
బంగ్లాదేశ్‌లోని తమ కార్యాలయాన్ని ఆగస్టు 7 వరకు మూసివేయనున్నట్లు ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సోమవారం తెలిపింది. బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా దళాలకు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో గత రెండు రోజుల్లో 100 మందికి పైగా మృతి చెందారు.
"బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న సామాజిక-రాజకీయ పరిస్థితుల కారణంగా, బంగ్లాదేశ్ లిమిటెడ్ ఎల్‌ఐసీ కార్యాలయం ఆగష్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు మూసివేస్తున్నాం" అని రెగులేటరీ ఫైలింగ్‌లో ఎల్‌ఐసీ తెలిపింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు 3 రోజుల పాటు కర్ఫ్యూను ప్రకటించిందని పేర్కొంది. వివాదాస్పద ఉద్యోగ కోటా పథకానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో గత నెలలో విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment