క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత | rural athletics closed | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత

Oct 23 2016 11:00 PM | Updated on Jun 1 2018 8:39 PM

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత - Sakshi

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత

క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌ తెలిపారు.

– ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌
– ముగిసిన రూరల్‌ అథ్లెటిక్స్‌


అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌ తెలిపారు. ఆదివారం అనంత క్రీడా మైదానంలో ఆర్డీటీ రూరల్‌ అథ్లెటిక్స్‌ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాల ఫెర్రర్‌ మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువుపై దష్టి పెట్టాలన్నారు. క్రీడల్లో రాణించాలంటే కషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయస్ఫూర్తి కలిగి ఉండాలన్నారు.

జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారన్నారు. అకాడమీల ద్వారా వారు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. మరింత శ్రమించి ఒలింపిక్స్‌ చేరుకోవడానికి కషి చేయాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ ఏఎఫ్‌ ఎకాలజీ డైరెక్టర్‌ మల్లారెడ్డి, ఉమెన్‌ సెక్టార్‌ డైరెక్టర్‌ డోరిన్‌రెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్లు నిర్మల్‌కుమార్, చంద్రశేఖర్‌ నాయుడు, సుధీర్, దశరథరాముడు, ఆర్డీలు రఫీ, హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..
100 మీటర్ల పరుగు పందెం విభాగంలో...
కవిత (ఉరవకొండ)–13.80 సెకన్లలో
ప్రత్యూష (కొత్తచెరువు)–14.19 సెకన్లలో
దీప్తి (పెనుకొండ)–14.71 సెకన్లలో

200 మీటర్ల పరుగుపందెం విభాగంలో..
విచిత్ర (ఆత్మకూరు)–30.93 సెకన్లలో
ధనలక్ష్మి (ఉరవకొండ)–31.24 సెకన్లలో
దీప్తి (పెనుకొండ)–34.53 సెకన్లలో

400 మీటర్ల పరుగు పందెంలో..
విచిత్ర (ఆత్మకూరు)–1.11.17 మిల్లీ పెకన్లలో
మైథిలీ (బత్తలపల్లి)–1.11.83 మిల్లీ సెకన్లలో
త్రివేణి (రాయదుర్గం)–1..11.97 మిల్లీ సెకన్లలో

4ఇంటూ100 మీటర్ల రిలే పరుగు పందెం విభాగంలో
మొదటి స్థానం– ఉరవకొండ క్రీడాకారిణులు
రెండవ స్థానం–రాయదుర్గం క్రీడాకారిణులు
మూడవ స్థానం–లేపాక్షి క్రీడాకారిణులు

రికార్డులు నమోదు చేసిన క్రీడాకారిణులు

డిస్క్‌ త్రోలో..
కీర్తి ప్రసన్న(నల్లమాడ) – 20.68 మీటర్లు వేసి రికార్డు నమోదు చేసింది.

హై జంప్‌లో..
కె.మున్ని (బుక్కరాయసముద్రం)–1.35 మీటర్లు

400 మీటర్ల పరుగు పందెంలో..
సచిత్ర (ఆత్మకూరు), ఎమ్‌. మైథిలి (బత్తలపల్లి), త్రివేణి (రాయదుర్గం)–1.11.17 మిల్లీ సెకన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement