దుకాణం బంద్!
దుకాణం బంద్!
Published Sat, Aug 20 2016 9:58 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
పుష్కరనగర్‌లో షాపుల మూత
ఆశించినస్థాయిలో యాత్రికలు రానందునే..
నెహ్రూనగర్: కృష్ణా పుష్కరాలకు నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌ను ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులను అధికారులు ఏర్పాటు చేశారు. యాత్రికులకు అవసరమైన జనరల్ స్టోర్స్, పూజా సామాగ్రి, హ్యండ్‌లూమ్స్, మందుల షాపు, ప్రూట్ స్టాల్స్ వంటి వాటిని డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో 37 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడకు యాత్రికులు భారీ స్థాయిలో వస్తారని ఆశించిన వ్యాపారులు స్టాల్స్ లో లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికులు కావాల్సినవన్ని సిద్ధం చేశారు. కాని పుష్కర్‌నగర్‌కు యాత్రికులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వ్యాపారులు డీలా పడ్డారు. పుష్కరాలు ప్రారంభమైన రోజు నుంచి అనుకున్న బేరం సాగక వ్యాపారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 6వ రోజు నాటికే స్టాల్స్‌ను ఖాళీ చేసి వెళ్లి పోవాలని నిర్ణయానికి వచ్చారు. 8వ రోజు నాటికి సగానికిపైగా వ్యాపారులు స్టాల్స్‌ను సర్దుకొని వెళ్లిపోయారు. ఇంకా కొంత మందిని అధికారులు ఈ నాలుగు రోజులు ఉండండి అంటున్నా వారు వెళ్లిపోతూనే ఉన్నారు. అదే విధంగా పుష్కర్‌నగర్ లో విధులు నిర్వహిస్తున్న, పారిశుద్ధ్య విభాగం, ఇతర విభాగాల నుంచి సిబ్బందిని అవసరం మేరకు ఉంచి మిగిలిన వారిని పుష్కర విధుల నుంచి అధికారులు వెనక్కి పిలిచారు.
రూ.25 వేలు నష్టం..
కృష్ణా పుష్కరాలకు యాత్రికులు గోరంట్ల వద్ద పుష్కర్‌నగర్‌కు పెద్ద సంఖ్యలో వస్తారని, వ్యాపారం బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఐస్ క్రీమ్, లస్సీ, మజ్జిగæ స్టాల్‌ను రూ.45వేల ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాం. కానీ మొదటి రోజు నుంచి వ్యాపారం సాగక నష్టపోయాం. దాదాపు రూ.25 వేల నష్టం వచ్చింది.
– సి.హెచ్ దీలిప్ వ్యాపారి
Advertisement
Advertisement