
కరీంనగర్:
- కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ టేబుల్ కౌంటింగ్.
- మొదటి 14 వేల ఓట్ల లెక్కింపు సాగుతుండగా..
- లీడ్ లో కొనసాగుతున్న బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య
- విక్టరీ సింబల్ చూపిస్తూ కౌంటింగ్ ఆలోచించి బయటికి వచ్చిన మల్క కొమురయ్య
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- ప్రారంభమైన 16వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ
- బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం
- సరోత్తం రెడ్డికి వచ్చిన (2289) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులు
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా:
- 15 రౌండ్ ఫలితాలు
- స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు(2040 ఓట్లు) ఎలిమినేట్
- 15వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలు
- శ్రీపాల్ రెడ్డి- 6916
- అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5205
- హర్షవర్ధన్ రెడ్డి- 4799
- పూల రవీందర్- 3617
- పులి సరోత్తం రెడ్డి-2645
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- కొనసాగుతున్న 15వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ
- స్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం
- సుందర్ రాజుకు వచ్చిన (2040) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులు
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- పన్నెండో అభ్యర్థి బాబు రావు( 128 ఓట్లు) ఎలిమినేట్
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- కొనసాగుతున్న 13 వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ
కొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులు
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- ముగిసిన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
- చెల్లుబాటు అయిన ఓట్లు- 23,641
- చెల్లని ఓట్లు- 494
- గెలుపు కోటా- 11822 గా నిర్ధారణ
- 12 రౌండ్లు ముగిసిన తర్వాత వచ్చిన ఓట్లు
- శ్రీపాల్ రెడ్డి- 6105
- అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4884
- హర్షవర్ధన్ రెడ్డి- 4502
- పూల రవీందర్- 3202
- పులి సరోత్తం రెడ్డి- 2337
సుందర్ రాజు-2091
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- 14 రౌండ్ ఫలితాలు
- కొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ఎలిమినేట్
- 14వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలు
- శ్రీపాల్ రెడ్డి- 6165
- అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4946
- హర్షవర్ధన్ రెడ్డి- 4596
- పూల రవీందర్- 3249
- పులి సరోత్తం రెడ్డి- 2394
- సుందర్ రాజు-2141
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా:
- ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియ
- తొమ్మిదో అభ్యర్థి తాటికొండ రాజయ్య( 36 ఓట్లు) ఎలిమినేట్
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- ఏడో అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి(24 ఓట్లు) ఎలిమినేట్
- వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా :
- ఎనిమిదో అభ్యర్థి కైలాసం( 26 ఓట్లు) ఎలిమినేట్
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
నల్లగొండ జిల్లా:
- ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియ
- ఎవరికీ గెలుపు కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులు
- చలిక చంద్ర శేఖర్ 1 ఓటు, కంటే సాయన్న. 4 ఓట్లు, బంక రాజు 7 ఓట్లు, పురుషోత్తం రెడ్డి 11, లింగడి వెంకటేశ్వర్లు 15, అర్వ స్వాతి 19 ఎలిమినేటర్
కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్
- ఆలస్యంగా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియ
- నేటి రాత్రి వరకు కొనసాగనున్న బ్యాలెట్ పేపర్ల బెండల్స్ కట్టడం ప్రక్రియ
- వ్యాలీడ్ ఇన్ వ్యాలిడ్ ఓట్ల పరిశీలనకు రాత్రి వరకు సమయం పట్టే అవకాశం
- రాత్రి వరకు ఎమ్మెల్సీ ఓట్లు కట్టలు కట్టి సపరేషన్ ప్రక్రియ
- అర్ధరాత్రి దాటిన తర్వాతే పట్టభద్రుల అసలు ఓట్ల లెక్కింపు
- చెల్లని ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన
- చెల్లని ఓట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులకే నష్టం అంటున్న ప్రసన్న హరికృష్ణ
- గెలుపు ధీమా వ్యక్తం చేసిన ప్రసన్న హరికృష్ణ
- టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ బండెల్స్ కట్టడం పూర్తి
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్
నల్లగొండ జిల్లా
- ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
- మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక లీడ్ లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి
- రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి
- మూడో స్థానంలో టీ పీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి
- నాలుగో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్
- ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి
- కాసేపట్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను ప్రకటించనున్న అధికారులు
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
- నల్లగొండ జిల్లా
- మరికాసేపట్లో ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
- ఇప్పటి వరకు పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజ
- మొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా శ్రీపాల్ రెడ్డికి నమోదు
- ఆ తర్వాత యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి
- మూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి
- రెండో ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరనేది తెలిసే అవకాశం
- మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక చెల్లని ఓట్లను తొలగించి గెలుపు కోటాను నిర్ణయించనున్న అధికారులు
వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్
- నల్లగొండ జిల్లా..
- మరికాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం.
- ముగిసిన బ్యాలెట్ పత్రాల కట్టలు కట్టే ప్రక్రియ
- 25 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
- టేబుల్ కు 40 కట్టల కేటాయింపు
- ఒక్కో కట్టలో 25 ఓట్లు
- ఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల కేటాయింపు
- మిగిలిన ఓట్లు చివరి టేబుల్ కు కేటాయింపు
- మధ్యాహ్నం మూడు గంటల వరకే ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
- చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను నిర్ణయించనున్న అధికారులు
- మొత్తం పోలైన ఓట్లు- 24139
👉ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడికానున్నాయి. పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది.
👉కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు.
👉ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్‌వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు.
👉గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి.
👉ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా.. గ్రాడ్యుయేట్ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు.
👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 24,139 మంది ఓట్లు పోలయ్యాయి.