closed
-
కరెంటు కోత... హీత్రూకు మూత!
లండన్: అంతర్జాతీయ ప్రయాణాలకు గుండెకాయ వంటి లండన్ హీత్రూ విమానాశ్రయం శుక్రవారం పూర్తిగా మూతబడింది. ఎయిర్‌పోర్టుకు విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగడమే ఇందుకు కారణం. దాంతో హీత్రూకు కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విమానాశ్రయాన్ని రోజంతా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకంగా 1,350 విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం జరిగినట్టు విమాన ట్రాకింగ్ సేవల సంస్థ ఫ్లైట్రాడార్24 వెల్లడించింది.దీనివల్ల 2.9 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు లోనైనట్టు సమాచారం. ‘‘విమానాశ్రయానికి విద్యుత్‌ను పూర్తిగా తిరిగి ఎప్పుడు పునరుద్ధరించేదీ చెప్పలేం. విమానాశ్రయాన్ని తెరిచేదాకా ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవైపు రావొద్దు’’అని హీత్రూ సీఈఓ థామస్ వోల్డ్బీ విజ్ఞప్తి చేశారు. శనివారానికల్లా పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరిస్తామని ఆయన ఆశాభావం వెలిబుచ్చినా చాలా రోజులే పట్టవచ్చంటున్నారు.ప్రయాణికులు తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవడం, అందుకు తగ్గట్టు విమానయాన సంస్థలు విమానాలను, సిబ్బందిని సమకూర్చుకునేందుకు కూడా కొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు. హీత్రూ యూరప్‌లోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ప్రతి 90 సెకన్లకు ఒక విమానం టేకాఫ్/లాండింగ్ జరుగుతుంది! ఇక్కణ్నుంచి రోజుకు 669 విమానాలు టేకాఫ్ అవుతాయి.మండిపడుతున్న ప్రయాణికులు హీత్రూ మూసివేతతో ఉత్తర అమెరికా, ఆసియా దేశాలకు చెందిన సుదూర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామంపై వారంతా తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్క అగ్నిప్రమాదం కారణంగా యూరప్‌లోనే అత్యంత రద్దీ విమానాశ్రయం మూతబడటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది అసాధారణమైన పరిస్థితని ఏవియేషన్ కన్సల్టెంట్ అనితా మెండిరట్టా తెలిపారు. ‘‘శనివారానికల్లా సమస్యను సరిదిద్దుతాం. కానీ పూర్తి సాధారణ స్థితికి చేరేందుకు నాలుగు రోజులు పట్టొచ్చు’’అని చెప్పారు. హీత్రూ వైపు వెళ్లే అన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్లు నేషనల్ రైల్ తెలిపింది. హీత్రూ మూసివేత కారణంగా 4 వేల టన్నుల కార్గో రవాణా కూడా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రికల్లా కొన్ని విమాన సేవలను పునరుద్ధరించినట్టు చెప్పుకొచ్చారు. ‘‘జొహన్నెస్‌బర్గ్, సింగపూర్, రియాద్, కేప్‌టౌన్, సిడ్నీ, బ్యూనస్ఎయిర్స్ వంటి నగరాలకు విమానాలు బయల్దేరాయి. అవన్నీ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికే పరిమితమయ్యాయి’’ అని స్పష్టం చేశారు. కారణమేంటి? పశి్చమ లండన్‌లో హీత్రూ విమానాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి భారీ పేలుడు శబ్దం విన్పించిందని, మంటలు సబ్ స్టేషన్‌ను చుట్టుముట్టాయని స్థానికులు వివరించారు. లండన్ ఫైర్ బ్రిగేడ్ 70 మంది సిబ్బంది 10 ఫైరింజిన్లతో హుటాహుటిన చేరుకుని 7 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే విమానాశ్రయంలో పవర్ కట్ ఏర్పడింది. ప్రమాదానికి కారణమేమిటనే దానిపై స్పష్టత లేదు. కుట్ర కోణం లేదని ప్రభుత్వం పేర్కొంది.జరిగింది చాలా పెద్ద ప్రమాదం. హీత్రూ విమానాశ్రయానికి ఉన్న అతి పెద్ద బలహీనత విద్యుత్ సరఫరాయే – విమానాశ్రయం సీఈఓ థామస్ వోల్డ్బీ తీవ్ర వైఫల్యమే: ప్రధాని హీత్రూకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం తీవ్ర వైఫల్యమేనని ప్రధాని కియర్ స్టార్మర్ అంగీకరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగి తీరుతుందని ఆయన అధికార ప్రతినిధి టామ్ వెల్స్ ప్రకటించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు.బిలియన్లలో నష్టం!హీత్రూ ప్రమాదం విమానయాన సంస్థల నడ్డి విరిచేలా కని్పస్తోంది. విమానాల రద్దు, బీమా, పరిహారం చెల్లింపులు తదితరాల రూపంలో అవి బిలియన్ల కొద్దీ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. హీత్రూ మూసివేత దెబ్బ ఇప్పటికే వాటి మార్కెట్ విలువపై పడింది. బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా, ర్యాన్ఎయిర్ వంటి పలు సంస్థల షేర్లు 1 నుంచి 2 శాతం దాకా పతనమయ్యాయి.ఆ సమయంలో గాల్లో 120 విమానాలువిద్యుత్ సరఫరా నిలిచి విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో సుమారు 120 విమానాలు హీత్రూ సమీపంలో గాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్నింటిని సమీపంలోని గాట్విక్, మాంచెస్టర్‌కు మళ్లించగా మరికొన్ని సమీప యూరప్ దేశాల్లోని పారిస్, ఆమ్స్టర్డామ్, ఫ్రాంక్ఫర్ట్ తదితర విమానాశ్రయాల్లో లాండయ్యాయి.మరికొన్ని విమానాలు వెనక్కు వెళ్లిపోయాయి. హీత్రూ మూసివేత వల్ల పారిస్‌లో లాండైన తమ ప్రయాణికుల కోసం క్వాంటాస్ ఎయిర్‌లైన్ సింగపూర్, పెర్త్ నుంచి విమానాలను పంపింది. లండన్‌కు వెళ్లాల్సిన వారిని బస్సులు, రైళ్లలో తరలిస్తామని తెలిపింది. ర్యాన్ఎయిర్ కూడా తమ ప్రయాణికుల కోసం డబ్లిన్, స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్టులకు విమానాలు నడుపుతామని తెలిపింది.అత్యంత బిజీ! అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో హీత్రూ ఒకటి. ఇది 1964లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడినుంచి ఏకంగా 90 దేశాల్లోని 230 గమ్యస్థానాలకు విమానాలు నడుస్తాయి. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో పాటు 90 సంస్థలకు చెందిన విమానాలు ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తాయి.జనవరిలో రికార్డు స్థాయిలో 63 లక్షల మంది ప్రయాణికులు హీత్రూ గుండా రాకపోకలు సాగించారు! 2010లో ఐస్‌ల్యాండ్‌లో అగ్నిపర్వతం బద్దలై భారీగా దుమ్ముధూళి మేఘాలు కమ్ముకోవడంతో అట్లాంటిక్ మీదుగా విమానాల రాకపోకలకు నెలలపాటు అంతరాయం ఏర్పడింది. అప్పుడు కూడా హీత్రూలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయినా ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనేందుకు బ్రిటన్ సన్నద్ధం కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మూడు సబ్స్టేషన్లున్నా... హీత్రూకు కరెంటు సరఫరా కోసం మూడు సబ్స్టేషన్లతో పాటు ఒక బ్యాకప్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. కానీ వాటిలో ఒక సబ్‌స్టేషన్ ప్రస్తు తం పని చేయడం లేదు. మరికొటి కొద్ది రోజులు గా సమస్యలు ఎదుర్కొంటోంది. హీత్రూ విమానాశ్రయం నడవాలంటే ఏకంగా ఒక మినీ నగర అవసరాలకు సమానమైన కరెంటు అవసరం!ఎయిరిండియా సేవలూ రద్దు..న్యూఢిల్లీ: హీత్రూకు విమాన సేవలను శుక్రవారం నిలిపేసినట్టు ఎయిరిండియా పేర్కొంది. ‘‘ఒక విమానం ముంబైకి తిరిగొచ్చింది. మరొకటి ఫ్రాంక్ఫర్ట్ మళ్లించాం. మిగతావి రద్దయ్యాయి’’ అని ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి శుక్రవారం లండన్ వెళ్లాల్సిన 5 వర్జిన్ అట్లాంటిక్, 8 బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలు కూడా రద్దయ్యాయి. -
జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!
సాక్షి, అమరావతి: ‘ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాం’ అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవడం వల్ల ఆస్పత్రులకు మందులు, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు జరపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో విక్రేతలు నోటీసులు జారీ చేసి.. సరఫరాలను నిలిపివేశారని తెలిపింది.ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని వాపోయింది. ఈ సమస్యలను గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల వైద్య శాఖపై సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో సైతం పెండింగ్ బిల్లులకు నిధులు మంజూరుతో పాటు సకాలంలో బిల్లుల చెల్లింపునకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో తామెంతో నిరుత్సాహానికి గురయ్యామని పేర్కొంది. పెండింగ్ బిల్లులను పరిష్కరిస్తే తప్ప.. ఆస్పత్రులు కోలుకోలేవని స్పష్టం చేసింది.అలాగే ప్రస్తుత ప్యాకేజీ ధరలను శాస్త్రీయంగా పునఃమూల్యాంకనం చేయాలని కోరింది. రూ.2 వేల కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేసి.. మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాలపరిమితిలోపు ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. గ్రీన్‌చానల్‌లో ప్రతి నెలా పెన్షన్లు, జీతాలతో పాటు ఆరోగ్య శ్రీ బిల్లులను కూడా క్రమబద్ధంగా చెల్లించాలని.. ఇందుకోసం చట్టబద్ధమైన చెల్లింపుల షెడ్యూల్లోకి చేర్చాలని కోరింది. -
జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్..
దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను (Bank Account)ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేస్తోంది. ఈ మార్పులను అర్థం చేసుకోవడం, ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా అవసరం. లేకపోతే మీ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొన్ని రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్‌ను అరికట్టడం, బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఆధునికీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.రిస్క్‌లను తగ్గించడానికి, బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని లోపాలను పరిష్కరించడానికి, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ మెరుగైన సేవలను అందించడానికి ఈ కొత్త మార్పులను అమలు చేస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం 2025 జనవరి 1 నాటికి మూడు నిర్దిష్ట రకాల బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ మూసివేస్తోంది.డార్మాంట్ అకౌంట్లుడార్మాంట్ అకౌంట్ అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా. మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్లు ఈ ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఖాతాదారులను, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్బీఐ అటువంటి ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది.ఇనాక్టివ్ అకౌంట్లునిర్దిష్ట వ్యవధిలో (సాధారణంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీ కార్యకలాపాలు లేని వాటిని ఇనాక్టివ్ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఖాతా భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్బీఐ క్లోజ్ చేస్తోంది. మీకూ ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి.జీరో బ్యాలెన్స్ ఖాతాలుఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్‌ని కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్ కానున్నాయి. అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యం. అంతేకాకుండా కేవైసీ (KYC) నిబంధనలను బలోపేతం చేయడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం. -
Uttar Pradesh: విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు పొడిగింపు
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలల్లో ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణను పొడిగించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌతమ్ బుద్ధ నగర్ పరిపాలనా అధికారులు నవంబర్ 25 వరకు అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆఫ్‌లైన్ తరగతులపై నిషేధాన్ని నవంబర్ 25 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం ఇటీవల ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 'చాలా తీవ్రమైన' కేటగిరీకి చేరుకోవడంతో ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు ఆఫ్‌లైన్ తరగతులను నిలిపివేశారు. డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డియోస్) ధరమ్వీర్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ ఎన్సీఆర్లో శనివారం గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం అలీపూర్, అశోక్ విహార్, ఆనంద్ విహార్, బవానా, డీటీయూ, ద్వారక, చాందినీ చౌక్, జహంగీర్‌పురి, నరేలా, నెహ్రూ నగర్, మందిర్ మార్గ్, పట్పర్గంజ్, రోహిణి, వజీర్పూర్, పంజాబీ బాగ్ తదితర ప్రాంతాల్లో వాయునాణ్యత 400 కంటే ఎక్కువ నమోదైంది. ఇది కూడా చదవండి: 8 నుంచి 16 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ -
శివనామస్మరణలతో కేదార్నాథ్ తలుపులు మూసివేత
రుద్రప్రయాగ: శివనామస్మరణల మధ్య చార్ధామ్లలో ఒకటైన కేదార్నాథ్ ధామ్ తలుపులను ఈరోజు (ఆదివారం) మూసివేశారు. శీతాకాలంలో ప్రతీయేటా ఈ తంతు కొనసాగుతుంటుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి కేదార్‌నాథ్‌లో మహాశివునికి ఘనంగా పూజలు జరిగాయి. ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులను మూసివేశారు. ఇకపై కేదారనాథుడు ఉఖిమఠ్‌లో ఆరు నెలల పాటు దర్శనం ఇవ్వనున్నారు. భయ్యా దూజ్ సందర్భంగా ఈ రోజున తలుపులు మూసివేశారు. ఈ సందర్భంగా పంచముఖి విగ్రహాన్ని సంచార విగ్రహ డోలీలో కొలువుదీర్చారు. అనంతరం ఈ విగ్రహం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్‌కు ఊరేగింపుగా తరలిస్తారు. ఈ ఏడాది 16 లక్షల మంది యాత్రికులు కేదార్నాథ్ ధామ్‌ను సందర్శించుకున్నారు. #WATCH | Uttarakhand: The portals of Shri Kedarnath Dham closed for the winter season today at 8:30 am. The portals were closed with Vedic rituals and religious traditions amidst chants of Om Namah Shivay, Jai Baba Kedar and devotional tunes of the Indian Army band.(Source:… pic.twitter.com/vCg2as6aJ7— ANI (@ANI) November 3, 2024కేదార్‌నాథ్‌ను ఇక్కడ చివరిసారిగా దర్శనం చేసుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని 10 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈరోజు కేదార్‌నాథ్‌లోని పంచముఖి విగ్రహాన్ని మొబైల్ విగ్రహం డోలీ ద్వారా ఉఖిమత్‌కు పంపనున్నారు. నిన్ననే(శనివారం) గంగోత్రి ధామ్ తలుపులు మూసివేశారు. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిలో గంగమ్మను పూజిస్తారు. ఇది కూడా చదవండి: త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం -
రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయం మూసివేత
చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది.కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. -
నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత
డెహ్రాడూన్: భక్తిశ్రద్ధలతో కొనసాగున్న చార్ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. శీతాకాలం రాకతో నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేయనున్నారు. అనంతరం ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనం కొనసాగుతుంది. ఇదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేయనున్నారు.దీపోత్సవంతో గంగోత్రి ధామం తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ తెలిపారు. అనంతరం గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలి యాత్ర నిర్వహిస్తూ శీతాకాలపు విడిదికి తీసుకువస్తామని చెప్పారు. మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత, యమునా తల్లి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని ఆలయానికి తీసుకువస్తారు. ఈ యాత్రా కాలంలో శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల 21 వేల 752 మంది యాత్రికులు ఈ రెండు ధామాలను సందర్శించుకున్నారు.ఇది కూడా చదవండి: మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో -
Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్
రాంచీ: జార్ఖండ్‌లో నేడు (శనివారం) రేపు (ఆదివారం) ఐదు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీజీఎల్‌సీసీఈ)దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని, అలాగే ఆదివారం కూడా ఇదే పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా పరీక్ష ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రత్యేకంగా చర్చించారు. పరీక్ష సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సోరెన్ హెచ్చరించారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని సంబంధిత అధికారి తెలిపారు.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ‘ఇప్పుడే సీనియర్ అధికారులతో మాట్లాడి, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను అందించాను. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’ అని దానిలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకం -
శ్రీకృష్ణాష్టమికి బ్యాంకులు పనిచేస్తాయా?
జన్మాష్టమి.. దీనినే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా అంటారు. ఇది హిందువులు అత్యంత వేడుకగా చేసుకునే పండుగ. ఈసారి జన్మాష్టమి సోమవారం అంటే ఆగస్టు 26న వచ్చింది. ఆగస్టు 24, 25వ తేదీలు శని, ఆదివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి. మరి సోమవారం, శ్రీకృష్ణాష్టమి నాడు బ్యాంకులు పనిచేస్తాయా? లేదా మూసివుంటాయా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 26న సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయయనున్నారు. అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, పట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేయవు. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు తమ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సెలవుల జాబితాను పొందవచ్చు.కాగా త్రిపుర, మిజోరం, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, న్యూఢిల్లీ, గోవాలలో సోమవారం నాడు బ్యాంకులు పనిచేస్తాయి. అయితే సోమవారం సెలవు ఉన్న బ్యాంకులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మొదలైన సేవలు ఎప్పటిలానే కొనసాగుతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు బ్యాంకు సేవలను పొందవచ్చు. -
Pakistan: ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయిన 700 మంది
పాకిస్తాన్‌లోని ఒక సంస్థలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇస్లామాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్ మోనాల్‌ను మూసివేయడంతో దానిలో పని చేస్తున్న 700 మంది రోడ్డున పడ్డారు.డాన్ నివేదిక ప్రకారం ఇస్లామాబాద్‌లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లోని మోనాల్‌ను మాత్రమే కాకుండా ఇక్కడున్న అన్ని రెస్టారెంట్లను మూసివేయాలని పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణను ఉద్దేశించి 2024, జూన్ 11న సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ పార్క్ చుట్టూ ఉన్న రెస్టారెంట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు 2024 సెప్టెంబర్ 11 నుంచి రెస్టారెంట్ మూసివేయనున్నామని మోనాల్ యాజమాన్యం తెలిపింది.ఈ హోటల్ గత రెండు దశాబ్దాలుగా ఆహర ప్రియులకు ఇష్టమైనదిగా పేరొందింది. 2006లో ప్రారంభించినప్పటి నుండి మోనాల్ నిరంతరం ఆహార ప్రియులకు సేవలు అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్లో 700 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇస్లామాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఈ రెస్టారెంట్లో ఆహారం తినేందుకు వస్తుంటారు.మోనాల్ మూసివేత ప్రకటనతో దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. తమ రెస్టారెంట్‌కు స్టార్ రేటింగ్ ఉందని మోనాల్ యజమాని లుక్మాన్ అలీ అఫ్జల్ తెలిపారు. -
Himachal: విరిగిపడిన కొండచరియలు.. 128 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో 128 రహదారులు మూతపడ్డాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 15 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.మండీ, బిలాస్పూర్, సోలన్, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లో వరద ముప్పు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. బలమైన గాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి తాకిడి కారణంగా పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయని, బలహీనమైన నిర్మాణాలు, కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మండీలో 60, కులులో 37, సిమ్లాలో 21, కాంగ్రాలో ఐదు, కిన్నౌర్‌లో నాలుగు, హమీర్పూర్ జిల్లాలో ఒక రోడ్డును మూసివేశారు. అలాగే 44 విద్యుత్, 67 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడింది.మండీ జిల్లాలోని జోగిందర్‌నగర్‌లో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధర్మశాలలో 125.4, కటౌలాలో 112.3, భరారీలో 98.4, కందఘాట్లో 80, పాలంపూర్‌లో 78.2, పండోహ్లో 76, బైజ్నాథ్లో 75, కుఫ్రీలో 70.8, కుఫ్రిలో 60 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో సగటున 445.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంటుంది. ఇప్పుడు 321.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
బంగ్లాదేశ్‌లో ఎల్ఐసీ ఆఫీస్ మూసివేత
బంగ్లాదేశ్‌లోని తమ కార్యాలయాన్ని ఆగస్టు 7 వరకు మూసివేయనున్నట్లు ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సోమవారం తెలిపింది. బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా దళాలకు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో గత రెండు రోజుల్లో 100 మందికి పైగా మృతి చెందారు."బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న సామాజిక-రాజకీయ పరిస్థితుల కారణంగా, బంగ్లాదేశ్ లిమిటెడ్ ఎల్ఐసీ కార్యాలయం ఆగష్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు మూసివేస్తున్నాం" అని రెగులేటరీ ఫైలింగ్‌లో ఎల్ఐసీ తెలిపింది.బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు 3 రోజుల పాటు కర్ఫ్యూను ప్రకటించిందని పేర్కొంది. వివాదాస్పద ఉద్యోగ కోటా పథకానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో గత నెలలో విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా మారాయి. -
Himachal: హఠాత్తుగా ముంచెత్తిన వరద.. చాంగుట్- టింగ్రేట్ రోడ్డు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలోని మయాడ్ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మయాడ్ ఘాటీలోని చాంగుట్ కాలువలోకి అకస్మాత్తుగా వరదలు రావడంతో చాంగుట్ నుండి టింగ్రేట్ వరకుగల రహదారిని అధికారులు మూసివేశారు.ఈ వరదల కారణంగా ఇంతవరకూ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కులు, మండీ జిల్లాల్లో సంభవించిన వరదల్లో సుమారు 45 మంది గల్లంతు కాగా, వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనిలో ఆర్మీ, ఎన్డిఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, పోలీస్, హోంగార్డు బృందాలకు చెందిన మొత్తం 410 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. pic.twitter.com/rPvdpWnTvo— Lahaul & Spiti Police (@splahhp) August 3, 2024 -
విరిగిపడిన కొండచరియలు.. గంగోత్రి హైవే బంద్
ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడుతూ జనాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా ఉత్తరకాశీలోని గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు.దీంతో ఉత్తరకాశీలోని మనేరి, భట్వాడిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) బృందం ఈ హైవేపై పడిన రాళ్లు, శిధిలాలను తొలగించేపని చేపట్టింది. వీలైనంత త్వరగా రహదారిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిథోరాఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కేదార్‌నాథ్‌లోని గౌరీకుండ్ సమీపంలో రాళ్లు పడడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. దీనికిముందు జూలై ప్రారంభంలో బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పట్లో బద్రీనాథ్ మార్గాన్ని కూడా మూసివేశారు. అయితే బీఆర్ఓ బృందం శిధిలాలు, రాళ్లను తొలగించడంతో ఆ రహదారిని తిరిగి తెరిచారు. गंगोत्री नेशनल हाईवे भूस्खलन के कारण बंद, रास्ते से मलबा हटाने में जुटी BRO की टीम#Gangotri | #NationalHighway | #Landslide | #Uttarakhand pic.twitter.com/GmtrvQ72iF— NDTV India (@ndtvindia) July 21, 2024 -
ముంబైలో భారీ వర్షం.. అంథేరీ సబ్వే బంద్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వివిధ రహదారులలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అంధేరి సబ్వే ఐదు అడుగుల మేర నీటితో నిండిపోయింది. ఫలితంగా అధికారులు ఈ సబ్వేను మూసివేశారు.ముంబైలో నేటి (శనివారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపైకి నీరు ప్రవేశించింది. ఫలితంగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు విలేపార్లేలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రానున్న రోజుల్లో ముంబయిలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో భారీ వర్షాలు కరుస్తున్న దృష్ట్యా పలు పాఠశాలలు, కళాశాలను మూసివేశారు. Watch: Heavy rain in Mumbai has led to intense morning showers and four feet of water accumulation in the Andheri subway. The subway has been closed to traffic since 6: 30 AM. pic.twitter.com/jHcocRmTZY— IANS (@ians_india) July 20, 2024 -
పాతాళగంగ లైన్ క్లియర్.. తెరుచుకోని జోషిమఠ్ రహదారి
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రెండు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిలో ఒకటి బద్రీనాథ్ జాతీయ రహదారిలోని జోషిమఠ్‌లో, మరొకటి పాతాళగంగ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. అయితే తాజాగా చార్ధామ్ యాత్రికుల కోసం పాతాళగంగ రహదారిని క్లియర్ చేశారు. దీంతో 40 గంటల తరువాత ఈ రహదారిలో వెళ్లేవారికి ఉపశమనం లభించినట్లయ్యింది. జోషిమఠ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన రహదారి ప్రాంతాన్ని ఇంకా క్లియర్ చేయలేదు.48 గంటలు గడిచినా జోషిమఠ్-బద్రీనాథ్ హైవేలో ఇంకా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడటంతో, బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్ మొదలైన ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్ధామ్ యాత్రికులు పలు అవస్థలు పడుతున్నారు.రెండు వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ హైవేపై చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు జోషిమఠ్‌లో రహదారిని క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో 260కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. వాటిపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేసేందుకు 241 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేశారు. -
అధికార మదం.. ఆర్యవైశ్యులపై ప్రతాపం డబ్బులివ్వలేదని మూసేశారు
తిరుపతి రూరల్: టీడీపీ కూటమి నేతల దృష్టి ఆర్యవైశ్యుల వ్యాపారాలపై పడింది. కష్టనష్టాలకోర్చి వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయాని్నవ్వడమే కాకుండా, పది మందికి ఉపాధి చూపిస్తున్న ఆర్యవైశ్యులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే అధికారులతో వ్యాపారాలను సీజ్ చేయిస్తున్నారు. వ్యాపారులతో పాటు వందలాది కార్మికుల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లావ్యాప్తంగా పలువురు వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.తాజాగా చంద్రగిరి నియోజకవర్గం కుంట్రపాకంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు కిషోర్‌కు చెందిన ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించారు. గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ మిల్లులో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి ఎంతో మంది రైతులు ధాన్యాన్ని ఈ మిల్లులో బియ్యం చేసుకుని వెళుతుంటారు. ఇటు కార్మికులకు, అటు అన్నదాతలకు బాసటగా నిలిచిన ఈ రైస్ మిల్లుపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కన్ను పడింది.తన బంధువులు, తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నేతలు అమిలినేని మధు, చెరుకూరి మధు, శ్రీధర్ నాయుడును రైస్ మిల్లు యజమాని కిషోర్ వద్దకు పంపినట్లు సమాచారం. వారు ముగ్గురూ కిషోర్ దగ్గరకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంత ఇవ్వలేనని, కొంత ఇస్తానని చెప్పినప్పటికీ వారు అంగీకరించలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే అధికారులను రంగంలోకి దించి, అన్ని రకాల అనుమతులతో నడుస్తున్న రైస్ మిల్లుకు బుధవారం అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయించి, సీజ్ చేయించినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.దీంతో రైసు మిల్లు మూతపడింది. 200 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మిల్లు యజమాని కిషోర్ రెండుసార్లు ఎమ్మెల్యే పులివర్తి నాని వద్దకు వెళ్లి వేడుకోగా, ఆయన తీవ్రంగా దుర్భాషలాడినట్లు తెలిసింది. తాను లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడినని, తన మాట వినకుంటే జిల్లాలో ఎక్కడా నిన్ను వ్యాపారం చేయనీయను అంటూ కిషోర్‌ను భయపెట్టినట్లు సమాచారం. దీంతో కిషోర్ కంట నీరు పెట్టుకొని బయటకు వచ్చినట్లు వ్యాపారవర్గాలు తెలిపాయి.వ్యాపారుల ఆగ్రహంవ్యాపారుల్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడే ఆర్యవైశ్యుల సంక్షేమ సంఘం నాయకుడు, చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, తిరుపతి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన కిషోర్‌నే వేధించి, ఆయన మిల్లును మూసివేయించడంపై వ్యాపారవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు వ్యాపారులంతా సంఘటితమవుతున్నారు.తమ నేత కిషోర్‌కు న్యాయం జరిగేంత వరకు బాసటగా నిలుస్తామని చెబుతున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయిస్తే ఎంత మంది జీవితాలు రోడ్డున పడతాయన్నది ఆలోచించని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన బంధువుల తీరును ప్రజలకు వివరించడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకై వారు నిర్ణయించినట్లు సమాచారం.అధికారుల అత్యుత్సాహంఅధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన బంధువుల ఒత్తిడితో ఎల్.వి.ఎం రైస్ మిల్లును మూసివేయించడంలో అధికారులు అత్యుత్సాహం చూపించారు. సాధారణంగా ఏ వ్యాపార సంస్థనైనా సీజ్ చేయాల్సి వస్తే ముందుగా నోటీసు ఇచ్చి, మూడు నెలలు సమయం ఇవ్వాలి. నోటీసుకు యజమాని నుంచి వచ్చే సమాధానంతో పాటు మరికొన్ని నియమాలు పాటించాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండానే విద్యుత్తు సరఫరా నిలిపివేసి, మిల్లును సీజ్ చేసేశారు. అందులో పనిచేసే కార్మికుల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలి్సన కనీస బాధ్యతను కూడా విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. -
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం పనిచేయవు. రోజంతా ఎటువంటి ట్రేడింగ్ సెషన్లు జరగవు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) జూన్ 17 సోమవారం బక్రీద్ సందర్భంగా మూతపడనున్నాయి.ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ (సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ ఎరాక్టివ్) సెగ్మెంట్లపై ఈ మూసివేత ప్రభావం చూపుతుందని బీఎస్ఈ వెబ్సైట్ పేర్కొంది. తిరిగి జూన్ 18న ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంసీఎక్స్) జూన్ 17న ఉదయం సెషన్‌ను మూసివేయనుంది. అయితే సాయంత్రం సెషన్లో మాత్రం సాయంత్రం 5 గంటల నుంచి 11:30/11:55 గంటల వరకు ట్రేడింగ్ కోసం తిరిగి తెరవనున్నారు. -
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మూసివేత? రైళ్ల మళ్లింపునకు సన్నాహాలు?
భారతీయ రైల్వేను ‘దేశానికి లైఫ్ లైన్’ అని అంటారు. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులను రైల్వేలు తమ గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. ఇంతటి ఘనత కలిగిన రైల్వేశాఖ నుంచి వచ్చిన ఒక వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పునరాభివృద్ధి కోసం ఈ ఏడాది చివరి నాటికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను మూసివేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆ తరువాత న్యూఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ఎప్పటి నుంచి మూసివేస్తారనేదానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇది ఈ ఏడాది చివరి నాటికి జరగవచ్చని తెలుస్తోంది.రైల్వే మంత్రిత్వ శాఖ గతంలో దేశంలోని సుమారు 1,300 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. దీనికి సంబంధించిన పనులు నిదానంగా పూర్తవుతున్నాయి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించే పనులు ప్రారంభంకానున్నాయి. కాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో రోజుకు ఆరు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి రైల్వే స్టేషన్‌ను అకస్మాత్తుగా మూసివేయడం రైల్వేకు పెను సవాలుగా మారనుంది. అయితే ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లను వివిధ స్టేషన్ల మీదుగా దారిమళ్లించనున్నారు. ఈస్ట్ ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లను ఆనంద్ విహార్ స్టేషన్‌కు మార్చనున్నారు. అలాగే పంజాబ్, హర్యానాకు వెళ్లే రైళ్లను సరాయ్ రోహిల్లా వైపు మళ్లించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే రైళ్లను ఢిల్లీ కాంట్, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల మీదుగా మళ్లించనున్నారు. మిగిలిన కొన్ని రైళ్లను ఘజియాబాద్‌కు మళ్లించే అవకాశ ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో రైల్వేశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడనుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పనుల కోసం నాలుగేళ్లపాటు మూసివేయనున్నారు. ఈ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఈ పనులను ఏకకాలంలో చేయాలని గతంలో ప్రభుత్వం యోచించింది. అయితే ఇప్పుడు దశలవారీగా ఈ పనులను చేయాలని నిర్ణయించారు. 2023 బడ్జెట్ సెషన్లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. -
నేటితో ప్రచారం బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హోరాహోరిగా సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం ఆరు గంటలకు తెరపడనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇది సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. ఆ సమయం దాటిన తరువాత నుంచి బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం తదితర ప్రచారంపై నిషేధం కొనసాగనుంది. దృశ్యరూపకంగా ఉండే ఏ ప్రకటన కూడా ప్రచారం చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి (ఉప ఎన్నిక) సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది..బరిలో 525 మంది అభ్యర్థులు..రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఏప్రిల్ 18న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం కూడా ప్రారంభమైంది. లోక్‌సభకు మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి 15 మంది పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని సీట్లలోనూ పోటీ చేస్తుండగా సీపీఎం, ఎంఐఎం ఒక్కోచోట బరిలో నిలిచాయి.అగ్ర నేతల ప్రచారం..నామినేషన్ల పర్వం నుంచి విస్తృత ప్రచారం ప్రారంభమవగా రాష్ట్ర, జాతీయ స్థాయిలోని ఆయా పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు పలువురు బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంలు కూడా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించారు.అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రచార బాధ్యతనంతా మోశారు. ఈసారి భారీ బహిరంగ సభలు అతితక్కువగా జరగ్గా ప్రజలను కలుసుకొనేలా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లకు అన్ని పార్టీలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి.పరస్పరం దూషణలపర్వం..ఈసారి ఎన్నికల ప్రచారంలో పార్టీల దూషణలపర్వం తారస్థాయికి చేరింది. ఆరు గ్యారంటీలంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినా.. అమలు చేయలేదని బీఆర్ఎస్, బీజేపీలు తీవ్రంగా విమర్శించాయి. గత పదేళ్లలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, కొత్త రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. మరోవైపు బీజేపీ తాము మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేస్తామని బదులిచ్చింది.ప్రలోభాలను అడ్డుకోవడంపై ఈసీ నజర్..నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుండటంతో పోలింగ్ జరిగే లోగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ఈసీ కృతనిశ్చయంతో ఉంది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు సీ–విజల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడైనా ప్రలోభాలు కొనసాగుతుంటే సమాచారం ఇవ్వాలని, తక్షణమే స్పందిస్తామని ఎన్నికల సంఘం హామీ ఇస్తోంది. ఇప్పటివరకు 180 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు, వెండి ఆభరణాలు, తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
చార్ధామ్ యాత్రపై సైబర్ నేరగాళ్ల కన్ను.. ఆటకట్టించిన పోలీసులు
చార్ధామ్ యాత్ర ప్రారంభమయ్యేందుకు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ యాత్రపై కన్నువేశారు. గతంలో హెలీ సర్వీసుల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసగించిన ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు హోటల్ బుకింగ్ పేరుతోనూ యాత్రికులను వంచించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ నేపధ్యంలో తాజాగా పోలీసులు హోటల్ బుకింగ్ పేరుతో సృష్టించిన ఏడు నకిలీ వెబ్సైట్లను, హెలీ సర్వీస్ బుకింగ్ కోసం సృష్టించిన 12 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఏడాది కాలంలో పోలీసులు చార్ధామ్ యాత్రతో ముడిపడిన 83 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఇటువంటి మోసాలను నివారించడానికి పోలీసు శాఖలోని ఇంటర్నెట్ మీడియా సెల్‌ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో హెలీ సర్వీస్ బుకింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఆయుష్ అగర్వాల్ తెలిపారు. యాత్రికులు https://www.heliyatra.irctc.co.in/ ద్వారా చార్ధామ్ హెలీ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాత్రికులెవరైనా నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించినప్పుడు డెహ్రాడూన్ ఎస్టీఎఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9456591505, 9412080875 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి, వివరాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. -
విమానం ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలి?
ఈ రోజుల్లో చాలామంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో విమాన ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అయితే విమాన ప్రయాణం చేసేటప్పుడు పలు నిబంధనలు పాటించాలని ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. విమాన ప్రయాణంలో ధూమపానం చేయకూడదు, సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలాంటి నిబంధనలలో ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్‌ను మూసివేయాలని కూడా చెబుతారు. అయితే ఇలా ఎందుకు చేయాలి? ట్రే టేబుల్ మూసివేయకపోతే ఏమైనా జరుగుతుందా? ఎయిర్ హోస్టోస్ హన్నా టెస్సన్(23) అమెరికాలోని కొలరాడోలో ఉంటున్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో ప్రయాణికులు ట్రే టేబుల్ ఎందుకు మూసివేయాలనే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రయాణికులు తాము చెప్పే సూచనలను పాటించనప్పుడు కోపం వస్తుందని అన్నారు. ప్రయాణీకులు టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ట్రే టేబుల్ మూసివేయాలని చెప్పినా, వెంటనే అమలు చేయరని ఆమె తెలిపారు. ఇలాంటి ఈ నిబంధనలను విమాన ప్రయాణికులు తప్పని సరిగా తెలుసుకోవాలని ఆమె అన్నారు. హన్నా తెలిపిన వివరాల ప్రకారం.. విమాన ప్రమాదాలు చాలావరకూ ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఓపెన్ ట్రే టేబుల్ కారణంగా ప్రయాణికులు గాయపడే అవకాశముంది. అందుకే ట్రే టేబుళ్లను మూసి వేయాలని ప్రయాణికులకు ఎయిర్ హోస్టెస్‌లు చెబుతుంటారు. ఆహారం అందించడం ఒక్కటే తమ పని కాదని, ప్రయాణికుల భద్రతను చూడటం కూడా తమ పనే అని హన్నా తెలిపారు. విమానం టేకాఫ్ చేయడానికి ముందు విమానంలోని భద్రతా పరికరాలను తనిఖీ చేస్తామని, అంతే కాకుండా ప్రయాణికుల వింత ప్రవర్తనపై కూడా నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా ప్రయాణికులు ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
మంచు, వర్షాల కారణంగా ఐదు హైవేలు, 300 రోడ్లు మూసివేత!
ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాలయాలలోని ఎత్తైన పర్వతాలపై భారీ హిమపాతం కురుస్తుండగా, అక్కడి మైదాన ప్రాంతాల్లో బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో ఐదు జాతీయ రహదారులతో సహా 300కు పైగా రోడ్లను మూసివేశారు. హిమాచల్‌లో 263 రోడ్లు మూసివేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. గడచిన 24 గంటల్లో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలతో సహా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇంతేకాదు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్, ఈశాన్య ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతం, సిక్కిం, అస్సాం, మేఘాలయ, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యింది. వాతావరణంలోని మార్పుల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలుప్రాంతాల్లో 11 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని చురులో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర భారతదేశంలోని పర్వత, మైదాన ప్రాంతాల్లో బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. -
జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్ఐ సర్వేలో వెల్లడి!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన సర్వే నివేదికలో వెల్లడించింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీని ఉపయోగించి ఏఎస్ఐ జరిపిన పరిశోధనలో ప్లాట్‌ఫారమ్ కింద, ప్లాట్‌ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా, దిగువ భాగమంతా చెత్తతో నిండి ఉంది. వీటిని మూసివేశారు. ప్లాట్‌ఫారమ్‌కు నైరుతి భాగంలో చెత్తతో నిండిన మూడు మీటర్ల వెడల్పుగల నేలమాళిగలు ఉన్నాయి. ఒక మీటరు మందపాటి గోడలతో తొమ్మిది చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేల మాళిగలు ఉన్నాయి. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశద్వారాలను కలిగి ఉన్నాయి అవి ఇప్పుడు మూసివేసివున్నాయి. నేలమాళిగకు ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షనల్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున రెండు మీటర్ల వెడల్పుతో మూడు నుండి నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి ఆనుకుని, ప్లాట్‌ఫారమ్‌కు పశ్చిమ భాగంలో మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు గల రెండు సెల్లార్ల రెండు వరుసలు ఉన్నాయి. నేలమాళిగలో దాగి ఉన్న బావి రెండు మీటర్ల వెడల్పు కలిగివుంది. దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించాయి. బేస్మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్‌లో మూసివున్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిగ గోడతో కప్పినట్లు ఉందని జీపీఆర్ చూపించింది. ఏఎస్ఐ తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం, పలు పరీక్షలను నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది మెటల్‌తో సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది. -
సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ నిరవధికంగా మూసివేత
-
ఆ రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులు
ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో తీవ్రమైన చలి వాతావరణం నెలకొనడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఫలితంగా విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించారు. పెరుగుతున్న చలి దృష్ట్యా ఈనెల 14 వరకూ ఘజియాబాద్‌లోని అన్ని పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జలౌన్‌లో జనవరి 6 వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోనూ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను ఈ నెల 6 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, గుర్తింపు పొందిన పాఠశాలలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారణాసిలో నిరంతరం పెరుగుతున్న చలి, దట్టమైన పొగమంచు దృష్ట్యా పాఠశాల సమయాలను మార్చారు. జిల్లా మేజిస్ట్రేట్ ఎస్. రాజలింగం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మాత్రమే పాఠశాలలను నిర్వహించనున్నారు. -
భయంకరంగా మిచాంగ్ తుఫాన్..
-
గోల్ఫ్ కోర్సుల రంధ్రాల మూసివేత ఎందుకు? స్పెయిన్‌లో ఏం జరుగుతోంది?
స్పెయిన్‌లోని పర్యావరణ కార్యకర్తలు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఐరోపా దేశాలు తీవ్రమైన కరువుతో తల్లడిల్లుతున్న నేపధ్యంలో స్పెయిన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్తలు నీటిని పొదుపు చేయడానికి నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మాడ్రిడ్, వాలెన్సియా, ఇబిజా, నవర్రాతో సహా ఆరు రాష్ట్రాలలో గోల్ఫ్ కోర్సుల రంధ్రాలను మూసివేశారు. గోల్ఫ్ కోర్స్ చుట్టూ ఉన్న పచ్చటి ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ 22,000 గ్యాలన్లకు పైగా నీరు అవసరమని వారు చెబుతున్నారు. కరువు కారణంగా స్పెయిన్ రైతులు తమ పంటలకు తగినంత నీరు అందకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. దేశంలో గోల్ఫ్ కోర్సుల కంటే పంట పొలాలకు నీటి అవసరం అధికమని పర్యావరణ కార్యకర్తలు చెబుతున్నారు. సీఎన్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం పర్యావరణ కార్యకర్తలు ప్రస్తుతం 10 గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేశారు. మైదానంలో కొన్ని గుంతలలో మొక్కలు నాటడమే కాకుండా కొన్నింటిని సిమెంటుతో మూసివేశారు. ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ (ఎక్స్ఆర్) సంస్థ సభ్యులు పర్యావరణ కార్యకర్తలతో కలిసి ఈ పనులు చేపట్టారు. కరువు సంక్షోభం మధ్య నీటి వృథాను అరికట్టేందుకు గోల్ఫ్ కోర్స్ల రంధ్రాలను మూసివేయడం తప్పనిసరి అని ఎక్స్‌టింక్షన్ రెబెల్లియన్ గ్రూప్ పేర్కొంది. దేశమంతా కరువుతో తల్లడిల్లిపోతున్నప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఉన్నతవర్గం వారు గోల్ఫ్ కోర్సుల పేరుతో నీటిని వృథా చేయడం తగదన్నారు. సంపన్నుల అనవసర కార్యకలాపాల వల్ల వనరులు వృథా అవుతున్నాయని వారు ఆరోపించారు. కొన్ని నెలలుగా స్పెయిన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, ఇతర నీటి వనరులలోని నీటిశాతం నిరంతరం తగ్గతూవస్తోంది. ఈ నేపధ్యంలోనే శాన్ రోమన్ డి కా సౌ రిజర్వాయర్ నీటి మట్టం 1990 నుండి కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో రిజర్వాయర్‌లో మునిగిపోయిన పాత చర్చి పూర్తిగా కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం స్పెయిన్‌లో కరువు పరిస్థితులు మరింతగా పెరగనున్నాయి. ఇది కూడా చదవండి: యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? -
పాక్‌లో 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే ఏం జరిగింది?
దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లోని హిందువుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాగే నాడు పాకిస్తాన్లో ఉన్న దేవాలయాల్లో నేటికి సగం కూడా కనిపించవు. కొన్ని దేవాలయాలను కూల్చివేయగా, మరికొన్నింటిని నిర్లక్ష్యం చేశారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో చాలా దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదేవిధంగా పాకిస్తాన్లో కొన్ని దేవాలయాలు మూతపడ్డాయి. సియాల్కోట్లో 72 సంవత్సరాలుగా మూసివేసిన ఆలయం కొంతకాలం క్రితం తెరుచుకుంది. ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం ఎంత విశిష్టమైనదనేది దాని నిర్మాణశైలి తెలియజేస్తుంది. భారీ పరిమాణంలోని రాళ్లతో నిర్మితమైన ఈ దేవాలయంలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇది చిన్నగా ఉన్న శివాలయమే అయినప్పటికీ, దీని నిర్మాణాన్ని ప్రముఖ దేవాలయాలతో పోలుస్తుంటారు. 75 ఏళ్లుగా ఆలయాన్ని మూసివేసినా, ఆలయ గోడలు చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. ఆలయాన్ని పరిశీలించి చూస్తే ఆనాటి ఆలయాలు ఎంత బలంగా నిర్మించారో అంచనా వేయవచ్చు. ఈ ఆలయాన్ని 72 ఏళ్ల తర్వాత 2019లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెరిచారు. ఈ దేవాలయం పేరు శివాల తేజ సింగ్ టెంపుల్. ఈ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. మీడియా కథనాల ప్రకారం ఆలయాన్ని తెరిచినప్పుడు అక్కడున్న హిందువులు హర్ హర్ మహాదేవ్ అని నినాదాలు చేశారు. ఈ నినాదాలు చాలా దూరం వరకూ ప్రతిధ్వనించాయని చెబుతారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి? -
భారత్‌లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత!
ఈరోజు (ఆదివారం, అక్టోబర్ 1) నుండి భారతదేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఎంబసీ ఆదివారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం గురించి ఆఫ్ఘన్ అధికారులు మాట్లాడుతూ న్యూఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం చాలా విచారకరం. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం సంయుక్తంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆతిథ్య దేశం నుండి తమకు సహకారం అందడం లేదని, ఈ కారణంగానే కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ రాయబారి, ఇతర సీనియర్ దౌత్యవేత్తలు భారతదేశం నుండి యూరప్‌కు వెళ్లి, యూఎస్ఏలో ఆశ్రయం పొందిన తరువాత ఈ పరిణామం జరిగిందని ఆఫ్ఘన్ ఎంబసీకి చెందిన ముగ్గురు అధికారులు తెలిపారు. ఐదుగురు ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్‌ను విడిచిపెట్టినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2021లో కూడా ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. భారతదేశంలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయానికి ప్రస్తుతం రాయబారి ఫరీద్ మముంద్జే నేతృత్వం వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: 22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ! Press Statement FOR IMMEDIATE RELEASE Date: 30th September, 2023 Afghanistan is closing its Embassy in New Delhi. The Embassy of the Islamic Republic of Afghanistan in New Delhi regrets to announce the decision to cease its operations, effective October 1, 2023. pic.twitter.com/BXesWPdLFP — Afghan Embassy India (@AfghanistanInIN) September 30, 2023 -
తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్‌షిప్ టోర్నీ షురూ
లక్డీకాపూల్: తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లోని గేమ్‌పాయింట్ హైటెక్ ఎరీనాలో జరిగే ఈ టోరీ్నలో దాదాపు 100 మంది క్రీడాకారులు ఎనిమిది విభాగాల్లో టైటిళ్ల కోసం పోటీ పడుతున్నారు. గేమ్‌పాయింట్‌తో కలిసి తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌లో రాష్ట్రంలోని అగ్రశ్రేణి జూనియర్ ప్లేయర్లు తనుజ్ రెడ్డి పులి, అర్నా ద్వివేది, సాన్వి శ్రీతో పాటు పురుషుల, మహిళల టాప్ ర్యాంకర్లు రోహన్ ఆర్యగోండి, ఐశ్వర్య పయ్యన్ బరిలో ఉన్నారు. బాలుర అండర్–11, అండర్–13, అండర్–15, బాలికల అండర్–13, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. పురుషుల 35, 45 వయో విభాగాల్లోనూ పోటీలు నిర్వహించనున్నారు. శనివారం క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఆదివారం ఫైనల్స్ జరుగనున్నాయి. రాష్ట్రానికి చెందిన స్క్వాష్ క్రీడాకారులకు గొప్ప వేదిక అయిన తెలంగాణ స్క్వాష్ క్లోజ్డ్ చాంపియన్ షిప్‌ను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నట్టు టోర్నమెంట్ చైర్మన్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే ఏజ్ గ్రూప్ పోటీల్లో అగ్ర ఆటగాళ్లు నమోదు చేసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి టోర్నమెంట్లో బలమైన పోటీ ఉంటుందన్నారు. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్‌ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
భారీ వర్షాలు: జీహెచ్ఎంసీ పరిధిలో రేపు, ఎల్లుండి స్కూల్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండి జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు గురువారం రాత్రి కూడా భారీ వర్షం కురవనుందని, కొన్ని ప్రాంతాల్లో 120 మిల్లీ మీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ పడే అవకాశం ఉందని, నగరవాసులు మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని మేయర్ తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో ఏకధాటిగా వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరికలు ఇవే.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలు పూర్తిగా జలమయ్యాయి. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ సమీపంలోని కాలనీలు పూర్తిగా మోకాళ్ల లోతు నీటితో కాలనీలు మునిగాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండడం, ఆఫీస్ నుండి ఇండ్లలోకి వెళ్లేవారు తమ వాహనాలను సైతం ఆ మోకాల్లోతు నీళ్లలో నడిపించుకుంటూ వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవులు 8 రోజులే..
వివిధ సెలవుల కారణంగా 2023 జూలైలో హైదరాబాద్‌లోని బ్యాంకులు ఎనిమిది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జూలై నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి మొత్తం 15 సెలవులు ఉన్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రానికి, రాష్ట్రానికి మారవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ మొత్తం 15 రోజులూ సెలవులు ఉండవు. హైదరాబాద్‌లో ఉండే బ్యాంకులు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, అదనంగా మొహర్రం కారణంగా జూలై 29 న పనిచేయవు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ కస్టమర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కార్యకలాపాలను కొనసాగించవచ్చు. హైదరాబాద్‌లో బ్యాంకు సెలవులు జూలై 2: ఆదివారం జూలై 8: రెండో శనివారం జూలై 9 : ఆదివారం జూలై 16 : ఆదివారం జూలై 22 : నాలుగో శనివారం జూలై 23 : ఆదివారం జూలై 29: మొహర్రం జూలై 30: ఆదివారం ఇదీ చదవండి: July Deadlines: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్లైన్ల సంగతేంటి? -
కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..?
ఉత్తరాఖండ్ : చార్ధామ్ యాత్రికులకు వాతావరణం పరీక్ష పెడుతోంది. ఏటా కేవలం ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే గంగోత్రీ, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్ర.. అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్ర. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో 3584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడం మామూలు విషయం కాదు. గత మూడు రోజుల నుంచి రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండలు, కోనలు, ఆ పక్కనే లోయలు, నదులు.. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో ఆకస్మిక వర్షాలు రావడం, ఆ వెంటనే వరదలు పోటెత్తడం ఇక్కడ సాధారణం. తాజా వర్షాలు, వరదల కారణంగా కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. హరిద్వార్, రుషికేష్ల నుంచి యాత్రికులు ముందుకు రావొద్దని కోరారు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి. Char Dham Yatra halted due to bad weather, CM Dhami instructs officials to be vigilant Read @ANI Story | https://t.co/NkileHv4Xw#chardham #chardhamyatra #Kedarnath #Badrinath #PushkarSinghDhami pic.twitter.com/nM38Si9jDm — ANI Digital (@ani_digital) June 26, 2023 20 గంటలపైనే.. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ శివాలయం ఒకటి. హిమాలయాల్లో నిర్మించిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దీన్నిఆదిశంకరాచార్యులు నిర్మించారు. హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో కనీసం 20 గంటల పాటు ప్రయాణం చేస్తేనే బేస్ పాయింట్ గౌరీకుండ్ చేరుకుంటాం. అయితే ఏకబిగిన 20 గంటలు ప్రయాణం అనేది ఏ మాత్రం సాధ్యం కాని పని. ఇదీ చదవండి: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు.. ప్రతికూల వాతావరణం.. కేదార్నాథ్ మంచుకొండల మధ్య ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ కనిష్టంగా ఉంటాయి. హఠాత్తుగా కూలిపడే కొండచరియలు, దెబ్బతినే రోడ్ల నడుమ అసలు ముందుకు సాగుతుందా లేదా అన్నట్టుగా ప్రయాణం ఉంటుంది. పైగా ఆ కొండలపై ట్రాఫిక్ తరచుగా నిలిచిపోతుంది. కేదార్‌నాథ్‌కు వాహనాలు వెళ్లవు. దాని బేస్ పాయింట్ గౌరీకుండ్ వరకే వాహనాలుంటాయి. అక్కడి నుంచి నడక మార్గం లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు. హెలీకాప్టర్ ఉన్నా వాతావరణం అనుకూలిస్తేనే ప్రయాణం సాగుతుంది. కేదార్‌నాథ్‌ను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలా మంది తహతహలాడుతారు. ఈ సారి బోలెడు మంది ఇప్పటికే హరిద్వార్, రిషికేశ్ చేరుకున్నారు. తాజా వరదలతో నిరాశపడిపోయారు. दयानिधान बाबा केदारनाथ की संध्या आरती दर्शन🙏खराब मौसम और बारिश की वजह से रोकी गई केदारनाथ यात्रा।यात्रियो को सुरक्षित स्थानों पर रुकने की सलाहजय केदार🕉#Kedarnath 🚩 pic.twitter.com/ljJpeEhLaM— श्री केदारनाथ (@ShriKedarnath) June 25, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా?
బ్యాంక్ అకౌంట్లో నగదు బ్యాలెన్స్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ జారీ చేసిన రూల్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. బ్యాంకు ఖాతాలలో రూ. 30 వేల కంటే ఎక్కువ ఉంటే అటువంటి అకౌంట్లను క్లోజ్ చేస్తారన్నది దాని సారాంశం. అయితే ఆ వార్త ఫేక్ అని తేలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వార్త నిజం కాదని, ఆర్బీఐ అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని నిర్ధారించింది. హిందీలో ఉన్న ఆ వార్తను ట్విటర్లో షేర్ చేస్తూ అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: Rs 500 Notes: రూ.88 వేల కోట్లు మిస్సింగ్! ఏమయ్యాయి? ఇంటర్నెట్లో తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్ లో ఈ ఫ్యాక్ట్-చెకింగ్ విభాగాన్ని ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించి సర్క్యులేట్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు పీఐబీ పేర్కొంటోంది. एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck ▪️ यह ख़बर #फ़र्ज़ी है। ▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9 — PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023 -
Secret Places In The World: భూమిపై మనం వెళ్ళడానికి నిషేధించబడిన టాప్ 10 ప్రదేశాలు
-
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మూడు రోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో భారీ బరువున్న క్రేన్లను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్ సూచించారు. మరోవైపు రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. చదవండి: Alert: హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు -
భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
పాక్‌కు చైనా షాక్.. కాన్సులర్ ఆఫీస్ క్లోజ్!
చైనా అనూహ్య నిర్ణయంతో పాక్‌కు షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కాన్సులర్ విభాగాన్ని(దౌత్యపరమైన) మూసేస్తున్నట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. పాక్‌లో ఉంటున్న చైనా పౌరులకు.. జాగ్రత్తగా ఉండాలని సూచించిన కొద్దిరోజులోనే చైనా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం. ఇక తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేసే ఉంటుందని స్పష్టం చేసింది చైనా ఎంబసీ. ఈ మేరకు ఎంబీసీ వెబ్సైట్లో ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటనలో పేర్కొందే తప్ప.. అందుకు కారణాలేంటన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే.. పాక్ గడ్డపై చైనీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ మూసివేత శాశ్వతమనే సంకేతాలను అందిస్తోంది చైనా. వాస్తవానికి తాలిబన్ గ్రూప్‌తో పాక్ ప్రభుత్వం సంధి విరమించుకున్న తర్వాత ఏడాది నుంచే.. అక్కడ దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(బీఆర్ఐ)నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పాక్ ఎకనామిక్ కారిడర్(సీపెక్)లో పనిచేస్తునన్న చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని వివిధ తీవ్రవాద గ్రూపులు తరుచుగా దాడి చేస్తున్నాయి. ఈ పరిణామాలపై చైనా, పాక్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరదల సమయంలోనూ ఈ కారణంతోనే పెద్దగా సాయం కూడా అందించలేదు చైనా. గత ఏప్రిల్‌లో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ కరాచీలో ముగ్గురు చైనా టీచర్లను, వారి స్థానిక డ్రైవర్‌తో సహా హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా, సీపెక్ అనేది చైనాను అరేబియా సముద్రాన్ని కలుపుతూ పాక్‌లోని రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లు, ఓడరేవులకు సంబంధించిన 65 బిలియన్ డాలర్ల నెట్వర్క్. ఈ బీఆర్ఐ అనేది తన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి, విస్తరించడానికి సహాయపడుతుందని పాక్ భావిస్తోంది. (చదవండి: ఇదే భారత్ ఇమేజ్..బాధితులకు అండగా మన బీనా, ఆనంద్ మహీంద్రా ప్రశంసలు) -
షూటింగ్స్ బంద్‌పై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు..
టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ బంద్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు. 'మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడంపై మీటింగ్‌లో మాట్లాడుకున్నాం. ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరల అంశంపై చర్చించాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే విషయమై నిర్మాతలందరం మాట్లాడాం. ఓటీటీలో సినిమా విడుదల అనేది 8 వారాల లేక 10 వారాల అనే అంశంపై కూడా చర్చించాం. చర్చల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. షూటింగ్స్ బంద్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ వల్ల కథలు రాశారు, వాటిని హీరోలు ఒప్పుకున్నారు. నిర్మాతలు తెరకెక్కించారు. కానీ ప్రేక్షకుల గురించి ఆలోచించలేదు. కరోనా సమయంలో ఆడియెన్స్ చాలా ఎడ్యుకేట్ అయ్యారు. అందుకు తగిన స్థాయిలో సినిమాలు తీస్తేనే మెప్పించగలం' అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చదవండి:👇 అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్..! పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ -
మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు
కాబూల్: తాలిబన్లు మరోసారి మాట తప్పారు. ప్రపంచ దేశాలు తమ వైపు వేలెత్తి చూపించేలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో బాలికలను హైస్కూల్ విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు తాలిబన్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. తీరా స్కూల్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు షాకిచ్చారు. అయితే, ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని.. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో బాలికలు ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం. అయితే, ఇందుకు కారణం గ్రామీణ ప్రజలేనని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు తమ పిల్లలను స్కూల్స్‌కు పంపేందుకు అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి సీనియర్ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహిళ స్వేచ్చ పట్ల ఆంక్షలు ఉండాలని, కఠినంగా వ్యవహరించాలని సీనియర్లు కోరుతుండగా.. స్వేచ్చ అవసరమంటూ మరికొందరు పట్టుబడుతున్నట్టు సమాచారం. -
Hyderabad:ఈ రోజు రాత్రి ఫ్లైఓవర్లు బంద్.. ఎందుకంటే
సాక్షి, హైదరాబాద్: జగ్నేకీ రాత్‌గా పిలిచే షబ్బే బరాత్ నేపథ్యంలో నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసేవేయనున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము వరకు గ్రీన్ ల్యాండ్స్, లంగర్హోస్ ఫ్లైఓవర్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా మిగిలినవి మూసి ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. -
‘హిజాబ్’పై ధర్మాసనం.. కర్ణాటక హైకోర్టు సీజే నిర్ణయం
బెంగళూరు: హిజాబ్–కాషాయ కండువా గొడవతో కొద్ది రోజులుగా అట్టుడికిన కర్ణాటకలో విద్యా సంస్థల మూసివేత నేపథ్యంలో బుధవారం ప్రశాంతత నెలకొంది. దీనిపై విచారణకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన ఈ ఫుల్ బెంచ్‌లో న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ కూడా ఉంటారు. వివాదంపై మంగళ, బుధవారాల్లో విచారణ జరిపిన జస్టిస్ దీక్షిత్ నివేదన మేరకు సీజే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దీక్షిత్ ముందు ఇరు పక్షాలు వాడివేడిగా వాదనలు విన్పించాయి. పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించారు. విద్యార్థినులు తమ మత విశ్వాసాలను అనుసరించేందుకు అనుమతించాలని వారి తరఫు లాయర్ దేవదత్త కామత్ కోరారు. ఇందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గీ అభ్యంతరం తెలిపారు. ఈ దశలో అలాంటి ఉత్తర్వులివ్వడం పిటిషన్‌ను అనుమతించడమే అవుతుందని వాదించారు. విద్యార్థులు విధిగా డ్రెస్ కోడ్‌ను పాటిస్తూ తరగతులకు హాజరు కావాలన్నారు. కాలేజీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ (సీడీఎంసీ) తరఫున హాజరైన లాయర్ సజన్ పూవయ్య కూడా మధ్యంతర ఉత్తర్వులను వ్యతిరేకించారు. ప్రస్తుత యూనిఫారాలు ఏడాదిగా అమల్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘తల్లిదండ్రులు, టీచర్లు తదితరులందరితో కూడిన సీడీఎంసీ ఏటా సమావేశమై యూనిఫాం తదితరాలపై ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకుంటుంది. యూనిఫాంపై ఇప్పటిదాకా లేని అభ్యంతరాలు ఇప్పడెందుకు?’’ అని ప్రశ్నించారు. మధ్యంతర ఉత్తర్వులపై కూడా విస్తృత ధర్మాసనమే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. -
ఢిల్లీలో బార్లు, రెస్టారెంట్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో మరిన్ని ఆంక్షలు విధించాలని డీడీఎంకే నిర్ణయించింది. ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నేతృత్వంలోని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితిని సమీక్షించేందుకు భేటీ అయింది. చదవండి: వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది! ఈ మేరకు ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్న రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేస్తూ.. కేవలం టేక్‌అవేలకు మాత్రమే అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే మెట్రో రైళ్లు, బస్సుల్లో సీటింగ్ సామర్థ్యం మళ్లీ తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను ఎన్సీఆర్ పరిధిలోనూ కఠినంగా అమలుచేయాలని డీడీఎంకే తీర్మానించింది. చదవండి: ఎవ్వరినీ వదలడం లేదు.. కరోనా బారిన పడ్డ మరో ఇద్దరు సీఎంలు -
కరోనా ఎఫెక్ట్: నుమాయిష్ బంద్ ఫొటోలు
-
తిరుమలలో భారీ వర్షాలు.. రెండు ఘాట్‌రోడ్లు మూసివేత
సాక్షి, తిరుమల: తిరుమలలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించే రెండు ఘాట్ రోడ్లలో రాకపోకలు నిషేదించారు. ఈ మేరకు టీటీడీ భద్రతా విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, తిరుమలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో భారీ వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగిపడతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో భారీగా నీరు తిరుమలలో కురుస్తున్న కుండపోత వర్షాలకి నడకదారిలో భారీగా నీరు ప్రవహిస్తోంది. మెట్లపై నడవలేని పరిస్థితి ఉంది. నడకమార్గంలో భక్తులు పిట్టగోడపై నడుస్తున్నారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదవండి: (Chennai Rains: తీరాన్ని తాకిన వాయుగుండం.. తమిళనాడులో 14 మంది మృతి) -
నిరవధిక దిగ్బంధనాలు సబబు కాదు
సాక్షి, న్యూఢిల్లీ: నిరసనల పేరుతో నిరవధికంగా రహదారుల దిగ్బంధనాలు సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. విషయం న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ నిరసనలు తెలపడానికి తామేమీ వ్యతిరేకం కాదని, అయితే ఈ విధంగా నిరవధికంగా రహదారులు దిగ్భంధనం సరికాదని దేశరాజధాని సరిహద్దుల్లోని సింఘూ బోర్డర్లో గత 11 నెలలుగా ధర్నాను కొనసాగిస్తున్న రైతు సంఘాలను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో అమిత్ సాహ్ని వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ రహదారులు బ్లాక్ చేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. రైతులు రహదారులను బ్లాక్ చేయడంపై నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘మొత్తానికి ఓ పరిష్కారం కనుగొనాల్సి ఉంది. న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉన్నా నిరసనలకు మేం వ్యతిరేకం కాదు. కానీ, ఈ రకంగా రహదారులు బ్లాక్ చేయడం సరికాదు. ప్రజలందరూ రహదారులపై హక్కు కలిగి ఉంటారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల్ని పోలీసులు నిలువరించిన తర్వాత రాంలీలా మైదానంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడిని ఖండిస్తూ బీజేపీ ర్యాలీ నిర్వహించిందని రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేన్నారు. ఈ ర్యాలీలో 5 లక్షల మంది పాల్గొన్నారని, దీనిపై ఎందుకు సుమోటోగా విచారణ చేపట్టడం లేదు, ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని దుష్యంత్ దవే పేర్కొన్నారు. రైతుల నిరసన వెనక దురుద్దేశం దాగుందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రైతుల సంఘాలు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. ‘‘ఇదే అంశంపై వేర్వేరు పిటిషన్లు కోర్టు ముందుండటంతో ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని లేదా ఈ ధర్మాసనమే వాటినీ విచారించాలని కోరుతున్నారు. తొలుత కౌంటర్లు దాఖలు చేస్తే ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనానికి పంపడం అవసరమైతే... ఆ విషయం చెబుతాం. కౌంటరు మూడు వారాల్లో దాఖలు చేయండి. అనంతరం రెండు వారాల్లో రిజాయిండరు దాఖలు చేయండి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘నూతన వ్యవసాయ చట్టాల చెల్లుబాటును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనలు చేయడం ఏంటి?’ అని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..!
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత్‌లో ఫోర్డ్ కంపెనీ కార్ల ఉత్పత్తి నిలిచిపోనుంది. సనంద్, చెన్నై నగరాల్లోని ప్లాంట్లను ఫోర్డ్ మూసివేయనుంది. కంపెనీకి భారీ నష్టాలు, బహిరంగ మార్కెట్లో వృద్ధి లేకపోవడంతో ఫోర్డ్ మోటార్ కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్ కారు ఇదేనండోయ్..! లాభాలకంటే నష్టాలే ఎక్కువ..! 2021 నాల్గవ త్రైమాసికం నాటికి గుజరాత్‌లోని సనంద్‌లో వాహనాల తయారీని, 2022 రెండవ త్రైమాసికానికి చెన్నైలో వాహన ఇంజిన్ తయారీని ఫోర్డ్ నిలిపివేస్తుందని ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. జీఎమ్ మోటార్స్ తరువాత భారత్ నుంచి వైదొలుగుతున్న రెండో కంపెనీగా ఫోర్డ్ నిలిచింది. 2017లో జనరల్ మోటార్స్ భారత్‌లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. గత 10 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా నిర్వహణ నష్టాలను ఫోర్డ్ చవిచూసింది. భారత్‌లో స్థిరమైన లాభదాయకమైన వ్యాపారాన్ని సృష్టించడానికి పునర్నిర్మాణ చర్యలు తీసుకున్న పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం కంపెనీలో పనిచేసే 4 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనుంది. కోవిడ్ -19 లాక్డౌన్, డేటెడ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోతో ఫోర్డ్ మరింత నష్టపోతున్న స్థానిక సంస్థగా తయారైంది. జులై నాటికి, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) షేర్ చేసిన డేటా ప్రకారం ఫోర్డ్ రెండు ప్లాంట్లలో ఉన్న 450,000 యూనిట్ల ఇన్స్టాల్ చేయబడిన సామర్థ్యంలో కేవలం 20 శాతం యూనిట్లను మాత్రమే ఆపరేట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ ఇప్పటివరకు భారత్‌లో సుమారు రెండు బిలియన్ డాలర్లపైగా పెట్టుబడి పెట్టింది. 350 ఎకరాల చెన్నై ప్లాంట్ సంవత్సరానికి 200,000 యూనిట్లు, 340,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. సనంద్ ప్లాంట్ 460 ఎకరాలలో విస్తరించి ఉండగా, సంవత్సరానికి 240,000 యూనిట్లు, 270,000 ఇంజిన్ల వాహన తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ 1.57 శాతం మార్కెట్ వాటాతో, భారత అతిపెద్ద కార్ల తయారీదారుల జాబితాలో ఫోర్డ్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఫోర్డ్ ఫిగో, ఆస్పైర్, ఫ్రీస్టైల్, ఎకోస్పోర్ట్, ఎండీవర్ భారత్‌లో ఐదు మోడళ్లను విక్రయిస్తుంది చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్...! ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు
సాక్షి, న్యూ ఢిల్లీ: ఈ నెలలో మీకు ఏమైనా బ్యాంకులో పనులు ఉంటే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఈ నెలలో పలు ప్రాంతాల్లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవులు ఆయాప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రభావితం చేయనున్నాయి. బ్యాంకుల ద్వారా జరిపే ముఖ్యమైన లావాదేవీలను వెంటనే జరుపుకుంటే మీకే మంచింది. బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. బ్యాంకులకు సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రకాలుగా నిర్ణయిస్తుంది. నెగోషియేబుల్ ఇన్స్స్ట్రూమెంట్ యాక్ట్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే, బ్యాంకుల ఖాతాల ముగింపు. జూలైలో పలు నగరాల్లో బ్యాంకు సెలవు దినాలు ఇవే... జూలై 12 -జగన్నాథ రథయాత్ర జూలై 13- భాను జయంతి(సిక్కింలో సెలవు) జూలై 14- ద్రుక్పా త్చేచి(సిక్కింలో సెలవు) జూలై 16- హారేలా ఫెస్టివల్(ఉత్తారఖండ్) జూలై 17- తీరథ్ సింగ్ డే/ ఖార్చి పూజ జూలై 18- ఆదివారం జూలై 19- గురు రింపోచే తుంగ్కర్ షెచు, (షిల్లాంగ్‌లో సెలవు) జూలై 20- బక్రీద్ (జమ్మూ, కొచ్చి) జూలై 21- బక్రీద్(దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు) జూలై 24- నాల్గవ శనివారం జూలై 25- ఆదివారం జూలై 31- కెర్ పూజ(త్రిపుర) -
హాంకాంగ్‌లో ‘యాపిల్ డైలీ’ కథ ముగిసింది
హాంకాంగ్: హాంకాంగ్ ప్రజాస్వామ్య డిమాండ్‌కు మద్దతుగా నిలిచిన చివరి పత్రిక ‘యాపిల్ డైలీ’ మూతపడింది. గురువారం ఆ పత్రిక చివరి సంచిక వెలువడింది. మొత్తం 10 లక్షల కాపీలు గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. యాపిల్ డైలీ కాపీల కోసం పాఠకులు ఎగబడ్డారు. దుకాణాల ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అర్ధ స్వయంప్రతిపత్తి కలిగిన హాంకాంగ్‌పై పూర్తిగా పట్టుబిగించేందుకు డ్రాగన్ దేశం చైనా పావులు కదుపుతోంది. హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమాలను కఠినంగా అణచివేస్తోంది. ఇన్నాళ్లూ ప్రజా పోరాటాలకు అండగా నిలిచిన యాపిల్ డైలీ పత్రిక మూతపడడంతో ఇక చైనాకు మరింత బలం చేకూరినట్లేనన్న వాదన వినిపిస్తోంది. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేలా విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తోందంటూ యాపిల్ డైలీపై చైనా పాలకులు కన్నెర్ర చేశారు. ఇటీవల ఆ పత్రికకు చెందిన ఐదుగురు సంపాదకులను అరెస్టు చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 2.3 మిలియన్ డాలర్ల విలువైన యాపిల్ డైలీ ఆస్తులను స్తంభింపజేశారు. ఈ నేపథ్యంలో ఇక పత్రికను మూసివేయడమే శరణ్యమని యాపిల్ డైలీ యజమానులు నిర్ణయాని కొచ్చారు. ఈ పత్రిక మూతపడడం హాంకాంగ్‌లో పత్రికా స్వేచ్ఛకు చీకటి రోజని జార్జిటౌన్ సెంటర్ ఫర్ ఆసియన్ లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ కెల్లాగ్ చెప్పారు. హాంకాంగ్ డౌన్టౌన్లో యాపిల్ ప్రతుల కోసం ప్రజల క్యూ -
వైరల్ వీడియో: మోదీజీ..ఏడేళ్లు స్కూల్స్ మూసేసినా ఫర్వాలేదు.. ఆన్లైన్ క్లాస్‌లు వద్దు
-
మోదీజీ... కరోనాపై పోరాటంలో మా చదువుల్ని త్యాగం చేస్తాం
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా అనేక విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులకు చదువులు ఆటంకం ఏర్పడకూడదని చాలా పాఠశాలలు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విద్యాభ్యాసం కొనసాగించే వెసలుబాటు లేని కొందరి విద్యార్థుల కష్టాలు మనల్ని కదిలించేలా ఉండగా, మరికొందరి పిల్లలు వారి పరిస్థితులను తెలుపుతున్న వీడియోలు ఫన్నీగా ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో వారు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు వారి అమాయకత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 19 సెకన్ల వైరల్ క్లిప్‌లో, ఆ ఇద్దరు పిల్లలు.. “ మోదీ జీ కరోనాతో పోరాడటం కోసం మా చదువులను త్యాగం చేయవలసి వస్తే అందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏడేళ్లపాటు పాఠశాలలు మూసివేయాల్సి వస్తే, మేము ఆ త్యాగానికి సిద్ధంగా ఉంటాం” అని తెలిపారు. ఈ తరహా వీడియోనే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ ఆరేళ్ల బాలిక మాత్రం ఇందుకు భిన్నంగా ఆన్లైన్ చదువులపై తనకున్న అసహనాన్ని గట్టిగానే వెల్లగక్కింది. తన బాధను దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వరదలో చిక్కిన మహిళ.. సహాయక సిబ్బంది తెగువతో -
Ballari: మూడు రోజులు బ్యాంకులు బంద్
బళ్లారి టౌన్: కరోనా నియంత్రణ కోసం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులను బంద్ చేయాలని ఆదేశించినట్లు జిల్లాధికారి పవన్‌కుమార్ మాలపాటి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టిన లాక్డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గాయని అన్నారు. కొంత మంది బ్యాంకుల్లో పని ఉందని తిరుగుతున్నారని, దీంతో బ్యాంకులు కూడా బంద్ చేస్తే జూన్ 7 వరకు చేపట్టిన లాక్డౌన్ వల్ల మరింత కేసులు తగ్గించవచ్చన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి జూన్ 7 ఉదయం వరకు సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సైదూల్ అడావత్ తెలిపారు. వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్, ఎస్పీ -
కోవిడ్ సెకండ్ వేవ్ :పార్కులపై పడ్డ ప్రభావం
-
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత
-
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ విలయతాండవం చేస్తుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మాహమ్మారిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15వరకు మూసివేస్తున్నట్టు కేంద్రంలోని సీనియర్ అధికారులు ప్రకటించారు. గతేడాది కరోనా విశ్వరూపం చూపిన సందర్భంలో కూడా ఈ కట్టడాలన్నీ మూసివేయగా.. కొన్ని రోజుల తరువాత వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా గతంలో కంటే వేగంగా కరోనా 2.0 కమ్ముకొస్తోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ను అదుపు చేసే చర్యల్లో భాగంగా మరోసారి కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను దశల వారీగా అమలు చేస్తున్నాయి. ( చదవండి: కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు ) -
లాక్డౌన్ ఎఫెక్ట్ షిర్డీ ఆలయం మూసివేత
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ మహారాష్ట్రలో కల్లోలం రేపుతోంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో మహారాష్ట్రలో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా దేశంలోనే అత్యంత సంపద గల షిర్డీ సాయిబాబా ఆలయం మూతపడింది. సోమవారం రాత్రి 8 గంటలకు ఆలయం మూతపడింది. ఈ ఆలయం మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా సామూహిక ప్రార్థన స్థలాలు, మందిరాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు షిర్డీ ట్రస్టీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మహారాష్ట్రలో 30,10,597 కేసులు నమోదవగా 55,878 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 4,30,503. -
76 మందికి కరోనా.. ‘తాజ్’ మూసివేత
డెహ్రాడూన్: మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గతేడాది మాదిరి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఒకేసారి 76 మందికి పాజిటివ్ సోకడంతో ప్రముఖ హోటల్ ‘తాజ్’ మూతపడింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్వాహకులు హోటల్‌ను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాలుగా ఉన్న రిశికేశ్, డెహ్రాడూన్లలో భారీగా కేసులు నమోదవుతుండడంతో కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. హోటల్‌ను శానిటైజ్ చేశామని.. ముందు జాగ్రత్తలో భాగంగా మూసివేసినట్లు ఎస్పీ తృప్తి భట్ మీడియాకు చెప్పారు. రిషికేశ్‌లోని తాజ్ రిసార్ట్ అండ్ స్పాలో గత మంగళవారం 16 మంది ఉద్యోగులకు కరోనా వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు పరీక్షలు భారీగా చేయించారు. ఈ క్రమంలో మరికొందరి పరీక్షలు నిర్వహించగా మొత్తం కేసులు కలిపి 76 మందికి మహమ్మారి వ్యాపించింది. దీంతో మరో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేశారు. అయితే కొన్ని రోజుల్లో ఉత్తరాఖండ్‌లో జరగాల్సిన మహాకుంభమేళాకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమయంలో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా మేళాకు వచ్చేవారు కచ్చితంగా పరీక్షలు చేసుకోవాలని.. నెగటివ్ వస్తేనే అనుమతి ఇవ్వనున్నారు. -
తెలంగాణలో స్కూళ్లు బంద్ ఫోటోలు
-
130 కోట్ల ఫేక్ ఖాతాలు నిలిపివేత
వాషింగ్టన్: 2020లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 130 కోట్లకు పైగా ఫేక్ ఖాతాలను నిలిపివేసినట్లు ఫేస్బుక్ యాజమాన్యం సోమవారం తెలియజేసింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ ప్రతినిధి రోసెన్ వెల్లడించారు. 60కి పైగా భాషల్లోని కంటెంట్‌ను నిశితంగా పరిశీలించడానికి స్వతంత్ర ఫ్యాక్ట్ చెకర్స్‌ను నియమించినట్లు తెలిపారు. ఏదైనా సమాచారం అసత్యమని తేలితే అది ఎక్కువ మందికి చేరకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాంటి సమాచారంపై హెచ్చరిక సంకేతం ఉంటుందని, దాన్నిబట్టి అప్రమత్తం కావాలని సూచించారు. ఈ సంకేతం ఉన్న సమాచారాన్ని 95 శాతం మంది యూజర్లు క్లిక్ చేయడం లేదని అన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారం చేస్తున్న కంటెంట్‌ను కూడా పూర్తిగా తొలగించామన్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించుకుంటున్నామని వివరించారు. -
టిక్‌టాక్ శాశ్వతంగా బంద్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ అయిన టిక్‌టాక్‌ను భారత్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ను ప్రమోట్ చేస్తున్న చైనా కంపెనీ బైట్‌డ్యాన్స్.. భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2,000 పైచిలుకు ఉద్యోగులను తీసివేయనుంది. ఈ ఉద్యోగులకు మూడు నెలల వేతనంతోపాటు కంపెనీలో పనిచేసిన కాలాన్నిబట్టి మరో నెల పారితోషికం ఇవ్వనున్నారు. టిక్‌టాక్ గ్లోబల్ ఇంటెరిమ్ హెడ్ వనెస్సా పప్పాస్, గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ చండ్లీ సంయుక్తంగా భారత్‌లోని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్స్‌లో ఈ విషయాలను వెల్లడించారు. -
భారత్‌కు ‘హార్లే’ గుడ్‌బై!
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్ విషయమై అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్సన్ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రీమియం బైక్‌ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షలతో భారత్‌లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ.. నష్టాల కారణంగా దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హరియాణాలోని బావల్లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. దీనివల్ల 70 మంది ఉపాధి కోల్పోనున్నారు. అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం. అదే విధంగా గురుగ్రామ్‌లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్‌లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులోనూ ఉత్పత్తి పరంగా సహకారం అందుతుందని ఈ సంస్థ భరోసా ఇచ్చింది. కాంట్రాక్టు కాలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్వర్క్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. అంటే పరిమిత కాలం వరకు కంపెనీ వాహన విక్రయాలు, విక్రయానంతర సేవలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్‌లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్ వివరణ ఇచ్చింది. అయితే, భారత్‌లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్ చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగమే ఈ నిర్ణయాలు. పునర్ నిర్మాణంలో భాగమే ‘‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్ బ్రాండ్, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021–25 కాలానికి రూపొందించిన ‘హార్డ్‌వైర్’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్ తన ప్రకటనలో వివరించింది. భారత్ లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు కం పెనీ తెలిపింది. ట్రంప్ ఒత్తిడి.. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు నిరసన స్వరం వినిపించారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్ సగానికి తగ్గించింది. అయినా ట్రంప్ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలు పర్యాయాలు డిమాండ్ కూడా చేశారు. ఎంట్రీ.. ఎగ్జిట్ ► 2007 ఏప్రిల్‌లో కాలుష్య ఉద్గార, పరీక్షా నియమాల్లో భారత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్ బైక్‌లు భారత మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. ► 2009 ఆగస్ట్‌లో హార్లే డేవిడ్సన్ ఇండియా కార్యకలాపాలు మొదలు ► 2010 జూలైలో మొదటి డీలర్షిప్ నియామకం, విక్రయాలు మొదలు ► 2011లో హరియాణాలోని ప్లాంట్‌లో బైక్‌ల అసెంబ్లింగ్ మొదలు ► విక్రయిస్తున్న మోడళ్లు: 11 ► ప్లాట్‌ఫామ్‌లు: 6 (స్పోర్ట్‌స్టర్, డైనా, సాఫ్టెయిల్, వీ రాడ్, టూరింగ్, స్ట్రీట్) ► 2020 సెప్టెంబర్‌లో వైదొలగాలని నిర్ణయం -
కొత్తపేట్ మార్కెట్‌కు తాళం
సాక్షి, హైదరాబాద్: కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్‌ను నేటి నుంచి మూసివేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మార్కెట్‌కు పండ్లు తెచ్చే రైతులు, కొనుగోలుకు వచ్చే వ్యాపారులు కోహెడకు వెళ్లాలని సూచించారు. అయితే కోహెడలో సరైన వసతులు లేవని, తాత్కాలిక షెడ్లు మాత్రమే ఉన్నాయని, వ్యాపార లావాదేవీలు ఎలా చేపట్టాలని రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం కూడా కోహెడ వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయకపోవడంతో గాలివాన, భారీ వర్షానికి షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండా కోహెడ వెళ్లాలని అధికారులు ఆదేశిస్తున్నారని, ఇది సరికాదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనందున, అక్కడ ప్లాట్‌ఫారాలు లేకపోవడంతో పండ్లు నేల పాలవుతాయని ఆందోళ వ్యక్తం చేన్నారు. గతంలో షెడ్లు కొందరు రైతులు, వ్యాపారులు గాయపడ్డారని మళ్లీ కోహెడకు వెళ్లాలంటే భయమవుతోందంటున్నారు. అధికారులు కోర్టు ఆదేశాలును బేఖాతరు చేస్తున్నారు మూడు నెలల క్రితం ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అయితే అక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో రైతులు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో కమీషన్ ఏజెంట్లు హై కోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో పక్కాగా నిర్మాణాలు చేపట్టిన అనంతరమే మార్కెట్‌ను కోహెడకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 12వ తేదీ నుంచి మార్కెట్‌ను కోహెడకు తరలిస్తున్నారు. కోర్టు అదేశాలను లెక్క చేయకుండా మార్కెటింగ్ శాఖ వ్యవహరిస్తోందని, కోర్టు ధిక్కర చర్యగా పేర్కొంటూ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కమీషన్ ఏజెంట్లు తెలిపారు. ఎక్కడైనా కరోనా ప్రబలుతుంది కొత్తపేట్ మార్కెట్‌ను మూసివేసి కోహెడకు తరలిస్తే కరోనా ప్రబలదా అని రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కొత్తపేట్ మార్కెట్లో శానిటైజేషన్ ఏర్పాట్లు చేయకుండా, వ్యాధి నిరోధక విధానాలు అవలంబించకుండా కోహెడకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని మార్కెట్ తరలించేందుకు ఇంత తొందరపాటు వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కోహెడ మార్కెట్ సమీపంలో ప్రజా ప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, మార్కెటింగ్ శాఖ అధికారులు భూములు కొనుగోలు చేశారని, వీటి విలువ పెంచుకోవడానికి మార్కెట్‌ను తరలించేందుకు తొందరపెడుతున్నారని కమీషన్ ఏజెంట్లు అరోపిస్తున్నారు. -
బెంగాల్లో జూన్ 30 వరకు స్కూళ్లు బంద్
కోల్‌కతా: కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లాక్డౌన్ ప్రస్తుతం ఉంఫన్ తుఫాను కారణంగా పశ్చిమ బెంగాల్లో జూన్ 30 వరకు యదావిధిగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఎనిమిది జిల్లాల్లో ఉంఫన్ తుఫాను కారణంగా అనేక పాఠశాల భవనాలు దెబ్బతిన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తెలిపారు. అయితే 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని గతవారం ప్రకటించినట్లే జూన్ 29 నుంచే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. (స్కూల్స్ పునఃప్రారంభానికి కసరత్తు) దాదాపు 1,058 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అయితే తుఫాను కారణంగా 462 పరీక్షా కేంద్రాలు దెబ్బతిన్నాయని అయినప్పటికీ ప్రత్యామ్నాయంగా కొన్ని పరీక్షా కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. అవసరమైతే మరికొన్ని కాలేజీ భవనాలను కూడా ఎగ్జామ్ సెంటర్లుగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. మిడ్నాపూర్, బుర్ద్వాన్, నాడియా, హూగ్లీ, హౌరా జిల్లాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు ఉంఫన్ కారణంగా తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు. దాదాపు తుఫాను కారణంగా స్కూళ్లు, పాఠశాలలు దెబ్బతిని 700 కోట్ల నష్టాన్ని మిగిల్చాయని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని పార్థా ఛటర్జీ వెల్లడించారు. ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. (సరిహద్దులో ఉద్రిక్తత: రంగంలోకి మళ్లీ అదే టీం?! ) -
కూరగాయల రైతుకు నష్టాల దిగుబడి
సాక్షి, హైదరాబాద్: రైతుల రోజువారీ ఆదాయ మార్గమైన కూరగాయల సాగు సంక్షోభంలో పడింది. సాగు పనులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. మార్కెట్లో అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నా, ధరలు పతనం కావడంతో లాభాలు మడిలోనే ఆవిరవుతున్నాయి. టమాట, బీర, బెండ, దొండ, దోస తదితర పంట దిగుబడులు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు భగభగమండేవి. పెళ్లిళ్లు, శుభకార్యాలతో డిమాండ్ బాగా ఉండేది. అయితే, కరోనా, లాక్డౌన్ ప్రభావాలతో కూరగాయల విక్రయాలకు గండిపడింది. రైతుబజార్లలో కూరగాయల మార్కెట్లు మూతబడ్డాయి. దాదాపు నెలన్నరగా రైతులు దిగుబడులను సగానికి సగం తగ్గిస్తూ విక్రయిస్తుండడంతో నష్టాలపాలవుతున్నారు. రవాణా చార్జీలు సైతం గిట్టుబాటు కాక దిగాలు పడుతున్నారు. కొనేవారు లేక.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగా రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లకు తాళం పడింది. ఇప్పటివరకు కూరగాయల దిగుబడులను నేరుగా రైతుబజార్‌కు తెచ్చి హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయించే రైతులకు తాజా పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. దిగుబడులను ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. రిటైల్ విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. ఇంటింటి విక్రయాలు జరిపినప్పటికీ కరోనా భయంతో కొనుగోళ్లకు వినియోగదారులు ముందుకు రావట్లేదు. దీంతో మధ్యవర్తులకు దిగుబడులను అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేసిన రైతులు కూలీలతో దిగుబడులను వేరు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కూలీలకు రోజుకు సగటున రూ.500 వరకు చెల్లించాలి. అయితే కూలీలకు చెల్లించే మొత్తం కూడా దిగుబడుల విక్రయంతో దక్కడం లేదు. దీంతో కొందరు రైతులు గిట్టుబాటు కావడం లేదని పంట దిగుబడులను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు కావడం లేదనే కారణంతో రైతులు కూరగాయల సాగును వదిలేయడమే మంచిదనే భావనతో ఉన్నారు. అదే జరిగితే ఇబ్బందులు తప్పవు. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గితే డిమాండ్‌కు సరిపడా దిగుబడులు మార్కెట్లోకి రావు. దీంతో ధరలు పెరిగిపోతాయి. రాబడి 60 శాతం తగ్గింది అరెకరంలో టమాట, మరో అరెకరంలో దొండ సాగుచేస్తున్నా. మరో రెండు మడుల్లో గోకర, బీర వేశాం. దిగుబడి బాగుంది. కానీ ధరల్లేవు. గతేడాది ఇదే సమయంలో రోజుకు సగటున రూ.1,000 రాబడి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.400 దాటడంలేదు. ఇది పెట్టుబడికే సరిపోవట్లేదు. మా కుటుంబసభ్యులతోనే సాగు పనులు చేస్తున్నాం. కూలీలను పెట్టుకుంటే నష్టాలు తప్ప పెట్టుబడి కూడా దక్కదు. – సిలువేరు మల్లయ్య, రైతు, సర్వేల్, యాదాద్రి జిల్లా పంటను పొలంలోనే వదిలేశా.. రెండెకరాల్లో టమాట, ఎకరంన్నరలో క్యాబేజీ, మరో రెండెకరాల్లో మునగ పంటలు వేశా. కూరగాయలకు ధరల్లేకపోవడం, కూలీలను పెట్టుకుంటే గిట్టుబాటు కాదని పంటంతా పొలాల్లోనే వదిలేశా. పొలం పక్కనున్న వారికి అవసరమైన కూరగాయలను తెంపుకోమని చెప్పా. – రొక్కం భీంరెడ్డి, రైతు, తుర్కయాంజాల్, రంగారెడ్డి జిల్లా -
చిన్న స్క్రీన్ పెద్ద ఊరట
లాక్ డౌన్ కారణంగా కొత్తగా రిలీజ్ కావాల్సిన సినిమాల కంటెంట్ అంతా స్టూడియోల్లోనే ఉండిపోయింది. కొంచెం ఆలస్యం అయినా రేపటి రోజుని చూస్తాయి, విడుదలవుతాయనే గ్యారంటీ ఉంది. కానీ ఇబ్బంది అంతా ఆల్రెడీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలకే. ప్రభుత్వం పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించిన వారం ముందే థియేటర్స్‌ని మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆల్రెడీ థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతున్న చిత్రాలకు చిక్కొచ్చి పడింది. థియేట్రికల్ రన్ పూర్తి కాకుండా మధ్యలోనే సినిమా ప్రదర్శన ఆగిపోతే నష్టం ఖాయం. అయితే అలాంటి సినిమాలకు ‘డిజిటల్ ప్లాట్ ఫామ్’ ఓ ఊరట అని చెప్పొచ్చు. ఇంటి పట్టున కూర్చుని కాలక్షేపం కోసం ఈ ప్లాట్ ఫామ్ లో వస్తున్న సినిమాలను వీక్షిస్తున్నారు. దాంతో కొన్ని చిత్రాలను నేరుగా డిజిటల్ లో విడుదల చేస్తున్నారు. టీవీ, ల్యాప్ టాప్, ఫోన్.. చిన్ని తెర అయినప్పటికీ పెద్ద ఊరటగా నిలుస్తున్నాయి. ఓ పిట్ట కథ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. నిత్యా శెట్టి, విశ్వంత్ ముఖ్య పాత్రల్లో నటించారు. చెందు ముద్దు దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న విడుదలయింది. థియేటర్లో ఆడటానికి స్కోప్ ఉన్నా లాక్ డౌన్‌తో ఆగింది. అందుకే సినిమా విడుదలయిన పదో రోజునే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. పలాస 1978 వర్గ బేధాల గురించి శ్రీకాకుళం నేపథ్యంలో తయారయిన రూరల్ డ్రామా ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె ముఖ్య పాత్రల్లో నటించారు. మార్చి 6న ఈ సినిమా విడుదలయింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రైమ్‌లో ఉంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ధన్య బాలకృష్ణ, త్రిదా చౌదరి, కోమలి, సిద్ధి ఇద్నాని ముఖ్య పాత్రల్లో బాలు అడుసుమిల్లి తెరకెక్కించిన చిత్రం ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6నే విడుదలయింది. ఈ సినిమాని కూడా ప్రస్తుతం ప్రైమ్‌లో చూడవచ్చు. మధ ‘మధ’ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకముందే ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటింది. సుమారు 26 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు, అభినందనలు గెలుచుకుంది. త్రిష్ణ ముఖర్జీ ముఖ్య పాత్రలో శ్రీ విద్య బసవ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 13న విడుదలయింది. అన్ని అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడి ఉండేది. అయితే మార్చి 15 నుంచి థియేటర్స్ క్లోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 8 నుంచి ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డబ్బింగ్ సినిమాలు డబ్బింగ్ సినిమాలదీ అదే కథ. శివకార్తికేయన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. తెలుగులో ఈ సినిమాను ‘శక్తి’ టైటిల్‌తో అనువదించారు. మార్చి 20న ఈ సినిమా థియేటర్స్‌లోకి రావాలి. కానీ లాక్ డౌన్ కావడంతో సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్‌లో రిలీజ్ చేశారు. విక్రాంత్, అతుల్య, మిస్కిన్ నటించిన ‘షూట్ ఎట్ సైట్ ఉత్తర్వు’ అనే అనువాద చిత్రాన్ని కూడా నేరుగా ప్రైమ్‌లోనే రిలీజ్ చేశారు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుడికి చూపిస్తేనే అది తయారు చేసిన వాళ్లకు ఆనందం. కానీ అనుకోకుండా వచ్చిన ఈ ‘లాక్ డౌన్’ వల్ల థియేటర్లకు రాకుండా సినిమాలు లాక్ అయ్యాయి. అందరూ ఇంట్లోనే ఉండటంతో వినోదాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే వెతుక్కుంటున్నారు. తెర ఏదైనా సినిమా తెరకెక్కేది ప్రేక్షకుడికి వినోదం అందించడానికే. ఒక నెల క్రితం వరకూ సినిమా విడుదలయ్యాక డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి రావాలంటే మినిమమ్ 7 నుంచి 8 వారాలు గ్యాప్ ఉంటే బాగుంటుందని నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ అధినేతలు భావించారు. కానీ ఎన్ని రోజుల్లో ఆన్ లైన్లో సినిమా అందుబాటులోకి రావాలనే వాదన పక్కన పెడితే ఈ పరిస్థితుల్లో, ఆ సినిమాలకు ఊరట అనే అనుకోవచ్చు. థియేట్రికల్ రెవెన్యూ పరంగా పలు ఇబ్బందులు ఎదురైనా ప్రేక్షకుడి వరకూ సినిమా వెళ్ళింది అనే ఆనందం అయితే కచ్చితంగా మిగులుతుంది. -
ఇక రెండు రోజులే..
సాక్షి, పాల్వంచ: సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు విద్యుత్ కాంతులు విరజిమ్మిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్) చరిత్ర తుది అంకానికి చేరుకుంది. పర్యావరణ ఆదేశాల మేరకు ఈ నెల 31తో తన ప్రస్థానానికి ముగింపు పలకబోతోంది. దీంతో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రాష్ట్రం కోల్పోనుంది. పాల్వంచలోని కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని 1966 – 1978 మధ్య కాలంలో ఏ,బీ,సీ స్టేషన్ల వారీగా 8 యూనిట్లను నిర్మించారు. వీటి ద్వారా 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి వెలుగులు అందించింది. ఇంజనీర్లు, కార్మికులు కలిపి 2,500 మంది ఇప్పటివరకు పనిచేశారు. కిన్నెరసాని జలాశయం ఆధారంగా సమీపంలోని కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల సింగరేణి బొగ్గు సరఫరా చేసుకుని ఐదున్నర దశాబ్దాల పాటు ఏకధాటిగా ఉత్పత్తి అందించింది. జపాన్ టెక్నాలజీతో 1,2,3,4 యూనిట్లలో 240 మెగావాట్లు, 5, 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 7,8 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల ఉత్పత్తిని అందించింది. అయితే కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ యూనిట్లను మూసివేయాలని సెంట్రల్ ఎలక్రి్టసిటీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, దాని స్థానంలో సూపర్ క్రిటికట్ టెక్నాలజీతో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా మరో ప్లాంట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఓఅండ్ఎం కర్మాగారాన్ని 2019 డిసెంబర్ 31న మూసి వేయాల్సి ఉండగా.. 7వ దశలో వార్షిక మరమ్మతుల నేపథ్యంలో గత నవంబర్ 28వ తేదిన ఉత్పత్తిని నిలిపివేశారు. మరమ్మతు చేయడానికి నాలుగు నెలల కాలం తీసుకున్నారు. దీంతో డిసెంబర్ 31న మూసివేయాల్సిన ఓఅండ్ఎం కర్మాగారాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. మార్చి 31తో మూసేస్తాం కాలం చెల్లిన 720 మెగావాట్ల కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని మార్చి 31న మూసివేయాలని జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఐదున్నర దశాబ్దాల పాటు తన ప్రస్థానాన్ని సాగించి ఉమ్మడి రాష్ట్రంలో వెలుగులు అందించింది. జ పాన్ టెక్నాలజీతో నిర్మించిన ఈ కర్మాగారం ఇంతకాలం విజయవంతంగా ఉత్పత్తి అందించడం గొప్ప విషయం. కేటీపీఎస్‌తోనే పాల్వంచకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉందనడంలో సందేహం లేదు. మూసివేత నిర్ణయం బాధాకరమైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో విరామం ప్రకటిస్తున్నాం. - జె.సమ్మయ్య, సీఈ -
ఏపీకు వచ్చే అన్ని సరిహద్దుల మూసివేత
-
ఇంటి వద్దకే అంగన్వాడీ సరుకులు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను మూసేస్తున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. అయినప్పటికీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పౌష్టికాహార పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సోమవారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ బియ్యం, పప్పు, నూనె, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు పంపిణీని గ్రామ కమిటీ ద్వారా చేపట్టాలన్నారు. ఈ కమిటీలో అంగన్వాడీ టీచర్, హెల్పర్, గ్రామ కార్యదర్శి, ఆశ వర్కర్, స్థానిక పోలీస్‌ను భాగస్వామ్యం చేసి ప్రభుత్వం ద్వారా ఇచ్చే ప్రతి వస్తువు సరైన పద్ధతిలో, సరైన సమయంలో లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ దివ్యను ఆదేశించారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితి నేపథ్యంలో సెలవు రోజుల్లో కూడా రోజు మాదిరిగానే సరుకులు పంపిణీ చేయాలన్నారు. కరోనాపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అప్రమత్తంగా ఉండాలని, విదేశాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. గర్భిణుల జాబితా సిద్ధం చేయాలి..: గ్రామాలు, పట్టణాల్లోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రసవ సమయానికి సిద్ధమైన గర్భిణుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి సత్యవతి ఆదేశించారు. కాగా, రాష్ట్రంలో గర్భిణులు 3.3 లక్షలు ఆరోగ్య లక్ష్మి ద్వారా లబ్ధి పొందుతున్నారని కమిషనర్ దివ్య వివరించారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు బాలబాలికలు 4.40 లక్షలు, 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు శిశువులు 8.40 లక్షల మంది ఉన్నారన్నారు. -
కరోనా: గుంటూరు మిర్చి యార్డు లాక్డౌన్
సాక్షి, గుంటూరు: కోవిడ్-19 ( కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా జిల్లాలోని మిర్చి మార్కెట్‌ను ఈ నెల 31 వరకు మూసివేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మిర్చి రైతులు గుంటూరు మిర్చి మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి మిర్చి యార్డ్ తెరిచేంతవరకు రైతులు రావొద్దని ఆయన సూచించారు. సోమవారం నుంచి గుంటూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడి ఉండొద్దని కలెక్టర్ శామ్యూల్ తెలిపారు. (31వరకు ఏపీ లాక్డౌన్ ) ఇక గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 31 వరకు యార్డుకు మిర్చిని తీసుకురావద్దని, రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
భారత్ @ 158
న్యూఢిల్లీ/బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 158కి చేరింది. మంగళవారం నుంచి కొత్తగా 14 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వారిలో ఒక సైనికుడు కూడా ఉన్నారు. లద్దాఖ్ స్కౌట్ రెజిమెంట్‌కు చెందిన 34 ఏళ్ల సైనికుడికి కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని భారత సైన్యం ప్రకటించింది. ఇరాన్ నుంచి ఫిబ్రవరి 20న ఎయిర్ ఇండియా విమానంలో భారత్ తిరిగొచ్చిన తన తండ్రి నుంచి ఆ సైనికుడికి ఆ వైరస్ సోకిందని, అతడి తండ్రికి కూడా కోవిడ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది. వారు లేహ్‌లోని చౌహత్ గ్రామానికి చెందినవారని తెలిపింది. ఆ సైనికుడి సోదరుడికి కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా ఆర్మీ చర్యలు ప్రారంభించింది. సెలవుపై వెళ్లి వచ్చిన సైనికులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడం, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం, అనవసర ప్రయాణాలను, అన్ని శిక్షణ కార్యక్రమాలను, సదస్సులను రద్దు చేయడం.. తదితర చర్యలు చేపట్టింది. ఈ వైరస్ సోకిన 158 మందిలో ముగ్గురు మృతులు, 25 మంది విదేశీయులు ఉన్నారు. ఏకాంతవాస కేంద్రాల(క్వారంటైన్ సెంటర్స్)ను సందర్శించి, అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ బాధితులతో సన్నిహితంగా ఉన్న దాదాపు 5700 మందిని వివిధ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బుధవారం వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 42, కేరళలో 27, ఉత్తరప్రదేశ్‌లో 16, కర్ణాటకలో 11, ఢిల్లీలో 10, లద్దాఖ్‌లో 8, తెలంగాణలో 13 కేసులు నమోదయ్యాయి. హరియాణాలో కోవిడ్ బారిన పడిన 17 మందిలో 14 మంది విదేశీయులే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా చికిత్స అనంతరం కోలుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల సౌదీ అరేబియా వెళ్లి వచ్చిన బీజేపీ ఎంపీ సురేశ్ ప్రభు స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. విదేశాల్లోని భారతీయులకు.. విదేశాల్లోని భారతీయుల్లో 276 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని విదేశాంగ శాఖ సహాయమంత్రి వీ మురళీధరన్ బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. వారిలో ఇరాన్‌లోని 255 మంది, యూఏఈలోని 12 మంది, ఇటలీలోని ఐదుగురు, శ్రీలంక, కువైట్, రువాండా, హాంకాంగ్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారన్నారు. యూఏఈలో 8 మంది భారతీయులను క్వారంటైన్ చేసినట్లు వెల్లడించారు. ఇరాన్లో సుమారు 6 వేల మంది భారతీయులున్నారన్నారు. వారిలో జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట్రల నుంచి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లిన 1100 మంది, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన 1000 మంది మత్స్యకారులు, జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల నుంచి వెళ్లిన 300 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి 389 మందిని వెనక్కు తీసుకువచ్చామన్నారు. రాజ్యసభలో మాస్కుల కలకలం రాజ్యసభకు తొలిసారి ఎంపీ డెరెక్ ఓ బ్రేన్ సహా నలుగురు టీఎంసీ సభ్యులు మాస్క్‌లతో వచ్చారు. సభా నిబంధనల ప్రకారం సభ్యులు మాస్క్‌లు ఉపయోగించరాదని సభ చైర్మన్ వెంకయ్యనాయుడు తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, కరోనా ముప్పు నేపథ్యంలో మాస్క్‌ల వినియోగం తప్పనిసరి అని, దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసిందని, అందువల్ల మాస్క్‌లను అనుమతించాలని కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం కోరడంతో, వెంకయ్యనాయుడు అంగీకరించారు. కరోనా ముప్పు పొంచి ఉందని, అందువల్ల బడ్జెట్ సమావేశాలను కుదించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు అభ్యర్థించారు. వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ ఉంటామని, అందువల్ల ఎంపీలకు వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని, ఎంపీలమైనందువల్ల ఆ వైరస్ మన జోలికి రాదని అనుకోకూడదని కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ గౌడ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అభ్యర్థనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సబ్బుల ధరలపై కేంద్రం దృష్టి న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నిత్యావసరాలైన సబ్బులు, నేలలు తుడిచే క్లీనర్లు, థర్మల్ స్కానర్ల ధరలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. సాధారణంగా ఈ శాఖ దేశవ్యాప్తంగా 22 నిత్యావసరాల ధరలను పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా ఫేస్ మాస్క్‌లు, చేతి శానిటైజర్లను ఆ జాబితాలో చేర్చింది. ‘కోవిడ్ కారణంగా డిమాండ్ పెరిగిన సబ్బులు, లైజాల్, డెటాల్ వంటి చేతులు, నేలలు శుభ్రపరిచే క్లీనర్ల ధరలను మేం పర్యవేక్షిస్తున్నాం’అని కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 114 కేంద్రాల ద్వారా ఈ ఉత్పత్తుల ధరలను కేంద్రం పర్యవేక్షిస్తోంది. 22 నిత్యావసర వస్తువుల్లో బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, పప్పు ధాన్యాలు, నూనెలు, కూరగాయలు, చక్కెర, పాలు, టీ, ఉప్పు తదితరాలు ఉన్నాయి. కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన పెరగడంతో వేరే దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువగా వ్యాపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ బాంబే బంద్ ► కరోనా ముప్పు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ఎలాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదని బీజేపీ నిర్ణయించింది. ► మా పరుపులు వాడితే కరోనా వైరస్ రాదని ప్రచారం చేస్తున్న ఒక వ్యాపారిపై మహారాష్ట్రలోని థానేలో కేసు నమోదైంది. ► కోవిడ్–19 లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయొద్దని, బాధ్యతాయుతంగా ప్రవర్తించి, వెంటనే వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్లాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై నకిలీ వార్తలు ప్రచారం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ► కరోనా వైరస్ నుంచి రక్షిస్తుందని పేర్కొంటూ గో మూత్రాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని నారాయణ చటర్జీ అనే బీజేపీ కార్యకర్త కోల్‌కతాలో మంగళవారం నిర్వహించారు. ఆ గోమూత్రం సేవించి, అనారోగ్యం పాలయిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చటర్జీని అరెస్ట్ చేశారు. ► ఐఐటీ బాంబే క్యాంపస్‌ను మార్చి 31 వరకు మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ► లండన్‌లో వేలాదిగా ఉన్న భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై అక్కడి హైకమిషన్‌ను అభ్యర్థిస్తున్నారు. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపై మార్చి 31 వరకు భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో కోవిడ్ కారణంగా 104 మంది చనిపోగా, దాదాపు 2 వేల మందికి ఈ వైరస్ సోకింది. ► పారా మిలటరీ సిబ్బందికి సంబంధించిన అన్ని అత్యవసరం కాని సెలవులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్లమెంట్ వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యకు థర్మల్ స్క్రీనింగ్ దృశ్యం -
బీసీసీఐ కార్యాలయం మూసివేత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవులు ప్రకటించగా... ఐటీ కారిడార్లు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆదేశాలు జారీ చేశాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా ఇదే బాటలో నడుస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని తమ ప్రధాన కార్యాలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలంటూ ఆదేశించింది. కోవిడ్–19 కారణంగా ఇప్పటికే పలు టోర్నీలను బీసీసీఐ వాయిదా వేసింది. ఈ జాబితాలో దేశవాళీ క్రికెట్ టోర్నీలు, ఇరానీ కప్, మహిళల చాలెంజర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ టోర్నీ కూడా ఉంది. మరోవైపు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అన్ని జోనల్ శిక్షణా శిబిరాలను నిలిపివేసింది. కానీ బెంగళూరులోని ఎన్సీఏ పునరావాస కేంద్రం మాత్రం సోమవారం కూడా తన విధుల్లో నిమగ్నమై ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈనెల 21 నుంచి జరగాల్సిన శిక్షణా శిబిరాన్ని వాయిదా వేసింది. -
‘సుప్రీం’ కాంప్లెక్స్‌లోకి సందర్శకులకు నో
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం మరిన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. న్యాయస్థానం ఆవరణలోకి ప్రతి శనివారం సందర్శకులకు బృందాలుగా ఇచ్చే అనుమతులను రద్దు చేసింది. కోర్టు క్యాంటీన్, కెఫేలను మూసివేయాలని ఆదివారం ఆదేశించింది. ఈ నెల 16వ తేదీన మొత్తం 15 ధర్మాసనాలకు గాను 6 మాత్రమే పనిచేస్తాయని, 12 అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘çకోర్టు ఆవరణలోకి సాధారణ సందర్శకులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలి. లాయర్లు, కోర్టు సిబ్బంది, చిరు వ్యాపారులు ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకల్లా ఆవరణ విడిచి బయటకు వెళ్లిపోవాలి. 6 గంటలకల్లా కోర్టులోని విశ్రాంతి గదులు, కారిడార్లు, మెట్లు తదితరాలను శుభ్రం చేయాలి. లాయర్లు, కక్షిదారులు, గుమాస్తాలు ఆవరణలో గుమి కూడరాదని, విధులు ముగిసిన తక్షణమే వెళ్లిపోవాలి’అని ఆదేశించింది. -
తడ బడి.. మూతపడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్ల సంఖ్య పెద్దగా తగ్గకపోయినా విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. పాఠశాల విద్యాశాఖ తేల్చిన లెక్కల ప్రకారం విద్యా వాలంటీర్లు కలుపుకొని 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2018–19లో 3,834 మంది టీచర్లు తగ్గిపోయారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 280 మందే తగ్గారు. విద్యార్థుల విషయానికొస్తే ప్రభుత్వ పాఠశాలల్లో 39,107 మంది తగ్గగా, ప్రైవేటు పాఠశాలల్లో 77,447 మంది పెరిగారు. స్కూళ్ల పరంగా చూస్తే ప్రైవేటు స్కూళ్లే అత్యధికంగా మూత పడ్డాయి. అయినా వాటిల్లో విద్యా ర్థుల సంఖ్య పెరగటం గమనార్హం. 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2018–19 విద్యా సంవత్సరంలో ప్రైవేటులో 410 స్కూళ్లు మూత పడినా ఆ ప్రభావం విద్యార్థుల సంఖ్యపైనా పడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇక 2019–20 విద్యా సంవత్సరం లెక్కల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య మరింతగా తగ్గుతుందని విద్యాశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. రూ.వేలకోట్లు వెచ్చిస్తున్నా.. రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద వివిధ విద్యా పథకాలకు ఆమో దం తెలిపేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇటీవల కేంద్రానికి ఈ లెక్కలను అందజేసింది.అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లే మూత పడినట్లు పేర్కొంది. పట్ట ణాల్లో 453 పాఠశాలలు మూత పడగా, గ్రామీణ ప్రాంతాల్లో 26 మూతపడ్డాయి. విద్యా పథకాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రూ.వేల కోట్లను వెచ్చిస్తున్నా ఫలితాలు ఆశించిన మేర రావడం లేదు. సమగ్ర శిక్షా అభియాన్ కిందే ఏటా వెచ్చిస్తున్న రూ. 2 వేల కోట్లు కలుపుకొని ఏటా పాఠశాల విద్యకు రూ. 11 వేల కోట్లు కేటా యించినా ప్రభుత్వ బడులు విద్యార్థులను ఆకట్టులేకపోతున్నాయి. ప్రభుత్వ టీచర్లు సరిగ్గా చెప్ప రన్న అపవాదు, ప్రైవేటు పాఠశాలల ఆకర్షణీయ విధానాలతో తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. కేంద్రానికి ఇచ్చిన లెక్కల్లో మరికొన్ని అంశాలు.. ►రాష్ట్రంలో 2017–18 విద్యా సంవత్సరంలో మొత్తం స్కూళ్లు 42,834 ఉండగా, 2018–19లో వాటి సంఖ్య 42,355కు తగ్గిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 479 స్కూళ్లు మూత పడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో 453, గ్రామీణ ప్రాంతాల్లో 26 మూత పడ్డాయి. ►మూత పడిన వాటిలో ప్రైవేటువే అత్యధికంగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 410 మూత పడగా, మిగతావి ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ►రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో (ఇంటర్మీడియట్ కలుపుకొని) 2017–18 విద్యా సంవత్సరంలో 65,29,072 మంది విద్యార్థులు ఉండగా 2018–19 విద్యా సంవత్సరం వచ్చే సరికి వారి సంఖ్య 65,56,701 మందికి చేరుకుంది. అంటే పాఠశాలల్లో 27,629 మంది విద్యార్థులు పెరిగారు. ►2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా వలంటీర్లు కలుపుకొని 2,61,904 మంది టీచర్లు ఉండగా, వారి సంఖ్య 2018–19 విద్యా సంవత్సరంలో 2,57,367 మందికి తగ్గిపోయింది. అంటే పాఠశాలల్లోనే 4,537 మంది టీచర్లు తగ్గిపోయారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్య«ధికంగా 3,834 మంది టీచర్లు తగ్గిపోవడం గమనార్హం. -
గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుపతి: సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూసి ఉంచుతున్నారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం గురువారం వీఐపీ బ్రేక్ దర్శనాలను (ప్రొటోకాల్ దర్శనాలు కూడా) రద్దుచేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును కూడా బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భవనాన్ని తెరుస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. శ్రీశైల ఆలయం మూత సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల ఆలయ మహాద్వారాలను బుధవారం రాత్రి 10 గంటలకు మూసివేసినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ఆలయద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాత సేవ, స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.10 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో తెలిపారు. శుద్ధి అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి 8 గంటలకు మూసివేసినట్లు ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ తెలిపారు. గ్రహణం వీడిన అనంతరం శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించి గురువారం సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తామని చెప్పారు. నేడు శ్రీకాళహస్తిలో గ్రహణకాల అభిషేకాలు శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తిలో వెలసిన వాయులింగేశ్వరుని ఆలయంలో గురువారం సూర్యగ్రహణం సందర్భంగా ప్రత్యేక గ్రహణకాల అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. -
రేపు యాదాద్రి ఆలయం మూసివేత
సాక్షి, యాదగిరిగుట్ట : పాక్షిక సూర్యగ్రహణం కారణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రినుంచి ఈ నెల 26(గురువారం)వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు మూసివేయనున్నట్లు ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8.26గంటల నుంచి 10.57గంటల వరకు మోక్షకాలం ఏర్పడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం (నేడు) రాత్రి ఆలయ ద్వారబంధనం చేస్తారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12గంటల తరువాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, మహానివేదన అనంతరం 2గంటలనుంచి భక్తులకు సర్వదర్శనాలు కల్పిస్తామని తెలిపారు. సాయంకాలం భక్తుల మొక్కుసేవలు, దర్బార్‌సేవ, అర్చనలు యధావిధిగా ఉంటాయని పేర్కొన్నారు. పాతగుట్ట ఆలయాన్ని సైతం మూసివేస్తామని తెలిపారు. పాక్షిక సూర్యగ్రహణం అనంతరం శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని శుద్ధి చేసి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వ్రతాలు జరిపిస్తామని పేర్కొన్నారు. వాడపల్లిలో.. దామరచర్ల(విుర్యాలగూడ): జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లిలోని దేవాలయాలను ఈ నెల 26న మూసివేయనున్నట్లు వాడపల్లి ఆలయాల మేనేజర్ మృత్యుంజశాస్త్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యగ్రహణం సందర్భంగా గురువారం ఉదయం 7గంటల నుంచి శ్రీ మీనాక్షి ఆగస్తేశ్వరదేవాలయం, శ్రీలక్ష్మీనర్సింహాస్వామి దేవాలయాలను మూసివేయనున్నట్లు తెలిపారు. -
మూతబడిన స్పాంజ్ ఐరన్ యూనిట్
సాక్షి, కొత్తగూడెం: పాల్వంచలోని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్పాంజ్ ఐరన్ యూనిట్ మనుగడ మూడు నెలల ముచ్చటే అయింది. మూడేళ్ల పాటు మూతబడిన ఈ ప్లాంట్‌లో గత జనవరిలో ఉత్పత్తి పునఃప్రారంభించారు. అయితే మూడు నెలలకే మళ్లీ మూతబడింది. స్పాంజ్ ఐరన్ విక్రయిస్తే వచ్చే డబ్బు కంటే తయారీకే ఎక్కువగా ఖర్చవుతోందని, దీంతో నష్టాలు వస్తున్నాయని ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రక్రియ భారం కావడంతో తిరిగి మూసేశారు. నష్టాలు వస్తున్నాయనే కారణంతో ఈ ప్లాంట్‌లో ఉత్పత్తిని 2016లో నిలిపివేశారు. ఉద్యోగుల కోరిక, జిల్లా ప్రజల ఆకాంక్ష, రాష్ట్ర విభజన నేపథ్యంలో బయ్యారంలో చేపట్టాల్సిన ఉక్కు కర్మాగారం విషయమై అనేక ఆందోళనల నేపథ్యంలో పాల్వంచలోని ఎన్ఎండీసీ స్టీల్ ప్లాంట్‌లో మూడేళ్ల తరువాత ఈ ఏడాది జనవరి 22న తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. అయితే ఉత్పత్తి ప్రక్రియ నిరాటంకంగా నడుస్తుందని ఆశించినప్పటికీ అది సాధ్యం కాలేదు. నడిపించి నష్టాలను పెంచుకోవడం కంటే ఉత్పత్తిని నిలిపివేయడమే మేలని నిర్ణయానికి వచ్చిన ఎన్ఎండీసీ.. గత మార్చిలో తిరిగి ఉత్పత్తిని ఆపేసింది. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. స్పాంజ్ ఐరన్ బదులు కోల్డ్ రోల్ మిల్ (మెటల్ ప్రాసెసింగ్ మిషనరీ) చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై అ«ధ్యయనం చేసేందుకు ఎంఎన్ దస్తూరి అనే కన్సెల్టెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఎన్ఎండీసీలో విలీనం చేసినా నష్టాలే.. 1980లో స్పాంజ్ ఐరన్ యూనిట్(డీఆర్పీ 1) వార్షిక ఉత్పత్తి 30 వేల టన్నులతో ప్రారంభమైంది. లక్ష్యాలకు మించి 60 వేల టన్నుల ఉత్పత్తిని కూడా సాధించింది. 2008లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఉక్కు పరిశ్రమలో మాంద్యం నెలకొంది. దీంతో నష్టాలు మొదలైన ఈ కర్మాగారాన్ని 2010 జూలై 31న లాభదాయకమైన నవరత్న స్థాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్‌లో విలీనం చేశారు. ఈ విధంగా అయినా తిరిగి స్పాంజ్ ఐరన్ యూనిట్ నష్టాలను అధిగమిస్తుందని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉత్పత్తి ధర కంటే అమ్మకం ధర తక్కువగా ఉండటంతో 2016లో ఉత్పత్తిని నిలిపివేశారు. అనేక పరిణామాల మధ్య తిరిగి 2019 జనవరి 22న పునరుద్ధరించేందుకు నూతన జీఎం ఆర్డీ నంద్ ప్రత్యేక చొరువ తీసుకుని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీఎస్ చెరియన్ సహకారంతో 100 టన్నుల సామర్థ్యం గల ఒక యూనిట్‌ను ప్రారంభించారు. ఇందుకు అవసరమైన ముడి సరుకు ఐరన్ ఓర్, బొగ్గు దిగుమతికి చర్యలు చేపట్టారు. అయితే టన్ను ఉత్పత్తికి రూ.23 వేలు ఖర్చు అవుతుండగా.. అది అమ్మితే రూ.19 వేలు మాత్రమే వస్తోంది. అంటే టన్నుకు రూ.4 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. ఇలా నెలకు రూ.12 కోట్లు నష్టం వస్తున్నట్లు సమాచారం. దీంతో నడపడం కంటే మూసేయడమే మేలని భావించి గత మార్చిలో ఉత్పత్తిని నిలిపివేశారు. మరో వైపు సిబ్బంది జీతభత్యాలు కూడా భారమై సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కర్మాగారంలో ఉత్పత్తి లేక పోవడంతో ఇక్కడ పనిచేస్తున్న సుమారు 30 మంది అధికారులు, 102 మంది కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తెరపైకి కోల్డ్ రోల్ మిల్.. మార్కెట్లో స్పాంజ్ ఐరన్ ధర పెరిగితే తప్ప నష్టాలు తప్పవని అధికారులు అంటున్నారు. సిబ్బంది సంక్షేమం దృష్ట్యా నడపాలని యోచిం చినప్పటికీ అది సాధ్యం కావడం లేదని చెపుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచి కాకుం డా సమీపంలో ఉన్న బయ్యారం ఐరన్‌ఓర్ ఉపయోగించుకుని నడపితే రవాణా చార్జీలు తగ్గుతాయని ఆలోచించినా.. ఇక్కడి ముడి సరుకు (ఐరన్‌ఓర్) ఉత్పత్తికి అవసరమైన మేర నాణ్యం గా లేదని తెలిసింది. దీంతో ఇక్కడ కోల్డ్ రోల్ మిల్ ఏర్పాటు చేస్తే బాగుంటదనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. దీనిపై యాజమాన్యం సైతం సానుకూలంగా ఉందని, కార్యరూపం దాల్చితే సంస్థకు మేలు జరుగుతుందని సిబ్బంది ఆశిస్తున్నారు. సాధ్యసాధ్యాలపై ఎంఎన్ దస్తూరి అనే కన్సెల్టెన్సీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇక్కడి సిబ్బందితో కూడా చర్చించినట్లు తెలిసింది. -
గాంధీ జయంతి : మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్టాక్‌మార్కెట్లకు ఈ రోజు (అక్టోబరు 2, బుధవారం) సెలవు. బాండ్, కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా బుధవారం పనిచేయవు. మరోవైపు గాంధీ 150వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ,రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా బాపూజీని స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు. కాగా మంగళవారం ఆరంభంలోనే పాజిటివ్‌గా ఉన్నప్పటికీ మిడ్‌సెషన్ తదుపరి అమ్మకాలు ఊపందుకోవడంతో ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలలో అమ్మకాలు షాక్ తగిలింది. చివరికి సెన్సెక్స్ 362 పాయింట్లు పతనమై 38305 వద్ద , నిఫ్టీ 115 పాయింట్లు కోల్పోయి 11359 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. राष्ट्रपिता महात्मा गांधी को उनकी 150वीं जन्म-जयंती पर शत-शत नमन। Tributes to beloved Bapu! On #Gandhi150, we express gratitude to Mahatma Gandhi for his everlasting contribution to humanity. We pledge to continue working hard to realise his dreams and create a better planet. pic.twitter.com/4y0HqBO762 — Narendra Modi (@narendramodi) October 2, 2019 -
‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్ (ఎస్సీఎల్) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టు 15–18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్‌లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్ ఈ సందర్భంగా వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్సీఎల్ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16, 17న (రెండు రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్ తదితర సంస్థలు డిమాండ్‌కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతీలో 3 వేల ఉద్యోగాలు కట్.. ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
మార్కెట్లకు సెలవు
సాక్షి,. ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు ఈ రోజు సెలవు. బక్రీద్ సందర్భంగా 12న(సోమవారం) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సెలవు ప్రకటించారు. సాక్షి పాఠకులకు బక్రీద్ పర్వదినంగా సందర్భంగా ఈద్ శుభాకాంక్షలు. అలాగే ఈ వారం మార్కెట్లలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. దీంతో వారంలో ట్రేడింగ్ మంగళ, బుధ, శుక్రవారాలకే పరిమితంకానుంది కాగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడంతో గత వారంలో తొలి మూడు రోజులూ దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. దేశీయంగా రిలీఫ్ ర్యాలీ వచ్చినప్పటికీ , సెంటిమెంటు బలహీనంగా ఉందనీ, అప్రమత్తత అవసరంమని నిపుణులు చెబుతున్నారు. -
వేలం వేయరు.. దుకాణాలు తెరవరు
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ దుకాణాలకు అధికారులు, పాలకులు వేలం వేయడంలేదు.. దుకాణాలను తెరవడంలేదు. ఫలితంగా సర్కారు ఖజానాకు చిల్లు పడుతోంది. పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో రూ.1.56 కోట్ల వ్యయంతో నిర్మించిన 28 దుకాణాలను, అలాగే కూరగాయల మార్కెట్లో రూ.38 లక్షల వ్యయంతో 16 దుకాణాలను నిర్మించారు. వాటిని గతేడాది ఫిబ్రవరి 17న అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఆ దుకాణాలకు వేలం వేయకుండా తెరవకుండా ఉండటంతో మార్కెట్ యార్డుకు దాదాపు ఇప్పటివరకు రూ.30 లక్షల మేర ఆదాయం రాకుండా పోయింది. గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడో? మార్కెట్‌యార్డు పాలకవర్గాన్ని పొడగించేందుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇటీవలే ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఏడాది కాలంలో పాలకవర్గం షాపింగ్కాంప్లెక్స్లోని దుకాణాలను వేలం వేయడంలో విఫలమైంది. ఈ అంశం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. వారంరోజుల్లో టెండర్లకు ఆహ్వానిస్తామని అధికారులు అంటున్నారు. వ్యాపారులు ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జోరందుకున్నాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాలు తొలగించారు. వ్యాపారస్తులకు సిద్ధంగా ఉన్న దుకాణాలు కావాలంటే నూతనంగా నిర్మించిన ఈ దుకణాలే దిక్కు. వాటిని ఎప్పుడు వేలం వేస్తారోనని ఏడాదిన్నరగా వేచి ఉన్నారు. రూ.30 లక్షల ఆదాయం పోయినట్టే.. మార్కెట్ విలువను బట్టి రైతుబజార్‌లోని 16 దుకాణాల సముదాయంలో ఒక్కొక్కదానికి రూ.2,200, వాణిజ్య సముదాయ దుకాణాలకు ఒక్కొక్క దానికి రూ.5,200 సర్కార్పాటను వేలానికి సిద్ధం చేశారు. కానీ రూ.5,200 అద్దె ఎక్కువ అవుతుందని వాటిని రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తగ్గించాలని ఇంతవరకు దుకాణాలకు వేలం నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం వేలం వేసిన తర్వాత ఆ దుకణాలకు టెండర్లు ఎవరూ వేయకపోతే మళ్లీ రెండోసారి పిలవడం అప్పుడు రానట్లయితే మూడోసారి టెండర్లను రీకాల్చేస్తూ అద్దెలో మార్పులు చేర్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. దుకాణాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో టెండర్లను ఇదివరకే పిలిచి ఉంటే ఇప్పటివరకు మార్కెట్‌కు రూ.30 లక్షల ఆదాయం వచ్చేది. ఇకనైనా పాలకులు, అధికారులు పట్టించుకుని వేలం వేసి దుకాణాలను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
‘బెల్ట్’ తీసేశారు
సాక్షి, నరసన్నపేట (శ్రీకాకుళం): పచ్చటి సంసారాల్లో చిచ్చురేపిన మద్యం మహమ్మారికి రోజులు దగ్గరపడ్డాయి. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మద్యం మహమ్మారి నిర్మూలను చికిత్స ప్రారంభించారు. ఒక్కసారిగా ఈ వ్యాధిని నిర్మూలించడం వీలుకాదని ముందే గ్రహించిన ఆయన విడతల వారీగా తుదముట్టిద్దామని పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా మొదటి విడతగా బెల్ట్‌షాపుల నిర్మూలనకు ఇచ్చిన ఆదేశాలు నరసన్నపేట నియోజకవర్గంలో విజయవంతమయ్యాయి. గ్రామాల్లో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల క్రితం గ్రామాల్లో పరిస్థుతులు ఒకలా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థులు పూర్తిగా మారాయి. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయమే కారణమంటూ మహిళా లోకం పొగడ్తలతో ముంచెత్తుతుంది. బెల్ట్‌షాపుల మూతకు గ్రామాల్లో పెద్దలు కూడా సహకరించారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఒక్క పిలుపుతో నాలుగు మండలాల్లో ఉన్న బెల్ట్ షాపులన్నీ దాదాపుగా మూతపడ్డాయి. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి కూడా ఎన్నికల సమయంలో బెల్ట్ షాపులను మూతవేస్తామని హమీ ఇచ్చారు. ఆ హామీ తుంగలోకి తొక్కడంతో.. బెల్ట్ షాపులు తగ్గడానికి బదులు మరిన్ని పెరిగాయి. మద్యం అమ్మకాలపై నెలవారీ టార్గెట్లు ఇవ్వడంతో ఎక్సైజ్ సిబ్బంది కూడా ఎంత తాగిస్తే అంతగా లక్ష్యం సాధిస్తామని బెల్ట్ షాపులను అప్పట్లో ప్రోత్సహించారు. 2014కు ముందు గ్రామాల్లో వీధికో బెల్ట్ షాపు ఉంటే గత ప్రభుత్వ అధినేత పుణ్యమా అని వీధికి నాలుగైదు వెలిశాయి. నరసన్నపేట పట్టణంలో అయితే సందు, సందులో బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బయటకు ఒకలా ప్రకటనలు చేయడం, లోపల ఆదేశాలు మరోలా ఇవ్వడంతో బెల్ట్ షాపులు మూత అనేది కేవలం ప్రకటలనకే పరిమితం అయింది. నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల వివరాలు.. మండలం బెల్ట్ షాపులు ప్రస్తుతం నడుస్తున్నవి నరసన్నపేట 310 0 పోలాకి 160 0 జలుమూరు 110 0 సారవకోట 90 0 మాటే శాసనం.. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘నా మాటే శాసనం’ అన్న తీరులో జగన్మోహన్రెడ్డి ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేయడంతో వారం రోజుల్లో బెల్ట్ షాపులు మూతపడ్డాయి. సీఎం ఆదేశాలను విధిగా నరసన్నపేట నియోజకవర్గంలో కూడా అమలు కావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్థానిక ఎక్సైజ్ అధికారులకు గట్టిగా చెప్పారు. బెల్ట్ షాపులకు మద్యం ఇస్తే లైసెన్స్ ఉన్న షాపులపై కేసులు పెట్టాలని, గ్రామాల్లో గొలుసు దుకాణాలు మూత పడాల్సిందేనని, గ్రామాల్లో మద్యం లభిస్తున్నట్లు తెలిస్తే పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న స్థానిక సీఐ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని ఎక్సైజ్ సిబ్బంది జూలు విదిల్చారు. దీంతో గ్రామాల్లోని బెల్ట్ షాపులన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం మద్యం కేవలం లైసెన్స్ ఉన్న షాపుల్లోనే లభిస్తుంది. ఈ షాపుల్లో కూడా రెండు బాటిళ్ల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. నరసన్నపేట ఎక్సైజ్(సీఐ) స్టేషన్ పరిధిలో ఉన్న జలుమూరు, పోలాకి, నరసన్నపేట మండలాల్లో దాదాపుగా అన్ని బెల్ట్ షాపులు మూసివేశారు. వీటిని నడిపిన వారు ప్రత్యామ్నాయ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మద్యం మహమ్మారి నిషేధానికి సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న మొదటి ప్రయత్నం విజయవంతం అయింది. కోటబొమ్మాళి సర్కిల్ సీఐ పరిధిలో ఉన్న సారవకోట మండలంలో కూడా మద్యం అనధికార షాపులు మూతపడ్డాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 21 లైసెన్స్డ్ షాపులున్నాయి. ప్రస్తుతం వీటిల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. గత పది రోజుల్లో మద్యం అమ్మకాలు 40 శాతం మేరకు తగ్గాయి. ఎక్సైజ్ సిబ్బందికి గ్రామాల దత్తత.. నరసన్నపేట సర్కిల్ స్టేషన్ పరిధిలో ఉన్న 12 మంది పోలీసులు, ముగ్గురు ఎస్ఐలు రెవెన్యూ గ్రామాల వారీగా దత్తత తీసుకున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలను వీరి నుంచి ఏ రోజు నివేదికలు ఆరోజు సీఐ తీసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించే వారికి సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు, పెద్దల నుంచి బెల్ట్‌షాపుల మూతకు ప్రోత్సాహం లభించిందని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. అక్రమ మద్యం ఉంటే కేసులు నిబంధనలకు మించి మద్యం బాటిళ్లు అధికంగా ఉన్నా, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనధికార మద్యం ఉంటే కేసులు నమోదు చేస్తాం. బెయిల్ రాకుండా సెక్షన్లు వేస్తాం. ప్రస్తుతం కేవలం లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మద్యం అమ్మకాలకు పరిమితం చేశాం. ఎవరైనా లైసెన్స్డ్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు చేస్తే వారి లైసెన్స్‌లు పూర్తిగా రద్దు చేస్తాం. –శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట గ్రామాల్లో ప్రశాంతత గత ప్రభుత్వ కాలంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉండటంతో ప్రధానంగా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. వై.ఎస్.జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యం బెల్ట్ షాపులు నిర్మూలకు చర్యలు తీసుకోవడంతో గ్రామాల్లో బెల్ట్ షాపులు కనిపించడం లేదు. వారం రోజులుగా గ్రామాల్లో ప్రశాంతత కనిపిస్తుంది. మహిళలు సంతోషంగా ఉన్నారు. – పుట్టా ఆదిలక్ష్మి, మాజీ సర్పంచ్, వీఎన్‌పురం, నరసన్నపేట -
స్వీయ తప్పిదమే పతన కారణమా?
పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో 1990 దశకంలో సరళీకృత ఆర్థిక విధానం అమలు చేయటం మొదలు పెట్టగానే అంతవరకు ప్రభుత్వ ఏకస్వామ్య విధానాల వలన రక్షణ పొందిన చాలా రంగాల్లో ప్రైవేట్ రంగ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విమానయాన రంగాన్ని కూడా సరళీకరించారు. దానిలో భాగంగా ఆనాడు మోడీ లుఫ్ట్, దమానియా, ఎన్ఈపీసీ, జెట్ ఎయిర్వేస్ లాంటి విమానయాన సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మూడు నాలుగేళ్లలోనే వాటిలో చాలా సంస్థలు మూతపడినా, జెట్ ఎయిర్‌లైన్స్ మాత్రం అప్పటి నుంచి తన కార్యక్రమాలను సాగిస్తూ, నష్టాల దృష్ట్యా ఒక వారం క్రితం తన విమాన సర్వీసులను నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్కు రుణాలు మంజూరు చేసిన సంస్థలు ఉదారంగా కొంత ఆర్థిక సహాయం ఈ సమయంలో అందించి ఉంటే విమాన సంస్థ మూసేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని, పనిచేసే ఉద్యోగులకు ఆసరాగా ఉండేదని, విమానయానంలో ధరలు పెరగకుండా చూడటానికి కూడా తోడ్పడేదని కొందరి వాదన. ఈ వాదన సరికాదు. ఈ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఒకరోజు, కొద్ది కాలంలో వచ్చే అంశం కాదు. సంస్థకు ఆర్థిక సమస్యలు చాలాకాలం నుంచే ప్రారంభమై ఉంటాయి. తొలి దశలో రుణాలు మంజూరు చేసిన సంస్థలు సరైన పాత్ర పోషించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. జెట్ ఎయిర్వేస్ను కాపాడుకునే అవకాశాలు అప్పుడు మెండుగా ఉండేవి. పూర్తిగా మూసివేసే పరిస్థితి వచ్చినప్పుడు రుణ సహాయం చేయడం వల్ల సంస్థ కొన్నాళ్ళు ఆక్సిజన్‌పై బతకడానికి సహాయపడుతుందేమో కానీ సంస్థ పరిస్థితిలో ఎటువంటి మౌలికమైన మార్పు తీసుకొని రావు. ఈనాడు ఇచ్చే సహాయం బూడిదలో పోసిన పన్నీరు గానే మిగిలిపోతుంది. బ్యాంకులు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నా భావన. జెట్ విమానయాన సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో నిర్వహించిన పర్మిట్ కోటా లైసెన్స్ రాజ్‌లో చాలామంది ఆశ్రిత పక్షపాతం పెట్టుబడిగా ఎదిగిన పెట్టుబడిదారులు ఉన్నారు. రాజకీయ నేతలను, అధికారులను సంతృప్తి పరచడం ద్వారా వారి సహాయ సహకారాలతో వ్యాపార లావాదేవీలు జరిపిన వ్యక్తులు వీరందరూ. వీరు సరళీకృత ఆర్థిక విధానంలో వచ్చే పోటీ పరిస్థితిని తట్టుకుని నిలబడే సామర్థ్యం శక్తి ఉన్న వ్యక్తులు కారు. ఆ కోవకు చెందిన వ్యక్తి జెట్ ఎయిర్వేస్ అధినేత. ఇండిగో స్పైస్ జెట్ లాంటి ఆర్భాటం లేని విమానయాన సంస్థల పోటీని ఈయన తట్టుకోలేకపోయారు. ఎక్కువ ధర వెచ్చించి కొన్న సహారా విమాన సంస్థ ఎయిర్ దక్కన్ కింగ్ ఫిషర్ సంస్థకు ఏరకంగా గుది బండ అయిందో జెట్ ఎయిర్వేస్కీ అట్లాగే అయింది. వీటన్నిటికీ మించి టికెట్ల అమ్మకం కోసంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ ఏజెంట్లకు చెల్లించిన రుసుము సంస్థ ఖర్చులలో 12 శాతం ఉంది. ఇండిగో లాంటి సంస్థలకు ఇది రెండు శాతం మాత్రమే. 2017– 18లో రూ.2,826 కోట్లు ఈ పద్దు కింద ఏజెంట్లకు చెల్లించడమైంది. గత నాలుగేళ్లలో ఈ పద్దు కింద కమీషన్‌గా చెల్లించిన మొత్తం రూ. 10 వేల కోట్లు. ఈరోజు ఈ సంస్థ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ మొత్తం కన్నా ఇది ఎక్కువ. జెట్ ఎయిర్వేస్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి కంపెనీని ప్రమోట్ చేసిన నరేష్ గోయల్ మాత్రమే కాక మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రధానమైన అంశాన్ని విస్మరించటానికి కారణాలు చెప్పవలసిన బాధ్యత ఆడిటర్లకు, సంస్థలో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లకు ఉన్నది. సంస్థ వనరులను కొందరు బినామీలకు బదిలీ చేయటానికి యాజమాన్యం ప్రమోటర్స్ ప్రయత్నం చేశారా అనే విషయం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సరళీకృత ఆర్థిక విధానాలలో పనిచేసే ప్రైవేట్ సంస్థలు అన్నీ విజయవంతం కాకపోవచ్చు. పోటీ విధానంలో సమర్థ సంస్థలే దీర్ఘకాలంలో మనగలగటం జరుగుతుంది. అసమర్థ సంస్థలు మార్కెట్ ఆటుపోటులను ఎదుర్కోలేక మూతపడటం సహజమే. కానీ సంస్థ మూతపడటానికి కారణం ప్రమోటర్లు, యాజమాన్యం చేసిన అవినీతికర కార్యక్రమాలు అయితే ఆ ప్రమోటర్లు యాజమాన్యం దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే నిజమైతే వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. జెట్ ఎయిర్వేస్ సంస్థ విషయంలో మాత్రం సంస్థ మూత పడటానికి మార్కెట్ ప్రేరేపిత కారణాలకన్నా నిర్వహణ లోపాలు అనైతిక విధానాలు ప్రధాన కారణాలని అనిపిస్తున్నాయి. ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాలపై దృష్టి సారించి నిజాలు వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు -
తిరుపతి ఎయిర్పోర్ట్ తాత్కాలికంగా మూసివేత
సాక్షి, తిరుపతి: తిరుపతి విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రన్ వేలో ఏర్పడిన సమస్యలతో ఎయిర్పోర్ట్ అధికారులు అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్, విజయవాడ వెళ్లే విమానాలు నిలిపి వేయడంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఎయిర్పోర్ట్ మూసివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరికొన్ని గంటల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. -
ముగిసిన వార్షిక మండల పూజలు
-
17నుంచి మీసేవలు బంద్
చిత్తూరు, పలమనేరు: జిల్లాలోని మీసేవా కేంద్రాలు 17 నుంచి మూతపడనున్నాయి. రెండు వారాల క్రితం మీసేవా కేంద్ర నిర్వాహకులు సమ్మె నోటీసు జారీ చేశారు. ఇప్పటివరకూ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆపరేటర్ల సమ్మె ఖాయమైంది. జిల్లాలో 535 మీసేవా కేంద్రాలున్నాయి. 535 మంది ఆపరేటర్లతోపాటు మరికొందరు సహాయకులు వీటిపై ఆధారపడుతున్నారు. చాలీచాలని కమీషన్లు, అధిక పని ఒత్తిడి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కొన్నిచోట్ల కేంద్రాలు మూతపడ్డాయి. వీరు సమ్మెకు దిగితే పలు సేవలు ఆగిపోనున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులకు యువనేస్తం, కులం, ఆదాయ, స్థిరనివాసం ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు తప్పనట్టే. రైతులకు ఆర్ఓఆర్ అడంగుల్, ఈసీ, సీసీ, పట్టాదార్ పాసుపుస్తకాలు, జననమరణ ధ్రువీకరణ పత్రాలు లాంటి ముఖ్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సేవా కేంద్రాలకు తహసీల్దార్ కార్యాయాలకు ఉన్న లింకు తెగినట్టే. ప్రధాన డిమాండ్లు ఇవీ.. రూరల్ మీసేవా కేంద్రాలు 2003లో ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలోసేవలు 2012 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 36 శాఖలకు సంబం ధించిన 440 రకాల సేవలు మీసేవా కేంద్రాలద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. సేవలు పెరిగేకొద్దీ ఆపరేటర్లపై బాధ్యతలు, అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. కమీషన్లు పెంచకపోవడంతో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లోని ఆపరేటర్లకు ప్రభుత్వం 15వేల వేతనాలు ఇవ్వాలని, మీసేవా కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలను మంజూరు చేయాలని వీరు కొన్ని నెలలుగా కోరుతున్నారు. ఆధార్ కమీషన్ బకాయిలు విడుదల కాలేదు. స్కానింగ్ చార్జీ రూ.2 నుంచి రూ.5కు పెంచాలని కోరుతున్నారు. ఆపరేటర్ల బతుకులు ఘోరంగా మారాయి.. చాలీచాలని కమీషన్లతో కుటుంబాలను పోషిం చడం ఆపరేటర్లకు చాలా కష్టంగా మారింది. మా సమస్యలపై ఇప్పటికే అధికారులకు సమ్మె నోటీసులిచ్చాం. సమ్మె గడువు దగ్గరపడుతున్నా ఎవరూ స్పందించలేదు. దీంతో సమ్మె చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం. సూర్యకుమార్,మీసేవా ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించలేదు.. నాలుగేళ్లుగా మాకు పనిభారం పెరిగింది. అందుకు తగ్గట్టు కమీష న్లు రావడం లేదు. సెంట ర్ను నిర్వహించాలంటే నెలకు రూ.30వేల దాకా పట్టణాల్లో రూ.20వేల దాకా గ్రామాల్లో ఖర్చు వస్తోంది. ఆ లెక్కన ప్రభుత్వం నుంచి మాకు కమీషన్లు రావడం లేదు. దీంతో సమ్మెకు దిగాల్సి వచ్చింది. సమ్మె చేస్తామని చెప్పి14 రోజులైనా ప్రభుత్వం ఏమాత్రమూ స్పందించకపోవడం బాధేస్తోంది. శ్రీవాత్సవన్, మీసేవా ఆపరేటర్ల సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు -
తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ బ్యాంకులు
-
ప్రసారం సమాప్తం
ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? అది సాహిత్యం అయినా, సన్నివేశం అయినా.. ఇట్సే ‘రేపీ’. మీటూ ఉద్యమం పుణ్యమా అని కొత్తగా కలిగిన ఈ స్పృహతో యు.ఎస్. రేడియో స్టేషన్లు.. డెబ్బై నాలుగేళ్లుగా క్రిస్మస్ సీజన్లో తాము ప్రసారం చేస్తున్న ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అనే ఆస్కార్ అవార్డు సాంగ్‌ను తమ ప్లే లిస్ట్‌లోంచి ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తున్నాయి. కొన్ని పాటలు, కొన్ని పువ్వులు సీజన్ వచ్చేసిందని ముందే చెప్పేస్తాయి. యు.ఎస్. రేడియో స్టేషన్ల నుంచి ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అనే హాలీడే సాంగ్ వినిపించిందంటే క్రిస్మస్ సీజన్ మొదలైనట్లే. అయితే ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ మొదలైనా.. ఆ పాట ఏ రేడియో స్టేషన్ నుంచీ వినిపించడం లేదు! యు.ఎస్.ను చూసి కెనడా కూడా స్టాప్ చేసింది. ఇంకా మరికొన్ని దేశాల్లోని రేడియో స్టేషన్లు 1944 నాటి ఆ క్లాసిక్ డ్యూయట్‌ను ఈ ‘మీటూ’ టైమ్‌లో ప్లే చెయ్యకపోవడమే క్షేమకరమన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. బ్రాడ్వే (రంగస్థలి) ఆస్థాన గీత రచయిత ఫ్రాంక్ లోస్సర్ రాసిన ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ ను 1949 హాలీవుడ్ మూవీ ‘నెప్ట్యూన్స్ డాటర్’లోకి తీసుకున్నారు. సినిమాలో ఎస్తర్ విలియమ్స్, రికార్డో మాంటల్బేన్ మధ్య పాటను చిత్రీకరించారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆస్కార్ అవార్డు’ కూడా పొందిన ఆ పాటకు ఇన్నేళ్లలో అనేక వెర్షన్లు వచ్చాయి. మొన్న మొన్న ఆమెరికన్ గాయని లేడీ గాగా.. రివర్స్ వెర్షన్లో ఆ పాటను తీసుకున్నారు. అసలుపాటలో అతడు ఆమెను వెళ్లకుండా ఆపుతుంటే.. గాగా వీడియోలో ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ (బేబీ, బయట చలిగా ఉంది) అంటూ ఆమె అతడిని వెళ్లకుండా ఆపుతుంటుంది. ఒరిజినల్ పాటను రాసినవారు కానీ, పాటకు యాక్ట్ చేసివారు గానీ ఇప్పుడు లేరు. పాటొక్కటే బతికి ఉంది. ఇప్పుడా పాట కూడా ‘మీటూ’ పెనుగాలులకు రెపరెపలాడుతోంది. ‘మీటూ’కు, ఈ పాటను ఆపేయడానికి సంబంధం ఏంటి? ఏంటంటే.. పాటపై ఎప్పటి నుంచో బలహీనమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మీటూ ఉద్యమం చురుగ్గా ఉన్న ఈ టైమ్‌లో అవి బలమైన అభ్యంతరాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉండొచ్చని స్టేషన్ డైరెక్టర్ల అనుమానం. పాటలోని సాహిత్యం, పాట సన్నివేశం.. ‘స్త్రీపై అత్యాచారం జరుపుతున్నట్లుగా’ ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. ‘సాంగ్ కాదు.. ఇట్సే రేపీ’ అని అప్పట్లోనే ముఖం చిట్లించిన వారున్నారు. పాట ‘కాల్ అండ్ రెస్పాన్స్’ స్టెయిల్లో సాగుతుంది. ఒకరు పాడుతుండగనే, దానికి లింక్‌గా రెండో వారు అందుకోవడం! ఎలాగంటే.. ‘లాయర్ సుహాసిని’ సినిమాలో సుహాసినికి, భానుచందర్‌కి మధ్య ఒక డ్యూయెట్ ఉంటుంది. ‘దివిని తిరుగు మెరుపు లలన’ అంటాడు అతడు. వెంటనే ‘సామజ వరగమనా’ అంటుంది ఆమె. ‘కరుణ కరిగి భువికి దిగిన’ అంటాడు అతడు. ‘సామజ వరగమనా..’ అంటుంది మళ్లీ ఆమె. పాటంతా అంతే.. ఆమె సామజ వరగమనా అనే మాటొక్కటే అంటుంటుంది. ఇలాంటిదే ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో శ్రీకాంత్, సంగీతల మధ్య డ్యూయెట్. ‘దొండపండు లాంటి పెదవే నీది’ అంటాడు శ్రీకాంత్. ‘అబద్ధం.. అంతా అబద్ధం’ అంటుంటుంది సంగీత. ‘కాల్ అండ్ రెస్పాన్స్’ ఫార్మాట్. ఇప్పుడీ క్రిస్మస్ సాంగ్‌లో.. ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అని అంటుంటాడు అతడు, ‘నేను వెళ్తాను’ అని ఆమె ఎంత మొత్తుకుంటున్నా వదలకుండా. ‘ఐ రియల్లీ కాంట్ సే’ అని మొదలు పెడుతుంది ఆమె. వెంటనే అతడంటాడు ‘బేబీ ఇట్స్ కోల్డ్ ఔట్‌సైడ్’ అని. విషయం ఏంటంటే.. ఆ సాయంత్రం ఆమె అతడి గదిలో ఉంటుంది. ఇంటికి వెళ్లాలని లేస్తుంటుంది. అతడు లేవనివ్వడు! ఆమెతో ‘గడపాలని’ ఉంటుంది. అందుకే బయట చల్లగా ఉందనీ, ఆ టైమ్‌లో క్యాబ్‌లు దొరకవని, గడ్డకట్టుకుని పోతావనీ, న్యూమోనియా వచ్చి ఛస్తావనీ.. ఏదో ఒకటి చెప్పి అడ్డుకుంటుంటాడు. వెళ్లేందుకు ఆమె హ్యాట్ పెట్టుకుంటుంటే దాన్ని తీసేస్తూ ఉంటాడు. ‘వెళ్లనివ్వు ప్లీజ్..’ అని బతిమాలుకుంటుంటే.. కాలు, చెయ్యి అడ్డుపెడుతుంటాడు. ఇదంతా పాటలా, మాటలా సాగుతుంటుంది కానీ.. సూక్ష్మంగా ఆలోచించేవారికి.. నిజమే, ‘రేపీ’లానే అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? ఇంకా.. అతడు ఆమెకు డ్రింక్ ఇస్తుంటాడు. ఆ డ్రింక్ గ్లాస్ అందుకుని ‘ఇందులో ఏం కలిపావు? అని అడుగుతుంది. మాట మార్చి ఏదో చెప్తాడు. ఇంకో చోట.. ‘నో.. నో.. నో..’ అంటుంది. వినకుండా.. ‘దగ్గరికి వస్తే ఏమైనా అనుకుంటావా’ అని ఒంటి మీద చెయ్యి వెయ్యబోతాడు. అతడు పట్టుకోబోవడం, అమె వదిలించుకోబోవడం.. ఇలా ఉంటుంది. ఇప్పటి అతిసున్నిత సమాజానికి సెక్సువల్ అసాల్టే అది. అందుకే యు.ఎస్. రేడియో స్టేషన్లు ‘ఇంతటితో ఈ పాట ప్రసారం సమాప్తం’ అంటున్నాయి. రచయిత ఎంత మంచి ఉద్దేశంతోనైనా రాయొచ్చు. అందులో చెడు ఉద్దేశం ‘పాప్–అప్’ అయి (పైకి లేచి) కనిపిస్తే మాత్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయిన వాళ్లని నిందించడానికి లేదు. పాటనైనా, పుస్తకాన్నైనా తీసుకెళ్లి పొయ్యిలో పడేయాల్సిందే. ఫ్రాంక్ లోస్సర్ మొదట ఈ పాటను తనను, తన భార్యను ఉద్దేశించి రాసుకున్నారు. స్టేజ్ షోలలో ఇద్దరూ కలిసి పాడేవారు. ఆ పాటను ఎం.జి.ఎం. కొనుక్కుని సినిమాలో పెట్టుకుంది. పాటగా విన్నా, పాత్రలతో చూసినా ఆ యుగళగీతాన్ని అప్పుడంతా ఇష్టపడ్డారు. వింటర్ థీమ్‌తో వచ్చింది కాబట్టి క్రమేణా అది ‘క్రిస్మస్ సాంగ్’ అయింది. పాట రచయిత ఫ్రాంక్ లోస్సర్ మాధవ్ శింగరాజు -
నేడు మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈతో పాటు బులియన్, ఫారెక్స్, మనీ మార్కెట్లు ఇవాళ పని చేయవు. అక్టోబర్ 1 న సెన్సెక్స్ 299 పాయింట్లు పుంజుకుని 36,526.1 వద్ద ముగిసింది. నిఫ్టీ 77.8 పాయింట్లు లాభపడి 11,008.3 వద్ద ముగిసింది. బాపూజీ 150వ జన్మదినం సందర్భంగా యావద్దేశం ఘన నివాళులర్పిస్తోంది. ముఖ్యంగా దేశాధ్యక్షుడు రామ్‌నాధ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు మహాత్ముడికి శ్రద్ధాంజలి ఘటించారు. -
4వేల పోర్న్ సైట్లను మూసేసిన చైనా
బీజింగ్: గత 3 నెలలుగా ప్రత్యేక చర్యలు ప్రారంభించిన చైనా ప్రభుత్వం దాదాపు 4,000 పోర్న్ వెబ్సైట్లను, ఖాతాలను మూసివేసింది. మేలో ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఆగస్టుచివరినాటికి 120 ఉల్లంఘనలను గుర్తించింది. తప్పు సరిదిద్దుకోవాలంటూ 230 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. హానికరంగా ఉన్నట్లు భావించిన 1.47 లక్షల అంశాలను తొలగించినట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. కాపీరైట్ ఉల్లంఘనలు, విలువలను దిగజార్చే, అశ్లీలం, అసభ్యత ఉన్న ఆన్లైన్ నవలలపైనా అధికారులు దృష్టి పెట్టినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో దేశవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో 22వేల పోర్న్ సైట్ల మూసివేతతోపాటు దాదాపు 11 లక్షల హానికర అంశాలను నెట్ నుంచి తొలగించామని ప్రభుత్వం పేర్కొంది. -
ఏనుగుల కారిడార్‌లో రిసార్టులపై కొరడా
న్యూఢిల్లీ: నీలగిరిలోని ఏనుగుల కారిడార్ పరిధిలో అనుమతులు లేకుండా నడుస్తున్న హోటళ్లు, రిసార్టులపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఆ ప్రాంతంలోని 27 రిసార్టులు, హోటళ్లను మూసివేయాలని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నీలగిరి జిల్లాలోని ఏనుగుల కారిడార్‌లో చట్ట విరుద్ధంగా రిసార్టులు, హోటళ్లను నడుపుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏనుగులు సంచరించే ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్టం ఉంది. అయినా రిసార్టులు, హోటళ్ల నిర్మాణాలను ఎలా చేపడతారు?’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వర్షాకాలంలో సుమారు 18వేల ఏనుగులు నీలగిరి కారిడార్లోకి ప్రవేశించాయని పిటిషనర్ తెలపగా.. ఆ ప్రాంతంలో ఉన్న రిసార్టులు, హోటళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. -
ఒక్క రోజులోనే మారిన అన్న క్యాంటీన్.. గేట్లకు తాళం
-
ఐఆర్సీటీసీ వెబ్సైట్, ఇతర రైల్వే సర్వీసులు క్లోజ్
రైల్వే ప్రయాణికులకు ఒక గమనిక. దేశీయ రైల్వే టిక్కెటింగ్ వెబ్సైట్ ఐఆర్సీటీసీ, ఇతర ఆన్లైన్ సర్వీసులు కొన్ని గంటల పాటు మూతపడబోతున్నాయి. గురువారం రాత్రి 10.45 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని రైల్వే పేర్కొంది. రైల్వేకు సంబంధించిన అన్ని వెబ్సైట్లు, యాప్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం కోసం ఆరు గంటల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీనిలో ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఆన్లైన్ టిక్కెటింగ్ సిస్టమ్‌ను మరింత స్నేహపూరితంగా చేయడం కోసం రైల్వే కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. దీనికోసంవెబ్సైట్లను, యాప్స్‌ను దేశీయ రైల్వే అప్‌గ్రేడ్ చేస్తోంది. సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేసే సమయంలో ప్రయాణికులకు ఐవీఆర్ఎస్ టచ్ స్క్రీన్, కాల్ సెంటర్, 139 ఎంక్వైరీ సిస్టమ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవు. -
దాడి చేయనని హామీ ఇస్తే అణ్వస్త్రాలను త్యజిస్తాం
సియోల్/వాషింగ్టన్: కొరియా యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు అధికార ప్రకటన చేయటంతో పాటు తమ దేశంపై దాడి చేయనని అమెరికా హామీ ఇస్తే అణ్వాయుధాలను త్యజిస్తామని ఉత్తర కొరియా తెలిపింది. ఇటీవల జరిగిన అగ్రనేతల చారిత్రక సమావేశం సందర్భంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రతిపాదన చేశారని దక్షిణకొరియా అధ్యక్షుడి అధికార ప్రతినిధి యూన్ యంగ్–చాన్ తెలిపారు. దీంతోపాటు వచ్చే మేలో అణు పరీక్షల ప్రాంతాన్ని మూసి వేయటంతోపాటు ఈ కార్యక్రమానికి అమెరికా, దక్షిణ కొరియా నిపుణులు, మీడియాను ఆహ్వానిస్తామని కిమ్ తెలిపారన్నారు. తాము అణ్వస్త్ర వ్యాప్తికి వ్యతిరేకమని, ఈ విషయంలో పారదర్శకతతో ఉన్నామని అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పేందుకే కిమ్ ఈ ప్రతిపాదన చేశారని చాన్ చెప్పారు. ‘మేం అమెరికాతో తరచుగా చర్చలు జరిపితే, రెండు దేశాల మధ్య విశ్వాసం పెంపొందుతుంది. అప్పుడు యుద్ధ వాతావరణం సమసిపోతుంది. అలాంటప్పుడు మాకు అణ్వాయుధాలతో పనే ముంటుంది?’ అని కిమ్ తెలిపారన్నారు. -
నగరంలో ఫ్లై ఓవర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: సాబ్ మెహరాజ్ జగ్నికే రాత్ సందర్భంగా శనివారం నగరంలోని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు. జగ్నికే రాత్ నేపథ్యంలో ముస్లింలు ఈరోజు రాత్రి ప్రార్థనలు చేయనున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాత్రి 10 గంటల తర్వాత ఫ్లై ఓవర్లు మూసివేస్తున్నట్టు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ చౌహన్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పీవీ ఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే, లంగర్‌హౌస్ ఫ్లై ఓవర్లు మాత్రం యధావిధిగా ఉంటాయన్నారు. వీటికి మాత్రమే మినహాయింపు ఉందని రాకపోకలు సాగించవచ్చని ఆయన పేర్కొన్నారు. మరో వైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ చౌరస్తా కేంద్రంగా శనివారం రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. -
ఏడాదిగా రెండు పాఠశాలల మూత
చింతూరు (రంపచోడవరం): మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అధికారులు ఉన్నారనడానికి ఇదోక సాక్ష్యం. ఒక పంచాయతీ పరిధిలోని రెండు పాఠశాలలు ఏడాదిగా మూతపడి ఉన్నట్టు తమకు సమాచారం అందలేదని అధికారులు తాపీగా చెబుతున్నారు. చింతూరు మండలంలోని చదలవాడ పంచాయతీ పరిధిలోని లక్కగూడెం, చదలవాడల్లో రెండు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 30 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. లక్కగూడెం పాఠశాలను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే తెరవలేదు. గతేడాది సజావుగానే నడిచినా టీచర్ లేక పాఠశాల తెరువలేదు. లక్కగూడెంతో పాటు కొండరెడ్ల గుంపునకు చెందిన పిల్లలు కూడా చదువుకుంటున్నారు. విద్యకు దూరమైన పిల్లలు పొలం పనులకు, పశువులు కాసేందుకు వెళుతున్నారు. చదలవాడలోనూ అదే పరిస్థితి చదలవాడ పాఠశాలదీ ఇదే పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక టీచర్ దేవి బదిలీ కావడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆ గ్రామస్తులు తెలిపారు. అనంతరం గ్రామానికే చెందిన ఓ యువకుడిని స్కూల్లో వలంటీర్‌గా నియమించారు. విద్యార్థులకు కొంతకాలం పాఠాలు బోధించిన అతడికి వేతనం ఇవ్వకపోవడంతో మానేశాడు. అప్పటి నుంచీ చదలవాడ పాఠశాల మూతపడి ఉందని ఆ గ్రామస్తులు తెలిపారు. విద్యకు దూరమైన కొంతమంది పిల్లలకు అంగన్వాడీ టీచర్ మడివి బాయమ్మ పాఠాలు చెబుతున్నారు. ఈ విషయం అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దీపాలార్పేస్తున్న తెలుగు తమ్ముడు
పిఠాపురం: ‘దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే’ అనేది నానుడి ... కానీ ఈ ఊళ్లోని రాముడి పెళ్లికి మాత్రం నేనే పెద్దనని ఓ టీడీపీ నేత హంగామా చేయడం పలువురిని విస్మయపరుస్తోంది. గ్రామమంతా నచ్చజెప్పినా ‘ససేమిరా’ అంటూ మొండికేయడం విస్తుబోయేలా చేస్తోంది. పిచ్చి ముదిరి రోకలిని మోకాలికి చుట్టుకుంటానన్న చందంగా బుధవారం మరింత ముందుకు వెళ్లి ఒక్క రాముడి వివాహమే కాదు గ్రామంలో ఏ దేవాలయంలోనూ పూజలు చేయనిచ్చేది లేదని ఘర్షణలకు దిగడంతో గ్రామస్తులంతా ఒక్కటై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... రాముడి పేరుతో వెలిసిన శ్రీరాంపురం గ్రామంలో సాక్షాత్తు శ్రీరాముల కల్యాణాన్ని సోమవారం నిలిపివేసి ఆలయానికి తాళాలు వేసిన టీడీపీ ఎంపీపీ భర్త పిర్ల గంగాధర్ మరో అపచారానికి పాల్పడ్డాడు. రాముల వారి ఆలయానికి తాళాలు వేయడంతో ఆ నేత కోపం తీరలేదో ఏమో ఊళ్లో ఉన్న అన్ని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలు జరపరాదంటూ తాళాలు వేశాడు. చివరికి గ్రామ దేవత ఆలయానికి సైతం తాళాలు వేసిన ఆ నేత గ్రామం నడిబొడ్డున ఉన్న రామాంజనేయ విగ్రహం వద్ద జైగంట కూడా ఎవరూ కొట్టరాదని హుకుం జారీ చేస్తూ ఆ గంటను పీకించేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలకు తాళాలు వేయడాన్ని తీవ్రంగా పరిగణించిన గ్రామస్తులు తిరగబడడంతో కాస్తా వెనక్కితగ్గి గ్రామ దేవత ఆలయం తాళాలు తీయించడానికి అంగీకరించాడు. అయితే భక్తులు ఎటువంటి పూజలు చేయరాదని భీష్మించడంతో గ్రామస్తులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామ సర్పంచి భర్త నాగళ్ల వెంకటరమణ తెలిపారు. ‘సాక్షి’పై చిందులు... సీతారామ కల్యాణాన్ని నిలిపివేయించి ఆలయానికి తాళాలు వేసిన సంఘటనపై ‘రామ రామ’ అనే శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 27వ తేదీన కథనం ప్రచురితమైంది. దీంతో ఆ ఎంపీపీ భర్త ‘సాక్షి’పై చిందులు తొక్కాడు. తనపైనే వ్యతిరేకంగా వార్తలు రాస్తారా...వారి అంతు చూస్తానంటూ హెచ్చరించడం గమనార్హం. తనపంతం నెగ్గే వరకు గ్రామంలో ఏ దేవుడికీ పూజలు జరగవని...ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటే సవాల్ విసిరాడు. జరిగిన ఘటనలు వార్తలుగా రాస్తుంటే ఇలా హెచ్చరించడం సమంజసంగా లేదని గ్రామస్తులు ‘సాక్షి’కి బాసటగా నిలిచారు. -
స్టాక్‌మార్కెట్లకు వరుస సెలవులు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లకు లాంగ్ వీకెండ్ ఇది. వరుసగా నాలుగు రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు సెలవులొచ్చాయి. గురువారం మహావీర్ జయంతి, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, మనీ మార్కెట్లు సెలవును పాటిస్తున్నాయి. ఇక శని, ఆదివారాలు మార్కెట్లకు సెలవు. ఈ నేపథ్యంలో దేశీ ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లు తిరిగి సోమవారం( ఏప్రిల్, 2) యథావిధిగా పనిచేస్తాయి. -
కార్తీకి ఐదు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కార్తీ చిదంబరంను ఐదురోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. కార్తీకి సంబంధించి ఈ కేసుల్లో ఆశ్చర్యకర సాక్ష్యాలున్నాయని వీటిని రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ విజ్ఞప్తి మేరకు మార్చి 6 వరకు కార్తీ కస్టడీని పొడిగిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు జడ్జి సునీల్ స్పష్టం చేశారు. కార్తీ విదేశాలకు వెళ్లి అక్రమ నిధులు దాచుకున్న వివాదాస్పద బ్యాంకు అకౌంట్లను క్లోజ్ చేశారని, దీనికి సంబంధించి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఆధారాలున్నాయని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఒకరోజు కస్టడీ ముగియటంతో సీబీఐ గురువారం ప్రత్యేక కోర్టుముందు కార్తీని ప్రవేశపెట్టింది. ఈ సమయంలో చిదంబరం, ఆయన భార్య నళిని (ఇద్దరూ సీనియర్ లాయర్లే) కోర్టు హాల్లో ఉన్నారు. వీరిద్దరూ కార్తీతో కాసేపు మాట్లాడారు. కుట్రను బయటపెట్టండి: జడ్జి కార్తీ కస్టోడియల్ విచారణ ద్వారా ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన భారీ కుట్ర బయటపెట్టాలని జడ్జి సీబీఐకి సూచించారు. సీబీఐ చూపించే దస్తావేజులు, సహ నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాలతో కార్తీ అసలు విషయాన్ని అంగీకరించేందుకు ఈ కస్టడీ అవసరమన్నారు. కేసు డైరీ, రోజువారీ నివేదికల ఆధారంగా ఈ కేసు ఇప్పుడు కీలకదశలో ఉందని.. విచారణ ద్వారా మరిన్ని విషయాలు బయటపడే∙అవకాశం ఉన్నందునే కస్టడీ పొడిగించినట్లు జడ్జి తెలిపారు. సీబీఐ కస్టడీ సందర్భంగా న్యాయవాది సహకారం (రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున) తీసుకునేందుకు కార్తీకి స్వేచ్ఛ కల్పించాలని ఆదేశించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుపై ఎఫ్ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి) అనుమతులను విచారించిన ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు కమిటీ ముందు కార్తీ పలువురు సహనిందితులు పేర్కొన్న విషయాలను అంగీకరించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. రాజకీయ దురుద్దేశం లేదు సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ వాదిస్తూ.. ‘ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిన అరెస్టు కాదు. ఆర్టికల్ 21 ప్రకారమే విచారణ జరుగుతోంది. విదేశాలకు వెళ్లి కార్తీ చిదంబరం ఏం చేశాడో తెలిపే ఆశ్చర్యకర సాక్ష్యాలున్నాయి’ అని జడ్జికి తెలిపారు. కార్తీ సాధారణ మెడికల్ చెకప్ సందర్భంగా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయనప్పటికీ బుధవారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని కార్డియాక్ కేర్ యూనిట్లో చికిత్స చేశారు. తర్వాతే గురువారం సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. హాస్పిటల్లో చేర్చినందున కార్తీ ఒకరోజు కస్టడీ వృధా అయ్యిందికనుకే కస్టడీని పొడిగించాలని జడ్జిని కోరారు. కార్తీ తరపున వాదిస్తున్న అభిషేక్ సింఘ్వీ.. ‘గతేడాది మేలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ఆయన్ను 22 గంటలపాటు విచారించిన సీబీఐ ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయింది. సహకరించటం లేదనే కారణంతోనే అరెస్టు చేస్తారా? ఇది దారుణం’ అని అన్నారు. మెహుల్ చోక్సీకి మేలుచేసేలా.. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన 80:20 బంగారు దిగుమతి పథకం ద్వారా చాలా మంది బంగారు, వజ్రాభరణాల వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీలోని బీజేపీ సభ్యులు ఆరోపించారు. పీఎన్బీ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ మనీలాండరింగ్ కేసూ ఇందులో భాగమేనన్నారు. గురువారం రెవెన్యూ కార్యదర్శి, ఈడీ ఉన్నతాధికారులు, ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ), ఎక్సైజ్, కస్టమ్స్ కేంద్ర మండలి (సీబీఈసీ)ల అధికారులు పీఏసీ సబ్ కమిటీ ముందు హాజరయ్యారు. యూపీఏ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా దేశ ఖజానాకు రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందంటూ.. 2016లో కాగ్ ఇచ్చిన నివేదికపై వీరు చర్చించారు. ఈ పథకంలో భాగంగా వజ్రాల వ్యాపారులు ఒక డాలర్ సంపాదించేందుకు ప్రభుత్వం సుంకం రూపంలో రూ.221.75 చెల్లించింది. దీని ద్వారా దేశం నుంచి నల్లధనం బయటకెళ్లి వైట్ మనీగా తిరిగొచ్చిందని వారన్నారు. కోర్టు బయట కార్తీ. కోర్టుకు వస్తున్న కార్తీ తల్లిదండ్రులు నళిని, చిదంబరం విచారణ లిస్టులో చిదంబరం కార్తీతోపాటు చిదంబరం సీబీఐ, ఈడీ విచారణ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ ఒప్పందంలో విదేశీ పెట్టుబడుల ఒప్పందానికి అనుమతివ్వటంలో చిదంబరం పాత్ర ఉందని సీబీఐ వాదిస్తోంది. కాగా, ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి మే 2007లో ఎఫ్ఐపీబీ ఇచ్చిన అనుమతులు తర్వాతి పరిణామాలపై కార్తీ ఏవిధంగా ఒత్తిడితెచ్చారనే అంశాన్ని విచారిస్తున్నామని సీబీఐ తెలిపింది. ‘మా దగ్గర కార్తీ చిదంబరానికి చెందిన అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కి నిధులు బదిలీ అయినట్లు పేర్కొనే ఈ–మెయిల్స్, బిల్లులు ఉన్నాయి. కార్తీని దోషిగా నిలబెట్టేందుకు అవసరమైన సాక్ష్యాలున్నాయి. ఈయన నుంచి స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్ ఫోన్లను పరిశీలిస్తున్నాం. వీటన్నింటికోసం కనీసం 14రోజుల కస్టడీ అవసరం’ అని మెహతా కోర్టును కోరారు. -
చంద్రగహణం.. నేడు ప్రత్యేక దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో బుధవారం అన్నప్రసాదాల వితరణను టీటీడీ నిలిపివేసింది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. గ్రహణం కారణంగా ఉదయం 11 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 5.18 గంటలకు గ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతున్నందున రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. అలాగే శేషాచలగిరుల్లో నెలవైన పుణ్యతీర్థాల్లో ఒకటైన రామకృష్ణ తీర్థానికి భక్తులు భారీగా తరలిరానున్నందున టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, శ్రీవారిని ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో నటి లావణ్యత్రిపాఠి, క్రికెట్ సెలక్షన్ కమిటీ సభ్యుడు చాముండేశ్వరీ నాధ్లు దర్శించుకున్నారు. -
చిత్ర ప్రదర్శనకు 'తెర' పడింది
బరంపురం: రాష్ట్రంలో సినిమా హాళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ఒకప్పుడు దక్షిణ ఒరిస్సాలో కేంద్ర బిందువైన బరంపురంలోని సినిమా హాళ్లలో చిత్ర ప్రదర్శనలు మూడు పువ్వులు, ఆరు కాయల్లా లాభసాటిగా ఉండేవి. కానీ ప్రస్తుతం టీవీ సీరియల్స్, పైరసీతో పాటు యూ ట్యూబ్ ప్రభావం వల్ల సినిమా హాళ్లు కష్టాల బాటలో నడుస్తుండడంతో నష్టాలు చవిచూస్తున్న థియేటర్ల యజమానుల పరిస్థితిగా అధ్వానంగా మారింది. రాష్ట్రంలో మొట్ట మొదటిగా బరంపురంలో 1927లో ఎస్‌ఎస్‌వీటీ థియేటర్‌ను ఆత్మకూరి వంశీకులు ప్రారంభించారు. అప్పట్లో మాటలు లేని మూకీ(మూగ) చిత్రాలు ప్రదర్శించేవారని పూర్వీకులు చెబుతున్నారు. నాలుగు కేటగిరీల్లో పన్ను వసూలు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నాలుగు కేటగిరీలుగా టాక్స్‌ను విభజించింది. కార్పొరేషన్ పరిధిలో గల హాల్‌కి 25 శాతం, మున్సిపాల్టీ పరిధిలో గల హాల్‌కి 20 శాతం, ఎన్ఏసీ పరిధిలో 10 శాతం, పంచాయతీ పరిధిలో గల హాల్‌కు 5 శాతం వినోదపు పన్ను వసూలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయింది. ఒరియా చిత్రాలకు అదరణ పెరగడం, ఒరియా చిత్రాల నిర్మాణం తక్కువ బ డ్జెట్ కావడంతో ఒరియా చిత్రాలు కాస్త లాభసాటిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ రుణాలతో థియేటర్లు నిర్మించి నడిపిస్తే కొన్నాళ్లకు మూసేయక తప్పదని యజమానులు చెబుతున్నారు. దీనికి తోడు ఒరిస్సా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా రాష్ట్రంలో గల సినిమా హాళ్లను అదుకోకపోవడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో 200 సి నిమా హాళ్లలో 120కి పైగా మూతపడినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో వినోద పన్ను చాలా తక్కువగా ఉంటే ఒరిస్సా రాష్ట్రంలో 25 శాతం పన్ను వసులు చేయడంతో తమపై భారం పడుతుండడంతో చేసేది లేక సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు థియేటర్ల యజమానులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నగరంలో కొంతకాలంగా శాంతి భధ్రతలు కరువవడంతో అడియన్స్ సెకెండ్ షోకు రాక పోవడం వల్ల నెలకు సమారు 10 రోజులు సెకండ్ షోలు వేయడం మానివేశారు. మూతపడిన హాళ్లు ఏమయ్యాయి..? నగరంలో గత 10 ఏళ్ల క్రితం కొత్తవి, పాతవి కలిపి 12 సినిమా హాళ్లు పోటాపోటీగా లాభసాటిగా నడిచేవి. కానీ ప్రస్తుతం ఇందులో 7 సినిమా హాళ్లు మూతపడ్డాయి. మరో 5 సినిమా హాళ్లు నష్టాల బాటలో నడుస్తున్నాయి. మూసివేసిన సినిమా హాళ్లలో జ్యోతి సినిమా హాల్ త్రీ స్టార్ హోటల్‌గా మారితే, విజయ టాకీస్ కల్యాణ మండపంగా మారింది. ఉత్కళ్ సినిమా హాల్ అపార్ట్‌మెంట్‌గా మారితే, మొట్టమొదటి సినిమా హాల్ ఎస్‌ఎస్‌వీటీ కుటుంబాల తగాదాలతో శిథిలావస్థకు చేరిది. కొత్త హాళ్లలో లింగరాజ్ సినిమా హాల్ కల్యాణ మండపంగా మారితే, పద్మిని సినిమా హాల్ వాహనాల షోరూంగా మారింది. నిన్న, మొన్నటి వరకు నడిచిన పరంజ్యోతి సినిమా హాల్ ఫైలీల్ తుఫాన్‌తో పూర్తిగా నేలకొరిగి మూతపడింది. ఈ పరిస్థితి చూసి కొమ్మపల్లిలో సినిమాహాల్ నిర్మాణం సగంలోనే అగిపోయింది. మూతబడిన సగం థియేటర్లు ఈ సందర్భంగా స్థానిక గౌతం సినిమాహాల్ యజమాని కోట్ని శివప్రసాద్ సాక్షితో మాట్లాడుతూ...ప్రతిరోజూ టీవీల్లో 10 తెలుగు సినిమాలు 15 హిందీ సినిమాలు, పదుల సంఖ్యలో సీరియల్స్ ప్రసారం కావడం, సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే మార్కెట్లోకి పైరసీ సీడీలు విచ్చల విడిగా చలామణి కావడంతో రాష్ట్రంలో సగానికి పైగా సినిమా హాల్స్ మూతపడ్డాయని చెప్పారు. పైరసీ అరికట్టకపోతే పైరసీ సీడీలను అరికట్టకపోతే ఉన్న సినిమా హాళ్లు కాడా మూత పడే ప్రమాదం ఉందని సినిమా హాళ్ల యజమానులు అవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో పైరసీ సీడీలు అరికట్టేందుకు కొత్త చట్టం అమలు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఒరిస్సా ఫిల్మ్ డిస్టిబూటర్స్ సంఘం అధ్యక్షుడు పెల్లి బాబు తెలియజేస్తున్నారు. -
31న శ్రీవారి ఆలయం మూత
సాక్షి, తిరుమల: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 31వ తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తికానుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితి. గ్రహణం తర్వాత రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించనున్నారు. రాత్రి 10.30 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. 31న ఆర్జితసేవలైన సహస్రకలశాభిషేకం, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. -
ఈ నెల 31న అన్ని ఫ్లైఓవర్లు బంద్
హైదరాబాద్ : నగరంలో ఈ నెల 31వ తేదీన సైబరాబాద్, హైద్రాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తామని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. 31న నైట్ సెలెబ్రేషన్స్ రాత్రి ఒంటి గంట వరకే పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తామని, మొత్తం 120 టీమ్‌లు బ్రీత్ అనలైజర్లతో సిద్ధంగా ఉంటారన్నారు. అలాగే స్పీడ్ లిమిట్ తప్పనిసరి అని, అతి వేగంతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని వెల్లడించారు. -
2020 నాటికి బీఎస్–4 రిజిస్ట్రేషన్లు బంద్
న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య ఉద్గారాలను నియంత్రించడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ స్టేజ్ (బీఎస్)–4 ప్రమాణాలతో దేశంలో తయారయ్యే వాహనాల రిజిస్ట్రేషన్‌ను 2020, జూన్ 30 నాటికి నిలిపివేస్తామని కేంద్రం తెలిపింది. 2020, ఏప్రిల్ 1 వరకు తయారైన వాహనాలన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టంలో మార్పులు చేపట్టేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బీఎస్–4 ప్రమాణాల నుంచి 2020 నాటికి ఏకంగా బీఎస్–6 ప్రమాణాలను అందుకోవాలని కేంద్రం ఇంతకుముందు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ముసాయిదాపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను డిసెంబర్ 20లోగా తెలియజేయాలని కేంద్రం సూచించింది. -
నేటి నుంచి మటన్ అమ్మకాలు బంద్
సీతంపేట(విశాఖ ఉత్తర): హనుమంతవాకలో ఉన్న మేకల కబేలాను నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలసకు తరలించిన నేపథ్యంలో నిరసనగా ఆదివారం నుంచి మటన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్టు మటన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. అసోసియేషన్ అధ్యక్షుడు కిలాని అప్పారావు మాట్లాడుతూ తగరపువలస నుంచి పెందుర్తి, గాజువాక వరకు ఉన్న 700 మటన్ షాపులు బంద్‌లో పాల్గొంటాయన్నారు. హనుమంతవాకలో కబేలా తెరిచేలా స్పష్టమైన హామీ వచ్చే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు. కబేలా తరలించడం వల్ల వ్యాపారాలు సరిగ్గా సాగక 6700 మంది గొర్రెల పెంపకం దారులు, సుమారు 10 వేల మంది మటన్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమంతవాకలో ఉన్న స్థలంలో రెండస్తుల భవనం నిర్మించి, పార్కింగ్, వాటర్ సదుపాయాలతో అత్యాధునిక కబేలాను నిర్మించి అందుబాటులోకి తేవాలని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి హనుమంతవాక కబేలా వద్ద నిరసన చేపడతామన్నారు. మటన్ వ్యాపారులంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. -
ఇంతేనా..ఇదే రియలా!
కాకర పద్మలత హత్య కుట్రకు సంబంధించిన నగదు లావాదేవీలే రౌడీషీటర్ గేదెలరాజు హత్యకు కారణమని ఇన్నాళ్లూ అందరూ భావించారు.. పోలీసులూ అదే చెబుతూ వచ్చారు.. ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు.. కానీ ఆ హత్యకు అదొక్కటే కారణం కాదని తాజాగా వెల్ల డించారు.. ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల వివాదాలు కూడా రాజును బలిగొన్నాయని అంటున్నారు.. ఒక పోలీస్ అధికారి, ఒక పత్రికా నిర్వాహకుడు, ఒక రియల్టర్.. ఈ ముగ్గురు సెటిల్మెంట్లు, రియల్ దందాల్లో ఆరితేరినవారే.. ఆ వ్యవహారాల్లో పరస్పరం సహకరించుకునేవారు.. అటువంటి వాటిలోనే రాటుదేలిన రౌడీషీటర్ గేదెలరాజు వారికి పరిచయమయ్యాడు.. యథాశక్తి వారికి సహకరించేవాడు.. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధం విషయంలో బెదిరింపులకు దిగిన పద్మలతను అడ్డు తొలగించుకునేందుకు పోలీసు అధికారి గేదెల రాజును ప్రయోగించాడు.. అయితే సొమ్ము చెల్లింపు విషయంలో ప్రారంభమైన వివాదం.. వారి మధ్య బెదిరింపుల దాకా వెళ్లింది.. ఇక రియల్టర్, పత్రికా నిర్వాహకుడు చేపట్టిన భూ దందాల్లో అనవసరంగా తలదూర్చి తనకూ వాటా ఇవ్వాలని బెదిరించి వారి కంటగింపుగా మారిన గేదెల రాజు.. మొత్తానికి ముగ్గురికీ ఉమ్మడి శత్రువుగా మారాడు.. అంతే.. ఆ ముగ్గురూ చేతులు కలిపారు.. పథకం ప్రకారం గేదెలరాజును హతం చేశారు.. వెలుగు చూసిన ఈ ‘రియల్’ కోణంతో ఈ హత్య కేసు దర్యాప్తు దాదాపు ముగిసినట్లేనట!.. ఇక తేలాల్సింది పద్మలత హత్య కేసు మిస్టరీనే.. సాక్షి, విశాఖపట్నం: రౌడీ షీటర్ గేదెలరాజు హత్య కేసులో పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. పద్మలత హత్యకు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బ్లాక్మెయిల్ చేయడం వల్లే డీఎస్పీ రవిబాబు అతన్ని భూపతిరాజు ద్వారా హత్య చేయించాడని చెప్పుకొచ్చిన పోలీసులు తాజాగా కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. రవిబాబు ఆఫర్‌కు తోడు గేదెలరాజుతో తనకున్న భూ వివాదాల వల్లే శ్రీనివాసరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని.. ఈ విషయంలో రియాల్టర్ డి.సుబ్బారావు సహకరించాడని చెప్పుకొచ్చారు. గేదెలరాజు హత్య కేసు దర్యాప్తు పూర్తయినట్టు ప్రకటించిన పోలీసులు పద్మలత హత్య కేసు పురోగతిలో ఉందన్నారు. కేసులో కీలక నిందితులు భూపతిరాజు శ్రీనివాసరాజు, అతని కారు డ్రైవర్ కేశవ్‌తో పాటు రియాల్టర్ సుబ్బారావును అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి జేసీపీ నాగేంద్రకుమార్ తెలిపిన వివరాలు ఆసక్తి గొలుపుతున్నాయి. విభేదాలు ఇలా.. మాతృశ్రీ లే అవుట్‌లోని కొంత భూమిని గేదెల రాజు ఆక్రమించడంతో సుబ్బారావుతో అతనికి విభేదాలు ఏర్పడ్డాయి. కాగా పద్మలత హత్య కోసం గేదెలరాజుకు సుపారీ ఇవ్వడానికి తన తోడల్లుడి పేరిట రిజిస్ట్రర్ చేయించిన స్థలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాల్సిందిగా డీఎస్పీ రవిబాబు సుబ్బారావును కోరాడు. ఆ మేరకు ఆ స్థలాన్ని అమ్మి రూ.50 లక్షలు రవిబాబుకు ఇవ్వగా ఆ సొమ్మును గేదెలరాజుకు ఇచ్చాడు. అడ్వాన్స్‌గా ఆ సొమ్ము తీసుకున్న గేదెల రాజు పద్మలతను విషప్రయోగంతో హతమార్చాడు. ఆతర్వాత మిగిలిన సొమ్ము కోసం గేదెల రాజు ఒత్తిడి చేయడంతో రవిబాబు అతడిని వదిలించుకోవాలని ఎత్తుగడ వేశాడు. రాజును హత్య చేసేందుకు భూపతిరాజుకు 400 చదరపు గజాల స్థలం, రూ.15 లక్షల నగదు ఇచ్చేందుకు రవిబాబు తరపున సుబ్బారావు అంగీకరించాడు. రూ.2.5 కోట్ల స్థల వివాదం వీటితోపాటు ఓ భూ ఆక్రమణ విషయంలో భూపతి రాజు, సుబ్బారావు, గేదెలరాజుల మధ్య విబేదాలు తలెత్తాయి. విమానాశ్రయం వద్ద సాకేతుపాలెం సమీపంలోని బుచ్చిరాజుపాలెం వద్ద గుంటూరు జిల్లాకు చెందిన దోనపల్లి నాగప్రసాద్ అధీనంలో ఉన్న సర్వే నెం. 69/1బీ1లోని రూ.2.5కోట్ల విలువైన 713 చదరపు గజాల భూమిని భూపతిరాజు తన అనుచరుడైన మహేష్ తదితరులతో కలిసి చౌకగా కొట్టేసేందుకు యత్నించాడు. ఈ వ్యవహారంలో తనకు 50 శాతం వాటా ఇచ్చే షరతుతో భూపతిరాజుకు సుబ్బారావు రూ.40 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బుతో ఆ స్థలాన్ని కొనేందుకు ప్రయత్నించగా.. బినామీ సైట్ ఓనర్ అంగీకరించలేదు. కొన్ని రోజుల తర్వాత అసలు వ్యక్తి అయిన వాడపల్లి వెంకట సూర్య సన్యాసిరావు అలియాస్ పెద్ద వద్దకు వెళ్లి ఆరా తీయగా.. వేరే పార్టీకి దాన్ని అమ్మేస్తున్నరన్న తెలిసింది. దాంతో భూపతిరాజు తన అనుచరుడు మహేష్‌ను పురమాయించాడు. రూ.1.10 కోట్లకు డీల్‌గా పేర్కొంటూ రూ.70 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టు తన పత్రికలో పని చేస్తున్న సబ్ ఎడిటర్ అశోక్‌తో పాత తేదీలతో ముందుగానే అగ్రిమెంట్ తయారు చేయించాడు. అనంతరం పెద్ద, నాగప్రసాద్‌లను పత్రిక కార్యాలయానికి రప్పించాడు. హైదరాబాద్ పార్టీ వచ్చిందని పెద్దను బయటపెట్టి నాగప్రసాద్‌ను లోనికి పంపించాడు. అక్కడ మాటు వేసిన శ్రీనివాసరాజు అనుచరులు మహేష్ తదితరులు కత్తులతో బెదిరించి స్టాంప్ డ్యూటీ డాక్యుమెంట్స్, ఖాళీ పేపర్లపై నాగప్రసాద్‌తో సంతకాలు చేయించి స్థలం ఆక్రమించారు. ప్రసాద్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న పెద్ద శ్రీనివాసరాజును నిలదీసి బెదిరించాడు. దాంతో ఆ స్థలం చేజారిపోకుండా శ్రీనివాసరాజు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అప్పటి వరకు సైలంట్‌గా ఉన్న గేదెల రాజు ఈ భూ దందాలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని తనకూ వాటా కావాలని శ్రీనివాసరాజుపై ఒత్తిడి తెచ్చాడు. ఇందులో తల దూర్చొద్దని స్పష్టం చేసినా వినలేదు. అప్పటికే గేదెల రాజుతో గొడవ పెట్టుకున్న సుబ్బారావు కూడా శ్రీనివాసరాజుతో కలిసి అతన్ని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో పద్మలత వ్యవహారంలో గేదెల రాజును హతమార్చాలని డీఎస్పీ రవిబాబు శ్రీనివాసరాజును పురమాయించాడు. అప్పటికే అతనిపై పీకలదాక కోపంతో ఉన్న శ్రీనివాసరాజు సుబ్బారావుతో కలిసి స్కెచ్ వేశాడు. తన కార్యాలయానికి రప్పించుకుని తన అనుచరులతో హత్య చేయించాడు. మీడియా ఎదుట తల దించుకుని నిల్చున్న నిందితులు భూపతిరాజు శ్రీనివాసరాజు, సుబ్బారావు, కేశవ్ రియల్ బంధం ఏ3గా తెరపైకి వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన సుబ్బారావు స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేశాడు. పదవీవిరమణ బిల్డర్‌గా మారాడు. కూర్మన్నపాలెంలోని మాతృశ్రీ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పలు అవకతవకలకు పాల్పడినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలోనే పరిచయమైన గేదెల రాజు ద్వారా పలు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశాడు. అప్పట్లో గాజువాక ఏసీపీగా ఉన్న డీఎస్పీ రవిబాబుతోనూ పరిచయం పెంచుకున్నాడు. అతని ద్వారా కూడా పలు సెటిల్మెంట్స్ చేశాడు. ఆ క్రమంలోనే తోడల్లుడి పేరిట 400 చదరపు గజాల స్థలాన్ని 2013లో గిప్ట్గా రిజిస్ట్రేషన్ చేయించాడు. మరో పక్క తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాసరాజు టింబర్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. 2016లో క్షత్రియభేరి పేపర్ ప్రారంభించాడు. తన ఆర్ధిక లావాదేవీలకు గేదెలరాజు, సుబ్బారావుల సహకారం తీసుకునేవాడు. అలా వీరందరి మధ్య ‘రియల్’ స్నేహం కుదిరింది. నేటితో ముగియనున్న రవిబాబు కస్టడీ కాగా గురువారంతో రవిబాబు పోలీస్ కస్టడీ ముగియనుంది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులకు రవిబాబు నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. తనకేపాపం తెలియదని, కావాలనే ఇరికించారని రవిబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. అక్కడ కోటి..ఇక్కడ రూ.20 లక్షలే కాగా పద్మలతను హత్య చేసేందుకు గేదెల రాజుకు రూ.కోటి చెల్లించేందుకు రవిబాబు డీల్ కుదుర్చుకున్నాడు. అందులో రూ.50 లక్షలు ముందుగానే ముట్టజెప్పాడు. మిగిలిన మొత్తానికి వన్ టైం సెటిల్మెంట్ మెంట్ కింద రూ.25లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కేసులో ఏకంగా కోటి రూపాయలు డీల్ కుదరగా, గేదెల రాజు హత్య కేసులో రూ.10లక్షలు మాత్ర మే చెక్కుల రూపంలో రవిబాబు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం మవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆర్ధిక విభేదాల కారణంగానే గేదెల రాజును హతమార్చేందుకు భూపతిరాజు అంగీకరించాడని చెబుతున్నారు. ఇందుకోసమే రవిబాబు రూ.10లక్షలు, సుబ్బారావు మరో రూ.10లక్షలు ఇచ్చినట్టుగా పోలీసులు ప్రకటించారు. మొత్తం నిందితులు 13 మంది ఈ వ్యవహారంలో పద్మలత హత్యకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఆధారాలు ఇంకా లభించలేదని.. దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటించిన జేసీపీ గేదెల రాజు కేసు దర్యాప్తు మాత్రం పూర్తయినట్టేనని చెప్పుకొచ్చారు. రాజు హత్యకు స్కెచ్ వేసేందుకు బీచ్‌రోడ్‌లో జరిగిన భేటీలో రఘు, రోహిత్, గోపిరాజుల పాత్ర ఏమేరకు ఉందో నిర్ధారణ కావాల్సి ఉందని చెప్పారు. గేదెల రాజు హత్య కేసులో 13 మందిని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు తరలించారు. -
గ్రహణం వేళ కోవెలల మూసివేత
-నేటి ఉదయం సంప్రోక్షణానంతరం పునర్దర్శనాలు రామచంద్రపురం రూరల్ : చంద్రగ్రహణంతో సోమవారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు అభిషేకాలు, పూజలు జరిపించారు. మధ్యాహ్నం 12.30 గంటల ఆలయాన్ని మూసివేశారు. తిరిగి మంగళవారం ఉదయం 8.30 గంటలకు పునర్దర్శనం కల్పించనున్నట్లు ఈఓ పెండ్యాల వెంకట చలపతిరావు తెలిపారు. అప్పనపల్లిలో.. మామిడికుదురు (పి.గన్నవరం): చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీబాలబాలాజీ స్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు మూసివేశారు. స్వామి వారికి ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు చెల్లించి ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వామి వారి దర్శనాన్ని పునరుద్ధరిస్తామని ఈఓ పొలమూరి బాబూరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్ తెలిపారు. తలుపులమ్మ లోవలో.. తుని రూరల్ : లోవ దేవస్థానంలో సోమవారం శ్రావణమాసం, పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తలుపులమ్మవారికి ప్రీతికరమైన చండీహోమాన్ని వేదపండితులు ముష్టి వెంకట పురుషోత్తమశర్మ, రాణి సుబ్రహ్మణ్య శర్మ, శశాంక్ త్రిపాఠి నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్, చైర్మన్ కరపా అప్పారావు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా హోమం అనంతరం ప్రత్యేక పూజలు చేశాక ఉదయం 11.15 గంటలకు ఆలయం తలుపులను మూసివేశారు. జాతీయ రహదారివద్ద ఉన్న నమూనా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8.45 గంటలకు భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. అయినవిల్లిలో.. అయినవిల్లి (పి.గన్నవరం) : చంద్రగ్రహణం సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరాలయాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మూసివేశారు. మంగళవారం తెల్లవారు జామున ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి సంప్రోక్షణ పూజలు చేసి ఆలయాన్ని తెరుస్తారని, ఉదయం 6 గంటల నుంచి స్వామికి యథావి«ధిగా పూజలు నిర్వహిస్తామని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. -
గ్రహణం ఎఫెక్ట్ తిరుమల ఆలయం మూసివేత
-
సరిహద్దు చెక్‌పోస్టు మూసివేత
– జీఎస్టీ అమలు ఎఫెక్ట్.. హిందూపురం రూరల్ : జిల్లాలో సరిహద్దు వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రాలు శనివారం మూతపడ్డాయి. ఇప్పటివరకు వాణిజ్య పన్నుల చెక్‌పోస్టులు తనిఖీలకే పరిమితమయ్యాయి. జీఎస్టీ అమలుకావడంతో జులై 1 నుంచి మూసేయాలని అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దాంతో శనివారం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో ఉన్న కొడికొండ చెక్‌పోస్టు, తూముకుంట చెక్‌పోస్టు, గుంతకల్లు వాణిజ్య పన్నుల తనిఖీ కేంద్రాలను మూసివేశారు. వీటిలో డీసీటీలు 20 మంది, ఏసీటీఓలు 40 మందితో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహించేవారు. వాణిజ్య పన్నుల శాఖకు చెక్‌పోస్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.వంద కోట్ల ఆదాయం వచ్చేది. కొత్త విధానంతో ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్లనుంది.దీంతో తప్పనిసరిగా మూసివేసి డీసీటీఓ స్థాయి అధికారి నుంచి సీనియర్ అసిస్టెంట్ అధికారి వరకు కర్నూలులోని వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని, అటెండర్ స్థాయి ఉద్యోగులు జిల్లా డీసీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. పట్టుబడితే భారీ జరిమానా : అక్రమంగా సరుకు రవాణా చేస్తూ మొబైల్ తనిఖీ బృందాలుకు దొరికితే భారీగా జరిమానా విధించినట్లు వాణిజ్య పన్నుల ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆన్లైన్లో వేబిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే పట్టుపడిన సరుకుపై ఏడు రెట్లు జరిమానాతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయునున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
పెద్దాపురంలో ముగిసిన ఎన్సీసీ శిక్షణ శిబిరం
–జాతీయ సమైక్యతకు ఎన్సీసీ దోహదమన్న వక్తలు పెద్దాపురం : కాకినాడ 18వ ఆంధ్రాబెటాలియన్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో పెద్దాపురం మహారాణి కళాశాలలో నిర్వహించిన ఎన్సీసీ శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కమాండెంట్ మునీష్‌గౌర్ ఆధ్వర్యంలో క్యాంపు ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు సిక్స్ నేవల్ కమాండ్ అధికారి కెప్టెన్ వివేకానంద, కల్నల్ నీలేష్, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, శ్రీ ప్రకాష్ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్‌ప్రకాష్, నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య ముఖ్యఅతిథలుగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జాతీయ సమైక్యతను చాటేందుకు ఎన్సీసీ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు. క్యాంపు ఎన్సీసీ అధికారులు ఉప్పలపాటి మాచిరాజు ఆధ్వర్యంలో క్యాడెట్లు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాడెట్లకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ తాళ్లూరి వీరభద్రరావు, మాజీ ప్రిన్సిపాల్ ప్రభాకరరావు, ఎన్సీసీ అధికారులు కృష్ణారావు, సతీష్, సత్యనారాయణ, పిలిఫ్‌రాజు, వీవీవీ రమణమూర్తి, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. -
బోర్ బావులు మూసేయండి
-
ప్రాధాన్యంపై అలక్ష్యం
భీమవరం/ తాడేపల్లిగూడెం :ధాన్యానికి కనీస మద్దతు ధర దక్కేలా చూసేందుకంటూ ప్రభుత్వం తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు లక్ష్య సాధనలో చతికిలపడ్డాయి. 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా.. 9.85 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. ఇందులో సింహభాగం మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు కొనుగోలు చేయగా.. ఆ ధాన్యాన్ని కూడా ఐకేపీ కేంద్రాల ద్వారానే సేకరించినట్టు రికార్డుల్లో చూపించారు. మంగళవారం సాయంత్రం నుంచి కొనుగోలు కేంద్రాలన్నిటినీ మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. 1,979 మంది రైతులకు రూ.36 కోట్లను బకాయిపెట్టారు. బకాయిల్ని చెల్లించకుండా ఐకేపీ కేంద్రాలను మూసివేస్తుండటంతో తమకు సొమ్ములు ఎప్పుడు అందుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. సగం ధాన్యం బయట జిల్లాలకే.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. గడచిన దాళ్వా సీజన్లో 5.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టినట్టు.. 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో అంచనాలకు మించి దిగుబడులు వచ్చాయి. ఎకరాకు 40 నుంచి 50 బస్తాల వరకు ధాన్యం పండింది. మొత్తం దిగుబడిలో సగం ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలించారు. మిగిలిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్టు చూపించి కస్టమ్ మిల్లింగ్‌కు తీసుకున్నారు. ఇదిలావుంటే.. మొత్తం దిగుబడిలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఏప్రిల్ 6న ప్రభుత్వం 283 కొనుగోలు కేంద్రాలు తెరిచింది. వీటి నిర్వహణను ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) గ్రూపులకు, సహకార సంఘాలకు అప్పగించింది. వీటిద్వారా బుధవారం నాటికి 84,456 మంది రైతుల నుంచి 9,85,933 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు రికార్డు చేశారు. రైతులకు మొత్తం రూ.1,474 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 1,438 కోట్లు చెల్లించామని, 1979 మంది రైతులకు రూ.36 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 10 రోజులుగా మందగమనం గత 10 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. చివరి రోజుల్లో కేవలం సుమారు 75 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఈనెల 8నాటికి 79,843 మంది రైతుల నుంచి రూ.1,363 కోట్ల విలువైన 9,10,824 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. 20వ తేదీ నాటికి 9,85,933 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు రావడం లేదనే కారణంతో బుధవారం నుంచి ఐకేపీ కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించారు. -
ముగిసిన తైక్వాండో వేసవి శిక్షణ శిబిరం
కాకినాడ సిటీ : స్పోర్ట్స్ అ«థారిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆండాళ్లమ్మ కళాశాలలో నిర్వహించిన తైక్వాండో వేసవి శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. నెల రోజులపాటు కొనసాగిన శిక్షణ శిబిరంలో సుమారు 130 మంది బాలబాలికలు పాల్గొన్నారని తైక్వాండో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ బి.అర్జున్‌రావు తెలిపారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చుండ్రు గోవిందరాజులు, తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎ.మధుసూదనరావు, ఆండాళ్లమ్మ కళాశాల ప్రిన్సిపాల్ ఏవీఎస్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్ కె.సుధాకరరావు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో తైక్వాండో జాయింట్ సెక్రటరీ కె.అప్పారావు, డి.సత్యనారాయణ, కోచ్‌లు పి.తేజ, ఎన్పీ. రాఘవేంద్రస్వామి, డాక్టర్ అబ్రహమ్ పాల్గొన్నారు. -
మూసేయండి
ఆకివీడు : ప్రాథమిక పాఠశాలల్ని మూసివేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరిట మూడేళ్లుగా బడులను మూసివేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాదీ అదే పనిలో నిమగ్నమైంది. జిల్లాలో 70కి పైగా ప్రాథమిక పాఠశాలల్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట బడుల మూతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 19 మందికంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 30 మందికంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిస్థాయి తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. జెడ్పీ హైసూ్కళ్లలో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే.. వాటిని ప్రాథమికోన్నత పాఠశాలలుగా మారుస్తారు. 6, 7, 8 తరగతులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో 40లోపు విద్యార్థులు ఉంటే.. వాటిని కూడా ప్రాథమిక పాఠశాల స్థాయికి తగ్గిస్తారు. జిల్లాలో 2,250 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. వాటిలో 70కి పైగా బడులను మూసివేస్తారని తెలుస్తోంది. ఇవి కాకుండా 50 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయిని కుదించే అవకాశం ఉన్నట్టు అంచనా. ఉపాధ్యాయుల కేటాయింపు ఇలా.. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం 2016 డిసెంబర్ 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 20 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటారు. 21 నుంచి 60 లోపు పిల్లలుంటే ఇద్దర్లు, 60 మంది దాటితే ముగ్గురు ఉపాధ్యాయుల్ని కేటాయిస్తారు. 80 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయుల్ని నియమించి దానిని మోడల్ పాఠశాలగా గుర్తిస్తారు. 80 నుంచి 131 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులతోపాటు ఒక ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తారు. ఈ మేరకు జీవో–29 జారీ కాగా.. దానికి అనుబంధంగా ఆర్సీ నంబర్ 4102తో మార్గదర్శకాలు సైతం వెలువడ్డాయి. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా హేతుబద్ధీకరణ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలతో కూడిన నివేదికలను ఈనెల 30న విద్యాశాఖకు సమర్పించాల్సి ఉంటుంది. సదరు నివేదికల తుది పరిశీలన అనంతరం ఆయా పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలను జూన్ 1న అధికారికంగా ప్రకటిస్తారు. బలోపేతం చేయాలి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమ బోధనను అందుబాటులోకి తెచ్చాక విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ స్థాయి నుంచి తరగతులు ఉండాలి. పాఠశాలలు మూసివేయడమనేది అవివేక చర్య. విద్య ఉమ్మడి వ్యవస్థగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకూడదు. దీనిని వ్యతిరేకిస్తున్నాం. – కె.రామలింగరాజు, ఎస్టీయూ అధ్యక్షుడు, ఆకివీడు మండలం పాఠశాలల్ని కుదించడం దారుణం విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో ప్రభుత్వ పాఠశాలల్ని కుదించడం దారుణం. అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలో 27వ స్థానంలో ఉంది. ఈ చర్యల వల్ల మరింత దిగజారుతుంది. నిరుపేదలకు విద్యను దూరం చేస్తున్నారు. ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. పాఠశాలల కుదింపు, ఎత్తివేత వంటి చర్యల్ని వెంటనే మానుకోవాలి. – పిల్లి జయకర్, అధ్యక్షుడు, యూటీఎఫ్ జిల్లా శాఖ -
మార్కెట్లకు నేడు సెలవు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు నేడు సెలవు. మే 1, సోమవారం మహారాష్ట్ర డే సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పని చేయవు. మళ్లీ ట్రేడింగ్ 2వతేదీ మంగళవారం ఉదయం యథావిధిగా మొదలవుతుంది. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం. గత వారం సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 30,000 పాయింట్ల మైలురాయి అధిగమించగా, నిఫ్టీ సైతం మొట్టమొదటిసారి 9,350 అధిగమించి ఆల్ టైం హైని రికార్డ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా గరిష్ట స్థాయిలను నమోదు చేయడం విశేషం. శుక్రవారం సెన్సెక్స్ 29,918 వద్ద, నిఫ్టీ 9,304 వద్ద ముగిశాయి. డాలర్ మారకంలో రుపీ కూడా చాలా బలంగా కొనసాగుతోంది. ఒకదశలో 64 స్థాయిని బ్రేక్ చేసిన రుపాయి గత సెషన్ లో రూ.64.24వద్ద స్థిరపడింది. కాగా గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రతికూల సంకేతాలతో లాభాలతో ముగిశాయి. ప్రధానంగా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో సెంట్రిస్ట్ అభ్యర్థి ఇమాన్యుయేల్ మాక్రన్ ముందున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు బూస్ట్ లభించిన సంగతి విదితమే. -
గట్టెక్కింది..
గోదావరి సహజ జలాలతోనే రబీసాగు ముగిసిన సీజ¯ŒS.. మూతపడిన కాలువలు మధ్యమధ్యలో చిన్నచిన్న ఒడుదొడుకులు ఎదురైనా మొత్తమ్మీద గోదావరి డెల్టాలో రబీ సాగు గట్టెక్కింది. సీలేరుకుతోడు.. సహజ జలాలు ఆశాజనకంగా ఉండడంతో రబీ సాఫీగానే సాగింది. డిసెంబర్ ఒకటి నుంచి.. కాలువలు మూత పడిన ఈ నెల 15వ తేదీ వరకూ.. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం మొత్తం సుమారు 104 టీఎంసీల గోదావరి జలాలు వినియోగించారు. అమలాపురం : డిసెంబర్ ఒకటిన ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాల్లో రబీ షెడ్యూల్ ఆరంభమైం ది. అధికారుల లెక్కల ప్రకారం డెల్టాల్లో వరి సాగు సాధారణ విస్తీర్ణం 8.86 లక్షల ఎకరాలు కాగా, వాస్తవ సాగు 7.50 లక్షల ఎకరాలు మాత్రమే. డెల్టాల్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 90 టీఎంసీల జలాలు కావాలన్నది అధికారుల లెక్క. ఇందులో 75 నుంచి 80 టీఎంసీలు వస్తే చాలు రబీ గట్టెక్కుతోంది. అటువంటిది ఈసారి ఏకంగా 104 టీఎంసీ నీటిని కాలువలకు వదిలారు. గోదావరిలో ఇ¯ŒSఫ్లో ఆశాజనకంగా ఉన్నందున, రబీకి నీటి ఎద్దడి రాదని విశ్లేషిస్తూ ‘గోదావరి డెల్టాలో రబీకి ఢోకా లేనట్టే’ అన్న శీర్షికతో గత అక్టోబరు 16న ‘సాక్షి’ కథనం కూడా ఇచ్చింది. మధ్యలో కొంత ఎద్దడి ఛాయలు కనిపించినా.. మొత్తమ్మీద సాగునీటికి పెద్దగా ఇబ్బందులు లేకుండానే డెల్టాలో రబీసాగు సాఫీగానే ముగిసింది. తొమ్మిదేళ్లలో ఇది రెండోసారి 2009 నుంచి డెల్టాలో రబీకి నీటి ఎద్దడి తప్పడం లేదు. 2010–11లోను, ప్రస్తుత రబీలోను నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదు. మిగిలిన అన్ని రబీ సీజన్లలో నీటి ఎద్దడి తప్పలేదు. 2009–10, 2011–12, 2014–15, 2015–16 సంవత్సరాల్లో రబీకి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. 2001–12లోనైతే ఉభయ గోదావరి జిల్లాల్లో ఏకంగా 1.50 లక్షల ఎకరాల్లో రబీ సాగు నిలిచిపోయింది. గత ఏడాది రబీకి ఏకంగా 23 టీఎంసీల నీటి కొరత ఏర్పడినా మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చారు. సకాలంలో సాగునీరు అందించకపోవడంతో రెండు డెల్టాల్లో ఏకంగా 50 వేల ఎకరాల్లో దిగుబడిపై ప్రభావం పడి, రైతులు నష్టపోయారు. అంచనాలకు మించి సహజ జలాల రాక అంచనాలకు మించి సహజ జలాలు రావడం ఈసారి రబీ రైతులకు వరంగా మారింది. సాధారణంగా రబీ సీజ¯ŒSలో సహజ జలాలకన్నా సీలేరు పవర్ జనరేష¯ŒS నుంచి వచ్చే నీరే ఎక్కువ. రబీలో సీలేరు నుంచి 40 టీఎంసీల నీరు మన వాటాగా వస్తోంది. అత్యవసర సమయంలో మరో ఐదు టీఎంసీలు బైపాస్ పద్ధతిలో సేకరించడం ఆనవాయితీగా మారింది. గత ఏడాది ఏకంగా 54.50 టీఎంసీల నీటిని సీలేరు నుంచి తెప్పించినా పంట ఎండిపోయింది. ఈసారి మాత్రం సీలేరు కన్నా సహజ జలాలే ఎక్కువగా రావడం గమనార్హం. మొత్తం రబీ పంట కాలంలో ఈ నెల 15 నాటికి 54.971 టీఎంసీల సహజ జలాలు రాగా, సీలేరు నుంచి వచ్చింది 48.835 టీఎంసీలు మాత్రమే. పైగా ఫిబ్రవరిలో ఒకానొక సమయంలో రోజుకు రెండు వేల క్యూసెక్కులకు పడిపోయిన సహజ జలాలు మార్చి నెలలో అనూహ్యంగా 9 వేల క్యూసెక్కులకు పెరగడం విశేషం. ఆ సమయంలో పంట చేలు పాలు పోసుకుంటాయి. దీంతో నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇదే నెలలో ఏకంగా 11.664 టీఎంసీల సహజ జలాలు బ్యారేజ్ వద్దకు వచ్చాయి. చివరకు ఏప్రిల్ నెలలో 15 రోజుల వరకూ 6.788 టీఎంసీల సహజ జలాలు రావడంతో డెల్టాలో రబీ పంట గట్టెక్కింది. నెలవారీ నీటి వివరాలు (టీఎంసీలలో) నెల కాలువలకు సీలేరు సహజ జలాలు వదిలింది డిసెంబర్ 25.292 7.991 17.301 జనవరి 23.144 9.936 13.208 ఫిబ్రవరి 19.279 13.269 6.010 మార్చి 25.113 13.449 11.664 ఏప్రిల్ 10.978 4.190 6.788 మొత్తం 103.806 48.835 54.971 -
నీళ్లొచ్చేది 24 గంటలే
నిడదవోలు : పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ పరిధిలోని ఉప కాలువలకు సోమవారం నుంచి నీటి విడుదల నిలిపివేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయిం చారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్ గేట్లను పూర్తిగా మూసివేస్తారు. 45 రోజుల తరువాత గాని ఈ తలుపులు తెరుచుకునేఅవకాశం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాలకు శనివారం సాయంత్రం నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. పంటలు పూర్తిగా గట్టెక్కుతాయా! కాలువలకు నీటి విడుదలను గత నెల 30న నిలిపివేయాలని మొదట్లో నిర్ణయించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈనెల 10వ తేదీ తరువాత మూసివేయాలని భావించారు. అయితే, సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 17వ తేదీ వరకు గడువు పెంచారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 60 శాతం విస్తీర్ణంSలో మాసూళ్లు పూర్తయినట్టు అంచనా. కాలువలు మూసివేసే నాటికి ఇది 70 శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లోని చేలకు చివరి దశలో నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సోమవారం నుంచి నీటి విడుదల నిలిపివేస్తే పంట ఎలా గట్టెక్కుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కనీసం మరో వారం రోజులపాటు నీరందిస్తే తప్ప రైతులు గట్టెక్కే పరిస్థితి లేదు. చెరువుల సంగతేంటి! జిల్లాలో 400కు పైగా మంచినీటి చెరువులు ఉన్నాయి. వాటిలో పూర్తిగా నీరు నింపితే తప్ప వేసవిలో తాగునీటి అవసరాలు తీరవు. ప్రస్తుతం చెరువుల్లో 70 శాతం వరకు మాత్రమే నీరు చేరినట్టు చెబుతున్నారు. అవి పూర్తిగా నిండాలంటే మరికొన్ని రోజులు కాలువలకు నీరివ్వాల్సి ఉంటుంది. -
స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై : స్టాక్ మార్కెట్లు నేడు సెలవును పాటిస్తున్నాయి. గుడ్ ప్రైడే, అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లు ట్రేడింగ్ ను జరుపడం లేదు. కాగ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురువారం ప్రకటించిన క్యూ4 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో నిన్న మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పతనమైంది. మొత్తం మీద సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 29,461 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 9,151 పాయింట్ల వద్ద సెటిలయ్యాయి. శుక్రవారం సెలవుతో పాటు, శని, ఆదివారాలు కూడా మార్కెట్లు ట్రేడింగ్ ఉండకపోవడంతో దేశీయ ఈక్విటీ సూచీలకు మూడు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. మరోవైపు దేశీయ మార్కెట్లతో పాటు అమెరికా ఫైనాన్సియల్ మార్కెట్లు గుడ్ ప్రైడే సందర్భంగా నేడు సెలవును పాటించనున్నాయి. మేజర్ ఆసియన్ మార్కెట్లు కూడా గుడ్ ప్రైడే, ఈస్టర్ మండే కారణంగా ఈ రోజుల్లో ట్రేడ్ హాలిడేను ప్రకటించాయి. అమెరికా కమోడిటీస్ మార్కెట్లు అంటే గోల్డ్, క్రూడ్-ఆయిల్ ఫ్యూచర్స్ నేడు ట్రేడింగ్ జరుపవు. -
మూతపడిన ఉరవకొండ సబ్‌జైలు
∙కడప డీఐజీ నుంచి వెలువడిన ఉత్తర్వులు ∙ సబ్ జైలర్ కడపకు బదిలీ ఉరవకొండ : ఉరవకొండ సబ్ జైలు మూతపడింది. కడపలోని జైళ్ల శాఖ డీఐజీ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు ఉరవకొండ సబ్ జైలు అధికారులకు అందాయి. నెలకు ఒక సారి నిల్ లాకప్ నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 1983లో మొత్తం 23 మంది ఖైదీల సామర్థ్యంతో సబ్‌జైలు ఏర్పాౖటెంది. దీంతో పాటు 2010లో జైలును రూ.55 లక్షల వ్యయంతో ఆధునీకరించారు. జైలు నిర్వహణకు ఖైదీలు లేక పోయినా ఏడాదికి దాదాపు రూ.40 లక్షలు ఖర్చు అవుతుండంతో ఉన్నతాధికారులు దీన్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉరవకొండ సబ్ జైలు మూతపడటంతో ఇక్కడ పని చేస్తున్న సబ్ జైలర్ రఘనాథరెడ్డిని కడప సెంట్రల్ జైలుకు, ఇద్దరు వార్డెన్లు వెంకటరవి, జయరాములును పెనగొండ సబ్‌జైలుకు, ఒక హెడ్వార్డె¯ŒS భాస్కర్‌రావును తాడిపత్రి, మరో హెడ్వార్డె¯ŒS నాగేంద్రప్రసాద్‌ను హిందూపురం సబ్ జైలుకు బదిలీ చేశారు. రికార్డులు పరిశీలించిన జిల్లా జైళ్లశాఖ అధికారి స్థానిక సబ్‌జైలులో రికార్డులను జైళ్లశాఖ జిల్లా అధికారి సుదర్శనరావు సోమవారం రాత్రి పరిశీలించారు. పలు కీలక రికార్డులను సబ్ జైలర్ నుంచి స్వాధీనం చేసుకొని, పర్నీచర్ను ఇతర సబ్ జైళ్లకు తరలించారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ ఖైదీల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో సబ్‌జైలును మూత వేస్తున్నట్లు తెలిపారు. ఉరవకొండ సబ్‌జైలర్ రఘనాథ్రెడ్డితో పాటు సిబ్బందిని మరో సబ్ జైలుకు బదిలీ చేశామన్నారు. -
club closed
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎట్టకేలకు పేకాట క్లబ్ మూతపడింది. ఉంగుటూరు మండలం నారాయణపురంలో టీడీపీ నేతలు పేకాట క్లబ్ నెలకొల్పిన వైనాన్ని ’ఆడుకో పేక.. ఆపేవారు లేరిక’ శీర్షికన ’సాక్షి’ శుక్రవారం సంచికలో వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. దీనిపై స్పందించిన పోలీసులు తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ క్లబ్ నిర్వాహకులను తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేయడంతో క్లబ్‌కు తాళాలు శుక్రవారం వేశారు. ఈ నిర్ణయం పేకాటరాయుళ్లకు మింగుడు పడలేదు. అధికార పార్టీ నేతల అండదండలు, వారికి నెలవారీ మామూళ్లు ఇవ్వడానికి సిద్ధపడినా ప్రయోజనం లేకుండా పోవడంపై వారు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. క్లబ్‌ను తెరిపించేందుకు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్తు ప్రారంభమైనట్టు సమాచారం. కొత్త క్లబ్‌కు సమీపంలో ఉన్న పాత క్లబ్‌లోనూ ఎటువంటి జూదం నిర్వహించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేయటంతో అసలుకే మోసం వచ్చిందంటూ నిర్వాహకులు నెత్తీనోరు బాదుకుంటున్నట్టు సమాచారం. -
‘వర్దా’గ్రహం తప్పింది
తీరం వెంబడి ఎగసిపడిన అలలు కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసం రోడ్డును మూసివేసిన అధికారులు గల్లంతైన మత్స్యకారుడు సురక్షితం మధురపూడి–చెన్నై విమాన సర్వీసులు రద్దు వర్షం పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైతులు తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని... సోమవారం మధ్యాహ్నం తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతాంగంలోనే కాదు జిల్లా ప్రజల్లోనూ వణుకు పుట్టించింది. వర్దాగ్రహం తమిళనాడుపై చూపించడంతో జిల్లాలో చిరుజల్లులకే పరిమితమైనా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాలు ఇంకా భయం గుప్పెట్లోనే ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలానికి చెందిన ఇద్దరు గల్లంతై ఒకరు ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నాడు. సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాకు ’వర్దా’గ్రహం తప్పింది. జిల్లాలోనే ’వర్దా’ తీరం దాటుతుందన్న వార్తల నేపథ్యంలో తీరం వెంబడి గ్రామాలు, ఖరీఫ్ వరి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి దక్షిణ కోస్తా– ఉత్తర తమిళనాడు మధ్యన అని ప్రకటించడంతో జిల్లా ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో వర్షం పడకపోయినా వాతావరణంలో మార్పు, సముద్రంలో పెద్ద అలలు, తీరం వెంబడి భారీ ఈదురు గాలులతో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. సముద్రం నుంచి భారీ అలలు ఎగసిపడడంతో ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దాదాపు నాలుగు కిలోమీటర్లు మేర రహదారి దెబ్బతింది. బీచ్ గోడ కూడా దెబ్బతింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షించారు. బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో కాకినాడ ఆర్డీవో అంబేడ్కర్, తహసీల్దార్ సింహాద్రి సూర్యారావుపేట, నేమం ప్రాంతాలను పరిశీలించి కాకినాడ–ఉప్పాడ రోడ్డును మూసివేశారు. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేటలో సముద్ర అలలకు తీరం కోతకు గురైంది. ఫలితంగా పలువురి మత్స్యకార గృహాలు ధ్వంసమయ్యాయి. సముద్ర తీరంలో లంగరు వేసిన బోట్లు ధ్వంసమవుతుండడంతో మత్స్యకారులు తమ బోట్లను, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. ఎండు చేపల కల్లాలు ముంపునకు గురవడంతో రూ. లక్షల విలువైన ఎండు చేపలు దెబ్బతిన్నట్లు మత్స్యకారులు వాపోతున్నారు. ఊపిరి పీల్చుకున్న రైతులు ‘వర్దా’ అతి త్రీవ తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా లేకపోవడంతో రైతులు ఊరట చెందారు. ఖరీఫ్ కోతలు, ఓదెలపై వరి పనలు జిల్లాలో ఇంకా 30 శాతం మేర మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి రైతులు తీవ్ర భయాందోళన మధ్య పంటను కాపాడుకునే ప్రయత్నాల చేశారు. తుపాను ప్రభావం తమిళనాడు రాజధాని చెన్నైలో అధికంగా ఉండడంతో మధురపూడి నుంచి చెన్నై వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులు వేటకు వెళ్లొద్దు తొండంగి మండలం తీర ప్రాంతంలో సముద్ర కెరటాలు ఉధృతం కావడంతో మత్స్యకారులు బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురు గాలులు ఎక్కువగా ఉండడంతో తీరప్రాంత గృహాలు దెబ్బతిన్నాయి. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామాన్ని మత్స్యశాఖ డీడీ ఎస్.ఏంజలీనా సందర్శించారు. స్థానిక మత్స్యకారులు, వలస మత్స్యకారులతో మాట్లాడారు. తుపాను నేప«థ్యంలో మరో రెండు రోజులపాటు సముద్రంలో వేటకు Ðð వెళ్లవద్దని సూచించారు. -
నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు మూసివేత
అంబాజీపేట : సంక్షోభంలో ఉన్న కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ఈ ఏడాది జూ¯ŒS 24వ తేదీన ప్రారంభించిన నాఫెడ్ కొనుగోలు కేంద్రాల గడువు ముగియడంతో మూసివేస్తున్నట్టు ఏపీ ఆయిల్ ఫెడ్ అసిస్టెంట్ మేనేజర్ యు.సుధాకరరావు తెలిపారు. వాటిని మూసివేయాలని ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు అందాయని శుక్రవారం ఆయన విలేకరులకు వివరించారు. కోనసీమలోని అంబాజీపేట, నగరం, తాటిపాక, ముమ్మిడివరం, కొత్తపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నవంబర్ 30 వరకు 33,185 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. వీటికి సంబంధించి రూ.19.75 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. ఇంకా రూ.2.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. బహిరంగ మార్కెట్లో కొత్త కొబ్బరి ధర రూ.5,900 నుంచి రూ.6వేలు వరకు పెరగడం, గడువు ముగిడంతో కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. -
నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబై: ఇండియన్ స్టాక్స్, బాండ్స్, కరెన్సీ మార్కెట్లు నేడు సెలవును పాటించనున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సెలవు చేపట్టనున్నట్టు ప్రకటించాయి. తిరిగి మంగళవారం మార్కెట్లు యథాతథంగా ట్రేడింగ్ కార్యకాలాపాలు నిర్వహించనున్నాయి. కాగ, శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 2.69 శాతం పడిపోయి 8,290.30గా, సెన్సెక్స్ 2.54 శాతం కిందకి జారి 26,818.82గా నమోదయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా క్షీణించి, 67.25/26గా ముగిసింది. -
అమ్మ ఒడికి చిన్నారి
నిందితురాలి పట్టివేత కాకినాడ క్రైం : కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన పసికందును పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు. వివరాల్లోకెళితే ఏజెన్సీ ప్రాంతం రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన రెడ్డి లక్షి్మకి పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం అక్టోబర్ 25న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. బుధవారం తెల్లవారుజాము 3.30కు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి 9.50 తల్లి పక్కలో నిద్రిస్తోన్న పసికందు అదృశ్యమైంది. బిడ్డ కనిపించకపోవడంతో ఆస్పత్రి అంతా గాలించారు. ఫలితం లేకపోవంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా ఏలేశ్వరం అంబేడ్కర్‌కాలనీకి చెందిన పలివెల లక్ష్మి బాధితురాలితో చనువుగా ఉంటూ, çపసికందును లాలించడం చేస్తుండేది. గురువారం రాత్రి 9.30 తల్లిపక్కలో పడుకున్న పసికందును ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో పక్కవారు వారించారు. అనంతరం అందరూ నిద్రపోయాక ççపసికందును తీసుకుని ఉడాయించింది. అయితే గురువారం ఉదయం 9.30 , సాయంత్రం 7.30కు పక్కన ఉన్న వారి సెల్ఫో¯ŒS నుంచి ఫో¯ŒS చేసి నంబరు తీసేసింది. గురువారం రాత్రి 10.05కు బయట వ్యక్తుల నుంచి ఫో¯ŒS వచ్చింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలను ఒకటో పట్టణ సీఐ ఏఎస్ రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించి, బిడ్డను ఎత్తుకు పోతున్న ఆ«ధారాన్ని గుర్తించి, సెల్ఫో¯ŒS నంబర్ ఆధారంగా కిర్లంపూడి మండలం ఎస్.తిమ్మాపురంలో నిందితురాలు పలివెల లక్షి్మని ఆమె పిన్ని మంజేటి పాప ఇంటి వద్ద పట్టుకుని, చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏఎస్ రావు చెప్పారు. ఈ కేసును కేవలం 12 గంటల వ్యవధిలో ఛేదించిన సీఐ ఏఎస్.రావును, తల్లిదండ్రులు, వైద్యులు అభినందించారు. మమకారం చంపులేక... కడుపులో ఉండగానే ముగ్గురు పిల్లలు చనిపోవడం...భవిష్యత్‌లో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలపడంతో.. పిల్లలపై మమకారం చంపుకోలేక ఏంచేయాలో తెలియని స్థితిలో పలివెల లక్ష్మి పసికందును అపహరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో పేషెంటుగానే ఉందని, గురువారం డిశ్చార్జ్ కావాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఈలోగా ఆమె ఈ పని చేసిందంటున్నారు. బిడ్డను చూస్తాననుకోలేదు నాలుగు రోజులుగా పలివెల లక్ష్మి నాతో చనువుగా ఉంటోది. నిద్ర మత్తులో ఉండగా రాత్రి వచ్చి çపక్కలో ఉన్న బిడ్డను తీసుకుంది. బిడ్డ ఏడుపు వినిపించింది. పాప దోరకదని కుమిలిపోయాం. నాకు 12 ఏళ్ల కూతురు ఉంది. రెండో కాన్పులో పాప పుట్టింది. పోలీసులకు మేము రుణపడి ఉంటాం. – రెడ్డి లక్ష్మి కానరాని భద్రత కాకినాడ వైద్యం : జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో శిశువు అపహరణ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందడానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఏటా 8 లక్షల 16 వేల మంది రోగులు వస్తుంటారు. అంతటి ప్రాధాన్యమున్న ఆస్పత్రిలో ముఖ్యంగా మాతా, శిశు విభాగం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంది. కేవలం సీసీ కెమెరాలమీదే కాకుండా సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సి ఉంది. గతంలో మాతా, శిశువుల వార్డులో తల్లి, బిడ్డకు గుర్తింపుగా స్టిక్కర్లు వేసేవారు. కాలక్రమంలో ఈ వ్యవస్థను అధికారులు పక్కన పెట్టారు. వార్డుల్లోకి ఎంతమంది వచ్చినా పట్టించుకోవడం లేదు. దాంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. త్వరలో కలెక్టర్ అనుమతితో జియో ట్యాగింగ్ వి«ధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు తెలిపారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత
– ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ – ముగిసిన రూరల్ అథ్లెటిక్స్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్ తెలిపారు. ఆదివారం అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ రూరల్ అథ్లెటిక్స్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాల ఫెర్రర్ మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువుపై దష్టి పెట్టాలన్నారు. క్రీడల్లో రాణించాలంటే కషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయస్ఫూర్తి కలిగి ఉండాలన్నారు. జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు. అకాడమీల ద్వారా వారు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. మరింత శ్రమించి ఒలింపిక్స్ చేరుకోవడానికి కషి చేయాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి, ఉమెన్ సెక్టార్ డైరెక్టర్ డోరిన్‌రెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్లు నిర్మల్‌కుమార్, చంద్రశేఖర్ నాయుడు, సుధీర్, దశరథరాముడు, ఆర్డీలు రఫీ, హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. 100 మీటర్ల పరుగు పందెం విభాగంలో... కవిత (ఉరవకొండ)–13.80 సెకన్లలో ప్రత్యూష (కొత్తచెరువు)–14.19 సెకన్లలో దీప్తి (పెనుకొండ)–14.71 సెకన్లలో 200 మీటర్ల పరుగుపందెం విభాగంలో.. విచిత్ర (ఆత్మకూరు)–30.93 సెకన్లలో ధనలక్ష్మి (ఉరవకొండ)–31.24 సెకన్లలో దీప్తి (పెనుకొండ)–34.53 సెకన్లలో 400 మీటర్ల పరుగు పందెంలో.. విచిత్ర (ఆత్మకూరు)–1.11.17 మిల్లీ పెకన్లలో మైథిలీ (బత్తలపల్లి)–1.11.83 మిల్లీ సెకన్లలో త్రివేణి (రాయదుర్గం)–1..11.97 మిల్లీ సెకన్లలో 4ఇంటూ100 మీటర్ల రిలే పరుగు పందెం విభాగంలో మొదటి స్థానం– ఉరవకొండ క్రీడాకారిణులు రెండవ స్థానం–రాయదుర్గం క్రీడాకారిణులు మూడవ స్థానం–లేపాక్షి క్రీడాకారిణులు రికార్డులు నమోదు చేసిన క్రీడాకారిణులు డిస్క్ త్రోలో.. కీర్తి ప్రసన్న(నల్లమాడ) – 20.68 మీటర్లు వేసి రికార్డు నమోదు చేసింది. హై జంప్‌లో.. కె.మున్ని (బుక్కరాయసముద్రం)–1.35 మీటర్లు 400 మీటర్ల పరుగు పందెంలో.. సచిత్ర (ఆత్మకూరు), ఎమ్. మైథిలి (బత్తలపల్లి), త్రివేణి (రాయదుర్గం)–1.11.17 మిల్లీ సెకన్లు -
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
నాదెండ్ల: చిలకలూరిపేట సాదినేని చౌదరయ్య హెల్త్ అండ్ రిక్రియేషన్ క్లబ్లో జరుగుతున్న నియోజకవర్గ స్థాయి బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ టోర్నమెంట్‌ను శనివారం రాత్రి ధనలక్ష్మి గ్రూపు సంస్థల కార్యదర్శి పేర్ని వీరనారాయణ, చిలకలూరిపేట అర్బన్ సీఐ బి.సురేష్‌బాబు ప్రారంభించారు. మొత్తం 56 టీములు పాల్గొన్నాయి. మొదటి స్థానాన్ని శ్రీనివాస ఇంటర్నేషనల్ అధినేత తాళ్ళ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మధు దక్కించుకున్నారు. వీరికి రూ.6 వేలు నగదు, షీల్డును బాలాజీ సీడ్స్ అధినేత నరేంద్ర అందించారు. రెండో బహుమతిని చిలకలూరిపేట ఆర్టీసీ కండక్టర్ మైనంపాటి సుబ్రహ్మణ్యం, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ శేఖర్‌బాబు దక్కించుకున్నారు. వీరికి రూ.4 వేలు నగదు, షీల్డును ఎంఎస్ ఫ్యాషన్స్ అధినేత కొర్నెపాటి శ్రీనివాసరావు అందజేశారు. మూడో బహుమతిని సాదినేని చౌదరయ్య క్లబ్ క్రీడాకారులు కాకుమాను వెంకట్, కోటి సాధించారు. వీరికి రూ.3 వేలు నగదు, షీల్డును అడపా నాగసుబ్బారావు అందించారు. నాలుగో బహుమతిని చిలకలూరిపేట ఎన్ఎస్పీ కెనాల్స్‌లో పనిచేసే శ్రీనివాసరావు, అధ్యాపకుడు సుబ్బారావు సాధించారు. వీరికి రూ.2 వేలు నగదు, షీల్డును వెనిగళ్ళ శ్రీధర్ అందజేశారు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా గణపవరానికి చెందిన పృథ్వీ ఎంపికయ్యారు. ఆయనకు రూ.వెయ్యి నగదు, షీల్డును నిర్వాహకులు అందించారు. -
ఆఖరిరోజూ అవస్థలతో ‘పోరు’
ముగిసిన ఆర్మీ ర్యాలీ సోల్జర్ టెక్నికల్ పోస్టులకు పరీక్షలు మెడికల్ టెస్టులకు ఎంపికైన 162 మంది ముగిసిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ బోట్‌క్లబ్ (కాకినాడ) : అవస్థలు, అననుకూలతలు, అస్వస్థతల మధ్యే.. దేశరక్షణ దళంలో కొలువుల కోసం నిర్వహించిన పరీక్షలు సాగాయి. స్థానిక జిల్లా క్రీడామైదానంలో ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారంతో ముగిసింది. ఆరుజిల్లాలు, యానాం నుంచి వేలాదిమంది ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ర్యాలీ జరిగిన ప్రాంతంలో కాక రెండు కిలోమీటర్ల దూరంలోని శ్రీరామ్‌నగర్ మున్సిపల్ స్కూల్లో అభ్యర్థులకు వసతి కల్పించడంతో వారు అక్కడకు వెళ్లడానికి ఇష్టపడలేదు. క్రీడామైదానం సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌లపైనే రాత్రి పడుకున్నారు. కొందరు ఆర్మీ క్యూలైన్లోనే సేదదీరారు. ఆఖరురోజు పలువురు అభ్యర్థులు పరుగు పరీక్షలో సొమ్మసిల్లి పడిపోయారు. ఒక అభ్యర్థి పరుగు పెడుతూ కింద పడిపోవడంతో తలకు గాయమయ్యింది. ఆర్మీ అధికారులు వెంటనే ప్రథమ చికిత్స చేసారు. అర్ధరాత్రి నుంచి ఎంపికలు నిర్వహించడంతో నిద్రలేమితో లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని పలువురు అభ్యర్థులు వాపోయారు. సోల్జర్ టెక్నికల్ పోస్టులకు 4,097 మందికి అడ్మిట్‌కార్డులు జారీచేయగా 2,998 మంది హాజరయ్యారని, 323 మందిని ఎత్తు చాలక తొలగించారని సెట్రాజ్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన 2,575 మందిమందిలో 192 మంది పరుగు పరీక్షలో పాస్‌కాగా, వీరిలో 162 మంది వైద్య పరీక్షలకు ఎంపికయ్యారన్నారు. శుక్రవారంతో ర్యాలీ ముగియగా మెడికల్ పరీక్షలు కొనసాగుతాయన్నారు. -
తెరచుకోని పశువుల ఆస్పత్రి
డాక్టర్ డిప్యూటేషన్ రద్దు సెలవులో అటెండర్ సమాచారం లేదన్న ఏడీఏ కౌడిపల్లి: రెండు రోజులుగా పశువులు ఆసుపత్రి తెరచుకోవడం లేదు. శనివారం ఆసుపత్రికి వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రణీత్‌రాజ్ విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఇటీవల అతని డిప్యూటేషన్ రద్దు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించే అటెండర్ రెండు రోజుల నుంచి సెలవుపై వెళ్తున్నట్లు ఆసుపత్రి ఎదుట బోర్డుపై కాగితం అంటించారు. వైద్యుడు లేక అటెండర్ రాక మూగజీవులకు వైద్యం అందడదం లేదు. ఆసుపత్రికి వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నర్సాపూర్ ఏడీఏ వెంకటయ్య వివరణ కోరగా డాక్టర్‌పై ఆరోపణలు రావడంతో అతని డిప్యూటేషన్ రద్దు చేశామన్నారు. అటెండర్ సెలవు పెట్టిని విషయం తమకు తెలియదన్నారు. సెలవుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదన్నారు. రాయలాపూర్ లైవ్‌స్టాక్ అసిస్టెంట్‌ను డిప్యుటేషన్ వేస్తామని తెలిపారు. -
ముగిసిన ఐటా టోర్నీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఉత్కంఠగా సాగిన ఐటా టెన్నిస్ టోర్నీ శుక్రవారం ముగిసింది. జిల్లాకు చెందిన పల్లవి ఫైనల్లో తడబడి చందన చేతిలో 9–8 స్కోరు తేడాతో ఓటమి పాలైంది. జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఫైనల్‌కు చేరడం ఇదే ప్రథమం. టెన్నిస్ టోర్నీకి అనంత క్రీడాగ్రామం వేదిక కావడం పట్ల పలువురు క్రీడ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. టోర్నీలో గెలుపొందిన విజేతలకు జిల్లా టెన్నిస్ సంఘం అధ్యక్షులు కట్టా నాగభూషణం, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, నదాల్ టెన్నిస్ స్కూల్ కో–ఆర్డీనేటర్ సిస్కో ట్రోఫీలను అందజేశారు. విజేతలు వీరే అండర్–14 సింగిల్స్ బాలికలు = నైషా శ్రీ వాస్తవ పై లక్ష్మీ సాహితీ 9–1 స్కోరు తేడాతో విజయం సాధించింది. అండర్–16 సింగిల్స్ బాలికలు = పల్లవి పై చందన 9–8 స్కోరు తేడాతో విజయం సాధించింది. అండర్–14 సింగిల్స్ బాలురు = సుధీర్త్ పై విశాల్‌రెడ్డి 9–4 స్కోరు తేడాతో విజయం సాధించాడు అండర్–16 సింగిల్స్ బాలురు = వశిష్ఠ రామ్ పై ఇక్బాల్ మహమ్మద్ ఖాన్ 9–5 తేడాతో విజయం సాధించాడు. అండర్–16 డబుల్స్ బాలికలు = పల్లవి, మోనికల పై నైషా శ్రీవాస్తవ, లక్ష్మీ సాహితీ లు 8–2 తేడాతో విజయం సాధించారు. అండర్–16 డబుల్స్ బాలురు = ఇక్బాల్ మహమ్మద్ ఖాన్, శశాంక్ లపై వశిష్ఠ రామ్, నితిన్ ప్రణవ్‌లు 8–4 తేడాతో విజయం సాధించారు. -
అనాథ వృద్ధాశ్రమం తొలగింపు
ముకుందాపురం(మునగాల): మండలంలోని ముకుందాపురం గ్రామపంచాయతీ శివారులో జాతీయ రహాదారి పక్కన గత కొంతకాలంగా ఉన్న అనాథ వృద్ధాశ్రమాన్ని శనివారం రాత్రి మండల తహసీల్దార్ ఆదేశాల మేరకు మునగాల పోలీసులు బలవంతంగా తొలగించారు. తహసీల్దార్ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం... జాతీయ రహాదారి విస్తరణలో భాగంగా మూడేళ్ల క్రితం ముకుందాపురం శివారులో కొంతభూమిని ప్రభుత్వం సేకరించి సదరు రైతుకు నష్టపరిహారం అందించింది. కాగ ఈ ప్రాంతంలో రెండేళ్లుగా ఓ మహిళ అనాథ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో జాతీయ రహాదారి విస్తరణలో భాగంగా క్యాంటిన్ ఏర్పాటు చేయాలని జీఎమ్మార్ సంస్థ నిర్ణయించింది. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని తొలగించాలని నిర్వాహాకులకు తెలిపినప్పటీకీ తొలగించకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి జీఎమ్మార్ సంస్థ తీసుకువెళ్లింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగించాల్సి వచ్చిందని ఆయన‡ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి మునగాల ఎస్ఐ గడ్డం నగేష్ ఆధ్వర్యంలో సిబ్బంది వృద్ధాశ్రమాన్ని బలవంతంగా తొలగించారు. -
ముగిసిన స్కౌట్స్ శిక్షణ తరగతులు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని స్కౌట్స్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్కౌట్స్, గైడ్స్ శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. ఈ నెల 6 నుంచి నిర్వహించిన శిబిరంలో పోల్కంపల్లి, పూడూర్, డోకూర్, అంకిళ్ల, పేరూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, షాద్‌నగర్ పట్టణంలోని ఠాగూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు శిక్షణ పొందినట్లు స్కౌట్స్, గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ రాజగోపాల్ తెలిపారు. ఐదు రోజుల శిక్షణలో వీరికి ప్రథమచికిత్స, ముడులు, దిక్సూచి, పట నైపుణ్యం, హస్తకళలు, ఆరోగ్య, విద్య, సాహస క్రీడలు, ప్రకతి పర్యావరణ రక్షణ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల వల్ల విద్యార్థుల్లో మానవీయత, భావవ్యక్తీకరణ, వ్యక్తిగత వికాసం, ఆత్మసై ్థర్యం, ఆధ్యాత్మిక చింతన, దేశభక్తి, ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యం వంటి లక్షణాలు అలవడుతాయని అన్నారు. క్యాంప్ లీడర్‌గా రవీందర్, అసిస్టెంట్ ఆఫీసర్లుగా హన్మంతు, ఆనంద్ వ్యవహరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వసంధుర, శకుంతల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రైవేట్ విద్యా సంస్థల బంద్
అమలాపురం టౌన్ : ప్యాకేజీల పేరుతో ఆంధ్రా ప్రజలను మోసగిస్తున్నందుకు నిరసనగా శనివారం జరిగే రాష్ట్ర బంద్‌కు జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ బంద్ పాటిస్తున్నాయని జిల్లా ఏపీ అన్ ఎయిడ్‌డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఆపుస్మా) అధ్యక్షుడు మంగళంపల్లి అంజిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు మూసి వేసి బంద్ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
– కొత్తపేట ఎంపీటీసీ ఏకగ్రీవం – మూడు సర్పంచ్‌లు, 9వార్డు సభ్యులకు ఎన్నికలు – ప్రచారంలోకి అభ్యర్థులు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : జిల్లాలో మూడు సర్పంచ్, 47వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో పోటీలో ఉండే అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మంగళవారం పరిశీలించారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. బాలనగర్ మండలం నేరెళ్లపల్లి సర్పంచ్ స్థానానికి 6 నామినేషన్లు రాగా ఒక్కరు తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా మిగిలిన ఐదుగురు బరిలో నిలిచారు. కోయిలకొండ మండలలోని బూర్గుపల్లి సర్పంచ్ స్థానానికి మూడు నామినేషన్లు రాగా ఒక్కరు ఉపసంహరించుకున్నారు. ఇద్దరు బరిలో ఉన్నారు. మద్దూర్ మండలంలోని పల్లెర్ల గ్రామానికి ఐదు నామినేషన్లు రాగా ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ముగ్గురు బరిలో నిలిచారు. మొత్తం 47వార్డు సభ్యులకు 65 నామినేషన్లు దాఖలయ్యాయి. 37 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో హన్వాడ మండలంలోని నాయినోనిపల్లి గ్రామంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 9స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో సీకేపల్లి, వటవర్లపల్లి, చిన్నతాండ్రపాడు, కుమార్లింగంపల్లి, పెద్దనందిగామ, నాచారం, బాలానగర్, శ్రీరంగాపూర్, బొక్కలోనిపల్లి గ్రామాల్లో వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. కాగా కేశంపేట మండలంలోని కొత్తపేట ఎంపీటీసీ ఎన్నిక ఏకగ్రీవమయింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో 8వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. -
ముగిసిన టీటీ పోటీలు
-
నేడు స్కాన్ సెంటర్ల బంద్
స్తంభించనున్న రేడియాలజీ సేవలు అమలాపురం టౌన్ : లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించేందుకు ఏర్పాౖటెన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటర్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ (పీసీ అండ్ పీఎన్డీటీ) నిబంధనలు మార్పు చేయాలని డిమాండు చేస్తూ ఇండియన్ రేడియాలాజికల్, ఇమేజింగ్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం స్కాన్ సెంటర్లు బంద్ పాటిస్తున్నాయి. దీంతో రేడియాలజీ సేవలు ఒక్క రోజు పాటు స్తంభించనున్నాయి. ఈ బంద్‌లో భాగంగా కోనసీమ కేంద్రం అమలాపురంలోని రేడియాలజీ సేవలను గురువారం నిలుపుదల చేసి స్కాన్ సెంటర్లు మూసివేసి బంద్ పాటిస్తున్నట్లు పట్టణానికి చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్‌లు డాక్టర్ నిమ్మకాయల రామమూర్తి, డాక్టర్ యెనుముల నరసింహరావు, డాక్టర్ వైటీ నాయుడు, డాక్టర్ వి.శారద విలేకరులకు తెలిపారు. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్‌లో ఉన్న చిన్న చిన్న తప్పిదాలకు జైలు శిక్ష విధించే నిబంధనలు మార్పు చేయాలని వారు డిమాండు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తాము వ్యతిరేకం కాదన్నారు. చట్టంలో అవసరం లేని నిబంధనలు చేర్చి ఇబ్బందులకు గురి చేయటం తగదని స్పష్టం చేశారు. -
‘ఆట’హాసంగా..
