lic office
-
బంగ్లాదేశ్‌లో ఎల్ఐసీ ఆఫీస్ మూసివేత
బంగ్లాదేశ్‌లోని తమ కార్యాలయాన్ని ఆగస్టు 7 వరకు మూసివేయనున్నట్లు ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సోమవారం తెలిపింది. బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా దళాలకు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య జరిగిన భీకర ఘర్షణల్లో గత రెండు రోజుల్లో 100 మందికి పైగా మృతి చెందారు."బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న సామాజిక-రాజకీయ పరిస్థితుల కారణంగా, బంగ్లాదేశ్ లిమిటెడ్ ఎల్ఐసీ కార్యాలయం ఆగష్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు మూసివేస్తున్నాం" అని రెగులేటరీ ఫైలింగ్‌లో ఎల్ఐసీ తెలిపింది.బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 వరకు 3 రోజుల పాటు కర్ఫ్యూను ప్రకటించిందని పేర్కొంది. వివాదాస్పద ఉద్యోగ కోటా పథకానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో గత నెలలో విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనగా మారాయి. -
కోదాడ ఎల్ఐసీ ఆఫీస్‌లో భారీ స్కామ్
-
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్
అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ ఉదయం నుంచే బ్యాంకులతో పాటు బీఎస్ఎన్ఎల్, తపాలా, కమర్షియల్ ట్యాక్స్, ఎల్ఐసీ కార్యాలయాలు ఎక్కడిక్కడ మూతపడ్డాయి. బంద్ ప్రభావం ముందే ఊహించిన అధికారులు ఎవ్వరూ కార్యాలయాలలోకి వెళ్లడానికి సాహసించలేదు. అయితే ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు తపాలా శాఖ, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో పలువురు ఉద్యోగులు విధులకు హాజరు కాగా.. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి వారిని బయటకు పంపించి వేశారు. మంగళ, బుధవారాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నిర్వహించనున్నారు.