
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం మరిన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. న్యాయస్థానం ఆవరణలోకి ప్రతి శనివారం సందర్శకులకు బృందాలుగా ఇచ్చే అనుమతులను రద్దు చేసింది. కోర్టు క్యాంటీన్, కెఫేలను మూసివేయాలని ఆదివారం ఆదేశించింది. ఈ నెల 16వ తేదీన మొత్తం 15 ధర్మాసనాలకు గాను 6 మాత్రమే పనిచేస్తాయని, 12 అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘çకోర్టు ఆవరణలోకి సాధారణ సందర్శకులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలి. లాయర్లు, కోర్టు సిబ్బంది, చిరు వ్యాపారులు ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకల్లా ఆవరణ విడిచి బయటకు వెళ్లిపోవాలి. 6 గంటలకల్లా కోర్టులోని విశ్రాంతి గదులు, కారిడార్లు, మెట్లు తదితరాలను శుభ్రం చేయాలి. లాయర్లు, కక్షిదారులు, గుమాస్తాలు ఆవరణలో గుమి కూడరాదని, విధులు ముగిసిన తక్షణమే వెళ్లిపోవాలి’అని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment