
తోట్లవల్లూరు హాస్టల్ మూసివేత
తోట్లవల్లూరు ఎస్సీ బాలుర వసతిగృహం మూతపడింది. కొన్ని రోజులుగా హాస్టల్ మూతపడుతుందన్న ప్రచారం ఎట్టకేలకు నిజమైంది.
తోట్లవల్లూరు : తోట్లవల్లూరు ఎస్సీ బాలుర వసతిగృహం మూతపడింది. కొన్ని రోజులుగా హాస్టల్ మూతపడుతుందన్న ప్రచారం ఎట్టకేలకు నిజమైంది. హాస్టల్‌లో ఉన్న 35 మంది విద్యార్థులలో 6 నుంచి 8 వరకు చదివే వారిని పామర్రు గురుకుల పాఠశాలలో, 9,10 తరగతుల వారిని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా వార్డెన్ సంజీవరావు స్థానిక జెడ్పీ పాఠశాల హెచ్‌ఎం ధనలక్ష్మిని కలిసి విద్యార్థులకు టీసీలు కోరారు. అయితే పాములలంక, తోట్లవల్లూరు సమీప గ్రామాల విద్యార్థులు పాఠశాల మారడానికి ఒప్పుకోకపోవడంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాతే టీసీలు ఇస్తానని ధనలక్ష్మి తెలిపారు.