లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించేందుకు ఏర్పాౖటెన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటర్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ (పీసీ అండ్ పీఎన్‌డీటీ) నిబంధనలు మార్పు చేయాలని డిమాండు చేస్తూ ఇండియన్ రేడియాలాజికల్, ఇమేజింగ్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం స్కాన్ సెంటర్లు బంద్ పాటిస్తున్నాయి. దీంతో రేడియాలజీ సేవలు ఒక్క రోజు పాటు స్తంభించనున్నాయి.
-
స్తంభించనున్న రేడియాలజీ సేవలు
అమలాపురం టౌన్ :
లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించేందుకు ఏర్పాౖటెన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటర్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ (పీసీ అండ్ పీఎన్‌డీటీ) నిబంధనలు మార్పు చేయాలని డిమాండు చేస్తూ ఇండియన్ రేడియాలాజికల్, ఇమేజింగ్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం స్కాన్ సెంటర్లు బంద్ పాటిస్తున్నాయి. దీంతో రేడియాలజీ సేవలు ఒక్క రోజు పాటు స్తంభించనున్నాయి. ఈ బంద్‌లో భాగంగా కోనసీమ కేంద్రం అమలాపురంలోని రేడియాలజీ సేవలను గురువారం నిలుపుదల చేసి స్కాన్ సెంటర్లు మూసివేసి బంద్ పాటిస్తున్నట్లు పట్టణానికి చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్‌లు డాక్టర్ నిమ్మకాయల రామమూర్తి, డాక్టర్ యెనుముల నరసింహరావు, డాక్టర్ వైటీ నాయుడు, డాక్టర్ వి.శారద విలేకరులకు తెలిపారు. పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్‌లో ఉన్న చిన్న చిన్న తప్పిదాలకు జైలు శిక్ష విధించే నిబంధనలు మార్పు చేయాలని వారు డిమాండు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తాము వ్యతిరేకం కాదన్నారు. చట్టంలో అవసరం లేని నిబంధనలు చేర్చి ఇబ్బందులకు గురి చేయటం తగదని స్పష్టం చేశారు.