రైల్వే ప్రయాణికులకు ఒక గమనిక. దేశీయ రైల్వే టిక్కెటింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ, ఇతర ఆన్‌లైన్ సర్వీసులు కొన్ని గంటల పాటు మూతపడబోతున్నాయి. గురువారం రాత్రి 10.45 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 5 గంటల వరకు అంటే ఆరు గంటల పాటు ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని రైల్వే పేర్కొంది.
రైల్వేకు సంబంధించిన అన్ని వెబ్‌సైట్‌లు, యాప్స్‌ను అప్‌గ్రేడ్ చేయడం కోసం ఆరు గంటల పాటు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీనిలో ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఆన్‌లైన్ టిక్కెటింగ్ సిస్టమ్‌ను మరింత స్నేహపూరితంగా చేయడం కోసం రైల్వే కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. దీనికోసంవెబ్‌సైట్లను, యాప్స్‌ను దేశీయ రైల్వే అప్‌గ్రేడ్ చేస్తోంది. సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేసే సమయంలో ప్రయాణికులకు ఐవీఆర్‌ఎస్ టచ్ స్క్రీన్, కాల్ సెంటర్, 139 ఎంక్వైరీ సిస్టమ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment