
సాక్షి, హైదరాబాద్: ఎల్లుండి(శనివారం) వైన్ షాపులు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో మద్యం షాపులు షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల ఆదేశాలతో ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి... మరుసటి రోజు 13వ తేదీ ఉదయం 6 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు కాంపౌండ్లు కూడా మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సీపీ హెచ్చరించారు.
రహస్యంగా మద్యం విక్రయాలు జరిపితే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. హనుమాన్ జయంతి రోజున మతపరమైన అల్లర్లు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.