ముగిసిన ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ రాజమహేంద్రవరం: స్థానిక జేఎన్‌రోడ్‌లోని సూర్యగార్డెన్స్‌లో రెండురోజులుగా జరుగుతున్న ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్ ముగిసింది. మంగళవారం జరిగిన క్యారమ్స్ సెమీఫైనల్స్, ఫైనల్స్ ఉత్కంఠంగా సాగాయి. మహిళలు విభాగం ఫైనల్స్‌లో అంతార్జాతీయ క్యారమ్స్ క్రీడాకారిణులు ఎస్.అపూర్వ(హైదరాబాద్), పి.నిర్మల(వరంగల్)లు తలపడ్డారు. వీరి ఆటను అందరూ ఆసక్తిగా తిలకించారు. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. నిర్మలపై అపూర్వ 25–4, 19–4 పాయింట్లుతో గెలుపొందింది. మూడు, నాలుగుస్థానాలు కోసం పోటీపడిన మ్యాచ్‌లో వీకే కాగనల్లి(దార్వడ్), ఎస్.అనలాదేవి(బెంగుళూరు)పై 22–16,20–21,24–10 పాయింట్లతో గెలుపొందింది. కె.వీణ(మైసూరు), సవిత(బెంగుళూరు), కె.జయశ్రీ(హైదరాబాద్), కుసుమకుమారిలు ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. పురుషుల ఫైనల్స్‌లో కె.బాలగురవయ్య(బెంగుళూరు), కె.రాఘవేంద్రరావు(హైదరాబాద్)పై 5–18,25–0,17–16 పాయింట్లతో గెలుపొందగా, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో ఎంబీ జగన్నాథరావు(విశాఖపట్నం), డి.వీరలింగం(హైదరాబాద్)పై 14–13,25–04 పాయింట్లుతో గెలుపొందాడని, కృష్ణానాయక్(షియాగో), వీఎస్ శ్రీనివాసన్(మైసూరు), బి.అజయకుమార్(హైదరాబాద్), జే.కిషన్(వరంగల్)ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారని క్యారమ్స్ చీఫ్ రిఫరీ అస్మదుల్లా తెలిపారు. చేస్పోటీల్లో విజేతలు వీరే... రెండు రోజులపాటు ఆరురౌండ్లు జరిగిన చెస్ పోటీల్లో పురుషుల విభాగంలో ఐదు పాయింట్లుతో కె.నారాయణభట్(షియోగా) ప్రథమ, 4.5 పాయింట్లతో పి.చిన్నస్వామి(విశాఖపట్నం) ద్వితీయ, ఆర్.శ్రీధర్(నెల్లూరు) తృతీయ, కేఆర్ఎస్.శంకర్‌బాబు(రాజమహేంద్రవరం) చతుర్ధ, ఆర్.జయదేవ్(హైదరాబాద్), వి.శ్రీనివాసులు(మచిలీపట్నం), ఎస్ఎం.రవిప్రకాష్(మైసూరు), చంద్రశేఖర్మూర్తి(బెంగుళూరు) ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలు సాధించారు. మహిళల విభాగంలో 5.5 పాయింట్లుతో సీహెచ్ రాధికాదేవి(మచిలీపట్నం) ప్రథమ, ఐదు పాయింట్లుతో వి.రాధాకుమారి(రాజమహేంద్రవరం) ద్వితీయ, 4.5 పాయింట్లుతో బి.రేణుకాకుమారి(సికింద్రాబాద్) తృతీయ, నాలుగుపాయింట్లుతో సీహెచ్ రాజ్యలక్ష్మి(విశాఖపట్నం) చతుర్ధ, వీనాకామత్(బెంగుళూరు), కేహెచ్ పద్మావతి(కడప), ఎస్.అన్నపూర్ణ(బెంగుళూరు), వీఏ బెలగాలి(బెల్గామ్)ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలు సాధించారని చెస్ చీఫ్ ఆర్బెటర్ జీవీ కుమార్ తెలిపారు. క్యారమ్స్, చెస్ పోటీలను ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజరు(హెచ్ఆర్డి) కేవీపీవీ నరసింహారావు, రాజమహేంద్రవరం డివిజనల్ కార్యాలయ సీనియర్ డివిజనల్ మేనేజర్ జే.రంగారావు, మేనేజర్(పీఆర్) నాగేంద్రకుమార్, స్పోర్ట్సు ప్రమోషన్‌బోర్డు సభ్యులు జాన్సన్, మంజునాథ్‌లు పర్యవేక్షించారు. ఎల్ఐసీ ఆల్ ఇండియా టోర్నమెంట్లో సౌత్‌సెంట్రల్ జోన్ సత్తా చాటాలి భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఆల్ ఇండియా టోర్నమెంట్లో సౌత్ సెంట్రల్‌జోన్ క్రీడాకారులు సత్తా చాటాలని ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ రీజనల్ మేనేజర్(హెచ్ఆర్డీ) కేవీపీవీ నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక జేఎన్‌రోడ్‌లోని సూర్యగార్డెన్స్‌లో రెండురోజులపాటు జరిగిన ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కారమ్స్ అండ్ చెస్ టోర్నమెంట్లో విజేతలకు మంగళవారం సాయంత్రం బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ 2015–16లో సౌత్‌సెంట్రల్‌జోన్ క్రీడాకారులు ఆల్ఇండియా టోర్నమెంటులో ఏడు గోల్డ్, ఐదు సిల్వర్, ఎనిమిది బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. 2016–17 టోర్నమెంట్లో ఇప్పటి నుంచి సాధన చేసి ఎక్కువ పతకాలు సాధించేలా కృషి చేయాలన్నారు. రాజమహేంద్రవరం డివిజనల్ సీనియర్ డివిజనల్ మేనేజర్ జే రంగారావు మాట్లాడుతూ సౌత్‌సెంట్రల్‌జోన్ క్యారమ్స్, చెస్ టోర్నమెంటు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన జోనల్ మేనేజర్ సుశీలకుమార్, రీజనల్ మేనేజర్ నరసింహారావులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చెస్, క్యారమ్స్ పురుష,మహిళల విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించిన విజేతలకు బంగారు, వెండి, కాంస్యపతకాలు, నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజరు ఈఏ విశ్వరూప్, మేనేజరు(పీఆర్)నాగేంద్రకుమార్, స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుసభ్యులు మంజునాథ్, జాన్సన్, చెస్చీఫ్ ఆర్బెటర్ జీవీ కుమార్, క్యారమ్స్ చీఫ్ రిఫరీ అస్మదుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఉపవాస ప్రార్థనలు
కోదాడ రూరల్: స్థానిక గాంధీనగర్‌లోని దైవస్వరూపి చర్చిలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉపవాస ప్రార్థనలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా గుంటూరు పట్టణానికి చెంది పాస్టర్ డి.యోహాను బైబిల్ సందేశాన్ని వినిపించారు. ఏసుక్రీస్తు అందరికి ప్రభువు అని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా మెలగాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గాయకులు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. వర్షాలు కురవాలంటూ, పంటలు బాగా పండాలంటూ ప్రత్యేక ప్రార్థనలు భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ కలపాల సుధాకర్, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. -
దుకాణం బంద్!
పుష్కరనగర్‌లో షాపుల మూత ఆశించినస్థాయిలో యాత్రికలు రానందునే.. నెహ్రూనగర్: కృష్ణా పుష్కరాలకు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌ను ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను అధికారులు ఏర్పాటు చేశారు. యాత్రికులకు అవసరమైన జనరల్ స్టోర్స్, పూజా సామాగ్రి, హ్యండ్లూమ్స్, మందుల షాపు, ప్రూట్ స్టాల్స్ వంటి వాటిని డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 37 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడకు యాత్రికులు భారీ స్థాయిలో వస్తారని ఆశించిన వ్యాపారులు స్టాల్స్ లో లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికులు కావాల్సినవన్ని సిద్ధం చేశారు. కాని పుష్కర్‌నగర్‌కు యాత్రికులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వ్యాపారులు డీలా పడ్డారు. పుష్కరాలు ప్రారంభమైన రోజు నుంచి అనుకున్న బేరం సాగక వ్యాపారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 6వ రోజు నాటికే స్టాల్స్‌ను ఖాళీ చేసి వెళ్లి పోవాలని నిర్ణయానికి వచ్చారు. 8వ రోజు నాటికి సగానికిపైగా వ్యాపారులు స్టాల్స్‌ను సర్దుకొని వెళ్లిపోయారు. ఇంకా కొంత మందిని అధికారులు ఈ నాలుగు రోజులు ఉండండి అంటున్నా వారు వెళ్లిపోతూనే ఉన్నారు. అదే విధంగా పుష్కర్‌నగర్ లో విధులు నిర్వహిస్తున్న, పారిశుద్ధ్య విభాగం, ఇతర విభాగాల నుంచి సిబ్బందిని అవసరం మేరకు ఉంచి మిగిలిన వారిని పుష్కర విధుల నుంచి అధికారులు వెనక్కి పిలిచారు. రూ.25 వేలు నష్టం.. కృష్ణా పుష్కరాలకు యాత్రికులు గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌కు పెద్ద సంఖ్యలో వస్తారని, వ్యాపారం బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఐస్ క్రీమ్, లస్సీ, మజ్జిగæ స్టాల్‌ను రూ.45వేల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాం. కానీ మొదటి రోజు నుంచి వ్యాపారం సాగక నష్టపోయాం. దాదాపు రూ.25 వేల నష్టం వచ్చింది. – సి.హెచ్ దీలిప్ వ్యాపారి -
జూరాల క్రస్టుగేట్ల మూసివేత
-కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జూరాల : కష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోపై ప్రభావం పడింది. సోమవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు కేవలం 52వేల క్యూసెక్కులు వస్తుండటంతో క్రస్టుగేట్లన్నింటినీ మూసివేశారు. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ 44వేల క్యూసెక్కులను పవర్‌హౌస్ ద్వారా దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా 9.29టీఎంసీలను నిల్వ ఉంచారు. జూరాల రిజర్వాయర్ ద్వారా కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కేవలం 84,688 క్యూసెక్కులు వస్తుండటంతో అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 117టీఎంసీలను నిల్వ ఉంచారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు. ప్రస్తుతం 32టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి రిజర్వాయర్‌కు 59,371 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా నాలుగు క్రస్టుగేట్లు తెరవడంతోపాటు విద్యుదుత్పత్తి ద్వారా జూరాల రిజర్వాయర్‌కు 22,072 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. -
ఎస్సీ బాలుర వసతి గృహం మూసివేత
చెన్నేకొత్తపల్లి : విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న నెపంతో చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దెల గ్రామ ఎస్సీ బాలుర వసతి గృహానికి అధికారులు తాళం వేశారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ హాస్టల్‌కు రూ. లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి సొంత భవనాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యాం కోసం విశాలమైన గదులు, డైనింగ్ హాల్ ఉన్నాయి. ఇక్కడ ఉంటూ చదువుకున్న వారు పలు శాఖల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఎంతో ఘన చరిత్ర గలిగిన ఈ హాస్టల్ మూతపడడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే హాస్టల్‌ను పునరుద్ధరించాలంటూ న్యామద్దెల వాసులు కోరుతున్నారు. -
ప్రభుత్వ వైఖరితోనే పరిశ్రమల మూత
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణయ్య గుంటూరు వెస్ట్ : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కృష్ణయ్య తెలిపారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లాlస్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. రోజురోజుకు ప్రభుత్వరంగం కుదించుకుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 94 శాతం మంది అసంఘటితరంగ కార్మికులు కనీస వేతనాలు, పనిభద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు రూ.18 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త కార్మికవర్గ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో సచివాలయం నిర్మాణ పనులు చేసే కార్మికులకు భద్రత, కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు కార్మిక ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. -
బడుగులు చదువులపై పిడుగుపాటు
నూజివీడు : పేదవర్గాల పిల్లలకు విద్యను అందించేందుకు దశాబ్దాల క్రితం సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వసతిగృహాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక ఇష్టారాజ్యంగా మూసేస్తోంది. పేదపిల్లలు చదువుకోవడమే పాపమన్నట్లుగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ వసతిగృహాలను అడ్డగోలుగా ఎత్తేస్తోంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 30 వసతిగృహాలను మూసేసిన ప్రభుత్వం, మరల ఈ ఏడాది మరో 32 గృహాలను ముసేసింది. మూసేసిన వసతిగృహాలు పోగా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఇంకా 80 వసతిగృహాలున్నాయి. వీటిలో మరో 50 వసతి గృహాలను వచ్చే ఏడాది ఎత్తేయనున్నట్లు ఆయావర్గాలు చెబుతున్నాయి. తాము చిన్నప్పుడు వసతిగృహాలలోనే ఉండి చదువుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నామని ఉన్నతస్థానాలలో ఉన్న పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటుండగా, ప్రభుత్వం మాత్రం వసతిగృహాలను మూసేసి పేదవర్గాల పిల్లలకు విద్యను దూరం చేస్తోంది. పారిశ్రామిక వర్గాలకు వేలాది కోట్ల ప్రజాధనాన్ని రాయితీల కింద ఇవ్వడమే కాకుండా, వందలాది ఎకరాలను తక్కువ ధరకు కట్టబెడుతూన్న ప్రభుత్వం, పేద వర్గాల పిల్లలు తలదాచుకుని చదువుకునే సంక్షేమ హాస్టళ్లపై కక్షగట్టడం అటు దళిత, ఇటు బీసీ వర్గాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ పిల్లల భవిష్యత్తుపై ఆ వర్గాలు బెంగపెట్టుకున్నాయి. 30 మంది ఉన్నప్పటికీ మూతే నూజివీడు మండలంలోని గొల్లపల్లి, ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి, ముసునూరు మండలం రమణక్కపేట, ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి, రెడ్డిగూడెం మండలంలోని రెడ్డిగూడెంలలోని సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని వసతిగృహాలను ఈ విద్యాసంవత్సరం నుంచి మూసేశారు. ఈ వసతిగృహాలలో 25నుంచి 30మంది విద్యార్థులున్నప్పటికీ మూసేయడం గమనార్హం. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే గ్రామాలలోకి వెళ్ళి పేద వర్గాలకు చెందిన విద్యార్థులను తీసుకొచ్చి జాయిన్ చేసుకోవాలే గాని, ఇలా మూసేయడమేమిటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మెస్‌ఛార్జీలు, అలంకరణ ఛార్జీలు పెంచాలని, వసతిగృహాలకు కూడా సన్నబియ్యం సరఫరా చేయాలని ఒకవైపు విద్యార్థి సంఘాలు డిమాండు చేస్తుంటే అవేమీ పట్టించుకోకుండా ఏకంగా వసతిగృహాలకు మంగళం పలకడం పట్ల పేదవర్గాలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
హాస్టళ్ల మూసివేతకు నిరసనగా జీపు జాతా
ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల మూసివేతను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంక్షేమ హాస్టళ్ళ పోరుబాట పేరుతో నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ఏపీ గిరిజన విద్యార్థి జేఏసీ తలపెట్టిన జీపు జాతాను మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు బయల్దేరిన జీపు జాతాను నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభించారు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అయ్యస్వామి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలన్నారు. ఏపీ గిరిజన విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె. పాండునాయక్ గిరిజన విద్యార్థుల సమస్యలపై మంత్రి రావెల కిషోర్‌బాబుకు చిన్నచూపు తగదన్నారు. గురుకులాల పేరుతో హాస్టళ్లను మూసివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్, నాయకులు రాజేష్ పాల్గొన్నారు. -
మరో పవర్‌హౌస్ మూత
గోదావరిఖని 18 మెగావాట్ల ప్లాంట్ మూసివేతకు సింగరేణి నిర్ణయం ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం ఆందోళన బాటలో కార్మిక సంఘాలు గోదావరిఖని (కరీంనగర్) : కంపెనీ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింగరేణి యాజమాన్యం గోదావరిఖనిలో నెలకొల్పిన 18 మెగావాట్ల పవర్‌హౌస్ మూతపడనుంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ఆధ్వర్యంలోనే 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేయడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పవర్‌హౌస్‌లో పనిచేస్తు న్న ఉద్యోగులను బదిలీ చేయడంలో భాగంగా స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్లకు వెళ్లడానికి దరఖాస్తులు సమర్పించాలని కోరింది. ఈ క్రమంలో పవర్‌హౌస్ మూసివేయవద్దని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు 1998లో బెల్లంపల్లి పవర్‌హౌస్, 2014లో కొత్తగూడెం పవర్‌హౌస్ మూసివేతకు గురికాగా ఆ జాబితాలో గోదావరిఖని పవర్‌హౌస్ చేరనున్నది. 1968 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం రామగుండం రీజియన్‌లో 1959 సంవత్సరం బొగ్గుగను లు చేపట్టగా 1961 నుంచి బొగ్గును వెలికితీత ప్రారంభమైంది. ఆ సమయంలో విద్యుత్‌కు ఇబ్బందిగా మారడం తో యాజమాన్యం గోదావరిఖనిలో 18 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌హౌస్‌ను రుమేనియా దేశ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.7కోట్ల వ్యయంతో నిర్మించింది. 1968 నుంచి మూడు టరై్బన్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైం ది. మొదట్లో 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినా.. క్రమేణా ఒక టరై్బన్‌తో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికే పరిమితమైంది. ఈ పవర్‌హౌస్‌లో 248 మంది పనిచేయా ల్సి ఉండగా ప్రస్తుతం 111 మంది మాత్రమే ఉన్నారు. రామగుండం, శ్రీరాంపూర్ ఏరియాలకు సరఫరా పవర్‌హౌస్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను రామగుండం రీజియన్, శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని పలు బొగ్గుగను లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నారు. పలు కాలనీలకు సైతం వినియోగిస్తున్నారు. 2013లో పవర్‌హౌస్‌లోని రెండవ టరై్బన్‌కు సంబంధించి రన్నర్ రీ–బ్లేడింగ్ చేయడానికి రూ.70లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇప్పటివర కు ఆ టరై్బన్‌ను సదరు సంస్థ తీసుకువచ్చిన దాఖలాలు లేవు. దీంతో ప్రస్తుతం ఒకే టరై్బన్‌తోనే నాలుగు మెగావా ట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం పవర్‌హౌస్ మూసివేతన నేపథ్యంలో అందులో పనిచేస్తు న్న ఉద్యోగుల్లో మొదటి విడతగా వివిధ డిజిగ్నేషన్లకు చెందిన 15 మందిని స్థానికంగా ఉన్న ఏరియా వర్క్‌షాపు, ఆటో వర్క్‌షాపులకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాల ని యాజమాన్యం ప్రకటించింది. అయితే పవర్‌హౌస్ మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికులను బదిలీ చేసే ఆలోచనను విరమించుకోవాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
తోట్లవల్లూరు హాస్టల్ మూసివేత
తోట్లవల్లూరు : తోట్లవల్లూరు ఎస్సీ బాలుర వసతిగృహం మూతపడింది. కొన్ని రోజులుగా హాస్టల్ మూతపడుతుందన్న ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. హాస్టల్లో ఉన్న 35 మంది విద్యార్థులలో 6 నుంచి 8 వరకు చదివే వారిని పామర్రు గురుకుల పాఠశాలలో, 9,10 తరగతుల వారిని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా వార్డెన్ సంజీవరావు స్థానిక జెడ్పీ పాఠశాల హెచ్ఎం ధనలక్ష్మిని కలిసి విద్యార్థులకు టీసీలు కోరారు. అయితే పాములలంక, తోట్లవల్లూరు సమీప గ్రామాల విద్యార్థులు పాఠశాల మారడానికి ఒప్పుకోకపోవడంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాతే టీసీలు ఇస్తానని ధనలక్ష్మి తెలిపారు. -
అంతేనా?
నాలుగు నెలలక్రితం మూతపడ్డ రైల్వే ఫుడ్ ప్లాజా నిలువుదోపిడీకి గురవుతున్న ప్రయాణికులు తిరుపతి అర్బన్ :‘తిరుపతి రైల్వే ఫుడ్ ప్లాజా మూతపడింది. బయట తిందామంటే ధరల మోత. ఆకలికి ఏదో ఒకటి తిని తృప్తి చెందాలనుకుంటే ఆహారం, తినుబండారాల్లో నాణ్యతే ఉండదు.. నాలుగు నెలలుగా నరకం అనుభవిస్తున్నాం.. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు’అని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వేశాఖ పరిధిలోని ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్‌ప్లాజా నిర్వాహకులు చెల్లించాల్సిన ముందస్తు అడ్వాన్స్ రూ.కోటిని సకాలంలో చెల్లించకపోవడంతో సికింద్రాబాద్ జోనల్ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 14న మూత వేయించారు. 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు దీన్ని పునఃప్రారంభించలేదు. సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే రైల్వే ప్రయాణికులకు సరైన తిండి లభించక నరకయాతన అనుభవిస్తున్నారు. తనిఖీలు నిల్ రైల్వేస్టేషన్ ఎదురుగా, పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, తోపుడు బండ్ల టిఫిన్ వ్యాపారులపై తనిఖీలు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెప్పిందే ధర.. పెట్టిందే మెనూ అన్నట్టుగా తయారైంది వీరి వ్యవహారం. ఫుడ్ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కలుషిత ఆహారం తిని ప్రాణాలమీదికి తెచ్చుకోవాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. నాసిరకం..పాచిపోయిన వంటకాలే రైల్వేస్టేషన్ ఎదురుగా ఉండే హోటళ్లలో ముందురోజు రాత్రి వండి మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు ఉదయం ఇడ్లీకో, లెమన్ రైస్కో కలిపి వడ్డించేస్తున్నారు. వాటిని తిన్న ప్రయాణికులు అనారోగ్యం పాలవుతున్నారు. బయ టి హోటళ్లలో ఎదురయ్యే ఇబ్బందులపై రైల్వే స్టేషన్‌లోని అధికారులకు ఫిర్యా దు చేసినా ఫలితం లేకపోతోందని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. నిబంధనలకు పాతర భారత ఆహార భద్రతా(ఫుడ్‌సేఫ్టీ) చట్టం ప్రకారం ప్రతి జిల్లాలోనూ ఫుడ్‌సేఫ్టీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో చిన్న హోటల్ నుంచి కార్పొరేట్ హోటల్ వరకు ధరల పట్టికను అమలు చేయాలి. అయితే రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న హోటళ్లలో చాలావరకు ధరల పట్టికను కూడా నిర్వహించడం లేదు. కొందరు పట్టికలను వేలాడదీసినా అందులో ధరలు నమోదుచేసి ఉండరు. ఇకనైనా రైల్వే ఐఆర్సీటీసీ అధికారులు స్పందించి రైల్వే ఫుడ్ ప్లాజాను త్వరగా తెరిపించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
పాఠశాలల మూసివేతను నిలిపివేయాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి విద్యారణ్యపురి : విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత, విలీనాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండలోని టీఎన్జీవోస్ భవన్లో నిర్వహించిన ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ప్రారంభించాలన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ పాఠశాలలకు అనుసంధానం చేయాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను సెమీరెసిడెన్షియల్‌గా, ఉన్నత పాఠశాలలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు. విద్యాపరిక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు ఎ.నర్సింహారెడ్డి మాట్లాడుతూ విద్య కాషాÄæూకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నూతన విద్యావిధానం కమిటీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ సిఫారసులు ప్రభుత్వ విద్యకు గొడ్డలిపెట్టుగా ఉన్నాయన్నారు. వీటన్నింటినీ నిరసిస్తూ ఈనెల 25న విద్యాపరరిక్షణ కమిటీ ఆ««దl్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా విజయవంతం చేయాని పిలుపునిచ్చారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ రమేష్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.అశోక్, జి,నటరాజ్, టి.పురుషోత్తమ్, కె.సునంద, ఎస్.గోవర్ధన్, డి.శ్రీనివాస్, పి.చంద్రం పాల్గొన్నారు. -
సౌలభ్యానికి స్వస్తి
కొత్తపేట సీహెచ్ఎన్సీ కార్యాలయం జిల్లాలో మూతపడ్డ 25 సీహెచ్‌ఎన్‌సీలు మినీ డీఎంహెచ్‌ఓలుగా ఉపకరించిన క్లస్టర్లు అయిదున్నరేళ్లుగా సేవలందించిన వ్యవస్థ రద్దుతో పీహెచ్‌సీలపై కొరవడనున్న పర్యవేక్షణ కొత్తపేట : జిల్లాలో అయిదున్నరేళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నిర్వహణ, పరిపాలనను సులభతరం చేస్తూ మినీ డీఎం అండ్ హెచ్ఓలుగా సేవలందించిన కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్ (సీహెచ్ఎన్సీ)లకు బుధవారం తెరపడింది. సీహెచ్ఎన్సీ వ్యవస్థను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దాంతో జిల్లాలో గల 25 సీహెచ్‌ఎన్‌సీలు బుధవారం మూతపడ్డాయి. ఆ క్టస్టర్లలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి Ðð ళ్లనున్నారు. ఈ మేరకు గురువారం రిపోర్టు చేయనున్నారు. జిల్లాలో 119 పీహెచ్‌సీలు ఉండగా వాటిని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయం (డీఎం అండ్ హెచ్ఓ) పర్యవేక్షించేది. పీహెచ్‌సీలకు సంబంధించి అన్ని వ్యవహారాలనూ ఆ కార్యాలయమే నిర్వహించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం సీహెచ్ఎన్సీ వ్యవస్థ ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే ప్రతిపాదన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ క్లస్టర్ వ్యవస్థకు బీజం పడింది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీవీ రమేష్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాలనా, నిర్వహణలను సులభతరం చేసేందుకు సీహెచ్‌ఎన్‌సీలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను వైఎస్ ముందుంచారు. ప్రజారాగ్యానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలన్న సంకల్పంతో ఆయన అందుకు అంగీకరిం మరికొన్ని సూచనలు చేశారు. అయితే ఆయన హఠాన్మరణంతో అప్పట్లో ఆ వ్యవస్థ సాకారం కాకపోయినా.. తదుపరి పాలకుల 2011 ఫిబ్రవరిలో సీహెచ్ఎన్సీలను ప్రారంభించారు. 2 లక్షల జనాభాకు ఒక క్లస్టర్ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 360 క్లస్టర్లు ఏర్పాటయ్యాయి. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యాధికారులు, సిబ్బందిని క్లస్టర్లలో నియమించారు. ఒక్కో క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ (సుమారు రెండేళ్ళ క్రితం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓగా స్థాయిని పెంచారు), సీహెచ్ఓ, డీపీఎంఓ, హెచ్ఈ, ఎంపీహెచ్ఈఓ, ఎస్ఏతో పాటు కొన్ని క్లస్టర్స్‌లో ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఓఎస్‌లను కూడా నియమించారు. అయితే తగినన్ని పరిపాలధినాకారాలు మాత్రం కల్పించలేదు. జిల్లా కేంద్రంలో ఉండే డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయం నిర్వహించే జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ, పీహెచ్‌సీల పనితీరు పరిశీలన తదితర బాధ్యతలను ఈ క్లస్టర్ ద్వారా నిర్వహిసూ ్తవచ్చారు. మెరుగు పరచడం మాని కనుమరుగు చేశారు.. జిల్లాలో 25 సీహెచ్‌ఎన్‌సీలు ఏర్పాటు కాగా ఒక్కోదాని పరిధిలో 6 నుంచి 9 పీహెచ్‌సీలు ఉండేవి. ఉదాహరణకు కొత్తపేట క్లస్టర్ పరిధిలో 6, పి.గన్నవరం క్లస్టర్ పరిధిలో 8 పీహెచ్సీలుండగా మండపేట పరిధిలో అత్యధికంగా 9 పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇప్పుడు సీహెచ్ఎన్సీల రద్దుతో పీహెచ్‌సీలపై పర్యవేక్షణ కొరవడుతుంది. ప్రభుత్వపరంగా ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ముందు వరుసలో ఉండే పీహెచ్‌సీల ద్వారా మరిన్ని సేవలు, మరింత సత్వరం అందేలా సీహెచ్ఎన్సీలను మరింత మెరుగుపరచడం పోయి అసలు ఆ వ్యవస్థనే రద్దు చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై పీహెచ్‌సీల వైద్యాధికారులు, పలువురు సిబ్బంది, ఉన్నతాధికారులు నిర్వహించే సమావేశాలకు జిల్లా కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుందని, పర్యవసానంగా వైద్యసేవలు కుంటుపడతాయని అంటున్నారు. తెలంగాణలో సీహెచ్ఎన్సీల వ్యవస్థ కొనసాగుతుండగా ఇక్కడ రద్దు చేయడంపై పునరాలోచించాలని కోరుతున్నారు. -
మూతపడ్డ ఈఫిల్ టవర్!
పారిస్ః అభిమానులు పోలీసుల మధ్య చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. యూరో కప్ సాకర్ మ్యాచ్ సమయంలో రేగిన ఘర్షణలు పారిస్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్ మూసివేతకు కారణమైంది. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని పారిస్ లోని ఈఫిల్ టవర్ ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పారిస్ లో జరిగిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లకు మధ్య జరిగిన యూరోకప్ సాకర్ 2016 ఫైనల్ మ్యాచ్ లో పోర్చుగల్ చేతిలో ఫ్రాన్స్ ఓటిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో స్టేడియంలోకి అభిమానులు ప్రవేశించడానికి పోలీసులు నిరాకరించడంతో అసలు గొడవ మొదలైంది. అడ్డుకున్న పోలీసులపైకి అభిమానులు రాళ్ళు రువ్వడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువును, వాటర్ క్యాన్స్ సైతం ప్రయోగించారు. ఈఫిల్ టవర్ ప్రాంతం భాష్సగోళాల పొగతో నిండిపోయింది. ఆందోళనకు దిగిన 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల్లో అక్కడి వాహనాలకు, చెత్తకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ సందర్భంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈఫిల్ టవర్ ను ఒక రోజంతా మూసివేస్తున్నట్లు ఈఫిల్ టవర్ నిర్వాహకులు వెల్లడించారు.